133 - దమ చరితము నందు వపుష్మానుని వధ

మార్కండేయుడు:

ఇతి ప్రతిజ్ఞాయ తదా నరిష్యంత సుతో దమః

కోపామర్ష వివృత్తాక్షః శ్మశ్రు మావృత్య పాణినా.

హా! హతోస్మీతి పితరం ధ్యాత్వా దైవం వినింద్య చ

ప్రోవాచ మంత్రిణః సర్వా అనినాయ పురోహితమ్.

మార్కండేయుడు:

నరిష్యంతుని  పుత్రుం డగు దముడు ఈ విధముగా ప్రతిన బూని క్రోధముచే రక్త వర్ణమును దాల్చిన నేత్రములతో మీసములు మెలి త్రిప్పెను. “హా! హతోస్మి” అని తండ్రిని గూర్చి చింతించుచూ దైవ నింద చేయ సాగెను. పిమ్మట పురోహితులను పిలిపించి మంత్రు లందరి సమక్షమున ఇట్లు చెప్పెను.

దముడు:

యదత్ర కృత్యం తాద్ర్చూత తాతే ప్రాప్తే సురాలయమ్.

శ్రుతం భవద్భి ర్యత్రోక్తం తేన శూద్ర తపస్వినా.

వృద్ద స్తపస్వీ స నృపో వానప్రస్థవ్రతే స్థితః

మౌనవ్రత ధరోశస్త్రో మన్మాత్రా చెందశ్రేనయా.

ప్రాక్తం సంసృష్టయా స్వాత్మ్య ద్యాథాతథ్యం వపుష్మతే

 తేనాపి ఖడ్గ మాకృష్య జటాః సవ్యేన ప్రాణినా.

ధృత్వా జఘాన దుష్టాత్మా లోకనాధ మునాధవాత్

మాతా చ సందిశ్య హి మాం ధిక్చబ్ధం బ్రువతీ సతీ.

మందభాగ్యం చ ని శ్శీకం ప్రవిష్టా హవ్యవాహనమ్

త మాలింగ్య నరిష్యంతం ప్రయాతా త్రిదశాలయమ్.

దముడు:

‘తండ్రి గారు స్వర్గమునకు బోయిరి. శూద్ర తపస్వి చెప్పిన దంతయు మీరు విని యున్నారు. ఇప్పుడు ఈ సమయమున ఏమి చేయ వలెనో దానినే మీరు తెలియ జెప్పుడు.’ ఆ రాజు వృద్దావస్థ యందు వాన ప్రస్థ వ్రతుడై, తపస్వియై మౌన వ్రతుడై యుండెను. వపుష్మానుడు అడిగిన దానికి నా తల్లి యగు ఇంద్రసేన, వపుష్మానునకు అంతయు యదార్ధముగా తెలిపెను. అప్పుడా దురాత్ముడు ఖడ్గమును లాగి వామ హస్తముతో, లోకనాథుని అనాథుని వలె పట్టుకొని చంపి వేసెను. సతియగు నా తల్లి నన్ను మంద భాగ్యునిగా, ధన హీనునిగా తిరస్కరించుచూ నా తండ్రి యగు నరిష్యంతుని కౌగిలించుకొని అగ్ని ప్రవేశము చేసి స్వర్గమునకు వెళ్ళెను.

సోహ మద్య కరిష్యామి యన్మే మాతు రుదీరితమ్

హస్త్యశ్వ రథ పాదాతం సైన్యం చ పరికల్ప్యతామ్.

అనిర్వాప్య పితు ర్త్వేర మహాత్వా పితృఘాతకమ్

అకృత్వా చ వచో మాతు ర్జీవితుం కిమిహోత్సహే.

“నా తల్లి ఏ విధముగా అజ్ఞాపించినదో, నేను దాని  ననుసరించి కార్యమును చేయుదును. ఏనుగులు, గుఱ్ఱములు, రథములు, పాదచారులతో చతురంగ బలమును సమాయిత్తము చేయుడు.” తండ్రి యొక్క వైరమును తీర్చుకొనక పితృ ఘాతకుని వదింపక, తల్లి ఆజ్ఞను పాటింపక జీవించుట కెట్లు ఉత్సాహ పడుదును?”

మార్కండేయుడు:

మంత్రిణ స్తద్వాచః శ్రుత్వా హాహే త్యుక్త్వా తథా చ తత్

కృతవంతో విమాన సః సభృత్య బలవాహనాః

మార్కండేయుడు:

మంత్రులు ఆతని వచనములు విని హాహా కారములను చేయుచు దుఃఖమును పొంది, నిమనస్కులైరి. రాజు అజ్ఞాను సారము వారు భృత్యులు, సైన్యములు, వాహనముల సహితముగా, సిద్దమయిరి.

నిర్యయు స్సపరీవారాః పురస్కృత్య దమం నృపమ్

గృహీత్వా చాశిషోవిప్రా త్త్రికాలజ్ఞాత్ పురోధసః

ఆహిరాడివ  నిశ్వస్య దమః ప్రాయా ద్వాపుష్మతమ్

సీమాపాలాది సామంతా న్నిఘ్నన్ యామ్యాం దిశి త్వరా.

నిరీశ్యం తం సమాయాంతం వపుష్మా న్మర్ష పూరిత.

సంక్రందన సుతేనాపి దమో జ్ఞాతో వపుష్మతాః.

ఆ యాతః సపరీవారః సామాత్యః సపరిచ్చదః.

ఆక పితేన మనసా స సైన్యాని దిదేశ హ

దూతం చ ప్రేషయామాస నిర్గమ్య నగరా ద్భహిః.

త్వం శీఘ్రతర మాగచ్చ నరిష్యంతః ప్రతీక్షతే

సభార్యః క్షత్ర బందో! త్వం సమయాహి మమాంతికమ్.

ఇట్లు దముని పురస్కరించుకొని మంత్రులు సపరి వారముగా బయలు దేరిరి. అప్పుడు దముడు కూడ త్రికాలజ్ఞులగు పురోహితుల ఆశీర్వాదమును పొంది, నాగరాజు వలె భుసలు కొట్టుచు సీమలను పాలించు నట్టి సామంతులను నాశనము చేయుచు శీఘ్రముగా వపుష్మానుని కొరకు దక్షిణ దిక్కునకు బోయెను. పరివార, కుటుంబ, అమాత్య గణ సహితముగా తన దేశమునకు దముడు వచ్చినాడన్న వార్త విని సంక్రందనుని పుత్రుడగు వపుష్మానుడును ఆశ్చర్యముతో, విచలిత మనస్కుడై తన సైన్యమును యుద్దము చేయుటకు ఆజ్ఞాపించెను. మఱియు నగరము వెలుపలికి వెళ్లి ఇట్లు ప్రకటింప మని దూతను పంపెను. ఓరీ క్షత్రియాధమా! నీవు త్వరగా రమ్ము. భార్యా సహితుడై నరిష్యంతుడు నీకై నిరీక్షించు చున్నాడు. నీవు శీఘ్రముగా నా సమీపమునకు రమ్ము.

ఇమే మద్భాహు నిర్ముక్తాః సితా బాణా పిపాసితాః

భిత్వా శరీరం సంగ్రామే పాస్యంతి రుధిరం తవ.

శ్రుత్వా దమస్తు తత్సర్వం  దూత ప్రోక్తం యయౌ త్వరన్

 స్మృత్వా ప్రతిజ్ఞాం పూర్వోక్తా న్నిశ్వస న్నురగో యథా.

ఆహూతః సమరే చైవ పుమా న్సేనా వికత్ధనః

తతో యుద్ద మతీవాసీ ద్దమస్య చ వపుష్మతః.

రథీ చ రథినా నాగీ నాగినా హయినా హయీ

ఆయుథ్యంత చ విప్రర్షే! తద్యుద్దం తుములం హ్యభూత్.

పశ్యతాం సర్వదేవానాం సిద్ద గంధర్వ రాక్షసామ్

చకంపే వాసుధా బ్రహ్మన్! విద్యమానే దమే యుథి.

“రుథిర దహముచే శిలల వంటి పదును గల నా ఈ బాణములు నాచే యుద్ద క్షేత్రమున విడువ బడినవై నీ శరీరమును చేదించి రుధిరమును త్రాగును.” దముడు దూతచే  ఈ వచనములు విని ముందుగా తాను చేసిన ప్రతిజ్ఞ స్మరణకు రాగా త్రాచు పాము వలె ఉచ్చ్వాసములను విడుచుచూ శీఘ్రముగా వెళ్ళెను. మరియు ఆతనిని సమరమునకు బిలచుచు ఇట్లనెను. “ప్రకృత పురుషుడైన వాడు ఎల్లప్పుడును ఆత్మను శ్లాఘించు కొనడు అనంతరము దముడు, వపుష్మానుల మధ్య ఘోర యుద్దము జరిగినది. రథికులతో రథికుల ఏనుగుల నధిరోహించిన వారితో అట్లే ఏనుగుల నధిరోహించిన వారు, అశ్వారోహులు యుద్దము చేయు చుండిరి. భయంకర మగు యుద్దము జరుగు చుండెను. ఓ విప్రర్షీ! సంపూర్ణ దేవ గణాలు, సిద్దులు, గంధర్వులు మరియు రాక్షస గణాలు చూచు చుండిరి. వారి ఎదుట ఈ విధముగా యుద్దము జరుగ సాగెను. ఓ బ్రాహ్మణుడా! ఎప్పుడయితే దముడు క్రోధ పూర్వకముగా యుద్దమును చేయుట యందు ప్రవృత్తు డయ్యెనో ఆ సమయమున భూమి అంతయు కంపించి పోయెను.

న గజో న రథీ నాశ్వ స్తస్య బాణ సహస్తు యః

తతో దమేవ యుయుధే సేనాధ్యక్షో వపుష్మతః

హృది వివ్యాధ చ దమ ఇషుణాగా ద్యమాంతికమ్

తస్మి న్నిపతితే సైన్యం పలాయన పరం హ్యభూత్.

స స్వామినం తతః ప్రహదమః శత్రుందమ స్తథా

క్వ యాసి దుష్ట! పితరం ఘాతయిత్వా తపస్వినమ్.

అశస్త్రం చ తపస్యంతం క్షత్రియోసి నివర్తతామ్

తతో నివృత్య స దమం యోధయామాస సానుజః.

సపుత్రః సహ సంబంధి బాంధవై ర్యుయుధే రథీ

తతః శరాసనా న్ముక్త బాణై ద్వ్యాప్తా స్తతో దిశః.

గుఱ్ఱములు, ఏనుగులు, రథములే కాదు. ఎవ్వరును అతని బాణములను సహింపలేక పోవు చుండిరి. వపుష్మానుని సైన్యము దమునితో యుద్దము చేయ సాగెను. దారుణ మగు దముని బాణములు ఛేదింప బడుచుండెను. సేనాపతి పడిపోవుటచే వపుష్మానుని సైన్య మంతయు పారి పోవుటకు ప్రయత్నించు చుండిరి. అప్పుడు శత్రువుల నణచునట్టి వాడగు దముడు “ఓరీ దుష్టుడా! తపస్వి యగు నా తండ్రిని చంపి నీవెక్కడికి పోయెదవు?”  నీవు శస్త్ర హీనుడు తపస్వి యగు నా తండ్రిని వధించితివి. నీవు క్షత్రియుడవు. అందు వలన ఆగుము. అనెను. అనంతరము వపుష్మానుడు తన అనుజుడును, పుత్ర సంబంధీకుల బంధవుల సహితముగా వెనుతిరిగి రథా రోహణము చేసి యుద్దము చేయ సాగిరి. అప్పుడు వపుష్మానునిచే విడువబడిన బాణములతో ఆకాశ మంతయు అచ్చాదింప బడెను.

దమం చ సరధం చాశు శరజాలై రాపూరయత్

తతః పితృ వదోత్థేన కోపేన స దమ స్తుథా.

చిచ్చేద తాచ్చరా న్త్సేషామ్ వివ్యాదాన్యైశ్చ తానపి

ఏకైనై కేన బాణేన సప్తపుత్రా న్త్సథా ద్విజ!

నంబంధి బాంథవా న్మిత్రా న్నివాయ యమ సాదనమ్

వపుష్మా న్సరధీ క్రోధా న్నిహతాత్మజ బాంధవః.

యుయుధే చ సతేవాజౌ శరై రాశీవిషోవమైః

చిచ్చేద తస్య తాన్భాణా న్స దమశ్చ మహామునే!

యు యుధాతే చ సంరబ్దౌ పరస్పర జయైషిణౌ

పరస్ఫర శరాఘాత వచ్చిన్న ధనుషౌ త్వరా.

గృహీత ఖడ్గా పుత్తీర్య చిక్రీడాతే సుహాబలౌ

దమః క్షణం నృపం ధ్యాత్వా పితరం నిహతం రణే.

కేశేష్వాకృష్య చాక్రమ్య నిపాత్య ధరణీ తలే

శిరో ధరాయాం పాదేన భుజ ముద్యమ్య చాబ్రవీత్.

మరియు బాణములచే వలను నిర్మించి ఆ వల ద్వారా అశ్వ, రథ సహితముగా దముని కప్పి వేసెను. అప్పుడు దముడును తండ్రిని వధించుట వలన కలిగిన కోపముచే. అతని బాణములను చేదించుచూ శత్రువుల అంగములను తన బాణములచే విచ్చిన్నము గావించు చుండెను. ఒక్కొక్క బాణముతో అతని ఏడుగురు పుత్రులను, సోదర సంబంధులను, బాంధవులను, మిత్రులను యమపురికి పంపెను. అప్పుడు రథము మాత్రమే మిగిలిన వపుష్మానుడు ఆత్మీయులు, బంధువులు  మరణించుటతో అత్యంత కృద్ధుడై అతి విషతుల్య మగు బాణములను వదలుచు దమునితో యుద్దము చేయ సాగెను. కానీ ఓ మహామునీ! దముడు ఆ బాణము లన్నియు త్రుంచి వేసెను. ఈ విధముగా అత్యంత క్రోధముతో పరస్పరము ఒకరి నొకరు వధింప వలెనను కోరికచే దారుణముగా యుద్దము చేయసాగిరి. ఇద్దరును బలవంతులే క్రమముగా ఆ యిద్దరును శారాఘాతములచే ముక్క చెక్కలైన ధనుస్సులను వదలి ఖడ్గదారులై లేచి యుద్ద క్రీడను సల్పు చుండిరి. వనము నందు మరణించిన తండ్రిని క్షణకాలము తలచుకొని దముడు ఆతని కేశములు పట్టి లాగి ఆతనిని భూమిపై పడవేసెను మరియు అతని కంఠమును పాదముచే నొక్కిపట్టి తన హస్తములను పైకి చాపి ఇట్లనెను.

వశ్యంతు దేవతా స్సర్వా మానుషాః పన్నగాః ఖగాః

పాట్యమానం  చ హ్భదయం క్షత్రబంధో ర్వపుష్మతః.

ఏవ ముక్త్వాచ స దయా హృదయం చ వ్యదారయత్

పాతుకామశ్చ స సురైః క్షతజేన నివారితః.

తత శ్చకార తాతస్య రక్తే నైవోదక క్రియమ్

అనృణ్యం ప్రాప్య స పితుః పునః ప్రాయా త్స్వమందిరమ్.

వపుష్మతస్య మాంసేన పిండదానం చకార హ

బ్రాహ్మణా భోజయామాస రక్షః కుల సముద్భవాన్.

ఈ క్షత్రియాధమము డగు వపుష్మానుని హృదయమును చీల్చు చున్నాను. సమస్త దేవతలు, మనుష్యులు, సిద్దులు మరియు పన్నగములు పక్షులు అవలోకించుదురు గాక.” అని పలికి దముడు అతని హృదయమును చీల్చి వేసెను. మరియు అతని రక్తమును పానము చేయుటకు ఉద్యుక్తు డయ్యెను. అప్పుడు దేవతలు ఆతనిని వారించిరి. అప్పుడు ఆ రక్తముతో, అతడు తన తండ్రికి ఉదక క్రియలు సంపన్నము గావించెను. దముడు వుపుష్మానుని మాంసముచే పిండ ప్రదానము చేసెను. మరియు రాక్షస కులోత్పన్ను లగు బ్రాహ్మణులకు భోజనములు పెట్టెను. ఈ విధముగా తండ్రి గారి ఋణము నుండి విముక్తుడై తిరిగి తన రాజ్యమునకు మరలి వచ్చెను.

ఏవంవిధా హి రాజానో బభూవుః సూర్యవంశజాః

అన్యేపి సుధియః శూరా యజ్వినో ధర్మకోవిధాః

వేదాంగ పా గా స్తాం చ న సంఖ్యాతు మహోత్సహే

ఏతేషాం చరితం శ్రుత్వా నరః పాపైః ప్రముచ్యతే.

ఈ విధముగా పరాక్రమ వంతులగు రాజులు సూర్య వంశం నందు జన్మించిరి, ఇంకను అనేకులగు బుద్ది మంతులు, శూరులు, యజ్ఞము చేయు వారు. ధర్మాత్ములు, పండితులు పుట్టిరి. వేదాంత పారంగతులు ఎంత మంది కలిగిరో చెప్ప నలవి గాదు. వారిని ఇంత సంఖ్యా యని చెప్ప జాలము. ఈ దమ చరిత్రను శ్రవణము చేసిన మానవుడు అన్ని పాపముల నుండి విముక్తు డగును.