యోగైశ్వర్యములు

వాయువు పలికెను:

యోగ విశేషముచేత యోగి సర్వలోకములను అతిక్రమించును. ఇక ముందు ఆ యోగ విశేషము యొక్క ఐశ్వర్యములను చెప్పుచున్నాను. అట యోగుల ఐశ్వర్యము ఎనిమిది గుణములు కలది. అది అంతయు ఒక క్రమ యోగముతో చెప్పుదను వినుడు. అణిమ, లఘిమ, మహిమ, ప్రాప్తి, అంతట ప్రాకామ్యము, అంతట ఈశిత్వము. అంతట వశిత్వము, అంతట యంత్ర కామావసాయిత్వము-ఇవి యెనిమిది ఐశ్వర్య గుణములు. సార్వకామికమైన ఆ ఐశ్వర్యము గూడ అనేక విధములు. అది సావద్యము, నిరవద్యము, సూక్ష్మము అని ప్రవర్తిల్లును. సావద్యమను ఆతత్త్వము పంచ భూతాత్మకము ఇంద్రియములు, మనస్సు అహంకారమును నిరవద్యముగా చెప్పబడిన. అట సూక్ష్మ ప్రవృత్తము (ఐశ్వర్యము) గూడ పంచభూతాత్మకము, ఇంద్రియములు, మనస్సు బుద్ధి, అహంకారముగా చెప్పబడినది. అట్లే సర్వమయము ఆత్మస్థము, ఖ్యాతి అని ఈ విధముగా సంయోగము మూడు విధములైన సూక్ష్మములందే ప్రవర్తిల్లును. తరువాత అష్టగుణమైన ఐశ్వర్యము గూడ అ సూక్ష్మములందే ప్రవర్తించును. ప్రభువైన భగవంతుడు చెప్పినట్లు దానియొక్క రూపమును చెప్పుదును.

త్రైలోక్యమున సర్వభూతములలో జీవునియొక్క (స్థితి) అనియతమని చెప్పబడినది. అంతయు ప్రతిష్ఠితమై వ్యక్తమగునట్టి సూక్ష్మము అణిమ. త్రైలోక్యమున సర్వప్రాణులకు పొందుటకు అలవిగానిదైనను యోగులకు (యోగ) బలమువలన లభించును ఇది మొదటిది అణిమ, యోగమున యోగియొక్క రూపము (ఆకారము) వ్రేలాడునది, తేలి ఉండునది, సర్వప్రాణులలో శీఘ్రముగ పోవునదియు అగును. ఇది రెండవదైన లఘిమ యొక్క స్థానము అనబడినది. త్రైలోక్యమున సర్వభూతము (అంగుల్యముచే చంద్రునిలో కలుగుట) యొక్క ప్రాప్తియున్న యోగము సిద్ధి ప్రాప్తి అనియు, ప్రాకామ్యము (సంకల్పమునకు అడ్డులేమి) ఉన్న యోగసిద్ధి ప్రాకామ్యము. మహిమ మహత్పరిమాణుడుగా కలిగియున్న యోగసిద్ధి మహిమ. ఇది మూడవ యోగసిద్ధి త్రైలోక్యమున సర్వభూతములలో ప్రాణులలో త్రైలోక్యము పొందుటకు అలవి కానిది అగును. ప్రతిరోధముచే అడ్డబడినవాడై ఒకచోట ప్రకామములైన విషయములను అనుభవింపజాలడు. త్రైలోక్యమున సర్వభూతములకు సుఖదుఃఖములు ప్రవర్తిల్లుచున్నవి. (ఇట్టి స్థితిలో త్రైలోక్యమును పొందగల యోగసిద్ధి ప్రాప్తి, అడ్డులేని సంకల్పముతో ప్రకామ విషయ అనుభవము చేయగల యోగసిద్ధి ప్రాకామ్యమే, త్రైలోక్యమున సుఖ దుఃఖములకు అందరాని మహత్పరిమాణమును పొంద గల యోగసిద్ధి మహిమ అని చెప్పబడును. యోగి అంతట ప్రతి భాగముచే భూత భౌతికముల ఉత్పత్తి స్థితి నాశనము ఒనర్చు శక్తి కలిగి ఉండుట ఈశత్వసిద్ధి. చరాచరములు గల త్రైలోక్యమున భూతములు వశ్యములగును. కాని అవి తమ ఇచ్ఛతో పరవశముకావు గదా. యోగి యొక్క వశిత్వసిద్ధితోనే వశమగును. చరాచరములు నిండిన త్రైలోక్యమున “యత్రకామావసాయిత్వ”మను సిద్ధితో యోగి ఇచ్ఛానుసారమే ఇంద్రియములు పనిచేయు చుండుటయు పనిచేయకుండుటయు, జరుగును. ఈ యోగి ఇచ్ఛానుసారమే శబ్ధము, స్పర్శ, రసము, గంధము, రూపము, మనస్సును, ప్రవర్తించుచుండును. అతని ఇచ్ఛానుసారమే అవి ప్రవర్తింపకగూడ ఉండు ఇంద్రియములైన త్వగాదులును, వాని విషయములైన స్పర్శాదులును “యత్రకామవసాయిత” అను యోగసిద్ధిగల యోగి యొక్క ఇచ్ఛానుసారమే. ప్రత్యక్షానుకూలమైన పరస్పర సంబంధము కలిగియుండును. అట్లే ఆ సిద్ధయోగి పుట్టడు, చావడు, భేదింపబడడు, పూజింపబడడు, దహింపబడడు, క్షీణింపబడడు. నశింపడు, ఎప్పుడును దుఃఖింపడు, అంతటను వికారము చెందడు. గంధ రసరూపములు లేనివాడై స్పర్శ శబ్దముల వదలినవాడై వర్ణముయొక్క వర్ణములేనివాడై వరుడు గానివాడై ఉండును. తరువాత విషయములు అనుభవించును. విషయములలో తగుల్కొనడు. పరమమైన సూక్ష్మమును తెలిసి సూక్ష్మత్వము వలన అపవర్గకుడు అగును. అపవర్గము నుండి వ్యాపకుడగును. వ్యాపియైనందున పురుషుడనబడును. పురుషుడు సూక్ష్మ భావము వలన ఐశ్వర్యమువలన పరముగనే ఉండును. ఐశ్వర్యమున గణాంతరము అన్నిటికంటె సూక్ష్మ మనబడును. ఎదురుదెబ్బలేని ఐశ్వర్యమును పొంది అత్యుత్తమమైన యోగమును, ఆ తరువాత సుసూక్ష్మమై పరమపదమైన మోక్షమును పొందవలెను. (13)