వాయు మహా పురాణము
దక్షకృతోష్ట సహస్రనామ స్తుతి
దక్షుడు పలికెను:
దక్షుడు శివాష్టోత్తర సహస్ర నామ స్తుతితో స్తోత్రము చేయుచు పలికెను. దేవాయ(తే) నమస్కారము=దేవునకు నమస్కారము, జగన్నిర్మాణ పరుడవై ప్రత్యక్షాది ప్రమాణ గోచరుడవై జ్ఞేయుడవైన నీకు నమస్కారము; దేవేశాయ నమస్కారము= దేవతలకు ఈశ్వరుడవైన నీకు నమస్కారము. ఇంద్రియాత్మకుడవును బుద్ధ్యాత్మకుడవును అయిన నీకు నమస్కారము. జ్ఞాన, జ్ఞాతృరూపుడవైన నీకు నమస్కారము; దేవాది బలసూద నాయ నమః= దేవతల శత్రువులైన రాక్షసుల బలమును నశింపచేయు నీకు నమస్కారము. ఇంద్రియవృత్తులైన శమాది దేవతలకు శత్రువులైన కామాదుల బలమును నశింపజేయు నీకు నమస్కారము. (దేవా! ఇంద్రియములు శమాదులును) ఈశః =అసురాః కామాదులు; దేవేంద్రాయ నమః=దేవేంద్ర స్వరూపుడవైన నీకు నమస్కారము. ఇంద్రియములకు సమస్త జ్ఞాన ప్రకాశక దీప్తినిచ్చు (ఆత్మ స్వరూపుడవగు) నీకు నమస్కారము; అమర శ్రేష్ఠాయ నమః=మృతిచెందని దేవతలలో శ్రేష్ఠుడవైన నీకు నమస్కారము. దేవదానవ పూజితాయ నమః=దేవతలచేతను (ఇంద్రాదుల చేతను), రాక్షసులచేతను (బాణాదులు చేతను) పూజింపబడిన నీకు నమస్కారము; సహస్రాక్షాయ నమః = వేయి కన్నులు కలవాడవగు నీకు నమస్కారము. ఒకే మారు అన్ని విషయములను తెలియజేయు ఇంద్రియములు కలిగి సర్వజ్ఞుడవగు నీకు నమస్కారము, విరూపాక్షాయ నమః =మన ఇంద్రియములవలె గాక వ్యవధానమున (అడ్డంకులున్నను) కూడ విషయములను గ్రహించు విశిష్ట రూపమైన ఇంద్రియములుగల నీకు నమస్కారము; త్ర్యక్షాయ నమః = మూడు (సోమ, సూర్య, అగ్ని రూపములైన కన్నులు గల నీకు నమస్కారము. యక్షులకు రాజైన ప్రియ మిత్రుడవైన నీకు నమస్కారము; సర్వతః పాణి పాదాయ నమః = అన్నివైపుల చేతులు, కాళ్ళు సర్వకర్తయు, సర్వగన్తయు అయిన నీకు నమస్కారము; సర్వతోఽ క్షిశిరో ముఖాయ నమః =అన్నివైపుల నేత్రములు, తల, ముఖముగల నీకు నమస్కారము. (ముఖ మంతయు అంతేకాక తల యంతయు కన్నులు గలవాడు); లోకే సర్వతః శ్రుతిమతే నమః = లోకమున అన్నివైపుల వినగల చెవిగల నీకు నమః; సర్వానావృత్య తిష్ఠతే నమస్కారము = అందరిని ఆవరించియున్న నీకు నమస్కారము
శంకుకర్ణాయ నమః = శంకువు వంటి చెవులుగల గుణ స్వరూపునకు నమస్కారము; (శంకుకర్ణాదులు ఈశ్వరగణములు సర్వాభిఽ న్నుడగు శివుడు వారితో గూడ అభిన్నుడే); మహాకర్ణాయ నమః = పెద్ద చెవులుగల గణ స్వరూపునకు నమస్కారము, కుంభకర్ణాయ నమః =కుండవంటి చెవులుగల గణస్వరూపునకు నమస్కారము అర్ణవాలాయ నమః =సముద్రంలో నివసించు గణ స్వరూపునకు నమస్కారము; గజేంద్ర కర్ణాయ నమః = గజరాజు చెవులవంటి చెవులుగల గణ స్వరూపునకు నమస్కారము; గోకర్ణాయ నమః =గోవుల వంటి చెవులుగల గణ స్వరూపునకు నమస్కారము; పాణి కర్ణాయ తే నమః =చేతులవంటి చెవులుగల గణ స్వరూపునకు నమస్కారము;
శతోదరాయ నమః =అనంతములైన కడుపులతో విశ్వరూపుడవైన నీకు నమస్కారము; శతావర్తాయ నమః=అనంతములైన తేజో (రాశి) సుళ్ళు (galaxies) గలిగి విశ్వరూపుడవైన నీకు నమస్కారము; శతజిహ్వాయ నమః = అనంతములైన నాలుకలుకలిగి కాలవిశ్వరూపుడవైన నీకు నమస్కారము; శతాననాయ నమః = అనంత ముఖములతో విశ్వరూపుడవైన నీకు నమస్కారము; త్రిసంధ్యాసు గాయత్రీ జపగీతాయ నమః =మూడు సంధ్యలలో గాయత్రీ జపపరులచే గానము జేయబడు నీకు నమస్కారము; త్రిసంధ్య గాయత్రీ త్రిసంధ్యలలో అర్చింపబడు (సూర్య రూపునకు) నీకు నమస్కారము
దేవదానవ గోప్త్రే నమః = రాక్షసబాధల నుండి దేవతలను, పాపఫలితముగా సంహారము నిచ్చి కైవల్యము నిచ్చుటచే దానవులను రక్షించు నీకు నమః; బ్రహ్మణే నమః = బ్రహ్మాత్ముడవైన నీకు నమస్కారము; శతక్రతవే నమః = ఇంద్రాత్మునకు నీకు నమస్కారము; మూర్తీశాయ నమః = పృథివి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, యజమాని అను అష్టమూర్తులతో ఈశుడవగు నీకు నమస్కారము; మహామూర్తయే నమః = లింగాకారమున (క్రిందపైన) విశ్వమంతయు వ్యాపించిన ఆకారముగల నీకు నమస్కారము; సముద్రాంబు ధరాయ నమః = సముద్ర జలమును, తేజోరూపమున ధరించు నీకు నమస్కారము (ఆగ్నే రాపః అని వేదము)
గవా గోష్ఠ ఇవ సర్వ దేవతానాం నివాసాయ నమః = గోవులకు గోశాలవలె సమస్త దేవతలకు నివాసమైన నీకు నమస్కారము; సోమ శరీరాయ నమః = చంద్రుడు శరీరమైన వానికి నమస్కారము; అగ్ని శరీరాయ నమః = అగ్ని శరీరమైన వానికి నమస్కారము; వరుణ శరీరాయ నమః = వరుణుడు శరీరమైన వానికి నమస్కారము; ఆదిత్య శరీరాయ నమః =సూర్యుడు శరీరమైన వానికి నమస్కారము; విష్ణు శరీరాయ నమః = విష్ణువు శరీరమైన వానికి నమస్కారము; బ్రహ్మ శరీరాయ నమః =బ్రహ్మ శరీరమైన వానికి నమస్కారము; బృహస్పతి శరీరాయ నమః = బృహస్పతి శరీరమైన వానికి నమస్కారము (సోమాదులకు ఆత్మ అయిన వాడని భావము)
క్రియా స్వరూపాయ నమః = సర్వక్రియా స్వరూపునకు నమస్కారము; కార్యాయ నమః = సర్వకార్య స్వరూపునకు నమస్కారము; కారణాయ నమః = సర్వకారణ స్వరూపునకు నమస్కారము; కర్త్రే నమః = సర్వకర్తకు నమస్కారము; కరణాయ నమః = సర్వకరణ (సాధన) స్వరూపునకు నమస్కారము;
అసతే నమః = సత్తాస్ఫూర్తి శూన్యునకు నమస్కారము (మాయా శబలిత సగుణ బ్రహ్మ స్వరూపునకు నమస్కారము అని భావము); సదసదే నమః =సదసత్స్వరూపునకు నమస్కారము; ప్రభవాప్యయాయ నమస్కారము=జన్మమృత్యు స్వరూపునకు నమస్కారము; భవాయ నమః=సర్వోత్పత్తి స్థాన రూపునకు నమస్కారము; శర్వాయ నమః =దుష్టులను చంపువానికి నమస్కారము; రుద్రాయ నమః = పాపములను ద్రవింప (కరుగ) చేయువానికి నమః ; వరదాయ నమః = భక్తులకువరముల నిచ్చువానికి నమస్కారము
పశూనాం పతయే నమః =బ్రహ్మాది స్థావరాంత జీవులైన పశువులను రక్షించు పతియైన వానికి నమస్కారము; అంధక ఘాతినే నమః = అంధకుడను రాక్షసుని సంహరించిన వానికి నమస్కారము; త్రిజటాయ నమః =మూడు జడలుగల రూపము గలవానికి నమస్కారము; త్రిశీర్షాయ నమః =మూడు తలల రూపము గలవానికి బ్రహ్మాత్మ స్వరూపునకు నమస్కారము; త్రిశూలవర ధారిణే నమః =త్రిశూలము అను ఆయుధ శ్రేష్ఠమును ధరించిన వానికి నమస్కారము; త్ర్యంబకాయ నమః = శాస్త్రాచార్యాధ్యయన రూపములైన మూడు నేత్రములు గలవానికి నమస్కారము; త్రినేత్రాయ నమః = సోమ సూర్యాగ్ని రూపములైన మూడు నేత్రములు గలవానికి నమస్కారము; త్రిపురఘ్నాయ నమః =ఆకాశమున లోహ రజతకనక పురములను నిర్మించుకొని, అజేయులైన కమాలాక్ష విద్యున్మాలిలను త్రిపురాసురుల పురములను మూడవ నేత్రముతో ధ్వంసముజేసిన నీకు నమస్కారము; చండాయ నమః = కోపముచే అందరిని చంపుటకు సమర్థుడైన వానికి నమస్కారము; (చడి-కోపే); ముండాయ నమః = అందరిని శోధింపజేయువానికి నమస్కారము (ముడి మార్జనే); ప్రచండాయ నమః =పాపులను నిశ్శేషముగా ఖండించువానికి నమస్కారము (ముండి ఖండనే); ధరాయ నమః =సర్వమును ధరించువానికి నమస్కారము
డిండిమాసక్త కర్ణాయ నమః =డిండిమము అను వాద్యవిశేష ధ్వనియందు తాండవ సమయమున లగ్నమైన కర్ణేంద్రియములుగల నీకు నమస్కారము; దండినే నమః = దండములను ధరించిన నీకు నమస్కారము; సమకర్ణాయ నమః = సమమైన కర్ణములు గల నీకు నమస్కారము; దండి మండాయ నమస్కారము దండము ధరించిన ముండనము జేసికొన్న పరివ్రాజక రూపునకు నమస్కారము; అర్థదండ కేశాయ నమః = సగము దండముతో సమానముగా పొడవైన తలవెంట్రుకలుగల నీకు నమస్కారము; నిష్ఠాయ నమః =బంగారు రూపము గలవారికి నమస్కారము; వికృతాయ నమః =వికార రూపము జెందిన నీకు నమస్కారము; విలోహితాయ నమః =మిక్కిలి ఎఱ్ఱనైన నీకు నమస్కారము; ధూమ్రాయ నమః = పొగవర్ణముగల నీకు నమస్కారము; నీలగ్రీవాయ తే నమః = కాలకూట విషము త్రాగుటచే నల్లని కంఠముగల నీకు నమస్కారము; అప్రతిరూపాయ నమః = ప్రతిరూపము (సాటిరూపము) లేని నీకునమస్కారము; శివాయ తే నమః =మంగళ కళా స్వరూపుడ వైన నీకు నమస్కారము; సూర్యాయ నమః = సూర్య స్వరూపుడవైన నీకు నమస్కారము; సూర్యధ్వజ పతాకినే నమః = సూర్యుడు ధ్వజము నందును జెండా యందునుగల నీకు నమస్కారము; ప్రమథనాథాయ నమః =ప్రమథులకు (సర్వులను మధించగల బలము గలవారికి) ప్రభువైన నీకు నమస్కారము; వృష స్కంధాయ నమః = ఆబోతు వంటి భుజములుగల నీకు నమస్కారము; ధన్వినే నమః =ధనుస్సు ధరించిన నీకు నమస్కారము
హిరణ్య గర్భాయ నమః =సువర్ణమయమైన, తేజోమయమైన గర్భముగల నీకు నమస్కారము; హిరణ్య కవచాయ నమః =జ్ఞాన తేజోమయమైన (బంగారు మయమైన) కవచముగల నీకు నమస్కారము; హిరణ్యకృత చూడాయ నమః = బంగారము (సొమ్ములు) నిండిన కొప్పుగల జ్ఞానతేజోమయమైన జటాజూటముగల నీకు నమస్కారము; సత్రఘాతాయ నమః = దక్షయజ్ఞ ధ్వంసము చేసిన నీకు నమస్కారము; దండాయ నమః = దండనీతి స్వరూపుడవగు నీకు నమస్కారము; వర్ణపాన పుటాయ నమః = = ఇష్టమైన పానపాత్ర (ద్రోణి) గల నీకు నమస్కారము; స్తుతాయ నమః = స్తోత్రము చేయబడిన నీకు నమస్కారము. స్తుత్యాయ నమః = స్తోత్రము చేయదగిన నీకు నమస్కారము; స్తూయమానాయ నమః =అందరిచే స్తుతింపబడుచున్న నీకు నమస్కారము; సర్వాయ నమః =సర్వ స్వరూపుడవగు నీకు నమస్కారము; అభక్ష్య భక్ష్యాయ నమః =యముడు భక్షించుటకు అవిగాని వానినైన భక్షించగల నీకు నమస్కారము; సర్వ భూతాన్తరాత్మనే నమః = సర్వ భూతములకు అంతరాత్మవైన నీకు నమస్కారము; హోత్రాయ నమః =హోమము చేయదగిన హవిస్సు (నేయి) మొదలగువాని స్వరూపుడవగు నీకు నమస్కారము; మన్ర్తాయ నమః =హోమమన్ర్త స్వరూపుడవగు నీకు నమస్కారము; శుక్ల ధ్వజ పతాకినే నమః =తెల్లని ధ్వజము (జెండా) కల నీకు నమస్కారము
నమాయ నమః =నమస్కార స్వరూపుడవగు నీకు నమస్కారము; నమ్యాయ నమః =నమస్కరింపదగిన స్వరూపముగల నీకు నమస్కారము; కిలికిలాయ నమః =కిలికిలియను హర్షానంద సూచక విశిష్ట శబ్ద స్వరూపునకు నమస్కారము; శయమానాయ నమః =సుఖముగా యోగనిద్రను అనుభవించుచున్న నీకు నమస్కారము; శయితాయ నమః =నిద్రించిన వాని స్వరూపుడవగు నీకు నమస్కారము; ఉత్థితాయ నమః = నిద్రమేలుకొన్న స్వరూపునకు నమస్కారము
స్థితాయ నమః =నిలకడగానున్న నీకు నమస్కారము; చలమానాయ నమః =కదులు (నడుచు) చున్న నీకు నమస్కారము; ముద్రాయ నమః =అంతట సంతోషము నిచ్చు నీకు నమస్కారము (ముదం రాతి అదత్తే ఇతి ముద్రః); కుటిలాయ నమః = నాట్యము చేయు స్వభావముగల నీకు నమస్కారము; ముఖవాదిత్రకారిణే నమః =ముఖముతో వీణా వేణు మృదంగతాళ వాద్యనాదముల జేయు నీకు నమస్కారము; నాట్యోపహార లుబ్ధాయ నమః = నాట్యపు కానుకలందు ఆసక్తిగల నీకు నమస్కారము; గీత వాద్య రతాయ నమః = దుష్టులకు కుటిల స్వరూపుడవైన నీకు నమస్కారము; నర్తన శీలాయ నమః = పాటలయందును వానికి తగిన వాద్య ధ్వనులయందును ఆసక్తుడైన నీకు నమస్కారము; జ్యేష్ఠాయ నమః = అందరి కంటెను పూర్వుడవైన (పెద్దవైన) నీకు నమస్కారము; శ్రేష్ఠాయ నమః = అందరికంటెను గుణాధికుడవైన నీకు నమస్కారము; బల ప్రమథనాయ నమః = బలాభిమానియగు దేవుడు ఇంద్రుని మథించి ఓడించిన నీకు నమస్కారము; కలనాయ నమః = సర్వమును తెలిసికొను నీకు నమస్కారము; కల్పాయ నమః = వేదాంగవిధి స్వరూపుడవగు నీకు నమస్కారము; క్షయాయ నమః =మహాప్రళయ స్వరూపుడవగు నీకు నమస్కారము; ఉపక్షయాయ నమః = అవాంతర ప్రళయ స్వరూపుడవగు నీకు నమస్కారము; భీమదుందుభిహాసాయ నమః= భయంకరమైన భేరి ధ్వనివంటి నవ్వుగల నీకు నమస్కారము; భీమసేన ప్రియాయ నమః = భీమసేన ప్రియుడవైన నీకు నమస్కారము; ఉగ్రాయ నమః = భయంకర స్వరూపుడవగు నీకు నమస్కారము; దశబాహవే నమః =పదిచేతులుగల నీకు నమస్కారము; కపాలహస్తాయ నమః = మనిషి పుఱ్ఱె చేతి యందుగల నీకు నమస్కారము; చితాభస్మ ప్రియాయ నమః = కాటిబూడిద ఇష్టమైన నీకు నమస్కారము
విభీషణాయ నమః =నిర్భయునకు నీకు నమస్కారము; భీష్మాయ నమః = భయం కరుడవగు నీకు నమస్కారము; భీష్మవ్రత ధరాయ నమః = భయంకరములైన నిరాహారాది వ్రతముల ధరించిన నీకు నమస్కారము; వికృత వక్షాయ నమః = విశాలముగా చేయబడిన వక్షస్థలముగల నీకు నమస్కారము; ఖడ్గజిహ్వాగ్రదంష్ట్రిణే నమః = ఖడ్గమువంటి నాలుకయు కోరలనుగల నీకు నమస్కారము;
పక్వాయ మాంసలుబ్ధాయ నమః = యజ్ఞమున పక్వమైన, శ్మశానమున ఆమమై (అపక్వమైన) మాంసములయందు ఆసక్తిగల నీకు నమః; తుంబవీణా ప్రియాయ నమస్కారము; ఎండిన సొరకాయతో చేసిన వీణను ఇష్టపడు నీకు నమస్కారము; వృషాయ నమః =వృష్టికర్తవగు నీకు నమస్కారము; వృష్యాయ నమః =ధర్మవృద్ధి కర్తయగు నీకు నమస్కారము; వృష్ణయే నమః = యాదవ కృష్ణ స్వరూపునకు నీకు నమస్కారము; వృషణాయ నమః = విశ్వప్రాణి తేజో రూపమయిన రేతస్సును వర్షించు నీకు నమస్కారము; కటింకటాయ నమః =వాయ్వాది రూపమున నిత్యము గమన శీలుడవగు నీకు నమస్కారము; చండాయ నమః = మిక్కిలి కోపియైన నీకు నమస్కారము; సావయవాయ నమః =అవయవములుగల యవయవి స్వరూపుడవగు నీకు నమస్కారము; వరకృష్ణాయ నమః =పుత్రవరదానాదుల వలన కృష్ణుడెవని వలన వరుడుగా జేయబడెనో (వరః శ్రేష్ఠః యస్మాత్సః) అట్టి పరమేశ్వరునకు నీకు నమస్కారము; వరాయ నమః = వర స్వరూపుడవగు నీకు నమస్కారము; వరదాయ నమః = ఈప్సితవర స్వరూపుడవగు నిన్ను భక్తులకు స్వాత్మగా ఇచ్చు నీకు నమస్కారము; వరగంధమాల్య వస్త్రాయ నమః = ఇష్టమై శ్రేష్ఠములైన పుష్ప మాలలు వస్త్రములునుగల నీకు నమస్కారము; వరాతివరయే నమః = కోరిన దానికన్న అధికముగ ఇచ్చు నీకు నమస్కారము; వర్షాయ నమః = వర్ష స్వరూపుడవగు నీకు నమస్కారము; వాతాయ నమః = వాయు స్వరూపుడవగు నీకు నమస్కారము; ఛాయాయై నమః = నీడరూపుడవైన నీకు నమస్కారము; ఆతపాయ నమః = ఎండ రూపుడవైన నీకు నమస్కారము; రక్త విరక్తాయ నమః = రాగవిరాగ భయాత్మకుడవగు నీకు నమస్కారము; శోభనాయ నమః = సుందర స్వరూపుడవగు నీకు నమస్కారము; అక్షమాలినే నమః = అకారాది క్షకారాన్త వర్ణమాలా రూపమైన జపమాలగల నీకు నమస్కారము; సంభిన్నాయ నమః = కారణ రూపమున అంతట వెన్నంటియున్న నీకు నమస్కారము; విభిన్నాయ నమః = కార్య రూపమున వేరైన ఆవరింపబడిన రూపముగల నీకు నమస్కారము; వివిక్త వికటాయ నమః = ఏకాంతముచే వక్ర స్వభావముగల నీకు నమస్కారము; అఘోర రూపరూపాయ నమః =అంతకంటే భయంకర రూపములేని శాంతరూపమైన ఆకారముగల నీకు నమస్కారము; ఘోరఘోరతరాయ నమః =భయంకరుడవును మిక్కిలి భయంకరుడవు నైన నీకు నమస్కారము; శివాయ నమః =సజ్జన మనస్సులందు ఉండు నీకు నమస్కారము; శాన్తాతారాయ నమః =మనస్సం యమముగల నీకు నమస్కారము; శాన్తతరాయ నమస్కారము=మిక్కిలి మనస్సంయముగల నీకు నమస్కారము; ఏక పదే నమః =ఇతరులకు లేని మహిమతో ముఖ్యమైన పాదములు గల నీకు నమస్కారము; బహునేత్రాయ నమః =సర్వమును చూడగల బహు నేత్రములుగల నీకు నమస్కారము; ఏకశీర్షే నమః = సర్వాతి శయముతో సాటిలేని శిరస్సుగల నీకు నమస్కారము; కృద్ధాయ నమః = కోపరూపుడైన నీకు నమస్కారము; లుబ్థాయ నమః = అన్ని విధముల సర్వోత్తమముగా వృద్ధిచెందిన నీకు నమస్కారము; లబ్ధాయ నమః =భక్తజన సుఖమును గోరు నీకు నమస్కారము; సంవిభాగ ప్రియాయ నమః =సర్వసుఖ సాధనమైన చక్కని విభాగమును ఇష్టపడు నీకు నమస్కారము;
పంచమాలార్చితాంగాయ నమః =రెండు పాదములు రెండు చేతులు ఒక శిరము ఐదు పుష్ప మాలలచే పై ఐదు అంగములు పూజింపబడిన నీకు నమస్కారము; పాశుపతాయ నమః =పశుపతి అధి దైవతముగల అస్త్ర స్వరూపుడవగు నీకు నమస్కారము; చండాయ నమః =తీవ్ర స్వరూపుడవైన నీకు నమస్కారము; ఘంటాయ నమః = ఘంటా స్వరూపుడవగు నీకు నమస్కారము; ఘంటాజగ్ధరంద్రిణే నమః =ఘంటచేత ఆవరింపబడిన చెవి రంధ్రములుగల నీకు నమస్కారము; సహస్ర శతఘంటాయ నమః =లక్ష ఘంటా నాదములుగల నీకు నమస్కారము; ఘంటామాలా ప్రియాయ నమః =ఘంటమాలలను ధరింప ఇష్టపడు నీకు నమస్కారము; ప్రాణదండాయ నమః =హృదయగత ప్రాణమే యోగ దండముగా గల నీకు నమస్కారము; త్యాగాయ నమః =కోరినవన్ని ఇచ్చు త్యాగ స్వరూపునకు నమస్కారము; హిలిహిలాయ నమః =హిలిహిలాఅని (సంతోషముననో మాంత్రికముగనో) పలుకు నీకు నమస్కారము; హూంహూంకారాయ నమః = దూషణుని ‘హూం’ అను ప్రళయ హూంకారముతో జంట అవన్తీ క్షేత్రమున మహాకాళ రూపమున వెలసిన నీకును, (అవన్తీ క్షేత్ర మాహాత్మ్యము) అణిమాద్యష్టైశ్వర్యములతో గూడి హైమీ సహితుడవై సర్వవ్యాధి నివారకుడవైన నీకును నమస్కారము; హ్= అణి మాద్యష్టైశ్వర్యయుత శివుని ఊమ్ హైమక బీజము పార్వతిని చెప్పునది సర్వవ్యాధి నివారణము (శ్రీ గరుడ తంత్రము); పారాయ నమస్కారము=భూరాది లోకముల కంటెపరమై శాంతమైన పరబ్రహ్మ స్వరూపుడవగు నీకు నమస్కారము; హూంహూంకార ప్రియాయ నమః =ఛిన్న మస్తాశక్తి ప్రియుడవైన నీకు నమస్కారము; హూం=ఛిన్న మస్తా బీజము (మంత్ర సిద్ధి) ఆకాశ రూపమున సర్వవ్యాపివైన శివుడవై పృధివియందు అంతట నెలకొని దుష్టులకు కాల రుద్రుడవై సర్వలక్ష్మిని జయము నిచ్చు ఆకారమే ప్రియమైన నీకు నమస్కారము; హ్=శివ ఆకాశ బీజము; ఊ=పృథివీ బీజము; మ్=కాల రుద్ర (లక్ష్మీ) రమా బీజమై జయప్రదము (మంత్ర సిద్ధి); శంభవే నమః=సుఖమును రక్షించి ఇచ్చు హరిహర స్వరూపునకు నమస్కారము. (శంభుః శివుడు విష్ణువు బ్రహ్మ గు. బా.ప్ర.); నిత్యం గిరి వృక్ష కలాయ నమః =ఎల్లప్పుడును పర్వతములకును వృక్షములకును కళాస్వరూపుడవైన నీకు నమస్కారము; గర్భమాంస శృగాలాయ నమః = యజ్ఞేశ్వరుడ వై వసా మాంసము నందు లోభము గల వాడవైన నీకు నమస్కారము; తారణాయ నమః = యజ్ఞభోక్తృత్వముచే పాపమోచకుడవైన నీకు నమస్కారము; తరాయ నమః = సంసారసాగరమును తరింపజేయు సాధనమైన నీకు నమస్కారము; యజ్ఞాధిపతయే నమః = యజ్ఞేశ్వరుడవైన నీకు నమస్కారము; ద్రుతాయ నమః =వేగ స్వరూపుడు కరిగిన రస స్వరూపుడును ఐన నీకు నమస్కారము; ఉపద్రుతాయ నమః =అనుకూల వేగవంతుడవైన నీకు నమస్కారము; యజ్ఞవాహాయ నమః =ఋత్విక్కులు మొదలగువాని రూపమున యజ్ఞ నిర్వాహకుడవైన నీకు నమస్కారము; దానాయ నమః =హవిర్దాన స్వరూపుడవైన నీకు నమస్కారము; తప్యాయనమః = సత్త్వమయుడవై తపోయ ముడవైన నీకు నమస్కారము; తపనాయ నమః =సూర్య స్వరూపుడవై తపింపజేయువాడవైన రజో రూపుడవైన నీకు నమస్కారము; తటాయ నమః =సంసార సాగరమునకు తర స్వరూపుడవైన నీకు నమస్కారము; భవ్యాయనమః = క్షేమ స్వరూపుడవైన నీకు నమస్కారము; తడితాంపతయే నమః =మెఱుపులకు పతియైన నీకు నమస్కారము.
అన్నదాయ నమః =అన్నము నిచ్చువాడవగు నీకు నమస్కారము; అన్నపతయే నమః =అన్నమునకు సర్వాధికారపతివైన నీకు నమస్కారము; అన్నభవాయ నమః = అన్నమువలన పుట్టిన మానవమనః స్వరూపుడవగు నీకు నమస్కారము (అన్నము సూక్ష్మ రూపము మనస్సని ఛాం. ఉప); సహస్ర శీర్షే నమః = అనంత శిరస్సులుగల దివ్యపురుష స్వరూపుడవగు నీకు నమస్కారము; సహస్రచరణాయ నమః =అనంత పాదములు గల దివ్య పురుషోత్తమ స్వరూపుడవగు నీకు నమస్కారము; సహస్రాద్యత శూలాయ నమః =అనంత శూలముల నెత్తి ధరించిన అనంత హస్తములు గల దివ్య పురుషోత్తమ స్వరూపుడవగు నీకు నమస్కారము; సహస్ర నయనాయ నమః = అనంతములయిన కన్నులుగల దివ్య స్వరూపుడవగు నీకు నమస్కారము; బాలరూపాయ నమః = బాల స్వరూపుడవగు నీకు నమస్కారము; బాలరూపధరాయ నమః = బాలుడగు కృష్ణాది దివ్యరూపములు ధరించినవాడవగు నీకు నమస్కారము; బాలానాంచైవ గోప్ర్తే నమః = బాలురను గూడ రక్షించు కృష్ణుడవైనట్టి నీకు నమస్కారము; బాలక్రీడనకాయ నమః = బాలభక్తులకు లింగరూపమున క్రీడాస్వరూపమైన నీకు నమస్కారము; శుద్ధాయ నమః =ఏకల్మషములేని శుద్ధస్వరూపుడవగు నీకు నమస్కారము; బుద్ధాయ నమః =ఆత్మజ్ఞాన స్వరూపుడవైన నీకు నమస్కారము; క్షోభణాయ నమః =శత్రువులను క్షోభింపజేయువాడవైన నీకు నమస్కారము; క్షతాయ నమః = దుష్టులకు దెబ్బవంటివాడవైన నీకు నమస్కారము; తరంగాంకిత కేశాయ నమః = గంగాతరంగములతో ఒప్పిన తలవెంట్రుకలు గల నీకు నమస్కారము; ముక్త కేశాయ నమః = ఆకాశగంగను జటాబద్ధము జేయుటకై విరబోసిన తల వెంట్రుకలు గల నీకు నమస్కారము; షట్కర్మనిష్ఠాయ నమః = యజ్ఞము జేయుట- యజ్ఞమును జేయించుట వేదశాస్త్రాదులను జదువుట వానిని జదివించుట దానము ధర్మములు చేయుట దానము స్వీకరించుట అను ఈ ఆఱు కర్మలయందు ఉండు వాడవగు నీకు నమస్కారము; త్రికర్మ నిరతాయ నమః = యజన -అధ్యయన దానకర్మలందు మిక్కిలి ఆసక్తిగల నీకు నమస్కారము; వర్ణాశ్రమాణాం విధివత్ పృథక్కర్మ ప్రవర్తినే నమః బ్రాహ్మణాది వర్ణములకును బ్రహ్మచర్యాది ఆశ్రమములకును శాస్త్రీయముగను వేరువేరుగను తగిన ధార్మిక కర్మలను ప్రవర్తిల్లజేయు నీకు నమస్కారము; ఘోష్యాయ నమః =నాదముచే ధ్వనింపదగిన నీకు నమస్కారము; కలకలాయ నమః = కోలాహల స్వరూపుడవగు నీకు నమస్కారము; శ్వేత పింగళ నేత్రాయ నమః = ఎఱుపును గోరోచన వర్ణమును కలిగిన కన్నులుగల నీకు నమస్కారము; కృష్ణరక్తేక్షణాయ నమః =నలుపు, ఎఱుపుగల చూపులు గలవాడవైన నీకు నమస్కారము; ధర్మార్థ కామమోక్షాయ నమః = నాలుగు విధములగు ధర్మాది పురుషార్థముల స్వరూపముగల నీకు నమస్కారము; క్రథాయ నమః = శత్రువులకు హింసా స్వరూపుడవగు నీకు సమస్కారము; క్రథనాయ నమః =శత్రువులను హింసించునట్టి నీకు నమస్కారము. సాంఖ్యాయ నమః =నిరీశ్వరవాదియై సాంఖ్య సిద్ధాన్త వర్తకుడైన కపిలముని స్వరూపుడవగు నీకు నమస్కారము; సాంఖ్యము ఖ్యాయ నమః = సేశ్వర పాతంజల స్వరూపుడవగు నీకు నమస్కారము. సాంఖ్యమన వేదాన్త విచారము వేదాంత విచార ముఖ్యస్వరూపుడు పరమేశ్వరుడని భావము; యోగాధి పతయే నమః = పాతంజల యోగమునకు అధిపతుడవైన నీకు నమస్కారము. నిధిద్యాసన రూపమైన యోగమునకు అనుగ్రహముద్వారా వీనియందు సర్వ ప్రవర్తకుడవగు నీకు నమస్కారము; రథ్యవిరథ్యాయ నమః = రథమునకు రథభిన్నమునకును తగినవాడవగు నీకు నమస్కారము; రథమార్గ మందును రథభిన్నములైన అశ్వాది మార్గములందును ప్రవీణుడని భావము; చతుష్పథ రతాయ నమః =జల, అగ్ని, వాయు, ఆకాశ మార్గముల సంచరించుటలో మిక్కిలి ఆసక్తిగల నీకు నమస్కారము; కృష్ణాజినోత్తరీయాయ నమస్కారము=కృష్ణ మృగచర్మము ఉత్తరీయముగా ధరించిన నీకు నమస్కారము; వ్యాళ యజ్ఞోప వీతినే నమః =సర్పము యజ్ఞోపవీతము (జందెము)గా గల నీకు నమస్కారము; ఈశానాయ నమః =సర్వ ప్రాణులకు ఈశ్వరుడవైన నీకు నమస్కారము; వజ్ర సంహాయ నమః = వజ్ర శరీరముగలనీకు నమస్కారము; హరికేశాయ నమః = గోరోచన వర్ణముగల వెంట్రుకలుగల నీకు నమస్కారము; అవివేకైక నాథాయ నమః =అజ్ఞానులకు జ్ఞానాతీతులకును ముఖ్య ప్రభువైన నీకు నమస్కారము, వ్యక్తావ్యక్తాయనమః = కార్యరూపుడవును కారణ రూపుడవగు నీకు నమస్కారము; కామాయ నమః = కామరూపుడవగు నీకు నమస్కారము; కామదాయ నమః=కోరిన కోరికలను ఇచ్చు నీకు నమస్కారము; కామ ఘ్నాయ నమస్కారము = కాముని సంహరించిన నీకు నమస్కారము; ధృష్ఠాయ నమః = దిట్టతనముగల నీకు నమస్కారము; దృప్త నిషూదనాయ నమః =మదించిన వానిని సంహరించు నీకు నమస్కారము; సర్వాయ నమః = సర్వస్వరూపుడవైన నీకు నమస్కారము; సర్వదాయ నమః = అన్ని ఇచ్చు నీకు నమస్కారము; సంధ్యారాగాయ నమః = సంధ్యా కాలమువల్ల ఎఱ్ఱనైన నీకు నమస్కారము; మహాబలాయ నమః = మహాబలవంతుడవగు (మహా బలేశ్వరుడవగు) నీకు నమస్కారము; మహాబాహవే=గొప్ప బాహువులు గల నీకు నమస్కారము; మహాసత్త్వాయ నమః =మహాప్రాణి స్వరూపుడవగు నీకు నమస్కారము; మహా ద్యుతయే నమః = గొప్ప కాంతిగల నీకు నమస్కారము; మహామేఘవర ప్రేక్షాయ నమస్కారము గొప్ప మేఘశ్రేష్టునివలె నల్లనైన చూపులుగల నీకు నమస్కారము; మహా కాలాయ నమః = ఉజ్జయినీ మహాకాల స్వరూపునకు నీకు నమస్కారము; స్థూలాయ నమః =మిక్కిలి లావైన ఆకారముగల నీకు నమస్కారము; జీర్ణాంగాయ నమః=సన్నని అవయవములుగల నీకు నమస్కారము; జటినే నమః = జటలుగల నీకు నమస్కారము; వల్కలాజినధారిణే నమః =నారవస్త్రములు కృష్ణ మృగ చర్మములను ధరించిన నీకు నమస్కారము; దీప్త సూర్యాగ్ని జటినే = మండుచున్న సూర్య అగ్నుల వంటి జటలుగల నీకు నమస్కారము; వల్క లాజినవాససే నమః = నార చీరలు కృష్ణ మృగ చర్మములు వస్త్రములుగా గల నీకు నమస్కారము; సహస్ర సూర్య ప్రతిమాయ నమః=వేయి సూర్యులతో సమానమైన నీకు నమస్కారము; తపోనిత్యాయ నమః =నిత్యము తపముగల నీకు నమస్కారము; ఉన్మాదనాయ నమః = వ్యామోహక స్వరూపుడవగు నీకు నమస్కారము; శతావర్త గంగాతో యార్ర్ద జాయ నమః = నూరు పొరలికలచే ఆక్రమించబడి గంగా జలముచే తడిసిన సగము తలవెండ్రు కలుగల నీకునమస్కారము. తక్కిన సగభాగము అర్థనారీశ్వరుడు అయి నందున పార్వతీ శిరోజములలో గంగ ఉండదు. పార్వతి తనసవతి గంగను తనతలలో ధరింపదుగదా అని భావము, చంద్రా వర్తాయ నమః =చంద్రుని మాటి మాటికి తన శిరమున త్రిప్పు నీకు నమస్కారము; మేఘావర్తాయ నమః =మేఘములను కాల స్వరూపుడవై మాటి మాటికిని త్రిప్పు నీకు నమస్కారము; అన్నాయ నమః = అన్న స్వరూపుడవైన నీకు నమస్కారము; అన్న కర్ర్తేనమః =అన్నమును చేయు నీకు నమస్కారము; అన్నదాయ నమః = అన్నమును ఇచ్చు నీకు నమస్కారము; అన్నస్రష్టే నమః =అన్నమును సృష్టించు నీకు నమస్కారము; అన్నపక్ర్తే నమః =అన్నమును వండు నీకు నమస్కారము; పక్వభుక్తపచే నమః = వండి తినిన అన్నము జీర్ణము చేయు జఠరాగ్ని రూపునకు నీకు నమస్కారము; జరాయుజే నమః = మావితో పుట్టిన స్వరూపుడవగు నీకు నమస్కారము; అండజాయ నమః = అండమువల్ల పుట్టి ప్రాణి స్వరూపుడవగు నీకు నమస్కారము; స్వేదజాయ నమః = చెమటవలన పుట్టు ప్రాణి స్వరూపుడవగు నీకు నమస్కారము; ఉద్భిజ్జాయ నమస్కారము=భూమిని ఛేదించుకొని మొలకెత్తు ప్రాణి స్వరూపుడవగు నీకు నమస్కారము; దేవాయ నమః = సర్వదేవ స్వరూపుడవగు నీకు నమస్కారము; దేవేశాయ నమః =ఇంద్ర స్వరూపుడవగు నీకు నమస్కారము; చతుర్విధ భూతగ్రామాయ నమః = జరాయుజ అండజ స్వేదజ ఉద్భిజ్జ రూపములైన నాలుగు విధములైన ప్రాణుల యొక్క సమూహ స్వరూపునకు నీకు నమస్కారము; చరాచర బ్రహ్మణే నమః = చరాచర ప్రపంచ సృష్టికర్తయైన బ్రహ్మవగు నీకు నమస్కారము; ప్రతిహర్ర్తే నమః = ఆచరాచరమును ప్రతిహరించు నీకు నమస్కారము; విదుషాం బ్రహ్మణే నమః = విద్వాంసులకు, బ్రహ్మ స్వరూపుడవగు నీకు నమస్కారము; బ్రహ్మవిదాం వరాయ నమః =బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడవగు నీకు నమస్కారము; సత్త్వస్య పరమయోనయే నమః =బలమునకు సత్త్వ గుణమునకు మూలకారణ స్వరూపుడవగు నీకు నమస్కారము; అబ్నిధయే నమః = నీటికి నిధానమైన నీకు నమస్కారము; వాయు నిధయే నమః =వాయువునకు నిధివైన నీకు నమస్కారము; జ్యోతిర్నిధయే నమః = తేజస్సునకు నిధివైన నీకు నమస్కారము; రుగ్రూపాయ నమః =ఋక్కుల స్వరూపముగల నీకు నమస్కారము. సామరూపాయ నమః =సామముల (సామవేదమంత్రముల) స్వరూపముగల నీకు నమస్కారము; ఓంకార రూపాయ నమః =ఓంకార స్వరూపుడ వగు నీకు నమస్కారము; హవిర్హావినే నమః =హవిస్సే (హోమము చేయు నేయి మొదలగునవి) విలాసముగాగల నీకు నమస్కారము; హూవాం వాచాహుతయై నమస్కారము=హోమము చేయు పదార్థములకు వాగ్రూపమైన ఆహుతివైన నీకు నమస్కారము; హవిర్హనీయనియు, హవోహావా అనియు, హూవావాచాహుతి అనియు చేయు సామ గీతి స్వరూపునకు నీకు నమస్కారము; సురశ్రేష్ఠాయ నమః = దేవతా శ్రేష్ఠుడవగు నీకు నమస్కారము; బ్రహ్మ వాదిభిః సామభిర్గీయమానాయ నమస్కారము వేదనాదుల చేతను తత్త్వ బ్రహ్మవాదుల చేతను సామములచే గానము జేయబడుచున్న నీకు నమస్కారము; యజుర్మయాయ నమః = యజుర్వేదమంతయు నిండియున్న నీకు నమస్కారము; ఋఙ్మయాయ నమః = ఋగ్వేద మంతయు నిండిన నీకు నమస్కారము; సామమయాయ నమః = సామవేదమంతయు నిండియున్న నీకు నమస్కారము; అధర్వ మయాయ నమః = అధర్వవేద మంతయు నిండియున్న నీకు నమస్కారము; బ్రహ్మవిద్భిః, కల్పోని షదాంగణైః పఠ్యమానాయ నమస్కారము; బ్రహ్మవేత్తలచే కల్ప శాస్త్రము చేత ఉపనిషత్తుల సమూహము చేతను పఠింపబడుచున్న నీకు నమస్కారము.
బ్రాహ్మణాత్మనే నమః = బ్రాహ్మణ రూపుడవగు నీకు నమస్కారము; క్షత్రియాత్మనే నమః =క్షత్రియ స్వరూపుడవగు నీకు నమస్కారము; వైశ్యాత్మనే నమః =వైశ్య స్వరూపుడవగు నీకు నమస్కారము. శూద్రాత్మనే నమః =శూద్రాత్మ స్వరూపుడవగు నీకు నమస్కారము; వర్ణావరాత్మనే నమః =నాలుగు వర్ణములకన్న తక్కువైన వర్ణము సంకర (జాతి) కాత్మ స్వరూపుడవగు నీకు నమస్కారము; మేఘ సంఘాత్మనే నమః =సృష్టిని ఇచ్చు మేఘసంఘ స్వరూపుడవగు నీకు నమస్కారము; విశ్వస్మై నమః =విశ్వ స్వరూపుడవగు నీకు నమస్కారము; స్తనితాయ నమః =మేఘము యొక్క దివ్య శబ్ద స్వరూపుడవగు నీకు నమస్కారము, గర్జితాయ నమః = మేఘగర్జన స్వరూపుడవగు నీకు నమస్కారము; సంవత్సరాయ నమః = కాలావయవమైన సంవత్సర స్వరూపుడవగు నీకు నమస్కారము; ఋతాత్మనే నమః = షడృతు స్వరూపుడవగు నీకు నమస్కారము. మాసాయ నమః = మాస స్వరూపుడవగు నీకు నమస్కారము. మాసార్ధాయ నమః = పక్ష స్వరూపుడవగు నీకు నమస్కారము; కలాత్మనే నమః = ముప్పది కాష్టల కాలావయవ స్వరూపుడవగు నీకు నమస్కారము; కాష్ఠాత్మనే నమః = పదునెనిమిది కనురెప్ప పాటు కాలావయవ స్వరూపుడవగు నీకు నమస్కారము; నిమేషాత్మనే నమః = ఒక్క కనురెప్ప పాటు కాలావయ స్వరూపునకు నీకు నమస్కారము; నక్షత్రాత్మనే నమః = నాశములేక స్థిరమైన చుక్కల స్వరూపుడవగు నీకు నమస్కారము; యుగాత్మనే నమః = కృతాది యుగ స్వరూపుడవగు నీకు నమస్కారము; గ్రహాత్మనే నమః = సూర్యాది నవగ్రహ స్వరూపుడవగు నీకు నమస్కారము; వృషాణాం కకుదే నమః = వృషభ ప్రధానుడైన నందీశ్వర స్వరూపుడవైన నీకు నమస్కారము; గిరీణాం శిఖరాత్మనే నమః = హిమాలయ పర్వతములలో సమస్త శిఖర స్వరూపుడవగు నీకు నమస్కారము; మృగాణాం సింహాత్మనే నమః =మృగరాజసింహ స్వరూపుడవగు నీకు నమస్కారము; పతతాం తార్క్ష్యాయ నమః= పక్షిరాజ గరుడ స్వరూపుడవగు నీకు నమస్కారము; భోగినామనన్తాయ నమః =సర్పరాజాది శేష స్వరూపుడవగు నీకు నమస్కారము; ఉదధీనాం క్షిరోదాయ నమస్కారము సముద్ర శ్రేష్ఠ క్షీరసముద్ర స్వరూపుడవగు నీకు నమస్కారము. యంత్రాణాం ధనుషే నమః = యంత్రశ్రేష్ఠములలో ధనుః = స్వరూపుడవగు నీకు నమస్కారము; ప్రహరణానాం వజ్రాయ నమః = ఆయుధములలో వజ్ర యాయుధ స్వరూపుడవగు నీకు నమస్కారము, వ్రతానాంసత్యాయ నమః వ్రతములలో సత్యనారాయణ వ్రత స్వరూపుడవగు నీకు నమస్కారము; ద్వేషాయ నమః =ద్వేష స్వరూపుడవగు నీకు నమస్కారము; రాగాయ నమః = ప్రేమ స్వరూపుడవగు నీకు నమస్కారము; మోహాయ నమః = మోహ స్వరూపుడవగు నీకు నమస్కారము; క్షామాయ నమస్కారము=క్షమా స్వరూపుడవగు (సహనము) నీకు నమస్కారము; దమాయ నమః =అనుచిత విషయముల ప్రర్తించ కుండునట్లు ఇంద్రియాదుల అణచు రూపమైన దమముయొక్క రూపము నందిన నీకు నమస్కారము; శమాయ నమః = సర్వేంద్రియ శాంత స్వరూపుడవగు నీకు నమస్కారము; వ్యవసాయాయ నమః = పురుష ప్రయత్న స్వరూపుడవగు నీకు నమస్కారము; ధృతయే నమః = ఆత్మ స్థిరస్థితి కారణమైన ధైర్యము నీ స్వరూపము. అట్టి నీకు నమస్కారము; లోభాయ నమః = సద్గుణలోభ స్వరూపుడవగు నీకు నమస్కారము; కామాయ నమః =కామ స్వరూపుడవగు నీకు నమస్కారము; క్రోధాయ నమస్కారము = కోప స్వరూపుడవగు నీకు నమస్కారము, జయాయ నమః =సర్వజయ స్వరూపుడవగు నీకు నమస్కారము; అజయాయ నమః =గదాధరుడవగు నీకు నమస్కారము; శరిణే నమః =శరములు బూనిన నీకు నమస్కారము; చాపినే నమః =ధనుర్ధారివగు నీకు నమస్కారము; ఖట్వాంగినే నమః =మంచము ఆయుధముగా ధరించిన నీకు నమస్కారము; ఝర్ఘరిణే నమ: = కైముడి అను వాద్య విశేషమును చేతిలో ధరించిన నీకు నమస్కారము; ఛేత్త్రే నమః=ఛేదించు (కోయు) నీకు నమస్కారము, ఛేత్త్రే నమస్కారము=ఛేదించు (పగుల గొట్టు) నీకు నమస్కారము; నేత్రే నమ: = సర్వజయమును గూర్చుచు నీ సారూప్యమునకు గొనిపోవు నీకు నమస్కారము, అంతకాయ నమః = నీస్వాత్మ లయమునకై భక్తులయైహిక జీవనము అంతమొందించు నీకు నమస్కారము; దశలక్షణ సంయుక్త ధర్మాయ నమః = హింసించ కుండుట, సత్యము బలుకుట, దొంగిలించ కుండుట, బ్రహ్మచర్యము, ఇతరుల నుండి దానము ఏదియు స్వీకరింపకుండుట, అనే అయిదు యమములు, శౌచము, సంతోషము, తపము, స్వాధ్యాయము (వేదాదులను చదువుట), ఈశ్వర ప్రణిధానము (ఈశ్వర ధ్యానము) అను నీ అయిదు నియమములు ఈ యోగోక్తములైన ఈ పది లక్షణములతో గూడియున్న ధర్మ స్వరూపుడవగు నీకు నమస్కారము. లేదా మనువు జెప్పిన క్షమా సత్యాదులతో గూడిన వాడవైన నీకు నమస్కారము; దశల లక్షణ సంయుక్తార్థాయ నమః = పై జెప్పిన పది లక్షణములు గల యర్థ(ధన) స్వరూపుడవగు నీకు నమస్కారము; దశలలక్షణ సంయుక్త కామాయ నమస్కారము = పై విధముగ పది లక్షణములుగల కామ స్వరూపుడ వగు నీకు నమస్కారము; ఇంద్రాయ నమస్కారము=ఇంద్ర స్వరూపుడవగు నీకు నమస్కారము; సముద్రాత్మనే నమః = సముద్ర స్వరూపుడవగు నీకు నమస్కారము; సరిదాత్మనే నమః=నదీ స్వరూపుడవగు నీకు నమస్కారము, పల్వలాత్మనే నమః = నదీ స్వరూపుడవగు నీకు నమస్కారము; సరోరూపిణే నమః = సరస్సుల రూపమునందిన నీకు నమస్కారము; లతాత్మనే నమః = స్తంభాదులను పట్టుకొను తీగరూపమున ఉన్న నీకు నమస్కారము; వల్ల్యాత్మనే నమః =చుట్టుకొను తీగ రూపమున ఉన్న నీకు నమస్కారము; తృణాయ నమః =పశువులు మొదలగునవి తినదగిన గడ్డి రూపమున ఉన్న నీకు నమస్కారము; ఓషధ్యాయ నమః =ఫలపాకాంత జీవనముగల అరటి వరి గోధుమ జొన్న మొదలగు నోషధీ వృక్ష స్వరూపుడవగు నీకు నమస్కారము; పశ్యాత్మనే నమః = పశు స్వరూపుడవగు నీకు నమస్కారము; మృగాత్మనే నమః = మృగ స్వరూపుడవగు నీకు నమస్కారము; పక్షిణే నమః =పక్షి స్వరూపుడవగు నీకు నమస్కారము; ద్రవ్యకర్మ గుణారంభాయ నమః =పృథివ్యాదుల యొక్కయు, ఎత్తులదించుట, ముడుచుట, చూచుట, నడచుట మొదలగు కర్మల యొక్కయు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాది గుణముల యొక్కయు ప్రారంభకుడవైన నీకు నమస్కారము; కాలాయ నమః = కాల స్వరూపునకు నీకు నమస్కారము; పుష్ప ఫల ప్రదాయ నమః =సుగంధములై అత్యంత సమీప భవిష్యత్తు కలుగబోవు ఫలమును సూచించుచు పుష్పములను, తరువాత ఫలములను ఇచ్చు నీకు నమస్కారము; ఆదయే నమః =జగదాది స్వరూపునకు నీకు నమస్కారము; అంతాయ నమస్కారము= మహాప్రళయ రూపమున జగదంత స్వరూపునకు నీకు నమస్కారము; మధ్యాయ నమః = ప్రవృద్ధమైన జగన్మధ్య స్వరూపునకు నీకు నమస్కారము; గాయత్ర్యోం కారాయనమః = గాయత్రి మంత్రాత్మకుడ వైన ఓంకార స్వరూపుడవైన నీకు నమస్కారము. గాయత్రీ మంత్రమున భర్గ శబ్దము శివునే జెప్పును గదా!; హరితాయ నమః = ఆకుపచ్చని వర్ణముగల నీకు నమస్కారము; కృష్ణాయ నమః =కృష్ణ వర్ణుడవగు నీకు నమస్కారము; నీలాయ నమస్కారము=నీలవర్ణునకు నీకు నమస్కారము; పీతాయ నమః =పసుపు వర్ణముగల నీకు నమస్కారము; అరుణాయ నమః = కొద్ది ఎఱుపు వర్ణముగల నీకు నమస్కారము; కద్రవే నమః =గోరోచనము వంటి వర్ణముగల నీకు నమస్కారము; కపిలాయ నమః= కపిల వర్ణముగల నీకు నమస్కారము; కపోతాయ నమః = బూడిద వర్ణముగల నీకు నమస్కారము; మేచకాయ నమః = నెమలిపురి వర్ణముగల నీకు నమస్కారము; సువర్ణ రేతసే నమః = సువర్ణము రేతస్సుగాగల నీకు నమస్కారము; విఖ్యాతాయ నమః = జగత్ప్రసిద్ధుడవైన నీకు నమస్కారము; సుపర్ణాయనమః = గరుడ స్వరూపునకు నీకు నమస్కారము.
సువర్ణ నామ్నే నమః = సువర్ణము (తేజము) నామము (పేరు) గా గల నీకు నమస్కారము; సువర్ణ ప్రియాయ నమః =సువర్ణము తేజము ప్రియమైన వాడవగు నీకు నమస్కారము; ఇంద్రాయ నమ: =ఇంద్ర స్వరూపుడవగు నీకు నమస్కారము; యమాయ నమః = యమ స్వరూపుడవగు నీకు నమస్కారము, వరుణాయ నమః = వరుణ స్వరూపుడవగు నీకు నమస్కారము; ధనదాయ నమః = కుబేర స్వరూపుడవగు నీకు నమస్కారము. (ఇంద్రాదులు తూర్పు మొదలుకొని ఉత్తరము వరకు ఉన్న నాలుగు దిక్కులకు అధిపతులు. వారి స్వరూపమున ఉన్నవాడు ఈశ్వరుడే అని భావము); అనలాయ నమః =అగ్ని స్వరూపుడవగు నీకు నమస్కారము; ఉత్ఫుల్లాయ నమః =వికసించిన (పుష్ప) స్వరూపముగల నీకునమస్కారము; చిత్రభావనే నమః =జ్ఞాన ప్రకాశములైన అనేక విధములగు కిరణములుగల సూర్యుని స్వరూపమున నున్న నీకు నమస్కారము; స్వర్భానవే నమః = స్వర్లోకమున భాసించు రాహు స్వరూపునకు నీకు నమస్కారము; హోత్రాయ నమః =హవిస్సు మొదలగునవి హోమము చేయబడు యజ్ఞాగ్ని హోత్ర స్వరూపుడవగు నీకు నమస్కారము; హోత్రే నమః = హోమము జేయు యజమాని స్వరూపుడవగు నీకు నమస్కారము; హోమాయ నమః =హోమ స్వరూపుడవగు నీకు నమస్కారము; హుతాయ నమః = హోమము చేయబడిన ద్రవ్య స్వరూపుడవగు నీకు నమస్కారము; ప్రహుతాయ నమః =విశిష్టముగా హోమము చేయబడిన ద్రవ్య (సోమ) స్వరూపుడవగు నీకు నమస్కారము; ప్రభవే నమః =యజ్ఞ ఫలములను ఇచ్చు ప్రభు స్వరూపునకు నీకు నమస్కారము; సుపర్ణాయ నమః =మంచి రెక్కలుగల గరుడస్వరూపుడవు మంచి యాకులుగల వృక్ష స్వరూపుడవుగాని యైన నీకు నమస్కారము; బ్రహ్మణే నమః పరబ్రహ్మ స్వరూపుడవు, వేద స్వరూపుడవు అయిన నీకు నమస్కారము; యజుషాం శతరుద్రియాయ నమః = యజుర్వేద యజుస్సులకు సంబంధించిన శత రుద్ర(నమక)ము నందున్న నామ సమూహములుగల నీకు నమస్కారము; పవిత్రాణాం పవిత్రాయ నమః = పవిత్రులైన వారికెల్ల పవిత్రుడవైన నీకు నమస్కారము; మంగళానాం మంగళాయ నమః =సర్వ మంగళములకు మంగళ స్వరూపుడవగు నీకు నమస్కారము; గిరయే నమః =పర్వత స్వరూపునకు నీకు నమస్కారము; స్తోకాయ నమః =పర్వత సమూహ స్వరూపునకు నీకు నమస్కారము; వృక్షాయ నమః = వృక్ష స్వరూపుడవైన నీకు నమస్కారము; జీవాయ నమః =ఎల్లప్పుడు జీవించు జీవ స్వరూపునకు నీకు స్వరూపునకు నీకు నమస్కారము; పుర్గలాయ నమః = పరమాణు స్వరూపునకు దేహస్వరూపునకు నీకునమస్కారము; సత్త్వాయ నమః = భూత భవిష్యద్వర్తమాన కాలత్రయముచే బాధింప అలవిగా నట్టియు, వికారహేతువు ఉన్నను వికారము జెందనట్టియు నీకు నమస్కారము; రజసే నమస్కారము = ప్రేరకమైన సక్రియమై దుఃఖహేతువైన రజోగుణ స్వరూపుడవగు నీకు నమస్కారము; (ధూళి స్వరూపుడ వైన నీకు నమస్కారము); తమసే నమః = భారముగలదైన సత్యమును ఆవరించునదై మోహింపజేయు గుణమైన తమోగుణ స్వరూపునకు, చీకటి రూపునకు, నీకు నమస్కారము; ప్రజననాయ నమః = సంతానమును కలుగజేయు నీకు నమస్కారము, ప్రాణాయ నమః = ప్రాణి హృదయమున నడుచు ప్రాణవాయు స్వరూపునకు నీకు నమస్కారము; అపానాయ నమః = గుదస్థానమందుండి అశుద్ధమును వెడలజేయు అపాన వాయు స్వరూపునకు నీకు నమస్కారము. సమానాయ నమః = కంఠమున నుండి వాగాదులను వెలువరింపజేయు నీకు నమస్కారము, వ్యానాయ నమః = సమస్త శరీరమున ఉండి శరీరమునంతయు సచేతనముగ చేయు నీకు నమస్కారము; ఉన్మేషాయనమః = నేత్రములను విప్పారచేయు కూర్మవాయు స్వరూపుడవగు నీకు నమస్కారము; నిమేషాయనమః = కన్నులు మూయజేయ వాయు స్వరూపుడవగు నీకు నమస్కారము; జృంభితాయ నమః = ఆవులింత కలుగజేయు దేవదత్తవాయు స్వరూపునకు నీకు నమస్కారము; క్షుతాయ నమః = తుమ్మును కలుగజేయు క్రుకర వాయు రూపునకు నీకు నమస్కారము; లోహితాంగాయ నమః =ఎఱ్ఱని శరీరము కల నీకు నమస్కారము; గినే నమః = గదాధరునకు నీకు నమస్కారము; దంష్ట్రిణే నమః =కోరలు గలిగిన నీకు నమస్కారము; మహావక్ర్తాయ నమః =విశాలమైన గొప్పనోరు గలిగిన నీకు నమస్కారము; మహోదరాయ నమస్కారము=గొప్పకడుపు గలిగిన నీకు నమస్కారము; శుచిరోమ్ణే నమః = పవిత్రమైన వెంట్రుకలుగల నీకు నమస్కారము; హరిచ్ఛశ్రవే నమః =పచ్చని మీసములు గలిగిన నీకు నమస్కారము; ఊర్థ్వకేశాయ నమః =పైకి ఆకాశమునకు ఎగసిన తల వెంట్రుకలుకల నీకు నమస్కారము; త్రిలోచనాయ నమః =మూడు కన్నులు గలిగిన నీకు నమస్కారము, గ్రీతావాదిత్ర నృత్యాంగాయ నమః =గీతము, వాద్యము, నృత్యము వీనికి దగిన దేహముగల నీకు నమస్కారము; గీత వాదనక ప్రియాయ నమః = గీతములు, వాద్యములు ఇష్టమైన నీకు నమస్కారము; మత్స్యాయ నమః = మత్స్యమువంటి జీవ స్వరూపుడ వైన నీకు నమస్కారము. జలినే నమః = జలమువంటి సంసారము కలిగిన నీకు నమస్కారము; జలాయ నమః =జలమువంటి సంసారస్వరూపునకు నీకు నమస్కారము; జల్యాయ నమః =జలాభిషేక యోగ్య (లింగ) స్వరూపునకు నీకు నమస్కారము; జవాయ నమః = వేగ స్వరూపునకు నీకు నమస్కారము; కాలాయ నమః = కాల స్వరూపునకు నీకు నమస్కారము; కలినే నమః =ధరణ రూపమైన ధర్మమును ధరించిన నీకు నమస్కారము (కలనం=ధరణం); కలాయ నమః =ధర్మ స్వరూపునకు నీకు నమస్కారము; వికారాయ నమః = విగతమైన కాల స్వరూపునకు నీకు నమస్కారము, సుకాలాయ నమః = మంచి కాలము యొక్క రూపమున ఉన్న నీకు నమస్కారము; దుష్కాలాయ నమః = చెడు కాలముయొక్క స్వరూపమున ఉన్న నీకునమస్కారము; క(కా)లనాశనాయ నమః =బంధ హేతువైన ధర్మమును, కాలమును నశింపజేయు నీకు నమస్కారము; మృత్యువే నమః =జీవులకు మృత్యు స్వరూపుడవైన నీకు నమస్కారము; క్షయాయ నమః =విశ్వక్షయ స్వరూపునకు నీకు నమస్కారము; అంతాయ నమః = విశ్వాంత స్వరూపునకు నీకు నమస్కారము; క్షమాకరాయ నమః = భక్తులను క్షమించు నీకు నమస్కారము; అపాయకరాయ నమః = అపాయమును కలుగజేయు నీకు నమస్కారము; హరాయ నమః =భక్తుల పాపముల హరించు నీకు నమస్కారము; సంవర్తకాయ నమః = ప్రళయకారక స్వరూపునకు నీకు నమస్కారము; అన్తకాయ నమః = సర్వమును అంతమొనరించు నీకు నమస్కారము; సంవర్తక బలాహకాయ నమః = ప్రళయకాల మేఘ స్వరూపునకు నీకు నమస్కారము; నమస్కారములు; అన్తకాయ నమః = సర్వమును అంతమొనరించు నీకు నమస్కారము, సంవర్తక బలాహకాయ నమః ప్రళయకాల మేఘ స్వరూపుడవైన నీకు నమస్కారము; ఘటాయ నమః = ఇష్టరూపమున భక్తులకు ఘటించు నీకు నమస్కారము; ఘటి కాయ నమః = జనులకు కర్మఫలములను ఘటింపజేయు నీకు నమస్కారము; ఘంటీ కాయ నమః = వాద్యఘంటను కలిగియున్న నీకు నమస్కారము; చూడాలోలాయ నమః = జటాజూటముతో ప్రకాశించు నీకు నమస్కారము, బలాయ నమః = సర్వబల సంపన్ను డవైన నీకు నమస్కారము; అబలాయ నమః = బలాతీతుడవగు నీకు నమస్కారము; బ్రహ్మకాలాయ నమః =బ్రహ్మయొక్క కాలముగల నీకు నమస్కారము; అగ్ని వక్ర్తాయ నమః = యజ్ఞ స్వరూపుడవై అగ్నియే ముఖముగాగల నీకు నమస్కారము; దండినే నమః = దండధారి పార్వతీ తపః పరీక్షలో కపటవటు దండధారివైన నీకు నమస్కారము; ముండినే నమస్కారము = పరమ హంస స్వరూపుడవైన నీకు నమస్కారము. దండధృ గ్రూపాయ నమః = అపరాధ శిక్షారూప దండధారివగు నీకు నమస్కారము. చతుర్యుగాయ నమః = కృతాది చతుర్యుగ స్వరూపునకు నీకు నమస్కారము. చతుర్వేదాయ నమః = ఋగ్వేదాది చతుర్వేద స్వరూపునకు నీకు నమస్కారము. చతుర్హోత్రాయ నమః = నలుగురు హోతలుకలిపి తీసుకొన్న హవిస్ స్వరూపుడవైన నీకునమస్కారము. చతుష్పథాయ నమః =చతుష్పథ బ్రాహ్మణ వేద స్వరూపునకు నీకు నమస్కారము.
చతురాశ్రమ వేత్ర్తే నమః =బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ (భిక్షు) సన్యాసము లను నాలుగు ఆశ్రమములు తత్త్వమును తెలిసిన నీకు నమస్కారము; చాతుర్వర్ణ్య కరాయ నమః =బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను నాలుగు వర్ణములను లోక కల్యాణమునకై ఏర్పరచిన నీకు నమస్కారము; క్షరాక్షర ప్రియాయ నమః = నశించుదాని యందు ఇది ఎట్లైనను నశించునదనియు, వాస్తవికతను చూపకయు, ఇది నశింపనిదని దీనిని చూడనవసరం లేదని వాస్తవికతను చూపక క్షరము నందు ఉద్భవించు బుద్ధితోను అక్షరము నందు క్షరాపత్తి లేకుండునట్లు చూచుటతోను అవి తనకు ప్రియములైనట్లుచూచు నీకు నమస్కారము. ధూర్తాయ నమః = క్రూరులను వంచించు నీకు నమస్కారము. అగణాయ నమః =గణాతీతుడవైన నీకు నమస్కారము. అగణ్యాయ నమః =లెక్కకు మించిన వాడవైన నీకు నమస్కారము; గణాధి పాయనమః =ప్రమథ గణములకు అధిపతియైన నీకు నమస్కారము; రుద్రాక్ష మాల్యాంబర ధరాయ నమః =రుద్రాక్షల యొక్క మాలలను, రుద్రాక్ష యొక్క వస్త్రమును (కవచమును) ధరించిన నీకు నమస్కారము; గిరికాయ నమః = కాషాయ వర్ణము కలిగిన నీకు నమస్కారము; గిరిక ప్రియాయ నమః =కాషాయ వస్త్రములు ప్రియమైన వాడవైన నీకు నమస్కారము; శిల్పీశాయ నమః =చిత్రముల వ్రాయుట చెక్కుట మొదలగు శిల్పకళగల శిల్పులకు అధిపతియైన నీకు నమస్కారము; శిల్పినాం శ్రేష్ఠాయ నమః =విశ్వము అను శిల్పమును సృష్టించు బ్రహ్మాదులలో శ్రేష్ఠుడవైన నీకు నమస్కారము; సర్వ శిల్ప ప్రవర్తకాయ నమః =అన్ని శిల్పకళలను ప్రవర్తింపజేయు (నడపు) నీకు నమస్కారము; భగనేత్రాంతకాయ నమః =దక్షాధ్వర ధ్వంసమున సూర్యుని నేత్రములను పెరికివేసిన నీకు నమస్కారము. చంద్రాయ నమః =షోడశ కళాత్మక చంద్రుని ధరించి చంద్రాత్ముడవైన నీకు నమస్కారము; పూర్ణోదన వినాశనాయ నమః =దక్షాధ్వరద్గంసము వలన సూర్యుని దంతములను పెరికి వేసిన నీకు నమస్కారము. గూఢావర్తాయ నమః =రహస్యమైన పరిభ్రమణముగల నీకు నమస్కారము; గూఢాయ నమః =అభేద్యమై రహస్య స్వరూపునకు నీకు నమస్కారము; గూఢప్రతి నిషేవిత్రే నమః =గూఢముగా వాంఛిత ఫలదానముతో భక్తులను సేవించు నీకు నమస్కారము; తరణాయ నమః =సంసారమును తరింప చేయు నావవైన నీకు నమస్కారము; తారకాయ నమః =ప్రణవ స్వరూపుడవైన నీకు నమస్కారము; సర్వ భూతసుతా రణానాయ నమః =సర్వ ప్రాణులను సంసారము నుండి సులభముగా తరింపచేయు నీకు నమస్కారము; ధాత్రే నమః = ఆదికర్త యైన విష్ణువగు నీకు నమస్కారము; విధాత్రే నమః =భౌతిక స్రష్టయైన చతుర్ముఖ స్వరూపునకు నీకు నమస్కారము; సత్త్వానాం విధాత్రే నమః = ప్రాణులను చక్కగా పాడుచు ఉండజేయు నీకు నమస్కారము; ధారణాయ నమః =సర్వాధిష్ఠాన భూత కారణాత్మ రూపునకు నీకు నమస్కారము; అధరాయ నమః =నిన్ను ధరించువాడు లేనట్టి నీకు నమస్కారము; సర్వబాధావధి భూత శుద్ధాత్ముడైన నీకు నమస్కారము; తపసే నమః = బ్రహ్మ విద్యాసాధనమైన తపోరూపునకు నమస్కారము; బ్రహ్మణే నమః =వేద స్వరూపునకు బ్రహ్మ స్వరూపునకు నమస్కారము; సత్యాయ నమః =బ్రహ్మ విద్యాసాధనమైన సత్యరూపునకు నీకు నమస్కారము; బ్రహ్మచర్యాయ నమః =బ్రహ్మ విద్యాసాధనమైన బ్రహ్మచర్య రూపునకు నమస్కారము; ఆర్జవాయ నమః =బ్రహ్మ విద్యాసాధనమైన ఋజుభావ (వంకర ప్రవర్తన లేక చక్కని ప్రవర్తన) ము గల నీకు నమస్కారము; భూతాత్మనే నమః =జరాయుజ అండజ ఉద్బిజ్జములైన సర్వప్రాణులకు ఆత్మయైన నీకు నమస్కారము; భూతకృతే నమస్కారము =ఆకాశ, వాయు, అగ్ని, జల, పృథివీ అను పంచ భూతముల పుట్టించు నీకు నమస్కారము; భూతాయ నమః = నిత్య సిద్ధ స్వరూపుడవగు నీకు నమస్కారము; భూతభవ్యభవోద్భవాయ నమః = భూత వర్తమాన భవిష్యత్ కాలములకు ఉత్పత్తి స్థానమైన ఆ శబల బ్రహ్మకుగూడ ఉత్పత్తి స్థానమైన నీకు నమస్కారము; భూలోకాయ నమః = భూలోక స్వరూపుడవైన నీకు నమస్కారము; భువర్లోకాయ నమః = భువర్లోక స్వరూపునకు నీకు నమస్కారము; స్వర్లోకాయ నమః =స్వర్లోక స్వరూపునకు నీకు నమస్కారము. ఇతాయ నమః = సర్వగత స్వరూపునకు నీకు నమస్కారము. ఉత్పత్తయే నమః = సర్వమునకు ఉత్పత్తి స్వరూపుడవైన నీకు నమస్కారము; మహేశ్వరాయ నమః = ఇతరులైన బ్రహ్మాదులకంటెను గొప్పవాడవైన నీకు నమస్కారము; ఈశానాయ నమః = సర్వ భూతములకు సర్వాధిపతివైన నీకు నమస్కారము; వీక్షణాయ నమః = సర్వ దేవతల కంటే విశిష్టమైన చూపుగల నీకు సాక్షివైన, నీకు నమస్కారము, శాన్తాయ నమః =శాన్త స్వరూపుడవైన నీకు నమస్కారము; దుర్దాన్తాయ నమః =దుష్టులను దమింపజేయు (అణుచు) నీకు నమస్కారము; అదాన్త నాశనాయ నమః = ఇంద్రియములకు వశవర్తుడై వానిని నశింప చేయు నీకు నమస్కారము; బ్రహ్మా వర్తాయ నమః = నవబ్రహ్మలు నా వర్తింప (త్రిప్ప)చేయు కాల స్వరూపునకు నీకు నమస్కారము; సురావర్తాయ నమః =దేవతలను (పుణ్యము క్షీణింపగా) మర్త్య లోకమునకు చేర్చి భూ స్వర్గములకు త్రిప్పు కాడవగు యజ్ఞ పుణ్యఫలమగుటచే నీకు నమస్కారము; కామావర్తాయ నమః =సంసారమునందు బంధించి కోరికలలో మానవులను త్రిప్పు నీకు నమస్కారము; కామబింబనిహర్ర్తే నమః = కాముని యొక్క ఆకరమును దహింపచేసిన నీకు నమస్కారము; కర్ణికార రజః ప్రియాయ నమః = కొండగోగు పుప్పొడి ప్రియమైన నీకు నమస్కారము; ముఖ చంద్రాయ నమః = చంద్రాభిన్న ముఖ స్వరూపునకు నీకు నమస్కారము; భీమ ముఖాయ నమః= భయంకరమైన ముఖముగల నీకు నమస్కారము; సుముఖాయ నమః = చక్కని మంగళకరమైన ముఖముగల నీకు నమస్కారము; దుష్టులకు దుష్టమైన ముఖములుగల నీకు నమస్కారము; అముఖాయ నమః = ముఖములకు అతీతుడవైన (హృదయ సన్ని హితుడవైన) నీకు నమస్కారము; చతుర్ముఖాయ నమః = నాలుగు ముఖములు గల బ్రహ్మ స్వరూపునకు నమస్కారము; బహుముఖాయ నమః = ప్రాణులతో ఏకమై ఉన్నందున అనేక ముఖములుగల నీకు నమస్కారము; రణేసదా అభిముఖాయ నమః = యుద్ధమున ఎల్లప్పుడు శత్రువులకు ఎదురు ముఖము గలవాడై ఉండు నీకు నమస్కారము; హిరణ్యగర్భాయ నమః= తేజస్సు గర్భమున గల బ్రహ్మ స్వరూపుడవగు నీకు నమస్కారము; శకునయే నమః=పక్షివలె భూసంగము లేక ఆకాశమున విహరించు నీకు నమస్కారము; మహోదధయే నమః = మహాసముద్ర స్వరూపుడవగు నీకు నమస్కారము; పరాయ నమః =అందరికన్న మించిన నీకు నమస్కారము; విరాజే నమః =విరాట్ స్వరూపునకు నమస్కారము; (సమిష్ఠి స్థూల సూక్ష్మ కారణ శరీరోపహిత చైతన్య స్వరూపునకు నమస్కారము); అధర్మహన్ర్తే నమః = అధర్మమును నశింపచేయు నీకు నమస్కారము; మహాదండాయ నమః = గొప్ప దండముగల నీకు నమస్కారము; దండ ధరాయ నమః =శిక్షాదండమును ధరించు నీకు నమస్కారము; రణప్రియాయ నమః = రణము ప్రియమైన నీకు నమస్కారము; గోతమాయ నమః =ఉత్తమ గో స్వరూపునకు నమస్కారము (గో=ఆవు) ఇంద్రియము, వాక్కు కావున గోశ్రేష్ఠ స్వరూపునకు నమస్కారమని భావము.
ఉత్తమ వాక్ స్వరూపునకు నమస్కారము; గోప్రతారాయ నమః=గోవులను విష జలమునుండియు, శిలావృష్ఠి నుండియు గోవర్ధన పర్వతమును ఎత్తుటచే వానిని అపద నుండి తరింపజేసిన శ్రీకృష్ణ స్వరూపుడవైన నీకు నమస్కారము; గోవృషేశ్వర వాహనాయ నమస్కారము=గో వృషములకు ఈశ్వరుడవైన నందీశ్వ రుడు వాహనముగా గలిగిననీకు నమస్కారము; ధర్మకృతే నమః =ధర్మకర్త యైన నీకు నమస్కారము; ధర్మస్రష్టే నమః= ధర్మమును సృష్టించి (నిర్మించిన) నీకు నమస్కారము; ధర్మాయ నమః=ధర్మ స్వరూపుడవగు నీకు నమస్కారము; ధర్మవిదే నమః=సత్యమైన ధర్మము తెలిసిన నీకు నమస్కారము; ఉత్తమాయ నమః = అత్యంత మహోన్నత స్వరూపునకు నీకు నమస్కారము.
త్రైలోక్య గోప్ర్తే నమః=ముల్లోకములను రక్షించు నీకు నమస్కారము; గోవిందాయ నమః =భూమిని గోవులను సువాక్కులను ఇంద్రియములను రక్షించు నీకు నమస్కారము; మానదాయ నమః=దుష్టుల దురభిమానమును ఖండించు నీకు నమస్కారము; మానాయ నమః పూజింపదగిన చిత్త సమున్నతి స్వరూపునకు నీకు నమస్కారము; తిష్ఠతే నమః= యోగాసనమున కూర్చుండు నీకు నమస్కారము; స్థిరాయ నమః=కావుననే చలనము లేకుండు నీకు నమస్కారము; స్థాణవే నమః=త్రైలోక్యధారణ స్తంభమైన నీకు నమస్కారము; నిష్కంపాయ నమః= ఏమాత్రము కదలికలులేని నీకు నమస్కారము; కంపాయ నమః=కాలానుగుణమైన భూకంపాది స్వరూపునకు నీకు నమస్కారము; దుర్వారణాయ నమః= మృత్యు రూపమువచ్చి దుఃఖముతో అతికష్టముతో కూడ వారింపఅలవి గాని నీకు నమస్కారము; దుర్విషదాయ నమః=అమృత స్వరూపుడవై దుష్టవిషమునైనను హరించు నీకు నమస్కారము; దుఃసహాయ నమః=యుద్ధమున ఎదిరించి సహింప అలవిగాని నీకు నమస్కారము; దురతిక్రమాయ నమః= యుద్ధమున అతి కష్టమున నైనను శత్రువు మించి పోవుటకు అలవి కాని నీకు నమస్కారము; దుర్ధరాయ నమః=యుద్ధమున శత్రువులచే అతికష్టమున గూడ ధరింప అలవి గాని నీకు నమస్కారము;
దుష్టకంపాయ నమః=అతి కష్టమున గూడ శత్రువుచే భయపెట్ట నలవిగాని నీకు నమస్కారము; దుర్విదాయ నమః =దుష్ట ప్రక్రియలతోగూడ జయింప నలవి గాని నీకు నమస్కారము; జయాయ నమః=రణమున కేవల జయస్వరూపివగు నీకు నమస్కారము; శశాయ నమః=శీఘ్ర గమనముగల కుందేలువగు నీకు నమస్కారము; శశాంకాయ నమః=శీఘ్ర గమనముగా గల చంద్ర స్వరూపుడవగు నీకు నమస్కారము; శమనాయ నమః=యమధర్మరాజ స్వరూపుడవగు నీకు నమస్కారము; శీతోష్ణాయ నమః=శీత స్వరూపుడవై, దుష్టులకు ఉష్ణమైన అగ్ని స్వరూపుడవై, ఉభయ స్వరూపుడ వైన నీకు నమస్కారము; దుర్జరసే నమః = దుష్టులకు దుష్టమై తొందరలో మరణదాయియైన ముసలి తనపు స్వరూపముగల నీకు నమస్కారము; తృషే నమః=సంసారబద్ధులకు దప్పిక మరియు ఇచ్ఛా స్వరూపము దాల్చిన నీకు నమస్కారము, అధయే నమః=మానసీ వ్యధారూపునకు నీకు నమస్కారము; వ్యాధయే నమః=పాపులకు వ్యాధి స్వరూపుడవైన నీకు నమస్కారము; వ్యాధి హర్తే నమః= భక్తులైన సజ్జనుల వ్యాధులను నశింపజేయు నీకు నమస్కారము; వ్యాధిగాయ నమః =వ్యాధిని హెచ్చించుటకును తగ్గించుటకును వ్యాధిలో అంతర్గతుడుగా ఉన్న నీకునమస్కారము; సహ్యాయ నమః=ఆరోగ్య సుఖ స్వరూపు డవగు నీకునమస్కారము; యజ్ఞాయ నమః=యజ్ఞ స్వరూపుడవగు నీకు నమస్కారము, మృగవ్యాధినే నమః=యజ్ఞ మృగమునకు వ్యాధునివలె సంహరించు వాడవగు నీకు నమస్కారము; వ్యాధనామాకరాయ నమః=వ్యాధులకు నిధలై దుష్టుల బాధించు నీకు నమస్కారము; అకారాయ నమః=సద్భక్తులకు వ్యాధులను కలుగజేయని నీకు నమ స్కారము; శిఖండినే నమః=వ్యాధరూపమున నెమలి ఈకను ధరించిన నీకు నమ స్కారము; పుండరీకాక్షాయ నమః = కమలముల వంటి నేత్రములు గలిగి విష్ణు స్వరూపుడ “వైన నీకు నమస్కారము; పుండరీక అవలోకనాయ నమః=తెల్లని కమలముల వంటి నేత్రములుగల నీకు, లేక బెబ్బులి చూపులునుగల నీకు నమస్కారము, దండధరాయ నమః=యమ స్వరూపునకు నీకు నమస్కారము; సదండాయ నమః=కపటవటువై పలాశదండమును ధరించిన నీకు నమస్కారము. శ్మశానవాసియై కాల దండమును ధరించిన నీకు నమస్కారము; దండముండ విభూషితాయ నమః=చేతిలో కాలదండము చేతను, గోరిగిన తలచేతను లేక, కంఠమున తల పుఱ్ఱెల మాలచేతను అలంకరింపబడిన నీకు నమస్కారము; విషపాయ నమః= కాలకూట విషమును (సముద్ర మథనమున పుట్టిన దానిని) పానము చేసిన నీకు నమస్కారము; అమృతపాయ నమః=కాలకూట విషపానము జేసి దేవతలకై యమృతమును రక్షించిన నీకు నమస్కారము; సురాపాయ నమః=తాత్త్వికానంద రసమును త్రాగు నీకు, రక్షించు నీకు నమస్కారము; క్షీర సమపాయ నమస్కారము=క్షీరము వంటి సోమరసమును త్రాగు నీకు నమస్కారము; మధుపాయ నమః=తేనెను పానముజేయు నీకు నమస్కారము, అజ్యపాయ నమః=హోమ ద్రవ్యమైన నేతిని త్రావు నీకు నమస్కారము; సర్వపాయ నమస్కారము=ప్రళయ కాలమున సర్వము పానముచేయు నీకు నమస్కారము; మహా బలాయ నమస్కారము=మహాబలేశ్వర స్వరూపునకు నీకు నమస్కారము; వృషాశ్వవాహ్యాయ నమస్కారము = వేగమున అశ్వము వంటి వృషభముచే (ఆబోతుచే నందించే) మోయదగిన నీకు నమస్కారము; వృషభాయ నమః=నందీశ్వర స్వరూపునకు నీకు నమస్కారము. వృషభ లోచనాయనమః=కామముల వర్షించు కన్నులుగల నీకు వృషభము యొక్క కన్నులవలె విశాలములైన కన్నులుగల నీకు నమస్కారము. వృషభాయ నమః=వర్షించునట్టి మేఘ స్వరూపునకు నీకు నమస్కారము; లోకానాం విఖ్యాతాయ నమః=లోకములకు విశిష్టముగా ప్రసిద్ధి చెందిన నీకు నమస్కారము; లోకసత్కృతాయ నమః=లోకములచే సత్కరింపబడిన నీకు నమ స్కారము; చంద్రాదిత్య చక్షుష్కాయ నమః=చంద్ర సూర్యులు నేత్రములుగా గల నీకు నమస్కారము; పితామహ హృత్కాయ నమః=బ్రహ్మయే హృదయముగా గల నీకు నమస్కారము; అగ్నయే నమః=అగ్ని స్వరూపునకు నీకు నమస్కారము; అపాం స్వరూ పాయ న నమః=జల స్వరూపునకు నీకు నమస్కారము; దేవాయ నమస్కారము=దివ్య లీలల నోలలాడు నీకు నమస్కారము; ధర్మకర్మ ప్రసాది తాయ నమః=ధర్మ కర్మలచే అలంకరింపబడిన నీకునమస్కారము, బ్రాహ్మణో ఽ ప్య వేద్య మహిమ్నే నమః=బ్రహ్మకు గూడ దెలియ అలవిగాని మహిమగల నీకు నమస్కారము; గోవిందస్యాప్య వేద్యమహిమ్నే నమః=ఉపనిష ద్వాక్కులచే తెలియబడు గోవిందునకు గూడ తెలియుటకు అలవిగాని మహిమగల నీకు నమస్కారము. పురాణ ఋషీణామప్య వేద్య మహిమ్నే నమః=పురాణ ఋషులకు గూడ తెలియ అలవిగాని మహిమగల నీకు నమస్కారము, అదృశ్య సూక్ష్మ మూర్తిభిః అస్మద్రక్షిత్రే నమః=చూడ అలవిగాని సూక్ష్మ మూర్తులచే మమ్ములను నీ పుత్రులను వలె రక్షించు నీకు నమస్కారము; భవద్రక్ష్యాస్మ ద్రక్షిత్రే నమః =రక్షింపదగిన మమ్ముల రక్షించు నీకు నమస్కారము; భక్తానుకంపినే నమః=భక్తుల దయదలచు నీకు నమస్కారము, భగవతే=సర్వైశ్వర్యముగల భగవంతునకు నీకు నమస్కారము.
పుంసాని కాని సహస్రాణి సమాహృత్య దుర్దశాయ నమః=వేలకొలది పురుషులను అజ్ఞానులను ఒక్కచోచేర్చి వారిని బాగుచేయుటకు అతి కష్టస్థితి నొందిన నీకు నమస్కారము. సముద్రానే తిష్ఠతే ఏకస్మై నమః=కామముల చివర జ్ఞేయ-జ్ఞాన-జ్ఞాతృ భావ శూన్యుడగు ఒక్కనిగా ప్రకాశించిన నీకు నమస్కారము (సముద్రములు-కామములు); నిత్యం మద్గోప్ర్తే నమస్కారము=ఎల్లప్పుడు నన్ను రక్షించు నీకు నమస్కారము; వినిద్రైః జితశ్వాసైః సత్త్వస్థైః సమదర్శిభిః స్వాత్మయోగేన దృశ్యమానాయ జ్యోతిషే నమః=నిద్ర వీడి ప్రాణాయామములచే శ్వాసను జయించి సత్త్వముతో సమదర్శనులైన వారిచే స్వాత్మ యోగమున చూడబడుచున్న జ్యోతిః స్వరూపుడవగు నీకు నమస్కారము; యోగాత్మనే సాక్షాత్ యోగ స్వరూపుడవగు నీకు నమస్కారము; యుగాన సర్వభూత సంభక్షకాయ నమః=యుగాన ప్రళయమున సర్వభూతములను చక్కగా దిను నీకు నమస్కారము. తతో జలశాయినే నమః=ఆ తరువాత సముద్ర జలమున శయనించిన విష్ణు స్వరూపునకు నీకు నమస్కారము, రాహువదనే ప్రవిశ్యనికి సోమంగ్రసతే నమః=రాహు ముఖమున ప్రవేశించి చంద్ర గ్రహణమును జేయు రాహు స్వరూపుడవగు నీకు నమస్కారము; రాహువదనే ప్రవిశ్య దివి అర్కంగ్రసతే నమః= రాహు ముఖమున ప్రవేశించి పగలు సూర్యుని గ్రహణము జేయు రాహు స్వరూపుడవగు నీకు నమస్కారము, సోమాగ్నయే నమః=సోమ చంద్ర స్వరూపునకు నీకు అగ్ని స్వరూపునకు నీకు నమ స్కారము; సర్వదేహి దేహస్థాంగుష్ఠ మాత్ర పురుషాయ నమః=సమస్త శరీరధారుల శరీరమందు బొటనవ్రేలు అంతటి పురుషుని రూపమున నున్న నీకు నమస్కారము; గర్భాదుత్పత్తి స్వరూపాయ నమః=గర్భము నుండి పైకి ఎగిరి వెలువడి స్వాహాకారమును బొందు రూపమున ఉన్న నీకు నమస్కారము; గర్భాదధోభాగ గన్తృ స్వరూపాయ నమః = గర్భమునుండి క్రిందుగా వెలువడి స్వధను పొందువారి రూపమున నున్న నీకు నమస్కారము. ప్రాణినాం రోదన కారణాయ నమః=ప్రాణులు ఏడ్చుటకు కారణుడవైన నీకు నమస్కారము; ప్రాణినాం రోదన ప్రేరకాయ నమస్కారము=ప్రాణులను ఏడ్పింప చేయు నీకు నమస్కారము; ప్రాణినాం హర్షకారణాయ నమః=ప్రాణులు సంతసించుటకు కారణమగు నీకు నమస్కారము; ప్రాణినాం హర్షణ ప్రేరకాయ నమః=ప్రాణులు ఇతరులను హర్షింపజేయుటకు ప్రేరకుడవైన నీకు నమస్కారము; సముద్రగత ప్రాణి స్వరూపాయ నమః=సముద్రమున నున్న ప్రాణుల స్వరూపుడవగు నీకు నమస్కారము. నదీ దుర్గగత ప్రాణి స్వరూపాయ నమః=నదీ దుర్గములందున్న ప్రాణు(రుద్రు)ల స్వరూపుడవగు నీకు నమస్కారము; పర్వతగత స్వరూపాయ నమః=పర్వతమున ఉన్న ప్రాణు(రుద్రుల) స్వరూపుడవగు నీకు నమస్కారము, గుహాగత ప్రాణి స్వరూపాయ నమః=గుహలోనున్న (రుద్ర) స్వరూపునకు నీకు నమస్కారము; వృక్షమూలగత ప్రాణి స్వరూపాయ నమః=వృక్షమూలమున ఉన్న ప్రాణు(రుద్రు)ల; స్వరూపాయ నమః=గోవుల కొట్టము ననున్న ప్రాణుల (రుద్రుల స్వరూపుడవగు నీకు నమస్కారము; కాన్తారగహ గతప్రాణి స్వరూపాయ నమః=దట్టమైన అడవులలో ఉన్న ప్రాణు(రుద్రు)ల స్వరూపుడవగు నీకు నమస్కారము; చతుష్పథగత ప్రాణి స్వరూపాయ నమః=నాలుగు త్రోవలు కల సినచోట ఉన్న ప్రాణు(రుద్రు)ల స్వరూపుడవగు నీకు నమస్కారము; రథ్యాగతప్రాణి స్వరూపాయ నమస్కారము=రాజ మార్గమున ఉన్న ప్రాణు(రుద్రు)ల స్వరూపుడవగు నీకు నమస్కారము; చత్వరగత ప్రాణి స్వరూపాయ నమః= అగ్నిహోత్ర గృహమున ముంగిటలో ఉన్న ప్రాణు (రుద్రు)ల స్వరూపుడవగు నీకు నమస్కారము, సభాగత ప్రాణి స్వరూపాయ నమః=సభలో ఉన్న ప్రాణు (రుద్రు) ల స్వరూపుడవగు నీకు నమస్కారము, చంద్రార్క మధ్యగత వ్యక్తి స్వరూపాయ నమస్కారము=చంద్ర సూర్యుల మధ్యనున్న (రుద్రు)ల స్వరూపుడవగు నీకు నమస్కారము, చంద్రార్క రశ్మిగత వ్యక్తి స్వరూపాయ నమః=చంద్ర సూర్యుల కిరణములలో ఉన్న (రుద్రు)ల స్వరూపుడవగు నీకు నమ స్కారము; రసాతలగత వ్యక్తి స్వరూపాయ నమః=పాతాళ లోకమున ఉన్న రుద్రుల స్వరూపుడవగు నీకు నమస్కారము; రసాతలా త్పారంగత వ్యక్తి స్వరూపాయ నమః=పాతాళ లోకమున కంటె ఇంకనులోతుగా వెళ్ళిన రుద్రుల స్వరూపుడవగు నీకు నమస్కారము, సూక్ష్మగత వ్యక్తి స్వరూపాయ నమః=సూక్ష్మములోనున్న రుద్రుల స్వరూపు డవగు నీకునమస్కారము, స్థూలగత వ్యక్తి స్వరూపాయ నమః=స్థూలములలో ఉన్న రుద్రుల స్వరూపుడవగు నీకు నమస్కారము. కృశగత వ్యక్తి స్వరూపాయ నమః=కృశించి నీ వారిలోనున్న రుద్రుల స్వరూపముగల నీకు నమస్కారము, హ్రస్వగత వ్యక్తి స్వరూపాయ నమః=పొట్టిగా ఉన్న వారిలో ఉన్న రుద్రుల స్వరూపుడవగు నీకు నమస్కారము.
సర్వస్మై తే నమః=అంతటనున్న దేవుడవు అగు నీకు నమస్కారము; సర్వగాయ దేవాయతే నమః=అంతటనున్న దేవుడవు అగు నీకు నమస్కారము; సర్వభూతపతయే భవతే నమః=సర్వప్రాణులకు పతివైన నీకు నమస్కారము; సర్వ భూతాంతరాత్మనే నమః=సర్వ ప్రాణులయందు ఆత్మవైన నీకు నమస్కారము; కావున నీవు యజ్ఞమునకు పిలువబడలేదు; వివిధ దక్షిణైః యజ్ఞః ఇజ్య మానాయ తే నమః=అనేకవిధ దక్షిణలు గల యజ్ఞములచే యజ్ఞము చేయు (యజ్ఞముచే పూజింప బడు నీకు నమస్కారము; సర్వస్య కర్తే తే నమః=సమస్తము నకు కర్తయైన నీకునమస్కారము. కావుననే నీవు ప్రత్యేకముగా నా యజ్ఞమునకు పిలువబడ లేదు; స్వసూక్ష్మమాయా మోహకాయతే నమః=నీ సూక్ష్మమాయచే నన్ను మోహింపజేయు నీకు నమస్కారము. ఈ కారణము వలననే నీవు నా యజ్ఞమునకు పిలువబడలేదు; శరణాగత ప్రసన్నాయ నమః=రక్షింపుమని వచ్చిన వారిని అనుగ్రహించు నీకు నమస్కారము. దేవదేవేశాయ నమః=దేవతల దేవతలకు ఈశ్వరుడవైన నీకు నమస్కారము. మద్దతయేతే నమః=నాకు గమ్యస్థానమై జ్ఞాన స్వరూపుడవగు నీకు నమస్కారము; మత్ప్రతిష్ఠాయ నమః=నాయొక్క ప్రతిష్టాత్మకుడవగు నీకు నమస్కారము, మదేకైక గతయే నమః = నాకు వేరొక గతిలేని ఒకే గతివైన నీకు నమస్కారము; దక్షప్రజాపతి ఈ పైవిధముగా మహాదేవుడగు శివుని స్తుతించి విరమించెను. (ఆగెను) భగవంతుడైన శివుడుగూడ మిక్కిలి సంతసించెను. తరువాత మరల దక్ష ప్రజా పతితో ఇట్లు పలికెను.
ఓ! దక్ష! ఓ! సువ్రత! ఈ నీ స్తుతిచేత నేను సంతుష్టుడ నైతిని. ఇట పెక్కు మాటలు చెప్పనేల? నీవు నా సమీపమునకు చేరగలవు అని పలికి త్రైలోక్యాధిపతియైన భవుడు వాక్య నైపుణ్యముతో తిరుగులేని విధముగాను ఓదార్పు రీతిలో ఈ విధముగా అనెను-ఓ దక్షా! జరిగిన యజ్ఞ విఘ్నమును గూర్చి కోపింపవలదు. యజ్ఞమును ధ్వంసము జేయగల శక్తి నా కొక్కనికే గలదు. మరెవ్వరికిని లేదు. పూర్వము గూడ ఎవ్వరికిని ఈ శక్తి ఉన్నట్లు కనబడదు.
ఓ సువ్రతుడా! దక్షా! నా నుండి బహుళమైన ఈవరమును గ్రహింపుము. ప్రసన్న ముఖము గలవాడవై ఏకాగ్రమైన చిత్తముతో వినుము. ఓ దక్షప్రజాపతీ! నా అనుగ్రహమున నీవు వేయి అశ్వమేధ యాగముల యొక్కయు, నూరు వాజపేయ యాగముల యొక్కయు ఫలములను పొందగలవు. నేను, అంగములతో గూడిన వేదములను, సాంఖ్యములను, యోగములను సంపూర్ణముగా ఉద్ధరించియు, దేవ దానవులచేత గూడ చేయుటకు అలవిగాని విపులమైన తపమును చేసియు, సర్వపాప విమోక్షణమై శుభమైన ఒక పాశుపత వ్రతమును. ఏర్పరచితిని ఐదు విధములైన అర్థములతో (సద్యో జాతానికి పంచబ్రహ్మ మంత్రములతో ఆగ్నేయ భస్మను గ్రహించి త్రియంబక మంత్రమున జలముతో తడిపి పూసుకొనుట) గూఢమైనది. ప్రాజ్ఞులను మించినవారిచే నిర్మింపబడినది. బ్రాహ్మణుడి వర్ణములచేతను బ్రహ్మచర్యాది ఆశ్రమముల చేతను చేయబడినదై ఒకచోట విపరీత మైనది(విరుద్ధమైనది) ఒకచోట సమమైనది. వేదార్థములచేతనే నిశ్చయింపబడినది. పశువులయొక్క (జీవులయొక్క) పాశమును, (అవిద్యా సాంసారికాది బంధమున) వదిలింప జేయునది ఓ దక్షా నా చేత పాశుపత వ్రతము అన్ని ఆశ్రమముల వారికిని (సన్యాసులకు గూడ) ఆచరణీయమైనదిగా నిర్మింపబడినది. శుద్ధమైనది, సర్వ పాపములను తొలగించు నది, దీనిని ఆచరించి నందు వలననే చక్కని అనంతమైన ఫలము ఓ మహాభాగ్యుడ వైన దక్షా! నీకు కలుగుగాక! మానసికమైన జ్వరమును వదిలిపెట్టుము.
అపరిమిత పరాక్రమియైన మహాదేవుడు ఈ విధముగా పలికి, భార్యతోను, తన పరివారముతోను అదృశ్యుడయ్యెను. తరువాత భవుడు (శివుడు) బ్రహ్మచే యజ్ఞ భాగమును పొంది, సర్వ ధర్మములు తెలిసినవాడై (అంతకు పూర్వము దక్షయజ్ఞము లేడియై రుద్ర భయమున పరుగిడగా దానిని వెంబడించినపుడు రాలిన తన చమట బిందువునుండి పుట్టిన జ్వరము యజ్ఞమును దహించివైచెను) ఆ జ్వరమును సర్వ ప్రాణుల శాంతికై అచట అనేక విధములుగా విభజించెను. ఆ విధమును ఓ బ్రాహ్మణులారా! వినుడు- ఏనుగులకు తలనొప్పి, పర్వతములకు శిలారుజము (శిలాజిత్తు అను ఖనిజము), నీటికి నాలిక (నాచువంటిది), పాములకు కుబుసము. ఎద్దులకు కుంటితనము కాలి రోగము, భూమికిచౌడు, ఏనుగులకు (పశువులకు) గూడ కనుచూపు అడ్డుకొనుట, గుఱ్ఱము లకు కంధరంధ్రములో మొలచిన మాంస ఖండము, నెమళ్లకు పింఛములు రాలుట, కోకిలలకు కంటి రోగము - ఇవి ఒక్కటిగా ఉన్న జ్వరము అనేక విధముగా విభజింపబడి అనేక స్థానములలో తన్నాశకముగా ఉంచబడినది అని మహాత్ములచే చెప్పబడినది. అన్ని మేకలకు ఒక విధమైన పిత్తము జ్వరము అని వినికిడి. అన్ని చిలుకలకును మంచు జ్వరమని చెప్పబడినది. మనుష్యులయందు మాత్రము ఓ సర్వజ్ఞుడా! ఈ జ్వరము మరణమున పుట్టుకలోను, ఈ రెంటి మధ్యను ఎల్లప్పుడు ప్రవేశించునని చెప్పబడినది. ఈ జ్వరము అనునది మిక్కిలి భయంకరమైన తేజము. ఇది సర్వ ప్రాణులకు ఈశ్వరుడుగా నమస్క రింపదగినది, గౌరవింపదగినది.
దీనమయిన మనస్సులేక, ఏకాగ్రచిత్తుడై ఎవడు ఈ జ్వరఉత్పత్తిని చదువునోవాడు సర్వరోగ విముక్తుడై సంతోషముతో గూడి తానుకోరిన కోరికలను పొందును. దక్షుడు చెప్పిన ఈస్తోత్రమును ఎవడు వినునో, పఠించునో, వానికి ఎట్టి అపయశమును కలుగదు. దీర్ఘాయువును కూడ పొందగలడు. సర్వదేవులలో యోగవంతుడై హరుడు వరిష్ఠు డైనట్లే ఈ సహస్ర నామ స్తుతియు అన్ని స్తుతులలో బ్రహ్మ నిర్మితమైన వరిష్ఠము. కీర్తి, రాజ్య సుభైశ్వర్యములు, లాభముగా పొందబడిన విత్తము, ఆయువు, ధనము వీనిని కోరువారికి శివుడే స్తుతిచే స్తోత్రము చేయతగినవాడు. విద్యను కోరినవారికి విశేషముగా భక్తితో అతిప్రయత్నమున ఈ స్తుతిచే స్తుతింపదగినవాడు. రోగము నందిన వాడు, దుఃఖమునంది నవాడు, దొంగలచే భయము చెందినవాడు, తక్కిన భయములచే పీడింపబడినవాడు, రాజ్యకార్య నియుక్తుడైనవాడును, మహాభయముచే విముక్తుడగును. ఈ దేహము చేతనేవాడు గణములకు పతి అగును. ఈ లోకమున సుఖమును పొంది గణమునందే ఉండును. ఏ గృహమున శివుడు స్తుతింపబడునో ఆ గృహమున యక్షులు, పిశాచులు, నాగులు, వినాయకులును ఎట్టి విఘ్నములను కలుగచేయజాలరు. ఈ స్తుతిని భక్తితో బ్రహ్మచారిణియై విన్నగాని, చదివిన గాని, స్త్రీ తన తండ్రి పక్షమువారిచేతను భర్త పక్షమువారిచేతను దేవునివలె పూజ్యురాలు అగును.
ఈ మొత్తము స్తోత్రము విన్నవారికిని మాటి మాటికి చెప్పినవారికిని వారి సమస్త కార్యములు నిర్విఘ్నముగా సిద్ధించును. ఈ స్తోత్రమును పలువురితోబాటు చదివినచో మనస్సులో అనుకొన్నదియు, మాటతో చెప్పినదియు సర్వమును సుసంపన్నమగును. కుమారస్వామితో కూడుకొనియున్న శివుని యొక్కయు, దేవియైన పార్వతి యొక్కయు, వాహనమైన నందీశ్వరుని యొక్కయు, నిగ్రహ నియమములతో తన వైభవము కొలది పూజ జేసి, ఏకాగ్రచిత్తమైన యోగమునందున్న వాడై వెంటనే వరసగా ఈ నామములను పఠింపవలెను. అట్లుచేసిన మానవుడుకోరిన కోరికలను సుఖములను పొందును. మరణిం చినపుడు వేల స్త్రీలతో చుట్టబడినవాడై స్వర్గమునందును, సాంసారిక సర్వకర్మలతో వదిలిపెట్టినంతగా అంటిపెట్టుకొన్నను, సమస్త పాపములతో కూడియున్నను, దక్షుడు చేసిన ఈ స్తుతిని పఠించినచో ఆ పాపముల నుండియు, బంధముల నుండియు పూర్తిగా విముక్తుడగును. మరణించిన తరువాత శివగణ సాలోక్యమును పొందును. సురాసురులచే పూజింపబడును. ఇంద్రునివలె శాస్త్రవిధితో కూర్చిన విమానమున విరాజిల్లును. పంచ భూతప్రళయము జరుగువరకు ఉండువాడై, రుద్రునకు సేవకుడు అగును అని ప్రభువైన పరాశర సుతుడైన వ్యాసుడు అనెను. దీనిని ఎవ్వడు తెలియడు. దీనిని ఎవ్వరికిని (అయోగ్యు నకు) వినిపించరాదు. పరమ రహస్యమైన ఈ స్తోత్రమును విని పాపకారులైనను వైశ్యులు, స్త్రీలు, శూద్రులును రుద్ర లోకమును పొందుదురు. బ్రాహ్మణుడు ఈస్తోత్రమును ప్రతి పర్వములందు బ్రాహ్మణులకు వినిపించిన రుద్ర లోకమును పొందును. ఇందులో సంది యము లేదు.