మార్కండేయ మహా పురాణము
27 - నైమిత్తికాది శ్రాద్ధకల్పము
మదాలస:
నిత్యం నైమిత్తికం చైవ నిత్య నైమిత్తికం తథా గృహస్థస్య త్రిధా కర్మ తన్నిశామయ పుత్రకః వాంఛ యజ్ఞాశ్రితం నిత్యం యదేత త్కథితం తవ నైమిత్తికం తథా చాన్య త్పుత్రః జన్మ క్రియాధికమ్ నిత్య నైమిత్తికం జ్ఞేయం పర్వ శ్రాద్ధాది పండితైః తత్ర నైమిత్తికం వక్ష్యే శ్రాద్ధ మాభ్యుదయం తవ పుత్ర జన్మని యత్కార్యం జాతకర్మ సమం నరైః వివాహాదౌ చ కర్తవ్యం సర్వం సంయక్క్ర మోదితమ్ పితర శ్చాత్ర సంపూజ్యాః ఖ్యాతా నాందీముఖాస్తు యే పిందాశ్చ దధి సంమిశ్రాన్ దద్యా ద్యవ సమన్వితాన్ ఉదజంఖః ప్రాజ్ముఖో వా యజమానః సమాహితః వైశ్వదేవ విహీనం తత్ కేచి దిచ్చంతి మానవాః
మదాలస:
పుత్రా! గృహస్థునకు కర్తవ్యమగు కర్మలు మూడు విధములు. నిత్యము, నైమిత్తికము, నిత్య నైమిత్తికము. ఈ మూడింటి యొక్క విధానములను చెప్పెదను వినుము. నేను ఏ పంచ యజ్ఞముల గురించి చెప్పి యుంటినో వానిని నిత్య కర్మలని అందురు. ఇవి గాక కుమారా! జననాది సంస్కారములను నైమిత్తికములని అందురు. పండితులు పర్వశ్రాద్ధాది కర్మలను నిత్యనైమిత్తిక కర్మలని అందురు. వాటిలో మొదట నీకు నైమిత్తికమగు అభ్యుదయ శ్రాద్ధమును గురించి చెప్పెదను. వినుము. పుత్రుడు జన్మించిన సమయ మందు జాతకర్మ చేయునట్లే వివాహము లందు కూడా క్రమానుసారముగా అట్లే చేయవలెను. వివాహాది కార్యము లందు నాందీ ముఖమను పేరుగల ప్రసిద్ధమైన పూజను పితృ దేవతలకు సంయక్ప్రకారముగా చేయ వలెను. ఆ సమయములో యజమాని శ్రద్ధగా తూర్పు దిక్కు ముఖముగా కాని, ఉత్తరదిక్కు ముఖముగా గాని, కూర్చుని, పితరుల నుద్దేశించి దధి మిశ్రితమగు పిండములను ఇవ్వ వలెను. ఈ సమయ మందు వైశ్వ దేవ బలి దానము చేయ వలసిన అవసరము లేదని కొందరు చెప్పుదురు.
యుగ్మాశ్చాత్ర ద్విజాః కార్యా స్తే పూజ్యాశ్చ ప్రదక్షిణమ్ ఏతం నైమిత్తికం వృద్ధౌ తథాన్య చ్చౌర్థ్వ దైహికమ్ మృతాహన్యస్తు కర్తవ్య మేకోద్ధిష్టం శ్రుణుష్వ తత్ దైవహీనం తథైకార్ఘ్యం తథై వైక పవిత్రకమ్ ఆవాహనం న కర్తవ్య మగ్నౌ కరణ వర్జితమ్ ప్రేతస్య పిండ మేకం చ దద్యా దుచ్చిష్ణ సన్ని ధౌ తిలోదకం చాపసవ్యం తన్నామ స్మరణాన్వితమ్ అక్షయ్య మముక స్యేతి స్థానే విపర విసర్జనే
ఈ వైష్ణదేవ మందు ఇద్దరు బ్రాహ్మణులకు ప్రదక్షిణము చేసి అర్చన చేయ వలెను. ఇదే వృద్ధి శ్రాద్ధ మందు నైమిత్తికమని చెప్పబడు చున్నది. అటులనే ఔర్ధ్వ దైహిక కృత్య మందు చని పోయిన దినమున ఏకోదిష్టము అను నైమిత్తిక కర్మను చేయ వలెను. ఆ విధానమును వినుము. ఈ కర్మను దైవ హీనముగా చేయ వలెను. ఏక పవిత్రమునే ధరింప వలెను. ఏ కార్ఘ్యమునే ఇవ్వ వలెను. ఆవాహనము గాని అగ్నౌకారణము గాని ఉండదు. ఉచ్చిష్ట సన్నిధిలో ఒక్క పిండమును పెట్ట వలెను. మరియు చని పోయిన వాని నామమును సంకల్పించి అపసవ్యముగా అతనికి అక్షయ లోకములు కలుగవలె నని విపర విసర్జన స్థానమందు తిల తర్పణము చేయ వలెను.
అభిరమ్యతా మితి బరూయా ద్బ్రూయుస్తే భిరతాః స్మ హ ప్రతి మాసంభావే దేతత్ కార్యా మావత్సరా న్నరైః అథ సంవత్సరే పూర్ణే యదా వా క్రియతే నరైః సపిండీకరణం కార్యం తస్యాపి విధి రుచ్యతే తచ్చాపి దైవ రహిత మేకార్ఘై క పవిత్రకమ్ నైవాగ్నౌ కరణం తత్ర తచ్చావాహన వర్జితమ్ అపసవ్యం చ తత్రాపి భోజ్యే దయుజో ద్విజాన్ విశేష స్తత్ర చాన్యాస్తి ప్రతిమాసం క్రియాధికః తం కథ్యమాన మేకాగ్రో వదత్యా మే నిశామయ తిల గందోధకై ర్యుక్తం కుర్యా త్పాత్ర చతుష్టయమ్
కర్త బ్రాహ్మణులతో “అభిరమ్యతాం” అని చెప్ప వలెను. బ్రాహ్మణులు “అభిరతాఃస్మ” అని ప్రతివచనము చెప్పవలెను. ఇట్లు సంవత్సర పర్యంతము ప్రతి మాసము ఈ విధముగా చేయవలెను. సంవత్సరము పూర్తి అయిన పిమ్మట సపిండీకరణము చేయవలెను. దాని విధానమును చెప్పెదను. ఈ సపిండీకరణము కూడ దైవ విహీనము, అగ్నౌకరణ హీనము, ఆవాహన హీనమై యుండ వలెను. ఏ కార్ఘ్యము ఏక పవిత్రము దీని యందు విధియై యున్నది. దక్షిణ దిక్కు యందు జల సహిత పిండాదులను పూర్వోక్త విధానములతో పెట్ట వలెను. బేసి సంఖ్య గల బ్రాహ్మణులకు భోజనము పెట్ట వలెను. పర్వ శ్రాద్ధాదులు కూడా నిత్య నైమిత్తిక కర్మలు. వానిని కూడా చెప్పెదను. ఏకాగ్ర చిత్తుడవై వినుము. వత్సా! తిల, గంధ, ఉదకములతో కూడిన నాలుగు పాత్రలను స్థాపించ వలెను.
కుర్యా త్పితౄణాం త్రితయ మేకం ప్రేతస్య పుత్రకః పాత్ర త్రయే ప్రేత పాత్ర మర్ఘ్యం చైవ ప్రసేచయేత్ సపిండీకరణం తాసాం పుత్రాభావే న విద్యతే ప్రతిసంవత్సరం కార్య మేకోద్దిష్టం నరైః స్త్రియాః యే సమానా ఇతి జవ న్పూర్వవ చ్చేష మాచరేత్ స్త్రీణా మప్యేవ మేవైత దేకోద్దిష్ట ముదాహృతమ్ మృతాహని యథాన్యాయం నృణాం యాదవ దిహోదితమ్ పుత్రాభావే సపిండాస్తు తదభావే సహోదకాః మాతుః సపిండా యే చ స్యు ర్యేన్యే మాతు స్సహోదకాః కుర్యు రేవం విధిం సమయ గపుత్రన్య సుతా సుతః
వాటిలో మూడు పాత్రలను పితృ దేవతల నుద్దేశించి, నాలుగవ పాత్రను ప్రేత నుద్దేశించి కర్మ చేయ వలెను. కుమారా! ఆ మూడు పాత్రల యందు ప్రేత పాత్రను అర్ఘ్యమును చేయవలెను. “యే సమానా” అను మంత్రమును స్మరించుచు, పూర్వము చెప్పిన విధానముగా అవసిష్ట కర్మను చేయ వలెను. స్త్రీల నుద్దేశించి కూడా ఈ ప్రకారముగానే ఏకోదిష్ట విధానము చేయ వలెను. పుత్రులు లేనిచో స్త్రీలకు సపిండీకరణ విధానము లేదు. పురుషునితో సమానముగా స్త్రీకి కూడా మరణ దినమున శక్తి ననుసరించి ఏకోదిష్ట కర్మను చేయ వలెను. స్రీలకు పుత్రులు లేని యెడల సపిండులు, లేని యెడల సహోదరులు పురుషునికి వలెనె స్త్రీకి కూడా చేయ వలెను. తల్లి యొక్క సపిండులు గాని, వారు లేనిచో సమానోదకులు గాని, వారి ఆభాసమున తల్లి యొక్క మనుమలు గాని ఈ కర్మను చేయ వలెను.
కుర్యా న్మాతామహా యైవం పుత్రికా స్తనయా స్తథా ద్వ్యాముష్యాయణ సంజ్ఞాస్తు మాతామహ పితామహాన్ వూజయేయు ర్యథాన్యాయం శ్రాద్ధై ర్నైమిత్తికై రపి సర్వాభావే స్త్రియః కుర్యుః స్వభర్తౄణా మమంత్రకమ్ తదభావే స నృపతిః కారయే త్స్వ కుటుంబినా తజ్జాతీయై ర్నరైః సమ్య గ్దాహాద్యా స్సకలాః క్రియాః సర్వేషా మేవ వర్ణానాం బాందవో నృపతి ర్యతః ఏతా స్తే కథితా వత్స! నిత్యా నైమిత్తికాః క్రియాః క్రియాం శ్రాద్ధా శ్రయా మన్యాం నిత్య నైమిత్తికీం శృణు దర్శ స్తత్ర నిమిత్తం వై కాలశ్చంద్ర క్షయాత్మకః నిత్యతాం నియతః కాల స్తస్య సంసూచయ త్యథ
మాతామహుల నుద్దేశించి పుత్రులు లేని పక్షమున దౌహిత్రులు చేయ వలెను. ఇతనిని “ద్వ్యాముష్యాయుణుడు” అని చెప్పుదురు. నైమిత్తిక శ్రాద్ధముల ద్వారా మతామహ పితామహులకు కర్మలు చేయ వలెను. ఎవ్వరు లేనిచో తన భర్తకు స్త్రీ చేయ వలెను. స్త్రీలు చేయు కర్మ మంత్ర రహితముగా చేయ వలెను. చనిపోయిన వారికి భార్య కూడా లేనిచో రాజు తన పరివారముతో కర్మను చేయించ వలెను. అనగా సజాతీయ పురుషుల ద్వారా అతని దహనాది కర్మలు చేయించ వలెను. సమస్త వర్ణములకు రాజు బంధువు కాన రాజు చేయ వలెను. వత్సా! నేను నీకు నిత్య కర్మ, నైమిత్తిక కర్మలను గురించి చెప్పితిని. ఇప్పుడు శ్రద్దాసక్తితో కూడు కొనిన నిత్య నైమిత్తిక క్రియల గురించి చెప్పెద వినుము. చంద్రుని యోక్క క్షయాత్మకమగు కాలమును “అమావాస్య” అని చెప్పుదురు. ఈ అమావాస్యను నిమిత్తముగా చేసుకొని ఎల్లప్పుడూ దీనిని నిత్యమని సూచించెదరు. ఈ కారణముచే దీనిని నిత్య నైమిత్తిక కర్మ యని అందురు.
Summary of chapter 27 of the Mārkandeya Mahā Purana is as follows:
Madālasā continues her sublime discourses on Advaita wisdom, explaining how the ego-sense creates bondage in saṃsāra. She teaches her sons that name, caste, physical form, and worldly relationships belong solely to the perishable body and subtle mind. By constantly contemplating 'Shuddhoham Buddhoham'—I am pure, enlightened consciousness—one dissolves all karmic illusions and rests in eternal bliss.