34 – అలర్క పాలనము, ఆత్మా వివేకము

జడుడు:

సోవ్యలర్కో యథా న్యాయం పుత్రవ న్ముదితాః వ్రజాః

పాలయామాస ధర్మాత్మా స్వేస్వే కర్మణ్యవ స్థితాః

దుష్టేషు దండం శిష్టేషు సమ్యక్చ పరిపాలనమ్

కురవా న్పరాం ముదం లేభే ఇయాచ చ మహామఖై

అజాయంత సుతాశ్చాస్య మహాబల పరాక్రమాః

ధర్మాత్మనో మహాత్మానో విమార్గ పరిపన్థినః

చకార సోర్థం ధర్మేణ ధర్మ మర్థేన వాపునః

తయోశ్చై వావిరోధేన బుభుజే విషయా నపి

ఏవం బహూని వర్షాణి తస్య పాలయతో మహీమ్

ధర్మార్థ కామ సక్తస్య జగ్ము రేక మహార్యథా

జడుడు:

ధర్మాత్ముడైన అలర్కుడు న్యాయాను సారముగ పుత్రుల వలె ప్రజలను పాలించుటచే ప్రజలు పరమానందమును పొందిరి. మరియు వారి వారి హితము లయిన అన్ని కర్మానుష్ఠానము లందు ప్రవృత్తులై యుండిరి. అలర్కుడు దుష్ట పురుషులను దండించి సజ్జనులను పాలించి పరమానంద భరితు డయ్యెను. మరియు అనేక ప్రకారములగు, శ్రేష్ఠము లయిన యజ్ఞములను చేసెను. కాలక్రమాన ఆయనకు అనేక పుత్రులు జన్మించిరి. వారందరూ మహా బల పరాక్రమ వంతులు, ధర్మాత్ములు, మహాత్ములు మరియు దుర్మార్గులను అంతము చేయు వారు అయి ఉండిరి. అలర్కుడు ఆత్మా వంతుడై ధర్మానుసారముగా అర్థమును, అర్థ సహితముగా ధర్మ రక్షణమును మరియు ధర్మార్థములకు అవిరోధముగా విషయ భోగుడై యుండెను. ఈ విధముగా ధర్మ, అర్థ, కామముల ననుసరించుచు భూమిని పాలించు చుండగా రాజుకు అనేక సంవత్సరములు ఒక దినముతో సమానముగా గడచి పోయెను.

వైరాగ్యం నాస్య సంజజ్ఞే భుంజతో విషయాన్ప్రియాన్

స చాప్యల మభూ త్తస్య ధర్మోర్థోపార్జనం ప్రతి

తం తథా భోగ సంసర్గం ప్రమత్త మాజీ తేంద్రియమ్

సుబాహుర్నామ శుశ్రావ భ్రాతా తస్య వనేచరః

తం బుబోధయిషుః సొథ చిరం ధ్యాత్వా మహామతిః

తద్దెర్వి సంశ్రయం తస్య శ్రేయోమన్యత భూపతేః

తతః స కాశీ భూపాల ముదీర్ణ బల వాహనమ్

స్వరాజ్య మాప్తు మాగచ్చ ద్భహుశః శరణం కృతీ

సోపి చక్రే బలోద్యోగ మలర్కం ప్రతి పార్థివః

దూతం చ ప్రేషయామాస రాజ్య మస్మై ప్రదీయతామ్

ప్రియమగు సంభోగ విషయముల ననుభ వించినను ధర్మార్థముల నార్జించ వలెనను కోరిక మిక్కుటముగా నుండెను. వైరాగ్యము కలుగ లేదు. అలర్కునికి సుబాహుడను పేరు గల ఒక సోదరుడు మొదటి నుండియు వన వాసము నాశ్రయించి ఉండెను. అతడు అలర్కుని భోగ సంభోగము లందు ప్రమత్తుడై అజితేంద్రియుడై ఉన్న విషయమును వినెను. అందు చేత అతడు సోదరునికి తత్త్వ జ్ఞానమును కలుగ చేయ వలెనను కోరికచే చాలా కాలము అలోచించి చివరకు అతని శత్రువు ఆశ్రయాన్ని పొందుటయే ఉత్తమమని తలంచెను. అనంతర మందు కార్య కుశలుడగు సుబాహుడు స్వయంగా రాజ్య లాభము కలుగ వలయునను కోరికచే మహా బలవంతుడు, బల వాహన యుక్తుడగు కాశీ పతిని అనేక పర్యాయములు శరణు వేడెను. కాశీ రాజు అలర్కునికి ప్రతికూలముగా సేనలను సమాయత్త పరచి ఒక దూత ద్వారా ‘సుబాహునకు రాజ్య ప్రదానము చేయుము’ అను సమాచారమును అలర్కుని వద్దకు పంపెను.

సోపి నిచ్చత్తదా దాతు మాజ్ఞా పూర్వం స్వధర్మవిత్

ప్రత్యువాచ చ తం దూత మలర్కః కాశి భూభృతః

మామేవాభ్యేత్య హార్దేనా యాచతాం రాజ్య మగ్రజః

నాక్రాంత్యా సంప్రదాస్యామి భయేనాల్పామపి క్షితిమ్

సుబాహు రపి నో యాచ్ఞాం చకార మతిమంస్తదా

న ధర్మః క్షత్రియస్యేతి యాచ్ఞా వీర్యధానో హి సః

తతః సమస్త సైన్యేన కాశీశః పరివారితః

అక్రాంతు మభ్యగా ద్రాష్ట్ర మలర్కస్య మహీపతేః

అనంతరైశ్చ సంశ్లేష మభ్యేత్య తదనంతరమ్

తేషా మన్యతమై ర్భృత్యై స్సమాక్రమ్యానయ ద్వశమ్

క్షత్రియ ధర్మమును ఎరిగిన అలర్కుడు ఈ విషయము నంగీకరింపక ఆ దూత ద్వారా కాశీ రాజునకు ఇట్లు ప్రత్యుత్తరమును పంపెను. “నా పెద్ద అన్నగారు నా ఎదుటకు వచ్చి వినయ పూర్వకముగా రాజ్యము నిమ్మని ప్రార్థించ వలెను. నేను ఆక్రమణ భయము చేత స్వల్ప మగు భూమిని కూడా ఇవ్వను.” బుద్ధిమంతుడగు సుబాహుడు ప్రార్థించ లేదు. ఎందుచేత ననగా అట్లు ప్రార్థించుట క్షత్రియులకు ధర్మము కాదు. ఒక్క వీరత్వము మాత్రమే వారికి ధనము. అనంతరము కాశీరాజు సేనలను సమాయత్త పరచి కాశీ రాజుతో కరిసి సుబాహుడు మహీపతి యగు అలర్కుని రాజ్యము పైకి దండెత్తెను. అతడు తన సామంత రాజుల సహితముగా మరియు అన్య భృత్యుల సహితముగా వెళ్ళి ఆక్రమణ చేసి అలర్కుని తన వశము చేసి కొనెను.

అపీడయంశ్చ సామంతం స్తస్య రాష్ట్రోపరోధనైః

తథా దుర్గాంత పాలాంశ్చ చక్రే చాటవికా న్వశే

కాంశ్చి చ్చోప ప్రదానేన కాంశ్చిద్భేదేనా పార్థివాన్

సామ్నైవాన్యా స్వశం నిన్యే నిభృతా స్తస్య యే భవన్

తతః సోల్పబలో రాజా పర చక్రావ పీడితః

కోశక్షయ మువాపోచ్చైః పురం చారుధ్యతారిణా

ఇత్థం సంపీడ్యమానస్తు క్షీణకోశో దినే దినే

విషాద మాగా త్పరమం వ్యాకులత్వం చ చేతనః

ఆర్తిం స పరమాం ప్రాప్య తత్సస్మ్రారాంగులీయకమ్

యదుద్ధిష్య పురా ప్రాహ మాటా తస్య మదాలసా

అతడు సోదరుని రాజ్యమును అవరోథకము లగు సామంత గణములను పీడించి, దుర్గ పాలురను మఱియు ఆటవిక గణాలను వశీభూతము చేసుకొనెను. ఈ విధముగా అలర్కుడు పర హస్తము నందు పీడితుడై క్షీణ బలుడు అయ్యెను. అతని రాజ్యము కూడా శత్రువుల వశ మయ్యెను. ఈ విషముగా దిన దినము కోశ క్షీణుడై శత్రువుల ద్వారా పీడితుడగుటచే అతడు అత్యంత విషాదమును పొందెను. అతని చిత్తము వ్యాకులము పొందెను. క్రమముగా అత్యంత ఆర్త భావమును పొందిన మీదట తల్లియగు మదాలస పూర్వము చెప్పిన అంగుళీయకము యొక్క విషయము జ్ఞప్తికి వచ్చెను.

తతః స్నాతః శుచిర్భూత్వా వాచయిత్వా ద్విజోత్తమన్

నిష్కృష్య శాసనం తస్మా ద్దదృశే ప్రస్పుటాక్షరమ్

తత్రైవ లిఖితం మా తా వాచయామాస పార్థివః

ప్రకాశ పులకాంగో సౌ ప్రహర్షోత్పుల్లోచః

సంగః సర్వాత్మనా హేయో హాతుం చేచ్చక్యతే న సః

ముముక్షాం ప్రతి తత్కార్యం సైవ తస్యాపి భేషజమ్

వాచయిత్వా టు బహుళో నృణాం శ్రేయః కథం త్వితి

ముముక్షయేతి నిశ్చిత్య సా చ తత్సజ్గటో యతః

అప్పుడు అతడు స్నానముచే పవిత్రుడై బ్రాహ్మణుని ద్వారా స్వస్తి వాచనములు చెప్పించి ఆ నిబద్ద శాసనమును బయటకు తీసి చూసెను. అందు స్పష్ట రూపములలో అక్షరములు వ్రాయబడి యుండెను. తల్లిచే వ్రాయబడిన ఆ శాసనమును చదువుటచే అతని శరీరము పులకిత మైనది. మఱియు రెండు నేత్రములు ఆనందముచే మెరిసి పోయెను. శాసన మందు ఇట్లు వ్రాయబడి యుండెను. “సర్వాంతః కరణములచే సాంగత్యమును త్యజింప వలెను.” ఒకవేళ సాంగత్య త్యాగము చేయుట యందు సమర్థుడు కానిచో అతడు సాధువులతో సాంగత్యము చేయ వలెను. ఎందుచేత ననగా సాధువుల సాంగత్యము జగత్తునకు ఔషధ స్వరూపము. సర్వాంతః కరణములచే కోరికలు పరిత్యజించ వలెను. ఒక వేల దానిని త్యజింప లేని వాడు ముక్తి యందు కోరిక కలిగి యుండుట ఉత్తమము. ఎందువల్ల ననగా అదియే అతనికి మహాదౌషదము వంటిది. ఈ విధముగా మాటి మాటికి తల్లి ఇచ్చిన శాసనము యొక్క పాఠమును చదివి దేని వలన మానవుడు కళ్యాణ లాభమును పొందునో, మోక్షము కలుగ వలెనను కోరికయే ఆ కళ్యాణ లాభామునకు ఉపాయము. మఱియు సత్సాంగత్యమే ఆ ముముక్షువు యొక్క సాధనమునకు కారణము అని నిశ్చయించెను.

తతః స సాదు సంపర్కం చింత యాన్పృథివీ పతిః

దత్తాత్రేయం మహాభాగా మగచ్చ త్పరమూర్తిమాన్

తం సమేత్య మహాథ్మాన మకల్మష మసంగినమ్

ప్రణిపత్యానుధి సంపూజ్య యథాన్యాయ మభాషత

బ్రహ్మన్ కురు ప్రసాదం మే శరణుః శరణార్థినామ్

దుఃఖాపహారం కురు మే దుఃఖార్తస్యాతికామినః

ఈ విధముగా నిశ్చయించు కొని సాదు సాంగత్య లాభమును గురించి విచారించ సాగెను. ఇట్లు ఆర్తుడైన నరపతి అలోచించి చివరకు మహాభాగుడగు దత్తాత్రేయుని వద్దకు వెళ్ళెను. అతడు నిష్కల్మషుడు సంగి మరియు మహాను భావుడు నాగు దత్తాత్రేయుని ప్రణామాదులచే పూజించి న్యాయాను సారముగ ఇట్లు చెప్పెను. హే బ్రాహ్మన్! తమరు నా యందు దయ చూప వలెను. తమరే శరణారతులకు శరణ్యులు నేను విషయ భోగము లందలి కోరికచే దుఃఖితుడ నయితిని. తమరు నా దుఃఖమును దూరము చేయుడు.

దత్తాత్రేయుడు:

దుఃఖా పహారా మద్యైవ కరోమి తవ పార్థివ

సత్యం బ్రూహికి మర్థం తే దుఃఖం తత్పృథివీ పతేః

కస్య త్వం కస్య వా దుఃఖం తత్వమేవ విచార్యతామ్

అంగాన్యంగీ వీరంగం చ సర్వాంగాని విచి తయ

దత్తాత్రేయుడు:

ఓ పార్థివా! నేను ఇప్పుడే నీ దుఖమును దూరము చేయుదును. ఓ పృథివీ పతీ! నీవు సత్యము చెప్పుము. ఏ కారణము చేత నీకు దుఃఖము సంప్రాప్త మయ్యెను? నీవు ఎవరవు? నీ కేమి దుఃఖము కలిగెను? ముందుగా దీనిని గురించి అలోచించుము. అంగములు, అంగముల భావాలు మరియు నిరంగములు ఈ అన్ని అంగముల గురించి విచారింపుము.

జడుడు:

ఇత్యుక్తశ్చింతయా మాస స రాజా తేన ధీమతా

త్రివిధస్యాపి దుఃఖస్య స్థాన మాత్మాన మేవ చ

స విమృశ్య చిరం రాజా పునః పున రుదారదీః

ఆత్మాన మాత్మానా ధీరః ప్రహస్యేద మథా బ్రవీత్

నాహ ముర్వీ న సలిలం జ్యోతి రానిలో న చ

నాకాశం కిం తు శారీరం సమేత్య సుఖ మిష్యతే

న్యూనాతిరిక్తతాం యాతి పంచకేస్మిన్సుఖా సుఖమ్

యది స్యా నమ్మ కిం న స్యా ధన్యస్థేపి హితం మయు

నిత్య ప్రభూత సద్భావే న్యూనాదిక్యా న్నతోన్నతే

తథా చ మమతా త్యక్తా విశేషేణోపలభ్యతే

జడుడు:

మహీపతీ! దత్తాత్రేయుడు ఈ విధముగా అడిగిన పిమ్మట ఆ మహీపతి త్రివిధములగు దుఃఖము యొక్క స్థానము మరియు ఆత్మా ఈ రెండు విషయములను విచారించుట యందు ప్రవృత్తు డయ్యెను. ఉదారుడు, ధీర ప్రకృతి, అయిన నరపతి మరల మరల అనేక మారులు ఆత్మ ద్వారా ఆత్మ విచారణ చేసి నవ్వు కొనుచూ చెప్ప మొదలిడెను. నేను భూమిని కాను, జలమును గాను, జ్యోతిని గాను, అనిలమును గాను, మరియు ఆకాశమును కూడా గాను. కాని శరీరమును ఆశ్రయించి సుఖమును కోరుదును. ఈ పంచ భౌతిక శరీర మందు సుఖ, దుఃఖములు ఉపస్థితములై యున్నవి. న్యూనాతిరిక్తములను పొందు చున్నవి. అవి ఇట్లుండినచో నా కేమి హానీ కలుగును? ఎందు వల్ల ననగా నేను శరీరము గాను. శరీరముతో స్వతంత్ర భావముతో ఉపస్థితుడనై యున్నాను. నాకు న్యూనాదిక్య భావాలు ఉండవు. అందుచే మమతలను త్యజించి విశేషముగా జ్ఞానమును పొందుటయే ఉచితము.

తన్మాత్రా వస్థితే సూక్ష్మే తృతీయాంశే చ పశ్యతః

తథైవ భూత సద్భావం శారీరం కిం సుఖా సుఖమ్

మనస్యవస్థితం దుఃఖం సుఖం వా మానసంచచ

యత్ యత స్తతో న మే దుఃఖం సుఖం వా న హ్యహం మనః

నాహంకారో న చ మనో బుద్ధిర్నాహం యతస్తతః

అంతః కరణజం దుఃఖం పారక్యం మమ తత్కథమ్

నాహం శరీరం న మనో యతోహమ్, పృథక్చరీరా న్మనస స్తథాహమ్

తత్సస్తు చేత స్యాత వాపి దేహే, సుఖాని దుఃఖాని చ కిం మమాత్ర

రాజ్యస్య వాంచాం కురుతేప్రజోస్య, దేవస్య చే త్పంచమయః స రాశిః

గుణ ప్రవృత్త్యా మమ కిం ను తత్ర, తత్ధ్స స చాహం చ శరీరతోన్యః

నేను తన్మాత్రావ స్థిత సూక్ష్మ మందలి తృతీయాంశ మందు ఉపస్తితుడనై యున్నాను. నా శరీరము కూడా భూత సద్భావములతో ఏకమై యున్నది. అందు వలన సుఖ దుఃఖముల సంభావన ఎక్కడ? సుఖ దుఖములు మనస్సు నందు యుండును. అది మనస్సు యొక్క ధర్మము. ఎప్పుడైతే నేను మనస్సును కూడా కానో అప్పుడు నాకు సుఖ దుఃఖములు లేవు. ఎప్పుడు నేను అహంకారమును కానో, మనస్సును కానో, మరియు బుద్ధిని కూడా కానో అప్పుడు అంతః కరణ జనితములైన పారక్య దుఃఖములు (ఇతరులు కలుగ చేసిన దుఃఖములు) ఏ విధముగా సంభవ మగును? నేను శరీరమును గాను, మనస్సును గాను, నేను శరీరము, మనసుల నుండి వేరుగా నుంటిని. అందు వలన సుఖము మనస్సు నందు గాని లేక శరీరము నందు గాని ఉన్న యెడల నాకేమి? నాకు ఇందులో ఏ హానీ కూడా లేదు. మరియు ఫలము లేదు. ఈ విధముగా అగ్రజుడే రాజ్యము నిమ్మని ప్రార్థించెను. ఈ శరీరము పంచ భౌతిక మయినచో దాని గుణ ప్రవృత్తులతో నాకేమి అవసర మున్నది? అగ్రజు డెవరు? నేను ఎవరను? ఇద్దరమూ దేహము నుండి వేరుగా ఉన్న ఒకే పదార్థము.

న యస్య హస్తాదిక మాప్యశేషం, మాసం న చాస్థీని శిరా విభాగః

క స్తస్య నాగాశ్వరథాది కోశైః న్వల్పోపి సంబద ఇహాస్తి పుంసః

తస్మాన్న మేరిర్న చ మేస్తి దుఃఖం, న మే సుఖం నాపి పురం న కోశమ్

న చాశ్వనాగాడి బలం న తస్య, నాన్యస్య వా కన్యచి ద్వా మమాస్తి

యథాఘటీ కుంభ కమందలుస్థ, మాకాశ మేకం బహుతా హి దృష్టమ్

తథా సుబాహుః స చ కాశిపోహం మన్యే చ దేహేషు శరీర భేదైః

దేనికి హస్తములు మొదలగు అవయవములు మాంసము, శిరము మొదలగు భాగములు ఉండవో, గుఱ్ఱము, ఏనుగు, రథము, మొదలగు వాటి వలన ఏమి అవసరము? ఇందులో పురుషునకు ఏ విధమయిన సంబంధము కనుపించదు. అందు వలన నా శత్రువులకు దుఃఖము, సుఖము, పురము, కోశము, ఆశ్వగజాది సైన్యములు కూడా లేవు. ఏ విధముగా నాకు కూడా ఏమియు లేవో, అదే విధముగా నా అగ్రజునకు కూడా అన్యులైన ఏ పురుషునకు కూడా ఇవన్నియు లేవు. ఒక ఆకాశము మాత్రమే ఏ విధముగా కుండ యందు, కమండలము నందు వాటి భేదముల ననుసరించి అనేక రూపముతో కనిపించునో అట్లే ఒక్క ఆత్మయే సుబాహు, కాశీ రాజు మరియు నేను ఇట్లు దేహముల భేధముల ననుసరించి అనేక విధములుగా కనిపించుచున్నది.