మార్కండేయ మహా పురాణము
63 - స్వారోచిష మన్వంతర వృత్తాంతము
మార్కండేయుడు:
ఏవం నిరస్య మానా స్తా హరిణేన మృగాంగనాః శ్రుత్వా స్వరోచి రాత్మానం మేనే స పతితం యథా త్యాగే చకార చ మనః స తాసాం మునిసత్తమః చక్రవాకీ మృగ ప్రోక్తో మృగచర్యా జుగుప్సితః సమేత్య తాభి ర్భూయశ్చ వర్ధమాన మనోభవః ఆక్షిప్త నిర్వేద కథో రేమే వర్ష శాతాని షట్ కింతు ధర్మావిరోధేన కుర్వన్ ధర్మాశ్రితాః క్రియాః భుంక్తే స్వరోచి ర్విషయాన్ సహతాభి రుదారదీః తతశ్చ జజ్ఞిరే తస్య త్రయః పుత్రాః స్వరోచిషః విజయో మేరు నందశ్చ ప్రభావశ్చ మహాబలః
మార్కండేయుడు:
అమృగాంనలయిన జింకలు మృగము యొక్క మాటలకు నిరాశ చెందినవి. ఇదంతయు వినిన స్వరోచి తనను తాను పతితునిగా తలచసాగెను. ఓ ముని సత్తమా! అతడు చక్రవాక మృగములచే ఈ విధముగా నిందను పొందిన వాడై చక్రవాక మృగములు ఆచరించిన క్రమము చూసి, తనను నిందితునిగా నెంచి, భార్యలను పరిత్యజించ వలెనని మనస్సులో తలచెను. కాని భార్యల చెంతకు చేరగానే కామ బ్రవృత్తి బలీయ మగుటచే అతని వైరాగ్యము నష్టమై పోయెను. మరియు ఆ తరువాత గూడ వారి సాంగత్యముతో ఆరు వందల సంవత్సరములు విహరించెను. అయినను ఉదార బుద్ధి గల స్వరోచి భార్యలతో విషయ భోగములు అనుభవించు చున్నను, స్వయముగా ధర్మ పథము వీడక సమస్త ధర్మాశ్రిత క్రియలను యథావిదిగా నిర్వర్తించు చుండెను. అనంతరము స్వరోచికి విజయుడు, ప్రభావుడు అను పేర్లు గల మహా బలవంతు లగు పుత్రులు కలిగిరి.
మనోరమా చ విజయం ప్రాసుతేం దీవరాత్మజా విభావరీ మేరునందం ప్రభావం చ కళావతీ పద్మినీ నామ యా విద్యా సర్వభోగో పపాదికా స తేషాం తత్ప్ర భావేణ పితా చక్రే పురత్రయమ్ ప్రాద్యాం తు విజయం నామ కామరూపే న గోత్తమే విజయాయ సుతాయాదౌ స దదౌ పుర ముత్తమమ్ ఉదీచ్యాం మేరునందస్య పురీం నందవతీమితి ఖ్యాతాం చకార పోత్తుంగ వప్ర ప్రకార మాలినీమ్ కళావతీ సురస్యాపి ప్రభావస్య నివేశితమ్ పురం తాళమితి ఖ్యాతం దక్షిణాపథ మాశ్రితమ్
ఇంతీవరుడను విధ్యాదరుని యొక్క కుమార్తె యగు మనోరమకు విజయుడు, విభావరి గర్భము నుండి మేరు నందనుడు, కళావతి గర్భము నుండి ప్రభావుడు జన్మించిరి. సర్వ భోగములను సంపాదించెడి పద్మిని అను పేరు గల విద్య యొక్క ప్రభావముచే తండ్రి యగు స్వరోచి మూడు పట్టణములను నిర్మించెను. తూర్పు దిక్కున కాపరూప పర్వతముపై నిర్మింప బడిన విజయుడను పేరుగల శ్రేష్టమగు పురమును విజయునకు ఇచ్చెను. ఉత్తర దిక్కున ఎత్తైన ప్రాకారములతో నిర్మింప బడిన నందవతి అను పేరుగల విఖ్యాతమగు పురమును నందునకు, మరియు దక్షిణ దిక్కున నిర్మింప బడిన తాళమను పేరు గల పురమును కలావతి పుత్రుడగు ప్రభావునకు ఇచ్చెను.
ఏవం నివేశ్య పుత్రా న్స పురేషు పురషర్శభః రేమే తాభిః సమం విప్రః మనోజ్ఞా స్వద్రి భూమిషు ఏకదా తు గతో రణ్యే విహర న్స ధనుర్ధరః చ కర్ష ధను రారోక్య వరాహ మతి దూరగమ్ అథా కాచిత భ్యేత్య తం తదా హరిణాంగనా మయ్యేవ పాత్యతాం బాణః ప్రసీదేతి పునః పునః కిమనేన హతే నాద్య మామశు వినిపాతయ త్వయా నిపాతితో బాణో దుఃఖా న్మాం మోక్ష మిష్యతి
ఓ విప్రా! ఆ పురుష శ్రేష్టుడు ఈ విధముగా ముగ్గురు పుత్రులను మూడు పురము లందు నియమించి భార్యలతో అత్యంత మనోహరములగు ప్రదేశము లందు విహరించ సాగెను. ఒకనాడు అతడు ధనుర్ధారియై వనము నందు విహరించుచూ అతి దూరమున నున్న ఒక వరాహమును చూసి విల్లు ఎక్కు పెట్టెను. అదే సమయమున ఒక లేడి అక్కడకు వచ్చి అతనితో మాటి మాటికి ఇట్లు చెప్పసాగెను. ‘ఆ బాణమును నాపై విడువుము. నాపై ప్రసన్నత జూపుము. నన్ను అనుగ్రహింపుము. ఇప్పుడు ఈ వరాహము మరణించుట నిష్ఫలము. అందుచేత వెంటనే నా పై బాణము వేయుము. మీరు వేసిన ఆ బాణము నన్ను దుఃఖము నుండి రక్షించును.’
స్వరోచి:
న తే శరీరం సరుజ మస్మాభి రూప లక్ష్యతే కిన్ను తత్కారణం యేనత్వం ప్రాణాన్ హాతు మిచ్చసి
స్వరోచి:
“నీ శరీరము ఏ విధము గాను రోగగ్రస్త మైనట్లుగా కనిపించుట లేదు. అయితే నీవు ఎందుకు ప్రాణ త్యాగమును చేయ వలెనని కోరు చున్నావు?”
మృగము:
అన్యాస్వాసక్త హృదయే యస్కింశ్చేతః కృతాస్పదమ్ మామ తేన వినా మృత్యు రేషదం కిమిహా పరమ్
మృగము:
ఎవని యొక్క హృదయము ఇతర స్త్రీల యందు ఆసక్తి కలిగి యున్నదో, అట్టి వాని యెడల నా హృదయము ఆసక్తి కలిగి యున్నది. అందువలన అతనిని పొందలేక పోయిన కారణమున నా యీ రోగమునకు మృత్యువు ఒక్కటియే ఔషదము. మరి యే ఉపాయము లేదు.
స్వరోచి:
కస్త్వాం నాభిలాషే ద్భీరుః సారాగాసి కుత్ర వా యద ప్రాప్తౌ నీవా న్ప్రాణా న్పరిత్యక్తుం వ్యవస్యసి
స్వరోచి:
ఓ భీరురాలా! ఎవడు నిన్ను అభిలషింపని వాడు? ఎవని యెడల నీవు అనురాగవతివై యున్నావు? ఎవనిని నీవు పొంద లేక ప్రాణ త్యాగము చేయ దలచితివి?
మృగము:
త్వామే వేచ్చామి భద్రం తే త్వయా మేపార హృతం మనః వృణోమ్యహ మాతో మృత్యుం మయి బాణో నిపాత్య తామ్
మృగము:
నేను మిమ్ములనే కోరి యుంటిని. మీకు మంగళ మగుగాక. మీరే నా హృదయమును హరించితిరి. అందు చేతనే నేను మృత్యువును అభిలషించు చుంటిని.
స్వరోచి:
త్వం మృగీ చంచలాపాంగీ నరరూపధరా వయమ్ కథం త్వయా సమం యోగో మద్వి ధస్య భవిష్యతి
స్వరోచి:
నీవు చంచలా పాంగి యగు మృగమువు కదా? నేను మనుష్య రూప ధారుడను. అందు చేత నా వంటి మానవునితో నీకు సంభోగ మెట్లు సంభవ మగును?
మృగము:
యది సాపేక్షితం చిత్తం మయితే మాం పరిష్వజ యది వ్యాసాధు చిత్తం తే కరిష్యామి యథేప్సితమ్
మృగము:
నా యెడల నీకు అనురాగ మున్నచో నన్ను ఆలింగనము చేసుకొనుడు. మీ మనస్సు మంచిగా నుండనిచో నేను మీ ఇష్ట ప్రకారముగా కార్యములను సాధింప గలను.
ఏతావతాహం భవతా భవిష్యా మ్యతి మానితా
ఇట్లు చేయుటచే మీ వలన నేను అత్యంతము సమ్మానతు రాల నగుదును.
మార్కండేయుడు:
ఆలిలింగ తత స్తాం స స్వరోచి ర్హరిణాంగనామ్ తేన చాలింగితా సద్యః సాభూ ద్దివ్య వపు ర్దరా తరః స విస్మయా విష్టః కా త్వ మిత్యభ్య భాషత సా చాస్మై కథయా మాస ప్రేమ లజ్జాజడా క్షరమ్ అహ మభ్యార్థితా దేవైః కాననస్యాస్య దేవతా ఉత్పాదనీయో హి మను స్త్వయా మయి మహామతే ప్రీతిమత్యాం మయి సుతం భూలోక పరిపాలకమ్ తముత్పాదయ దేవానాం త్వామహం వచనా ద్వదే తత స్స తస్యాం తనయం సర్వ లక్షణ లక్షితమ్
మార్కండేయుడు:
అనంతరము స్వరోచి ఆ హరిణాంగనను ఆలింగనము చేసుకొనెను. ఆతనిని ఆలింగనము చేసు కొనిన వెంటనే ఆ మృగము దేహ రూప దారిణియైన కామినిగా మారెను. స్వరోచి ఆమెను చూసి ఆశ్చర్య చకితుడై నీవెవరవు? అని అడిగెను. ఆ మృగము కూడా ప్రేమ భరితమైన సిగ్గు గలదై గాద్గాదిక స్వరమున ఆతనితో ఇట్లు పలికెను. “నేను ఈ వనమునకు అధి దేవతను. దేవతల యొక్క ప్రార్థనచే నేను మీ సమీపమునకు వచ్చితిని. ఓ మహామతీ! నా యందు మనువును జన్మింప జేయుట మీ కర్తవ్యము. నేను మీ యందు అనురాగము కలిగి యున్నాను. నా యందు ఆ భూలోక పరిపాలక పుత్రుని జన్మింప జేయుము. ఇది అంతయు నేను నీకు దేవతల యొక్క వచనానుసారము చెప్పితిని”. అనంతరము స్వరోచి ఆ వనదేవత యందు వెంటనే సర్వ లక్షణ యుక్తుడు, ఆత్మ తుల్యుడు, తేజస్వి అయిన ఒక పుత్రుని ఉత్పన్నము చేసెను. అప్పుడు ఆ పుత్రుడు జన్మించగానే దేవ దుందుభులు మ్రోగెను. గంధర్వ పతులు గానము చేయ సాగిరి. మరియు అప్సరసలు నాట్యము చేసిరి.
తేజస్విన మివాత్మానం జనయామాస తత్ క్షణాత్ జాత మాత్రస్య తస్యాథ దేవవాద్యాని సస్వమః జాగు ర్గంధర్వ పతయో వసృతు శ్చాప్స రోగణాః నిషిచుః శీకరై ర్మేఘా ఋషయశ్చ తపోధనాః దేవాశ్చ పుష్పవర్షం చ ముముచుశ్చ సమంతతః తస్య తేజః సమాలోక్య నామ చక్రే పితా స్వయమ్ ద్యుతిమానితి యేనాస్య తేజసా భాసితా దశః స బాలో ద్యుతిమాన్నామ మహాబల పరాక్రమః స్వరోచిషః సుతో యస్మా త్తస్మా త్స్వారోచిషో భవత్ స చాపివిచర న్రమ్యే కదాచి ద్గిరి నిర్ఘరే స్వరోచి ర్దదృశే హంసం నిజపత్నీ సమన్వితమ్ ఉవాచ స తదా హంసీ సాభిలాషాం పునః పునః
నాలుగు దిక్కుల యందలిది గజములు మేఘ జలములను తపో గుండములతో పీల్చి అభిషేకము చేసెను. తపోథనులగు ఋషి గణములు మరియ దేవ గణములు అన్ని దిక్కుల నుండి పుష్ప వృష్టి కురిపించ సాగిరి. ఆ బాలకుని తేజస్సుచే అన్ని దిక్కులు ప్రకాశింప సాగెను. అట్టి తేజస్సు గల శరీరమును చూసి తండ్రియగు స్వరోచి పుత్రునికి “ద్యుతిమాను”డను సార్థక నామమిడెను. ఈ ద్యుతిమానుడను బాలకుడు మహా బల పరాక్రమవంతు డయ్యెను. స్వరోచి యొక్క పుత్రుడగుట చేత ఆ మహా బాల పరాక్రమ వంతుడగు ద్యుతిమానుడను పేరుగల బాలకునకు “స్వారోచిషుడు” అను పేరు కూడా కలిగెను. స్వరోచి మరల వేరొక సమయ మందు రమణీయ పర్వత నిర్ఘర ప్రదేశము లందు విహరించు చుండగా, నిజ పత్నితో విహరించు చున్న ఒక హంసను చూసెను. ఆ హంస అభిలాష యుక్తురాలైన ఆడ హంసతో మాటి మాటికి ఇట్లు చెప్ప సాగెను.
ఉపసంహ్రియతా మాత్మా చిరం తే క్రీడితం మయా కిం సర్వకాలం భోగై స్తే ఆసన్నం చరమం వయః పరిత్యాగస్య కాలో మే తవ చాపి జలేచరిః
“జలచరీ! మనస్సును వృత్తి చేసుకొనుము. నీ సాంగత్యమున నేను చాలా కాలము వరకు విహరించితిని. సదా నిన్ను సంభోగించుటచే లాభమేమి కలుగును? ఇప్పుడు వృద్దావస్థ సంభవించినది. ఇప్పుడు నీవు మరియు నేను ఈ విషయ వాసనలను త్యజించ వలసిన సమయము”.
ఆడు హంస:
అకాలః కో హి భోగానాం సర్వం భోగాత్మకం జగత్ యజ్ఞాః క్రియంతే భోగార్థం బ్రాహ్మణైః సంయ తాత్మభిః దృష్టాదృష్టాం స్తథా భోగాన్ వాంఛమానా వివేకినః దానాని చ ప్రయచ్చంతి పూర్తాన్ ధర్మాంశ్చ కుర్వతే స త్వం నేచ్చసి కిం భోగాన్ భోగశ్చేష్ట ఫలం నృణామ్
ఆడు హంస:
“అనుభవించుటకు కాలము అకాలము అని ఏమి కలదు? ఈ జగ మంతయు భోగమయము. సంయతాత్ములగు బ్రాహ్మణ గణాలు భోగముల నిమిత్తము యజ్ఞములు చేయుదురు. మరియు జ్ఞానులు దృష్టాదృష్ట భోగములను కోరుతూ, దానములు మరియు (చెరువులు, బావులు, దేవ మందిరములు, మొదలగు వానిని నిర్మించుట) పూర్త ధర్మములు అనుష్టించెదరు. సంయతాత్ములు, వివేకము కల మనుష్యులకు కూడ భోగములే కర్మ ఫలములై యుండగా పక్షి జాతి విషయమున చెప్ప వలసిన దేమున్నది?”
వివేకినాం తిరశ్చాం చ కిం పునః సంయతాత్మనామ్
అందు వలన అట్టి భోగములను నీవు ఏ కారణమున ఇష్ట పడుట లేదు?
హంస:
భోగే ష్వాసక్త చిత్తానాం పరమార్థా న్వితా మతిః భవిష్యతి కదా సంగ ముపేతానాం చ బంధుషు పుత్ర మిత్ర కలత్రేషు సక్తా స్సీదంతి జంతవః నరాః పంకార్ణవే మగనా జీర్ణా వనగజా ఇవ కిం న వశ్యసి వా భద్రే! జాత సంగం స్సరోచిషమ్ ఆబాల్యా త్కామ సంసక్తం మగ్నం స్నేహాంబు కర్దమే యౌవనే తీవ భార్యాంసు సాంప్రతం పుత్రా నప్తృషు స్వరోచిషో మనో మగ్న ముద్దారం ప్రాప్స్యతే కుతః? నాహం స్వరోచిష స్తుల్యః స్త్రీవశ్యో వా జలచరి వివేకవాంశ్చ భోగానాం నివృత్తోస్మి చ సాంప్రతమ్
హంస:
ఎవని మనస్సు భోగముల యందు ఆసక్తి లేక యుండునో, ఆతని బుద్ధి పరమాత్మ వైపునకు పయనించును. బంధు వర్గాలతో సాంగత్యము గల మనుష్యులకు అటువంటి బుద్ధి ఎప్పటి కయినను కలుగ గలదా? పుత్రులు, మిత్రులు, భార్యలు, వీరి యందు ఆసక్తి గల ప్రాణి గణాలు సరోవరము నందలి బురదలో కూరుకు పోయిన వన గజముతో సమానముగా దుఃఖమును పొందుదురు. ఓ భద్రా! బాల్యావస్థ నుండి కామా సక్తుడై స్నేహ మనెడు బురద యందు మునిగి విషయాను రక్తుడైన స్వరోచిని నీవు చూడలేదా? యౌవన వతులగు భార్యలు, పుత్రులు, మరియు ఇతర స్త్రీలు, వీరి యందు నిమగ్నమై యున్న స్వరోచి మనస్సు ఏ విధముగా ఉద్దరింప బడ గలదు? ఓ జలచరీ! నేను స్వరోచి వలె స్త్రీ గణాలకు వశీభూతుడను గాను. నేను జ్ఞానిని. ఇప్పుడు భోగముల నుండి నివృత్తుడ నైతిని.
మార్కండేయుడు:
స్వరోచి రేత దాకర్ణ్య జాతోద్వేగః ఖగేరితమ్ ఆదాయ భార్యా స్తపసే యయా వన్య త్త పోవనమ్ తత్ర తప్త్వా తపో ఘోరం సహ తాభి రుదారధిః జగామ లోకా నమలాన్ నివృత్తా ఖిల కల్మషః
మార్కండేయుడు:
పక్షి పలికిన పలుకులు విన్న స్వరోచి ముగ్గురు భార్యలతో తపస్సు చేయుటకు తపో వనమునకు వెళ్ళెను. అక్కడ ఉదార బుద్ధి గల స్వరోచి భార్యలతో సహితముగా ఘోరమగు తపస్సు చేసి సంపూర్ణ పాపముల నుండి విముక్తుడై స్వర్గ లోకమునకు పయనించెను.
Summary of chapter 63 of the Mārkandeya Mahā Purana is as follows:
Svarochis wanders through celestial forests, rescuing the maiden Manoramā from a curse and learning the sacred science of Padminī Vidyā from her. Through his righteous valor and divine weapons, Svarochis protects sages and marries three noble maidens, establishing his royal reign.