మార్కండేయ మహా పురాణము
119 - అవీక్షిత చరితము
మార్కండేయుడు:
వీర్యచంద్ర సుతా సుభ్రూ ర్వీరా నామ శుభవ్రతా
స్వయంవరే సా జగృహే మహారాజం కరంధమమ్.
తస్యాం పుత్రం స రాజేంద్రో జనయామాస వీర్యవాన్
అవీక్షిత మితి ఖ్యాతి ముపేతం జగతీతలే.
జాతే తస్మి న్సుతే రాజా స దైవజ్ఞా నపృచ్చత
కచ్చి త్ప్రశస్త నక్షత్రే శస్త గ్నే సుతో మమ
కచ్చిచ్చాలోకితం జన్మ మమ పుత్రస్య శోభనైః
గ్రహైః కచ్చి న్న దుష్టానాం గ్రహాణాం రృక్పధం గతమ్.
ఇత్యుక్తా స్తేనా దైవజ్ఞా స్త మూచు ర్నృపతిం తతః
శాస్తే ముహూర్తే నక్షత్రే లగ్న చైవ సుత స్తవ.
మార్కండేయుడు:
ఓ ద్విజోత్తమా! స్వయంవర స్థలమున వీర్యచంద్రుని కుమార్తె శుభవ్రత యగు “వీరా” యను కన్య కరంధమ మహా రాజును వరించెను. ఆ రాజేంద్రుని వలన ఆమె గర్భము నుండి “అవీక్షితు” డను ప్రశస్త లగ్న శుభ నక్షత్రము నందు జన్మించినవాడా! ఈతని లగ్న స్థానము నందు శుభ గ్రహముల దృష్టి యున్నదా? ఈతని పై దుష్ట గ్రహాల దృష్టి పడలేదు గదా?” అట్లడిగిన పిమ్మట దైవజ్ఞులు ఇట్లు ప్రత్యుత్తర మిచ్చిరి “ఓ రాజా! నీ కుమారుడు ప్రశస్త ముహూర్త, ప్రశస్త నక్షత్ర, ప్రశస్త లగ్నము లందు జన్మించి నాడు.
సముత్పన్నో మహావీర్యో మహాభాగో మహాబలః
భవిష్యతి మహారాజ మహారాజ స్తవాత్మజః.
అవైక్షతేమం దేవానాం గురుః శుక్రశ్చ సప్తమః
సోమ శ్చతుర్ధం స్తనయం తవైనం సమవైక్షత.
ఉపాన్త సంస్థిత శ్చైవ సోమ పుత్రోప్యవైక్షత
నావై క్షతేమం సవితా న భౌమో న శనైశ్చరః.
తప పుత్రం మహారాజ! ధన్యోయం తనయ స్తవ
సర్వ కళ్యాణ సంపత్తి సమవేతో భవిష్యతి.
అందు వలన ఓ రాజా! ఇతడు మహా భాగ్య వంతుడు, అత్యంత వీరుడు, అద్భుత బల శాలియు నగు మహా రాజు అగును. ఇటు జూడుము, ఈ కుమారునికి బృహస్పతి, శుక్రులు సప్తమ మందుండి జన్మ లగ్మమును చూచు చున్నారు. మరియు చతుర్ధమును చంద్రు డవ లోకనము చేయు చున్నాడు. మరియు పదు నొకండవ స్థాన మందు స్థితుడైన బుధుని దృష్టి కూడ ఈతని పై నున్నది. నీ పుత్రుని పై రవి, మంగళ, శనైశ్చరుల దృష్టి పడ లేదు. అందుచే ఓ రాజా! నీ ఈ పుత్రుడు ధన్యుడు, మరియు సర్వ కళ్యాణ సంపత్తి యుక్తు డగును.
మార్కండేయుడు:
ఇతి దైవజ్ఞ వచనం నిశమ్య వసుధాధిపః
హర్ష పూర్ణ మనాః ప్రాహ నిజస్థాన గత స్తదా.
మార్కండేయుడు:
జ్యోతిష్కుల వచనములు వసుధేశ్వరుడు ప్రీతి పూర్ణ మనస్కుడై తన స్థానమున గూర్చుండి ఇట్లు చెప్ప సాగెను.
అవైక్షతేమం దేవానాం గురుః సోమః సితో బుధః
నావై క్షతేన మాదిత్యో నార్కనూను ర్న భూమిజః.
అవైక్షతేతి యత్ప్రక్తం భవద్భి ర్భహుశో వచః
అవీక్షితేతి తేనాస్య ఖ్యాతం నామ భవిష్యతి.
‘బృహస్పతి, బుధులు ఈ పుత్రుని అవలోకించు చున్నారు. కాని రవి, మంగళులు చూచుట లేదు’ అని మీరు మాటి మాటికి “అవైక్షత” శబ్దమును పలికితిరి. అందు వలన ఈ పుత్రుడు “అవీక్షితు” డను పేరుతో విఖ్యాతి చెందును గాక.
మార్కండేయుడు:
అవీక్షితః సుత స్తస్య వేద వేదాజ్గ పారగః
అస్త్రగ్రామ మశేషం స కణ్వ పుత్రా దథాగ్రహీత్.
స్వరూపేణాతి భిషజౌ దేవానాం పార్థివాత్మజః
బుధ్వా వాచస్పతిం కాంత్యా శశాఙ్కం తేజసా రవీమ్.
ధైర్యేణాబ్ధిం తథోర్వీం చ సాహిష్ణుత్వే స వీర్యవాన్
శౌర్యేణ న సమస్తస్య కశ్చి దాసీ న్మహాత్మనః.
మార్కండేయుడు:
వేద వేదాంగ పారంగతుడగు ఆ అవీక్షుతుడు కణ్వ పుత్రుని వలన. సంపూర్ణ అస్త్ర విద్యలు గ్రహించెను. ఆ రాజపుత్రుడు రూపమున దేవ వైధ్యులగు అశ్వినీ కుమారులను, బుద్ది యందు వాచస్పతిని, కాంతి యందు చంద్రుని, తేజస్సు నందు సూర్యుని, దైర్యము నందు సముద్రుని, సహన మందు పృథ్విని మించి యుండెను. మరి ఇతర పురుషులలో ఆ మహాత్మునితో సమాన మగు శూరుడు లేకుండెను.
స్వయంవరే తం జగ్పహే హేమధర్మాత్మజా వరా
సువేద తనయా గౌరీ సుభద్రా బలినః సుతా.
లీలావతీ వీర సుతా వీరభద్ర సుతా నిభా
భీమాత్మజా మాన్యవతీ దంభ పుత్రీ కుముద్వతీ.
యాశ్చైనం నాభినన్దన్తి స్వయం వర కృత క్షణాః
తాశ్చాపి స బలా ద్వీరో జగ్రాహ నృపతేః సుతః.
నిరాకృత్య నృపా న్సర్వాం స్తాసాం పితృకులాని చ
స్వయం హి వీర్య మాశ్రిత్య బలవా న్స బలోద్ధతః.
ఏకదా తు విశాలస్య విశాలాదిపతేః సుతామ్
వైశాలినీం స సుదతీం స్వయంవర కృతక్షణామ్.
పరిభూయాఖిలా న్భూపా న్న్వేచ్చయా న వృత స్తయా
బలాఙ్జ గ్రాహ విప్రర్షే! యథాన్యా బలగర్వితః.
హేమధర్ముని కన్య ‘వరా’, సుదేవుని కుమార్తె ‘గౌరీ’, బలి యొక్క పుత్రిక ‘సుభద్ర’, వీరభద్రుని కన్య ‘నిభా’, వీరుని కన్య ‘లీలావతి’ భీమ పుత్రిక ‘మాన్యవతి’ మఱియు దంభ కన్య ‘కుముద్వతి’ వీరు ఆతనిని స్వయంవరము నందు వరించిరి. మరియు ఏ ఏ రాజ కుమార్తెలు స్వయంవర మందు ఆతనిని వరించ లేదో, బలవంతుడు, బలోన్మత్తుడు నగు ఆ రాజ పుత్రుడు తన పరాక్రమముతో ఆయా రాజులను, వారి పితృ కులములను ఓడించి వారిని కూడ బలాత్కారముగా గ్రహించెను. ఓ విప్రర్షీ! ఒక నాడు విశాలాదిపతి విశాల రాజు యొక్క కన్య సుదతి వైశాలిని స్వయంవర మందు అతనిని వరించుటకు ఇష్టపడ లేదు. అప్పుడు అతడు బల గర్వముచే ఏ విధముగా ఇతర రాజ కన్యలను పరిగ్రహించెనో, అదే విధముగా సమస్త రాజులను పరాజితుల చేసి బలాత్కారముగా ఆమెను కూడ పరిగ్రహించెను.
తతస్తే భూభృతః సర్వే బహుశ స్తేన మానినా
నిరాకృతాః సునిర్విణ్ణాః ప్రోచు రన్వోన్య మాకులాః.
క్షమాతాం వంచనా మేతా మేకస్మా ద్భల శాలినామ్
బహూనా మేక వర్ణానాం జన్మ దిగ్వో మహీభృతామ్.
క్షత్రియో యః క్షతా త్త్రాణం పద్యమానస్య దుర్మదైః
కరోతి తస్య తన్నామ వృధై వాన్యే హి బిభ్రతి.
ఆత్మనోని క్షతత్రాణం దుష్టా దస్మా దకుర్వతామ్
భవతాం క్షత్రియకులే జాతానాం కీదృశీ మతిః.
ఆ రాజు లందఱు ఆ అవీక్షిత రాజుచే పలుమారులు పరాజితులై మరియు వ్యాకులతతో పరస్పరము ఇట్లు చెప్పుకొన సాగిరి. ఒకే జాతి బలశాలురు ఏకమైన రాజు లందరి ఎదుట ఒకే ఒక వీరుడు ఈ లలనను గ్రహించెను. ఇది చూచియు కూడ మీరు సహించి యుంటిరి. అందు వలన మీ యొక్క జన్మ తిరస్కార మైనది. దుష్ట మానవులు చంపి నప్పటికి అతనిని ఎవరు రక్షించునో, అతడే క్షత్రియుడు ఇతర పురుషుడు క్షత్రియు డను పేరును వృధాగా ధరించును, ఎవరినో అయినచో మాటలెల? రక్షించు కొనుటకు కూడ ప్రయత్నించ లేదు. క్షత్రియ కుల మందు జన్మించిన మీకు ఇదేమి బుద్ది?
ఉచ్చార్యతే స్తుతిర్యా వః సూతమాగధ వన్దిభిః
సా సత్యా మా వృథా వీరా! భవత్వారి వినాశనాత్.
చరతాం సా తథై వైషా భూపా శ్చారై ర్దిగన్తరే
పౌరషాశ్రయిణః సర్వే విశిష్ట కులసంభావాః.
బిభేతి కో న మరణా త్కో యుద్దేన వినామరః
విచింత్యై తన్న హాతవ్యం పౌరుషం శస్త్ర వృత్తిభిః.
ఏ తన్నిశమ్య తే భూపా విస్పష్టామార్ష పూరితాః
ఊచుః పరస్పరం సర్వే సముత్తస్థుశ్చ సాయుధా.
కేచి ద్రథా నారురుహుః కేచి న్నాగాం స్తథా హయన్
అన్యేమర్ష పరాధీనా స్తముపేతాః పదాతయః
ఓ వీరులారా! సూత్ర, మాగధ వంది గణాలు చేయు స్తోత్రములు వ్యర్ధములు కాకూడదు. శత్రు వినాశనము చేసి వారి స్తుతులను సత్యము చేయుడు. మీ యొక్క ‘భూపతి’ యను శబ్దము దిగంతరము లందు వ్యర్ధముగా ప్రచారము చేయవద్దు, మీరందరూ శ్రేష్ట కులము నందు జన్మించితిరి. అందు వలన పౌరుషము గల వారు. ఎవడు మృత్యు వనిన భయపడడు? మరియు యుద్దము పరిత్యజించియే ఎవరు అమరు డగును? అని ఈ విధముగా విచారించిన శస్త్రధారులకు పౌరుషము విడుచుట ఉచితము గాదు. ఈ వచనము లన్ని విన్న భూపాల గణాలు అత్యంత కుపితులై పరస్పరము ఉత్సాహముతో సంభాషించుకొను సాగిరి. మరియు తిరిగి శస్త్రాలను గ్రహించి లేచి నిలుచుండిరి కొందఱు రథములపై, కొందఱు గుఱ్ఱములపై నెక్కి పోయిరి, మరియు కొందఱు క్రోధ చిత్తులై నడచియే అవీక్షితుని సమీపమునకు వచ్చిరి.
Summary of chapter 119 of the Mārkandeya Mahā Purana is as follows:
Prince Vivimsha, son of Khanitra, ascents the throne and rules with immense valor and devotion. Under his rule, agricultural yields multiply, crime disappears, and the kingdom prospers through regular performance of Yajnās.