మత్స్య మహా పురాణము
204 - ఉభయతో ముఖీ గోదానము.
మనువు మత్స్యుని ఇట్లడిగేను: అపుడే ఈనుచున్న ధేనుపును బ్రాహ్మణోత్తమునకు దానము చేయవలసిన విధా నమును దాన ఫలమును ధర్మజ్ఞా! తెలుపవేడెదను. అనగా నారాయణుడిట్లు. తెలి పేను: ప్రసవించుచున్న ధేనువును బంగరు కొమ్ములతో వెండిగిట్టలతో ముత్తెముల తోకతో కంచుతో చేసిన పాలు పిదుకు పాత్రలతో ఆ దూడతో కూడ బ్రాహ్మణ పుంగవునకు దానమిచ్చినచో మహాపుణ్యఫలము లభించును. దూడ యోనియందే యుండి ఇంకను గర్భమును విడువనంతవరకు ఆ ప్రసవించు గోవు పర్వతవన కాననాదులతో కూడిన సర్వ పృథివితో సమాన. ఇట్టి ధేనువును ధనముతో కూడ దానము చేయుట సర్వ సముద్ర శైల తద్దుహావన కానన సహితమయి చతురంత. (నాలుగు సముద్రములు హద్దుగాగల భూమిని దానము చేయుటతో సమానము. దానిచే ఆ దూడ కెన్ని కోమములుండునో అన్ని మహాయుగములు దాత దేవలోకమందుండును. భూరి దక్షిణలతో ఈ ప్రసూయమాన ధేను దానము చేసినచో వాని పితృ పితామహ ప్రపితా మహులు నరకమునుండి తరింతురు. అతడు వెళ్ళిన చోటనెల్ల నేయియు పాలును చిక్కని పెరుగును పాయసమును ప్రవహించు నదులును కోరికల నొసగు వృక్షములును లభించుచుండును. దాతకు గోలోక బ్రహ్మలోకములు ప్రాప్తించును. వానికచట నెల్ల ఇందు సమాన ముఖములును కాచిన బంగారువంటి దేహచ్చాయయు విశాలములగు పీరుదులును సన్న ని గుండ్రని నడుములును పద్మములవంటి నేత్రములును గల స్త్రీలును లభింతురు. (ఈనుచున్న ఆవునకు వెనుక నుండి దూడ ముఖముండుట చేతను అవి రెండును ఒకటిగా ఉండుట చేతను ఈ గోవు ఉభయతో ముఖీ రెండు వైపుల ముఖముగలది)
ఇది శ్రీమత్యమహాపురాణమున ఉభయతో ముఖీ గోదానమను రెండు వందల నాలుగవ అధ్యాయము.
Summary of chapter 205 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya reveals the sacred Pitṛ-kavacha and devotional stotra, a powerful spiritual armor and prayer designed to invoke the protective grace of the divine ancestors. Bhagavān Matsya explains that reciting this sacred hymn purifies the subtle body, shields the practitioner from dark forces, neutralizes malicious astrological afflictions, and removes ancestral curses known as Pitṛ-dosha. The text mandates that reciting this stotra during daily morning prayers or before ancestral ceremonies fills the household with divine light, harmony, and lasting prosperity.