మార్కండేయ మహా పురాణము
121 - అవీక్షిత చరితము
మార్కండేయుడు:
తతః శుశ్రావ తం బద్దం తనయం స కరన్ధమః
తస్య పత్నీ తథా వీరా అన్యే చాపి మహీభృతః
త మధర్మేణ తనయం బద్దం శ్రుత్వా మహీపతిః
సమస్తైః పృథివీపాలై శ్చిరం దద్యౌ మహామునే!
కేచి దూచు ర్మహీపాలా వధ్యాః సర్వే మహీభృతః
యై రేకః సంయుగే బద్దః సమస్తై స్తై రధర్మతః.
యుజ్యతాం వహీనీ శీఘ్ర మూచు రన్యే కిమాస్యతే
విశాలో బధ్యతాం దుష స్తత్ర యేన్యే సమాగతాః.
అన్యే తథో ర్ధర్మోత్ర త్యక్తః పూర్వమహీక్షితా
అన్యాయేన బలా ద్యేన గృహీతా త మావాంఛతీ.
మార్కండేయుడు:
ఓ మహారాజా! కరంధముడు అతని భార్య యగు వీరా మరియు ఇతర రాజులును రాజ కుమారుని బంధించిన విషయమును వినిరి. ఓ మహామునీ! ఆతనిని అధర్మ యుద్దముచే బంధించిరని విని రాజు సామంత రాజులతో చాలా సమయము వరకు ఆలోచన చేయు చుండెను. “ఏ ఏ రాజు లందరూ ఏకమై ఒక్క వీరుని అధర్మ యుద్దముచే బంధించినారో, వారందరో వధ్యులు”(అనగా చంపుట కర్హులు) అని కొందఱు పలికిరి. “ఇప్పుడు నిశ్చింతగా గూర్చున్నా రెందుకు? వెంటనే సేనను సమాయత్త పఱచి దుష్టు డగు విశాల రాజును, మఱియు అక్కడకు వచ్చి యున్న రాజు లందరినీ బంధింపుడు” అని మరి కొందఱు పలికిరి. “ముందుగా రాజ పుత్రుడే ఇచ్చగించని కన్యను అన్యాయముగా బలవంతముగా గ్రహించి ధర్మమును విడిచిరి అని” కొందఱు చెప్పిరి.
స్వయంవరే ష్వశేషేషు తేన రాజసుతా స్తదా
ఖిలీకృతా స్తతః సర్వే సమేత్య స వశీకృతః.
తేషా మేత ద్వచః శ్రుత్వా వీరా వీరప్రజాపతీ
వీరగ్రోత్ర సముద్భూతా వీరపత్నీ ప్రహర్షితా.
ఉవాచ భర్తుః ప్రత్యక్ష మన్యేషాం చ మహీక్షితామ్
భద్రం కృతం భద్రభుజా మమ పుత్రేణ పార్దివాః!.
గృహీతా యద్భలా త్కాన్యా జిత్వా సర్వ మహీక్షితః
తదర్ధం యుథ్యమానోయం బద్ద ఏకో న ధర్మతః!.
తద ప్యస్మ త్సుతస్యాజౌ మన్యే నాపచయ ప్రదమ్
ఏత దేవ హి పౌరుష్యం యదమర్షవశా న్నరః.
నీతిం న గణయత్యేవం జిఘాంసు రివ కేసరీ
స్వయంవరాయ విన్యస్తా మమ పుత్రేణ కన్యకా.
బహ్వ్యో గృహీతా భూపానాం పశ్యతా మతిమానివామ్!
క్వ క్షత్రియ కులే జన్మ క్వ యాచ్ఞా హీనసేవితా.
అంతే కాక అతడు అన్ని స్వయంవరము లందును ఇదే విధముగా రాజ పుత్రులను శత్రువులుగా చేసి కొనెను. ఈ కారణముచే వారందరు కలసి ఆతనిని బంధించినారు” అని కొందఱు అనిరి. వీర వంశీయురాలు, వీరపత్ని వీరమాత యైన “వీర” వారి ఈ వచనములు విని ప్రహర్షముతో, భర్త మఱియు ఇతర రాజుల ఎదుట ఇట్లు పలుక సాగెను. “ఓ పార్దివులారా! సంపూర్ణ రాజులను పరాజితుల జేసి నా కల్యాణాస్పద పుత్రుడు బలాత్కారముచే ఏ కన్యలను గ్రహించేనో, అది ఉత్తమమైన పనియే, అందుచే అధర్మ యుద్దములో ఒంటరి యైన రాజు పుత్రుని ఆ రాజు లందఱు బంధించిరి. దీని వలన నా కేమని బోదపడు చున్నది యనగా ఇట్లు చేయుట వలన నా పుత్రునికి హాని ఏమియు లేదు. ఇదే పురుషార్ధము. క్రోధమునకు వశీభూతమై చంపుటకు ఇష్టపడు నట్టి సింహము వలె అధర్మ యుక్తుడగు మనుష్యుడు నీతిని ఈ విధముగా లెక్కింప లేడు సన్మానితులైన అనేకానేక రాజుల ఎదుట బలాత్కారముచే నా పుత్రుడు స్వయంవర నిమిత్తమై యున్న చాలా మంది కన్యలను గ్రహించెను. ఎక్కడి క్షత్రియ కుల మండలి జన్మ, ఎక్కడి హీన జనోచిత యాచిత కార్యము? ఈ రెండింటి లోనూ చాల అంతర మున్నది.
బలాదేవ సమాదత్తే క్షత్రియో బలినాం పురః
లోహ శృంఖల బద్దా వా న వశం యాన్తి కాతరాః.
ప్రసహ్యకారిణో యాన్తి రాజానో ధర్మశాలినః
తదలం దౌర్శనస్యేన శ్లాఘ్య మేవాస్యసంధానమ్.
యుష్మాక మపి యే పూర్వే క్రుత్వారీణాం నిపాతనమ్
హృత్వైవ పృథివీశానాం పృధ్వీ పుత్రాదికం వసు.
అందు వలన క్షత్రియ గణాలు బలవంతుల ఎదుటనే తమ బలమును చూపి గ్రహించెదరు. ఒక వేల ధార్మిక మైన రాజుకు ఎవరయిననూ ఇనుప సంకెళ్ళు వేసి బంధించిననూ అతడు పిరికి తనముతో అతనికి వశమై నట్లు స్వీకరించ లేదు. కాని ముందు వీరత్వమును జూపి తిరిగి సహజముగానే వశమై శ్లాఘ నీయముగా తలంచు చున్నాను. మీ పూర్వులు కూడ శత్రువులను నాశనము చేసి ఆ రాజుల యొక్క భూమి, పుత్రాదికములగు ధనమును హరించిరి.
భార్యా వీర్య నిమిత్తాని తతో యాతాతిగౌరవమ్
తత్త్వర్యతాం రణాయశు స్యన్దనా న్యాదిరోహత.
సజ్జీకుకుత నాగాశ్వ మచిరేణ ససారథిమ్
మన్యధ్వం కిం మహీపాలై ర్భాహుభిః సహ విగ్రహమ్ః!
ప్రభూతా ఏవ తోషాయ శూరస్యాల్పరణే క్రియోః
కస్య నాల్పేషు సామర్ధ్యం నరేన్ద్రాదిషు జాయతే.
యేభ్యో న విధ్యత్రే భీతి ర్విక్రా తస్యాపి శత్రుషు
వ్యాప్య లోభా న్సమస్తా న్యో హ్యభిభూయ యథో నరః
వ్యరోచాతేతిశూరః స తమాంసీవ దివాకరః.
మరియు వీని నిమిత్తము మీ మస్తకము లందు అస్త్రా ఘాతమై నప్పటికి కూడ శ్లాఘనీయమే. రాజులు భూమి, పుత్రాకది ధనము మఱియు భార్య ఇత్యాదులను సజ్జనుల నుండియే హరించి ప్రోగు చేసుకొనెదరు. మరియు అదియే వారి గౌరవమునకు హేతువగు చున్నది. అందు వలన యుద్దము కొఱకు వెంటనే సన్నద్ధులు కండు రథము నెక్కి వెంటనే సారథుల సహితముగా ఏనుగులు, గుఱ్ఱములను అలంకరింపుడు. అనేక మంది రాజులతో ఒకే ఒకడు చేయు యుద్దమును మీరు ఎట్లు యోచించు చున్నారు? శూరులు అల్ప యుద్దము నందే గొప్ప పరాక్రమమును పొంది అంతమందు సంతోషమును పొందుదురు. అల్పులగు నరేంద్రాది శత్రు సమూహములు మరియు ఎవరి వలన భయము ప్రాప్తింపదో, అట్టి పిరికి వారైన శత్రువులపై ఎవరు సామర్ధ్యమును జూపుటకు అభిలషింపరు? సూర్యుడు ఏ విధముగా దిగంత వ్యాప్తమై యున్న అంధకారమును నాశనము చేయునో, అట్లే ఏ శూరులు బల, వీర్యాదులచే భువన మందు వ్యాపించి యున్న శత్రువు లందరిని పరాజితుల చేసి విరాజిల్లుదురో, వారే యదార్ధ శూరులు.
మార్కండేయుడు:
ఇత్ధముద్దర్షితో రాజానయా పత్న్యా కరన్ధమః
చకార స బలోద్యోగం హన్తుంపుత్రాహితా న్మునే!
మార్కండేయుడు:
ఓ మునీ! కరంధమ రాజు ఈ విధముగా భార్యచే ఉత్తేజితుడై పుత్రుని శత్రువులను వధించుటకై సైన్యమును సమాయత్త పరచ సాగెను.
తత స్తస్య సమం భూపై ర్విశాలేన చ స జ్గరః
బభూవ బద్ద పుత్రస్య తై రశేషై ర్మహామునే!
దినత్రయ మాభూ ద్యుద్దం తేన రాజ్ఞా సమం తదా
కరన్ధమేన భూపానాం విశాలస్యానుకుర్వతామ్.
యదా పరాజిత ప్రాయం తత్సర్వం భూపమండలమ్
తదా విశాలోద్ఘ్యకరః కరన్ధమ ముపస్థితః.
కరందమోపి సంప్రీత్యా తేన రాజ్ఞాభిపూజితః
విముక్తే తనయే తత్ర నిశాం తాం సుఖ మావసత్.
తాం చ కన్యా ముపాదాయ విశాలం సముపస్థితమ్
అవిక్షి త్ప్రాహ విప్రర్షే! వివాహార్ధం పితుః పురః.
అనంతరము పుత్రుడు బంధించి యుండగానే విశాల రాజుతో మఱియు ఇతర రాజులతో కరంధమ రాజునకు యుద్దము ప్రారంభ మయ్యెను. ఆ సమయమున విశాల రాజు యొక్క అనుచరులగు రాజులతో కరంధమునికి మూడు రోజుల పాటు యుద్దము జరిగిన పిమ్మట విశాలాది రాజు లందఱు పరాజితులైరి. అప్పుడు విశాల రాజు ఆతనిని పూజించుటకు అర్ఘ్యమును చేతి యందుంచుకొని కరంధముని సమీపమునకు వచ్చెను. కరంధముడు కూడా ఆ రాజుచే పూజింప బడి పుత్రుని బంధ విముక్తుని చేసెను. ప్రీతి పూర్వకముగా ఆ రాత్రి అచట సుఖముగా నుండెను. ఓ విప్రర్షీ! అటు పిమ్మట విశాల రాజు తన కన్యను తీసుకొని వచ్చెను. అవీక్షితుడు తండ్రి యెదుట వారితో నిట్లు పలికెను.
నాహ మేతాం గ్రహీష్యామి న చాన్యాం యోషితం నృప!
పరై ర్యస్యా నిరీక్షన్త్యాః సంగ్రామేహం పరాజితః.
అన్యస్మై సంప్రయచ్చేమా మియం చాన్యం వృణోతు తమ్
అఖండిత యశో వీర్యో యః పరై ర్నాపమానితః.
పరైః పరాజితోహం య త్కాతరేయం యథాబలా
కిమత్ర మానుషత్వం మే నైతస్యా మమ చాన్తరమ్.
స్వత న్త్రతా మనుష్యాణాం పరతన్త్రాసదాబలా
నరోపి పరతన్త్రోయ స్తస్య కీదృజ్ మనుష్యతా.
సోహమస్యా ముఖం భూయో దృష్టం దర్శయితా కధమ్
యోహ మస్యాః పురోభూమౌ పరై ర్భూపైః ఖిలీకృతం
ఓ రాజా! ఏ కన్య ఎదుట నేను శత్రువులచే ఓడి పోయితినో, ఆ కన్యను ఎప్పటికీ స్వీకరింప లేను. మరియు ఏ కన్యను కాని నేను గ్రహించను. అందు వలన ఎవరు ఎప్పుడునూ శత్రువులచే అవమానింప బడలేదో, అట్టి అఖండ యశస్సు, వీర్య యుక్తుడైన మరెవ్వరికైననూ మీ కుమార్తె నిమ్ము. ఈ కన్య కూడ ఆతనినే వరించెను. పిరికి తనము గల అబల వలె నేను శత్రువుల వలన పరాజితుడ నైతిని. అందు వలన నాకు మానవత్వమే మున్నది? అందుచేత నాకును ఈ కన్యకును భేదము లేదు. స్వతంత్ర్యము ఎల్లప్పుడు మానవునికి అధీనము, మఱియు లలనా గణములు (స్త్రీలు) సదా పరాధీనులు. అందు వలన పురుషుడై నప్పటికినీ, ఎవరు పరాధీను రగునో. అతని యొక్క మనుష్యత్వ మేమున్నది? ఎవరి యెదుట నేను సమస్త రాజులచే ఓడి పోయితినో, ఆమెకు నా పూర్వ దృష్ట ముఖమును ఎట్లు చూపించ గలను?
ఇత్యుక్తే తేన తనయా మువాచ జగతీపతిః
శ్రుతం తే వచనం వత్సే! వదతోస్య మహాత్మనః
వరయాన్యం పతిం యత్ర మనస్తే రమతే శుభే!.
వయం వా సంప్రయచ్చామో యస్మి స్తస్మిం స్తవాదృతిః
ఏతయోర్హ్యేక మాతిష్టమార్గయో రుచిరాననే!.
భూపతి యగు విశాలుడు రాజ పుత్రుని ఈ మాటలు విని కుమార్తెతో ఓ కుమారీ! ఈ మహాత్ముడు చెప్పినది నీవు విన్నావు కదా! ఇప్పుడు ఓ కల్యాణీ! నీవు ఇష్ట పడినచో వేరెవరి నయినా పతిగా వరించుము. లేక నీ యడల గల స్నేహముతో నేను తగిన వానిని చూచెదను. ఓ రుచిరాననా! ఈ రెండింటి యందు ఏదో ఒక దానిని స్వీకరింపుము.
కన్య:
పరాజితోయం బహుభి ర్నసమ్య క్సమ్య గాచరన్
సంగ్రామే తద్యశో వీర్య హానికారీ న పార్ధివ!.
ఏకో బహునాం యుద్దాయ గజానా మివ కేసరీ
యత్సం స్థితః వరం శౌర్యం తేనాస్య పకటీకృతమ్.
న కేవల మయం తస్థౌ తేప్యఖిలా జితాః
బహుశోనేన యత్నేన విక్రయోపి ప్రకాశితః.
కన్య:
తండ్రీ! ఈ రాజ కుమారుడు ధర్మ మార్గ మందే నిలిచి అనేకులతో యుద్దము చేసియు వీర్యమునకు హాని కరమగు యుద్దమున పరాజితుడు కాలేదు. యుద్దమునకు వచ్చిన అనేక మంది రాజులలో ఈతడే విధముగ సింహము వలె ఒంటరిగా యుద్దమున నిలిచి యుండెనో, దాని ద్వారా యీతని శౌర్యము విశేషముగా ప్రకాశించెను. ఈతడు ఒక్క యుద్ద క్షేత్రముననే కాదు, సంపూర్ణ రాజ మండలమును అనేక మారులు, పరాజితులను చేసి యథేష్ట పరాక్రమమును ప్రకాశింప చేసెను.
శౌర్యవిక్రమ సంయుక్త మిమం సర్వమహీక్షితః
ధర్మయుద్ద మాధర్మేణ జితవన్తోత్ర కా త్రపా!.
న చాపి రూపమాత్రేహం లోభ మున్య గతా పితః!
శౌర్యవిక్రమ థైర్యాణి హరన్త్యస్య మనో మమ.
తత్కిముక్తేన బహునా యాచ్యతాం మత్కృతే నృపః
త్వయా మహానుభావోయం నాన్యో మే భవితా పతిః.
శౌర్య, పరాక్రమశాలియగు ఈ రాజ కుమారుడు ధర్మ యుద్దము చేయ అనేక మంది రాజులు అధర్మ వ్యవహారముచే పరాజితుని చేసిరి.ఇందు సిగ్గు పడవలసిన విషయ మేమున్నది? ఓ తండ్రీ! నేను ఈతనిని కేవలము రూపమును చూచియే లోభము పొందుట లేదు. యీతని శౌర్య, పరాక్రమములు, దైర్యము నా మనస్సును హరించినవి. అందుచే ఇంత కన్న నదికముగా నేమి చెప్పుదును ఓ రాజ మీరు నా కొఱకు ఈ మహానుభావుని ప్రార్ధించుడు. ఈతడు కాక మరెవ్వరూ నాకు భర్త కాలేడు.
విశాలుడు:
రాజపుత్ర! సుతా ప్రాహ మమైత చ్చోభనం వచః
ఏపం చైవ త్వయా తుల్యః కుమారో న మహీతువే.
అవిసంవాదితే శౌర్య మతీవ చ పరాక్రమః
పాపయాస్మత్కులం వీర! దుహితు ర్మే పరిగ్రహాత్.
విశాలుడు:
ఓ రాజపుత్రా! నా కుమార్తె చెప్పిన దంతయు యుచితముగా నున్నది. నీతో సమానుడగు కుమారుడు పృథ్వి యందు మరెవ్వరునూ కనుపించుట లేదు. నీ శౌర్యము అప్రతిహతము, పరాక్రమము అత్యధికము. ఓ వీర కుమార నీవే ఈ కన్యను గ్రహించి నా కులమును పవిత్రము చేయుము.
రాజపుత్రుడు:
నాహమేతాం గ్రహీష్యామి న చాన్యాం యోషితం నృప!
ఆత్మన్యేవ హి మే బుద్దిః స్త్రీమయీ మనుజేశ్వర!
రాజపుత్రుడు:
ఓ రాజా! నేను ఈమెను గాని లేక మరియే ఇతర కన్యను గ్రహించను. ఓ మనుజేశ్వరా! నేను నన్ను స్త్రీగా తలంచు చున్నాను.
మార్కండేయుడు:
తతః కరన్ధమః ప్రాహ పుత్రేయం గృహ్యాతాం త్వయా
విశాల తనయా సుభ్రూ స్థాయ్వి హార్దవతీ దృఢమ్.
మార్కండేయుడు:
అప్పుడు కరంధముడును పుత్రునితో చెప్ప సాగెను. ఓ కుమారా! ఈ కన్యను గ్రహింపుము. ఎందు వలన యనగా ఈ సుందరి యగు విశాల రాజ కన్య నీ యెడల దృఢ మైన అనురాగము గలదై యున్నది.
రాజ పుత్రుడు:
నాజ్ఞాభఙ్గః కదాచిత్తే కృతః పూర్వం మయా ప్రభో!
తథాజ్ఞాపయం మాం తాత! యథాజ్ఞాం కరవాణి తే.
రాజ కుమారుడు:
ఓ ప్రభూ! నేను ఇంతకు ముం దెన్నడు నీ ఆజ్ఞను భంగ పరువ లేదు. ఓ తండ్రీ! సమయము నందు కూడా నీవు నాకు ఎట్టి దానిని చేయుట యందు సమర్దుడనో, అట్టి దానిని అజ్ఞాపింపుడు.
మార్కండేయుడు:
అత్యన్త నిశ్చిత మతౌ తస్మి న్రాజసుతే సుతామ్
తా మువాచ విశాలోపి వ్యాకులీ కృత మానసః.
కర్త్యతాం మనః పుత్రి! ఏతస్మచ్చ ప్రయోజనాత్
అన్యం వరయ భర్తార్ధం సంత్యనేకే నృపాత్మజాః.
మార్కండేయుడు:
విశాల రాజు రాజ పుత్రుని ఇట్టి స్థిర బుద్దిని ఎరిగి వ్యాకుల చిత్తుడై కన్యతో యిట్లనియె. ఓ కుమారీ! ఈతనిపై నుండి మనస్సును మారల్చుకొనుము. అనేక మంది రాజ పుత్రు లున్నారు. వారిలో ఎవరినైన తొందరగా వరింపుము.
రాజ కన్య:
వరం వృణో మ్యహం తాత మామేష యది నేచ్చతి
తపసాన్యో న్మ మే భర్తా జన్మ న్యాస్మ న్భవిష్యతి.
రాజ కన్య:
ఓ తండ్రీ! ఈ రాజ కుమారుడు నన్ను అభిలాషింపనిచో, తపస్సు కాక ఈ జన్మ యందు నాకు అన్యు లెవరూ భర్త కాలేరు.
మార్కండేయుడు:
తతః కరన్ధమో రాజా విశారేన సమం ముదా
స్థిత్వా దినత్రయం తత్ర విశారేన సమం ముదా
స్థిత్వా దినపత్రం తత్ర నిజ మభ్యాయయౌ పురమ్.
క్షితోపి తేనైవ పిత్రా న్యైశ్చ నరాధివైః
నిదర్శనైః పురావ్రుత్తైః సాన్త్వితోభ్యాగమ త్పురమ్.
కన్యా వనం గత్వా నిసృష్టా నిజవాన్ధవైః
తప స్తేవే నిరాహారా వైరాగ్యం పర మాస్థితా.
హారా యదా సా తు మాసత్రయ మవస్థితా
నంప్రాప పరమా మార్తిం కృశా ధమని సంతతా.
మార్కండేయుడు:
అనంతరము కరంధమ రాజు, విశాల రాజు సహితముగా అచ్చట ప్రసన్న చిత్తుడై మూడు రోజులు గడిచిన పిమ్మట తన నగరమునకు వెళ్ళెను. తండ్రి మఱియు ఇతర రాజులు అనేక ప్రాచీన దృష్టాంతములు తెలియ చెప్పిన పిమ్మట అవీక్షితుడు కూడ రాజధానికి వెళ్ళెను. మరియు ఆ విశాల రాజ కన్య కూడ ఆత్మ బంధువుల నుండి ఆనుజ్ఞ తీసుకొని వనమునకు పోయెను. వైరాగ్యముతో నిరాహారురాలై తపస్సు చేయ సాగెను. ఈ విధముగా నిరాహారురాలై మూడు నెలలు గడపిన పిమ్మట ఆమె శరీరము నందలి నాడి కంపింప సాగెను. ఆమె కృశించినదై అత్యంత దుఃఖితు రాలయ్యెను.
మన్దోతాహాతితన్వజ్గీ ముమూష్షు రపి బాలికా
దేహత్యాగాయ సా చక్రే తదా బుద్దిం నృపాత్మజా.
ఆత్మత్యాగాయ తాం జ్ఞాత్వా క్రుతబుద్దిం సురా స్తతః
సమేత్య ప్రేశాయామాసు ర్దేవదూతం తదన్తికమ్.
సముపేత్య స తాం ప్రాహ దూతోహం పార్దివాత్మజే
ప్రేషిత స్త్రిదిశై స్తుభ్యం యథ్కార్యం తన్నిశామయ.
న భవత్యా పరిత్యాజ్యం శరీర మతిదుర్లభమ్
త్వం భవిష్యసి కల్యాణి! జననీ చక్రవర్తినః.
పుత్రేణ చ మహాభాగే! భోక్తవ్యాని హతారిణా
అవ్యహతా జ్ఞేం చిరం సప్తద్వీపవతీ మహీ.
అప్పుడు అత్యంత దుర్భలమైన అంగములు గలదై మృత్యువు సమీపమున నున్న ఆ రాజ కన్య నిరుత్సాహముతో ప్రాణ త్యాగము చేయుటకు కృత నిశ్చయు రాలయ్యెను. ఇట్లు ప్రాణ త్యాగము చేయుటకు స్థిర నిశ్చయురాలగుట ఎగిరి దేవత లందఱు ఆమె వద్దకు ఒక దేవ దూత దూతను పంపిరి. దూత వచ్చి ఇట్లు పలికెను: “ఓ నృపాత్మజా! నేను దేవతలు పంపగా వచ్చిన దూతను. ఏ కార్యార్ధము దేవతలు నన్ను పంపిరో, దాని నెరిగించెదను వినుము.” “ఈ దుర్లభ మగు శరీరమును నీవు పరిత్యజింపకుము. ఓ కల్యాణీ! నీవు చక్రవర్తి యగు రాజునకు తల్లి వగుదువు గాక. ఓ మహాభాగా! నీ పుత్రుడు శత్రు కులమును నాశనము చేసి అప్రతిహత ప్రభావముచే చాలాకాలము వరకు ఈ సప్త ద్వీపములు గల భూమిని అనుభవించును.”
హన్తవ్య స్తేన తరుజి ద్దేవానాం పురతో రిపుః
ఆయఃశంకు స్తథాక్రూరో ధర్మే స్థాప్యా స్తతః ప్రజాః.
పరిపాలనీయ మఖిలం చాతుర్వర్ణం స్వధర్మతః
హన్తవ్యా దస్యవో మ్లేచ్చా యే చాన్యే దుష్ట చేష్టితాః.
యష్టవ్యం వివిదై ర్యజ్ఞైః సమాప్త వర దక్షిణైః
వాజిమేధాది భి ర్భాద్రే షట్ సహస్త్రైశ్చ సంఖ్యయా.
“దేవ శత్రువులైన తరుజిత్తు మఱియు క్రూరుడగు అయఃశంఖుడు దేవతల యెదుట ఆతని ద్వారానే వినాశానమును పొందుదురు. మఱియు ఓ భద్రా! అతడు విపుల, దక్షిణా యుక్తముగా ఆశ్వమేదాది అనేక విధములు గల ఆరువేల యజ్ఞములు చేయును.”
మార్కండేయుడు:
తం దృష్ట్వా సాన్తరిక్షస్థం దివ్యస్రగానులేపనమ్
దేవదూత మువాచేదం రాజపుత్రీ తతో మృదు.
సత్యం త్వ మాగతః స్వర్గా ద్దేవదూతో న సంశయః
కిస్తు భర్త్రా వినా పుత్రః స కథం మే భవిష్యతి.
మార్కండేయుడు:
అనంతరము దివ్యమాలానులేప ధారియై ఆకాశము నందు నిలిచి యున్న ఆ దేవదూతను చూచి రాజ పుత్రిక మధుర స్వరముతో నిట్లు పలికెను. నీవు నిజముగా స్వర్గ లోకము నుండి వచ్చిన దేవదూతవు. ఇందు సందియము లేదు. కాని భర్త లేకుండ నాకు పుత్రు డెట్లు కలుగును?
అవీక్షిత మృతే భర్తా మమ నాన్యోత్ర జన్మని
భావితేతి ప్రతిజ్ఞాతం మయైత త్సన్నిదౌ పితుః.
స న్ద నేచ్చతి మాం ప్రోక్తో మత్భిత్రా జనకేన చ
కనన్దమే నాథ సమ్య గ్యాచితశ్చ మయా తథా.
అవీక్షితుడు కాక మరెవ్వరును ఈ జన్మ యందు నాకు పతి కాలేదు. నేను తండ్రి యెదుట ఇట్లు ప్రతిజ్ఞ చేసితిని. కాని అవీక్షితుడు కూడ నా తండ్రి మఱియు తన తండ్రి నేను ప్రార్ధించి నప్పటికిని నన్ను అభిలషింప లేదు.
దేవదూత:
కిమనేన మహాభాగే! బహునోక్తేన తే సుతః
సముత్పత్స్యతి మా త్యాక్షీ స్త్వమాత్మాన మధర్మతః
అత్రైవ కాననే తిష్ఠ తమం క్షీణాం చ పోషయ
తపః ప్రభావా దేతత్తే సర్వం సాధు భవిష్యతి.
దేవదూత:
“ఓ మహాభాగా! అధికముగా చెప్పుట వలన ప్రయోజనము లేదు. నిస్సందేహముగా నీకు పుత్రుడు జన్మించును. అందు వలన నీవు ఆత్మ త్యాగము చేసి అధర్మాచరణ చేయ వద్దు. ఈ వనము నందే యుండి క్షీణమైన దేహమును పోషించు కొనుము. నీ తపస్సు యొక్క ప్రభావముచే నీకు అన్ని విధాల శుభ మగును.”
మార్కండేయుడు:
ఇత్యుక్త్వా దేవదూతోసౌ యథాగత మగచ్చత.
చాకారాసుదినం సుభ్రూః సాప్యాత్మ తను పోషణమ్.
మార్కండేయుడు:
దేవదూత ఇట్లు పలికి ఎచటి నుండి వచ్చెనో, అచటకు పోయెను. పిమ్మట ఆ సుందరి యగు రాజ కన్య నిత్యము తన శరీరమునూ పోషించు కొన మొదలిడెను.
Summary of chapter 121 of the Mārkandeya Mahā Purana is as follows:
King Karandhama demonstrates extraordinary martial strength and righteous governance. When rival monarchs surrounded his capital in a surprise siege, Karandhama clapped his hands in divine prayer, generating a vast army from his own spiritual power that dispersed the enemy without bloodshed.