123 - అవిక్షి చ్చరితము

మార్కండేయుడు:

కదాచి ద్రాజపుత్రో సౌ మృగయా మచర ధ్వనే మృగా న్విధ్య న్వరాహాంశ్చ శార్దూలాదేంశ్చ దంష్ట్రిణః శుశ్రావ సహసా శబ్దం త్రాహి త్రాహీతి యోషితః విక్రోశన్త్యాః సుబహుశో భయ గద్గద ముచ్చకైః మాభై ర్మాభై రితి వద న్రాజపుత్రః స వేగితః చోదయామాస తురగం యతః శబ్దః సమాగతః తతశ్చ సాపి చుక్రోశ కన్యకా విజనే వనే గృహీతా దనుపుత్రేణ దృడ కేళేన మానినీ కరన్దమ సుత స్యాహం భార్యా చః మవిక్షితః హర త్యనార్యో విపినే పృథివీశస్య ధీమతః

మార్కండేయుడు:

ఒకనాడు రాజ పుత్రుడు వనము నందు మృగ, వరాహములను కోరలు గల శార్దూల, సింహాది జంతువులను వేటాడు చుండెను. ఆ సమయమున హఠాత్తుగా దుఃఖించు చున్న ఒక స్త్రీ యొక్క కంఠము నుండి “రక్షింపుడు” “రక్షింపుడు “ అని భయముతో డగ్గుత్తికతో బిగ్గరగా అక్రోశించుచున్న శబ్దమును వినెను. ఆ ధ్వని వినిన వెంటనే రాజపుత్రుడు “భయము లేదు” “భయము లేదు” అని వణుకుచు ఆ శబ్దము విన వచ్చిన ప్రదేశమునకు వేగముగా గుఱ్ఱమును పరుగెత్తించెను. అనంతరము దను పుత్రుడగు దృఢ కేశునిచే పట్టుకొన బడియున్న ఆ “మానిని” నిర్జన వనము నందు ఈ విధముగా విలపించెను. నేను కరంధముని పుత్రుడు బుద్ధిమంతుడు పృథ్వీశ్వరుడు నగు అవీక్షితుని భార్యను. ఈ దుర్మార్గుడు నన్ను ఈ వనములో అపహరించు చున్నాడు.

యస్య సర్యే మహీపాలా స్తథా గాంధర్వ గుహ్యకాః న సమర్థాః పురః స్థాతుం తస్య భార్యా హృతాస్మ్యహమ్ యస్య మృత్యోరివ క్రోధః శక్రస్యేన పరాక్రమః కరంధ మనుత స్యైషా తస్య భార్యా హృతాస్మ్యహమ్

ఎవని ఎదుట సమస్త రాజులు , గుహ్యకులు గంధర్వులు గూడ నిలువలేరో, అట్టి వాని భార్యనై యుండియు అపహరింప బడు చున్నాను. ఎవని కోపము మృత్యువుతో సమానమో, పరాక్రమము ఇంద్రునితో సమానమో, అట్టివాడగు కరంధముని పుత్రుని భార్యను. ఈతడు నన్ను అపహరించు చున్నాడు.

మార్కండేయుడు:

ఇత్యాకర్ణ్య మహీపాల తనయః సశరాసనీ చిన్తయామాస కిమిదం మామ భార్యాత్ర కాననే మాయేయం రక్షసాం నూనం దుష్టనాం శాననౌకసామ్ అధవా గత ఏవాహం సర్వం వేత్స్యామి కారణమ్

మార్కండేయుడు:

చేతి యందు ధనుస్సు ధరించిన రాజ పుత్రుడు ఈ మాటలు విని ఇట్లు యోచింప సాగెను. “ఈ వనములో నా భార్యయా? ఏమి విచిత్రము? ఇది నిస్సందేహముగా వనము నందు సంచరించు రాక్షసుల మాయయే. ఏమయిన గాని సమీపమునకు బోయినచో విషయ మంతయు తెలియును.”

మార్కండేయుడు:

త్వరితః స తతో గత్వా దదర్శాతిమనోరమామ్ కాననే కన్యకా మేకాం సర్వాలజ్కార భూషితామ్

మార్కండేయుడు:

అటు పిమ్మట రాజ పుత్రుడు వెంటనే అచటకు చేరుకొని ఆ వనములో సమస్త ఆభరణములచే అలంకరింప బడినదియు, అత్యంత మనోహరియు అగు ఒక కన్యను చూచెను.

గృహీతాం దను పుత్రేణ దృఢకేశేన దండినా త్రాహి త్రాహీతి కరుణం విక్రోశన్తీం పునః పునః మాభై రితి స తా మాహహతోసీతి చ తం వదన్ శాసతీమాం మహిం దుష్టః కో దూయేత కరంధమే యస్య ప్రతాపావనతా భువి సర్వే మహిక్షితః తతస్త మాగతం దృష్ట్వా గృహీత వర కార్ముకమ్ మాం త్రాహి త్యాహ తన్వజ్గీ హృతాస్మ్యేషేతి చాసకృత్ రాజ్ఞః కరన్దమస్యాహం స్నుషా భార్యాప్యవిక్షితః హృతాస్మ్యేతేన దుష్టేన సనాథా నాధవ ద్వనే

చేతి యందు దండమును ధరించిన దానవుడగు ధృడకేశుని చేపట్టు కొనబడినదై “రక్షింపుము, రక్షింపుము” అని మాటి మాటికి పలుకుచు రోదించు చున్న ఆమెను చూసెను. అవిక్షితుడు ఆ కన్యతో భయము లేదు అని పలికి దానవునితో ఇట్లనెను. నీకు మృత్యువు అత్యంత సమీపమున ఉన్నది. కరంధముని యొక్క పృథ్వీ పాలన సమయమున దుఃఖమును పొందు వారెవరు ఉందురు? ఎట్టి కరంధమ రాజు యొక్క ప్రతాపమునకు భూమి యందలి రాజు లందరు తలలు వంచుకొని యుందురో, అట్టి వాని శాసన కాలమున ఏ దుష్ట మానవుడు జీవింప గలడు? అని ప్రచండ ధనుర్ధారియై వచ్చుచున్న ఆ రాకుమారుని చూచి ఆ కృశాంగి మాటి మాటికి ఇట్లు పలుక సాగెను. “నన్ను రక్షింపుడు. ఇతడు నన్ను అపహరించు చున్నాడు. నేను కరంధ మహారాజు యొక్క పుత్రుడగు అవీక్షుని భార్యను. అందువలన నాథుడుండియు కూడ అనాథ వాలే ఈ వనము నందు దుష్టునిచే హరింపబడు చున్నాను.”

మార్కండేయుడు:

తతో విమమృసే వాక్య మవిక్షి తప తతోదితమ్ కథ మేషా హి మే భార్యా సృషా తాతస్య వా కథమ్

మార్కండేయుడు:

ఆ కన్య పలుకులు విని రాజ పుత్రుడు ఇట్లు ఆలోచింప సాగెను. ఈ కన్య నాకు భార్యయా? నా తండ్రి గారికి కోడలా ? ఎట్లు అగును?

అధవా మోదయా మ్యేతా తవ్వీం వేత్స్యామి త త్పునః క్షత్రియై ర్దార్యతే శాస్త్ర మార్తానాం త్రాణకారణాత్ తతః కృద్దో బ్రవీ ద్విరో దానవం తం సుదుర్మతిమ్ జీవ న్గచ్చ విసుచ్యైనా మన్మథా న భవిష్యసి తతః స తాం విహాయాచ్చై ర్దండ ముత్క్షిప్య దానవః తమప్యథావ త్సోప్యేనం శరవర్షై రవాకిరత్ స వార్యమణో బాణౌఘై ర్దానవోతిమదాన్వితః రాజపుత్రాయ చిక్షేప దండం శంకుశతావృతమ్ త మాపత న్తం చిచ్చేద శరై ర్భూపసుత స్తతః సోప్యాసన్నం గృహీత్వోచ్చై ర్ద్రుమమాజౌ వ్యవస్థితః

ఏమయినను ముందు ఈ కన్యను విడిపించెదను. అటు పిమ్మట అన్ని విషయములను తెలుసుకొనెదను. ఎందు వలన యనగా ఆర్త జనులను రక్షించుటకు క్షత్రియులు శస్త్రములను ధరింతురు. అని పలుకుచూ తరువాత మహా వీరుడగు రాకుమారుడు క్రోధితుడై దుర్మతియగు దానవునితో ఇట్లు పలికెను. “జీవింప వలెనను కోరిక యున్నచో, ఈమెను వదిలి పారి పొమ్ము. లేనిచో తప్పక నీకు మృత్యువు సంప్రాప్తించును. దానవుడు రాజ పుత్రుని మాటలు విని కన్యను వదిలి దండమును చేతిలో ధరించి అతని పైకి యురికెను. అప్పుడు అతడు బాణములను వర్షించి అతనిని కప్పి వేసెను. దానవుడు రాజ పుత్రుని బాణములను నిరోధించి అత్యంత అహంకారముతో రాజ పుత్రునిపై వందల కొలది ముండ్లు గల దండమును విసిరెను. కాని రాజ పుత్రుడు మధ్య లోనే దానిని బాణములచే త్రుంచి వేసెను. అప్పుడు దానవుడు సమీపమున నున్న ఒక పెద్ద వృక్షమును తీసికొని యుద్ద క్షేత్రమున ప్రవేశించెను.

సృజతః శరవర్షాణి తం చిక్షేప తతో ద్రుమమ్ స చ తం తిలశ శ్చక్రే భల్లైః కార్ముక యోచితైః తత శ్చిక్షేవ చ శిలాం రాజపుత్రాయ దానవః సాపి మోఘా పపాతోద్వ్యా ముజ్ఘితా తేన లాఘవాత్ రాజపుత్రాయ కుపిదో యద్యచ్చి క్షేప దానవః తత్తచిచ్చేద బాణౌఘై ర్భూభ్భత్పూనుః నలీలయా తతో విచ్చిన్న దండోసౌ విచ్చిన్న సకలా యురః ముష్టి ముద్యమ్య సక్రోదో రాజపుత్ర మధావత తస్యాపతత ఏవాసౌ కరన్దమసుతః శిరః చిత్త్వా వేతసపత్రేణ పాతయామా స వై భువి

బాణములను వర్షించు చున్న ఆ రాజ పుత్రునిపై దానిని విసిరెను. కాని రాజ పుత్రుడు దానిని కూడ ధనస్సుచే వదులు చున్న బాణములచే తిల పరిమాణములుగా ఖండ ఖండములు చేసెను. అటు పిమ్మట దానవుడు రాజ పుత్రునిపై ఒక శిలను వేయ సాగెను. అతడు హస్త లాఘవముచే దానిని కూడ వ్యర్థ పరచి భూమిపై పడ వేసెను. ఈ విధముగా దానవుడు క్రోధముతో రాజ పుత్రునిపై ఏమేమి విసురు చున్నాడో, వాని నన్నింటిని అతడు బాణములచే మధ్యలోనే త్రుంచి వేయు చుండెను. ఈ విధముగా దానవుడు దండము, సంపూర్ణ అస్త్ర శస్త్రములన్నియు తునకలు కాగానే ఆ దానవుడు కృద్ధుడై పిడికిలి బిగించి రాజ పుత్రుని పైకి ఉరికెను. కాని అతడట్లు వచ్చు చుండగానే కరంధముని కుమారుడు వేతస పాత్ర బాణముచే ఆతని శిరస్సును త్రుంచి భూమిపై బడ వేసెను.

తస్మి న్వినిహతే తేన దానవే దుష్ట చేష్టితే కనన్దమసుతః సర్యైః సాధు సాద్వితి భాషితః వరం వృణీష్వేతి తదా దేవై రుక్తో నృపాత్మజః వవ్రే పుత్రం మహావీర్యం పితుః ప్రియ చికీర్షయా

ఇట్లు దుష్టుడగు దానవుని చంపగానే దేవత లందరూ “బాగు, బాగు” అని పలుక సాగిరి. పిమ్మట దేవతలు వరము కోరుకొను మనిరి. అప్పుడు రాజ పుత్రుడు తండ్రి యొక్క ప్రియ కార్యమును సఫలము చేయుటకై మహా వీర్యవంతుడగు పుత్రుని యిమ్మని కోరెను.

దేవతలు:

భవిష్యతి హి తే పుత్రా శ్చక్రవర్తీ మహాబలః అస్యా మేవ హి కన్యాయాం మోక్షితాయాం త్వయానఘ

దేవతలు:

ఓ పాపరహితుడా! నీవు ఎవరిని రక్షించితివో ఈ కన్య యొక్క గర్భము నందే నీకు బలవంతుడగు చక్రవర్తి అగు పుత్రుడు ఉదయించును.

రాజ పుత్రుడు:

పిత్రాహం సత్యపాశేన బద్ద చ్చామ్యహం సుతమ్ రాజభి ర్నర్జితే నాజా త్యక్తో దారసంగ్రహః స చ మే యాచతా త్యక్తా విశాల నృపతేః సుతా తయా చ మత్క్రుతే త్యక్తో మామృతే నారా సఙ్గమః

రాజ పుత్రుడు:

నేను తండ్రి ఎదుట సత్య పాశమునకు బద్దుడనై పుత్రుని కోరు చున్నాను. కాని పూర్వము యుద్ధ స్థలమున ఓడిపోయి నందున భార్యను పరిగ్రహింప వలెనను కోరికను పరిత్యజించి యుంటిని. నేను విశాల రాజ పుత్రికను పరిత్యజించగానే ఆ కన్య కూడ అప్పటి నుండి నా కారణముననే నన్ను దక్క అన్య పురుషుని సంగమును పరిత్యజించెను.

తత్కుధం తా మపాశ్యాద్య విశాల తనయా మహమ్ నృశంసాత్మా కరిష్యామి అన్యనారీ పరిగ్రహమ్

ఇప్పుడు విశాల రాజ కన్యను వదిలి నేను ఏ విధముగా అన్య స్త్రీని గ్రహింతును.

దేవతలు:

ఇయమేవ హి తే భార్యా శ్లాఘ్యతే యా త్వయా సదా విశాలస్య సుతా సుభ్రూ స్త్వత్క్రుతే యాశ్రితా తపః అస్యా ముత్పత్స్యతే వీరః సప్తద్వీప ప్రసాధకః యష్టా యజ్ఞ సహస్రాణాం చక్రవర్తీ సుత స్తవ

దేవతలు:

“ఎవరిని నీవు సదా ప్రశంసించు చున్నావో, ఆమెయే ఈమె నీ భార్య. ఈ సుందరియే విశాల రాజు యొక్క కుమార్తె. నీ కొరకు తపస్సు నవలంభించిన ఆ రాకుమారి ఈమెయే. ఈమె గర్భము నుండి నీకు సప్త ద్వీప ప్రసాధకుడు, సహస్ర సహస్ర యజ్ఞకర్త , చక్రవర్తి వీరుడునగు పుత్రుడు జన్మించును.”

మార్కండేయుడు:

ఇత్యుచ్చార్య యయు ర్దేవాః కరన్దమసుతం ద్విజః సోప్యాహ తాం తదా పత్నీ కథ్యతాం భీరు కిం త్విదమ్

మార్కండేయుడు:

దేవతలు కరంధముని పుత్రునితో నిట్లు పలికి అంతర్ధాన మయిరి. అప్పుడు రాజ పుత్రుడు భార్యతో నిట్లనెను. ఓ వీరురాలా! ఈ సంఘటన ఎట్లు సంప్రాప్తించినది? దానిని చెప్పుము.

కన్య:

సా చాస్మై కథయామాస త్యక్తాహం భవతా యదా త్యక్త బంధు జనారణ్యం నిర్వేదా త్సముపాగతా

కన్య:

ఎప్పుడయితే మీరు నన్ను వదిలి వెల్లితిరో, అప్పుడు నేను అత్యంత దుఃఖముతో బంధువులను త్యజించి ఈ వనము నందు ప్రవేశించితిని.

అత్రాహం తపసా వీర క్షీణప్రాయం కలేబరమ్ త్యక్తుకామా స మభ్యేత్య దేవదూతేన వారితా భవిష్యతి చ పుత్రస్తే చక్రవర్తీ మహాబలః ప్రీణయిష్యతి యో దేవా ననురాంశ్చ హనిష్యతి ఇతి దేవాజ్ఞయా తేన దేవదూతేన వారితా న సంత్యక్తవతీ దేహం త్వత్సజ్గమ మనోరదా పరశ్వశ్చ మహాభాగ స్నాతుం గజ్గాహ్రదం గతా అవతీర్ణా వికృష్టాస్మి వృద్ధనాగేన కేనచిత్ తతో రసాతలం నీతా తేన తత్ర చ మే పురః నాగాః సహస్రశ స్తస్థు ర్నాగా పత్న్యః కుమారకాః

ఓ వీరా! ఇక్కడ తపస్సు చేయుటచే దేహ మత్యంత క్షీణ మయ్యెను. నేను ఒక దినమున దేహ త్యాగము చేయవలె ననుకొంటిని. అదే సమయమున ఒక దేవ దూత వచ్చి నన్ను నివారించెను. అతడిట్లు చెప్పెను. నీకు బలవంతుడు చక్రవర్తి యగు పుత్రుడు ఉదయించును. ఆపుత్రుడు అసురులను చంపును. మరియు దేవతల ప్రీతి బడయును. అందువలన దేవతల ఆజ్ఞ ప్రకారము ప్రాణ త్యాగమును చేయవద్దు.” ఇట్లు నివారింప బడిన దానినై నేను అప్పుడు మిమ్ములను కలియుదునను ఆశచే జీవన త్యాగమును చేయలేదు. ఒకనాడు నేను గంగా నదికి వెళ్లి అచ్చట స్నానము చేయుటకు నీటి లోనికి దిగితిని. అదే సమయమున ఒక వృద్ద నాగ రాజు నన్ను లాగు కొనుచు రసాతలమునకు తీసుకొని పోయెను. ఎప్పుడయితే నేను రసాతలమునకు చేరు కొంటినో, అప్పుడు వేల వేల నాగులు, నాగ పత్నులు మరియు నాగ కుమారులు నా ఎదుటకు వచ్చి నిలచిరి.

తుష్టువు ర్మాం స మభ్యేత్య మా మన్యేపూజయం స్తథా యయాచిరే సవినయఖ నాగా మా దుజ్గవా స్తథా ప్రసాదం కురు సర్వేషాం త్వ మస్యాకం సుత స్త్వయా అపరాధ ముపేతానాం సంనివార్యో వథోన్ముఖః అపరాధం కరిష్యన్తి త్వత్సుత్ర స్యానిలాశనాః తన్నిమిత్తం నివార్యోసౌ ప్రసాదః క్రియతామితి తథేతి చమయా ప్రోక్తే దివ్యైః పాతాల భూషణైః భూషితాహం తథా పుష్పై ర్గన్ధవాసోభి రుత్తమైః సమానీతా తథా లోక మిమం తేనానిలాశినా పురా యథా కాన్తిమతీ పూర్వవ ద్రూప శాలినీ

కొందరు నన్ను పూజింపసాగిరి.అటు పిమ్మట నాగులు, నాగ పత్నులు వినయముతో నన్ను ఇట్లు ప్రార్థించిరి. “మీరు మా అందరిపై దయ జూపవలెను. మీ పుత్రుని యెడల ఒక వేళ మేము అపరాథుల మైనచో, అతడు మమ్ములను వధించుటకు ప్రయత్నించును. అప్పుడు మీరు అతనిని నివారించ వలెను” వాయు భోజులగు నాగ గణాలు ఎప్పుడయితే మీ పుత్రునికి అపరాధము చేసినను మీరు ఈ నిమిత్తము అతనిని నివారింప వలెను. అనుగ్రహించి ఈ విషయము నంగీకరింపుడు.” అని ప్రార్థించెనో, అప్పుడు నేను ‘అట్లే అగు గాక’ అని అంగీకరించితిని. అప్పుడు నన్ను దివ్యములగు పాతాళ భూషణములచే మనోహర గంధ వస్త్రాదులచే మరియు పుష్పాదులచే అలంకరించిరి. ఆ వృద్ధ నాగరాజు మరల భూలోకమునకు తీసుకొని వచ్చి తన లోకమునకు బోయెను. అప్పుడు నేను పూర్వము వలే కాంతి యుక్త రూపవతి నయితిని.

ఇతి రూపవతీం దృష్ట్వా సర్వాలజ్కార భూపితామ్ జగ్రాహ దృఢకేశోయం హర్తుకామః వ దుర్మతిః యుష్మద్భాహు బలే నాహం రాజపుత్ర విమోక్షితా,

తత్ప్రశీద మహాబాహో మాప్రతీచ్చ త్వయా సమః భూలోకే రాజపుత్రోన్యో నాస్తి సత్యం బ్రవీమ్మహమ్  

ఇట్లు సర్వ భూషణాలంకృతురాలైన రూపవతినై యున్న నన్ను చూచి దుర్మార్గుడగు దృఢకేశుడు అపహరింప వలెనను కోరికచే పట్టుకొని తీసుకొని పోవు చుండెను. ఓ రాజపుత్రా! నేను మీ యొక్క బాహు బలముచే ఈ సమయమున విముక్తురాల నైతిని. అందువలన ఓ మహాబాహూ! అనుగ్రహించి నన్ను స్వీకరింపుము. నేను సత్యము చెప్పు చున్నాను. భూమియందు మీతో సమానుడగు గుణవంతుడగు రాజు లేడు.