మార్కండేయ మహా పురాణము
97 - భౌత్య మన్వంతర వర్ణనము.
మార్కండేయుడు:
ఏవం స్తుత స్తత స్తేన భగవా న్హవ్యవాహనః
జ్వాలామాలా వృతతను స్తస్యాసీ దగ్రతో మునే!
దేవో విభాపసుః ప్రీత స్తోత్రేణానేన వై ద్విజః!
తం శాంతి మాహ ప్రణతం మేఘ గంభీర వాగథ.
మార్కండేయుడు:
ఓ మునీ! శాంతి అను విప్రుడు ఈ విధముగా స్తుతించ గానే భగవాను డగు హవ్య వాహనుడు జ్వాలామాలా యుక్తుడై ఆతని యెదుట ప్రత్యక్ష మయ్యెను. ఓ ద్విజుడా! విభావసుడు ఈ స్తోత్రముచే ప్రసన్నుడై ప్రనతుడైన ఆ “శాంతి”తో మేఘము వలె గంభీర వచనములతో నిట్లు పలికెను.
అగ్ని:
పరితుష్టోస్మి తే విప్ర! భక్త్యా యా తే స్తుతిః కృతా
వరం దాదామి భవతే ప్రార్ధ్యతాం య త్తవేప్సితమ్.
అగ్ని:
ఓ విప్రుడా! నీవు భక్తి పూర్వకముగా చేసిన స్తుతి వలన నేను సంతుష్టుడ నైతిని. నేను నీకు వరము నిచ్చెదను. నీవు నీ అభీష్టమును తెలుపుము.
శాంతి:
భగవ! న్కృతకృత్యోస్మి యత్త్వాం పశ్యామి రూపిణమ్
తథాపి భక్షినమ్రస్య భవతా శ్రూయతాం మమ,
భ్రాతృ యజ్ఞం గతో దేవ! మమాచార్యో నిజాశ్రమాత్
ఆగతశ్చాశ్రమం దిష్ణ్యం త్వ త్సనాధం స పశ్యతు.
శాంతి:
ఓ భగవానుడా! మీ రూపమును దర్శించుట తోడనే నేను కృత కృత్యుడ నైనాను. అయి నప్పటికి నేను భక్తి సహిత నమ్రుడనై అడుగు చున్నాను. వినుడు. ఓ దేవా! నా గురువు గారు తన ఆశ్రమము నుండి సోదరుని యజ్ఞమునకు వెళ్ళిరి. వారు ఆశ్రమమునకు తిరిగి వచ్చి అగ్ని కుండమును అగ్ని యుక్తముగా చూచు గాక!.
మమాపరాధాత్ సంత్యక్తం ధిష్ణ్యం యత్తే విభావసో!
త్రత్త్వయాధిష్టితం సోధ్య పూర్వవత్ పశ్యతు ద్వుజః
తథాన్యదపి మే దేవ! ప్రసాదం కురుషే యది
పుత్రో విశిష్టో భవకు తదాపుత్రస్య మే గురోః.
తథా చ మైత్రీం తనయే స కరిష్యతి మే గురుః
తథా సమస్త సత్వేషు భవత్యస్య మనో మృదు.
యశ్చ త్వాం స్తోష్యతేనేన ప్రీతిం యతోసి మేవ్యాయ!
స్తోత్రేణ తస్య వరదో భవేథా మత్ప్రసాదితః
ఓ విభావసుడా! నా యొక్క అపరాధము వలన ఏ అగ్ని కుండమును మీరు పరిత్యజించితిరో, దానిని ఈ సమయమున మీచే అధిష్టింపబడి పూర్వము వలెనే ఆ ద్విజుడు చూచు గాక. ఓ దేవా! తమరు ప్రసన్ను లైనచో నా రెండవ ప్రార్థనను ఆలకింపుడు. అపుత్రుడగు నా గురువునకు గుణశాలి యగు పుత్రుడు కలుగు గాక! నా గురువు ఏ విధముగా తన పుత్రునితో స్నేహము చేయునో, అదే విధముగా వారి మనస్సు అన్ని ప్రాణుల యందు స్నేహము కలదై యుండు గాక. ఓ అవ్యయుడా! నాపై ప్రసన్ను లగుట చూచి ఎవడు మిమ్ములను స్తుతించునో, నా యందు దయ యుంచి అతనికి కూడా మీరు ఈ స్తోత్రముచే వర దాయకులుగ నుందురు గాక.
మార్కండేయుడు:
ఏత చ్చృత్వా వచస్తస్య త మహా ద్విజసత్తమమ్
స్తోత్రేణారాధిత స్తేన గురుభక్త్యా చ పావకః
మార్కండేయుడు:
పావకుడు గురు భక్తిచే మరియు ఈ స్తోత్రము ద్వారా ఆరాధింప బడిన వాడై ద్విజ శ్రేష్టుడగు శాంతి యొక్క వచనములు విని ఆతనితో నిట్లు చెప్ప సాగెను.
అగ్ని:
గురో రార్దే యథో బ్రహ్మన్! యాచితం తే వరద్వయమ్
నాత్మార్ధం తేన మే ప్రీతి స్త్వ య్యతీవ మహామునే!
భవిష్యత్యేత దఖిలం గురో ర్యత్ప్రార్ధితం త్వయా
మైత్రీ సమస్త భూతేషు పుత్రశ్చాస్య భవిష్యతి.
మన్వన్తరాథిపః పుత్రో భౌత్యో నామ భవిష్యతి
మహాబలో మహావీర్యో మహాప్రాజ్ఞో గురు స్తవ.
అనేన యశ్చ స్తోత్రేణ స్తోష్యతే మాం సమాహితః
తస్యాభిలషితం సర్వం పుణ్యం చాస్య భవిష్యతి.
యజ్ఞేషు పర్వ కాలేషు తీర్థేజ్యా హోమకర్మసు
ధర్మాయ పఠతా మేత న్మమ పుష్టికరం పరమ్.
అగ్ని:
ఓ బ్రాహ్మణుడా! నీవు నీ కొఱకు ఏమియును అడుగక నీ గురువు కొరకు ఏ రెండు వరములను అడిగితివో, ఓ మహామునీ! వాని వలన నేను నీపై ఇంకనూ అధికముగా ప్రసన్నత నొందితిని. నీవు గురువు కొఱకు ఏమని ప్రార్ధించితివో, అదంతయు సిద్దించును. సమస్త ప్రాణుల యందు ఆయనకు మైత్రి కలుగును. మఱియు వానికి పుత్రుడు కూడ కలుగును. నీ గురువు గొప్ప ప్రాజ్ఞుడు, ఆయన మహా బలుడు, వీర్య వంతుడు నగు భౌత్యుడను పేరు గల మన్వంత రాధిపతి యగు పుత్రుడు ఉదయించును. మరియు ఏ పురుషుడు సావధానుడై ఈ స్తోత్రముచే నన్ను స్తుతించునో, ఆతని సమస్త కోరికలను సిద్దించును. మరియు పుణ్య సంచాయు డగును. యజ్ఞము లందు, పర్వ దినముల యందు, తీర్ధము లందలి యజ్ఞము లందు మరియు హోమాది కర్మల యందు ధర్మార్ధమై నా ఈ స్తోత్రమును పఠించినచో, పుష్టి కారకము అగును.
అహోరాత్ర కృతం పాపం శ్రుత మేత త్సకృ ద్ద్విజ!
నాశయిష్య త్ససందిగ్దం మమ తుష్టికరం వరమ్.
అహోమ కాల దోషాదీ నయోగ్యై రపి తత్కృతైః
యే దోషా స్తా నిదం సద్యః శమయిష్యతి సంశ్రుతమ్.
పౌర్నమాస్యా మమావస్యాం పర్వ స్వన్వేషు చ స్తవః
మమైష సంశ్రుతో మర్త్యై ర్భవితా పాపనాశనః.
మరియు ఈ స్తోత్రమును ఒకసారి శ్రవణ మాత్రముచే పగలు, రాత్రి చేసిన సమస్త పాపములు నిస్సందేహముగా నశించి పోవును. ఓ ద్విజుడా! ఈ స్తవము నాకు అత్యంత సంతోష జనక మైనది. హోమ కాలము దాటి పోయినచో, లేక అనధికారులగు మనుష్యులచే హోమాది కార్యములు చేయ బడినచో, ఎట్టి దోషములు కలుగునో, ఈ స్తవమును వినిన వెంటనే ఆ దోషము శమించును. పౌర్ణమి, అమావాస్య లేక ఇతర పర్వ దినము లందు వినినచో మానవులకు పాపములు తొలగి పోవును.
మార్కండేయుడు:
ఇత్యుక్త్వా భగవా నగ్నిః పశ్యత స్తస్య వై మునే!
బభూవాదర్శనః సద్యో దీపస్థో నిర్వృతో యథా.
స చ శాంతి ర్గాతే వహ్నౌ పరితుష్టేన చేతసా
హర రోమాఞ్చిత తనుః ప్రవివేశాశ్రమం గురోః
మార్కండేయుడు:
ఓ మునీ! దీపము యొక్క వెలుగు ఏ విధముగా వెంటనే నివృత్తమై పోవునో, అట్లే అగ్ని భగవానుడు ఇట్లు చెప్పు చుండగనే ఆతని సమీపము నుండి అంతర్ధాన మయ్యెను. అగ్ని దేవుడు అంతర్ధాన మవగానే ఆ “శాంతి” సంతుష్టు మనస్కుడై గురువు యొక్క ఆశ్రమమునకు బోయెను.
జాజ్వల్యమానం తత్రాసౌ గురు దిష్ట్యే హుతాశనమ్
దదర్శ పూర్వవ త్ప్రాప తతః స పరమాం ముదమ్.
ఏతస్మి న్నన్తరే సోపి గురు స్తస్య మహాత్మనః
భ్రాతు ర్యవీయసో యజ్ఞా దాజగామ స్వ మాశ్రమమ్.
తస్యాగ్రతశ్చ శిష్యోసౌ చక్రే పాదాభివన్దనమ్
గృహీతాసన పూజశ్చ తమాహ స తదా గురుః
వస్తాతిహార్ధం త్వయి మే తథాన్యేషు చ జన్తుషు
న వేద్మి కిమిదం త్వం చేద్వేత్స్యే తత్కథయాశు మే.
తతః స శాన్తి స్త త్సర్వ మాచార్యాయ మహామనే!
అగ్ని నాశాదికం విప్రః సమాచష్టే యథాతథమ్.
అనంతరము శాంతి యను విప్రుడు గురువు గారి అగ్ని కుండము నందు పూర్వము వలెనే ప్రజ్వలించు చున్న అగ్ని దేవుని చూచి అత్యంత ఆనందమును బొందెను. అదే సమయమున మహాత్ముడగు ఆ ‘శాంతి’ యొక్క గురువు కూడ తన ఆశ్రమమునకు తిరిగి వచ్చెను. అప్పుడు ఆ శిష్యుడు ఎదురుగా వెళ్లి ఆయన చరణములకు వందన మాచరించెను. అనంతరము గుర్వు శిష్యునిచే ఈయ బడిన ఆసన పూజలను గ్రహించి ‘శాంతి’తో ఇట్లనెను. ఓ వత్సా! నీ యందును, మఱియు అన్య ప్రాణు లందును నాకు స్నేహము కలుగు చున్నది. ఇట్లు ఎందులకు కలుగు చున్నదో నేను ఎరుగను. ఓ వత్సా! నీవు ఎరిగినచో వెంటనే నాకు చెప్పుము. ఓ మహామునీ! అప్పుడు శాంతి అను పేరు గల ఆ విప్రుడు అగ్ని నాశన మగుట మొదలు కొని సమస్త విషయములను ఆచార్యునికి ఉన్న దున్నట్లుగా వినిపించెను.
తచ్చృత్వా స పరిష్వజ్య స్నేహార్ద్ర నయనో గురుః
శిష్యాయ ప్రదదౌ వేదా న్సాజ్గోపాఙ్గా న్మహామునేః.
భౌత్యో నామ మను స్తస్య పుత్రో భూతే రాజాయత
తస్య మన్వన్తరే దేవా నృషీ న్భూపాంశ్చ మే శృణు.
భవిష్యస్య భవిష్యాంస్తు గదతో మమ విస్తరాత్
దేవేంద్రో యశ్చ భవితా తస్య విఖ్యాత కర్మణః
చాక్షుషాశ్చ కనిష్టాశ్చ పవిత్రా భ్రాజిరా స్తథా
ధారావృకాశ్చే త్యేతే వై పఞ్చ దేవగణాః స్మృతాః.
శుచి రిన్ద్ర స్తవా తేషాం త్రిదశానాం భవిష్యతి
మహాబలో మహావీర్యః సర్వై రిన్ద్ర గుణై ర్యుతః
ఓ మహా మునీ! విషయ మంతయు వినిన ఆ ఆచార్యుడు స్నేహ పూరిత నేత్రములతో శిష్యుని ఆలింగనము చేసుకొనెను. మరియు ఆతనికి సాంగోపాంగముగా సంపూర్ణ వేదమును ప్రసాదించెను. అనంతరము ఆ “భూతి” యొక్క పుత్రుడుగా, “భౌత్యు” డను మనువు జన్మించెను. విఖ్యాత కర్ముడగు భవిష్య మనువు యొక్క మన్వంతరము నందు ఏ దేవతలు, ఋషులు, భూపతులు మరియు ఏ ఇంద్రుడు ఉందురో, ఆ విషయము నంతయు విస్తారముగా వినిపించెదను వినుము. చాక్షుషులు, కనిష్టులు, పవిత్రులు, భ్రాజిరులు, మఱియు దారావృకులు, అను ఈ ఐదు విధాల దేవతా గణాలు ఉందురు. ఆ సమయమున ఇంద్రుని యొక్క సంపూర్ణ గుణాలు కలిగిన మహాబలుడు, మహా వీర్యుడు, అగు “శుచి” అనువాడు దేవతలకు ఇంద్రుడుగా ఉందును.
అగ్నీ దశ్చాగ్నిబాహుశ్చ శుచి ర్ముక్తోథ మాధవః
శుక్రోజితశ్చ సప్తైతే తదా సప్తర్షయః స్మృతాః.
గురు ర్గభీరో బ్రద్నశ్చ భారతోనుగ్రహ స్తథా
శ్రీమానీ చ ప్రతీరశ్చ విష్ణుః సంక్రన్దన స్తథా.
తేజస్వీ సుబలశ్చైవ భౌత్య స్యైతే మనోః సుతాః
చతుర్ధశం మమైతత్తే మన్వంతర ముదాహృతమ్.
శ్రుత్వా మన్వన్తరాణీత్థం క్రమేణ మునిసత్తమః
పుణ్య మాప్నోతి మనుజ స్తథాక్షీణాం చ సన్తతిమ్.
శ్రుత్వా మన్వన్తరం పూర్వం ధర్మ మాప్నోతి మానవః
స్వారోచిషస్య శ్రవణా త్సర్వకామా నవాప్నుతే.
అగ్నీధ్ర, అగ్నిబాహు, శుచి, ముక్త, మాధవ, శుక్ర, అజితులు, అను ఈ ఏడుగురు ఆ సమయమున సప్తర్షులుగా ఉందురు. గుహ, గంభీర, బ్రధ్న, భరత, అనుగ్రహ, శ్రీమానీ, ప్రతీర, విష్ణు, సంక్రందన, మరియు తేజస్వీ, సుబలులు అను వీరు భౌత్య మనువు యొక్క పుత్రు లయ్యెదరు. నేను నీకు ఈ పదునాల్గవ మన్వంతరమును వర్ణించితిని. ఓ మునిసత్తమా! క్రమానుసారముగా ఈ సంపూర్ణ మన్వంతరములను శ్రవణము చేసినచో మనుష్య గణాల పుణ్యమును సంపాదించుట యందు సమర్దు లగుదురు మరియు వారి వంశము ఎప్పుడును క్షీణము గానేరదు మనుష్య గణాల ప్రధమ మగు స్వాయంభువ మన్వంతరమును శ్రవణము చేసినచో ధర్మమును పొందుదురు. రెండవది యగు స్వారోచిష మన్వంతరమును వినినచో వారి సంపూర్ణ కోరికలు సిద్దించును.
ఔత్తమే ధన మాప్నోతి జ్ఞాన మాప్నోతి తామసే
రైవతే చ శ్రుతే బుద్దిం సురూపాం విన్దతే స్త్రీయమ్.
ఆరోగ్యం చాక్షుపే పుంసాం శ్రుతే వివస్వతే బలమ్
గుణవ త్పుత్ర పోత్రాంస్తు సూర్యసావర్ణికే జయమ్
జ్ఞాతిశ్రేష్టో గుణైర్యుక్తో దక్షసావర్ణికే శ్రుతే
నిశాతయ త్యరిబలం రౌచ్యం శ్రుత్వా నరోత్తమ!
దేవప్రసాద మాప్నోతి భౌత్యే మన్వన్తరే శ్రుతే
తతాగ్నిహోత్రం పుత్రాంశ్చ గుణయుక్తా నవాప్నుతే.
మూడవది యగు ఔత్తమ మన్వంతరమును మరియు నాల్గవది యగు తామస మన్వంతరమును వినినచో జ్ఞాన లాభమును పొందుదురు. ఐదవది యగు రైవత మన్వంతరము వినుటచే బుద్దిని మఱియు రూపవతి యగు స్త్రీని పొందుదురు ఆరవది యగు చాక్షుష మన్వంతరమును వినుటచే పురుషుడు ఆరోగ్యమును పొందును, ఏడవది యగు వైవస్వత మన్వంతరమును వినినచో బలమును. ఎనిమిదవది యగు సూర్య సావర్ణిక మన్వంతరమును వినినచో గుణవంతులగు పుత్ర పౌత్రులను పొందును. మనుష్య గణాలు తొమ్మిదవది యగు బ్రహ్మ సావర్ణి మన్వంతరమును శ్రవణము చేసినచో మాహాత్మ్యమును పదియవ దగు ధర్మ సావర్ణిక మన్వంతరమును వినుటచే మంగళమును, మఱియు పదకొండ వదియగు రుద్రా సావర్ణిక మన్వంతరమును వినుటచే బుద్దిని, జయమును పొందుదురు. ఓ నరోత్తమా! పన్నెండవది యగు దక్ష సావర్ణిక మన్వంతరమును వినుటచే మనుష్యుడు జ్ఞాతులలో శ్రేష్ఠుడు మఱియు గుణ యుక్తుడు అగును. పదమూడవ వదియగు రౌచ్య మన్వంతరమును వినుటచే శత్రువుల బలమును నాశనము చేయుట యందు సమర్దు డగును. పదనాల్గవ వది యగు భౌత్య మన్వంతరమును వినుటచే దేవ ప్రసాద లాభమును పొందును మఱియు అగ్ని హోత్రుని యనుగ్రహమున గుణ యుక్తులగు పుత్రులను పొంద గలుగును.
సర్వా ణ్యనుక్రమా ద్యశ్చ శృణోతి మునిసత్తమ!
మన్వన్తరాణి తస్యాపి శ్రూయతాం ఫల ముత్తమమ్.
తత్ర దేవా నృషీ నిన్ద్రాన్మనూం స్తత్తనయా నృపాన్
శ్రుత్వా వంశాంశ్చ సర్వేభ్యః పాపేభ్యో విప్ర! ముచ్యతే.
దేవర్షీన్ద్ర నృపాశ్చాన్యే ఏత న్మన్వ న్తరాధిపాః
తే ప్రియన్తే తదా ప్రీతా ప్రయచ్చన్తి శుభాం మతిమ్.
తతః శుభం మతిం ప్రాప్య కృత్వా కర్మ తథా శుభామ్
శుభాం గతి మవాప్నోతి యావదిన్ద్రా శ్చతుర్దశ.
సర్వే స్యు రృతవః క్షేమ్యాః సర్వే సౌమ్యా స్తదాగ్రహాః
భవ న్త్యసంశయం శ్రుత్వా క్రమా న్మన్వన్తర స్థితిమ్.
ఓ మునిసత్తమా! మనుష్యుడు స్వాయంభువ మన్వంతరము నుండి క్రమా నుసారముగా అన్ని మన్వంతరములను శ్రవణము చేయు వాడు పొందు నట్టి ఉత్తమ ఫలములను చెప్పెదను వినుము. ఓ విప్రా! ఆయా మన్వంతరముల యొక్క , దేవతల యొక్క సమస్త ఋషుల యొక్క, మనువు యొక్క, నృపతుల యొక్క, పుత్ర గణాలు మఱియు వారి వంశముల యొక్క వృత్తాంతములను వినిన మానవుడు సంపూర్ణ పాపముల నుండి విముక్తు డగును. దేవతలు, ఋషులు, ఇంద్రుడు నృప గణాలు మరియు ఎవరు ఆ మన్వంతరముల యొక్క అధిపతులై ఉండిరో వారు ప్రసన్ను లగుదురు. వారు ప్రసన్ను లైనచో బుద్ది నిచ్చెదరు. అనంతరము బుద్దిని పొంది శుభ కర్మలు చేయుటచే ఎప్పటి వరకు పదనాలుగు ఇంద్రులు ఉందురో, అప్పటి వరకు మనుష్యులు శుభమగు బుద్దిని పొందుదురు. క్రమా నుసారముగా మన్వంతరముల యొక్క స్థితిని వినుటచే సమస్త ఋతువుల క్షేమ కారకములై ఉండును. మఱియు గ్రహము లన్నియు సౌమ్యుములుగ నుండును ఇందు సందేహము లేదు.
Summary of chapter 97 of the Mārkandeya Mahā Purana is as follows:
Pleased by Ruci's devout stuti, the Pitṛs emerge from the sky in radiant, shining forms and grant him divine boons. They promise him a noble, celestially beautiful wife and declare that his son will become the ninth patriarch, Raucya Manu, ruling over a glorious cosmic age.