మార్కండేయ మహా పురాణము
115 - ఖనిత్ర చరిత్రము
మార్కండేయుడు:
తతః సమస్త లోకస్య విస్మయః సోభవ న్మహాన్
యదేక కాలం నేశుస్తే పృథక్పురనివాసినః
తతః శ్రుశ్రావ నిదనం యాతా న్భ్రాతృ పురోహితాన్
మంత్రిణం చ తథా భ్రాతు ర్ధగ్ధం తం విశ్వవేదినమ్.
కిమేతదితి సోతీప విస్మితో మునిసత్తమ!
ఖనిత్రోభూ న్మహారాజో నాజానా త్తచ్చ కారణమ్.
తతో వసిష్ఠం పప్రచ్ఛ స రాజా గృహ మాగతమ్
యత్కరణం వినేశుస్తే భ్రాతృ మన్రిపురోహితాః.
తేన పృష్ఠ స్తదా ప్రాహ యథావృత్తం మహామునిః
యచ్చౌరిమన్త్రిణా ప్రోక్తం యచ్చ శౌరి రువాచ తమ్.
మార్కండేయుడు:
మునివరా! అప్పుడు ఖనిత్ర సోదరుని పురములు వేరై నప్పటికిని పురవాసులు ఒకే సమయమున ఏ ప్రకారముగా నాశనము పొందిరో సమస్త లోకమునకు గొప్ప ఆశ్చర్యము కలిగెను. మునివరా! అటు పిమ్మట ఖనిత్రుని సోదరుని యొక్క పురోహితుడు, మంత్రి, విశ్వవేదియు దగ్ధమగుట విని మునిసత్తమా! ఇట్లు అగుటకు కారణములు తెలియక మహా రాజగు ఖనిత్రుడు చాలా విస్మయము జెందెను. తరువాత ఆ రాజు తన గృహమునకు వచ్చిన వశిష్ఠ మహర్షిని సోదరులు మంత్రి పురోహితులు నాశము చెందిన కారణ మేమిటని యడిగెను ఇట్లు రాజు అడుగగా వశిష్టుడు శౌరికి మంత్రి చెప్పినది, మంత్రితో శౌరి చెప్పినది, జరిగిన దంతయు చెప్పెను.
యథా చానుష్టితం తేన భ్రాతౄణాం భేదాకారి వై
మన్త్రిణా తేన దుష్తెన యచ్చకృశ్చ పురోహితాః.
యన్నిమిత్తం వినేశు స్తే అపాపస్యాపకారిణః
పురోహితా స్తస్య రాజ్ఞః శత్రా వసి దయావతః.
స తచ్చృత్వా తతో రాజా హాహతోస్మీతి వైవదన్
నినిన్దాత్మన మత్యర్ధం వసిష్ఠస్యాగ్రతో ద్విజ!.
ఆ దుష్ట మంత్రి ద్వారా సోదరుల యందు భేదాభిప్రాయము కలిగించుటకు ఏ ఏ కార్యములు చేసిరో, పురోహితులు ఏమి చేసిరో, మఱియు శత్రువు యెడల కూడా దయ జూపునట్టి ఆ పురోహితులు ఏ కారణముచే నిరపరాధియైన రాజుకు అపకారము చేయుటకు సంవిద్దులై నష్ట పోయిరో దాని నంతయు యధాతధముగా చెప్పెను. ఓ ద్విజుడా! రాజు ఈ విషయములను విని “హా హతోస్మి” అని చెప్పి వసిష్ఠుని ఎదుటనే తనను తాను నిందించు కొనసాగెను.
రాజు:
ధీఙ్మా మపుణ్య సంస్థాన మల్పభాగ్య మశోభానమ్
దైవ దోష కృతం పాపం సర్వలోక విగర్హితమ్.
మన్నిమిత్తం వినిష్టంతత్ తద్బ్రాహ్మణ చతుష్టయమ్
మత్తః కోన్యః పాపతరో భవిష్యతి పుమా న్భువి.
రాజు:
నేను సంపాదన చేయలేదు. నేను అల్ప భాగ్యహీనుడను. దైవము నా యడల ప్రతి కూలముగా నుండెను. మఱియు నేను సర్వ లోకము లందును నిందితుడను, పాపిని, నను ధిక్కరింప వలెను, ఎందు వలన యనగా నా కారణమున నలుగురు బ్రాహ్మణులు మృత్యువును పొందిరి. అందు వలన ఈ భూ మండలమున నన్ను మించిన మహా పాపాత్ముడు ఎవ్వడు ఉండును?
నాభవిష్యం యది పుమా నహ మత్ర మహీతలే
తత స్తేన వినశ్యేయు ర్మమ భ్రాతృ పురోహితాః.
దిగ్రాజ్యం దిక్చమే జన్మ భూభుజాం మహతాం కులే
కారణత్వం గతో యోహం వినాశస్య ద్విజన్మనామ్.
కుర్వన్తః స్వామినాం తేధ భ్రాతౄణాం మమ యాజకాః
నాశం యయు ర్న దుష్టా స్తే దుష్టోహం నాశకారణే.
కిం కరోమి క్వ గచ్చామి నాన్యో మత్తోస్తి పాపకృత్
పృథివ్యా మస్తి హేతుత్వం ద్విజనాశస్య యోగతః.
ఇత్థగ్నముద్వ్ని హృదయః ఖనిత్రః పృథివీపతిః
వనం యియాసుః పుత్రస్య కృతవా నభిషేచనమ్.
నేను ఈ భూమి యందు పురుషునిగా జన్మించినచో, నా సోదరులు పురోహితులు మృత్యువును పొందెడి వారు కారు. నేనే బ్రాహ్మణుల నాశన మునకు కారకుడ నైతిని. నా ఈ రాజ్యము మరియు గొప్ప రాజ కులమందు కలిగిన నా ఈ జన్మకు ధిక్కారము. నా సోదరుల పురోహితులు ప్రభువుల ప్రయోజన సిద్ది కొఱకై నష్ట పోయిరి. అందు వలన వారు దోషులు కారు. వారి నాశనమునకు కారకుడ నైన నేనే దోషిని. ఇప్పడు నేనేమి చేయుదును? ఎక్కడికి పోను? బ్రహ్మ హత్యా కారకుడ నయిన నాతో సమానమగు పాపాత్ముడు భూమి యందు మరి యోక డుండడు, ఈ ప్రకారము మహీ పాలకుడగు ఖనిత్రుడు ఉద్విగ్న చిత్తుడై వనమునకు బోవ నిశ్చయించి పుత్రుని రాజ్యాభిషిక్తుని జేసెను.
అభిషిచ్య సుతం రాజ్యే క్షుపసంజ్ఞం మహీపతిః
భార్యాభి స్త్రిసుభిః సార్ధం తపసే స వనం యయౌ.
తత్ర గత్వా తపస్తేపే వానప్రస్థ విధానవిత్
శతాని త్రీణి వర్షాణాం సార్థాని నృపసత్తమః.
తపసా క్షీణ దేహస్తు రాజవర్యో ద్విజోత్తమ!
నిగృహ్య సర్వస్రోతాంసి తత్యాజాసూ న్వనేచేరః.
తతః పుణ్యా న్యయౌ లోకా న్సర్వ కామదుహోక్షయాన్
ఆశ్వమేధాదిభి ర్యజ్ఞై రవాప్యా యే నరాధిపైః.
భార్యాశ్చ తస్య తా స్తిస్త్రః సమం తేనైవ తత్యజుః
ప్రాణా నవాపుః సాలోక్యం తేనైవ సుమహాత్మనా.
ఏతత్ ఖనిత్ర చరితం శ్రుతం కల్మష నాశనమ్
పఠతాం చ మహాభాగ! క్షుపస్యాతో నిశామయ.
రాజు క్షుపుడను కుమారుని రాజ్యా భిషిక్తుని జేసి ముగ్గురు భార్యలతో తపస్సు చేసు కొనుటకు వనమునకు బోయెను. నృప సత్తముడు వనమున ప్రవేశించి వానప్రస్థ విధాన క్రమముగా మూడు వందల యేబది సంవత్సరములు తపస్సు చేసెను. అటు పిమ్మట ఓ ద్విజోత్తమా! రాజకుల తిలకుడు వనవాసి యగు నా రాజు తపస్సు వలన దేహము క్షీణించెను ఇంద్రియము లన్నియు నిరోధించి ప్రాణములు వదిలెను. ఏ రాజులు గూడ వందల కొలది అశ్వమేధ యజ్ఞములు చేసినను పొందని అక్షయ లోకములను మహా రాజగు ఖనిత్రుడు మరణించిన పిమ్మట పొందెను. అతని యొక్క ముగ్గురు భార్యలును యజమానితో గూడి ప్రాణ త్యాగము చేసి ఆ మహాత్మునితో కలిసి ఆయనతో సమానమగు లోకముల బొందిరి. ఓ మహా భాగా! ఈ ప్రకారము ఖనిత్ర చరితము చెప్ప బడెను. ఈతని చరిత్ర వినుటచే లేక చదివినను సమస్త పాపములు నశించును. ఇప్పుడు నీకు క్షుప మహారాజు చరిత్ర వర్ణించెదను.
Summary of chapter 115 of the Mārkandeya Mahā Purana is as follows:
Having governed his kingdom righteously for centuries, King Nābhāga crowns his heroic son Ambarīsha and retires into the forest to practice deep meditation, eventually attaining the supreme abode of Bhagavān Vishṇu.