మత్స్య మహా పురాణము
132 - నారదుడు త్రిపురముల కేగుట
సూతు డిట్లు చెప్పసాగేను: త్రిపుర విజయార్ధ మైన రథము సాగిపోవుచుండెను. దానిని దేవవరులు అభినదిం చుచు వెంట పోవుచుండిరి. దేవవరులును ప్రమథులును సాధువాదములు చేయుచు ధ్వనులు చేయుచుండిరి. ఈశ్వరుని మహా వృషభము వేద స్వర ఘోషముతో అంకెలు వేయుచుండెను. విప్రులు వేదాధ్యయనము చేయుచుండిరి. అశ్వములును వేదముల పఠించుచు పోవుచుండెను. అట్టి సమయమున ప్రభుడగు నారద మహర్షి గగనాంగణమునుండి చంద్ర సదృశ దేహకాంతిలో దుమికి శీఘ్రముగా త్రిపుర దుర్గమునకు పోయెను. అప్పుడును అచట ఉత్పాతములు అధిక ముగ జరుగుచునే యుండెను. అదే సమయమున తపోధనుడు నారద భగవాను డట సాక్షాత్కరించుటచే అగ్ని ప్రకాశం డగు ఆయన రాకను చూచి దైత్య దానవులు అభివాదనములు పలుకుచు లేచి నిలువబడిరి. అసురేశ్వరుడు నారదుని అర్ఘ్యపాద్య మధుపర్కములతో ఇంద్రుడు బ్రహ్మ సర్చించి నట్టర్చించేను. తపోధనుడు పూజార్హుడా నారదుడు మయుడు ఇచ్చిన పూజను స్వీకరించి మేలగు బంగరు పీఠము పై కూర్చుండెను. అనంతరము దానవేశ్వరుడగు మయమహాసురుడు తుష్టుడును హరసహిత రోమముఖనయనములు కలవాడునై తన దానవులతో కూడ తానును కూర్చుండి నారదుని చూచి ఇట్లు పలికెను: నారదా! నీవు వర్తమానము నెరిగినవాడవు. మా పురమునం దీపుడు మరెప్పుడు నేక్కడను లేనంతగా ఉత్పాతములు. కనబడుచున్నవి. ఏమనగా- భయంకర స్వప్నములు కలుగుచున్నవి. ధ్వజములు విరుగుచున్నవి. వాయువు వీచక యే జెండాలు క్రింద పడుచున్నవి. పతాక లతో గోపురములతో కూడ అట్టాలకములు మేడల పై అంతస్తులు విరిగి పడుచున్నవి. ఓ బాధించుడు బాధించుడు. అను భయంకర ధ్వనులు వినబడుచున్నవి. నారదాః స్థాణు(శాశ్వత) రూపుడు భక్తాభయకరుడు వరదుడు నగు హరునకుతప్ప నే నింద్రాది దేవతల కేవ్వరికినీ భయపడను. అనఘా! భగవన్! ఉత్పాత విషయమున నీకు తెలియని దేదియు లేదు. భూత భవిష్యముల వాస్తవ రూపము నీ వేరుగుదును. కావున మునిశ్రేష్ఠా! నారదా! ఈ ఉత్పాతములు మాకు. రానున్న ఏ భయ హేతువును సూచించుచున్నవో నీకు తెలిసినంత తెలుపుము. అనగా ఏ చిత దోషములును లేని నారదుడు మయునితో కెను.
నారదః : శృణు దానవః తత్త్వేన భవత్యౌత్పాతికం యథా ।
ధర్మేతి ధారణే ధాతు ర్మహాతేజోపపద్యతే.
ధారణేచావధరణే ధర్మఏష నిరూప్యతే ।
న దృష్టప్రాపకో ధర్మ ఆచార్యై రుపదిశ్యతే.
ఇతశ్చైవానిష్టఫల మాచార్యై రుపదిశ్యతే ।
దుర్మార్గం గచ్ఛతో మాధే మార్గో సతి విమారతః.
వినాశ స్తస్య నిర్దేశ్య ఇతి ధర్మవిదో విదుః ।
త్వమధర్మం యథా మూఢ సహైభి రౌత్యదానవై .
ఆవాచీనాని దేవానాం కురు మే కుసహాయవాక్ ।
తదేకాన్యేవ మాద్యాని ఉత్పాతవిదితానిచ.
వై నాశికాని దృశ్యనే దానవానాం తథైవచ ।
ఏష రుద్ర స్సమాస్థాయ రౌద్రం లోకమయం రథమ్.
ఆయాతి త్రిపురం దగ్గుం మయ! త్వా మసురానపి ।
స త్వం మహౌజసం నిత్యం ప్రపద్యస్వ మ హేశ్వరమ్.
యాస్య సే సహపు శ్రేణ దానవే స్పహ మానద ।
ఇత్యేవ మా వేద్య భయం నారదః ప్రస్తుతం వచః.
దానవానాం పునర్గీమా దేవేశపుర మాగతః ।
నారదేతు మునౌ యాతే మయో దానవనాయకః.
శూరా సుద్బోధయన్నేవ మువాచ సహి దానవః ।
శూరాశ్చ జాతపుత్తాశ్చ కృతకృత్యాశ్చ దానవాః.
యుధ్యధ్వం దైవతై స్సార్గం కర్తవ్యంహి న వో భయమ్ ।
హతా వయం భవిష్యామ స్సర్వే సురసభాసదః.
దేవాన్వా సేన్తకాన్ హత్వా లోకాక్ భోజ్యామ హే వయమ్ ।
అట్టాల కేషు తిష్ఠధ్వం సన్నద్ధా శ్శస్రపాణయః .
దంశితాయుధసజాశ్చ తిష్ఠధ్వం ప్రోద్యతాయుధాః ।
పురాణీ త్రీణి చై తాని యథాస్థానేషు దానవాః.
తిష్టనలజనీయాని భవిష్యని పురాణీచ ।
నభోగాః ప్రమథాశ్శూరా దేవాశ్చ విదితాహి వః.
తే ప్రయత్నేన వాద్యాశ్చ విదార్యా శ్చైవ సాయకైః ।
ఇతి దనుతనయా స్మయ స్తథో క్త్వా సురరణకారణవారణే వచాంసీ.
యుధి నిజమనసా విషక్తమానో గగనపురం సహసా వివేళ రాజా ।
అథ వీర జవిశుద్ధ భావధావో భవమభిపూజ్య దిగమ్బరంచ వాగ్బిః.
శరణ మథ జగామ దేవదేవం యమమదనాన్షక యజ్ఞదేవఘాతమ్ ।
మయ మభయపదై షిణం ప్రపన్నం స ఖలు బుబోధ తృతీయనేత్రదీప్తః.
తదభిమత మదా చ్చశాఞ్కమౌళి స్సచ కిల నిర్భయదేవదానవేన ।
ఇతి శ్రీమత్స్యమహాపురాణే త్రిపురాఖ్యానే నారదమయసంవాదాది కథనం నామ ద్వాత్రింశదుత్తరశతతమోధ్యాయః .
మయదానవా ఈ ఉత్పాతము లేమి సూచించు 5 తేలిపెదను; వినుము! మహాతేజో! ధర్మ శబ్దమునందలి ‘ధా’ ధాతువునకు గల అర్థమును బట్టి ‘తను ఆశ్రయించినవారిని నిలుపునది' 'కంటికి కానరాని ఫలితములను తన యందు గట్టిగా నిలుపుకొనునది' అని ధర్మశబ్దమునకు అర్థము. ఈ కారణమున ఈ ఉత్పాతములు మీకు ఆనిష్ట ఫలమునే సూచించుచున్నవి. విమార్గమును విడిచి సన్మార్గమున నడువ వీలుండియు దుర్మార్గము ననుసరించువానికి నాశము తప్పదని ధర్మతత్వ వేత్తలందురు. నీవు మూడుడవై ఈ దైత్య డానవులతో కూడి ఈ దుష్టుల తోడ్పాటుతో దేవ తలకు ప్రతికూలము లాచరించుచున్నవి . ఈ దోషమునకు ఫలముగా మీకు నాశము కలుగుననియే ఈ ఉత్పాతములు తెలుపుచున్నవి. ఇదిగో: రుద్రుడు లోకమయరథ మారోహించి మయా త్రిపుర దుర్గమును నిన్ను అసురులను దహించుటకై వచ్చుచున్నాడు. కావున ఇట్టి స్థితిలో నీవు నీవాదాసవులతో కూడ మహేశ్వరుని శరణు చొచ్చుట మేలు. లేనిచో సికుమారులతో నీదానవులతోకూడ నశించిపోయేదవు. అని నారదుడు మయాదులగు దానవులకు రానున్న భయమును ప్రస్తుత వచనములతో తెలిపి ఆ ధీమంతుడు మరల దేవేశుని పురమునకు (స్వరమునకు) వచ్చెను. నారదుడు వెడలిన తరువాత దానవ సౌయకుడు మయుడు తన శూరుల నుద్బోధించుచు ఇట్లు పలికెను: శూరులగు దానవులారా! మనచుందరము పుత్రవంతులమయితిమి. (వారుసు మనంతటి వారయినారు). మనము కుటుంబములకు చేయవలసిన కృత్యములను చేసితిమి. మనము ఎవరికిని ఎందులకును భయపడవలసిన పనిలేదు. దేవతలతో యుద్ధము చేయుదము. మనము చచ్చితిమా ఇంద్రుని సభాసదులమై స్వర్గసుఖము లనుభవింతము. ఇంద్రాదు లను చంపగలిగితిమా.మనమే సర్వలోక ముల ననుభవింతము. కావున మీరెల్లరు శస్త్రపాణులై సన్నద్ధులే ఆట్టాల కముల పై (బురుజుల ప్రేమభవనాగ్రముల పై) నిలువుడు. కవచములు ఆయుధములు ధరించి నిలువుడు. ఈ త్రిపురము లును వీనికి అనుబద్ధములగు పురములును శత్రువులకు చేరనలవి కాకుండునట్లు మీమీ స్థానములందు నిలువుడు. దేవతలును ప్రమథులును ఆకాశ మున సంచరింపగలవారును శూరులును అని మీకు తెలియును. వారిని మీశ క్తికొలది అడ్డగించుడు. బాణములతో చీల్చుడు.
అని ఇట్లు మయుడు దానవులకు వారు దేవతలతో పోర వలసిన హేతుపును వీరు వారినడ్డగించవలసిన విధమును తెలిపి తన మనస్సును యుద్ధాసక్త మొనర్చి గగన సంచారియగు త్రిపుర దుర్గమును ప్రవేశించెను. అనంతరమతడు రజోగుణ రహిత విశుద్ధ భావమును అట్టి రూపమును కలవాడయి దిగంబరుడు దేవదేవుడు యముని మదనుని అంధకుని దక్షయజ్ఞమును అంతమొందించినవాడు అగు పర మేశ్వరుని (లౌకిక) వాక్కులతో స్తుతించి శరణు వేడెను. ప్రకాశమాను తృతీయ నేత్రముగల చంద్రమౌళియు మయుడు భయమగు ము పదమును కోరి తను శరణువేడినని. గురుతించి, ఆతని కభయ మభిమతముగా నిచ్చెను. దానవేంద్రుడగు మయుడును నిర్భయుడై యుండెను.
ఇది శ్రీ మత్స్యమహాపురాణమున త్రిపురోపాఖ్యానమున మయనారద సంవాదోది కథనమను నూట ముప్పది రెండవ అధ్యాయము.
Summary of chapter 133 of the Matsya Mahā Purana is as follows:
Bhagavān Matsya relates the plan devised by the Devas to break Mahādeva's intense absorption in meditation and facilitate His union with Goddess Pārvatī, who was undergoing penance on the mountains. The Devas summoned Kāmadeva, the deity of love, alongside his consort Rati and his companion Vasanta, instructing him to shoot his enchantment arrows at Mahādeva to awaken romantic longing for Goddess Pārvatī.