మార్కండేయ మహా పురాణము
122 - అవిక్షిచ్చరితము
మార్కండేయుడు:
అథ సావిక్షితో మాతా వీరా వీర ప్రజాపతీ పుణ్యే హని సమాహూయ ప్రాహ పుత్ర మవిక్షితమ్ పుత్రాహ మభ్యనుజ్ఞాతా తప పిత్రా మహాత్మనా ఉపవాసం కరిష్యామి దుష్కరోయం కిమిచ్చకః స చాయత్త స్తవ పితు స్త్వయా సాధ్యో మయాపి చ ప్రతిజ్ఞాతే త్వయా పుత్రః తత స్తత్ర యాతా మ్యహమ్ ద్రవ్యసార్థం మహాకోశా త్తవ దాస్యా మ్యహం పితుః దానం తే పితు రాయత్త మనుజ్ఞాతాస్మి తేన చ క్లేశ సాద్యో ముదాయత్తః స హి శ్రేయో భవిష్యతి సాద్యో భవేద్వా యది తే కశ్చి ద్బల పరాక్రమైః
మార్కండేయుడు:
ఒక పవిత్ర దిన మందున అవీక్షుని తల్లి వీరమాత యగు వీర అవీక్షితుని బిలచి ఇట్లు చెప్పెను. ఓ కుమారా! నేను ”కిమిచ్చక” మను పేరుగల ఒక దుష్కరమగు వ్రతమును ఉపవసించి చేయుదును. మహాత్ముడగు నీ తండ్రి గూడ దానిని చేయుటకు అనుమతించెను. ఈ వ్రతమును నీ తండ్రి, నీవు మరియు నేను ఆధీనులమై యుండ వలెను. అందు వలన ఎప్పుడు నీవు దానికి ప్రతిజ్ఞ చేయుదువో, అప్పుడు నేను ప్రతికార్యము లందు యత్నవతి నగుదుము. నీ తండ్రి యొక్క రాజ్య కోశము నుండి సగము దానము చేయుదును. ఆ ధనము నీ తండ్రి ఆధీనము. అందుచే అతని నుండి ఆజ్ఞను పొందితిని. కష్ట సాధ్యమైన విషయము నా ఆధీనము. అది నావలన సంపన్నము కాగలదు. మరియు ఇంక ఎట్టిది బల పరాక్రమముచే సాధ్యమై యున్నదో అదంతయు నీ ఆధీనమున నున్నది.
స తేసాధ్యో హ్యన్యథా వా దుఃఖ సాధ్యో భవిష్యతి త త్త్వం ప్రతిజ్ఞాం కురుషే యది పుత్రాత్ర చైవ తే తదైత దహమావాప్స్యే కథ్యతాం యన్మతం తవ
అది నీకు సుసాధ్యము గాని దుఃఖ సాద్యము గాని లేక అసాధ్యము గాని గావచ్చును. అందువలన ఓ కుమారా! నీవు నీ సాధ్య విషయ మందు అంగీకారమును తెలిపినచో ఈ వ్రతమును చేయుదును. నీ అభీష్టమును తెలియ జెప్పుము.
అవిక్షితుడు:
విత్తం మే పితురాయత్తం మత్వ్యామిత్వ్యం న తత్ర వై యన్మ చ్చరీర నిష్పాద్యం తత్కరిష్యే ర్వయోదితమ్ కిమిచ్చకం వ్రతం తత! ర్నిశ్చిన్తా భవ నిర్వ్యథా
రాజ్ఞా పిత్రాభనుజ్ఞాతమ్ యది విత్తేశ్వరేణ మే
అవిక్షితుడు:
“ధనము తండ్రి ఆధీనము. ఇందు నా ప్రభుత్వ మేమియు లేదు. నా శరీరముచే ఎట్టి కార్యము సంపన్న మగునో, నీ ఆజ్ఞానుసారము నేను దానిని సంపన్నము చేయుటకు సిద్ధముగా నున్నాను. విత్తేశ్వరుడగు తండ్రి గారి ఆజ్ఞ అయినచో ఓ తల్లీ! నీవు నిశ్చింతగా సంతుష్ట హృదయముతో “కిమిచ్చక” వ్రతమును ఆచరించుము.
మార్కండేయుడు:
తతః సా రాజమహీషీ తద్వ్రతం సముపోషితా యథోక్తం సాకరో త్పూజాం రాజరాజస్య సంయతా నిధీనా మప్యశేషానాం నిధి పాల గణస్య చ లక్ష్మాశ్చ పరయా భక్త్యా యత వాక్కాయ మానసా
మార్కండేయుడు:
అనంతరము సంయమ పరాయణురాలైన పట్టపు రాణి ఆ వ్రతమును ఉపవాసముతో మనో వాక్కాయములచే ఇంద్రియ నిగ్రహము గలదై అత్యంత భక్తి శ్రద్ధలతో యధావిధిగా నిధి సమూహములను నిధి పాలగణాలను మరియు లక్ష్మీ దేవిని పూజింప సాగెను.
వివిక్తే తు గృహస్థోయ మధ రాజా కరన్దమః ఆసీన ఉక్తః సచివై ర్నీతి శాస్త్ర విశారదైః
ఇక్కడ కరంధముడు, నీతి శాస్త్ర విశారదులైన మంత్రులతో మంత్రణా గృహ మందుండగా వారు ఇట్లు విన్నవించిరి.
మంత్రులు:
రాజః స్వయః పరిణతం తవైత చ్చాసతో మహీమ్ ఏక స్తే తనయో విక్షి త్త్యక్త దార పరిగ్రహః అపుత్రః స చ తే నిష్టాం యదా భూపః గమిష్యతి తదారిపక్షం పృథివీ నిశ్చితం తవ యాస్యతి వంశక్షయ స్తే భవితా పితృ పిందోడక క్షయః ఏత న్మహత్తేరిభయం క్రియాహాన్యా భవిష్యతి తస్మా త్కురు తథా భూపః యథా తే తనయః పునః కరోతి సతతం బుద్ధిం పితౄణాం మప కారిణీమ్
మంత్రులు:
ఓ రాజా! పృథ్వీ పాలన చేయుచూ మీ వయస్సు గడచి పోయినది. మరియు మీ ఏకైక పుత్రుడు వివాహము చేసుకొనలే దు. ఓ భూపతీ! అతను ఎప్పుడైతే అపుత్రుడై యుండునో, పత్నిని చేపట్టడో, అప్పుడు నిస్సందేహముగా ఈ భూమి మీ యొక్క శత్రువుల నాశ్రయించును. మీకు కూడా వంశ క్షయము, పితృ దేవతలకు శ్రాద్ధ, తర్పణాదులు నష్టమగును. క్రియాహాని కలుగుటచే సమస్తములగు మహత్తర భయములు సంభవించును. అందుచేత ఓ భూపాలా! దేని వలన మీ పుత్రుడు సదా పితరులకు ఉపకారము చేయు బుద్ధి నవలంభించునో, అట్టి ఉపాయమును చేయుడు.
మార్కండేయుడు:
ఏతస్మిన్నన్తరే శబ్దం శుశ్రావ జగతీ పతిః పురోహితస్య వీరాయా గదతో హ్యార్ధినం ప్రతి కః కమిచ్చతి దుఃసాధ్యం కస్య కిం సాధ్యతా మితః కరన్థమస్య మహిషీ కిమిచ్చిక ముపోషితా రాజపుత్రోప్య విక్షిత్తు శ్రుత్వా పౌరోహితం వచః ప్రత్యు వాచార్థినః సర్వా న్రాజ ద్వార ముపాగతాన్ మయా సాధ్యం శరీరేణ యస్య కిఞ్చి ద్బ్రవీతు సః మమ మాతా మహాభాగాః కిమిచ్చిక ముపోషితా శ్రుణ్వస్తు మేర్థినః నర్వే ప్రతిజ్ఞాతం మయా తదా కిమిచ్చథ దాదా మ్యేష క్రియమాణే కిమిచ్చికే
మార్కండేయుడు:
అదే సమయంబున రాజమహిషియు మరియు పురోహితుడు అర్థి గణాలతో చెప్పిన వచనము లన్నియు రాజు వినెను. పురోహితుడు ఇట్లు చెప్పెను. “కరంధముని మహిషి “కిమిచ్చక” వ్రతము చేయు చున్నది. మీరేమేమి కోరు చున్నారో, ఎట్టి దుస్సాధ్యమగు కార్యములు చేయవలసి యుండెనో, వానిని తెలుపుడు. పురోహితుని వచనములు విన్న రాజ పుత్రుడు అవీక్షుడు కూడా రాజ ద్వారము వద్దకు వచ్చి ఆ అర్థి గణాలతో నిట్లు పలుక సాగెను. “ఓ అర్థులారా! నా ప్రతిజ్ఞ ఆలకింపుడు. భాగ్యవతి యగు నా తల్లి కిమిచ్చక వ్రతము నందున్నది. ఈ సమయమున నా శరీరము నుండి ఎట్టి కార్యములు చేయుటకు సాధ్యమగునో వాటిని చెప్పుడు. ఈ కిమిచ్చక వ్రతసమయ మందు మీరు ఏమేమి కోరు చున్నారో, వానిని కూడ చెప్పుడు. వాని నిచ్చుటకు నేను సిద్ధముగా నున్నాను. ఇది నా ప్రతిజ్ఞ”.
మార్కండేయుడు:
తతో రాజా నిసమ్యైత ద్వాక్యం పుత్ర ముఖా చ్ఛృతమ్ సముత్పత్యా బ్రవీ త్పుత్ర మహా మర్థీ ప్రయచ్చ మే
మార్కండేయుడు:
పిమ్మట కరంధమ రాజు పుత్రుని నోట వచ్చిన పలుకులు వినిన వెంటనే అతని సమీపమునకు వెళ్లి ఇట్లు పలికెను. కుమారా! నేను అర్థినై వచ్చితిని. నేనభిలషించిన దానిని యిమ్ము.
అవీక్షితుడు:
దాతవ్యం యన్మయా తాతః భవతే తద్బ్రవీహి మామ్ కర్తవ్యం దుష్కరం వా తే సాధ్యం దుఃసాధ్య మేవ వా
అవీక్షితుడు:
“తండ్రీ! నేను మీకేమి ఇవ్వగలను? ఆజ్ఞాపింపుడు. మీరడిగిన వస్తువు సాధ్యము, దుస్సాద్యము లేక అసాధ్యము అయినను, తప్పక ఇచ్చెదను”.
రాజు:
యది సత్య ప్రతిజ్ఞ స్త్వం దదాసి చ కిమిచ్చకమ్ పౌత్రస్య దర్శయ ముఖం మమోత్సంగ గతస్య తత్
రాజు:
“నీవు కిమిచ్చక వ్రతమందు దానము చేయుదునని సత్య ప్రతిజ్ఞ చేసినచో, నా యొడిలో గూర్చోను నట్టి పౌత్రుని ముఖమును నాకు జూపుము.”
అవీక్షితుడు:
అహం తవైక స్తనయో బ్రహ్మచర్యం చ మే నృపః న మే పుతోస్తి పౌత్రస్య దర్శయామి కథం ముఖమ్
అవీక్షితుడు:
ఓ రాజా! నేను మీకు ఏకైక పుత్రుడను. మరియు నేను బ్రహ్మచర్యము నవలంభించితిని. అందుచే నాకు పుత్రుడు కూడా లేడు. ఈ కారణముచే ఎట్లు మీకు పౌత్రుని ముఖము చూపించ గలను?
రాజు:
పాపాయ బ్రహ్మచర్యం తే యరిదం ధార్యతే త్వయా తస్మా త్త్వం మోచయాసుత్మానం మమ పౌత్రంచ దర్శయ
రాజు:
నీవు అవలంభించిన బ్రహ్మ చర్యము పాపమునకు హేతువు. అందు వలన దానిని పరిత్యజించి దాని నుండి ఆత్మకు ముక్తిని కలిగించుము. నాకును పౌత్రుని చూపించుము.
అవీక్షితుడు:
విషమం స్యా న్మహారాజః యద న్యాత్త త్సమాదిశ వైరాగ్యేణ మయా త్యక్తః స్త్రీ సంభోగ స్తథాస్తు సః
అవీక్షితుడు:
ఈ కార్య మత్యంత విషమము. ఓ మహారాజా! నేను వైరాగ్య నిమిత్తము స్త్రీ సంభోగమును పరిత్యజించితిని. దేని వలన ఈ వైరాగ్యము చెడ కుండునో, అట్టి దానిని వేరొకటి ఆజ్ఞాపించుడు.
రాజు:
బహుభి రుధ్యమానానాం దృష్టో వై వైరిణాం జయః తత్రాపి యది వైరాగ్య ముపైషి తదపండితః కిం వా నో బహునోక్తేన బ్రహ్మచర్యం పరిత్యజః మాతు స్త్వ మిచ్చయా పుత్రః పౌత్రస్య మమ దర్శయ
రాజు:
బృహత్తమ సేనా యుక్తులై ఉన్న వైరులను నీవు యుద్ధమున ఓడించుట నేను చూచితిని. అట్టి నీవు వైరాగ్యము నవలంభించినచో మూర్ఖుడవు అగుదువు. ఇప్పుడు నాకు నీవు అధికముగా చెప్పుట వలన ప్రయోజన మేమున్నది? తల్లి ఇచ్చానుసారముగా బ్రహ్మచర్యమును పరిత్యజించుము.
మార్కండేయుడు:
యదా స బహుశ స్తేన ప్రోక్తః పుత్రేణ పార్థివః నాన్యత్స్రార్దయతే కించి త్తదా పుత్రో బ్రవీ త్పునః దత్త్వా కిమిచ్చకం తుభ్యం ప్రాప్తోహం తాత సంకటమ్ తత్కరిష్యామి నిర్లజ్జో భూయో దార పరిగ్రహమ్
మార్కండేయుడు:
ఇట్లు రాజ పుత్రుడు మాటి మాటికి ప్రార్థించినను ఆ రాజు ఎప్పుడయితే వేరొక కోరికను అడుగలేదో, అప్పుడు రాజ పుత్రుడు తిరిగి ఇట్లు పలికెను. ఓ తండ్రీ! మీతో కిమిచ్చక ప్రధాన విషయమును అంగీకరించి నేను సంకటమున పడితిని. ఈ కారణముచే నిర్లజ్జుడనై భార్యను పరిగ్రహించు చున్నాను.
స్త్రియాః సమక్షం విజితః పతితో ధరణితలే స్త్రీ పతి ర్భావితా భూయ స్తాతైత దతిదుష్కరామ్ తథానుపి కింకరోమ్యేష సత్యపాశ వశజ్గతః కరిష్యామి యథాత్థ త్వం భుజ్యతాం నిజశాసనమ్
నేను స్త్రీ ఎదుట పరాజితుడనై భూమి యందు బడియుంటిని. అందువలన స్త్రీ నా యెడల భర్తతో సమానముగా నున్నది. ఓ తండ్రీ! ఇది చాలా కఠిన కార్యముగా నున్నది. అయినను నేను ఏమి చేయుదును? సత్య పాశముచే బంధింప బడితిని. ఇప్పుడు మీరు చెప్పిన దానిని తప్పక చేయుదును. మీరు నిశ్చింతగా రాజ్య శాసనమును చేయుడు.
Summary of chapter 122 of the Mārkandeya Mahā Purana is as follows:
The birth and heroics of Prince Avīkshita, son of Karandhama, are narrated. Trained in all sacred sciences and martial arts, Avīkshita became famous across Bhāratavarsha for his chivalry, strength, and unwavering adherence to royal honor.