మార్కండేయ మహా పురాణము
22 – మాయా మదాలస వివాహము
పుత్రుడు:
కృతాహారం మహాత్మాన మధిపం పవనా శినామ్ ఉపాసాం చక్రిరే పుత్రౌ భూపాల తనయ స్తథా కథాభి రనురూపాభిః ప్రహృష్టాత్మా భుజంగమః ప్రీతిం సంజనయామాస పుత్రా సఖ్యు రువాచ హ తవ భద్రః సుఖ భూహిః గేహ మభ్యాగతస్య యత్ కర్తవ్య ముత్సృజాశంకాం పితరీవ సుతేమయి హిరణ్యం వా సువర్ణం వా వస్త్రం వాహన మాసనమ్ యద్వాభిమత మత్యర్థం దుర్లభం తచ్ఛృణుప్వ మామ్
పుత్రుడు:
తరువాత ఆ ఇద్దరు కుమారులు మరియు నా రాజ పుత్రుడు ఆ నాగరాజును సేవించు చుండిరి. భుజంగ రాజు రాజ కుమారుడు చెప్పుచున్న అను రూపములైన కథలకు సంతుష్టాంతరంగు డయ్యెను. శుభ స్వరూపుడ వైన రాజ కుమారా! నీవు నా గృహమున కభ్యాగతుడవై వచ్చితివి. నీకు సుఖముగా నున్నదా? సందేహమును వీడుము. నన్ను నీ తండ్రి వలెనె భావించి ప్రవర్తించుము. బంగారము గాని, రజతము గాని, వస్త్ర వాహనములు గాని నీ కేది అభిమతమో నాకు తెలుపుము. అత్యంత దుర్లభమైన దైనను చెప్పుము.
కువలయాశ్వుడు:
భవత్ప్రసాదా ద్భగవన్ సువర్ణాది గృహే మమ పితు రస్తి మమాధ్యాపి న కిన్చితా రయ మీదృశైః
కువలయాశ్వుడు:
పూజ్యుడా! తమ యనుగ్రహము చేత మా తండ్రి గారి గృహమున సువర్ణాది సర్వ వస్తువు లున్నవి. ఇప్పటి వరకు వాటి యవసరము లేదు.
తాతే వర్ష సహస్రాయుః శాసతీమాం వసుంధరామ్ తథైవ త్వయి పాతాళం న మే యాచ్ఞోన్ముఖం మనః తే సుభాగ్యా స్సుపుణ్యాశ్చ యేషాం పితరి జీవతి తృణం కోటి సమం విత్తం తారుణ్యం విత్తకోటిషు మిత్రాణి తుల్య శిష్టాని తద్వద్దేహ మనామయమ్ జనే వా థ్రియతే విత్తం యౌవనం కిం తు నాస్తి మే అసత్యర్థే నృణాం యాచ్ఞా ప్రవణం జాయతే మనః సత్యశేషే కథం యాచ్ఞాం మామ జిహ్వా కరిష్యతి యై ర్నచింత్యం ధనం కించి న్మమ గేహేస్తి నాస్తి వా పితృ బాహు తారు చ్చాయాం సంశ్రితాః సుఖినో హితే
నా తండ్రి సహస్ర వర్షములు లీ భూమిని, నీవు పాతాళమును పాలించు చుండగా నా మనస్సు యాచించుట కంగీకరింపదు. తండ్రి జీవించి యున్నవాడు ధన్యుడు. పుణ్యవంతుడు. అట్టి వానికి తరుణ యౌవనమే మహ దైశ్వర్యము. అన్యము లయిన ధనాదు లన్నియు తృణ ప్రాయములు. నా స్నేహితులు శిష్టాచార సంపన్నులు. ఆ విధముగా నేను నా దేహము పుష్టి గలవై యున్నవి. రాజ్యమున ప్రజలు ధనవంతులు. నేను తరుణ వయస్కుడను. ఇంకా నాకు లేనిదేమి? మానవుల మనస్సు లేమి చేత పరులను యాచించుటకు సిద్ధ పడును. సమస్త వస్తువులను సమృద్ధముగా కలిగి యున్న నేనెట్లు యాచించ గలను? ఇష్ట ఫల ప్రదమైన మహా వృక్షమును బోలిన తండ్రి యొక్క భుజ చ్చాయ నాశ్రయించిన వాడు తన ఇంటి యందు ధనమున్నదా? లేదా ? యని విచారముతో నిమిత్తము లేకయే సుఖించును.
ఏ తు బాల్యాత్ ప్రభృత్యేవ వినా పిత్రా కుటుంబినః తే సుఖాస్వాద విభ్రంశాన్ మన్యే ధాత్రైవ వంచితాః తద్వయం తత్ప్రసాదేన ధనరత్నాది సంచయమ్ పితృభక్తాః ప్రయచ్చామః కామతో నిత్య మర్థినామ్ తత్సర్వ మిహ సంప్రాప్తం యదంఘ్రి యుగలం తవ మచ్చూడామణినా ఘృష్టం యచ్చాంగ స్పర్శ మాప్తవాన్
బాల్యము నుండియు పితృ హీనులై కుటుంబ భారమును మోయుచున్న వారు, సుఖానుభవము లేనివారు, విది వంచితులని తలంచెదను. అందువలన పితృ భక్తులమైన మేము పితృ ప్రసాదము వలన ప్రతి దినమును యాచకులకు ధన రత్నాది సంచయమును యధేచ్చగా నిచ్చు చున్నాము. ఇచ్చట తమ పాద యుగ్మమునకు నా శిరో రత్నమును ఘటించుట (నమస్కారము చేయుట) వలన తమ దివ్య తను స్పర్శ లభించినది. అందు వలన సర్వ సంపదలును సంప్రాప్తించినవి.
పుత్రుడు:
ఇత్యేవం ప్రశ్రితం వాక్య ముక్తః పన్నాగా సత్తమః ప్రాహ రాజసుతం ప్రీత్యా పుత్రయో రూపకారిణమ్ యది రత్న సువర్ణాది మత్తోవాప్తుం న తే మనః యదన్య న్మనసః ప్రీత్యై బ్రూహి తత్తే దదామ్యాహమ్
పుత్రుడు:
అట్లు వినయ పూర్వకముగా రాజ కుమారుడు చెప్పినది విని తన కుమారుల నత్యంతము స్నేహమున సమ్మానించు నతనితో పన్నగ ప్రభు డిట్లనెను. రాజ కుమారా! కాంచన, ధన, రత్నములను, నీవు నా వలన పొందుటకు ఇష్టపడనిచో నీ మనః ప్రీతికారక మైనది, మరేదైనను, కోరుకొనుము. ఇచ్చెదను.
కువలయాశ్వుడు:
భగవం స్త్వత్ప్ర సాదేనా ప్రార్థితస్య గృహే మమ సర్వ మస్తి విశేషేన సం పాప్తం తవ దర్శనాత్ కృతకృత్యోస్మి చైతేన సఫలం జీవితం మమ యదంగ సంశ్లేష మిత స్తవ దేవస్య మానుషః మమోత్తమాంగే త్వద్పాద రసజా యదిహా స్పదమ్ కృతం తేనైవ న ప్రాప్తం కింమయా పన్నగేశ్వరః యది త్వవశ్యం దాతవ్యో వరో మే మనసేప్సితః తత్పుణ్య కర్మ సంస్కారో హృదయా న్మా వ్యపైతు మే సువర్ణ మణి రత్నాది వాహనం గృహ మానసమ్ స్త్రియోన్నపానం పుత్రాశ్చారు మాల్యాను లేపనమ్ ఏతే చ వివిధా భోగా గీత వాద్యాదికం చ యత్ సర్వ మే తన్మయ మతం ఫలం పుణ్య వనస్పతేః తస్మాన్న రేణ తన్మూల సేకే యత్నః కృతాత్మనా కర్తవ్యః పుణ్య సక్తానాం న కించి ద్చువి దుర్లభమ్
కువలయాశ్వుడు:
మీ యనుగ్రహము వలన కోర వలసిన వన్నియు నా గృహము నందున్నవి. ఇప్పుడు మీ దర్శన ప్రాప్తి చేత ఆ సంపద యంతయు విశేష ఫలప్రద మయినది. మనుష్య మాత్రుడ నైన నాకు దేవతా మూర్తివైన నీ దేహాలింగన భాగ్యము కలుగుట వలన నేను కృత కృత్యుడ నయితిని. నా జీవితము సఫలమైనది. పన్నగేశ్వరా! నా శిరస్సున మీ పవిత్ర పాదధూళిని ధరించిన పిమ్మట నాకు ప్రాప్తించని దేముండును? నాకు వరము ఏదేని తాము అనుగ్రహింప దలచిన యెడల నా హృదయము నుండి పుణ్య కర్మ సంస్కారము తొలగ కుండునట్లు అనుగ్రహింప వలెను. ఇదియే నా మనోభీష్టము. బంగారము, రత్నములు, వాహనములు, గృహములు, ఆసనములు, కాంతలు, అన్నపానములు, పుత్రులు, గీత వాద్యములు మొదలైన వివిధ భోగము లన్నియు పుణ్య మనెడు వృక్షము యొక్క ఫలము లనియే నా విశ్వాసము. అందువలన బుద్ధిమంతుడగు నరుడు ఆ పుణ్య వృక్షమునకు దోహదము చేయుటయే కర్తవ్యము. పుణ్య కర్మాసక్తులగు వారికి ప్రపంచ మందు పొంద రానిది ఏదియు నుండదు.
అశ్వతరుడు:
ఏవం భవిష్యతి ప్రాజ్ఞ! తవ ధర్మా శ్రితా మతిః సత్యం చైత త్ఫలం సర్వం ధర్మ స్యోక్తం యథా త్వయా తథాప్యవశ్యం మద్గేహ మాగతేన త్వయాదునా గ్రాహ్యం యన్మానుషే లోకే దుష్ప్రాపం భవతో మతమ్
అశ్వతరుడు:
ప్రాజ్ఞుడగు నో రాజకుమారా! నీ మనస్సెప్పుడును ధర్మమునే ఆశ్రయించి యుండు గాక. నీవు చెప్పిన విధముగా సర్వ భోగములును ధర్మమూ వలన కలుగు ఫలములే. అది సత్యము. అయినను ఇప్పుడు నీవు నా యింటికి వచ్చితివి కావున మీ మానవ లోక దుర్లభ మయిన దానినే దైనను గ్రహింప వలసి యుండును.
పుత్రుడు:
తస్య తద్వచనం శ్రుత్వా స తదా నృపనందనః ముఖావ లోకనం చక్రే పన్నగేశ్వర పుత్రయోః తత స్తౌ ప్రణిపత్యోభౌ రాజపుత్రస్య యన్మతమ్ త త్పితుః సకలం వీరౌ కథయామాసతు స్ఫుటమ్ తాతాస్య పత్నీదయితా శ్రుత్వేమం వినిపాతితమ్ అత్యజ ద్దయితాన్ ప్రాణాన్ విప్రలబ్దా దురాత్మనా తేనాపి కృతవైరేణ దానవేన కుబుద్దినా గంధర్వ రాజస్య సుతా నామ్నాఖ్యాతా మదాలసా కృతజ్ఞోయం తత స్తాత ప్రతిజ్ఞాం కృత్వా నిమామ్ నాన్యా భార్యా భవిత్రీ మే వర్ణయిత్వా మదాలసామ్ ద్రష్టుం తాం చారు సర్వాంగీ మయం వీరో ఋతధ్వజః తాతః వాంఛతి యద్యేత త్క్రియతే తత్కృతం భవేత్
పుత్రుడు:
ఆ రాజ పుత్రుడు ఆ మాటలు విని పన్నాగ రాజ కుమారుల ముఖముల వంక చూచెను. అప్పుడు నాగ పుత్రులు తండ్రికి నమస్కరించి రాజ కుమారుని యభీష్టమును తండ్రికి స్పష్టముగా నివేదించిరి. తండ్రీ! ఒక దురాత్ముని వంచన వలన నితడు మృతుడైనాడని విని యితని భార్య ప్రియములైన ప్రాణముల వదిలెను. వీరి యందు విరోధముచే దుష్ట బుద్ధియగు ఒకానొక రాక్షసుడు ఆ పని చేసెను. ఇతని భార్య పేరు మదాలస. ఆమె గంధర్వ రాజ కుమార్తె. జనకా! మదాలస ప్రాణ త్యాగము చేసిన తరువాత నితడు ఆమె యందలి కృతజ్ఞతా ప్రకాశముగా మదాలస స్థానములో మరి యే స్త్రీయు తనకు భార్యగా కాజాలదని ప్రతిజ్ఞ చేసెను. వీరుడైన యీ ఋతధ్వజుడు మనోహరములైన అవయవములు గల తన భార్యను జూడవలె నని కోరుచున్నాడు. అది చేసిన యెడల అతని కోరిక తీర్చినట్లగును.
అశ్వతరుడు:
భూతై ర్వియోగినో యోగ స్తాదృశై రేవ తాదృశః కథమేత ద్వినా స్వప్నం మాయాం వా శంబరోదితామ్
అశ్వతరుడు:
పంచ భూతములలో వియోగమును పొందిన తరువాత పూర్వపు దేహమును చూచుటకు స్వప్నము నందు గాని లేక శంబర మాయచే గాక ఇతర విధమున సాధ్యము గాదు.
పుత్రుడు:
ప్రణిపత్య భుజంగేశం పుత్రః శత్రుజిత స్తతః ప్రత్యువాచ మహాత్మానం ప్రేమ లజ్జా సమన్వితః మయామయీ మప్యదునా మమ తాతో మదాలసామ్ యది దర్శయతే మన్యే పరం కృతమనుగ్రహమ్
పుత్రుడు:
శత్రుజిత్తు తనయుడైన ఋతధ్వజుడు మహాత్ముడైన నాగేంద్రునకు నమస్కరించి ప్రేమ లజ్జా సమన్వితుడై ఇట్లు పలికెను. తండ్రీ! ఈ సమయమున తాము నాకు మదాలసను మాయా రూపకముగా చూపినప్పటికి నన్ననుగ్రహించి నట్లుగా తలచెదను.
అశ్వతరుడు:
తస్మాత్ప శ్యేహ వత్స త్వం మాయాం చేద్ద్రష్టు మిచ్చసి అనుగ్రాహ్యో భవాన్ గేహే బాలోప్యభ్యాగతో గురుః
అశ్వతరుడు:
వత్సా! బాలుడ వైనను అభ్యాగతుడవు గాన గురు తుల్యుడవు. మాయా జనితమైన మదాలసను చూడగోరినచో అట్లే చూడుము. నీవు అనుగ్రహింప దగిన వాడవు.
పుత్రుడు:
ఆనయామాస నాగేంద్రో గృహే గుప్తాం మదాలసామ్ దర్శయామాస చ తదా రాజపుత్రాయ తాం శుభామ్
పుత్రుడు:
నాగేంద్రు డపుడు తన సౌధము నందు రహస్యముగా నుంచ బడిన శుభ లక్షణ యగు మదాలసను పిలిపించి రాజ పుత్రునకు చూపెను.
తేషాం సమ్మోహనార్థాయ జజల్ప చ తతః స్ఫుటమ్ సేయం నవేతి తే భార్యా రాజపుత్ర మదాలసా
సభలో నున్న వారిని మభ్య పెట్టుటకు మంత్రములు పఠించినట్లు నటించి తరువాత స్ఫుటముగా రాజ పుత్రా! నీ భార్య మదాలస ఈమెయేనా యని అడిగెను.
జడుడు:
స దృష్ట్వా తాం తదా తన్వీం తత్ క్షణా ద్విగత త్రపః ప్రియేతి తా మభిముఖం యయౌ వాచా ముదీరయ నివారయామాస చ తం నాగః సోశ్వతర స్త్వరన్
జడుడు:
పిమ్మట రాజ కుమారుడు మదాలసను చూచి నంతనే లజ్జను విడచి ప్రియా! యని పలుకుచు నామే కభిముఖముగా వెళ్ళెను. నాగరాజగు ఆశ్వతరుడు వెంటనే అతనిని నివారించెను.
అశ్వతరుడు:
మాయేయం పుత్ర మాస్ప్రాక్షీః ప్రాగేవ కథితం తవ అంతర్థాన ముపైత్యాశు మాయా సంస్పర్శనా దిభిః
తతః పపాత మేదిన్యాం స తు మూర్చా పరిప్లుతః హా! ప్రియేతి వదన్ సోథ చింతయామాస భామినీమ్ మోహో మమాయం నో వేతి నాలం ప్రత్యయవా నహమ్
అశ్వతరుడు:
కమారా! మాయా రూపము గల మదాలస యని నీకు పూర్వము జెప్పి యుంటిని. ఈమెను స్పృశించ వలదు. స్పర్శన సంభాషణాదుల వలన మాయా మదాలస శీఘ్రముగా అంతర్థానము పొందును. ఆ మాటలు వినిన వెంటనే రాజకుమారుడు మూర్చా క్రాంతుడై నేలపై బడెను. హా! ప్రియురాలా! యని పలుకుచు నాకు చిత్త విభ్రమము కలిగినదేమో తెలియ కున్నాను” అని మదాలసను గురించి దుఃఖించ సాగెను.
అహో మామే త్యహం చేతి బలం ప్రత్యయయో ర్మహత్ యే నాహం పాతనోరీణాం వినా శస్త్రం నిపాతితః మమేతి దర్శితా నేన మిథ్యా మాయేతి విస్ఫుటమ్ వాయ్యంబు తేజసాం భూమే రాకాశస్య చ చేష్టయా
ఆహా! ఏమిది? నేను నాదియను విశ్వాస బలము ఎంత గొప్పది? వాయువు, అగ్ని, నీరు, ఆకాశము, భూమియను పంచ భూత లక్షణములు కలిగిన నిజమైన మదాలసగా నాగరాజుచే నాకు చూపబడినది, ఆమె మిథ్య యని స్పష్టమైనను శత్రు హంతకుడనైన నేను అహంకార మమకారముల చేత ఆమె నిజముగా నా భార్య యని భావించి శస్త్ర హతుని వాలే పతితుడ నైతిని.
పుత్రుడు:
తతః కువలయాళ్వం సమాశ్వాస్య భుజంగమః కథయామాస తత్సర్వం మృత సంజీవనా దికమ్ తతః ప్రహృష్టః ప్రతిలభ్య కాంతం ప్రణమ్య నాగం నిజ మాజగామ సంస్తూయ మానః స్వపురం తమశ్వ మారుహ్య సంచితిత మభ్యుపేతమ్ శృణుయా ద్భక్తి పూర్వం యో నైరంతర్యేణ మానవః వేదం ఘోష ఫలం తేన ప్రాప్తం వై భువి దుర్లభమ్ సంప్రాప్నోతి సుఖం నిత్యం సర్వకామ సమన్వితః లోకే చ దుర్లభం తస్య నాస్తి కించి న్న విద్యతే
పుత్రుడు:
తరువాత భుజంగ పతి యగు ఆశ్వతరుడు రాజ కుమారుడైన కువలయాశ్వుని ఓదార్చి మరణించిన మదాలస ఏవిధముగా పునర్జీవితురా లయ్యెనో ఆ విషయమును వివరముగా చెప్పెను. అపుడు కువలయాశ్వుడు ప్రియ భార్యను పొందుటచే మిక్కిలి సంతోషమును పొందెను. నాగ రాజునకు నమస్కరించి స్మరణ మాత్రమున ప్రత్యక్షమైన తన అశ్వమును భార్యతో నధిరోహించి నిజపురమున కేగెను. ఈ కువలయాశ్వ చరిత్రను ఏ మానవుడు నిరంతర భక్తీ పూర్వకముగా వినునో అతడు భూమి యందు దుర్లభ మైన వేదం పారాయణ సత్ఫలమును పొందును. సర్వ కామ సమన్వితుడై ఎల్లప్పుడు సుఖమును పొందును. లోకము నందు వానికి దుర్లభమైన దేదియు నుండదు.
Summary of chapter 22 of the Mārkandeya Mahā Purana is as follows:
A tragic trial besets the royal couple when Tālaketu, the vengeful brother of Pātālaketu, deceives Prince Kuvalayāshva with illusory news. Disguised as a hermit, the demon falsely informs Queen Madālasā that Kuvalayāshva was slain in battle against demons. Overwhelmed by unbearable grief and total devotion to her husband, Madālasā instantly abandons her physical body through the sheer power of her marital vow.