మార్కండేయ మహా పురాణము
113 - భలందనవత్సప్రీ చరితము
మార్కండేయుడు:
ఇతి తస్యా వచః శ్రుత్వా పుత్రస్య స చ పార్థివః పునః ప్రోవాచ ధర్మజ్ఞ స్తాం పత్నీం తనయం తథా యన్మయా పితు రాదేశా త్త్యక్తం రాజ్యం న తత్పునః గ్రహీష్యామి పృథోక్తేన కిమాత్మా క్లిశ్యతే త్వయా అహం తే సంప్రదాస్యామి కరం వైశ్యవ్రతే స్థితః భుంక్ష్వ రాజ్య మశేషం త్వ మిచ్చయా వా పరిత్యజ ఇత్యుక్తః స తదా పిత్రా రాజపుత్రో భలందనః చకార రాజ్యం ధర్మేణ తద్వద్దార పరిగ్రహమ్
అవ్యాహతం తస్య చక్రం పృథివ్యా మభవ ద్ద్విజః న నాధర్మే మనో భూపా స్తస్య సర్వే భవన్ వశే
మార్కండేయుడు:
ధర్మజ్ఞుడగు రాజు భార్యా పుత్రుల వచనములు విని తిరిగి వారితో వేరు వేరుగా నిట్లు పలికెను. ముందుగా భార్యతో నిట్లు చెప్పెను. నేను నా తండ్రి గారి ఆజ్ఞానుసారము ఒకసారి రాజ్యము త్యజించితిని. దానిని ఇప్పుడు తిరిగి చేపట్ట లేను. నీవు వృధా వాక్యములను పలికి, ఎందులకిట్లు వృధా ప్రయాస నొందెదవు? పిమ్మట పుత్రునితో నిట్లు పలికెను. “నేను వైశ్య వృత్తి యందే ఉంటూ నీకు పన్నులు చెల్లిస్తాను. నీవు ఈ సంపూర్ణ రాజ్యము ననుభవించుము. నీకు యిష్టము గానిచో పరిత్యజించుము. రాజ పుత్రుడగు భలందనుడు ఈ విధముగా తండ్రి గారి ఆజ్ఞను పొంది ధర్మానుసారము రాజ్య పాలన చేయ సాగెను. మరియు యథా సమయమున వివాహము చేసుకొనెను. ఓ ద్విజుడా! ధరణీ చక్రమున ఆతడి రథ చక్రము అవ్యాహతముగా సంచరించెను. అతని మనస్సు ఎన్నడును అధర్మ మార్గము నందు నడువ లేదు. అందు వలన రాజు లందరును ఆతనికి వశమై యుండిరి.
తేనేష్టో విదివ ద్యజ్ఞః సమ్యక్ శాస్తి వసుంధరామ్ స ఏవైకోభవ ద్భర్తా పృథివ్యా మరిశాసనః అజాయత సుత స్తస్య వత్సప్రీ రితి నామతః పితాతిశయితో యేన గుణౌఘేన మహాత్మనా తస్యాపి భార్యా సౌనందా విదూరథ సుతావత్ పతివ్రతా మహాభాగా స ప్రాప్తా తేన శౌర్యతః హత్వా పురంధ రిపుం కుజృంభం దితిజేశ్వరమ్
అతడు యధావిధిగా యజ్ఞములను చేయుచూ, చక్కగా రాజ్యపాలన చేయు చుండెను. క్రమానుసారముగా పృథ్వి యందు అతని శాసనము వ్యాపించుటచే శత్రు శాసనుడైన అతడొక్కడే పృథ్వీశ్వరుడుగా విఖ్యాతి చెందెను. పిమ్మట ఆ రాజుకు ‘వత్సప్రీ’ అను పేరు గల పుత్రుడు కలిగెను. ఆ మహాత్ముడు గుణములలో తండ్రిని అతిశయించెను. విదూరథుని కన్య యగు “సౌనంద” వత్సప్రీతికి భార్య అయ్యెను. అతడు శౌర్యముచే ఇంద్రుని శతృవగు కుజ్రుంభుడను దైత్యనాథుని చంపి ఈ మహా పతివ్రత యగు భాగ్యశాలిని పొందెను.
క్రౌష్టుకి:
భగవంస్తేన సంప్రాప్తా కుజృభ నిధానా త్కథమ్ ఏత దాఖ్యాన మాఖ్యాహి ప్రసన్నేనాంతరాత్మనా
క్రౌష్టుకి:
హే భగవన్! వత్సపి ఏ విధముగా కుజ్రుంభుని చంపి సౌనందను పొందెను? దయ ఉంచి దానిని వివరింపుము.
మార్కండేయుడు:
విదూరథో నామ నృపః ఖ్యాత కీర్తి రాభూ ద్భువి తస్య పుత్రద్వయం జాతం సునీతిః సుమతి స్తథా
మార్కండేయుడు:
భూమండలమున “విదూరథుడు” అను ప్రసిద్ధ కీర్తి గల ఒక రాజు కలడు. ఆ రాజుకు “సునీతి”, “సుమతి” అను ఇరువురు పుత్రులు కల్గిరి.
ఏకదా తు వనం యాతో మ్పగయా స విదూరథః దదర్శ గర్తం సుమహ ద్భూమే రముఖ మివోద్గతమ్ తం ద్మష్ట్వా చిన్తయామాస కి మెటా దితి భైరవమ్ పాతాళ వివరం మన్యే నైత ద్భూమే శ్చిరంతనరమ్ చింత న్నితి తత్రసౌ దదర్శ విజనే వనే బ్రాహ్మణం సువ్రతం నామ తపస్విన ముపాగతమ్ స తం ప్రపచ్చ చ నృపః కి మేత దితి విస్మితః అతి గంభీర మవనే దర్శితాంతర్గ తోదరయ్
ఒకనాడు విదూరథుడు వేటకు వెళ్లి తిరిగి వచ్చు చుండగా మార్గమధ్యలో ఒక పెద్ద లోయను చూసెను. ఆ గర్తము భూదేవి ముఖమును నట్లుగా యుండెను. ఆ రాజు భయంకరమగు ఆ లోయను చూసి “ఈ లోయ ఏమిటి?” అనుకొని తిరిగి ఇట్లాలోచించెను. “ఇది పూర్వ కాలమున త్రవ్విన లోయ మాత్రము కాదు. ఇది పాతాళ మార్గమని నాకు తోచుచున్నది.” అని ఈ విధముగా ఆలోచించు చుండెను. అదే సమయమున ఆ నిర్జన ప్రదేశ మందు సువ్రతుడను ఒక బ్రాహ్మణ తపస్వి వచ్చు చుండుట చూచెను. ఆశ్చర్యచిత్తుడైన ఆ రాజు బ్రాహ్మణుని భూసంబంధమగు ఆ గంభీర లోయను చూపించుచూ దాని వివరము అడిగెను.
ఋషి:
కిన్న వేత్సి మహీపాలః వాగర్థ స్త్వం హి మే మతః జ్ఞేయం సర్వం నరేంద్రేన వర్తతే యనమ హీతలే
ఋషి:
ఓ రాజా! దీనిని నీవెరుగవా? భూమి సంబంధమగు సమస్త వృత్తాంతమును రాజు తెలిసికొని యుండుట ఉచిత మైనది. నా ఉద్దేశ్యమున నీవు దీని గురించి వినుటకు నిజమైన యోగ్యుడవు.
దానవః సుమహావీర్యో వసత్యుగ్రో రసాతలే స జృంభయతి యత్ప్రుథ్వీం కుజృంభః ప్రోచ్యతే తతః క్రియలే తేన యత్కించిద్రత్న భూతం మహీతలే త్రిదివే వా నరపతే తం కథం వేత్తి నో భవాన్ సునందం నామ ముసలం త్వష్ట్రా య న్నిర్మితం పురా తజ్జహార స దుష్టాత్మా తేన హంతి రణే రిపూన్ పాతాలాంతర్గత స్తేన భినత్తి పసుధామిమామ్ తతో సురాణాం సర్వేషాం ద్వారాణి కురుతే సురః తేన భిన్నాత్ర పసుధా సునంద ముసలేన తు భోక్ష్యతే వసుధా మేతాం త మజిత్వా కథం భవాన్
మహా బలశాలి యగు ఉగ్రుడగు ఒక దానవుడు రసాతల మందు నివసించు చున్నాడు. వాడు భూమిని జృంభించుటచే అందరు వాడిని కుజృంభుడని పిలుచు చుండిరి. ఓ రాజా! ఈ భూమండల మందు స్వర్గ మందు ఒక్కచోట యేమి రాజ్యము నందలి ప్రతి ప్రాణి యందు జరిగిన సమస్త ఘటనలకు వాడే కారణము. నీవు దీనిని ఎరుగవా? పూర్వము విశ్వకర్మ “సునంద” అను పేరు గల ముసలమును నిర్మించెను. దురాత్ముడగు ఆ దానవుడు దానిని అపహరించి యుద్ద కాలమున ఆ ముసలముచే శత్రువులను వధించు చుండెను. మరియు ఆ ముసలము తోనే రసాతల మందు భూమిని త్రవ్వి ఇతర రాక్షసు లందరికి ద్వారము ఏర్పాటు చేసెను. ఆ “సునంద” అను పేరు గల ముసలము యొక్క దెబ్బలచే ఈ భూప్రదేశమును సొరంగముగా చేసెను. నీవు వానిని ఓడింపక ఏవిధముగా భోగముల ననుభవించెదవు? ఉగ్ర కర్ములగు దైత్యులు ముసలాయుధముచే అధిక బలశాలియై యజ్ఞ కర్మలను నాశనము చేసి దేవతలను పీడించుచూ, దైత్యులకు తృప్తిని కలిగించు చున్నాడు.
యజ్ఞా న్విధ్వంసయ త్యుగ్రో దేవానా ముపరోధకః ఆప్యాయ యతి దైతేయాన్ స బలీ ముసలాయుధః యద్యరిం ఘాతయస్యేనం పాతాలాంతర గోచరమ్ తతః సమస్త వసుధావతి స్త్వం పరమేశ్వరః ముసలం తస్య బలినం సౌనందం ప్రోచ్యతే జనైః తథా బలాబలం చైవ తం వదంతి విచక్షణాః తత్తు నిర్వీర్యతాం యాతి సంస్పృష్టం యోషితా నృపః తస్మిన్ దినే ద్వితీయేహ్ని వీర్యవ త్తరుదీర్యతే న స వేత్తి దురాచారః ప్రభావం ముసలస్య తమ్ యోషి త్కరాగ్రసంస్పర్శే దోషం వీర్య నిశాతనమ్
ఇప్పుడు నీవు పాతాళ మందున్న ఈ శత్రువులను ఓడింప గలిగినచో, సమస్త భూమికి అధిపతివై పరమేశ్వరు డగుటకు సమర్థుడ వగుదువు. జనులు ఈ ముసలమును “సౌనంద” అని చెప్పుదురు. విచక్షుణులగు పురుషులు కూడా దాని బలమును గూర్చి అట్లే పిలిచెదరు. ఆ ముసలము ఏ రోజు స్త్రీ చేతి స్పర్శను పొందునో, ఆ రోజు వీర్య హీనమును పొందును. కాని మరుసటి రోజే తిరిగి పూర్వము వలే బలశాలి యగును. కాని ఆ దుర్మార్గుడు ముసలము యొక్క ఈ ప్రభావమును మరియు స్త్రీ యొక్క హస్త స్పర్శ వలన అది తన బలమును పోగొట్టు కొనునను విషయమును ఎరుగడు.
ఏవం తస్య బలం భూపః దానవస్య దురాత్మనః ముసలస్య చ తే ప్రోక్తం యదుక్తం తత్సమాచర ఆసన్న మేత ద్భవతః పురస్య పృథివీపతేః కృతం లేన మహారంద్రం నిశ్చింతః భగవాన్ వృథా ఇత్యుక్త్వా తు గతే తస్మిన్ పురం గత్వా మహీపతిః మంత్రయామాస మంత్రజ్ఞేః పురమధ్యే తు మంత్రిభిః యథాశ్రుత మశేషం త త్కథయామాస మంత్రిణామ్ ముసలస్య ప్రభావం చ వీర్యశాతన మేవ చ తం మంత్రం క్రియమాణం తు మంత్రభి స్తేన భూభ్రుతా తత్సార్శ్వ వర్తినీ కన్యా శుశ్రావాథ ముదావతీ
ఓ రాజా! దుష్టులగు దానవుల బలమును గూర్చి యథాతథముగా నీకు చెప్పబడినది. ఇప్పుడు నేను చెప్పిన దాని ననుసరించి కార్యమును సాదించుము. ఓ రాజా! నీ పురము సమీపము నందే వాడు భూరంధ్రమును చేసినాడు. అయినచో నీవు నిశ్చింతగా ఎట్లుంటివి? అని ఎప్పుడయితే ఋషి ఈ విధముగా చెప్పి పోయెనో, అప్పుడు రాజు కూడా తన పురమునకు వచ్చి తన మంత్రులతో మంతనములు జరిపెను. ముసలము యొక్క ప్రభావము, వీర్యహాని మొదలగు ఏ ఏ విషయములు వినెనో, ఆ విషయము లన్నియు మంత్రులకు తెలియ జెప్పెను. రాజు ఈ విషయమును గూర్చి మంత్రులతో సభ చేయుచున్న సమయములో ముదావతి అను రాజు కుమార్తె పార్శ్వ మందు కూర్చొని దాని నంతయు విను చుండెను.
తతః కతిపయాహేతు తాం కన్యాం వయసాన్వితామ్ జహారోపవనా ద్దైత్యః కుఙృంభః స సఖీవృతామ్ తచ్చ్రాత్వా స మహీపాలః క్రోధపర్యాకులేక్షణః పుత్రా వువాచ త్వరితం గచ్చతం వనకోవిదౌ న్వింధ్యాయా స్తటే గర్తస్తేన గత్వా రసాతలమ్ స హన్యతాం యోపహర్తా ముదావత్యాః సుదుర్మతిః
ఈ విషయము జరిగిన కొంత కాలమునకు ముదావతి తన సఖులతో ఉద్యానవనమునకు వెళ్ళెను. అప్పుడు కుజృంభ దైత్యుడు ఆ కన్యను అపహరించెను. ఈ విషయమును విని రాజు మండిపడి, కండ్లెర్ర జేయుచు ఆ వన ప్రదేశము నెరిగిన తన యిద్దరు పుత్రులతో ‘మీరు ఆ వన ప్రదేశమును ఎరుగుదురు. అందువలన వెంటనే వెళ్ళండి’. నిర్వింధ్యాలది ఒడ్డున ఒక సొరంగము గలదు. దాని ద్వారా రసాతలమునకు వెళ్లి ముదావతిని అపహరించిన ఆ దురాత్ముని చంపండి. అని పలికెను.
మార్కండేయుడు:
తత స్తౌ తత్సుతౌ ప్రాప్య తం గర్తం తత్పదానుగౌ యుయుధాతే కుజృంభేణ స్వసైన్యే నాతికోపితా తతః పరిఘ నిస్త్రింశ శక్తిశూల పరశ్వధైః బాణైశ్చా విరతం యుద్ధం తేషా మాసీ త్సుదారుణమ్
మార్కండేయుడు:
వెంటనే ఆ యిద్దరు రాకుమారులు ఆ సొరంగమునకు చేరు కొనిరి. ఆ సొరంగము లోని పాద చిహ్నముల ననుసరించి పోవుచు, అత్యంత క్రోధముచే సేనా సహితులై కుజృంభునితో యుద్ధము చేసిరి. ఆ సమయమున ఆయుధ విశేషములగు బరిశలు, శూలములు, గండ్రగొడ్డళ్ళు, శక్తి, బాణములు మొదలగు వానిచే దారుణమగు యుద్ధము జరిగెను.
తతో మయా బలవతా తేన దైత్యేన తా వుభౌ రాజపుత్రౌ రణే బద్ధౌ విహతాశేష సైనికౌ తచ్చ్రుత్వా స మహీపాలః ప్రాహేదం సర్వసైనికాన్ బద్ధపుత్రః పరా మార్తి ముపేతో మునిసత్తమః యస్తం నిహత్య దైతేయం మోచయిష్యతి మే సుతామ్ తస్యాహం సంప్రదాస్యామి తామేవాయత లోచనామ్ ఇత్యేవం ఘోషయాం చక్రే స రాజా స్వపురే తదా నిరాశః పుత్రా తనయా బంధ మోక్షాయ వై మునేః తతః శుశ్రావ వత్సప్రీ ర్భలందన సుతో హి తత్ ఆఘోష్యమాణం బలవాన్ కృతాస్త్రః శౌర్య సంయుతః
కాని మాయా బలముచే బలవంతులైన దైత్యులు ఆ యుద్ద క్షేత్రమున రాజ పుత్రుల సైన్యమును సంపూర్ణముగా నాశనము చేసి ఆ ఇద్దరు రాజ కుమారులను బంధించిరి. ఓ ముని సత్తమా! పుత్రులను బంధించి రన్న వార్తను విని రాజు హృదయమున అత్యంత దుఃఖమును పొంది సైన్యముతో నిట్లు పలికెను. “ఎవరు ఆ దైత్యులను చంపి నా కన్యను మరియు నా యిద్దరు కుమారులను విడిపించుదురో, వారికి విశాల నేత్రములు గల నా కుమార్తె ముదావతి నిచ్చెదను.” ఓ మునీ! రాజు తన పుత్రులను, కన్యను విడిపించు విషయమున నిరాశను చెంది తన నగరమున ఈ విధముగా చాటించెను. బలవంతుడు, వీరుడు, అస్త్ర సంపన్నుడగు వత్సప్రీయను భలందన పుత్రుడు ఈ చాటింపును విని తండ్రిగారి మిత్రుడు పార్థివ సత్తముడగు విథూరథునకు నమస్కరించి వినయముతో నమ్రుడై ఇట్లు పలికెను.
స చాగమ్యాభివాద్యైనం ప్రాహ పార్థివసత్తమమ్ వినయావనతో భూత్వా పితుర్మిత్ర మనుత్తమమ్ ఆజ్ఞాపయాశు మా మేవ తనయౌ మోచయామి తే తవైవ తేజసా హత్వా తం దైత్యం తనయో చ తే
“నాకు ఆజ్ఞ నిమ్ము. నేను ఇప్పుడే నీ యొక్క తేజో బలముచే ఆ దైత్యులను సంహరించి మీ యొక్క పుత్రులను మరియు కుమార్తెను విడిపించుదును.”
మార్కండేయుడు:
స తం ముదా పరిష్వజ్య ప్రియసఖ్యు రథాత్మజమ్ గమ్యతా మితి సంసిద్ద్యై వత్సేత్యాహ స పార్థివః స్థానే స్థాస్యతి మే వత్సో యద్యేవం కురుతే విధిమ్ వత్సైత త్క్రియతా మాశు యద్యుత్సాహి మన స్తవ
మార్కండేయుడు:
తన మిత్రుని పుత్రుడు అగు వత్సప్రీని హర్షముతో ఆలింగనము చేసుకొని ఇట్లనెను. “ఓ కుమారా! కార్య సిద్ధికై వెళ్లుము” “ఈ కార్యమును నీవు చేయగలిగినచో నిజమైన మిత్రుని పుత్రుడు తలపెట్టిన కార్యము సిద్ధించెనని తలంచెదను. ఓ కుమారా! ఈ కార్యమును చేయుటకు నీవు నీ మనస్సు అత్యంత ఉత్సాహమును చూపినచో వెంటనే ఈ కార్యమును సాధించుము.”
మార్కండేయుడు:
తతః సఖడ్గః సధను ర్బద్ధ గోదాంగులిత్రవాన్ జగామ వీరః పాతాళం తేన గర్తేన సత్వరః
మార్కండేయుడు:
పిమ్మట మహావీరుడగు వత్సప్రి ఖడ్గము, ధనుస్సు అంగుళి త్రాణము మొదలగు ఆయుధములు ధరించి ఆ సొరంగ మార్గము ననుసరించి శీఘ్రముగా పాతాళమునకు చేరు కొనెను.
తతో జ్యాస్వన మత్యుగ్రం స చక్రే పార్థివాత్మజః యేన పాతాల మఖిల మాసీ దాపూరితాంతరమ్ తతో జ్యాస్వన మాకర్ణ్య కుజృంభో దానవేశ్వరః ఆజగామాతికోపేన స్వసైన్య పరివారితః తతో యుద్ధ మభూ త్తస్య తేన పార్థివసూనునా స సైన్యస్య స సైన్యేన బలినో బలిశాలినా దినాని త్రీణి యదా యోధిత స్తేన దానవః తతః కోప పరీతాత్మా ముసలాయాభ్యదావత గంధై ర్మాల్యై స్తథా ధూపైః పూజ్యమానః తిష్ఠతి అంతఃపురే మహాభాగః ప్రజాపతి వినిర్మితః
అక్కడ రాజ పుత్రుడు ఉగ్రమగు ధనుష్టాంకారము చేసెను. దాని వలన పాతాళమంతయు ప్రతి ధ్వనించెను. దానవ పతి యగు కుజృంభుడు ఈ ధనుష్టంకారమును వినుట తోడనే అత్యంత కృద్ధుడై తన సైన్యమును వెంట పెట్టుకొని వచ్చెను. అప్పుడు అత్యంత బలశాలురగు సైన్యము కలిగి యున్న రాజ పుత్రునితో అత్యధిక సేనచే బలవంతుడగు కుజృంభునికి గొప్ప యుద్ధము జరిగెను. దానవుడు మూడు రోజులు వారితో యుద్ధము చేసి క్రోధ చిత్తుడై ముసలమును తెచ్చుటకు పరుగెత్తెను. ఓ మహాభాగా! ప్రజాపతిచే నిర్మితమైన ఆ ముసలము గంధ, మాల్య, ధూప దీపాదులచే పూజింప బడి, అంతఃపురము నందు ఉంచబడెను.
తతో విజ్ఞాత ముసల ప్రభావా సా ముదావతీ పస్పర్శ ముసల శ్రేష్ఠ మతినమ్ర శిరోధరా పూనా ర్యావ త్స గృహ్ణాతి మశలం తల మహాసురః తావ త్సా వందన వ్యాజా త్పస్పర్శానేకశః శుభా తతః స గత్వా యుయుధే ముసలేనా సురేశ్వరః వ్యర్థా ముసల పాతా స్తే సంజగ్ము స్తేషు శత్రుషు పరమా స్త్రేతు నిర్వీర్యే సౌనందే ముశలే మునే అస్రైః శస్త్రైశ్చ దైతేయః సోయుధ్యత రణేరిణా శాస్త్రాస్త్రై ర్నః సమస్తస్య రాజపుత్రస్య సోసురః ముసలేన బలం తస్య తచ్చ తన్వ్యా నిరాకృతమ్
ఇంతకు ముందు ముదావతి ముసలము యొక్క ప్రభావమును విని యుండుటచే ఆమె తన శిరస్సు వంచి దానిని స్పృశించెను. మరియు ఎప్పుడయితే అసురుడు ఆ ముసలమును తీసు కొనునో అప్పటి లోగా ఆ సుందరి దానిని పూజించు నెపముతో మాటి మాటికి స్పృశించు చుండెను. పిమ్మట ఆ అసురపతి యుద్ధ క్షేత్రమున ప్రవేశించి ముసలముతో యుద్ధము చేయ సాగెను. కాని శత్రువుల యెడల ముసలము యొక్క దెబ్బలు వ్యర్థమగు చుండెను. ఓ మునీ! సౌనంద అను ఆ ముసలము వీర్యహీన మగుటచే దైత్యులు అస్త్ర శస్త్రాదుల ద్వారానే శత్రువులతో యుద్దము చేయ సాగిరి. కాని దైత్యులు రాజ పుత్రుని అస్త్ర శస్త్రాదులచే గెలువలేక పోయిరి. మరియు వారి వద్ద వున్న ముసలము యొక్క బలము కూడా ఆమె బుద్ధి బలము వలన వ్యర్థమై పోయెను.
తతః పరాజిత్య స భూపనూను, రస్త్రాణి శస్త్రాణి చ దానవస్య చకార సద్యో విరథం తతశ్చ, స చర్మ ఖడ్గః పున రప్యధావత త మాపతంతం రభసాభ్యుదీర్ణం, విస్పష్ట కోపం త్రిదశేంద్ర శత్రుమ్ శస్త్రేణ వహ్నే ర్భువి రాజపుత్రో, జఘాన కాలానం సప్రభేణ స పావకాస్త్రేణ హృది క్షతో భృశం, తత్యాజ దేహం త్రిదశారి రాత్మనః బభూవ సద్యశ్చ మహోరగాణాం, రసాతలాంతేషు మహా నథోత్సవః తతోపత త్సుష్ప వృష్టి ర్మహీపాల సుతోపరి జగు ర్గంధర్వ పతయో దేవా వాద్యాని సస్వనుః స చాపి రాజపుత్ర స్తం హత్వా తౌ నృపతేః సుతౌ మోచయామాస తన్వంగీం తాం చ కన్యాం ముదావతీమ్
అందు వలన రాజ పుత్రుడు ఆ దైత్యుల అస్త్ర శస్త్రములను వ్యర్థ పరచి వారిని వెంటనే విరథులను చేసెను. అప్పుడు దైత్య రాజు తిరిగి కత్తిని, ఢాలును గ్రహించి రాజ పుత్రుని పైకి ఉరికెను. ఇంద్రుని శతృవగు ఆ దైత్యుడు క్రుద్ధుడై వేగముగా వచ్చుచుండ రాజ పుత్రుడు కాలాగ్ని వలె మెరియు చున్న ఆగ్నేయాస్త్రముచే ఆ దైత్యుని సంహరించెను. దేవతల శతృవగు కుజృంభుడు ఆ ఆగ్నేయాస్త్రముచే గుండె పగిలి ప్రాణములు వీడెను. ఆ సమయమున పాతాళ వాసులగు ఉరగములు మహోత్సవమును చేసు కొన్నవి. రాజ పుత్రునిపై పుష్ప వృష్టి కురియ సాగెను. గంధర్వులు సంగీతమును ఆలపించిరి. దేవ దుందుభులు మ్రోగ సాగెను. రాజ పుత్రుడగు వత్సప్రీ ఈ విధముగా దైత్యుని అంత మొందించి సునీతి, సుమతి అను రాజ పుత్రులను మరియు కోమలమైన శరీరము గల రాజ కన్యయగు ముదావతిని విడిపించెను.
తచ్చాపి ముసలం తస్మిన్ కుజృంభే వినిపాతితే జగ్రాహ నాగాధిపతి రనంతః శేష సంజ్ఞితః తస్యాశ్చ పరితుష్టో సౌ శేషః సర్వోరగేశ్వరః ముదావత్యా ముదా ధ్యాత మనోవృత్తి స్తపోధనః సునంద ముసల స్పర్శం యచ్చకార పునః పునః యోషిత్కరతల స్పర్శ ప్రభావజ్ఞాతిశోభనా ముతావత్యా స్తతో నామ నాగరాజ స్తదా కరోత్ “సునందా” మితి సానందం సౌనంద గుణజం ద్విజః స చాపి రాజపుత్ర స్తాం భ్రాతృభ్యాం సహితాం పితుః సమీప మానినాయాశు ప్రణిపత్యాహ చైవ తమ్ ఆనీతౌ తనయౌ తాతః తథైవేయం ముదావతీ తవాజ్ఞయా మయాన్య ద్యత్కర్తవ్యం తత్సమాదిశ
కుజృంభుడు మరణించిన పిమ్మట శేషుడను పేరు గల నాగ రాజు ఆ ముసలమును గ్రహించెను. మరియు ఓ ద్విజుడా! తపోధనుడగు నాగరాజు రాజ కన్య యగు ముదావతి యొక్క అభిప్రాయమును తెలుసుకొని ఆమె యెడల సంతుష్టు డయ్యెను. స్త్రీ కర స్పర్శ యొక్క ప్రభావమును తెలుసుకొని ముదావతి మాటి మాటికి ముసలమును స్పృశించుటచే, నాగరాజు ముదావతి మరియు సౌనంద యను పేరు గల ముసలము యొక్క గుణముచే “సునందా” అను పేరు పెట్టెను. పిమ్మట రాజపుత్రుడు ఆ యిద్దరు సోదరుల సహితముగా ఆ కన్యను వెంటనే తండ్రి సమీపమునకు తీసుకొని వెళ్లి నమస్కరించి ఇట్లనెను. “ఓ తండ్రీ! మీ ఆజ్ఞానుసారము మీ ఈ పుత్రులను, మరియు ముదావతిని తీసుకొని వచ్చితిని. ఇప్పుడు నేనింక ఏమి చేయవలెనో, దానిని ఆజ్ఞాపించుడు.”
మార్కండేయుడు:
తతః ప్రహర్ష సంపూర్ణ హృదయః స మహీపతిః సాధు సాద్వి త్యదాహోచ్చై ర్వత్స వత్సేతి శోభనమ్
మార్కండేయుడు:
అప్పుడు రాజు ప్రీతి పూర్ణ హృదయముతో హెచ్చైన ప్రీతి స్వరముతో “సాధు వత్సా” సాదువత్సా అని పలికి
సభాజితోస్మి త్రిదశై ర్వత్సాహం కారణై స్త్రిభిః త్వం జామాతా చ యత్ప్రాప్తో యచ్చారి ర్వినిపాతితః ఆగతా న్యక్షతా న్యత్ర యచ్చా పత్యాని మే పునః తద్ గృహాణాద్య శస్తేహ్ని పాణి మస్యా మయోదితమ్ త్వ రాజపుత్ర చార్వంగ్యాః కన్యాయా దుహితు ర్మమ ముదావత్య ముదా యుక్తః సత్యవాక్యం కురుష్వ మామ్
తిరిగి ఇట్లనెను. ఓ కుమారా! ఈ రోజు నేను మూడు కారణముల వలన దేవతల ద్వారా కూడా ప్రశంసింప బడుచున్నాను. మొదటిది, నిన్ను నేను జామాతగా పొందితిని. రెండవది, శత్రువు మరణించెను. మరియు మూడవది, నా పుత్రులు, పుత్రిక స్వస్థ శరీరములతో తిరిగి వచ్చిరి. అందు వలన ఓ రాజ పుత్రా! నేటి ఈ శుభ దినము నందు నా ఆజ్ఞానుసారము శుభ లక్షణ యుక్తురాలైన నా ఈ కన్య ముదావతిని పరిణయ మాడుము. అట్లు చేసినచో నేను సత్యవాది నగుదును.”
రాజ పుత్రుడు:
తాతస్యాజ్ఞా మయా కార్యా యద్బ్రవీషి కరోమి తత్ త్వమేవ తాతః జానీషే నైవాత్రాధికృతా వయమ్
రాజపుత్రుడు:
“ఓ తండ్రీ! మీ ఆజ్ఞ తప్పక అనుసరించుటకు యోగ్య మైనది. అందు వలన మీరు ఏమి ఆజ్ఞాపించినారో దానినే చేయుదును. ఓ తండ్రీ! మీరు కూడా ఎరుగుదురు కదా! నేను పూజ్యులగు వారి ఆజ్ఞ ఎన్నటికిని తిరస్కరించను.”
మార్కండేయుడు:
తత స్తయోః స రాజేంద్ర శ్చక్రే వైవాహికం క్రమమ్ ముదావత్యాశ్చ దుహితు ర్భలందన సుతస్య వై
మార్కండేయుడు:
అనంతరము రాజేంద్రుడగు విదూరథుడు ముదావతికి మరియు భలందన పుత్రుడగు వత్సప్రీ యను వానికిని వివాహ కార్యము నిర్వర్తించెను.
తతః స తయా రేమే వత్సప్రీర్నవ యౌవనః రమణీయేషు దేశేషు ప్రాసాద శిఖరేషు చ కాలేన గచ్చతా వృద్దః పితా తస్య భలందనః వనం జగామ వత్సప్రీః స బభూవ మహీపతిః ఇయాజ యజ్ఞా న్సతతం ప్రజాధర్మేణ పాలయన్ పుత్రవ త్పాల్యమానా స్తు ప్రజా స్తేన మహాత్మనా వవృధు ర్విషయే తస్య న చాభూ ద్వర్ణసంకరః న దస్యు వ్యాల దుర్వృత్త భయ మాసీచ్చ కస్య చిత్ నోపసర్గ భయం చైవ తస్మిన్ చాసతి భూపతౌ
అనంతరము నవ యువకుడు వత్సప్రి ముదావతితో రమణీయ స్థానములకును మరియు ప్రాసాది శిఖరము లందు విహరించ సాగెను. కాలక్రమమున వత్సప్రి యొక్క తండ్రి భలందనుడు వృద్ధుడై వనములకు బోయెను. అప్పుడు వత్సప్రీ రాజై యజ్ఞానుష్టానమును మరియు ధర్మానుసారము ప్రజలను పాలింప సాగెను. ప్రజలు ఆ మహాత్మునిచే పుత్రుల వలె పాలింప బడుచు ఉత్తరో త్తరము సమృద్ధ శాలురై వర్దిల్లు చుండిరి. ఆతని రాజ్య మందు ఎక్కడను వర్ణ సంకరము లేదు. ఆతని శాసన కాల మందు చోరులు, హింసక జంతువులు దుర్మార్గులు మొదలగు వానిచే కలుగు ఉపద్రవములు లేకుండా నిర్భయముగా నుండెను.
Summary of chapter 113 of the Mārkandeya Mahā Purana is as follows:
The story of Prince Nābhāga unfolds as his brothers deprived him of his royal inheritance while he was residing at his guru's gurukula. Instructed by his father Manu, Nābhāga assisted the Angiras sages in completing a grand sacrifice, receiving vast wealth and establishing a prosperous kingdom through righteousness.