మార్కండేయ మహా పురాణము
3 - చటక చతుష్టయము వింధ్యపర్వతమందు నివసించుట.
మార్కండేయుడు:
అహన్యహని విప్రేంద్రః స తేషాం ముని సత్తమః చకారా హార పయసా తథా గుప్త్యా చ పోషణమ్
మాసమాత్రేణ జగ్ముస్తే భానో స్స్యందన వర్త్మని కౌతూహల విలోలాక్షైః దృష్టా ముని కుమారకైః
దృష్ట్వా మహీం సనగరాం సాంభోనిధి సరిద్వారామ్ రథ చక్ర ప్రమాణాం తే పూన రాశ్రమ మాగతాః
శ్రమ క్లాంతతరాత్మనో మహాత్మానో వియోనిజాః
జ్ఞానంచ ప్రకటీ భూతం తత్ర తేషాం ప్రభావతః
రుషే శ్శిష్యా ను కంపార్థం వదతో ధర్మ నిశ్చయమ్ కృత్వా ప్రదక్షిణం సర్వే చరణా వభ్య వాదయన్
ఊచుశ్చ మరణాద్ ఘోరా న్మోక్షితా స్స్మ స్త్వయా మునే
ఆవాస భక్ష్య పయసాం త్వం నో దాతా పితా గురుః గర్భస్తానాం మృతా మాతా పిత్రా నైవాపి పాలితః త్వయా నో జీవితం దత్తం శిశవో యేన రక్షితాః
మార్కండేయుడు:
ఆ ముని సత్తముడు ప్రతి దినము పాలు మొదలగు నాహారములతో నో విప్రేంద్రా! పోషించుటయే గాక వాటిని జాగ్రత్తగా కాపాడుచుండెను. ఆ పక్షి శిశువులు ఒక మాస కాలము మాత్రములోనే సూర్య రథ మార్గము దనుక పయనించినవి. ముని కుమారులు కౌతూహల విలోల నేత్రములతో జూచిరి. ఇంతియే గాక ఆ పక్షులు నగరములు, నదులు, సముద్రలములతో గూడిన భూమినంతయూ రథ చక్రముతో సమానముగా ప్రదక్షిణము జేసి మరల ఆశ్రమమునకు వచ్చినవి. పయనించుటచే బడలిక చెందినవియు, మహత్తు గలవియు నగు ఆ పక్షులు మహర్షి ప్రభావమున జ్ఞానము బొందిన వయ్యెను. ఒక రోజున శిష్యుల యందనుగ్రహముచే ధర్మోపదేశము చేయుచుండ ఆ పక్షులు శమీక మహర్షికి ప్రదక్షిణము చేసి, చరణములకు ప్రణమిల్లెను. అనంతర మిట్లు పలికినవి. మునీశ్వరా! నీవు ఘోర మరణము నుండి మమ్ముల దప్పించితివి. పాలు, పండ్లు, భక్షములు, నివాసము ఇచ్చి రక్షించితివి. మాకు నీవే తల్లివి, దండ్రివి, గురువు. గర్భములో మేమున్నప్పుడే తల్లి చనిపోయినది. తండ్రి కూడా కాపాడలేదు. శిశువులమగు మమ్ము రక్షించి మీరు ప్రాణ దానము జేసితిరి.
క్షితా వక్షతతేజాస్త్వం కృ మీణామివ శుష్యతామ్ గజఘంటాం సముత్పాట్య కృతవాన్ దుఃఖరేచనమ్
కథం వర్దేయుర బలాః ఖస్తాంద్ర క్ష్యామ్యహం కదా
కదా భూమే ర్ద్రుమం ప్రాప్తాన్ ద్రక్ష్యే వృక్షాంతరం గతాన్
కదా మే సహజా కాంతిః పాంసునా నాశమేష్యతి ఏషాం పక్షాని లోత్థేన మత్సమీప విచారిణామ్
ఇతి చింతయతా తాత భవతా ప్రతిపాలితాః తే సాంప్రతం ప్రవృద్దా స్స్మః ప్రభుద్దాః కరవాషు కిం ?
ఇత్య్రు షిర్వచనం తే షాం శ్రుత్వా సంస్కార వత్స్ఫుటమ్ శిష్యైః పరివృత స్సర్వైః సహ పుత్రేణ శృంగిణా కౌతూహల పరో భూత్వా రోమాంచ పట సంవృతః ఉవాచ తత్వతో బ్రూత ప్రవృత్తేః కారణం గిరః
అక్షయ తేజస్సు గల మునీశ్వరా! మేము భూమి మీద బడి క్రిముల వలె శుష్కించి పోవు చుండ గజ ఘంటను పైకి తీసి మమ్ము కాపాడితివి. బలహీనముగా నున్న ఈ పిల్లలు పెరుగుట ఎట్లు? వీటిని ఆకాశములో విహరించు చుండగా నెప్పుడు చూడ గలను? భూభాగమున నొక వృక్షము నుండి మరియొక వృక్షమునకు నెరుగు చుండ నెప్పటికి చూడ గలను? ఈ పిల్లలు నా సమీపమున సంచరించు చుండ వాటి రెక్కల గాలిచే వెడలిన ధూళి నా శరీర సహజ కాంతి నెప్పుడు పోగొట్టునో గదా! తండ్రీ! యిట్టి తలంపులతో తమరు మమ్ము పాలించితిరి. అట్టి మేమిప్పుడు పెద్ద వారమైతిమి. జ్ఞానము గల వారమైతిమి. ఇప్పుడేమి జేయవలయునునో మాకు చెప్పుడు. సమస్త శిష్య పరి వృతుడగు శమీక మహాముని, శృంగియను తన కుమారునితో గూడి స్పష్టమును, సంస్కార యుక్తములు నగు ఆ పక్షి శిశువుల వాక్యములను వినెను. ఆ ముని హర్షపుల కాంచిత శరీరుడయ్యెను. కౌతూహల పరుడై వాటితో, “సత్యము బల్కుడు; మీ కిట్టి స్పుటములగు మనుష్య వాక్యములు వచ్చుటకు కారణ మేమి!” యని అనెను.
యస్య శాపాదియం ప్రాప్తా భవద్భి ర్విక్రియా పరా రూపస్య వచసశ్చైవ తన్మే వక్తు మిహార్హథ
పక్షులు:
విపుల స్వానితి ఖ్యాతః ప్రాగాసీన్మునిత్తమః తస్య పుత్రా ద్వయం జజ్ఞే సుక్రుషస్తుంబురు స్తథా
సుక్రుషన్య వయం పుత్రా శ్చత్వారః సంయతాత్మనః తస్యర్షే ర్వినయాచార భక్తి నమ్రాః సదైవ హి
తపశ్చరణ శక్త స్య శాస్యమానేంద్రియస్య చ యతాభి మత మస్మాభి స్తథా తస్యోపపాదితమ్
సమిత్పుష్పాదికం సర్వం యచ్చైవా భ్యవహారికమ్ ఏవం తత్రా థ వసతాం తస్యాస్మాకం చ కాననే
ఆజగామ మహావర్ష్మా భగ్నపక్షో జరాన్వితః ఆతామ్రనేత్రస్త్ర స్తా త్మా పక్షీ భూత్వా సురేశ్వరః
మనవి: 20 - 39 శ్లోకములు భావము మూల గ్రంధము నందు లేవు.
మీ యొక్క మాంసముచే తక్షణమే తృప్తి కలుగును. అటులనే మీ రక్త పానముచే దప్పిక కూడ దీరును. గాన యట్లు జేయుడనెను. అనంతరము మేమత్యంత హృదయ వేదనతో భయపడచు, వణుకుచు యిట్లంటిమి. చాలా కష్టమైన పనియని జెప్పి మేము చేయలే మంటిమి. ఎంత పండితు డైననూ పర శరీర రక్షణ కొరకు తన శరీరమును మరియు జీవనమును నశింపజేసి కోనునా? తండ్రియే పుత్రుడై జన్మించును కదా.
పితృదేవ మనుష్యాణాం యాన్యుక్తాని ఋణాని వై తాన్య పాకురుతే పుత్రో న శరీర ప్రదః సుతః
తస్మాన్నై తత్కరిష్యామో నో చీర్ణం యత్సురాతనైః జీవన్భద్రాణ్య వాప్నోతి జీవన్పుణ్యం కరోతి చ
మృతస్య దేహనాశ శ్చ ధర్మాద్యుపర తి స్తథా ఆత్మానాం సర్వతో రక్ష్య మాహుర్ధర్మవిదో జనాః
ఇత్థం శ్రుత్వా వచోస్మాకం మునిః క్రోదాదివ జ్వలన్ ప్రోవాచ పునరప్యస్మా న్నిర్ధహన్నివ లోచనైః
ప్రతిజ్ఞాతం వచో మహ్యం యస్మాన్నైత త్కరిష్యథ తస్మాన్మచ్చావ నిర్దగ్దా స్తిర్యగ్యోనౌ ప్రయాస్యథ
ఏవముక్త్వా తదా సో స్మాం స్తం విహంగమమబ్రవీత్ ఆంత్యేష్టి మాత్మనః కృత్వా శాస్త్రత శ్చౌర్ద్వ దైహికమ్
తండ్రీ! కుమారుడైన వాడు పితృ, దేవ, మనుష్య రుణములను దీర్చ వలయునని శాస్త్ర మందున్నది. అంతియే గాని కుమారుడు శరీరము నిచ్చువాడు కాదు. ఇట్లడుగుటచే మేమీ పని చేయము. పూర్వములో గూడ నెవరును చేయలేదు. బ్రతికి యున్న సుఖములు బడయ వచ్చును మరియు బ్రతికి యున్న పుణ్య కార్యములు జేయ వచ్చును. చచ్చిన దేహ నాశనమగును. చనిపోయిన ధర్మాచారము నశించును. ఇందుచేతనే ధర్మ వేత్తలయిన జనులను సర్వ ప్రకారములచే నాత్మ రక్షణము కర్తవ్యమని చెప్పుదురు. మహర్షీ! ఇట్లు మేము చెప్పిన మాటలు వినినంతనే నేత్రములచే దహించు వాని వలె కోపముచే మండిపడుచూ ముని మరల నిట్లు పలికెను. దుష్ట పుత్రులారా! నేనీ పక్షి రాజునకు ప్రతిజ్ఞ చేసితిని. మీరు నా మాట వినలేదు. అందుచే మీరు నా శాప దగ్దులై పక్షులు గండు. ఓ ద్విజోత్తమా! తండ్రి మాతో నిట్లుబలికి శాస్త్రానుసారముగా తన యౌర్ధ్వదైహికము నంత్యేష్టిని జేసికొని యా పక్షితో నిట్లు పలికెను.
భక్షయస్వ సువిశ్రబ్దో మామాత్ర ద్విజసత్తమ ఆహారకృత మే తత్తే మయా దేహ మిహాత్మనః
ఏతావదేవ విప్రస్య బ్రాహ్మణత్వం ప్రచక్ష్యతే యావత్పతగ జాత్యగ్ర్య స్వసత్య పరిపాలనమ్
న యజ్ఞే ర్దక్షిణావద్భి స్త త్పుణ్యం ప్రాప్యతే మహత్ కర్మనాన్యేన వా విప్రై ర్యత్సత్యపరిపాలనాత్
ఇత్ర్యుషె ర్వచనం శ్రుత్వా సో న్త ర్విస్మ యనిర్భరః ప్రత్యువాచ మునిం శక్రః పక్షిరూపధర స్తథా
యోగామాస్థాయ విప్రేంద్ర త్యజ్యేదం స్వం కలేబరమ్ జీవజ్జంతుం హి విప్రేంద్ర న భక్ష్యామి కదాచన
తస్య తద్వచనం శ్రుత్వా యోగయుక్తో భవన్మునిః తమ్ తస్య నిశ్చయం జ్ఞాత్వా శక్రోథాహ స్వదేహభ్రుత్
భో! భో! విప్రేంద్ర! బుధ్వస్య బుద్థ్యా బోధ్యం బుదాత్మక జిజ్ఞాసార్థం మయాయం తే అపరాధః క్రుతోనఘ
పక్షిరాజా! నీవు సావధానముగా నన్ను భక్షించుము. నేను నా శరీరమును నీకు ఆహారముగా చేసితిని. పతగశ్రేష్టుడా! బ్రహ్మణుడగు వాడు సత్య వాక్య పరిపాలన చేసినపుడే బ్రాహ్మణుడనిపించు కొనును. సత్య వాక్య పరిపాలన వలన లభించు మహా పుణ్యము దక్షిణా యుక్తములగు యజ్ఞములచే గాని మరి యితర సత్కర్మలచే గాని లభింపదు. పక్షి రూపదారి యగు ఇంద్రుడు ఋషి శ్రేష్టుని ఈ వాక్యములను విని మనస్సులో అత్యంత విస్మయము నంది ఆయనతో నిట్లు పలికెను. ఓ బ్రాహ్మణోత్తమా! ముందుగా యోగ మార్గానుసారముగా నీ శరీరమును వదలి పెట్టుము. నేను జీవితముతో నున్న జంతువు నెన్నడు భక్షించలేదు. పక్షి యోక్క యీ వాక్యమును విని మునిరాజు యోగము నవలంభించెను. వెంటనే ఇంద్రుడతని నిశ్చయము తెలిసికొని నిజ రూపమును ధరించి యిట్లు పలికెను. “పండితాగ్రణీ!
బ్రహ్మర్షీ! నేను తమ మహత్త్వమును తెలిసికొన దలచి తమ సమీపమందు ఇట్టి అపరాధము చేసితిని.”
తత్క్షమ స్వా మలమతే! కాచేచ్చా క్రియతాం తవ పాలనా త్సత్య వాక్యస్య ప్రీతిర్మే పరమా త్వయి అద్య ప్రభ్రుతి తే జ్ఞాన మైంద్రం ప్రాదుర్భవిష్యతి తపస్యథ తథా ధర్మే న తే విఘ్నో భవిష్యతి ఇత్యుక్త్వా తు గతే శక్రే పితా కోప సమన్వితః ప్రణమ్య శిరసా స్మాభి రిదముక్తో మహామునిః
భిభ్యతాం మరణా త్తాతత్వమస్మాకం మహామతే క్షంతు మర్హసి దీనానాం జీవిత ప్రియతా హి నః
త్వగస్తిమాంససంఘాతే పూయశోణిత పూరితే కర్తవ్యా న రాతిర్యత్ర తత్రాస్మాక మియం రతిః
శ్రూయతాం చ మహాభాగ యథా లోకో విముహ్యతి కామక్రోదాదిభిర్దోషై రవశః ప్రబలారిభిః
వ్రజ్ఞా ప్రాకార సంయుక్త మస్థిస్థూణం పరం మహత్ చర్మభిత్తి మహా రోధం మాంసశోణిత లేపనమ్
శుద్ధ స్వభావా! నన్ను క్షమింపుము. నీ కోరిక ఏమి. ఆజ్ఞాపించుము. నీ సత్యవాక్య పరిపాలన వలన నీ యందు నా కత్యంత ప్రీతి జనించినది. ఈ రోజు నుండి నీకు నైంద్ర జ్ఞానముద్భవించు గాక. మరియు తపస్సు యందు ధర్మమందు నెప్పుడు గూడ విఘ్నము కలుగకుండు గాక. దేవ రాజగు ఇంద్రుడిట్లు చెప్పి వెళ్ళిన పిమ్మట మేము తండ్రి చరణములపై వ్రాలి, నమస్కరించి యిట్లంటిమి. తండ్రీ! మహామతీ! మేము మరణ భయము చేతను బ్రతుకు నందలి యాశ వలనను, అట్లంటిమి. మా తప్పులను క్షమింపుడు. ఈ శరీరము త్వగస్తి మాంస సముదాయమై, పూయ శోణిత పూరితమై యుండును. ఇట్టి దేహమునకై యెంత మాత్రమాసక్తి జూపజనదు. కాని మాకు మాత్ర మిట్టి కాయమందు అభిలాష మిక్కుటమై ఉన్నది. మహాభాగా! ప్రబల శత్రు రూపములగు కామ క్రోమాది దోషములకు వశమై ఈ లోకము మోహము పొందు చున్నదని వినుచున్నాము. ఓ తండ్రీ! ప్రజ్ఞా రూపమగు ప్రాకారముచే నా వరింపబడిన యీ శరీరమను పట్టణమున కస్థులను స్తంభములు, చర్మమను గోడలు, మాంస శోణితములు పూతలుగా నున్నవి.
నవద్వారం మహాయాసం సర్వతః స్నాయు వేష్టితమ్ నృపశ్చ పురుష స్తత్ర చేతనావా నవస్తితః
మంత్రిణౌ తస్య బుద్దిశ్చ మనశ్చైవ విరోదినౌ యతేతే వైర నాశాయ తావుభావితరే తరమ్
నృపస్య తస్య చత్వారో నాశమిచ్చంతి విద్విషః కామః క్రోదః స్తథా లోభో మోహశ్చాన్య స్తథా రిపుః
యదా తు స నృపస్తాని ద్వారాణ్యావృత్య తిష్టతి సదా సుస్థ బలశ్చైవ నిరాతం కశ్చ జాయతే
జాతానురాగో భవతి శత్రు భిర్నాభిభూయతే యదాతు సర్వ ద్వారాణి వివృతాని స ముంచతి రాగో నామ తదా శత్రు ర్నేత్రాది ద్వారమృచ్చతి
సర్వవ్యాపీ మహాయామః పంచద్వార ప్రవేశనః తస్యానుమార్గం విశతి తద్వై ఘోరం రిపుత్రయమ్
ప్రవిశ్యా థ స వై తత్ర ద్వారై రింద్రియ సంజ్ఞకైః రాగః సంశ్లేష మాయాతి మనసా చ సహేతరైః
అన్ని వైపుల నరములచే అందింపబడి తొమ్మిది ద్వారములు కలదై యున్న యీ శరీరమను పట్టణమునకు చైతన్య రూపుడగు పురుషుడు రాజై యున్నాడు. ఈ రాజునకు ఇద్దరు మిత్రులు. మనస్సు, బుద్ధియను వారు గలరు. వీరిద్దరూ గూడ పరస్పర విరోధము గలవారై యుందురు. ఎల్లప్పుడొకరి నొకరు నాశము చేసికొనుటకు ప్రయత్నించు చుందురు. మరియు ఈ రాజునకు నలువురు శత్రువులు కామ, క్రోధ, లోభ, మోహములను నామములు గల వారున్నారు. వీరు కూడా ఎల్లవేళలా రాజును నాశనము జేయుటకై ప్రయత్నిచు చుందురు. రాజయిన చైతన్య పురుషుడు పూర్వోక్తములగు నవ ద్వారములను బందించిన యెడల ఎల్లప్పుడూ అత్యంత సుఖము కలవాడై యుండును. ప్రేమ, అనురాగాదులు గల వాడగును. కామ క్రోదాది శత్రువులు కూడా ఈ రాజు నేమి జేయ జాలరు. నవ ద్వారములు తెరచి యుంచిన యెడల మొదటి రాగమను శత్రువు, నేత్రాది నవ ద్వారములలో ప్రవేశించి సర్వము నాక్రమించును. ఈ శత్రువు సర్వ వ్యాప్తియే గాక యత్యంత ప్రబలమైనది.ఈ అనురాగ శత్రువయిదు ఇంద్రియములను ద్వారములలో ప్రవేశించిన వెంటనే రాగము ననుసరించి క్రోధ, లోభ మోహములను ముగ్గురు శత్రువులు ప్రవేశింతురు. ఈ రాగా రూప శత్రువు ఇంద్రియ నామకములగు ద్వారముల గుండా ప్రవేశించి మనోబుద్ధులతో కలుసుకొని నవ ద్వారముల యందు అభిలాష కలుగ జేయును.
ఇంద్రియాణి మనశ్చైవ వశే కృత్వా దురాసదః ద్వారాణి చ వశే కృత్వా ప్రాకారం నాశ యత్యథ
మనస్తస్యా శ్రితం దృష్ట్వా బుద్ధిర్న శ్యతి తత్క్షణాత్ అమాత్య రహిత స్తత్ర పౌ రావర్గోజ్గ్హిత స్త థా
రిపుభిర్లబ్ధ వివరః స నృపో నాశ మృచ్చతి ఏవం రాగ స్తథా మోహో లోభః క్రోధ స్తథైవ చ
ప్రవర్తంతే దురాత్మానో మనుష్య స్మృతి నాశాకాః రాగాత్క్రోదః ప్రభావతి క్రోధాల్లోభో భిజాయతే
ఈ జయింప శక్యము కాని యీ రాగ శత్రు వింద్రియ సమూహమును మనస్సును, మరియు అన్ని ద్వారములను వశము జేసికొని ప్రజ్ఞారూపమగు ప్రాకారమును (బుద్ధి రూపమగు) కోటను కూలగొట్టు చున్నది. ప్రజ్ఞయను మనస్సును, దాని నాశ్రయించి యున్న కామాదులను చూచినా తత్ క్షణమే నశించు చున్నది. చైతన్య పురుషుడగు ఈ రాజును, మంత్రులగు ఈ ఇద్దరు మనో బుద్ధులు ఎప్పుడైతే వదలి వేసిరో ప్రజలు అనగా కోరికలు కూడా వదలి పెట్టును. (లభించవు) ఇప్పుడా చైతన్య పురుషుడను రాజు శత్రువులగు కామాదులచే ఆక్రమింపబడి నాశనమగు చున్నాడు. ఈ ప్రకారముగా కామ, క్రోధ, లోభ, మోహ, రూప శత్రువులు ప్రజ్ఞను నాశనము చేయుచున్నవి. కామాది శత్రు గణము చైతన్య పురుషుడనే రాజు యొక్క దేహమను కోటలో ఉండి రాజు యొక్క బుద్ధిని నశింప చేయుచున్నవి. రాగము వలన క్రోధము, క్రోధము వలన లోభము పుట్టు చున్నవి.
లోభా ద్భవతి సమ్మోహః సంమోహా త్స్మ్రు తివిభ్రమః స్మృతిభ్రంశా ద్భుద్ది నాశో బుద్దినాశాత్ప్రనష్యతి
ఏవం ప్రణష్ట బుద్దీనాం రాగాలోభాను వర్తినామ్ జీవితే చ సలోభానాం ప్రసాదం కురు సత్తమ
యోయం శాపో భగవతా దత్తః స న భవేత్తథా న తామసీం గతిం కష్టాం వ్రజేమ మునిసత్తమ
లోభముచే మోహము కలుగును. మోహము కలిగిన స్మృతి భ్రంశమగును. స్మృతి నాశముచే బుద్ధి నశించును. బుద్ధి నాశము వలన మృత్యువు పొందును. జనకా! ఈ ప్రకారముగా మాకు గూడ రాగ లోభములకు వశీభూతుల మగుట చేతనే బుద్ధి నశించి పోయినది. ఈ కారణము చేతనే జీవితమందు లోభము గలవార మైతిమి. ఓ పురుషసత్తమా! మా యందు ప్రసన్నుడవు గమ్ము. మీరు ఇచ్చిన శాపము మాకు లేకుండు గాక. ఓ మునిశ్రేష్టుడా! ఈ కష్ట దాయకమగు తామస జన్మను పొందకుందుము గాక.
ఋషి:
యన్మయోక్తం న తన్మిథ్యా భవిష్యతి కదాచన న మే వాగనృతం ప్రాహ యావ దద్యేతి పుత్రకాః దైవమత్ర పరం మన్యే దిక్పౌరుష మనర్తకమ్ అకార్యం కారితో యేన బలా దహ మచినిత్తమ్ యస్మాచ్చ యుష్మా భిరహం ప్రణిపత్య ప్రసాదితః తస్మాత్తిర్యక్త్వ మాపన్నాః పరం జ్ఞానమవాప్స్యథ జ్ఞాన దర్శిత మార్గాశ్చ నిర్ధూత క్లేశ కల్మషాః మత్ప్రసాదా దసందిగ్దాః వరాం సిద్ది మవాప్స్య థ
ఋషి:
పుత్రులారా! నేను పలికినది ఎన్నటికి అభద్దము గానేరదు. ఇంతవరకు నేనన్న వచనము అసత్యము గాలేదు. దైవ బలమే పురుష కారము కంటే గొప్పదియని తలంచుచున్నాను. దైవబలమే నాచే ఇట్టి ఊహించని అకార్యము చేయించినది. మీరు నాకు నమస్కరించి ప్రసన్నుని జేసికొనినారు. అందువలన పక్షి జన్మలను పొందిననూ జ్ఞానము గల వారలయ్యెదరు గాక. నా యనుగ్రహముచే మీరు జ్ఞానము గలవారై పాప రహితులగుచు సంశయ రహితమగు చిత్తముతో పరమ సిద్ధి నందెరు గాక.
ఏవం శప్తాః స్మ భగవాన్ పిత్రా దై వశాత్పురా తతః కాలేన మహతా యోన్యంతర ముపాగాతాః
జాతాశ్చ రణమధ్యే వై భవతా పరిపాలితాః వయమిత్తం ద్విజశ్రేష్టః ఖగాత్వం సముపాగతాః
నా స్త్యసావిహ సంసారే యో న దిష్టేన భాధ్యతే సర్వేషామేవ జంతూనాం దైవా దీనం హి చేష్టితమ్
భగవానుడా ఈ విధముగా దైవ వశముచే పూర్వము మా తండ్రి శాప మిచ్చెను. పిమ్మట చాలాకాలము గడువగా నిట్లు పక్షి జన్మలను బొందితిమి. ఓ ద్విజోత్తమా! యుద్ధ స్థలమందు జన్మించిన మమ్ములను మీరు రక్షించితిరి. మేము ఇట్లు పక్షుల మైతిమి. ఓ మునిశ్రేష్టా! ఈ సంసారములో ప్రారబ్ద కర్మను అనుభవించని వాడెవ్వడు నుండడు. సమస్త జీవుల కర్మలన్నియు దైవా దీనములై యున్నవి.
మార్కండేయుడు:
ఇతి తేషాం వచశ్రుత్వా శమీకో భగవాన్మునిః ప్రత్యువాచ మహాభాగః సమీప స్తాయినో ద్విజాన్ పూర్వమేవ మయా ప్రోక్తం భవతాం సన్నిదావిధం,
సామాన్య పక్షిణో నై తే కె ప్యేతే ద్విజ సత్తమాః యే యుద్దేపి న సంప్రాప్తాః పంచత్వ మతి మానుషే తతః ప్రీతిమతా తేన తే నుజ్ఞాతా మహాత్మనా జగ్ముశ్శిఖరిణాం శ్రేష్టం వింధ్యం ద్రుమలతాయుతమ్
మార్కండేయుడు:
భగవానుడగు శమీక మహర్షి ఇట్లు చెప్పిన పక్షి బాలకుల వాక్యములను విని సమీప మందున్న బ్రాహ్మణులతో నిట్లనెను. ద్విజోత్తములారా! నేను ఈ పక్షి శిశువు లేప్పుడైతే యలౌకిక మగు మహాయుద్ధము నందు మరణము జెందక జీవించి యుండెనో యప్పుడే మీ సన్నిధిలో యీ పక్షులు సామాన్య పక్షులు గావని చెప్పి యుంటిని. అనంతరమా పక్షులు ప్రసన్నుడు, మహాత్ముడునగు శమీక మహర్షి యాజ్ఞను బడసి, వృక్ష లతా ప్రపూరితము పర్వత శ్రేష్టమునగు వింధ్య పర్వతమునకై వెళ్ళెను. ఆ ధర్మ పక్షిరూపులగు ఆ ముని పుత్రులు ఇప్పటి వరకు ఆ పర్వతమందు నివసించు చున్నారు. తపస్స్వా ధ్యాయ నిరతులై యున్నారు. సమాధి యందు నిశ్చయ సంకల్పులై యున్నారు.
యావదద్య స్థితాస్త స్మి న్నచలే ధర్మ పక్షిణః తపస్స్వా ధ్యాయ నిరతా స్సమాదౌ కృత నిశ్చయాః ఇతి మునివరలబ్ద సత్క్రియాస్తేముని తనయా విహగత్వ మభ్యుపేతాః గిరివర గాహనేతి పుణ్య తోయే యత మనసో నివసంతి వింధ్య వృష్ఠే
ఇట్లు శమీక మహర్షి యొక్క యాజ్ఞను బడసి, ఆ పక్షి రూపులగు ముని కుమారులాయన వలన సమస్త సదాచార క్రియల నుపదేశ మంది, అతి పవిత్ర నిర్మల జలయుత మగు ఆ పర్వత శిఖరము నందు మనో నిగ్రహము గలవారై నివసించుచున్నారు.
Summary of chapter 3 of the Mārkandeya Mahā Purana is as follows:
Resolving Jaimini's inquiry regarding Draupadī's wedlock with the five Pāṇḍava princes, the celestial birds explain the subtle workings of divine incarnation. When Indra committed ancient transgressions by slaying Trishirā and Vṛtra, his supreme celestial majesty and vigor were divided into five essential energies. These five divine portions took birth on Earth as Yudhishtira, Bhīma, Arjuna, Nakula, and Sahadeva, while the eternal Mother Śrī manifested from the sacred sacrificial altar as Draupadī to serve as their unified divine consort, thereby upholding cosmic harmony without violating holy law.