మార్కండేయ మహా పురాణము
124 - అవిక్షిచ్చరితమున అవిక్షితునకి మరుత్త పుత్రోత్పత్తి
మార్కండేయుడు:
ఇతి తస్యా వచః శ్రుత్వా స్మృత్వా పితృవచః శుభమ్
కిమిచ్చకే ప్రతిజ్ఞాతే యదుక్తం తేన భూభృతా.
ప్రత్యువాచ స తాం కన్యా మవిక్షి న్నృపతేః సుతః
సానురాగమనాః కన్యాం త్యక్తభోగాం చ తత్కృ తే.
యదాహం త్యక్తనాం స్తన్వీం త్వా మరాతి పరాజితః
విజిత్య శత్రూ న్సంప్రాప్తా త్వం మయాత్ర కరోమి కిమ్.
మార్కండేయుడు:
ఆ కన్య యొక్క వచనములు విన్న అవిక్షితుడు కిమిచ్చక వ్రత సమయ మందు తండ్రి గారి సమీపమున తాను చేసిన ప్రతిజ్ఞను, కరంధముడు పలికిన వచనములను స్మరించు కొనెను. కేవలము తన కొరకే ఈ కన్య భోగమును త్యాగము చేయుట చూచి అప్పుడు సానురాగ చిత్తముతో రాజ నందనుడగు అవీక్షితుడు ఆమెకు ఇట్లు ప్రత్యుత్తర మిచ్చెను. ఓ కృశాంగీ! నేను శత్రువులచే పరాజయము నొందియే నిన్ను పరిత్యజించితిని. మఱియు ఇప్పుడు శత్రువును గెలిచియే తిరిగి నిన్ను పొందితిని. ఇప్పుడు నేనేమి చేయ వలెను?
కన్య:
మమ పాణిం గృహాణ త్వం రమణీయేత్ర కాననే
సకామాయాః సకామేన సజ్గమో గుణవాన్ భవేత్.
కన్య:
ఈ రమణీయ వనము నందే మీరు నన్ను పాణి గ్రహణము చేసు కొనుడు. కామించిన కామినీ యొక్క సంగమము కామించిన పురుషునితో జరిగిన యెడల గుణ యుక్త మగును.
రాజ పుత్రుడు:
ఏవం భవతు భద్రం తే విధి రేనాత్ర కారణమ్
అన్యధా కథ మన్యత్ర త్వా నుహం చ సమాగతః.
రాజ పుత్రుడు:
అట్లే నీవు చెప్పినట్లు శుభమగు గాక. ఈ విషయము నందు దైవమే కారణము. కాక పోయినచో నీవును నేనును వేరు వేరు స్థానము లందుండియు నేడు ఒక చోట కలిసి కొనుట ఎంత చిత్రము?
మార్కండేయుడు:
ఏతస్మి న్నంతరే ప్రాప్తో గంధర్వ తనయో మునే!
వరాప్సరోభిః సహితో గంధర్వై రపరై ర్వృతః
మార్కండేయుడు:
ఓ మునీ అదే సమయమున “తనయుడు” అను పేరు గల గంధర్వుడు అనేక మంది ఇతర గంధర్వులతో అప్సరసతో అచటకు వచ్చి ఇట్లు అనెను.
గంధర్వుడు:
రాజపుత్ర! సుతేయం మే భామినీ నామ మానినీ
అభిశాపా దగ స్త్యస్య విశాల తనయాభవత్.
బాలభావేన యోగ స్త్వః కోపితః క్రీడమానయా
తత స్తేన తదా శప్తా మానుషీ త్వం భవిష్యసి.
ప్రసాదితః స ఛాస్మాభి ర్భాలేయ మవివేకినీ
తవాపరాద్దా విప్రర్షే! ప్రసాదః క్రియతా మితి.
ప్రసాద్యమానః సోస్మాభి రిద మాహ మహామునిః
బాలేతి మత్వా శాపోల్పో దత్తస్యా నాన్య థైవ తత్.
గంధర్వుడు:
రాజ పుత్రా! ఈ మానిని నా కుమార్తె, ఈమె పేరు ధామిని. అగస్త్యుని శాపము వలన ఈ కన్య విశాల రాజ పుత్రిక అయినది. ఒకనాడు భామిని ఆట లాడుచు బాల్య స్వభావముచే మహర్షికి క్రోధమును కలిగించెను. ఆ కారణమున అగస్త్యుడు “నీవు మనుష్య స్త్రీ విగా పుట్టుదువు గాక” అని శాపమిడెను. ఓ విప్రర్షీ! ఈ కన్య ఏమీ తెలియని బాలిక అందుచే తమకు అపరాధము చేసినది అందు వలన ఈమె అపరాధమును గ్రహింపక, అనుగ్రహింపుడు. అని నేను ఆ సమయమున పలికి ఆయనను శాంత పరచితిని. అప్పుడు మహాముని యగు అగస్త్యుడు. నా ప్రార్ధనకు ప్రసన్నుడై బాలికగా ఎరిగియే ఈమెకు సామాన్య శాపము నిచ్చితిని.” అని యనెను.
ఇతి శాపా దగస్త్యస్య విశాల భవనే శుభా
జాతేయం మత్సుతా సుభ్రూ ర్మానినీ నామ నామతః
తదస్యాహం కృతే ప్రాప్తో గృహా ణేమాం నృపాత్మజామ్.
మమాత్మజాం సుతస్తేత్ర చక్రవర్తీ భవిష్యతి.
ఈ కారణమునే చక్కని కను బొమలు గల నా పుత్రిక యగు “భామిని” విశాల మహారాజు భవనమున “మానిని” యను పేరుతో జన్మించినది. నేను ఈమె కొఱకు ఇచ్చటకు వచ్చితిని. ఇప్పుడు రాజ కన్యక యగు ఈ నా కన్యను స్వీకరింపుడు. ఈమె గర్భమున నీకు చక్రవర్తి యగు పుత్రుడు జన్మించును.
మార్కండేయుడు:
తథేత్యుక్త్వేతి తస్యాశ్చ స పాణిం పార్దివాత్మజః
జగ్రాహ విధివ ద్దోమం చక్రే తత్ర చ తుమ్భురుః
ప్రజగు ర్దేవ గన్ధర్వా ననృత శ్చాపసరోగణాః
పుష్పాణి ససృజు ర్మేఘా దేవ వాద్యాని సస్వనుః.
వివాహే రాజపుత్రస్య తయా తత్ర సమేయుషః
సమస్త వసుథాత్రాణ కర్తృకారణ భూతయా.
తతో గంధర్వాలోకం తే సహ తేన మహాత్మనా
నిఃశేషేణ యయుః సా చ స చ రాజసుతో మునే!
మార్కండేయుడు:
గంధర్వుని వచనములు విని రాజపుత్రుడు ‘తథాస్తు’ అని అంగీకరించి ఆ కన్యను పాణి గ్రహణము చేసుకొనెను. గంధర్వ పురోహితుడగు తుంబురుడు యథా విధిగా హోమ కార్యమును సంపన్నము చేసెను. ఆ సమయమున దేవతలు, గంధర్వుడు గానము చేసిరి. మఱియు అప్సరసలు నాట్యము చేయ సాగిరి. మేఘములు పుష్పములను వర్షించినవి. దేవ దుందుబులు మ్రోగినవి. ఓ మునీ! పిమ్మట సమస్త భూమండల పాలన కర్తకు కారణ భూతురాలు అగు ఈ కుమారితో రాజ పుత్రుని వివాహ కాల మందు వచ్చి యున్న గంధర్వులు, మహాత్ముడగు తనయునితో సహితముగా గంధర్వ లోకమునకు వెళ్ళిరి. మఱియు రాజ కన్యను రాజ పుత్రుని కూడ వారి వెంట తీసుకొని బోయిరి.
భామిన్యా ముముదే సార్ధ మవిక్షి న్నృప నందనః
సా చ తేన సమం తత్ర భోగ సంవత్సనున్వితా.
కదాచి దతిరమ్యేసౌ నగారోపవనే తయా
విక్రీడతి సమం తన్వ్యా కదాచి దుపపర్వతే.
కదాం త్సులినే నద్యా హ స సారస శోభితే
కదాచి ద్భవన స్యాన్తే ప్రసాదే చాతిశోభానే.
విహార దేశే ష్వన్యేషు రమణీయే ష్వహర్నిశమ్
స రేమే సహిత స్తన్వ్యా సా చ తేన మహాత్మనా.
అచట నృప నందనుడు అగు అవీక్షితుడు భామినీ సహవాసముతో ఏ విధముగా ఆనందించెనో, భోగ సంపత్ శాలిని యగు భామిని కూడా అవీక్షితుని సహవాసముతో అట్లే సంతోషముగా నుండెను. అచట అతడు ఆమెతో కొంత కాలము అత్యంత మనోహరములగు నగరము లందలి వనములలోను, మరి కొంత కాలము ఉప పర్వతము లందును క్రీడింప సాగెను. మరి యోకప్పుడు హంసలతో సార సశోభిత మగు నదీ మందును, ఎత్తైన మనోహరము లగు భవనము లందును, మఱియు ఒక్కప్పుడు అనన్య రమణీయ విహార ప్రదేశము లందును ఆ తన్వంగితో రాజ పుత్రుడు, మఱియు మహాను భావుడగు రాజ పుత్రునితో భామినియు ఈ విధముగా పరస్పరము పగలు రాత్రియును విహరించు చుండిరి.
భక్ష్యానులే వనం వస్త్రం స్రక్పానాదిక ముత్తమమ్
ఉపాజహృ స్తయో స్తత్ర గన్దర్వ కిన్నరాః
తయా చ రమత స్తస్య భామిన్యా సహ దుర్లభే
గన్ధర్వ లోకే వీరస్య పుత్రం సా సుషువే శుభా.
తస్మి ఞ్జాతే మహావీర్యే గన్దర్వాణాం మహోత్సవః
బభూవ మనుజ వ్యాఘ్రే తేజ కార్య మవేక్షతామ్.
జగుః కేచి త్తథైవాన్యే మృదఙ్గ పటహానకాన్
అవాదయన్త చైవాన్యే నేణ వీణాదికాం స్తథా.
ననృతుశ్చ తథా తత్ర బహవోప్సరసాం గణాః
పుష్పవృష్టిముచో మేఘా జగర్జు ర్మృదు నిస్వనాః.
ముని, గంధర్వ, కిన్నెర గణాలు వారికి ఉత్తమోత్తమ భక్ష్య పానీయమును అనులేపనాది ఉపహారములను ఇచ్చు చుండిరి. దుర్లభ మగు ఆ గంధర్వ లోక మందు భామినితో మహా వీరుడగు రాజ కుమారుడు ఈ విధముగా విహరించు చుండగా కాల క్రమమున ఆ కళ్యాణీ ఒక పుత్రుని కనెను. ఓ మనుజ వ్యాఘ్రా! మహా వీరుడగు ఈ పుత్రుడుదయించ గానే భవిష్యత్ ప్రయోజనము సిద్ధించు నను ఆశతో గంధర్వులు గొప్ప ఉత్సవమును జరుపు కొనిరి. వారిలో కొందఱు గానము చేసిరి. కొందఱు మృదంగమును మ్రోగించు సాగిరి. మరి కొందఱు వేణువు, వీణాది వాద్యములను వాయించు చుండిరి. అప్పుడు అప్సరసలు నాట్యము చేసిరి. మేఘము లన్నియు పుష్ప వృష్టిని కురిపించుచూ మృదు, మంద స్వరముతో గర్జింప సాగినవి.
తథా కోలాహలే తస్మి స్వర్తమానేథ తుమ్భురుః
ప్రణయేన స్మృతోభ్యేత్య జాతకర్మాకరో స్మునిః.
దేవాః సమయాయుః సర్వే తథా దేవర్శయోమలాః
పాతాలా త్పన్నగేన్దాశ్చ శేష వాసుకి తక్షకాః.
తథా దేవాసురాణాంచ యే ప్రధానా ద్విజోత్తమ
యక్షాణాం గుహ్యకానాం చ వాయవశ్చ తథాఖిలాః.
తదాగతైరాశేషర్షి దేవదానవ పన్నుగైః
మునిభిశ్చాకుల మభూ ద్గన్ద ర్వాణాం మహాత్పుర్షమ్.
తతః స తుమ్బురుః కృత్వా జాతకర్మాదికాః క్రియాః
చక్రీ స్వస్త్యయనం తస్య బాలస్య స్తుతి పూర్వకమ్.
ఓ మునీ! ఈ విధముగా సంపూర్ణ కోలాహలము యొక్క సమయ మందు తనయుడు స్మరించినంతనే తుంబురుడు అటకేతెంచి జాతకర్మాదులను చేసెను. ఓ ద్విజోత్తమా! క్రమానుసారముగా సర్వ దేవతలు. నిష్పాపులగు దేవర్షి గణాలు, పాతాళము నుండి శేషుడు వాసుకి, తక్షకుడు ఇత్యాది పన్నగ, రాజులు, రాజ గణాలు. దేవ, అసుర, యక్ష, గుహ్యకు లందలి ప్రధాన వ్యక్తి గణాలు మఱియు ఏకోని పంచాసత్ మరుద్దేవతలు వచ్చిరి. ఆ సమయమున వచ్చి యున్న ఋషులు, దేవ, దానవ, పన్నగ మునులతో గంధర్వ నగరము నిండి పోయెను. జాతకర్మాదులను చేసిన పిమ్మట తుంబురుడు స్తుతి పూర్వకముగా ఆ బాలకుని ఇట్లు స్వస్త్యయనము (ఆశీర్వచనము) చేసెను.
చక్రవర్తీ మహావీర్యో మహాబాహో ర్మహాబలః
మహాన్తం కాల మీశిత్వ మశేషాయాః క్షితేః కురు.
ఇమే శక్రాదయః సర్వే లోకపాలా స్తథార్షయః థా
స్వస్తి కుర్వన్తు తే వీర! వీర్యం చారి వినాశనమ్.
మరు త్తవ శివాయాస్తు వాతి పూర్వేణ యోరజః
మరుత్తే విమలోక్షిణో వైషమ్యాయాస్తు దక్షిణః.
పశ్చిమస్తే మరు ద్వీర్య ముత్తమం సంప్రయచ్చతు
బలం యచ్చతు చోత్క్రుష్టం మరుత్తే చ తథోక్తరః.
ఇతి స్వస్త్యయనస్యాన్తే వాగువాచాశరీరిణీ
మరు త్తవేతి బహుశో యదిదం గురు రాబ్రవీత్.
ఓ వీరా! నీవు మహా బలుడవు, గొప్ప వీరుడవు, మహా బాహుడవు మఱియు సార్వ భౌముడిపై చాలా కాలము వరకు భూమి యొక్క ఆధిపత్యమును చేయుము. ఈ సమస్త ఇంద్రాది లోకపాలకులు ఋషి గణాలు నీకు శత్రు వినాశనమునకు తగిన వీర్యమును ప్రసాదించి సమస్త శుభములు గలుగ జేయుదురు గాక. తూర్పు దిక్కున వీచు చున్న మాలిన రహిత మరుత్తుడు నీకు మంగళము కలిగించు గాక. అక్షీణుడు, విమలుడు అగు దక్షిణ దిక్కున వీచు పవనుడు నీకు అనుకూలుడుగా నుండు గాక. మఱియు పశ్చిమ దిక్కు నున్న మరుత్తుడు నీకు గొప్ప వీర్యమును, ఉత్తర దిక్కు పవనుడు నీకు ఉత్కృష్ట మగు బలమును ప్రసాదించు గాక. ఈ విధముగా స్వస్త్యయన కార్యక్రమము పూర్తి అయిన పిమ్మట ఆకాశవాణి ఇట్లు పలికెను. “గురువు మాటి మాటికి ‘మరుత్తు’ అను శబ్దమును ఉచ్చరించెను.
మరుత్త ఇతి తేనాయం చువి ఖ్యాతో భవిష్యతి
భువి చాస్యా మహీపాలా యాశ్య న్త్యాజ్ఞావశా యతః.
ఏష సర్వక్షితీ శానం వీరః స్థాస్యతి మూర్ధని
చక్రవర్తీ మహావీర్యః సప్తద్వీపవతీం మహిమ్.
ఆక్రమ్య పృథివీపాలా నయం భోక్ష్య త్యవారితః
ప్రధానః పృథివీశానాం భవిష్య త్యేష యజ్వినామ్.
ఆధిక్యం శౌర్య వీర్యేణ భవిష్యత్యేష రాజసు.
ఈ కారణముచే ఈ బాలకుడు “మరుత్త” నామముతో భూ మండలమున విఖ్యాతిని గాంచు దాక. మఱియు మహీపాలు లందరూ ఇతనికి ఆజ్ఞా బద్ధులై యందురు గాక. అందు వలన ఈ బాలకుడు రాజు లందరికి శీర్ష స్థానీయుడగును. మఱియు మహావీర్యుడై, చక్రవర్తియై సదా రాజ గణాలను అతిక్రమించి ఈ సప్త ద్వీపవతి యగు భూ మండలము నను భవించును. ఈ బాలుడు పృథ్వీశ్వరులలో యద్దకర్తలలో శ్రేష్టు డగును. మఱియు భూమి యందలి రాజు లందరి కన్న అధికమగు శౌర్య వీర్యములు కలవాడగును.
మార్కండేయుడు:
ఇత్యాకర్ష్య వచః సర్వే కేనాప్యక్తం దివౌకసామ్.
తుతుఘ ర్విప్ర గన్ధర్వాశ్చాస్య మాతా తథా పితా.
మార్కండేయుడు:
దేవవాణి పలికిన వచనములు వినిన విప్రులు, గంధర్వులు మఱియు ఆ బాలకుని తల్లి దండ్రులు పరమానందమును బొందిరి.
Summary of chapter 124 of the Mārkandeya Mahā Purana is as follows:
Overwhelmed by the united attack of dozens of defeated kings, Avīkshita is captured and imprisoned. Upon learning of his son's capture, King Karandhama marches with his army, defeats the allied kings, and frees Avīkshita.