మార్కండేయ మహా పురాణము
45 - సృష్టి ప్రకరణము
మనవి: ఇక్కడ 1 – 5 శ్లోకములు, భావము మూల గ్రంధము నందు లేవు.
ఉత్ససర్జ తత స్సాటు తమో మాత్రాత్మికాం తనుమ్
సాపవిద్దా తాను స్తేన సద్యో రాత్రి రజాయత
అన్యాం తాను ముపాదాయ సిసృక్షుః ప్రీతి మాప సః
సత్త్వోద్రేకా స్తతో దేవా ముఖత స్తస్య జజ్ఞిరే
ఉత్ససర్జ చ భూతేశ స్తనుం తా మప్యసౌ విభుః
సా చాప విద్దా దివసం సత్త్వప్రాయ మజాయత
సత్త్వ మాత్రాత్మికామే వ తతోన్యా గృహే తనుమ్
పితృవ న్మాన్య మానస్య పితర స్తస్య జఙ్ఞిరే
సృష్ట్వా పితౄ నుత్ససర్జ తనుం తామపి స ప్రభుః
సా చోత్సృష్టాభవ త్సంద్యా దిననక్తాంతర స్థితా
అందుచేత వారికి తమో గుణాత్మక మగు శరీరమును ప్రసాదించెను. మరియు ఆ శరీరమును వదలి పెట్టి వెంటనే తమో గునాత్మికమగు “రాత్రి”యను పేరుతో విఖ్యాతి పొందెను. అనంతరము ప్రజాపతి వేరొక శరీరమును గ్రహించి ప్రసన్నతను పొందెను. దాని యందు సత్త్వ గుణము యొక్క ఉద్రేకముచే అతని ముఖము నుండి దేవతల సృష్టి కలిగెను. వారికి సాత్త్విక శరీరమును ఇచ్చెను. అప్పుడు విడిచి పెట్ట బడిన సత్త్వ గుణ కళేబరము “దినము” అను పేరును పొందెను. తిరిగి సత్త్వమయ మగు రెండవ శరీరమును గ్రహించి పితరులకు ఇచ్చగించి, పితరులను సృష్టించెను. పితరులను సృష్టించి ప్రభువు ఆ శరీరమును కూడా పరిత్యజించెను. అప్పుడు అది పగలు, రాత్రి కాక “సంధ్యా” రూప మందు పరిణితి చెందెను.
రజోమాత్రాత్మికా మాన్యాం తనుం భేజేథ స ప్రభుః
తతో మనుష్యాః సంభూతా రజో మాత్ర సముద్భవాః
సృష్ట్వా మనుష్యా న్స విభు రుత్ససర్జ తనుం తతః
జ్యోత్స్నా సమభవత్సా చ నక్తాంతేహర్ముఖే చ యా
ఇత్యేతాస్తు నవ స్తస్య దేవస్య ధీమతః
ఖ్యాతా రాత్ర్యహనీ చైవ సంధ్యా జ్యోత్నా చ వై ద్విజః
జ్యోత్స్నా సంధ్యా తథైవాహః సత్వమాత్రాత్మకం త్రయమ్
తమో మాత్రాత్మికా రా తిః సా వై తస్మా త్తమోధికా
తస్మాద్దేవా దివా రాత్రా వాసురాస్తూ బలాన్వితాః
జ్యోత్స్నాగమే చ మనుజాః సంధ్యాయాం పితర స్తథా
భవంతి బలినోథృష్యా విపక్షాణాం న సంశయః
తద్విపర్యయ మాసాద్య ప్రాయాంతి చ విపర్యయమ్
ఆ తరువాత రజో గుణాత్మకమగు వేరొక శరీరమును గ్రహించి రజో గుణ మదికమగు మానవులను సృష్టించెను. మనుష్యులను ఉత్పన్నము చేసి ఆ విభుడు ఆ శరీరమును కూడా విడిచి వేసెను. అది “జ్యోత్స్న” అయినందున అది జ్యోత్స్నా రాత్రి యొక్క శేషము. మరియు పగలు ప్రధమ భాగమందు ప్రాదుర్భూత మయ్యెను. ఓ ద్విజుడా! బుద్ధిమంతుడగు దేవ దేవుని ఈ సమస్త విగ్రహములే పగలు, రాత్రి సంధ్యా మరియు జ్యోత్స్నా అను పేర్లతో విఖ్యాతి పొందెను. జ్యోత్స్నా, సంధ్యా, పగలు ఈ మూడు సత్త్వ గుణాత్త్వికములు. రాత్రి తామస గుణము కలది. అందు చేతనే రాత్రి త్రియామా అయినది. పూర్వము చెప్పిన గుణాదిక్యత వలననే పగలు దేవతలు, రాత్రి అసురులు, జ్యోత్స్న యందు మనుష్యులు పరియు సంధ్యా సమయమందు పితృ గణాలు, అధిక బలశాలురై శత్రువులను జయించెదరు. అనగా శత్రువులు వీరిని సంగ్రామ మందు గెలువ లేరు. అధిక మగు బలశాలురై యుందురు.
జ్యోత్స్నారాత్యహనీ సంధ్యా చత్వార్వేతాని వై ప్రభోః
బ్రాహ్మణస్తు శరీరాణి త్రిగుణోపసృతాని తు
చత్వార్వేతా స్మథోత్పాద్య తాను మన్యాం ప్రజాపతిః
రజస్తమోమయీం రాత్రౌ జగృహే క్షుత్తృడన్వితః
తదంధకారే క్షుత్క్షామాన సృజద్భగవా నజః
విరూపం చ్మశ్రులా నత్తు మారబ్దా స్తే చ తాం తనుమ్
రక్షామ ఇతి తేభ్యోన్యే య ఊచు స్తేతు రాక్షసాః
ఖాదామ ఇతి చోచు స్తే యక్షా యక్షణా ద్ద్విజ!
ప్రజాపతి పగలు, రాత్రి, సంధ్యా, జ్యోత్స్నా ఈ నాలుగు విధాల శరీరములను ఉత్పత్తిని చేసెను. అది బ్రహ్మ యొక్క త్రిగుణాత్మకమగు శరీరము. ప్రజాపతి ఈ నాలుగు శరీరములను సృష్టించి ఆకలి, దప్పిక కలిగిన రజస్తమో మాయ గుణాత్మక మగు రాత్రిని గ్రహించెను. ఆ అంధకార మందు భగవానుడు బ్రహ్మ ఆకలి నుండి కృశించిన శరీరము పొడుగైన గడ్డము, మీసములు గల వానిని సృష్టించెను. అప్పుడు అతడు ఆ శరీరమును తినుటకు ప్రవృత్తు డయ్యెను. ఓ ద్విజుడా! ఎప్పుడయితే అతడు ఆ శరీరమును భక్షించుట మొదలు పెట్టేనో, అప్పుడు ఎవరు “రక్షించండి” అనిరో వారు రాక్షసులు. ఎవరు “భక్షిస్తాము” అనిరో వారు యక్షులు అన్న పేరుతొ ప్రసిద్ధి కెక్కిరి.
తాన్ దృష్ట్వా హ్యప్రియేణాస్య కేశాః శీర్యంత వేధసః
సమారోహణ హీనాశ్చ శిరసో బ్రాహ్మణస్తు తే
సర్పణా త్తేభవ న్సర్పా హీనత్వా దహయః స్మృతాః
సర్పాన్ దృష్ట్వా తతః క్రోతా త్క్రోదాత్మానో వినిర్మమే
వర్ణేన కాపిలేనోగ్రా స్తే భూతాః పిశితాశనాః
ధ్యాయతో గాం తద స్తస్య గంధర్వా జఙ్ఞిరే సతః
జఙ్ఞిరేపి తతో వాచం గంధర్వా స్తేన తే స్మృతాః
అష్టాస్వేతాసు సృష్టాసు దేవయోనిషు స ప్రభుః
తతః స్వదేహతోన్యాని వయాంసి పశవో సృజత్
ముఖతోజాః ససర్జాథ వక్షస శ్చావయో సృజత్
వారిని చూసి అప్రసన్నత కలిగి నందున విధాత యొక్క కేశములు గిరిగిర తిరుగ నారంభించెను. ఈ కేశములు బ్రహ్మ యొక్క శిరస్సు నుండి పడిపోయి, విహరించుటచే (పాకుటచే) సర్ప సంజ్ఞ లభించెను. హీన జాతి యగుటచే వాటిని ఆహులు అని కూడా అందురు. బ్రహ్మ క్రోధముతో సర్పములను చూచుట తోడనే వాటిని క్రోదాత్ములను చేసెను. కపిల వర్ణముచే ఉత్పన్నమగు ఉగ్ర స్వభావము, మాంస భోజులు ఉత్పన్న మయిరి. గోవు యొక్క చింతన కాల మందు గంధర్వులు ఉత్పత్తి కలిగెను. వాక్యములను పరిగ్రహించుచూ ఉత్త్పన్న మైనందున వారు గంధర్వులు అను పేరును పొందిరి. ఈ విధముగా అష్ట విధముల దేవ యోనులు ఉత్త్పన్నము చేసి, తన దేహము నుండి ఇతరములగు సమస్త పశు పక్ష్యాదులను ఉత్త్పన్నము చేసెను. ముఖము నుండి మేకను, హృదయము నుండి గొర్రెలను పుట్టించెను.
గా శ్చైవోదరతో బ్రహ్మా పార్శ్వాభ్యాం చ వినిర్మమే
పద్భ్యాం చాశ్వాన్స మాతంగా చశకాన్మృగాన్
ఉష్ట్రా నశ్వతరాం శ్చైవ నానా రూపాశ్చ జాతయః
ఓషధ్యః ఫల మూలిన్యో రోమభ్య స్తస్య జజ్ఞిరే
ఏవం పశ్వౌషదీః సృష్ట్వా హ్యయజచ్చాద్వారే విభుః
తస్మాదాదౌ తు కల్పస్య త్రేతా యుగముభే తదా
గౌ రజః పురుషో మేషో హ్యశ్వాశ్వతర గర్ధభాః
ఏతాన్ గ్రామ్యా న్పశూ నాహో రారణ్యా శ్చ నిబోధ మే
శ్వాపదం ద్విఖురం హస్తీ వానరా పక్షి పంచమాః
ఔదకాః పశవః పష్ఠాః సప్తమాస్తు సరీసృపాః
మరియు ఉదరము నుండి, పార్శ్వ స్థానము నుండియు గోవులను, రెండు పాదముల నుండి ఆశ్వములను, ఏనుగులను, గార్ధభములను, కుందేళ్ళను, జింకలను, ఒంటెలను మరియు కంచర గాడిదలను మరియు రోమముల నుండి ఫల మూల యుక్తమగు అనేక ప్రకారము లగు ఔషదులను ఉత్పన్నము చేసెను. భగవానుడు త్రేతాయుగ ప్రారంభ మందు ఈ విధముగా పశువులను, ఔషధులను ఉత్పన్నము చేసి యజ్ఞ సృష్టి యందు నియమించెను. గోవు, మేక, దున్నపోతు, మేషము, అశ్వము, కంచర గాడిద పరియు గాడిద. ఈ పశువు లన్నింటిని గ్రామ్యము లందురు. ఇప్పుడు అరణ్యములు అనగా వన పశువుల గురించి చెప్పెదను. క్రూర మృగములు, ఏనుగులు, కోతులు, పక్షులు, జలచర, పశువులు, ద్విఖురములు, ప్రాకేడి జంతువులు, పాములు మొదలగునవి. ఈ ఏడును అరణ్యము నందు నివసించు ప్రాణులు.
గాయత్రీం చ తృచం చైవ త్రివృత్సామ రథన్తరమ్
అగ్నిష్టోమం చ యజ్ఞానాం నిర్మమే ప్రథమాన్ముఖాత్
యజూషిత్రైష్టుభం ఛందః స్తోమం పంచాదాశం తథా
బృహత్సామ తథోక్తం చ దక్షిణా దసృజన్ముఖాత్
సామాని జగతీం ఛందః స్తోమం పంచాదశం తథా
వైరూప మతిరాత్రంచ నిర్మమే పశ్చిమాన్ముఖాత్
ఏక వింశ మథర్వాణ మాప్తోర్యామాణ మేవ చ
అనుష్టుభం స విరాజ ముత్తరాదసృజన్ముఖాత్
విద్యుతోశని మేఘాశ్చ రోహితేంద్ర ధనూంషి చ
వయాంసి చ నసర్జాదౌ కల్పస్య భగవాన్విభుః
విధాత తన మొదటి ముఖము నుండి యజ్ఞము యొక్క గాయత్రిని త్రిఋక్ వేద మంత్రములు, త్రివృత్, సామ రథంతరములను మరియు అగ్ని ష్టోమములను ఉత్త్పన్నము చేసెను. దక్షిణ ముఖము నుండి యజుః, త్రైష్టుభ చందము, పంచ దశస్తోమ బృహత్సామము మరియు ఉక్థములను పుట్టించెను. పశ్చిమ ముఖము నుండి సామ జగతీ చందమూ, పంచ దశ స్తోమము, వైరూపము, అతి రాత్రములను ఉత్పత్తి చేసెను. ఉత్తర ముహము నుండి ఇరువది ఒకటి అథర్వములు, ఆప్తోర్యామములు, అనుష్టుభాములు, వైరాజకములను ఉత్పన్నము చేసెను. భగవంతుడగు విభుడు కల్పమునకు మొదట మెరుపులు, వజ్రములు, మేఘములు, ఎరుపు, ఇంద్ర ధనుస్సు మరియు పక్షులు వీటిని సృష్టించెను.
ఉచ్చావచాని భూతాని గాత్రేభ్య స్తస్య జజ్ఞిరే
సృష్ట్వా చతుష్టయం పూర్వం దేవాసురపితౄన్ప్రజాః
తతోసృజ త్స భూతాని స్థావరాణి చరాణి చ
యక్షాన్పిశాచాన్ గంధర్వాం స్తథైవాప్సరసాం గణాన్
నర కిన్నర రక్షాంసి వయః పశు మృగో రగాన్
అవ్యయం చ వ్యయం చైవ యదిదం స్థాణు జంగమమ్
తేషాం యే యాని కర్మాణి ప్రాక్సృష్టేః ప్రతిపేదిరే
తాన్యేవప్రతి పద్యంతే సృజ్యామానాః పునః పునః
హింస్రాహింస్రే మృదు కరూరు ధర్మాధర్మా వృతానృతే
తద్భావితాః ప్రపద్యంతే తస్మా త్త త్తస్య రోచతే
ఆ తరువాత దేవతలు అసురులు పితరులు మనుష్యులు ఉత్పన్న మైనపుడు వాని శరీరము నుండి నానా విధాల ప్రాణులు ఉత్పన్నమై ఆ తర్వాత స్థావర, జంగమ, భూత గణ, యక్ష, పిశాచ, గంధర్వాదులు మరియు అప్సరో గణంబులు, నరులు, కిన్నెరులు, రాక్షసులు, పశువులు, పక్షులు, మృగములు, భుజంగములు మొదలగు సంపూర్ణ నశ్వరములు అనశ్వరములు అగు స్థావర జంగమ పదార్థములు ఉత్పన్న మైనవి. వెతికి ఏయే కర్మలు ఉన్నవో అవి సృష్టికి ప్రథమ మందే నిర్దేశింప బడినవి. అందు వలన అవి మాటి మాటికి ఉత్పన్న మగుచు వాని యొక్క అన్నీ కర్మలను పొందు చున్నవి. ప్రాణి గణాలు పూర్వ జన్మ మందు హింస, అహింస, మృదుత్వము, క్రూరత్వము, ధర్మము, అధర్మము, సత్యము వీటిని ఏ విధముగా యోచించునో తరువాత జన్మ మందు వానికి అవియే సంప్రాప్త మగును.
ఇంద్రి యార్థేషు భూతేషు శరీరేషు చ స ప్రభుః
నానాత్వం వినియోగం చ థాతైవ యద్వ్యదా త్స్వయమ్
నామరూపం చ భూతానాం కృత్యానాం చ ప్రపంచనమ్
వేద శబ్దేభ్య ఏవాదౌ దేవాదీనాం చకార సః
ఋషీణాం నామదేయాని యాశ్చ దేవేషు సృష్టయః
శర్వర్యంతే ప్రసూనాతా మన్యేషాం చ దదాతి సః
యథర్తా వృతులింగాని నానా రూపాణి పర్యయే
దృశ్యంతే తాని తాన్యేవ తథా భావా యుగాదిషు
ఏవం విదః సృష్టయస్తు బ్రాహ్మణో వ్యక్త జన్మనః
శర్వర్యంతే ప్రబుద్దస్య కల్పే కల్పే భవంతి వై
ప్రాణుల యందు ఇంద్రియముల యొక్క అర్థము మరియు శరీర మందు ఇంద్రియాలను అనేక ప్రకారములగు వాటిని కర్మాను సారముగ ఆ విభుడు స్వయంగా నిర్మించెను. ప్రాణుల యొక్క పేరు, రూపము, వారి కృత్యములు, అకృత్యములు, ప్రపంచము మరియు దేవతల యొక్క కర్మలు మొదలైన వారి యందు వేద శబ్దము నుండి నిర్మాణము చేసెను. ఋషుల పేర్లు, దేవతల సృష్టి ఇవన్నియు ప్రళయము తర్వాత, ప్రళయమునకు ముందున్నట్లుగానే చేసెను. ఏ విధముగా ఋతువులు మారినపుడు వాటి చిహ్నములు ఎట్లు కన్పించునో అట్లే యుగ యుగములు ప్రకటిత మగును. ఈ విధముగా అవ్యక్త జన్ముడగు బ్రహ్మ ప్రతి కల్పము నందును ప్రళయాంత మందు సృష్టిని చేయుచున్నాడు.
Summary of chapter 45 of the Mārkandeya Mahā Purana is as follows:
The narrative transitions to the dialogue between Maharshi Mārkaṇḍeya and his disciple Kraushtuki, opening with the cosmic creation. Mārkaṇḍeya describes how at the end of Mahāpralaya, the unmanifest Supreme Being awakens Prakṛti, causing the emergence of Mahattattva, Ahaṃkāra, and the Cosmic Egg wherein Svayambhū Brahmā manifests to initiate creation.