మార్కండేయ మహా పురాణము
100 - ఆదిత్య స్తవము
మార్కండేయుడు:
తస్య సంతాప్యమానే తు తేజసోర్ద్వ మధస్యథ
సిసృక్షు శ్చింతయామాస పర్మయోనిః పితామహః
సృష్టి కృతాపి మే నాశం ప్రయాస్యత్యభి తేజసా
భాస్వతః సృష్ఠి సంహార స్థితిహేతో ర్మహాత్మనః
అప్రాణాః ప్రాణినః సర్వ ఆశః శుష్యంతి తేజసా
న చాంభసా వినా సృష్టి ర్విశ్వస్యాస్య భవిష్యతి.
ఇతి పంతింత్య భగవాన్ స్తోత్రం భగవతో రణేః
చకార తన్మయో భూత్వా బ్రహ్మ లోక పితామహః
మార్కండేయుడు:
పిమ్మట ఆదిత్యుని తేజస్సుచే ఊర్ద్వ, అథో లోకాల సంతాపమును పొందుటచే సృష్టిని చేయ దలచి పద్మ యోని యగు పితా మహుడు ఇట్లు చింతింప సాగెను. “నేను సృష్టించి నప్పటికీ సృష్టి, స్థితి, సంహార కారియు, మహాత్ముడు నగు భాస్కరుని తీవ్ర తేజస్సుచే ఈ సమస్తము నష్ట మగును. అతని తేజస్సుచే సమస్త ప్రాణులు ప్రాణ హీనులు, మరియు జలములు శుష్కములు అగు చున్నవి. జలము లేక ఈ విశ్వము యొక్క సృష్టి కూడా జరగదు” లోక పితా మహుడగు బ్రహ్మ ఈ విధముగా చింతించి ధ్యాన మగ్నుడై రవి భగవానుని స్తుతింప మొదలిడెను.
బ్రహ్మ:
నమస్యే యన్మయం సక్వ మేత త్సర్వమయశ్చ యః
విష్ణుమూర్తిః పరంజ్యోతి ర్యత్తద్ద్యాయంతి యోగినః
బ్రహ్మ:
ఎవడు సంపూర్ణ విశ్వము యొక్క ఆత్మ స్వరూపడై యున్నాడో, ఎవడు ఈ విశ్వము యొక్క రూపము లోనే చరించు చున్నాడో, ఈ విశ్వమే మూర్తిగా ఎవడు కలిగి యున్నాడో, మఱియు యోగి గణాలు ఏ అనింద్రియ గ్రాహ్యమగు పరమ జ్యోతిని ధ్యానించెదరో, నేను వానికి నమస్కారము చేయు చున్నాను.
య ఋఙ్మయో యో యజుషాం నిధాన, సామ్నాంమ్చ యా యోని రచింత్యశక్తిః
త్రయీమయః స్థూలతయార్ధ సూత్రా, సస్వరూపో గుణ పారయోగ్యః
త్వాం సర్వహేతుం పరమం చ దేద్య, మాద్య సుంజ్యోతి రనీద్యరూపమ్
స్థూలం చ దేవాత్మతయా నమస్తే, భాస్వంతి దూర్యం పరమం పరేభః
సృష్టిం కరోమి యదహం తపశక్తి రాద్యాం తత్ ప్రేరితో జల మహీ పవరాగ్ని రూపామ్
తద్దేవతాది విషయాం ప్రణవాద్య శేషాం, నాత్మేచ్చాయ స్థితింయావపి తద్వాదేవ
వహ్నిస్త్వ మేవ జలశోషణతః పృథివ్యాః సృష్టిం కరోషి జగతాం చ తథాద్య పాకమ్
వ్యాపీ త్వమేవ భగవాన్! గగన స్వరూపం, త్వం వంచథా జగదిదం పరిపాసి విశ్వమ్.
యజ్ఞై ర్యజంతి పరమాత్మవిదో భవంతం విష్ణు స్వరూప మఖిలేష్టిమయీ వివస్వన్!
ధ్యాయంతి చాపి యతయో నియతాత్మచిత్తాః, సర్వేశ్వరం పరమ మాత్మ విముక్తి కామః
ఎవడు అచింత్య శక్తి గల ఋగ్వేద మయుడో, ఎవడు యజుర్వేదమునకు ఆధారమై యున్నాడో, ఎవడు సామ వేదము యొక్క ఉత్పత్తికి కారణుడో, ఎవడు స్తూలతా ప్రయుక్త త్రయీ మయుడో, ఎవడు అర్ధమాత్ర స్వరూపుడో, మరియు ఎవడు పరబ్రహ్మ స్వరూపుడో మరియు గుణాతీతుడో. పరమ కారణ రూపుడో. పరమ పూజ్యుడు, పరమ వేద్యుడు, అవహ్ని రూపమగు పరమ జ్యోతి, దేవాత్మతా హేతు స్థూల రూపుడు, శ్రేష్ఠులలో శ్రేష్ఠుడు అగు భాస్వాన్ భగవానునకు నమస్కారము చేయు చున్నాను. ఓ దేవా! నీ శక్తియే ఆద్యము. ఎట్లనగా నేను దాని ద్వారానే ప్రేరేపింప బడి జలము, భూమి, వాయువు, మరియు అగ్ని రూప దేవతాది విషయములు ప్రాణవాదులు మొదలగు వాని యొక్క అశేష సృష్టి చేయు చున్నాను. ఇదే విధముగా స్థితి, ప్రళయములను కూడా నా యిష్టముచే చేయుట లేదు. నీ శక్తిచే ప్రేరేపింప బడియే చేయు చున్నాను. ఓ భగవంతుడా! నీవే వహ్ని రూపుడవు. నీవు ఎప్పుడు భూమి యందలి జలమును పీల్చుదువో. అప్పుడు జగత్తు యొక్క సృష్టి ప్రధమ ఫలముగా నీవు సంపన్నము చేయుదువు. నీవే పంచ భూత స్వరూపుడవై ఈ విశ్వమును రక్షించు చున్నావు. ఓ వివస్వానుడా! పరమాత్మ వేత్తలు అఖిల యజ్ఞమయ విష్ణు రూప మందు నిన్ను యజ్ఞముల ద్వారా అర్చించెదరు. ఆత్మ మొక్షాభిలాషులగు జితేంద్రియ యతి గణాలు సర్వేశ్వరునిగా తలచి నిన్ను ధ్యానించెదరు.
నమస్తే దేవ రూపాయ యజ్ఞ రూపాయ తే నమః
పర బ్రహ్మ స్వరూపాయ చింత్యమానాయ యోగిభిః.
ఉపసంహార తేజో యత్ తేజసః సంహతి స్తవ
సృష్టే ర్విఘాతాయ విభో! సృష్టౌ చాహం సముద్యతః.
నీవే దేవ స్వరూపుడవు నీకు నమస్కరించు చున్నాను. నీవే యజ్ఞ స్వరూపుడవు నీవే యోగి జనుల యొక్క చింతనీయ పరబ్రహ్మ స్వరూపుడవు నీకు నమస్కరించు చున్నాను. హే విభో! నీవు తేజస్సును నివృత్తి చేసుకొనుము. నేను సృష్టి చేయుటకు ఉద్యుక్తుడనై ఉన్నాను. నీ యొక్క తేజ స్సమూహము సృష్టి యందు విఘ్న కారిగా ఉన్నది.
మార్కండేయుడు:
ఇత్యేవం సంస్తుతో భాస్వాన్ బ్రహ్మణా సర్గ కర్తృణా
ఉపసంహృతవాం స్తేజః వరం స్వల్ప మథారయత్.
చకార చ తతః సృష్టిం జగతః పద్మ సంభవః
తథా తేషు మహాభాగః పూర్వకల్పాంతరేషు వై
దేవాసురాడీ న్మర్త్యంశ్చ వశ్వాదీన్ వృక్షవీరుదః
ససర్జ పూర్వవ ద్బ్రహ్మా నరకాంశ్చ మహామునే!
మార్కండేయుడు:
భాస్వాను డగు భగవానుడు సృష్టికర్త యగు బ్రహ్మ ద్వారా ఈ విధముగా స్తుతిని పొందిన వాడై పరమ తేజస్సును ఉప సంహరించెను. కేవలము అల్ప తేజస్సును ధరించెను. అప్పుడు మహాభాగుడు పద్మయోని యగు బ్రహ్మ పూర్వ కల్పము వలె ఈ కల్పము నందు కూడా జగత్ సృష్టి చేసెను. ఓ మహామునీ! బ్రహ్మ పూర్వము వలె దేవ అసుర, నర, పశు, వృక్ష, లతల మొదలగు వానిని మరియు అన్ని నరకాలను సృష్టించెను.
Summary of chapter 100 of the Mārkandeya Mahā Purana is as follows:
Mārkaṇḍeya summarizes the complete cycle of the fourteen Manvantaras that make up a single Kalpa of Svayambhū Brahmā. He extols the immense spiritual merit gained by contemplating the divine order of cosmic time, the lineages of Manus, and the continuous preservation of Dharma by Bhagavān Vishṇu.