మార్కండేయ మహా పురాణము
93 - రౌచ్య మన్వంతరము నందు రుచ్యుపాఖ్యానమున రుచి కృత పితృ స్తవము
మార్కండేయుడు:
స తేన పితృ వాక్యేన భృశ ముద్విగ్న మానసః కన్యాభిలాషీ విప్రర్షిః పరిబభ్రామ మేదినీమ్ కన్యా మలభమానో సౌ పితృ వాక్యాగ్ని దీపితః చింతా మవాప మహతీ మతీవోద్విగ్న మానసః కిం కరోమి? కవ గచ్చామి? కథం మే దారసంగ్రహః క్షిప్రం భవే త్పితౄణాం యో మమాభ్యుదయ కారకః ఇతి చింతయత స్తస్య మతి ర్జాతా మహాత్మనః తపసారాధయామ్యేనం బ్రహ్మాణం కమలోద్భవమ్ తతో వర్షశతం దివ్యం తపస్తేతే స వేధసమ్ దిదృక్షుః సుచిరం కాలం పరం నియమ మాస్థితః
మార్కండేయుడు:
విప్రర్షి యగు యా ఋషి యట్లు పితృ దేవతల మాటలను విని మిక్కిలి యుద్వేగ మనస్కుడై కన్యాభిలాషతో భూమండలమున తిరుగు చుండెను. పితృ వాక్య రూపమగు సగ్ని చేదేప్తుడై కన్య లభించక పోవుటచే అత్యంత ఉద్విగ్న మనస్సుతో మిక్కిలి చింతను బొందెను. “ఏమి చేయను? ఎక్కడికి బోదును? ఏమి చేసిన నా పితరులకు అభ్యుదయము కలిగించు భార్యా పరిగ్రహణము శీఘ్రముగా సంపన్న మగును?” అని ఇట్లు చింతించు చుండ ఆ మహాత్మునికి “నేను తపస్సుచే భగవంతుడు కమల సంభవుడు నగు బ్రహ్మ దేవుని ఆరాధించెదను.” అను బుద్ధి కలిగెను. అప్పుడు అత్యంత నియమముతో చాలా కాలము బ్రహ్మ దర్శనాభిలాషియై నూరు దివ్య సంవత్సరములు తపస్సు చేసెను.
తతః స్వం దర్శయామాస బ్రహ్మలోక పితామహః ఉవాచ తం ప్రసన్నోస్మి త్యుచ్యతా మభివాఞ్ఛతమ్ తతోసౌ ప్రణిపత్యాహ బ్రహ్మాణం జగతో గతిమ్ పితౄణాం వచనాత్తేన యత్కర్తు మభివాఞ్ఛతమ్ బ్రహ్మా చః రుచిం విప్రం శ్రుత్వా తస్యాభివాఞ్ఛతమ్
పిమ్మట లోక పితామహుడగు బ్రహ్మ దేవుడు రుచికి తన స్వరూపమును కనబర్చెను. “నేను ప్రసన్నుడనైతిని.” ఇప్పుడు నీవు నీయభీష్టమగు కోరికను చెప్పమనెను. అప్పుడు రుచి జగధారదా భూతుడగు బ్రహ్మ దేవునికి నమస్కరించి, పితృ దేవతల వచనానుసారముగా తన కోరికను విన్నవించెను. తరువాత బ్రహ్మ విప్రర్షియగు “ఋచి” యొక్క కోరికను విని యిట్లు పలికెను.
బ్రహ్మ:
ప్రజాపతి స్త్వం భవితా స్రష్టభ్యా భవతా ప్రజాః సృష్ట్వా ప్రజాః సుతా న్విప్రః సముత్పాద్య క్రియా స్తథా కృత్వా కృతాధికార స్త్వం తతః సిద్ధి మవాప్స్యసి స త్వం యదోక్తం పితృభిః కురు ధారా పరిగ్రహమ్ కామం చేమ మభిధ్యాయ క్రియతాం పితృ పూజనమ్ త ఏవ తుష్టాః పితరః ప్రదాస్యంతి తవేప్సితాన్ పత్నీం సుతాంశ్చ సంతుష్టాః కిం న దద్యుః పితామహాః
బ్రహ్మ:
విప్రా! నీవు ప్రజాపతివి అగుదువు గాక. నీ వలన ప్రజలు కలుగుడురు గాక. ప్రజలను సృష్టించి సంతానోత్పాదన పూర్వకముగా సమస్త క్రియలను చేసిన తరువాత సిద్ధిని పొందుదువు గాక. ఈ కారణము చేతనే పితృ దేవతలు నిన్ను “వివాహము చేసు కోనుము” అని చెప్పిరి. “వారి వచనము తప్పక చేయ దగినది” అని నిశ్చయించుకొని నీవు పితృ పూజ జేయుము. ఆ పితృ గణము సంతుష్టి చెంది నీకు అభీష్టములను ప్రసాదించెను. పితామహులు కోరిన భార్యా పుత్రులను అనుగ్రహించెదరు.
మార్కండేయుడు:
ఇత్యృషే ర్వచనం శ్రుత్వా బ్రాహ్మణో వ్యక్త జన్మనః నద్యా వివిక్తే పులినే చకార పితృతర్పణమ్ తుష్టావ చ పితౄ న్విప్రః రేభి స్తథాకృతః ఏకాగ్రః ప్రయతో భూత్వా భక్తి నమ్రాత్మకంధరః
మార్కండేయుడు:
అవ్యక్త జన్మయగు బ్రహ్మ చెప్పిన యిట్టి వాక్యములను విని ఋచి ఏకాంతమగు నొక నదీ తీరమున తర్పణము కలుగజేసెను. ద్విజోత్తమా! ఆ ఋచి ఆచార యుక్తుడు, ఏకాగ్ర చిత్తుడు, శ్రద్ధా సహితుడు భక్తిచే శిరస్సు నంచిన వాడును, రెండు చేతులు జోడించి శిరస్సు యందు అంజలి ఘటించిన వాడునునై ఇట్లు స్తోత్రము చేయ సాగెను.
రుచి:
నమస్యేహం పితౄఞ్ఛ్రాద్దే వన స్తధిదేవతాః దేవైరపి హి తత్ప్ర్యంతే యే చ శ్రాద్దే స్వదోత్తరైః నమస్తేహం పితౄ న్స్వర్గే యే తత్ప్ర్యన్తే మహర్షిభిః శ్రాద్దే ర్మనోమయై ర్హక్త్యా భుక్తి ముక్తి మభీప్సుభిః నమస్తేహం పితౄ న్స్వర్గే సిద్ధాః సన్తర్పయంతి యాన్ శ్రాద్దేషు దివ్యైః సకలై రుపహారై రనుత్తమైః
రుచి:
శ్రాద్ధ కర్మ యందు ఆధి దేవతా రూపమున ఎవరు నివసించు చున్నారో, దేవతలు కూడా శ్రాద్ద కర్మ యందు స్వాహాకారముతో ఎవరిని తృప్తి చెందించు చున్నారో, అట్టి పితరులకు నేను నమస్కరించు చున్నాను. స్వర్గ మందు భుక్తి ముక్తుల యందలి అభిలాషతో మనోమయ శ్రాద్ధ కర్మచే మహర్షి గణములు భక్తీ పూర్వకముగా ఎవరిని తృప్తి బొందించుదురో, ఆ పితరులకు నమస్కారము జేసెదను. స్వర్గ మందలి సిద్ధ గణము శ్రాద్ధ సమయమున దివ్యములు, అత్యుత్తములు నగు సకల ఉపాహారములచే ఎవరిని తృప్తి బొందించుదురో, ఆ పితృ దేవతలకు నేను నమస్కరించెదను.
నమస్యేహం పితౄ నృక్త్యా యేర్చ్యన్తే గుహ్యకైరపి తన్మయత్వేన వాఞ్ఛద్భి రృద్ధి మాత్యన్తికీం పరామ్ నమస్యేహం పితౄ న్మర్త్యై రర్చ్యంతే భువి యే సదా శ్రాద్దేషు శ్రద్ధయాభీష్ట లోక ప్రాప్తి ప్రదాయినః నమస్యేహం పితౄ న్విప్రై రర్చ్యన్తే భువి యే సదా వాఞ్ఛితా భీష్ట లాభాయా ప్రజాపత్య ప్రదాయినః నమస్యేహం పితౄ న్విప్రై ర్నైష్టిక వ్రత చారిభిః యే సంయతాత్మభి ర్నిత్యం సంతర్ప్యన్తే సమాదిభిః నమస్యేహం పితౄ న్యేవై తర్ప్యన్తేరణ్య వాసిభిః వన్యైః శ్రాద్ధై ర్యతాహారై స్తపో నిర్ధూత కిల్భిషైః
అత్యంత సమృద్ధి కొరకు గుహ్యక గానము తన్మయ భావముతో భక్తి సహితులై ఎవరిని అర్చించెదరో, అట్టి పితృ దేవతలకు నమస్కారము. భూలోక మందలి జనులు శ్రాద్ధ కర్మ చేసినచో శ్రద్ధతో చేసిన యట్టి వారికి అభిష్ట ఫలము నిచ్చు పితృ గణములకు నమస్కరించు చున్నాను. ప్రాజాపత్య పదవీ ప్రదాతలగు పితృ గణములకు కోరిన లోకములు యిచ్చునట్టి పితరులను, ఎవరు శ్రద్ధా సహితులై అర్చన గావించెదరో ఆ పితృ దేవతలకు వందనములు. అరణ్యవాసులు, నియతాత్ములు, నైష్టిక బ్రహ్మచారులు, తపస్సుచే సమస్త పాపములు నశింప చేసి కొన్నవారు నగు బ్రాహ్మణులు సమాధిలో ఎవరిని తృప్తి బొందించెదరో, అట్టి పితరులకు నమస్కరించు చున్నాను. మరియు అరణ్య వాసులు అరణ్య మందలి పదార్థములచే సంతర్పణము చేసి ధన్యులగు చున్నారో, ఆ పితృ దేవులకు నమస్కారము చేయు చున్నాను.
నమస్యేహం పితౄఞ్చ్రద్దై రాజన్యా స్తర్పయన్తి యాన్ కవ్యై రశేషై ర్విధివ ల్లోక త్రయ ఫల ప్రదాన్ నమస్యేహం పితౄన్వైశ్యై రర్చ్యంతే భువి యే సదా స్వకర్మాభిరతై ర్నిత్యం పుష్ప దూపాన్న వారిభిః నమస్యేహం పితౄ ఞ్చ్రూద్ధై ర్యే శూద్రై రాపి భక్తితః సంతర్స్యన్తే జగత్యత్ర నామ్నా ఖ్యాతః సుకాలినః నమస్యేహం పితౄ ఞ్చ్రూద్ధై పాతాలే యే మహాసురైః సంతర్స్యన్తే స్వధాకారై స్త్యక్త దమ్భమదైః సదాః నమస్యేహం పితౄ ఞ్చ్రూద్ధై రర్చ్యన్తే యే రసాతలే భోగై రశేషై ర్విధివ న్నాగైః కామా నభీప్సుభిః
క్షత్రియ జనులు లోక మందలి ఫలముల నొసంగి పితృ దేవతలను శ్రద్ధా పూర్వకముగా శ్రాద్దాన్నముచే తృప్తిచేయు చున్నారో, అట్టి పితరులను నమస్కరింతును. స్వధర్మ మందు ఆసక్తులగు వైశ్యులు భూలోకమున ఎవరిని పుష్ప, ధూప, దీప, అన్న జలాదులచే సంతుష్టి కలుగ జేయు చున్నారో, ఆ పితరులకు వందనము చేసెదను. మర్త్య లోక మందలి శూద్ర జనము “సుకాలీన” నామముచే విఖ్యాతులగు పితరులను భక్తి శ్రద్ధలతో తృప్తి చేయు చున్నారో, అట్టి పితృ గణమునకు నమస్కారము. పాతాళ లోకమున మద దంభ రహితులయి మహాసురులు స్వధాకారములచే పితృ గణములను శ్రాద్ధముచే ఎల్లప్పుడూ తృప్తి చేయుదురో, ఆ పితరులకు నమస్కరించెదను. రసాతల లోక మందు కామాభిలాషులగు నాగకులములు శ్రాద్ధ కర్మచే ఎవరిని సంతుష్టి కలిగించి అశేష భోగములను సంపత్తులను అనుభవించు చున్నారో, అట్టి పితృ దేవతలకు నేను నమస్కరించెదను.
నమస్యేహం పితౄ ఞ్చ్రూద్ధైః సర్పైః సన్తర్పితా స్సదా తత్రైవ విధివ న్మన్త్ర భోగ సమ్ప త్సమన్వితైః పితౄ న్నమస్యే నివసంతి సాక్ష్యా ద్యే దేవలోకే చ తథాన్తరిక్షే మహీతలే యే సురాధిపూజ్యాంస్తే మే ప్రతీచ్చాస్తు మయోపనీతమ్ పితౄ న్నమస్యే పరమాత్మ భూతా యేవై విమానే నివసంతి మూర్తాః యజన్తి యా నస్తమలై ర్మనోభి ర్యోగీశ్వరాః క్లేశ విముక్తి హేతూన్ పితౄ న్నమస్యే దివి యేచ మూర్తాః స్వధా భుజః కామ్య ఫలాభిసన్ధౌ ప్రదానశక్తా సకలేస్సితానాం, విముక్తిదా యేనభిసంహితేషు తుష్యంతు తేస్మి న్పితరః సమస్తా, ఇచ్చావతాం యే ప్రదిశంతి కామాన్ సురత్వ మింద్రత్వ మతోధికం వాసుతా న్పశూ న్స్వాని బలం గృహాణి
మంత్ర, భోగ,సంపత్తులు గల సర్పగణము పాతాళ మందు ఎల్లప్పుడు ఏ పితృ దేవతలను శ్రాద్ధముచే విధి ప్రకారము సంతుష్టుల జేయురో, ఆ పితరులకు నమస్కారము జేసెదను. దేవలోకమున అంతరిక్షమున ప్రత్యేకముగా నివసించు వారు, భూతలమున దేవతలచే పూజింపబడు వారును అగు ఆ పితరులకు ప్రణామము జేయుదును. ఆ పితృ దేవతలు నేను జేయు పూజను గ్రహించెదరు గాక. పరమాత్మ స్వరూపులు, మూర్తిమంతులునయి విమాన మందు నివసించు వారును యోగీశ్వరులు విమల మనస్కులై క్లేశ విమోచకమగు జ్ఞానము ద్వారా యజ్ఞమున ఎవరిని పూజించెదరో, ఆ పితరులకు నా వందనము. స్వర్గమున మూర్తిమంతులై కామ్య ఫలప్రాప్తి యందు స్వధా భోజులు అగుదురు. కోరిన వారికి కోర్కెల నొసంగుము. నిష్కాములకు ముక్తి ప్రదులయ్యెదరు. అట్టి పితృ దేవులకు నా అంజలి ఘటించెదను. కోరిన వారికి కొంగు బంగార మగుదురు. దేవత్వము గాని ఇంద్ర పదవి గాని యిచ్చెదరు. ఇంతకన్నా అధికముగా గావలెనన్న అనుగ్రహించెదరు. పుత్ర, పశు, అర్థ, బల, గృహముల నేవి కోరినను యిచ్చెదరు. ఇట్టివారు పితృ దేవతలు నా పూజచే సంతుష్టి బొందుదురు గాక.
సోమస్య యే రశ్మిషు యేర్కబింబే, శుక్లే విమానే చ సదా వసంతి తృప్యంతు తేస్మి న్పితరో న్నతోయై, ర్గందాదినా పుష్టి మీతో ప్రజంతు యేషాం హుతేగ్నౌ హవిషా చ తృప్తి,ర్యే భుఞ్జతే విపర శరీర నంస్థాః యే పిండదానేన ముదం ప్రయాంతి, తృప్యంతు తేస్మి న్పితరో న్నతోయైః యే ఖడ్గమాంసేన సురై రాభీష్టైః , కృష్ణై స్తిలై ర్దివ్య మనోహరైశ్చ కాలేన శాకేన మహర్షి వర్త్యేః , సంప్రీణితా స్తే ముద మాత్రా యాన్తు కవ్యా న్య శేషాణి చ యాన్యభీష్టా న్యతీవ తేషా మమరార్చితానామ్ తేషాం తు సాన్నిధ్య మిహాస్తు పుష్ప, గంధాన్న భోజ్యేషు మయా కృతేషు దినే దినే యే ప్రతి గృహ్ణాతేర్చా, మాస్థా త పూజ్యాం భువి యేష్టకాసు యే వత్సరాంతేభ్యుదయే చ పూజ్యాః, ప్రయాంతు తే మే పితరో త్ప్రతృప్తిమ్
చంద్ర కిరణము లందు సూర్య బింబ మందు తెల్లని విమాన మందు ఎల్లప్పుడూ నివసించు చుండెడి పితృ దేవతలు నేను సమర్పించు అన్న తోయ, గంధాదులచే పుష్టిని పొంది సంతుష్టి గలవార లగుదురు గాక. పితృ దేవతలు అగ్ని యందు ఆజ్యాహుతులచే తృప్తి బొందుదురు మరియు బ్రాహ్మణ శరీరము లందు ఆవేశించి భోజనము చేయుదురు. పిండ ప్రధానముచే సంతుష్టు లగుదురు. నేను సమర్పించు ఈ అన్న జలాదుల వలన సంతృప్తులయ్యెదరు గాక. పవిత్ర కాలము నందు దేవతలు ఇచ్చు ఖడ్గ మృగ మాంసము చేతను దివ్యములు మనోహరములగు కృష్ణ తిలల చేతను, మహర్షులు సమర్పించు కాలశాకము (కరివేపాకు) చేతను త్రుప్తులగు పితృ దేవతలు ఇచ్చట సంతుష్టు లగుదురు గాక. దేవతలచే అర్చితులగు పితృ గణములకు అభీష్టంబగు కవ్యములో, నేను వాటితోనే తృప్తి చేయుదును. పుష్ప, గంధ, అన్న, భోజ్యములతో తృప్తులై నా సాన్నిధ్యమునకు దయ చేయుదురు గాక. కొందరు ప్రతి దినము అర్చించెదరు. కొందరు ప్రతి మాసము, కొందరు ప్రతి సంవత్సరాంతము, అభ్యుదయ కాలమునను అర్చింతురు. అట్లు చేయు వారి పూజ లన్నింటిని స్వీకరించి తృప్తులైన భంగి నా పూజను గూడ గ్రహించి తృప్తులగుదురు గాక.
పూజ్యా ద్విజానాం ముదేస్తుఖాసో యే క్షత్రియాణాం చ నవార్కవర్ణాః తధా విశాం యే కనకావదాటా, నీలినిభాః శూద్ర జనన్య యే చ తేస్మి న్నమస్తా మమ పుష్ప, గంధ, దూపాన్న తోయాది నివేదనేన తథానుగ్ని హోమేన చ యాంతు తృప్తిం, సదా పితృభ్యః ప్రణతోస్మి తేభ్యః యే దేవపూర్వా ణ్యతితృప్తి హేతో, రశ్నంతి కావ్యాని శుభాహుతాని తృప్తాశ్చ యే భూతిసృజో భవంతి, తృప్యంతు తేస్మి న్ప్రణతోస్మి తేభ్యః రక్షాంసి భూతా న్యసురాం స్తథోగ్రా, నిర్నాశయస్త న్త్వశివం ప్రజానామ్ ఆద్యాః సురాణా మమరేశ పూజ్యా, స్త్రుప్యంతు తేస్మిన్ ప్రణతోస్మి తేభ్యః అగ్నిష్వాత్తా బర్షిషదః ఆజ్యపాః సోమపా స్తథా ప్రజంతు తృప్తిం శ్రాద్దేస్మి న్సితర స్తర్పితా మయా
ఏ పితృ గణాలు కుముద చంద్రుల వంటి శుక్ల వర్ణ ప్రభాయుక్తులై దేవతలకు పూజ్యులగు చున్నారో, ఎవరు కొత్తగా ఉదయించు చున్న సూర్యుని వలె రక్త వర్ణ యుక్తులై క్షత్రియులకు పూజ్యులగు చున్నారో, ఎవరు కనకము వాలే సుందర కాంతి యుక్తులై వైశ్యులకు పూజ్యులగు చున్నారో, ఎవరు నీల వర్ణము వారై శూద్రులకు పూజ్యులగు చున్నారో, అట్టి పితృ గణాలు నాచే ఇవ్వ బడుచున్న పుష్ప, గంధ, ధూప, అన్న, జాలాది నివేదనము మరియు అగ్ని హోమాదులచే నా వలన తృప్తిని పొందుదురు గాక. నేను సదా ఆ పితరులకు నమస్కరించు చున్నాను. ఎవరు అతి తృప్తికి దేవతల ముందు ఆహుతులై సమస్త శుభ కావ్యములను భుజించు దురో ఎవరు తృప్తులై అణిమాది అష్టైశ్వర్యములను సృష్టించెదరో, అట్టివారు నాచే త్రుప్తులగుదురు గాక. నేను వారికి నమస్కరించు చున్నాను. ఎవరు రాక్షస, హోట, ఉగ్ర రాక్షసుల యొక్క ఘాతుకములను ప్రజల యొక్క అమంగళమును నాశనము చేయుదురో, ఎవరు దేవతలకు ఆదిపురుషులై యున్నారో, ఎవరు అమర్వీరుడగు ఇంద్రునికి పూజ్యులగు చున్నారో, అట్టి పితృ గణాలు నాచే త్రుప్తు లగుదురు గాక. నేను వారికి నమస్కరించు చున్నాను. అగ్నిష్వ్యాత్త, బర్హిషద, ఆజ్యప, సోమప పితృగణాలు నాచే అర్చింప బడి ఈ శ్రాద్ధము నందు తృప్తిని పొందుదురు గాక.
అగ్నిష్వాత్తా పితృ గణాః ప్రాచీం రక్షంతు మే దిశమ్ తథా బర్హిషదః పాంతు యాఖ్యాం యే పితరః స్మృతాః ప్రచీతి మాజ్యపా స్తద్వా దుదీచి మపి సోమపాః రక్షో భూత పిశాచేభ్య స్తధైవాసురదోషతః సర్వతశ్చా ధిప శ్తేషాం యయో రక్షాం కరోతు మే విశ్వో విశ్వభుగారాధ్యో ధర్మో ధన్య శుభాననః భూతిదో భూతికృ ద్భూతిః పితౄణాం యే గణా నవ కల్యాణః కల్యతా కర్తా కల్యః కాల్వ తరాశ్రయః కల్యతాహేతు రనఘః షడిమే తే గణాః స్మృతాః వరో వరేణ్యో వరదః పుష్టిద స్తుష్టిద స్తథా
అగ్నిష్వాత్త పితరులు నన్ను, తూర్పు దిక్కు నందు, బర్హిషద పితరులు దక్షిణ దిక్కు నందు రక్షింతురు గాక. ఆజ్యప పితరులు మరియు సోమ పితృ గణాలు క్రమముగా పశ్చిమ, ఉత్తర దిక్కులా యందు రాక్షస, భూత, పిశాచ, అసురోత్పన్న దోషముల నుండి రక్షించు చుందురు గాక. విశ్వ, విశ్వభుక్, ఆరాధ్య, ధర్మ, ధన్య, శుభానన, భూతిద, భూతికృత్, భూతి అను ఈ తొమ్మిది సంఖ్య గల పితృ గణాలు కలవో, ఆ గణాలకు అధిపతి యగు యముడు అన్ని దిక్కుల యందు నన్ను రక్షించు గాక. కళ్యాణ, కల్యాతా, కర్త, కల్య, కల్యతరాశ్రయ, కల్యతా హేతు, అనఘ అను ఈ ఆరు గణాల ఏ పితృ దేవతలు కలరో, మరియు ఏ పితరుల యోక్క వర, వరేణ్య, వరద, పుష్టిద, తుష్టిద
విశ్వపాతా తదా ధాతా సప్తై వైతే తథా గణాః మహాన్మహాత్మా మహితో మహిమానా న్మహాబలః గణాః పఞ్చ తధైవైతే పితౄణాం పాపనాశనాః సుఖదో ధనద శ్చాన్యో ధర్మదో న్యశ్చ భూతిదః పితౄణాం కథ్యతే చైత త్తదా గణచతుష్టయమ్ ఏక త్రింశ త్పితృ గణా యై ర్వ్యాప్త మఖిలం జగత్ తేమే నుతృప్తా స్తుష్యంతు యచ్చంతు చ సదా హితమ్
విశ్వపాత, ధాత అను సప్తవిధ గణాలున్నవో. ఏ పితరుల యొక్క మహాన్, మహాత్మా, మహిత, మహిమావాన్, మహాబల అను ఈ ఐదు పాపనాశకము లగు గణాలున్నవో, ఇవి అన్నియు కలిపి మొత్తము ముప్పది ఒకటి గణాలు. ఇవి జగత్తంతయు వ్యాప్తి చెంది యున్నవి. వీరందరు నాచే తృప్తులై నన్ను సంతుష్టుని చేయుదురు గాక. నాకు సదా హితము చేయుదురు గాక.
Summary of chapter 93 of the Mārkandeya Mahā Purana is as follows:
Sage Medhā concludes the narration of the Devī Māhātmya to King Suratha and the merchant Samādhi. Moved to intense devotion, both go to the riverbank, construct a clay murti of the Goddess, and perform rigorous penance for three years. The Mother appears and grants King Suratha the restoration of his kingdom and the boon to become Sāvarṇi Manu in the next epoch, while Samādhi receives pure spiritual illumination and eternal liberation.