69 - ఔత్తమ మన్వంతర వృత్తాంతము

మార్కండేయుడు:

తతః స్వనగరం ప్రాప్య తం దదర్శ ద్విజం నృబః సమేతం భార్య యా చైవ శీలవత్యా ముదాన్వితమ్

మార్కండేయుడు:

అనంతరము ఉత్తమ మహా రాజు తన నగరమునకు చేరుకొని ఆ బ్రాహ్మణుడు సుశీలయగు భార్యతో హర్ష యుక్తుడై యుండుట చూచెను.

బ్రాహ్మణుడు:

రాజవర్యః కృతార్దోస్మి యతో ధర్మో హి రక్షితః ధర్మజ్ఞేనేహ భవతా భార్యా మానయతా మమ

బ్రాహ్మణుడు:

ఓ రాజశ్రేష్టా! నేను కృతార్థుడ నైతిని. ఎందుచేత ననగా మీరు ధర్మమూ నెరిగిన వారు కాబట్టి నా భార్యను తెచ్చి నా ధర్మాన్ని రక్షించితిరి.

రాజు:

కృతార్థ స్త్వం ద్విజ శ్రేష్ఠ నిజ ధర్మానుపాలనాత్ వయం సంకటినో విప్రః యేషాం వత్నీ న వేశ్మని

రాజు:

ఓ ద్విజ శ్రేష్టా! మీ ధర్మాన్ని మీరు పాలించి నందున మీరు కృతార్థు లైనారు. కాని ఓ విప్రా! నా గృహమున నా భార్య లేదు. అందుచేత నేను అత్యంత సంకట మందు పడితిని.

బ్రాహ్మణుడు:

నరేంద్రః సా హి విపినే భక్షితా శ్వాపదై ర్యది క్రోధస్య వశ మాగమ్య ధర్మోనా వేక్షిత స్త్వయా అలం తయా కిమన్యస్యా న ప్రాణి ర్గహ్యతే త్వయా సంతి రాజ్ఞాం గృహే కన్యాః శోభనా నృప నందనః

బ్రాహ్మణుడు:

ఓ నరేంద్రా! మీరు క్రోధమునకు వశులై ధర్మమును చూడ లేదు. ఒక వేళ ఆమెను వనము నందలి హింసక జీవులు భక్షించి నట్లయితే ఇప్పుడే మున్నది? ఒక వేళ నష్ట మైనచో ఆమెను కలియ వచ్చునను ఆశ వదలి వేరొక కన్యను వివాహము ఎందుకు చేసుకొనరు? ఓ నృప నందనా! కావలెనన్న రాజుల గృహముల యందు అనేక మంది కన్యలు ఉన్నారు.

రాజు:

న భక్షితా మే దయితా శ్యాపదైః సా హి జీవతి అవిదూషిత చారిత్రా కథ మేత త్కరోమ్యాహమ్

రాజు:

నా భార్యను హింసక జీవులు భక్షింప లేదు. ఇప్పటి వరకు విశుద్ధ చరిత్రతో జీవించి యున్నది. తిరిగి ఎట్లు నేనామెను గ్రహింతును?

బ్రాహ్మణుడు:

యది జీవతి తే భార్యా న చైవ వ్యభిచారిణీ

అపత్నీ కత్వతో జన్మ కిం పాపం క్రియతే త్వయా

బ్రాహ్మణుడు:

ఒకవేళ మీ భార్య ఇప్పటి వరకు అవ్యభి చారిణియై జీవించి యున్నచో మీరు పత్నీ పరిత్యాగము చేసి పాపము నెందుకు చేయు చున్నారు?

రాజు:

ఆ నీతాపి హిసావిప్రః ప్రతికూలా స దైవమే

దుఃఖాయ న సుఖాయాలం తస్యా మైత్రీ న వై మయి

యథాతే బ్రాహ్మణీ విప్రః వశగా తవ సుందరీ

తథా త్వం కురు యత్నం మే యథా స వశ గామినీ.

రాజు:

ఓ విప్రా! నా భార్యను తెచ్చు కున్నను ఆమె సదా నాకు ప్రతికూలముగా నుండును. ఆమె సుఖము కొరకు కాదు. కేవలము దుఃఖము కొరకే. ఎందుచేత ననగా నా యందు ఆమెకు స్నేహము లేదు. ఓ విప్రోత్తమా! ఏ విధముగా ఆమె నాకు వశీభూతురాలగునో, మీరు దాని కొరకు ప్రయత్నింపుడు.

బ్రాహ్మణుడు:

త్వయి సం ప్రి త తయేస్యా వరేష్టి రూప కారిణీ క్రియతే మిత్రకామై ర్యా మిత్రవిందా నరోమి తామ్ అప్రీతయోః ప్రీతి కరీ సా హి సంజననీ పరమ్

 భార్యా పత్యోర్మను ష్యేంద్రః తాం తవేష్టిం కరోమ్యహమ్ యాత్ర తిష్టతి సా సుభ్రూ స్తవ భార్యా మహీపతేః తస్మా దానీయతాం సా తే పరాం పీతి ముపైష్యతి

బ్రాహ్మణుడు:

మైత్రిని కోరువాడు ఎట్టి ఉపకారి యగు శ్రేష్టమగు యజ్ఞమును చేయునో, నేను మీకు మీ భార్యకు ప్రీతి కొరకు “మిత్రవింద” అను పేరుగల యజ్ఞమును చేయుదును. ఓ మనుజేంద్రా! అసంతుష్టులగు స్త్రీ పురుషులకు ప్రీతికారి మరియు అత్యధిక ప్రీతిని ఉత్పన్నము చేయునది యగు ఆ యజ్ఞమును మీ కొరకు చేయుదును. ఓ మహీపతీ! సౌందర్యవతి యగు మీ భార్య ఏ ప్రదేశమున నున్నదో, అచటి నుండి తీసుకొని రమ్ము. ఆమె మీ యెడల పరమ ప్రీతి కలదై యుండును.

( తస్యా న్తవ హి తార్థాయ ధర్మో యత్ర న సీదతి )

(ఆమె యొక్క, మీ యొక్క హితము ఒరకు యజ్ఞము చేసెదను. ధర్మమునకు నష్టము కలుగదు.)

మార్కండేయుడు:

ఇత్యుక్తః స తు సంభారా న శేషా న పనీ పతిః ఆవినాయ చ కారేష్టిం స చ తాం ద్విజ సత్తమః సప్త కృత్వః స తు తదా చకారేష్టిం పునః పునః తస్య రాజ్ఞో ద్విజ శ్రేష్టో భార్యా సంపాద నాయ వై యదారోపి తమైతాం తా మమన్యత మహామునిః స్వ భర్తరి తదా విప్ర స్త మువాచ నరాధిపమ్ అనీయతాం నరశ్రేష్ఠ యా తవేష్టాత్మ నోంతికమ్ భుంక్ష్వ భోగాం స్తయా సార్థం యజ యజ్ఞాం స్తథాహృతః

మార్కండేయుడు:

ఉత్తముడను ఆ రాజు బ్రాహ్మణుని వచనములు విని యజ్ఞమునకు వలసిన సంపూర్ణ సామాగ్రిని తెచ్చెను. ఆ బ్రాహ్మణుడు పైన చెప్పిన యజ్ఞమును చేసెను. అనంతరము ఆ ద్విజోత్తముడు రాజు యొక్క భార్యను సుశీలురాలిగా చేయుటకు మరల మరల ఏడు సార్లు ఆ యజ్ఞమును చేసెను. ఎప్పుడయితే ఆ మహా ముని ఆ రాజ మహిషిని స్వయముగా పతి యెడల అనురాగవతి అయినట్లుగా తలచెనో, అప్పుడు రాజుతో ఇట్లనెను. “ఓ నరశ్రేష్టా! ఇప్పుడు మీ ప్రియమైన భార్యను మీ సమీపమునకు తెచ్చి ఆమెతో సాంసారిక భోగము లనుభవింపుడు. పత్నీ సహితులై యజ్ఞములను చేయుడు.”

మార్కండేయుడు:

ఇత్యుక్త స్తేన విప్రేణ భూపాలో విస్మిత న్తదా సస్మార తం మహా వీర్యం సత్య సంధం నిశాచరమ్                  

మార్కండేయుడు:

ఆ బ్రాహ్మణుని మాటలు విన్న ఆ రాజు అత్యంతాశ్చర్యమును పొందెను. మరియు అదే సమయమున మహా వీర్యవంతుడు, సత్య ప్రతిజ్ఞుడు అగు ఆ నిశాచరుని స్మరించెను.

స్మృత స్తేన తదా సధ్యః సముప్యేత నరాధిపమ్ కిం కరోమీతి సోప్యాహ ప్రణిపత్య మహామునే తత స్తేన నరేంద్రేణ విస్తరేణ నివేదితే గత్వా పాతాల మాదాయ రాజపత్నీ ముపాయయౌ ఆ నీతా చాతి హార్దేన సా దదర్శ తదా పతిమ్ ఉవాచ్యచ ప్రసీదేతి భూయో భూయో ముదాన్వితా తతః స రాజా రభసా పరిష్వజ్యాహ మానినీమ్ ప్రియే ప్రసన్న ఏవాహం భూయో ప్యేవం బ్రవీషి కిమ్

ఓ మహామునీ! స్మరించిన వెంటనే ఆ నిశాచరుడు అచ్చట ప్రత్యక్షమై అతనికి నమస్కరించి “నేనేమి చేయను?” అని ప్రశ్నించెను. అనంతరమా రాజు విషయము నంతను సవిస్తారముగా చెప్పిన పిమ్మట నిశాచరుడు పాతాళమునకు వెళ్లి రాజ పత్నిని తీసుకొని తిరిగి వచ్చెను. ఆమె వచ్చి మనస్సు నందలి అత్యధికమగు ప్రణయముతో తన భర్తను దర్శించి ప్రీతి కలదై “నాపై ప్రసన్నుడ వగుము” అని మాటి మాటికి చెప్ప సాగెను. అనంతరమా రాజు ఉత్సుకతతో మానిని యగు పత్నిని ఆలింగనము చేసుకొని “ఓ ప్రియా! నేను నీ యందు ప్రసన్నుడనై యుంటిని. నీవు మాటి మాటికి ఎందులకు చెప్పెదవు?”

రాజపత్ని:

యది ప్రసాద ప్రవణం నరేంద్ర మయి తే మనః తదేత దభియాచే త్వాం తత్కురుష్వ మమార్హణమ్

రాజపత్ని:

ఓ నరేంద్రా! మీ మనస్సు నాయందు ప్రసన్నత గలదైనచో నేను ప్రార్థించు చున్నాను. మీరు నన్ను యదా యోగ్యముగా ఆదరించి రక్షింపుడు.

రాజు:

నిః శంకం బ్రూహి మత్తో యద్భవత్యా కించి దీప్సితమ్ తదలభ్యం న తే భీరుః తవాయత్తోనుస్మి నాన్యథా

రాజు:

ఓ భీరురాలా! నీవు అభిలషించిన విషయమును శంక లేక చెప్పుము. నా వద్ద నీకు లభ్యము కాని దేదియు లేదు. నేనే నీకు ఆధీనుడను. అన్యదా భావించ నర్కర లేదు.

రాజపత్ని:

మదర్థం తేన నాగేన సుతా సప్తా సఖీ మమ మూకా భవిష్యసీ త్యాహ సా చ మూకత్వ మాగతా తస్యాః ప్రతి క్రియాం ప్రీత్యా మమ శక్నోతి చేదృవాన్ వాగ్ని ఘాత ప్రశాంత్యర్థం తతః కిం న కృతం మమ

రాజపత్ని:

నా చెలి నాగరాజు యొక్క కుమార్తె నా కారణముగా నాగరాజు ద్వారా మూగదానిగా శాపము నొంది మూకత్వమును బొంది యున్నది. మీరు నా యందు ప్రేమచే ఆమె యొక్క మూగతము శమించుటకు ప్రతీకారము చేయుట యందు సమర్థులైనచో, నాకు మీరు చేయని కార్య మేమున్నది?

మార్కండేయుడు:

తతః స రాజా తం విపర మహాన్మ న్కీదృశీ క్రియా తన్మూకతా పనోదాయా స చ తం ప్రాహా పార్థివమ్

మార్కండేయుడు:

అనంతరమా రాజు ఆ బ్రాహ్మణుని ఇట్లడిగెను. నాగరాజు పుత్రికకు మూగతనము పోవుటకు ఈ సమయమున ఎట్టి కార్యము చేయుట ఆవశ్యకము?

బ్రాహ్మణుడు:

భూవ! సారస్వతీ మిష్టం కరోమి వచనా త్తవ పత్నీ తవేయ మాసృణ్యం యాతు తద్వాకృ పర్తనాత్

బ్రాహ్మణుడు:

ఓ రాజా! మీ వచనానుసారము సరస్వతీ ఇష్టిని చేయుదును. మీ భార్య ఆమెకు మూగతనము దూరము కాగానే ఋణ విముక్తురాలగును.

మార్కండేయుడు:

ఇష్టిం సారస్వతీం చక్రే తదర్థం స ద్విజోత్తమః సారస్వతాని సూక్తాని జజాపచ సమాహితః తతః ప్రవృత్త వాక్యాం తాం గర్గః ప్రాహ రసాతలే

ఉపకారః సఖీ భర్తా కృతోయ మతి దుష్కరః ఇత్థం జ్ఞానం సమాసాద్య నందా శీఘ్రగతిః పురమ్ తతో రాజ్ఞీం పరిష్వజ్య స్వసఖీ మురగాత్మజా తం చ సం స్తూయ భూపాలం కల్యాణోక్త్యా పునః పునః ఉవాచ మధురం నాగో కృతాసన పరిగ్రహా ఉపకారః కృతో వీరః భవతా యో మమాదునా తేనా స్మ్యాకృష్ణ హృదయా యద్ప్రవీమి శృణుష్వ తత్

మార్కండేయుడు:

ఆ ద్విజ శ్రేష్టుడు ఆమె మూగతనమును పోగొట్టుటకు సారస్వతీ యిష్టిని ప్రారంభించెను. సావధానుడై సారస్వతీ సూక్తములను జపించ సాగెను. అనంతరము గర్గ ఋషి రసాతల మందు మాటలాడు శక్తిని పొందిన నాగ కన్యతో ఇట్లు చెప్పెను. నీ సఖురాలి భర్త నీకు ఈ దుష్కరమగు ఉపకారమును చేసెను. నాగకన్య యగు నంద ఈ విషయము తెలసిన వెంటనే ఆ పురమునకు వెళ్లి తన సఖియగు రాణిని ఆలింగనము చేసుకొనెను. మరియు ఆ భూపాలుని గుణములను స్తుతించి ఆసనముపై కూర్చుండి శుభ వచనములతో మదుర భావములతో మాటి మాటికి ఇట్లు చెప్ప తొడగెను. ఓ వీరా ఈ సమయమున మీ వలన నాకు ఏ ఉపకారము జరిగినదో, దాని వలన ఆ కృష్ణ హృదయము గల దాననై నేను ఏది చెప్పబోవు చున్నానో అది వినుము.

తవ పుత్రో మహావీర్యో భవిష్యతి నరాధీపః తస్యా ప్రతిహతం చక్ర మస్యాం భువి భవిష్యతి సర్వార్థ శాస్త్ర తత్త్వజ్ఞో ధర్మానుష్టాన తత్పరః మన్వంతరేశ్వరో ధిమాన్ భవిష్యతి స వై మనుః

ఓ నరాధిపా! మీకు గొప్ప వీర్యవంతుడగు పుత్రుడు జన్మించును. మరియు ఈ పృథ్వి యందు అతడు అఖండ రాజ్య మండలమును ప్రతిష్టింప జేయును. సర్వార్థ శాస్త్ర తత్త్వజ్ఞుడు, ధర్మానుష్టాన తత్పరుడు, బుద్ధిమంతుడు కాగలడు. ఇంతియే గాక మీ పుత్రుడు మన్వంతరాధిపతి యగు మను వగును.

మార్కండేయుడు:

ఇతి దత్త్వా వరం తస్మై నాగరాజ సుతా తతః సఖీం తాం సంపరిష్వజ్య పాతాల మగమ న్మునే తత్ర తస్య తయా సార్థం రామతః పృథివీ పతేః జగామ కాలః సుమహా నృజాః పాలయత స్తథా తతః స తస్యా త సయో జజ్ఞే రాజ్ఞో మహాత్మనః పౌర్ణ మాస్యాం యథా కాంత శ్చంద్రః సంపూర్ణ మండలః

మార్కండేయుడు:

ఓ మునీ! అనంతర మా నాగరాజు పుత్రిక నంద, వారికి ఈ విధముగా వరమునిచ్చి తన సఖిని గాఢా లింగనము చేసికొని పాతాళమునకు వెడలి పోయెను. ఇచ్చట భార్యతో రమణ పరాయణుడై ఆ పృథ్వీ పతి, ప్రజా పాలనము చేయు చుండగా కాలము గడచి పోయెను. అనంతరము రాణి గర్భము నుండి మహాత్ముడగు రాజును పౌర్ణమాస మందు షోడశ కలా పరిపూర్ణుడగు చంద్రుని వంటి కాంతి గలిగిన తనయుడు కలిగెను.

తస్మిం జాతే ముదం ప్రాపుః ప్రజాః సర్వాః సహామరాః దేవదుందుభయో నేదుః పుష్పవృష్టిః పపాత చ తస్య దృష్ట్వా వపుః కాంతం భవిష్యం శీలమేవ చ ఔత్తమశ్చేతి మధయో నామ చక్రుః సమాగతాః జాతోయ ముత్తమే వంశే బాలః కాలే తథోత్తమే ఉత్తమా వయవ స్తేన ఔత్తమోయం భవిష్యతి

ఆ మహాత్ముడు జన్మించిన సమయమున సమస్త ప్రజలు మహా నందమును పొందిరి. సమస్త దేవతలు దుందుభులు మ్రోగించిరి. పూల వర్షము కురిసెను. వచ్చిన మును లందరు అతని దేహ కాంతిని చూసి మరియు భావ స్వభావములను తెలుసుకొని అతనికి “ఔత్తము”డని నామకరణము చేసిరి. మునులు ఇట్లు పలికిరి. ఈ మహాత్ముడు ఉత్తమ వంశమందు ఉత్తమ కాలమందు మరియు అవయవ సంపన్నుడై జన్మించెను. ఈ కారణముచే యితడు ఉత్తమ నామముతో విఖ్యాతి చెందగలడు.

మార్కండేయుడు:

ఉత్తమస్య సుతః సోథ నామ్నాఖ్యాత స్తధౌ త్తమః మను రాసీ త్తత్ప్రభావో భాగురేః శ్రూయతాం మమ ఉత్తమాఖ్యా సమఖిలం జన్మచే వోత్తమస్య యః నిత్యం శృణోతి విద్వేషం స కదాచి న్న గచ్చతి ఇష్టై ర్దారై స్తధా పుత్రై ర్బంధుభి ర్వా కదాచవ వియోగో నాస్య భవితా శృణుతః పఠతోపి వా తస్య మన్వంతరం బ్రహ్మ న్వదతో మమ విస్తరాత్

శ్రూయతాం తత్ర యశ్చేంద్రో యే చ దేవా స్తథర్షయః

మార్కండేయుడు:

ఓ మునీ! పక్షాంతరమున “ఉత్తముని పుత్రుడు” ఈ కారణముచే అతడు ఔత్తముడను పేరుతో పిలవబడి మన వగును. ఇప్పుడు అతని ప్రభావమును వినుము. ఉత్తమ నృపతి యొక్క వ్యాఖ్యానము మరియు ఔత్తమ మనువు యొక్క జన్మ వృత్తాంతమును ఎవరు విందురో వారు ఎప్పుడును విద్వేషములను పొందరు. ఎవరు దీనిని వినెదరో లేక చదివెదరో వారికి ఎప్పుడును ఇష్టులు, పుత్రులు, భార్య, బంధు వర్గాలు మొదలగు వారి యొక్క వియోగము కలుగదు. ఆతని మన్వంతర కథను విస్తారముగా వర్ణించి చెప్పెదను వినుము. ఓ బ్రాహ్మన్! ఆ సమయమున ఏ ఇంద్రుడు, ఏ దేవతలు మరియు ఏ ఋషులు ఉండిరో, అది కూడా చెప్పెదను.