మార్కండేయ మహా పురాణము
103 - భాను తను లేఖనము
మార్కండేయుడు:
అథ తస్మై దదౌ కన్యాం సంజ్ఞాం నామ వివస్వతే ప్రసాద్య ప్రణతో భూత్వా విశ్వకర్మా ప్రజాపతిః వైవస్వతస్తు సంభూతో మనుస్తస్యాం వివస్వతః పూర్వ మేవ తథా ఖ్యాతం తత్స్వరూపం విశేషతః
మార్కండేయుడు:
అనంతరము ప్రజాపతి యగు విశ్వకర్మ ప్రణతుడై వివస్వానుని ప్రసన్నుడిగా చేసి సంజ్ఞా దేవి యను పేరు గల తన కన్య నిచ్చెను. ఆ సంజ్ఞా దేవి గర్భము నుండి వివస్యానునకు “వైవస్వతు”డను పేరు గల పుత్రుడు జన్మించెను. అతని వృత్తాంతమును ఇంతకు ముందు విశేషముగా చెప్పి యుంటిని.
క్రౌష్టుకి:
భూయశ్చ శ్రోతుమిచ్ఛామి మార్తాండస్య మహాత్మనః । చరితం హంతి యత్పాపం కలౌ సంశృణ్వతాం నృణాం ॥
క్రౌష్టుకి:
ఏ చరిత్ర వినిన వారికి కలి సంబంధమగు పాపము లన్నియు నాశనము చేయునో, అట్టి మార్తాండ మహాత్ముని యొక్క చరిత్రను నేను తిరిగి వినగోరు చున్నాను.
మార్కండేయుడు:
త్రీ ణ్యపత్యాన్యసౌ తస్యాం జనయామాస గోపతిః ద్వౌ పుత్రౌ నుమహాభాగౌ కన్యాం చ యమునాం మునే మను ర్వైవస్వతో జ్యేష్ఠః బ్రాద్ధదేవః ప్రజాపతిః తతో యమో యమీ చైవ యమశౌ సంబభూవతుః యత్తేజో భ్యదోకం తస్య మార్తాండస్య వివస్వతః తేనాతితాపయామాస త్రీం ల్లోకాన్స చరాచరాన్
మార్కండేయుడు:
ఓ మునీ! గోపతి యగు సూర్యుడు సంజ్ఞా దేవి గర్భము నుండి మహా భాగ్యవంతులగు ఇద్దరు పుత్రులు, యమున పేరు గల ఒక కన్య కలిగిరి. ఇందు శ్రాద్ధ దేవుడు ప్రజాపతి యగు వైవస్వత మనువు జ్యేష్టుడు తరువాత యముడు మరియు యమున అను పేరు గల కవలలు జన్మించిరి. ఆ సమయమున మార్తాండుడు తనకు గల అధికమైన తేజస్సుచే ముల్లోకముల లోని సచరాచరములను తపింప జేయు చుండెను.
గోళాకారం తు తద్ద్రుష్ట్వా సంజ్ఞా రూపం వివస్వతః అసహన్తీ మహత్తేజః స్వాం ఛాయాం ప్రేక్ష్య సాబ్రవీత్
సంజ్ఞా దేవి గోళాకారములో నున్న వివస్వానుని రూపమును, అతని తేజస్సును భరించ లేక తన ఛాయతో నిట్లు పలికెను.
సంజ్ఞా దేవి:
అహం యస్యామి భద్రం తే న్వమేవ భవనం పితుః నిర్వికారం త్వయా ప్యత్ర స్థేయం మచ్చాసనా చ్చుభే ఇమౌ చ బాలకౌ మహ్యం కన్యా చ వరవర్ధినీ సంభావ్యౌ నైవః మిదం భగవతే త్వయా
సంజ్ఞా దేవి:
“ఓ సుభాంగీ! నీకు శుభమగు గాక. నేను నా తండ్రి గారి గృహమునకు పోవు చున్నాను. నీవు నా ఆజ్ఞను పాటించుచు నిర్వికార చిత్తముతో నా స్థానమున నివసింపుము. నా యిద్దరు పిల్లలను వరవర్ణిని యగు కన్య యెడల స్నేహముగా నుండ వలెను. మరియు ఈ వృత్తాంతమును సూర్య భగవానునికి ఎప్పుడును చెప్పరాదు.”
ఛాయా దేవి:
ఆకేశ గ్రహణా ద్దేవి! ఆశాపా న్నైవ కర్హిచిత్ ఆఖ్యాస్యామి మతం తుభ్యం గమ్యతాం యత్ర వాంచితమ్
ఛాయా దేవి:
ఓ దేవీ! ఎప్పటి వరకు నా జుట్టు పట్టు కొనడో, ఎప్పటి వరకు నన్ను శపించడో, అప్పటి వరకు నేను నీ విషయమును చెప్పను. నీవు అభిలషించిన స్థానమునకు పొమ్ము.
ఇత్యుక్తా చాయయా సంజ్ఞా జగామ పితృ మందిరమ్ తత్రావాస త్పితు ర్గేహే కంచిత్కాలం శుభేక్షణా భర్తృః సమీపం యాహితి పిత్రోక్తా సా పునః పునః అగచ్చ ద్వడవా భూత్వా కురూన్విప్రో ద్తరాం స్తతః తత్ర తేపే తపః సాధ్వీ నిరాహారా మహామునేః పితుః సమీపం యాతాయాః సంజ్ఞాయాః వాక్య తత్పరా తద్రూత ధారిణీ ఛాయా భాస్కరం సముపస్థితా తస్యాం చ భగవాన్ సూర్యః సంజ్ఞేయ మితి చింతయన్ తథైవ అనయామాస ద్వౌ సుతౌ కన్యకాం తథా పూర్వజస్య మనోస్తుల్యః సావర్ణి స్టేన సోభవత్ యస్తయోః ప్రథమం జాతః పుత్రయో ర్ద్విజసత్తమః ద్వితీయో యోభవచ్చాన్యః స గ్రహోభూచ్చనైశ్వరః
ఛాయా దేవి ఇట్లు పలికిన పిమ్మట శుభ దర్శనురాలగు సంజ్ఞా దేవి తండ్రి గారి గృహమునకు వెళ్లి కొంత కాలము అచట నివసించెను. ఓ విప్రుడా! అనంతరము సంజ్ఞా దేవి యొక్క తండ్రి విశ్వకర్మ “ఇక నీ గృహమునకు పొమ్ము” అని మాటి మాటికి చెప్పుట చేత ఆమె అశ్వ రూపమును ధరించి ఉత్తర కురు క్షేత్రమునకు పోయెను. ఓ మహామునీ! సాధ్వి యగు సంజ్ఞా దేవి అచట నిరాహారురాలై తపస్సు చేయ సాగెను. ఇచట సంజ్ఞా దేవి ఎప్పుడయితే తండ్రి గారి గృహమునకు వెళ్ళెనో, అపుడు ఆమె ఆజ్ఞానుసారముగా ఛాయా దేవి, ఆమె రూపమును ధరించి భాస్కర భగవానుని యడల సంజ్ఞా దేవి వలె ప్రవర్తింప సాగెను. సూర్య భగవానుడును ఆమెను తన భార్య సంజ్ఞా దేవిగా తలంచి, ఆమె వలన కూడా ఇద్దరు పుత్రులను, ఒక కుమార్తెను పొందెను. ఓ ద్విజోత్తమా! ఈ ఇద్దరు పుత్రులలో జ్యేష్టుడు, సంజ్ఞాదేవి యొక్క పుత్రుడగు వైవస్వత మనువుతో సమానుడై “సావర్ణి” యను పేరు గల మనువయ్యెను. రెండవ వాడు “శనైశ్వరు”డను పేరు గల గ్రహ మయ్యెను.
కన్యాభూత్తపతీ యా తాం వవ్రే సంవరణో నృపః సంజ్ఞా తు పార్థివీ తేషా మాత్మజానాం యధాకరోత్ స్నేహాన్న పూర్వజాతానాం తాతా కృతవతీ సతీ మనుస్తత్ క్షాంతవాం స్తస్యా యమ శ్చాస్యా న చక్షమే బహుశో యాచ్యమానస్తు పితుః పత్న్యా సుదుఃఖితః స వై కోపాశ్చ బాల్యాచ్చ భావినోర్థస్య వై బలాత్ పదా సంతర్జయామాస ఛాయాసంజ్ఞాం యమో మునేః తతః శశాప చ యమం సంజ్ఞా సామర్షిణీ భృశమ్
“తపతి” అను పేరు గల కన్యను “సంవరణు”డను నరపతి వివాహ మాడెను. చాయా సంజ్ఞ సావర్ణి మనువు మొదలగు తన పుత్రుల యెడల ఎట్టి స్నేహమును చూపు చున్నదో, నిజ సంజ్ఞ గర్భము నుండి ఉత్పన్నమైన వైవస్వత మనువు మొదలగు పుత్రుల యడల అట్టి ప్రేమను చూపుట లేదు. ఛాయా సంజ్ఞ ఈ విధముగా భిన్నముగా ప్రవర్తించుట చూచి వైవస్వత మనువు సహింప గల్గెను. కాని యముడు దుఃఖితుడై సవితి తల్లి చేయు పనులను మాటి మాటికి తల్చుకుంటూ వాటిని సహించ లేక పోయెను. ఓ మునీ! క్రోధముతో యముడు జరుగ బోవు విషయమునకు వశీభూతుడై ఛాయా సంజ్ఞను అదిలించుచు ఆమెను తన్నుటకు తన పాదమును ఎత్తెను. అందులకు చాయా సంజ్ఞ అత్యంత క్రోధితురాలై యముని నిట్లు శపించెను.
ఛాయా దేవి:
పదా తర్జయసే యస్మా త్పిత్రు భార్యాం గరీయసీమ్ తస్మాత్తవైవ చరణః పతిష్యతి న సంశయః
ఛాయా సంజ్ఞ:
“నేను పూజ్యులైన నీ తండ్రి గారి భార్యను. నన్ను పాదమును చూపించుచూ అదిలించితివి. అందు వలన నీ పాదము తెగి భూమిపై బడును గాక. ఇందు సందేహము లేదు.”
యమస్తు తేన శాపేన భృశం పీడిత మానసః మనువా సహా ధర్మాత్మా సర్వం పిత్రే న్యవేదయత్
ధర్మాత్ముడగు యముడు ఈ శాపముచే అత్యంత పీడిత మనస్కుడై మనువు సహితముగా తండ్రి సమీపము నకు వెళ్లి వృత్తాంతము నంతయు తెలిపెను.
యముడు:
స్నేహేన తుల్య మస్మాసు మాటా దేవా! న వర్తతే విసృజ్య జ్యాయసోప్యస్మాన్ కనీయాంసౌ రుభూషతి తస్యాం మయోద్యతః పాడో న తు దేహే నిపాతితః బాల్యాద్వా యది వా మొహా త్తద్భవాన్ క్షంతుమర్హసి శప్తోహం తాత! కోపేన జనన్యా తనయో యతః తతో న మన్యే జననీ మిమాం వై తపతాంవర విగుణేష్వపి పుత్రేషు న మాటా విగుణా పితః పాద స్తే పతతాం పుత్రకధమే తత్ప్రవక్ష్యతి
యముడు:
ఓ దేవా! తల్లి మా యెడల సమాన భావము చూపక, మేము జ్యేష్టులమై నప్పటికి మమ్ములను అనాదరముగా చూచుచు కనిష్టులైన ఆ ఇద్దరినీ పోషించుట యందే ఇష్టమును చూపు తున్నది. ఆ కారణము వలన నేను బాల్య స్వభావముచే ఆమె పైకి నా పాదమును ఎత్తితిని. కాని ఆమెను తన్న లేదు. నా యీ అపరాధమును మీరు క్షమించ వలెను. తేజః శ్రేష్టుడైన ఓ తండ్రీ! పుత్రుడు దురాచారుడైననూ, తల్లి అతని యెడల ఎల్లప్పుడును చేదుగా వ్యవహరించదు. కాని “నీ పాదము తెగి భూమిపై పడుగాక” అని ఎట్లు శపించ గలదు? ఎప్పుడైతే తల్లియై యుండియు పుత్రునిపై గల కోపముచే ఇట్లు శపించెనో, అప్పుడు ఆమె తల్లిగా కనిపించుట లేదు.
తవ ప్రసాదా చ్చరణో న పతే ద్భగవాన్ న్యాదా మాతృ శాపా దయం మేధ్య తథా చింతయు గోపతేః
ఓ భగవానుడా! తల్లి యొక్క శాప కారణముగా ఏ ఉపాయము వలన నా పాదము తెగకుండా ఉండ గలదో, ఓ గోపతీ! నన్ను అనుగ్రహించి అట్టి ఉపాయమును ఆలోచింపుడు.
రవి:
అసంశయ మిదం పుత్రః భవిష్య తత్ర కారణమ్ యేన త్వా మావిశ త్క్రోదో ధర్మజ్ఞం సత్యవాదినమ్ సర్వేషామేవ శాపానాం ప్రతిఘాతో హాయ్ విద్యతే న తు మాత్రాభిశప్తానాం క్వచి చ్చాప నివర్తనమ్ న శక్యమేత న్మిధ్యా తు కర్తుం మాతు త్వచ స్తవ కించిత్తవ విధాస్యామి పుత్ర స్నేహా దనుగ్రహమ్ కృమయో మాంస మాదాయ ప్రయాస్యన్తి మహీతలమ్ కృతం తస్యా వచః సత్యం త్వం చ త్రాతో భవిష్యసి
సూర్యుడు:
“కుమారా! నీవు ధర్మజ్ఞుడవు మరియు సత్యవాదివై యుండియు ఎప్పుడయితే నీవు క్రోధమునకు వశీభూతుడ వైతివో, అప్పుడు నిస్సందేహముగా ఇట్లు జరుగుట సంభవము”. “ఇతర సమస్త శాపములకును, శాప నివృత్తి చేయవచ్చును. కాని తల్లి యొక్క శాపమును నివృత్తి చేయుటకు ఎట్టి ఉపాయము లేదు. అందువలన నీ తల్లి యొక్క శాపమును నివృత్తి చేయుటలో నేను అసమర్థుడను. కాని పుత్ర స్నేహముతో నిన్ననుగ్రహించి వేరొక విధానమును తెలిపెదను. కృములు నీ పాదము యొక్క మాంసమును గ్రహించి భూమి పైకి తీసుకొని పోవును. అట్లు జరుగుటచే నీ తల్లి యొక్క వచనములు సత్య మగును, మరియు నీవును రక్షింప బడుదువు.”అని పలికెను.
మార్కండేయుడు:
ఆదిత్య స్త్వబ్రవీ చ్చాయాం కిమర్థం తనయేషు వై తుల్యేష్వప్యధికః స్నేహ ఏకత్ర క్రియతే త్వయా నూనం నైషాం త్వం జననీ సంజ్ఞా కాపి త్వ మా గతా విగుణేష్వప్యపత్యేషుకథం మాతా శపే త్సుతమ్
మార్కండేయుడు:
తిరిగి ఆదిత్యుడు ఛాయతో నిట్లు పలికెను. “నీ పుత్రులందరూ నీకు సమాన స్నేహ పాత్రులే. కాని నీవు అట్లు చూడక కొందరిపైన మాత్రమే స్నేహమును చూపు తున్నావు. అందుచే నీవు వీరి తల్లివి కాదని, సంజ్ఞాదేవి రూపములో నున్న వేరొక దానివని బోధ పడుచున్నది. అట్లు కానిచో పుత్రుడు దురాచారుడైనను, తల్లి శపింప గలదా ?
మార్కండేయుడు:
సా తత్పరిహరంతీ చ నాచచక్షే వివస్వతః స చాత్మానం సమాధాయ యుక్త స్తత్త్వ మపశ్యత తం శప్తు మద్యతం దృష్ట్వా చాయాసంజ్ఞా దివస్పతిమ్ భయేన కంపితా బ్రహ్మ న్యదా వృత్తం న్యవేదయత్ వివా స్వాంస్తు తతః కృద్ధః శ్రుత్వా శ్వశుర మభ్యగాత్ స చాపి తంతదాన్యాయ మర్చయిత్వా దివాకరమ్ నిర్ధగ్దు కామం రోషేణ సాంత్వయామాస సువ్రతః
మార్కండేయుడు:
ఛాయా సంజ్ఞ దివాకరునకు ఏమీ చెప్పక వృత్తాంతము నంతయు రహస్యముగా నుంచెను. కాని దివస్పతి తప శ్శక్తితో నిజ వృత్తాంతమును తెలుసుకొని శపించుట కుద్యుక్తు డయ్యెను. హే బ్రాహ్మన్! అది చూచి చాయా సంజ్ఞ భయముచే కంపించుచు జరిగిన వృత్తాంత మంతయు తెలిపెను. వివస్వానుడు ఆ వృత్తాంతము నంతయు విని కృద్ధుడై మామ గారి వద్దకు వెళ్ళెను. రోషముచే సమస్తమును దగ్ధము చేయు వాని వలె నున్న దివాకరుని సువ్రతుడగు విశ్వకర్మ చూచిన వాడై ఆయనను యధావిధిగా పూజించి అతనిని సమాధాన పరచెను.
విశ్వకర్మ:
తవాతి తేజసా వ్యాప్త మిదం రూపం సుదుః సహమ్ అసహంతీ తతః సంజ్ఞా వనే చరతి వైతపః ద్రక్ష్యతే తాం భవా నద్య స్వభార్యాం శుభచారిణీమ్ రూపార్థం భవతో రణ్యే చరంతీం సుమహత్తపః స్మృతం మే బ్రాహ్మణో వాక్య యది తే దేవ రోచతే రూపం నివర్తయా మ్యేత త్తవ కాంతం దివస్పతే
విశ్వకర్మ:
తేజస్సుచే వ్యాప్తమై యున్న మీ యొక్క దుస్సహమగు రూపమును సంజ్ఞాదేవి సహింప లేక పోవుటచే వనమునకు పోయి తపస్సును చేయు చున్నది. మీ రూపము యొక్క కారణమున వనము నందు తపస్సును చేయుచు శుభ కార్యము నందు తత్పరురాలై యున్న నీ భార్యను ఇప్పుడే వెళ్లి చూడుము. ఓ దేవా! బ్రహ్మ పలికిన వచనములు ఇప్పుడు నాకు స్ఫురణకు వచ్చుచున్నవి. దానికి మీ అనుమతి ఇచ్చినచో ఓ దివస్పతీ! మీ ఈ రూపమును ప్రకాశవంతముగా పరివర్తనము చేయుదును.
మార్కండేయుడు:
యతో హి భాస్వతో రూపం ప్రాగాసీ త్పరిమ డలమ్ తత స్తథేతి తం ప్రాహ త్వష్టారం భగవా నవిః విశ్వకర్మా త్వనుజ్ఞాతః శాకద్వీపే వివస్వతః భ్రమి మారోప్య తత్తేజః శాతనాయోపచక్రమే
మార్కండేయుడు:
తన రూపము మండలాకారముగా నుండుటచే భగవానుడు రవి త్వష్టికు ఆ కార్యమును చేయుటకు అనుజ్ఞ ఇచ్చెను. విశ్వకర్మ సూర్యుని ఆజ్ఞచే శాక ద్వీపము నందు వివస్వానుని తేజస్సును సానపట్టి ఆతని రూపమును తగ్గించుటకు ఉపక్రమించెను.
భ్రమతా శేషజగతాం నాభిభూతేన భాస్వతా సముద్రాదివనో పేతా సా రురోహ మహీ నభః గగనం చాఖిలం బ్రాహ్మన్ సచంద్ర గ్రహ తారకమ్ అదోగతం మహాభాగః బభువాక్షిప్త మాకులమ్ విక్షిప్త సలిలాః సర్వే బభూవుశ్చ తథాబ్దితః వ్యభిద్యన్త మహాశైలాః శీర్ణసాను నిబన్దనాః ధృవాధారా ణ్యశేషాణి దిష్ణ్యాని మునిసత్తమః తృట్య ద్రశ్మి నిబంధాని హ్యదో జగ్ముః సహస్రశః వేగభ్రమణ సంజాత వాయు క్షిప్తా సమన్తతః వ్యశీర్యంత మహామేఘో ఘోర రావ విరావిణః
ఓ మహాభాగా! సంపూర్ణ జగత్తుకు నాభి స్వరూపుడగు ఆదిత్యుడు తేజస్సుచే సముద్రము, గిరులు, వనములు, మహీతలము, ఆకాశము, వ్యాకుల మయ్యెను. మరియు హే బ్రాహ్మన్! చంద్ర, గ్రహ, నక్షత్రాదులు, గగనము నుండి క్రిందికి పడిపోవు నట్లుగా అనిపించ సాగెను. సముద్ర మందలి జలము పొంగ సాగెను. మహా పర్వతముల యొక్క శిఖరములు చిన్నాభిన్నము లయ్యెను. మరియు ఓ మునిసత్తమా! ధ్రువాధారములగు నక్షత్రము లన్నియు తమ రశ్మి బంధనము స్ఖలన మగుటచే క్రిందకు పడిపో సాగినవి. ఓ మునీ! మేఘాలు నలు దిక్కుల వేహముగా తిరుగుటచే కలిగిన గాలి వలన పరస్పరము డీకొని ఘోరముగా గర్జించుచూ విహరింప సాగెను.
భాస్వద్ భ్రమణ వి భా తం భూమ్యాకాశ రసాతలమ్ జగదాకుల మత్యార్థం తదాసీన్ మునిసత్తమః త్రైలోక్యే సకలే విప్ర భ్రమమాణే సురర్షయః దేవాశ్చ బ్రహ్మణా సార్థం భాస్వంత మభితుష్టువుః ఆదిదేవోసి దేవానాం జ్ఞాత మేత త్స్యరూపతః స్వర్గ స్థిత్యన్త కాలేషు త్రిధా భేదేనా తిష్ఠసి స్వస్తి తేస్తు జగన్నాదః ధర్మ వర్షా హిమాకరః జుషస్వ శాన్తిం లోకానాం దేవదేవ దివాకరః ఇంద్ర శ్చాగత్య తం దేవం లిఖ్యమానం యధాస్తువత్ జయదేవః జగద్వ్యాపిన్ జయాశేష జగత్సపతే
ఓ ముని సత్తమా! ఈ విధముగా స్వర్గ, మర్త్య, పాతాళ లోకములన్నియు సూర్యుని భ్రమరము వలన అతిశయమగు వ్యాకులము పొందెను. ఓ విప్రుడా! త్రైలోక్యము లన్నియు ఈ విధముగా వ్యాకుల మగుటచే సురర్షులు, దేవతలు, బ్రహ్మ సహితముగా సూర్యుని స్తుతింప సాగిరి. వారు సూర్యుని ఇట్లు స్తుతించు చున్నారు. దేవతలలో ఆది దేవుడవు నీవేనని, నీ ఈ స్వరూపముచే తెలియు చున్నది. సృష్టి, స్థితి, ప్రళయ కాలములను భేదములతో నీవు త్రివిధములుగా స్థితుడవై యున్నావు. ఓ జగన్నాధా! ఓ గ్రీష్మవర్ష హిమకరా! నీకు జయ మగుగాక. ఓ దేవదేవా! ఓ దివాకరా! నీవు లోకములను శాంతింప జేయుము. సూర్య దేవుని జూచి ఇంద్రుడు “ఓ దేవా! జగద్వ్యాపీ! ఓ అశేష జగత్పతీ! నీకు జయమగు గాక” అని స్తుతించెను.
ఋషయశ్చ తతః సప్త వసిష్టా త్రిపురోగమాః తుష్ణువు ర్వివిదైః స్తోత్రైః స్వస్తి స్వస్తీతి వాదినః వేదోక్తాభి రదాగ్ర్యాభి ర్వాలఖిల్యాశ్చ తుష్ణువుః భాస్వంత మృగ్భి రాద్యాభి ర్లిఖ్యమానం ముదా యుతాః త్వం నాధః మోక్షిణాం మోక్షో ధ్యేయ స్త్వం ధ్యానినాం పరః త్యం గతిః సర్వ భూతానాం కర్మ కాండేపి వర్తతామ్ శం ప్రజాభ్యో స్తు దేవేశ శన్నోస్తు జగతాంపతేః శన్నోస్తు ద్విపదే నిత్యం శన్నశ్చాస్తు చతుష్పదే తతో విద్యాధర గణా యక్ష రాక్షస పన్నగాః కృతాంజలి పుటాః సర్వే శిరోభిః ప్రణతా రవిమ్
పిమ్మట అత్రి, వసిష్టాది సప్తర్షులు ‘స్వస్తి’ ‘స్వస్తి’ యని స్వస్తి వాక్యములను ఉచ్చరించుచూ వివిధములుగా స్తోత్రములచే స్తుతించిరి. ప్రసన్నచిత్తులై వాలఖిల్య గణాలు వ్రాయ బడిన భాస్కర దేవుని వేదోక్త, అధ్య ఋక్కుల ద్వారా ఈ విధముగా స్తుతింప సాగిరి. ఓ నాధా! నీవు ముముక్షు పురుషుల యొక్క ఏకైక లక్ష్యము. మరియు కర్మకాండ యందు ప్రవృత్తులగు జీవ కోటికి గతివి నీవే. ఓ దేవేశా! ఓ జగన్నాధా! ప్రజలందరికి, మాకు మరియు మా ద్విపద చతుష్పదుల యొక్క జయమును కలుగ చేయుము. తదనంతరము విధ్యాధర, యక్ష, రాక్షస, పన్నాగా గణాలు శిరస్సు లందు అంజలి ఘటించి ప్రణమిల్లిరి.
ఊచు రేవంవిధా వాచో మనః శ్రోత్ర సుఖావహాః సహ్యం భవతు తే తేజో భూతానాం భూత భావనః తతో హాహా హూహూ శ్చైవ నారద స్తుంబురు స్తధా ఉపగాయితు మారబ్దా గాంధర్వం కుశలా రవిమ్ షడ్జ మధ్యమ గాంధార గ్రామ త్రయ విశారదాః మూర్చనాభిశ్చ తానైశ్చ సంప్రయోగైః సుఖప్రదైః విశ్వాచీ చ ఘృతాచీ చ ఉర్వ శ్యధ తిలోత్తమా మేనకా సహజన్యాచ రంభా చాప్సరసాంవరా ననృతు ర్జగతా మీశే లిఖ్యమానే విభావసౌ జ్ఞాన భావ విలాసా డ్యాన్ కుర్వన్తో భినయా న్బహూన్
ఓ భూతభావనా! నీ తేజస్సు సమస్త భూతములకు సహింప గలదిగా నుండు గాక. అని ఈ విధముగా మనస్సునకు కర్ణములకు సుఖకరమగు వచనములను పలుక సాగిరి. పిమ్మట షట్జ, మధ్యమ, గాంధార అను ఈ మూడు గ్రామము లందు గాన విశారదులగు, హాహా, హూహూ, నారద, తుంబురులను ఇత్యాది సంగీత విడ్వద్గణాలు, మూర్చనా, తాళాది, సంప్రయోగాను సారము రవి సమ్ముఖమున సుఖ దాయకమగు సంగీతము ప్రారంభించిరి. విభావసుడు ఈ విధముగా లిఖ్యమానుడగు చుండగా పిమ్మట విశ్వాచి, ఘృతాచి, ఊర్వశి, తిలోత్తమ, మేనక, సహజన్య, రంభ, ఇత్యాది అప్సరసలు హావ, భావ, విలాసాది, అనేక అభినయాలతో నృత్యము చేయ సాగిరి.
ప్రావాద్యంత తతస్తత్ర వేణు వీణాది ఝర్ఘరాః ప్రణవాః పుష్కరాశ్చైవ మృదంగా పటహానకాః దేవ దుందుభయః శంఖా శతశోధ సహస్రశః గాయద్చి శ్చైవ గాంధర్వం నృత్యాద్చి శ్చాప్యప్సరోగణైః తూర్య వాదిత్ర ఘోషైశ్చ సర్వం కోలాహలీకృతమ్ తతః కృతాంజలి పుటా భక్తి నమ్రాత్మ మూర్తయః లిఖ్యమానం సహస్రాశుం ప్రణేముః సర్వదేవతాః తతః కోలాహలే తస్మిన్ సర్వదేవ సమాగమే తేజసః శాతనం చక్రే విశ్వకర్మా శనైః శనైః ఇతి హిమాజల ధర్మ కాలహేతో, ర్హర కమలా సన విష్ణు సంస్తుతస్య తనుపరిలిఖినం నిశమ్య భానో, ర్వజతి దివాకర లోక మాయుషోన్తే
వేణువు, వీణ, ఝర్ఘర, పణవ, పుష్కర, మృదంగ, పటహ, ఆనక, దేవదుందుభులు, శంఖము మొదలగు వందల వేల వాయిద్యములు ధ్వనింప నుగెను. ఇట్లు గంధర్వుల సానము, స్వర్గ లోక మందలి అప్సరసల నృత్యము, మరియు తూర్య వాయిద్యముల వంటి అనేక శబ్దాదులచే ఆ సమయమున జగత్తంతయు కోలాహలముతో నిండి యుండెను. పిమ్మట దేవతలందరు చేతులు జోడించి భక్తితో నమ్రతా మూర్తులై లిఖ్యమాన సహస్రాంశునకు ప్రణమిల్లిరి. దేవతాదుల సమాగమము వలన ఆ సమయ మందలి కోలాహల సమయమున విశ్వకర్మ నెమ్మది నెమ్మదిగా తేజస్సును క్షీనింప జేసెను. శిశిర, వర్ష, గ్రీష్మ కాలములకు హేతు స్వరూపములగు హరి, హర, బ్రహ్మాదులచే స్తుతింప బడిన భానుదేవుని భాను తను లేఖనము అను కథను వినుటచే మరణాంతరము సూర్య లోకమును పొందుదురు.
Summary of chapter 103 of the Mārkandeya Mahā Purana is as follows:
Svayambhū Brahmā offers a magnificent hymn of praise to Sūryadeva at the dawn of cosmic creation, seeking the manifestation of light to dissolve primeval darkness. Touched by Brahmā's devotion, Sūryadeva condensed His infinite light into a luminous orb, enabling the structured creation of the worlds.