57 - భువనకోశ వర్ణనము

మార్కండేయుడు:

యత్తు కింపురుషు వర్షం తత్ప్ర వక్ష్యామ్యహం ద్విజః తత్ప్రాయు ర్దశ సాహస్రం పురుషాణాం వపుష్మతామ్ అనామయాద్యశోకాశ్చ నరా యత్ర తభా స్త్రియః ప్లక్షః ఖండశ్చ తత్రోక్త స్సుమహా న్నందనోవ మః తస్యతే వై ఫలరసం పిబంతః పురుషాస్సదా స్థిరయౌవన నిష్పన్నాః స్త్రియశ్చోత్పల గంధికాః అతః పరం కింపురుషా ద్ధరివర్షం ప్రచక్షతే మహా రజత సంకాశా జాయంతే తత్ర మానవాః దేవలోకచ్యుతా స్సర్వే దేవరూపాశ్చ సర్వశః హరివర్షే నరాస్సర్వే పిబంతీక్షురసం శుభమ్

మార్కండేయుడు:

ఓ ద్విజోత్తమా! ఇప్పుడు కింపురుష మను దేశము గురించి చెప్పెదను వినుము. అక్కడ శరీర ధారులగు పురుషులు పది వేల సంవత్సరములు జీవించుదురు. అక్కడి స్త్రీ పురుషులు రోగ రహితులు, శోక రహితులు అయి ఉందురు. ఆ ప్రదేశము నందు నందన వనముతో సమానమగు గొప్పదగు ఒక ప్లక్ష ఖండము ఉన్నది. అచటి మనుష్యులు ఎల్లప్పుడు ఆ వృక్షముల యొక్క ఫల రసములు త్రాగి స్థిర యౌవనులై ఉందురు. మరియు స్త్రీలు పద్మముతో సమానమగు గంధ యుక్తులై ఉందురు. ఈ కింపురుష వర్షము తదుపరి మధ్యమున హరి వర్షమను పేరు గల వర్షమున్నది. అచట జన్మించిన పురుషులు శ్రేష్ఠమగు వెండితో సమానమగు వర్ణము గలవారై ఉందురు. ఎట్టి దేవ రూపము గల మనుషులు దేవ లోకచ్యుతులై హరి వర్షము నందు జన్మింతురు. వారు అచటి ఉత్తమమగు చరకు రసమును త్రాగు చుందురు.

న జరాబాధతే తత్ర న జీర్యం తే చ కర్హిచిత్ తావంత మేవతే కాలం జీవంత్యథ నిరామయాః మేరు వర్షం మయా ప్రోక్తం మధ్యమం యదిలా వృతమ్ నతత్ర సూర్యస్తపతి న తే జీర్యంతి మానవాః లభంతే నాత్మలాభం చ రశ్మయ శ్చంద్ర సూర్యయోః నక్షత్రాణాం గ్రహాణాం చ మేరో స్తత్ర పరాద్యుతిః పద్మ ప్రభాః పద్మగంధా జంబూఫల రసాశినః పద్మపత్రాయతా క్షాస్తు జాయంతే తత్రమానవాః వర్షాణాం తు సపాస్రాణి తత్రాప్యాయు స్త్రయోదశ శరావాకార సంస్తారో మేరుమధ్యే ఇలావృతే

ముసలితనము వారిని పీడింపదు. అందుచేత ఎవ్వరును జీర్ణము కారు. మరియు ఎంత కాలము వరకు వారు జీవించి ఉందురో అంతవరకూ ఎల్లప్పుడు యౌవనులై ఉందురు. మరియు రోగము లేనివారై ఉందురు. మేరు వర్షమను పేరు గల మధ్యమ వర్షమును ఇలావృతమని అందురు. అచట సూర్యుని తాపము ఉండదు. మనుష్యులు ముసలితనముచే క్షీణింపరు. సూర్య చంద్ర గ్రహముల మరియు నక్షత్రముల కిరణములు అక్కడ ప్రకాశమును పొందలేవు. ఎందుచేత ననగా అక్కడ సుమేరు పర్వతము యొక్క అత్యంత మగు జ్యోతి ప్రకాశించు చుండును. మేరు వర్ష మందు జన్మించిన మనుష్యులు పద్మముతో సమానముగా ప్రభాయుక్తుడై, పద్మ గంధ యుక్తుడై, పద్మ పత్రములతో సమానమగు విశాలమగు నేత్రములు గలవారై, జంబూ ఫల రసమును త్రాగువారై యుందురు. ఆ మానవుల యొక్క ఆయువు పదమూడు వేల సంవత్సరములు ఉండును. మరియు ఇలావృతమునకు మధ్య భాగమందున్న మేరు అను పర్వతము యొక్క ఆకారము శరావము మూకుడుతో సమానంగా ఉండును.

మేరు స్తత్ర మహాశైల స్తవాఖ్యాట మిలావృతమ్ రమ్యకం వర్ష మస్మాచ్చ కథయిష్యే నిబోధ తమ్ వృక్ష స్తత్రాపి చోత్తుంగో న్యగ్రోదో హరితచ్చదః తస్యాపి తే ఫలరసం పిబంతో పర్తయంతి వై వర్షాయుతా యష స్తత్ర నరాస్తత్ఫల భోగినః రతిప్రదానా విమలా జరాదౌర్గంధ్య వర్జితాః తస్మాదథోత్తదం వర్షం నామ్నాఖ్యాతం హిరణ్మయమ్ హిరణ్వతీ నదీయత్ర ప్రభూత కమలోజ్జ్వలా మహాబలా సతే జస్కా జాయంతే తత్ర మానవాః మహాకాయా మహా సత్త్వా ధనినః ప్రియ దర్శనాః

మనవి: ఇక్కడ కొన్ని శ్లోకములు, భావము మూల గ్రంధము నందు లేవు.