మార్కండేయ మహా పురాణము
99 - మార్తాండ మాహాత్మ్యము
మార్కండేయుడు:
తస్మా దండా ద్విభిన్నాత్తు బ్రాహ్మణోవ్యక్త జన్మనః
ఋచో బభూవుః ప్రథమం ప్రథమా ద్వదనా న్మునే!.
జపాపుష్ప నిభాః సద్య స్తేజోరూపా హ్యసంహతాః
పృథక్ పృథ గ్విభిన్నాశ్చ రజో రూపవహా సతః.
యుజూంషి దక్షిణా ద్వాక్త్రా దనిరుద్దాని కానిచిత్
యాదృగ్వర్ణం తథా వర్ణా న్యసంహతిధరాణి చ.
పశ్చిమం యద్విభో ర్వక్త్రం బ్రహ్మణః పరమేష్టినః
అవిర్భూతాని సామాని తత్త చ్చందాంసి తా న్యథ.
అథర్వణా మశేషంచ భృంగాంజనచయ ప్రభమ్
యావద్ఘోర స్వరూపం తదాభిచారిక శాంతికమ్.
ఉత్తరా త్ర్పకటీభూతం వదనా త్తస్య వేథసః
సుఖ సత్వతమః ప్రాయో సౌమ్యఃసౌమ్య స్వరూపవత్.
మార్కండేయుడు:
ఓ మునీ! ఎప్పుడైతే ఆ గ్రుడ్డు పగిలి పోయెనో, దాని నుండి అవ్యక్త జన్ముడగు బ్రహ్మ వెలువడెనో, అప్పుడు ఆతని మొదటి ముఖము నుండి ఋగ్వేద ఛందస్సులు ఉత్పన్న మయ్యెను. ఆ ఋగ్వేద ఛందస్సులు జపా పుష్పముల వలె తేజో రూపములు, అసంహతములు, పరస్పర విభిన్న రజో రూపమయ ములై యుండెను. ఆతని దక్షిణ ముఖము నుండి కాంచన వర్ణ యుక్తములు, అసంహితములు నగు సమస్త యజుర్వేద ఛందస్సులు విభిన్న భావములతో బహిర్గత మయ్యెను. అనంతరము పరమేష్టియగు బ్రహ్మ యొక్క పశ్చిమ ముఖము నుండి సమస్త సామ వేద ఛందస్సులు ఆవిర్భవించెను. ఆ సమస్త సామ వేద ఛందస్సులు పరస్పరము విభిన్నములై యుండెను. ఆ బ్రహ్మ యొక్క ఉత్తర ముఖము నుండి అశేష అధర్వణ వేద ఛందస్సులూ మారణ ఉచ్చాటనాది అభిచారికములు, శాంతి కారకములు, ఘోర రూపములు తుమ్మెదల సమూహముల వలె కృష్ణ వర్ణములు, ప్రభాయుక్తములు సుఖ సత్వ తమో బహుళములగు సౌమ్య, అసౌమ్య రూపములగు అశేష అధర్వణ వేద ఛందస్సులు బయల్వెడలెను.
ఋచో రజోగుణాః సత్త్వం యుజుషాం చ గుణా మునే!
తమో గుణాని సామాని తమః సత్త్వ మథర్వసు.
ఏతాని జ్వలమానాని తేజసా ప్రతిమేన వై
పృథక్ పృథ గవస్థాన భాంజి వూర్వ మివాభవన్
తత స్తదాద్యం యత్తేజ ఓమిత్యుక్త్వాభిశబ్ద్యతే
తస్య స్వభావా ద్యత్తేజ స్తత్సమావృత్య సంస్థితమ్.
యథా యజుర్మయం తేజ స్తద్వత్సామ్నాం మహామునే!
ఏకత్వ మపయాతాని పరే తేజసి సంశ్రయే.
ఓ మునీ! సమస్త ఋగ్వేద ఛందస్సులు రజో గుణ యుక్తములు, సమస్త సామవేద ఛందస్సులు తమో గుణ యుక్తములు, మఱియు సమస్త అధర్వణ వేద ఛందస్సులు సత్వ్త తమో గుణాత్మకములుగ ఉండును. ఇవన్నియు అప్రతిమ తేజస్సుచే ఉజ్జ్వలమై పూర్వము వలె వేరు వేరు భావలచే అవస్థితములై యుండెను. ప్రథమ మగు ఏ తేజస్సున్నదో దానిని “ఓమ్” అని చెప్ప బడెను. దానికి స్వభావముచే ఉత్పన్నమైన ఏ తేజస్సున్నదో దానిని అది ఆవరించి అస్థితమై యున్నది. ఓ మహామునీ! సామమయ తేజస్సు మరియు యజుర్మయ తేజస్సు ఆ ఓంకార రూప మగు పరమ తేజస్సును ఆశ్రయించి ఏకత్వమును పొందెను.
శాంతికం పౌష్టికం చైవ తథా చైవాభిచారికమ్
ఋగాదిషు లయం బ్రహ్మం స్త్రితయం త్రిష్వథాగమత్.
తతో విశ్వ మిదం సద్య స్తమోనాశా త్సునిర్మలమ్
విభావనీయం విప్రర్షే! తిర్య గూర్ధ్వ మథ స్తథా.
తత స్త న్మండలీభూతం ఛాందసం తేజ ఉత్తమమ్
పరేణ తేజసా బ్రహ్మ! న్నే కత్వ ముపగామ్య తత్.
ఆదిత్య సంజ్ఞా మగమ దాదావేవ యథోభవత్
విశ్వస్యాస్య మహాభాగ! కారణం చావ్యయాత్మకమ్.
ప్రాత ర్మధ్యందినే చైవ తథా చైవాపరాహ్ణికే
త్రయీ తపతి సా కాలే ఋగ్యజుః సామ సంజ్ఞితా.
హే బ్రహ్మన్! అనంతరము ఋగ్వేద యజుర్వేద, సామ వేదాలను ఈ మూడు వేదము లందలి శాంతిక, పోష్టిక, మరియు అభిచారిక ఛందస్సులను ఈ మూడును అథర్వణ వేదము లందు లీన మయ్యెను. ఓ విప్రర్షీ! తిరిగి అంధకారము నాశన మగుటచే. ఈ విశ్వము వెంటనే నిర్మల మయ్యెను. దీని వలన తిర్య గూర్ధ్వాథో దేశములు ప్రకాశ వంత మయ్యెను. హే బ్రహ్మాన్! ఆ తరువాత ఆ ఛాందస మగు ఉత్తమ తేజస్సు మండలీ భూతమై తిరిగి పరమ తేజో రూపమగు ఓంకారము నందు ఏకత్వమును పొందెను. ఈ విధముగా ఈ తేజస్సు ప్రథమముగా ఉత్పన్న మగుటచే ఆదిత్య సంజ్ఞను పొందెను. ఓ మహాభాగా, ఇతడు ఈ విశ్వమునకు అవ్యయాత్మక మగు విశ్వమునకు కారణము. ఋక్, యజు, సామము లను పేరు గల మూడునూ ప్రాతః కాల, మధ్యాహ్న కాల, అపరాహ్న కాలము లందు తాపమును కలుగ జేయు చున్నవి.
ఋచస్తపంతి పూర్వాహ్ణే మధ్యాహ్నే చ యజూంషి వై
సామాని చాపరాహ్ణే వై తపంతి మునిసత్తమ!.
శాంతికం ఋక్షు పూర్వాహ్ణే చ యజుఃష్వేవ చ పౌష్టికమ్
విన్యస్తం సామ్ని సాయాష్నే హ్యాభిచారికా మంతతః.
మధ్యందినే పరహ్ణే చ సమే చైవాభిచారికమ్
ఆపరాహ్ణే పితౄణాం తు సామ్నా కార్యాణి తాని వై.
విసృష్టౌ ఋఙ్మయో బ్రహ్మ స్థితౌ విష్ణు ర్యజిర్మయః
రుద్రః సామమయోంతే చ తస్మా త్తస్యాశుచి ర్ధ్వనిః.
తదేవం భగవా న్భాస్వాన్ వేదాత్మా వేద సంస్థితః
వేదవిద్యాత్మక శ్చైవ పరః పురుష ఉచ్యతే.
ఓ మునిసత్తమా! ప్రాతః కాలమున ఋక్కులు, మధ్యాహ్న కాలమున యజుస్సులు, మరియు అపరాహ్న కాలమున సామములు తపో యోగ్యము లగు చుండును. పూర్వాహ్న సమయ మందు ఋక్ లతో శాంతి కర్మలు, మధ్యాహ్న సమయమున యజుస్సులతో పౌష్టిక కార్యములు, అపరాహ్న సమయముల సామ మంత్రములతో అభిచారిక కర్మలు చేయ వలయునని నిశ్చయింప బడినది. మధ్యాహ్న అపరాహ్న కాలము లందు అభిచారిక కర్మలు చేయ వలెను. మఱియు కేవలము అపరాహ్న మందే సామముచే పితరుల కార్యములను చేయ వలెను. సృష్టి కాల మందు బ్రహ్మ ఋఙ్మయుడు, స్థితి కాలమున విష్ణువు యజుర్మయుడు మరియు సంహార కాలమున రుద్రుడు సామ మయుడుగ చెప్ప బడెను. అందు వలన పైన చెప్ప బడిన విధముగా వేదాత్ముడు, వేద సంస్థితుడు, వేద విద్యామయుడు, భగవానుడు నగు భాస్వానుడు పరమ పురుషుడుగా చెప్ప బడెను.
సర్గ స్థిత్యంత హేతుశ్చ రజః సత్త్వదికా న్గుణాన్
ఆశ్రిత్య బ్రహ్మ విష్ణ్వాది సంజ్ఞా మభ్యేతి శాశ్వతః.
దేవైః సదేడ్యః స తు వేదమూర్తి,
రమూర్తి రాద్యోఖిల మూర్త్యమూర్తిః
విశ్వాశ్రయం జ్యోతి రావేద్యధర్మా,
వేదాంత గమ్యః పరమః పరేశః.
సృష్టి, స్థితి, ప్రళయకారి యగు ఈ శాశ్వతుడైన ఆదిత్యుడు సత్త్వ రజస్తమో గుణములను ఆశ్రయించి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు లను పేర్లు పొందు చున్నాడు. మరియు ఆ సూర్యుడు పూజ్యుడు, వేదమూర్తి, నిరాకారుడు, సంపూర్ణ ప్రాణుల యొక్క మూర్తి స్వరూపము లందు మూర్తి మంతుడు, జ్యోతి స్వరూప మందు ఆది పురుషుడు, ఆ ఆదిత్య భగవానుడు విశ్వమునకు ఆశ్రయ స్వరూపుడు, అవేద్య ధర్ముడు, వేదాంత గమ్యుడు మరియు శ్రేష్ఠులలో శ్రేష్ఠుడైన వాడుగా దేవతలచే ఎల్లప్పుడు పూజింపబడుచున్నాడు.
Summary of chapter 99 of the Mārkandeya Mahā Purana is as follows:
The chronicle of the Tenth Manvantara opens with the story of Sage Angiras performing intense penance to Bhagavān Agni. Offering a magnificent hymn to the sacred Fire-god, Angiras receives the boon of a divine son named Bhautya, who becomes the tenth patriarch, Bhautya Manu.