మార్కండేయ మహా పురాణము
62 - స్వారోచిష మన్వంతర కథనము
మార్కండేయుడు:
తతః తాభి సహితః వత్నీభి రమర ద్యుతిః రరామ తస్మ్యి స్మిం భైలేం ద్రె రమ్య కానన నిర్ఘరే సర్వోపభోగ రత్నాని మధూని మదురాణి చ నిధయ స్సముపాజగ్ముః పద్మిన్యా వశవర్తినః స్రజో వస్త్రా ణ్యలంకారా న్గంధార్థ్య మనులేపనమ్ ఆసనా న్యతి శుభ్రాణి కాంచనాని యథేచ్చయా సౌవర్ణాని మహాభాగః కరకా న్భాజనాని చ తథా శయ్యాశ్చ వివిధా దివ్యై రాస్తరణై ర్యుతాః ఏవం స తాభిః సహితో దివ్యగంధాది వాసితే రరామ స్వరుచి ర్భాభి ర్భాసితే వరపర్వతే
మార్కండేయుడు:
అనంతరము దివ్య తేజోవంతుడగు స్వరోచి తన భార్యలతో ఆ హిమాచలము యొక్క రమణీయ కాననము లందు, నిర్ఘర ప్రదేశము లందు విహరించ సాగెను. పద్మినీ విద్యా ప్రభావముచే అష్ట నిధులు వశము లయ్యెను. సమస్త ఉప భోగములు, అనుభవించుట కొరకు వివిధములగు రత్నములు, మధురములగు మధ్యములు, మాల్యములు, వస్త్రములు, ఆభరణములు, సుగంధాను లేపనములు, ఆసనములు, వెండి, బంగారములతో నిర్మితములగు కమండలములు, సువర్నములతో నిర్మితము లైన వివిధము లైన పాత్రలు, దివ్యములగు శయ్యాగారములు, మొదలగు ద్రవ్యములను ఇచ్చాను సారముగా సంప్రాప్తము లగు చుండెను. ఆ స్వరోచి దివ్య గంధ యుక్తములు, రత్నాదులతో ప్రకాశించు నట్టి పర్వత ప్రదేశము లందు మువురు భార్యలతో విహరించు చుండెను.
తాశ్చాపి సహా తేనేతి లేభిరే ముద ముత్తమామ్ రమమాణా యథా స్వర్గే తథా తత్ర శిలోచ్చయే కలహంసీ జగాదైకాం చక్రవాకీం జలే సతీమ్ తస్య తాసాం చ లలితే సంబంధే చ స్పృహావతీ ధన్యోయ మతిపుణ్యోయం యోయం యౌవన గోచరః దయితాభిః సహైతాభి ర్భుంక్తే భోగా న భీప్సితాన్ సంతి యోవనినః శ్లాఘ్యా స్తత్పత్న్యో నాతిశోభానాః జగత్యా మల్పకాః పత్న్యః పతయ శ్చాతిశోభనాః అభీష్టా కస్యచి త్కాంతా కాంతః కస్యాశ్చి దీప్సితః పరస్పరాను రాగాఢ్యం దాంపత్య మతి దుర్లభమ్
స్వర్గముతో సమానముగా మనోహరముగా నున్న ఆ పర్వత శ్రేష్ఠము లందు విహరించుచూ, అతని భార్యలు కూడ అత్యంత ఆహ్లాదమును పొందిరి. అట్టి సమయము నందు స్వరోచి యొక్క ఆతని భార్యల యొక్క ప్రణయమును చూచి వారితో సమమైన ప్రణయాను రాగి అయిన ఒక కల హంస జల స్థితమై యున్న రెండవ చక్రవాకముతో ఇట్లు చెప్పెను. ఈ యువకుడు భార్యలతో ఇచ్చాను సారముగా సమస్త భోగములను అనుభవించు చున్నాడు. అతడు పుణ్యాత్ముడు, ధన్యుడు, ప్రపంచము నందు రూపము కలవారు, యౌవనులు అయిన పురుషులు అనేకు లుందురు. కాని వారి భార్యలు రూపవంతులుగ నుండరు. కాని ఈ భార్యా భర్తలు ఇద్దరును సౌందర్య భూషితులై యున్నారు. ఇట్టి దాంపత్యము దుర్లభము. ఎచట నైనా భర్త తన భార్య యందు లేక భార్య తన భర్త యందు అనురక్తులై యుందురు. కాని పరస్పరము సమానముగా అనురక్తులై యుండు స్త్రీ పురుషు లుండుట అతి దుర్లభము.
ధన్యోయం దయితా భీష్టో హ్యేతా శ్చాస్యాతి వల్లభాః పరస్పరాను రాగో హి ధన్యా నామేవ జాయతే ఏతన్నిశమ్య వదనం కలహంసీ సమీరితమ్ ఉవాచ చక్రవాకీ తాం నాతి విస్మిత మనసా నాయం ధన్యో యతో లజ్జా నాన్వస్త్రీ సన్నికర్షతః అన్యాం స్త్రియ మాయం భుంక్తే న సర్వా స్వస్య మానసమ్ చిత్తానురాగ ఏకస్మి న్నధిష్టానే యతః సఖిః తతోతి ప్రీతిమా నేష భార్యాసు భవితా కథమ్ ఏతా నదయతాః చత్యుర్ నైతాసాం దయితః పతిః వినోదమాత్ర మేవైతా యథా పరిజనో పరః
అందు వలన భార్యా సహితుడైన ప్రియతముడగు ఈ యువకుడు ధన్యుడు మరియు ప్రియురాల్లైన ఈ భార్యలు కూడ ధన్యులు. ఎందుచేత ననగా ఈ ప్రపంచము నందు ఎవరు ధన్యులో అట్టి వారికి మాత్రమే పరస్పరము అనురాగ ముత్పన్న మగును. కలహంసి చెప్పిన ఈ మాటలు వినిన చక్రవాకము అధికమగు విస్మయము చెందని మనస్సు గలదై దానితో ఇట్లు చెప్పెను. “ఓ సఖీ ఈ స్వరోచి ధన్యుడు కాడు. ఒక భార్య సమీపమున మరియొక భార్యతో రమించు చున్నాడు. ఈతనికి ఎంత మాత్రము సిగ్గు, లజ్జ లేదు. ఈతనికి భార్య లందరి యందును సమానమగు అభిలాష లేదు. మనస్సు నందలి అనురాగము ఎప్పుడు ఒకరి యందు మాత్రమే ఆధారపడి యుండునో, అప్పుడు ఈ స్వరోచి భార్య లందరి ఎడల ఏ విధముగా సమానమగు అనురాగము గల వాడగును? ఈ భార్యలు కూడా ఇతనికి ప్రియురాండ్రు కారు. మరియు ఈ భర్త కూడ వీరికి ప్రియతముడు కాడు. ఇతర పరిజనుల వలన ఏ విధముగా మనస్సునకు వినోదము ప్రాప్తించునో, అదే విధముగా భార్యల యందు కూడ ఈతడికి వినోదము లభించు చున్నది.”
ఏతాసాం చ యదిష్టోయం తత్కిం ప్రాణా న్న ముంచతి లలింగ త్యపరాం కాంతాం ధ్యాతో వై కాన్తయాన్యయా విద్యాప్రదాన మూల్యేన క్రీతో హ్యేష సుభృత్యవత్ ప్రవర్తతో న హి ప్రేమ సమం బహ్వీషు తిష్టతి కలహంసిః పతి ర్ధన్యో మమ ధన్యః మేవ చ యస్యై కస్యాం చిరం చిత్తం యస్యాశ్చైకత్ర సంస్థితమ్ బహుపత్నీపతి ర్లోకః శ్శరణ్యం పుణ్య పాపయోః గృహాసనాద్వైశ్చ భూషణైశ్చ సమాగమైః విషమైః క్రియమాణో హి యుజ్యతే మహాదేనా సా జ్యేష్టాం కనీయ భావేన కనిష్టాం జ్యేష్టతాం నయేత్
“ఒక వేళ పత్ను లందరూ అభీష్టులైనచో ఈతడు అన్ని వేళలా సమాన భావముతో సంతోషమును పొందుటకు సమర్ధుడైనచో ఇన్ని రోజులు జీవించునా ఏమి? ఒక భార్య ఈతనిని అభిలషించు సమయమున అతడు వేరొక స్త్రీని ఆలింగనము చేయు చుండును. అందు వలన వీరి యందు పరస్పరాను రాగముతో నిండిన దాంపత్య ప్రేమ ఎక్కడ నున్నది? విద్యా ప్రదానము యొక్క మూల్యమునకు అమ్ముడు పోయిన స్వరోచి భార్యల ఎదుట భృత్యుని వలె ప్రవర్తించు చున్నాడు. ప్రేమ ఎక్కువ మంది భార్యల యందు సమాన భావముతో నుండ జాలదు. ఓ సఖీ! కలహంసీ! నా భర్త ధన్యుడు. నేనును ధన్యురాలను. ఎందుచేత ననగా నేనతనికి ఏకైక భార్యను. నా యెడలననే అతని చిత్తము, అనురాగములు ఉన్నవి. మరియు నేను కూడా ఒక్కడే భర్త యగు నా భర్త యందే అనురాగము గల దాననై యుంటిని. సంసారము నందు చాలా మంది భార్యలు గల పతియే పుణ్యమునకు, పాపమునకు కారణము. గృహము, ఆసనము మొదలగు వాని వలన మరియు భూషణాదుల వలన, సమాగమముల వలన, నిశ్చయముల వలన, చెడు కార్యములు చేయుట చేతను, మహా పాపమును పొందును. పెద్దలు పిన్నల భావములను, పిన్నలు పెద్దల భావములను పొందుదురు.”
గురువే తు పరం దత్త్వా హుత్త్వాన్యం సమిధం యథా ఊఢయా సహ కర్తవ్యా నిత్య నైమిత్తికీః క్రియాః జగాదా థాన్య భావేనః పాపియాన్ జాయతే నరః
గురువుకు దక్షిణా స్వరూప వరమును యిచ్చి, సమిధలతో హోమము చేయ వలెను. భార్యా సహితుడై నిత్య నైమిత్తిక క్రియలు చేయవలెను. ఇట్లు మనుష్యుడు శ్రద్ధతో చేయక అన్య భావముతో చేసినచో మానవుడు పాపి యగును.
మార్కండేయుడు:
సర్వ సత్త్వరు తజ్ఞోసౌ స్వరోచి రపరాజితః నిశమ్య లజ్జితో దధ్యౌ సత్యమేవ హి నానృతమ్ తతో వర్షపతే యాతే రమణో మహాగిరౌ రమణః సమం తాభి ర్దనర్శ పురతో మృగమ్ సుస్నిగ్ధ పీనా వయవం మృగీ యూధ విహారిణమ్ వాసితాభిః స్వరూపాభి ర్మ్రుగీభిః పరివారితమ్ ఆకృష్ట ఘ్రాణ పుటకా జిఘ్రంత స్తా స్తతో మృగీః ఉవాచ స మృగోలం వో లజ్జా త్యాగేన గమ్యతామ్
మార్కండేయుడు:
జీవుల భాషను ఎరిగిన అపరాజితుడగు స్వరోచి, వారి యొక్క ఈ సంభాషణ వినిన తోడనే లజ్జితుడై చింతింప సాగెను. “ఈ పక్షులు ఏ విషయములను చెప్పినవో, అవి సత్యము. ఇందు ఏ మాత్రము అసత్యము లేదు”. అని ఇట్లు చింతించుచు భార్యలతో ఆ మహా శైలమందు విహరించు చుండ, స్వరోచికి నూరు వత్సరములు గడచెను. ఒకనాడు భార్యలతో విహరించు చుండగా, నాతని సమీపమున నునుపైన స్థూలమగు శరీరములు, పుష్టి గల జింకల గుంపుతో విహరించు చున్న ఒక మృగమును చూసెను. ఆ మృగము తనతో సమానముగా నున్న ఆడు జింకల గుంపు నందు పడుకొని యుండెను. అప్పుడు ఆడు జింకలు నాసిక జాపి మొగ జింకను వాసన చూడసాగెను. ఇట్లు చేయుట చూసి ఆ మృగము వాటితో ఇట్లనెను. కామినులారా! మీరు సిగ్గును విడచితిరి. అందుచేత ఇతర ప్రదేశములకు పొండు.
నాహం స్వరోచి స్తచ్చీలో న చైవాహం సులోచనాః
నిర్తజ్ఞా బహవ స్సంతి తాదృశా స్తత్ర గచ్చత ఏకా త్వనేకానుగతా యథా హాసాస్పదం జనే అనేకాభి స్తథై వైకో భోగ దృష్ట్వా నిరీక్షితః తస్య ధర్మక్రియా హాని రహస్యమాని జాయతే సక్తోన్య భార్యయా చాన్య కామాసక్త స్సదైవ నః య స్తాదృశోన్య స్తచీలః పరలోక పరాజ్ముఖః
తంకామయత భద్రం వో నాహంతుల్యః స్వరోచిషా
ఓ సులోచనురాలా! నేను స్వరోచిని గాను మరియు నా స్వభావము గూడ స్వరోచి వలె గాదు. స్వరోచి వలె సిగ్గు లేని వారు అనేక మంది లాభించ గలరు. వారి వద్దకు పొండు. ఏ విధముగా ఒక స్త్రీ అనేక మంది పురుషులతో అనురాగము కలిగి యుండిన జన సమాజము నందు హాస్యాస్పదముగా నుండునో, అట్లే ఒక పురుషుడు అనేక మంది రమణులతో భోగించు దృష్టి కలిగిన హాస్యాస్పదముగా నుండును. అట్టి పురుషుని యొక్క నిత్య నైమిత్తిక క్రియలకు హాని కలుగును. అట్టి పురుషుడు ఒక భార్యను పొందియు ఇతర భార్యా సంగమమును ఎల్లప్పుడూ కోరు చుండును. అందు వలన స్వర్గ లోక పరాజల్మఘ డైన స్వరోచి యొక్క స్వభావము గలవారు ఇతరులెవరైనా యున్నచో వారిని కోరుకొనుడు. మీకు మంగళమగు గాక. నేను స్వరోచి తుల్యుడ గాను.
Summary of chapter 62 of the Mārkandeya Mahā Purana is as follows:
When Svarūpa refused Varūthinī's romantic overtures to maintain his Vedic vows, a Gandharva named Kali disguised himself as Svarūpa and united with her. From this union was born Svarochis, a youth endowed with extraordinary radiance, mastery over languages, and knowledge of all weapons.