మార్కండేయ మహా పురాణము
87 - శుంభ వధ
ఋషి:
నిశుమ్భం నిహతం దృష్ట్వా భ్రాతరం ప్రాణ సంమితమ్ హన్యమానం బలం చైవ శుమ్భః కృద్దోబ్రవీ ద్వచః బలావలే పాద్దుష్టే త్వం మా దుర్గేః గర్వ మావహ అన్యాసాం బల మాశ్రిత్య యుధ్యసే యాతి మానినీ
ఋషి:
ప్రాణ తుల్యుడగు సోదరుడు నిశుంభుడును మరియు సేనలను చంపుట చూసి శుంభుడు కృద్దుడై ఇట్లు పలికెను. ఓ దుష్టురాలా! దుర్గా! నీవు బలవంతు రాలనని గర్వింపకుము. నీవు ఇతరుల బలమును ఆశ్రయించి అత్యంత మానవతివై యుద్ధము చేయు చున్నావు.
శ్రీదేవి:
ఏకై వాహం జగత్యత్ర ద్వ్తీయా కా? మమాపరా పశ్యైతా దుష్ట మయ్యేవ విశంత్యో మద్విభూతయః
శ్రీదేవి:
ఓరీ దుష్టుడా! ఈ జగత్తు నందు నేనొక్క దానినే వెలుగొందు చున్నాను. నేను కాక వేరెవరున్నారు? చూడుము. ఈ నా విభూతు లందరూ నాయందే ప్రవేశించు చున్నారు.
ఋషి:
తతః సమస్తా స్తా దేవ్యో బ్రహ్మాణీ ప్రముఖాలయమ్ తస్యా దేవ్యా స్తనౌ జగ్ము రేకై వాసీత్తదాంబికా
ఋషి:
అనంతరము బ్రహ్మాణీ మొదలగు సమస్త శక్తులు దేవి యొక్క శరీర మందు లీనమైరి. అప్పుడు అంబిక ఒక్కతే వెలుగొందెను.
శ్రీదేవి:
అహం విభూత్యా బహుభి రిహ రూపై ర్యదాస్థితా తత్సంహృతం మయైకై వ తిష్టా మ్యాజౌ స్థిరో భవ
శ్రీదేవి:
ఓరీ శుంభా! నేను నా విభూతి ద్వారా ఈ స్థానము నందు చాలా రూపములతో యున్నాను. ఇప్పుడు ఆ రూపాల నన్నిటినీ ఉపసంహరించి యుద్ధ క్షేత్రమున ఒంటరిగా ఉన్నాను. నీవు యుద్ద రంగమున స్థిర బుద్ధివై , ధైర్యముగా నుండుము.
ఋషి:
తతః ప్రవవృతే యుద్ధం దేవ్యాః శుమ్భస్య చోభయోః పశ్యతాం సర్వ దేవానా మసురాణాం చ దారుణమ్ శరవర్షైః శితైః శస్త్రై స్తథా చాస్త్రైః సుదారుణైః తయోర్యుద్ధ మాభూ ద్భూయః సర్వలోక భయంకరమ్ దివ్యా న్యస్త్రాణి శతశో ముముచే యా న్యాథాంబికా బభంజ తాని దైత్యేంద్ర స్తత్ప్రతీఘాత కర్తృభిః ముక్తాని తేన చాస్త్రాణి దివ్యాని పరమేశ్వరీ బభంజ లీలయేవోగ్ర హూంకారోచ్చారణాదిభిః తతః శరశతై ర్దేవీ మాచ్చాదయత సోసురః సా చ తత్కుపితా దేవీ ధను శ్చిచ్చేద చేశుభిః
ఋషి:
తదుపరి దేవాసురులు చూచు చుండగా శ్రీదేవీ శుంభాసురుల దారుణమగు యుద్ధము మొదలయ్యెను. ఈ విధముగా ఆ దేవీ శుంభాసురుల శరవృష్టి, శస్త్రాలు మరియు దారుణ అస్త్రాల యొక్క పరస్పర ఆక్రమణల ద్వారా సంపూర్ణ లోకాలకు భయమును కలిగించు యుద్ధము జరిగెను. అంబిక ఏ వందల కొలది దివ్యాస్త్రములను వేసేనో ఆ సమస్త దివ్యాస్త్రములను ఆ దైత్యేంద్రుడగు శుంభాసురుడు తన అస్త్రములచే విరగ గొట్టెను. మరియు శుంభాసురుడు ఏ దివ్యాస్త్రములను వేసేనో ఆ దివ్యాస్త్రముల నన్నింటిని పరమేశ్వరి యగు చాముండిక కూడా లీలా మాత్రముగా ఉగ్రములగు హుంకారోచ్చారణాదుల చేతనే భంగ పరచెను. తరువాత ఆ మహాసురుడు వందల కొలది బాణములను వర్షింప జేసి శ్రీ దేవిని కప్పి వేసెను. అప్పుడు దేవి కూడా కుపితురాలై బాణములచే అతని విల్లును విరిచెను.
భిన్నే ధనుషి దైతేంద్ర స్తథా శక్తి మథాదదే చిచ్చేద దేవీ చక్రేణ తా మప్యస్య కారే స్థితామ్ తతః ఖడ్థ ముపాదాయ శతచంద్రం చ భానుమత్ అభ్యధావత తాం హంతుం దైత్యానా మదిపేశ్వరః తస్యాపతత ఏవాశు ఖడ్గం చిచ్చేధ చండికా ధను ర్ముక్తైః శితై ర్బాణై శ్చర్మ చార్కకరామలమ్ ఆశ్వాశ్చ పాతయామాస రథం సారదినా సహ,
హతాశ్వః స తదా దైత్య శ్చిన్నధన్వా విసారధిః జగ్రాహ ముద్గరం ఘోర మంబికా నిధనోద్యతః చిచ్చేదాపతత స్తస్య ముద్గరం నిశితైః శరైః తథాపి సోభ్య దావత్తాం ముష్టి ముద్యమ్య వేగవాన్
విల్లు విరిగి పోగానే దైత్యపతి శక్తిని గ్రహించెను. కాని దేవి శుంభుని చేతి యందలి ఆ శక్తిని కూడా చక్రముతో తునకలు చేసెను. అప్పుడు రాక్షస రాజు అగు శుంభుడు ఖడ్గము మరియు దీప్తి వంతమగు “శతచంద్ర”మను ఖడ్గమును గ్రహించి దేవిపై కురికెను. అప్పుడు అట్లు వచ్చిన ఆ శుంభుని ఖడ్గమును మరియు సూర్యుని కిరణముల వలె నిర్మలమగు ఢాలును చండిక తన ధనుస్సు నుండి వదులు చున్న పదునైన బాణములచే తుంచి వేసెను. గుర్రములను పడ గొట్టెను. సారధి సహితముగా రథమును భుజించెను. ఎప్పుడైతే ఆ రాక్షస రాజు రథము భిన్నమయ్యెనో, అశ్వములు చనిపోయేనో, విల్లు విరిగెనో, మరియు సారధి మరణించెనో, అప్పుడు అతడు ఘోరమగు ముద్గరమును (సుత్తి వంటి సాధనము) తీసుకొని అంబికను చంపుటకు ఉద్యుక్తు డయ్యెను. అప్పుడు దేవి దగ్గరగా వచ్చుచున్న అసురుని ముద్గరమును పదునైన బాణములచే నరికి వేసెను. అయినప్పటికీ ఆ మహాసురుడు పిడికిలి బిగించి వేగముతో దేవిపై కురికెను.
స ముష్టిం పాతయామాస హృదయే దైత్య పుంగవః దేవ్యా స్తం చాపి సా దేవీ తలే నోరస్యతాడయత్ తల ప్రహారాభిహతో నిపపాత మహీతలే స దైత్యరాజః సహసా పున రేవ తదోత్దితః ఉత్పత్య చ ప్రగృహ్యోచ్చై ర్దేవీం గగన మాస్థితః తత్రాపి సా నిరాధారా యుయుధే తేన చండికా నియుద్ధం ఖే తదా దైత్య శ్చండికా చ పరస్పరమ్ చక్రతుః ప్రథమం సిద్ధ ముని విస్మయ కారకమ్ తతో నియుద్ధం సుచిరం కృత్వా తేనాంబికా సహ ఉత్పత్య భ్రామయామాస చిక్షేప ధరణీ తలే
రాక్షస శ్రేష్టుడు ఆ పిడికిలిచే దేవి యొక్క హృదయమును కొట్టెను. అప్పుడు దేవి కూడా హస్తముచే అతని వక్ష స్థలమును చరిచెను. ఆ ప్రహారముచే పీదితుడైన రాక్షస రాజు భూమి యందు పడిపోయెను. తత్క్షణమే తిరిగి లేచెను. అనంతరము దేవిని గ్రహించుటకు ఎగురుచూ శుంభుడు ఆకాశమున నిలచెను. మరియు దేవి కూడా ఆకాశ మందు నిరాధారురాలై అతనితో ఘోరమగు యుద్ధము చేయ సాగెను. అప్పుడు ఆకాశమున శుంభాసురుడు, చండికాదేవియు సిద్ధులకు మునులకు ఆశ్చర్యమును గొలుపు నట్టి యుద్ధము చేయ సాగిరి. ఆ అసురునితో చాలా కాలము వరకు నిర్యుద్ధము చేసి అతనిని పైకి ఎగురవేసి గిర గిర త్రిప్పి భూమి యందు విసిరి వేసెను.
స క్షిప్తో ధరణీం ప్రాప్య ముష్టి ముద్యమ్య వేగతః అభ్యధావత దుష్టాత్మా చండికా నిధనేచ్చయా త మాయాంతం తతో దేవీ సర్వ దైత్య జనేశ్వరమ్ జగత్యాం పాతయామాస భిత్త్వా శూలేన వక్షసి స గతాసుః పపాతోర్వ్యాం దేవీశూలాగ్ర విక్షతః చాలయ న్సకలాం పృథ్వీం సాబ్ది ద్వీపాం సపర్వతామ్ తతః ప్రసన్న మఖిలం తే తస్మి న్డురాత్మని జగత్ స్వాస్ధ్య మతీవాప నిర్మలం చాభవ న్నభః ఉత్పాతమేఘాః సోల్కా యే ప్రాగాసం స్తే శమం మయుః సరితో మార్గవాహిన్య స్తథా శుంభే నిపాతితే
అప్పుడు దుష్టాత్ముడగు ఆ రాక్షసుడు భూమి యందు పడి, అత్యంత వేగముతో పిడికిలి ఎత్తి చండికను చంపవలెనని మీదికి పరుగెత్తెను. సర్వ దైత్యేశ్వరుడగు ఆ శుంభుడు వచ్చు చుండుట చూచి దేవి తన శూలముతో అతని హృదయమును చీల్చి అతనిని భూమిపై పడవేసెను. శ్రీదేవీ శూలాగ్ర విక్షతుడగు నా రాక్షసుడు ప్రాణము పోయిన వాడై భూభాగమున పడి పోయెను. ఆ సమయమున సముద్ర, ద్వీప, పర్వత సహితమైన భూమి యంతయు కంపించెను. దురాత్ముడగు ఆ రాక్షసుడు మరణించుటచే అందరూ ప్రసన్నులైరి. జగత్తు అత్యంత సుఖమును బొందెను. మరియు ఆకాశము కూడా అత్యంత నిర్మలముగా నయ్యెను. ఎట్టి అనిష్ట సూచకములగు మేఘములు మరియు ఉల్కా గణాలు శుంభుడున్న సమయము వెలు గొందెనో, శుంభుడు మరణించిన పిమ్మట అవన్నీ అదృశ్యమై పోయెను. మరియు నదులు వాని వాని స్థానములను ప్రవహించ సాగెను.
తతో దేవగణాః సర్వే హర్షనిర్భర మానసాః బభూవు ర్నిహతే తస్మి న్గంధర్వా లలితం జగుః అవాదయం స్తథైవాన్యే ననృతు శ్చాప్సరో గణాః వపుః పుణ్యా స్తథా వాతాః సుప్రభోభూర్దివాకరః జజ్వలు శ్చాగ్నయః శాంతాః శాంత దిగ్జనిత న్వనాః
మరియు అతడు మరణించ గానే సమస్త దేవగణాలు అత్యంత హర్ష చిత్తులైరి. గంధర్వులు మధుర గానము చేయ సాగిరి. కొంత మంది వాద్యములు మ్రోగింప సాగిరి. మరియు అప్సరసలు నృత్యము చేయు చుండిరి. సుందరమగు చల్లని గాలులు వీచ సాగెను. దివాకరుడు కూడ సుందరమైన కాంతిని ధరించెను. ఆరి పోవుచున్న హోమాగ్ని తిరిగి ప్రజ్వలింప సాగెను. మరియు దిక్కులయందు “శాంతి, శాంతి” యను శబ్దములు వినబడు చుండెను.
Summary of chapter 87 of the Mārkandeya Mahā Purana is as follows:
Śumbha then sends the fierce generals Caṇḍa and Muṇḍa with a vast army to seize the Goddess. As the demon forces surround Her, divine wrath darkens the brow of Mother Ambikā, and from Her forehead manifests the terrifying Goddess Kālī, wearing a garland of skulls and wielding a sword and noose. Kālī devours the demonic elephants, chariots, and warriors, decapitates Caṇḍa and Muṇḍa on the battlefield, and presents their severed heads to Ambikā, earning the divine name Chāmuṇḍā.