వాయు మహా పురాణము
గీతాలంకార నిర్దేశము
పూర్వాచార్యుల మతమును అనుసరించి, ముప్పది అలంకారములను ఆనుపూర్వి కముగా చెప్పెద వినుడు. తమ తమ వర్ణములతోను, ఆయా సంస్థాన (స్థితి) యోగముల తోను, పాదముల యొక్క అన్వవేక్షణతోను, చమత్కారమునకు ప్రకృష్టములైన హేతువులైనవి అలంకారములుగ చెప్పుదురు. వాక్యార్థ-పద యోగార్థములతో అలంకారము యొక్క అన్వయము జరుగును. గీతకమునకు ముందుగాని వెనుకగాని పదములు ఉండునని అందురు. వాని స్థానములు ఉరము (రొమ్ము), కంఠము, శిరము అనునవి మూడు. ఈ మూడు స్థానములలో ప్రవర్తిల్లిన విధి ఉత్తమము. ప్రకృతిలో వర్ణములు నాలుగు. ప్రవిచారము నాలుగు విధములు, వికల్పము ఎనిమిది విధములు. దేవతలు పదునారుగ తెలియవలెను. వర్ణము స్థాయియై ప్రసంచారియు అగును. మూడవది అవరోహణము. నాలుగవది ఆరోహణము. ఈ విధముగ వర్ణమును వర్ణమును వర్ణవేత్తలు తెలుసుకొందురు. అందులో ఒకటి సచరమును అస్తచరమును అగుచు సంచర స్థాయి అగును. తరువాత (ఆ) రోహణ వర్ణములకు అవరోహణమును నిర్దేశింపవలెను. వర్ణవేత్తలు ఆరోహణముతో ఆరోహవర్ణమును తెలుసుకొందురు. ఈ వర్ణములకే అలంకారములను వినుడు.
అలంకారములైతే నాలుగు. స్థాపని, క్రమరేజనము, ప్రమాదము, అప్రమాదము అనునవి. వాని లక్షణములను చెప్పెదను. విస్వరోష్ట్రకలలు స్థానము నుండి ఏకాంతరమును పొందినవి. ఆవర్తమునకు పరిమాణమును బట్టి ఆక్రమోత్పత్తులు రెండు కార్యములు. కుమారము అను వేరొకదానిని విస్తరమై వమనమును పొందినది. ఇదియే కుతారేకమై కలాధికమైన అపాంగము. శ్యేనమనునది ఏకాంతరమున పుట్టినది. కలా మాత్రాంతరమున ఉండినది. దానియందే స్వరమున వృద్ధి తద్విలక్షణమై ఉండును. శ్యేనము, అవరోహము ఉత్తరముగా చెప్పబడును. కలాకల ప్రమాణము వలన అది బిందువను పేర పుట్టును. బిందువు ఏక కలగా చేయదగినది. అది వర్ణాంత స్థాయిని అగును. అది విపర్యయ స్వరముగలది కూడ అగును. దానికి దుర్ఘటిత స్వరము ఉండదు. ఏకాంతరమైన వాద్యమైతే షడ్జము కంటే ఉత్కృష్టమైన స్వరము. కాకికి ఉచ్చ పుష్కలమువలె ఆక్షేపాస్కందనమును చేయవలెను. కార్యముగాని, కారణముగాని అవి రెండు సంతారములు, సంచార్యములును కూడా. అవరోహణము చేసియు ఆక్షిప్తము అగును. ప్రోక్షమధ్యము కూడ అగును. తరువాత పండ్రెండవ కలాస్థానము ఏకాంతరగతము అగును. ఈ విధముగ ప్రేంఖో లితము అను అలంకారము స్వరసమన్వితము అగును. స్వరసంక్రామకము వలన తరువాత పుష్కలము అని చెప్పబడినది. ఇతరముల (రెంటి) యొక్క పాదములు కలచే ప్రక్షిప్తము అగును. అట్టిదియే రెండు కలలుకలదై వ్రాసితము అనబడును. ఉచ్ఛారము వలన విస్వరారూఢమై అట్లే అష్ట స్వరాంతరము అగును. అవరోహముగగాని, తారముగగాని, మంద్రముగ గాని - ఉన్న స్వరములు ఆ స్వరము లోపలనే ఏకాంతర రహితములు అగును. ఇది మక్షిప్రచ్ఛేదనము అనుపేర చతుష్కలమైన గణము అనబడును. ఇవి ముప్పది. ఇంతకుముందు చెప్పబడిన అలంకారములు అగును. అవి వర్ణ - స్థాన ప్రయోగముతోను కలా మాత్రా ప్రమాణమును బట్టియు పై విధముగా ఉండును. సంస్థానము, ప్రమాణము, వికారము, లక్షణము - అని అలంకారపు ప్రయోజనములు నాలుగు విధములు. ఆత్మకు (ఆత్మాశ్రిత శరీరమునకు) విపర్యస్తమైన అలంకారము నిందింపబడినట్లే, విషమమైన (విపర్యస్తమైన) వర్ణము ఆత్మను అలంకరించుటకు చాలదు. నానాభరణ వ్యత్యస్త సంయోగము వలన స్త్రీకి వికృతము అలంకారము అయినట్లే కేవల వర్ణము యొక్క అలంకారము విపర్యస్తమై మిక్కిలి నిందింపబడును. పాదమున కుండలములు చూడబడవు. కంఠమున మొలనూలు కనబడదు. ఈ విధముగనే విపర్యస్తమై ఈ అలంకారము మిక్కిలి నిందింపబడును. చేయబడుచున్న అలంకారము, అదిచూపిన రాగము కర్తవ్యమై యథోద్దిష్టమైన మార్గమునకు విధింపబడును. లక్షణమును నిశ్చయించి కూడ వర్ణికలతో ప్రవర్తించుటను మాసోద్భవ ముఖోద్భవములుగా ఉన్నది చెప్పెదను. ఆ అలంకారముల ఈ విపర్యయము ఇరువది మూడును, ఎనుబదియును, షడ్జపక్షము (న) కూడ తత్త్వాదిలో మధ్యమము హీనస్వరము అగును. పడ్జ - మధ్యమముల యొక్కయు, గ్రామముల యొక్కయు వ్యత్యాసము, అట్లే ఉత్తర మంద్రము యొక్కయు ఆవికము యొక్కయు (గాంధారము యొక్క) మానములు ఇచట ఆఱే అగును. సర్వాలంకార ప్రత్యయమే సర్వుల ప్రత్యయము. అనుగమించి బహిర్గతమైనది పంచ దైవతము. గో రూపముల ఎదుట మద్యమాంసము మారును. ఆరెంటి యొక్క విభాగము గీతముల యొక్క లావణ్య మార్గమున ఉన్నది. స్వస్వరూపమైన వేరొక స్వరమును గూర్చి సంబంధము ఉద్దేశింపబడినది. (దాని ఆధారముగ) సప్తస్వర పద క్రమరూపమైన మార్పు జరుగును. నాలుగు మంద్రకములు గాంధారాంశతో గానము చేయబడును. పంచమము, మధ్యమ మును అట్లే గానము చేయబడును. ధైవతమున నిషాదమున పుట్టిన షడ్జర్షభములచే గానము చేయబడును. ఇది అంతయు మంద్రకములందే జరుగును. అంతరమున కాదు. హయ శుల్లాష్టకమునకు రెండు అపరాంతికములు. ప్రాకృతము వైణవములతో (వేణు వాద్యములతో) గాంధారాంశమున ప్రయోగింపబడును. పదమునకు మూడు రూపములు. కౌశికము ఏడు రూపములు గలది. మొత్తము గాంధారాంశతోనే మార్పుయొక్క విధి చెప్పబడినది. ఈ విధముగా మధ్యమాంశము యొక్క మధ్యమము క్రమోదిష్టమైనది. విశేషించి రూపముతో చెప్పబడిన గీతములు సప్తస్వరములుగ చేయవలెను. అది కౌశికము. దీనిని సంగదర్శనము అందురు. రెండు మానములు సమానములు. అట్లే ద్వితీయ భావాచరణ రూపమైన మాత్ర నాభియందు ప్రతిష్ఠితమైనది. ఉత్తరమున ప్రకృతి. ఈ విధముగ మాత్ర తల్లీనమగును. హంతలుండుచోట పిండకము మాత్రయందు మించి వర్తించదు. మాత్రయందు ఒకపావు భాగము నడచుట సామాన్యము. పావుభాగము తక్కువ నడచుట అతివీరణము. అసలు మాత్రయందు సంఖ్యయే లేక నడచుట కూడ చెప్పబడినది. రెండవ పాద భంగము గ్రహముతో అభిప్రతిష్ఠితమైనది. ముందు ఎనిమిది పరీతకముకాని తృతీయమునందైతే రెండవది ప్రతిష్ఠితమైనది. పంచకమున పాద భాగము నుండి పాద సామ్యముగ అర్ధముతో (సగముతో) ప్రతిష్ఠితమైనది. ప్రకృతియందు కూడ సపాదమైనా పాదభాగము(సగము)సంస్థితమైనది. (పంచకమున సగము ప్రకృతిలో సగము ఉన్నదని భావము). నాలుగవది ఉత్తర మద్రకమైన మద్రవతి యందున్నది. దక్షిణ మద్రకమున కూడ యథోక్తమైన కల యున్నది. మొదటనే అనుయోగము, రెండవది బుద్ధి అనబడును. దీనివలన రెండు పాదముల (పావు భాగముల) తీసికొనుట జరుగును. ఇట అంతు (హద్దు) లేదు. ఓ ద్విజోత్తమా! ఒకదాని ఉపయోగము, రెంటి ఉపయోగము, అనేకముల ఉపయోగమును పతాకాహరిణ అనబడినది. మూడు వృత్తులు ఒకచోట వర్తించినచోట దక్షిణ వర్తించినది. ఎనిమిది (స్వరములు) కూడినచో సౌవీర మూర్ఛన అగును. అది అనుత్తరమై సప్తత్త్వ స్వరమును వ్యాపింపజేయును.