మార్కండేయ మహా పురాణము
126 - మరుత్త చరితము
క్రౌష్టుకి:
భగవః న్విస్తారా త్సర్వం మమైత త్కథితం త్వయా కరన్దమస్య చరిత మవిక్షి చ్చరితం చ యత్ అవిక్షితస్య నృపతే ర్మరుత్తస్య మహాత్మనః శ్రోతు మిచ్చామి చరితం శ్రూయతే సోతిచేష్టితః చక్రవర్తీ మహాభాగః శూరః కాన్తో మహామతిః ధర్మవి ద్ధర్మకృచ్చైవ సమయ క్పాలయితా భువః
క్రౌష్టుకి:
ఓ భగవానుడా! మీరు కరంధమ, అవీక్షితుల చరిత్రను విస్తారముగా వర్ణించితిరి. ఇప్పుడు అవీక్షితుని పుత్రుడు మహాత్ముడగు మరుత్త మహారాజు చరిత్రను విన వలెనని కోరు చున్నాను. అతడు అత్యంత ఉద్యమ శీలుడు, కీర్తి కలవాడు, చక్రవర్తి మహాభాగుడు శూరుడు, కమనీయుడు, గొప్పదగు బుద్ధి గలవాడు, ధర్మము కలవాడు, ధర్మము నాచరించు వాడు, చక్కగా భూమిని పాలించు వాడు అని వింటిని.
మార్కండేయుడు:
సపిత్రా సమనుజ్ఞాతం రాజ్యం ప్రాప్య పితామహాత్ ధర్మతః పాలయామాస పితా పుత్రా నివౌరసాన్ ఇయాజ సుబహూ న్యాజ్నా న్యథావ త్స్వాప్త దక్షిణాన్ బుత్వి క్సురోహితాదేశా దనిర్విణో మహీపతిః
మార్కండేయుడు:
మరుత్తుడు తండ్రి అనుజ్ఞచే పితామహుని వలన రాజ్యమును పొంది తండ్రి ఏ విధముగా తన కన్న బిడ్డలను పాలించునో, అట్లే యావత్ప్రజలను ధర్మానుసారముగా పాలింప సాగెను. ఋత్విక్కులు మరియు పురోహితుల యొక్క ఆజ్ఞలను శ్రద్ధతో అనుసరించుచు ఆ మహీపతి భూరి దక్షిణలతో యథావిధిగా అనేక యజ్ఞములను చేసెను.
తస్యాప్రతిహతం చక్ర మాసీ ద్ద్వీపేషు సప్తసు గతిశ్చాప్యనవచ్చిన్నా స్వః పాతాల జలాధిఘ తతః ప్రాప్య దానం విప్ర యథావ త్స్వక్రియాపరః అయజ త్సమహాయజ్ఞై ర్దేవా నిన్ద్ర పురోగమాన్ ఇతరే చ యధావర్ణాః స్వే స్వే కర్మ ణ్యతన్ద్రితాః త దుపాత్త ధనా శ్చక్రు రిష్టాపూర్తాదికాః క్రియాః పాల్యమానా మహీ తేవా మరుత్తేన మహాత్మనా యోస్పర్ధ త్రిదశావాసవాసిభి ర్దిజసత్తమః తేనాతిశయితాః సర్వే కేవలం న మహీక్షితః యజ్వినా దేవరాజో పి శతయజ్ఞో భిసన్ధినా
సప్త ద్వీపముల యందు అతని రథ చక్రము అప్రతిహత మైనది. మరియు ఆకాశ, పాతాళ, జాలాది స్థానము లందును అవిచ్చిన్న మగు గమనము గలదై యుండెను. ఓ విప్రా! ఆ స్వకర్మ పరాయణుడగు మరుత్తుడు ధనమును పొంది మహా యజ్ఞములచే ఇంద్రాది దేవతలను జయించెను. ఇతర సమస్త వర్ణాల వారును తమ తమ కర్మల యందు తత్పరులై ఆ స్వకర్మల వలన ప్రాప్తించిన ధనముచే ఇష్టాపూర్తాది క్రియలు చేసుకొను చుండిరి. ఓ ద్విజ శ్రేష్టా! భూమి మహాత్ముడగు మరుత్తునిచే పాలింపబడి, దేవతలతో పోటీ పడుచుండెను. మరుత్తుడు కేవలము పృథ్వీ పాలకుల యందు మాత్రమే ప్రాధాన్యతను పొంద లేదు. ఇంకనూ వందల యజ్ఞములను అనుష్టించి అతడు దేవరాజగు ఇంద్రుని కన్నను శ్రేష్టు డయ్యెను.
ఋత్వి క్తస్య తు సంవర్తో బభూవాంగిరసః సుతః భ్రాతా బృహస్పతే ర్విప్రః మహాత్మా తపసాం నిధిః సౌవర్ణో ముఞ్జవా న్నామ పర్వతః సుర సేవితః పాతితం తేన తచ్ఛృంగం కృతే తస్య మహీపతేః తేన యస్యాఖిలం యజ్ఞే భూమిభాగాదికం ద్విజః ప్రసాదాంశ్చ కృతాః శుభ్రా స్తపసా సర్వ కాఞ్చనాః గాథాశ్చా ప్యత్ర గాయన్తి మరుత్త చరితాశ్రయాః సాతత్యేనర్షయః సర్వే కుర్వన్తో ధ్యయనం యథా మరుత్తేన సమో నాభూ ద్యజమానో మహీతలే సదః సమస్తం యద్యజ్ఞే ప్రాసాదాశ్చైవ కాంచనాః అమాద్య దిన్ద్రః సోమేన దక్షిణాభి ర్ద్విజాతయః విప్రాణాం పరివేష్టారః శాక్రాద్యా స్త్రిదశోత్తమాః
ఓ విప్రా! అంగిరసుని పుత్రుడు బృహస్పతి యొక్క సోదరుడు, తపోనిధి మహాత్ముడు నగు సంవర్తుడు అతనికి ఋత్విక్కుగా ఉండెను. ఓ ద్విజుడా! దేవతలు సేవించు నట్టి “ముంజవత్” అను పేరుగల సువర్ణ మయమగు ఒక పర్వత మున్నది. ఋత్విజుడగు సంవర్తుడు తపో బలముచే దాని శృంగమును పెరకి రాజు కొరకు తెచ్చెను. ఇంతియే గాక ఆ సంవర్తుడు తపో బలముచే ఈ శృంగము ద్వారా రాజుచే యజ్ఞము చేయించుచు సమస్త భూభాగమును చక్కగా కాంచన మయములు, నిర్మలములగు భవనములను నిర్మించెను. ఋషి గణాలు చేసినట్లుగా వేదాధ్యయనము పలుమారులు ఈ మరుత్తుని చరిత్రను సదా ఈ విధముగా గానము చేయు చుండిరి. ఎట్లనగా ఎవని యజ్ఞము నందు సమస్త సభలు, ప్రాసాదములు కాంచన మయమై ఉన్నదో, ఇంద్రుడు సోమపానము తోను, బ్రాహ్మణ గణాలు దక్షిణల చేతను మత్తులై యున్నారో, మరియు ఇంద్రాది ప్రధాన దేవతలు, బ్రాహ్మణులకు అన్నాదులను వడ్డించు చుండిరో, అట్టి మరుత్తునితో సమానమగు యజ్ఞశీలుడు నగు మనుష్యుడు భూమి యందు జన్మించ లేదు.
యథా యజ్ఞే మరుత్తస్య తృప్తాః సర్వే మహీపతేః సువర్ణ మఖిలం త్యక్తం రత్న పూర్ణగృహే ద్విజైః ప్రాసాదాది సమస్తం చ సౌవర్ణం తస్య యత్క్రతౌ త్రయో వర్ణా హ్యలభ్యన్త తస్మా త్కేచి త్తథా దదుః (తేన త్యక్తేన శిష్టా యే జనాః పూర్ణ మనోరథాః తేపి యజ్ఞా న్యజంతే స్మ దేశే దేశే పృథ క్పృధక్)
తస్యైవం కుర్వతో రాజ్య సమ్య క్పాలయతః ప్రజాః తపస్వీ కశ్చి దభ్యేత్య త మాహ మునిసత్తమః పితూ ర్మాతా తవాహేదం దృష్ట్వా తాపస మండలమ్ విషాభిభూత మురగై ర్మదోన్మత్తై ర్నరేశ్వరః
మహీపతియగు మరుత్తునితో సమానమగు వాడు లేడు. బ్రాహ్మణులు గృహములు రత్న పూర్ణములై యున్నందున బంగారమును వదిలి వేసిరి. అతని యజ్ఞ కాలమున బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణముల వారును సువర్ణమయ ప్రాసాదములు మొదలగు సమస్త వస్తువులను పొందిరి. ధనవంతు లగుటచే వారు గూడ దానములు చేయు చుండిరి. అతడివ్వ బడిన ధనమును పొంది ఏ శిష్ట పురుషులు ఆతని యజ్ఞమున పూర్ణ మనోరథులైరో, వారును వేరు వేరు దేశము లందు వేరు వేరుగా యజ్ఞములు చేయు చుండిరి. ఓ ముని సత్తమా! ఈ విధముగా ఆతని రాజ్య శాసనమున మరియు ప్రజా పాలనా కాలము నందు ఒకనాడు ఒక తపస్వి వచ్చి అతనితో ఇట్లు చెప్పెను. ఓ నరేశ్వరా! తాపస మండలమును మదోన్మత్తులగు సర్పముల యొక్క విషముచే పీడించబడుట చూచి నీ పితామహి (తండ్రి గారి తల్లి) ఈ మాట చెప్పమని నన్ను పంపించిరి.
పితామహ స్తే స్వర్యాతః సమ్య త్సంపాల్య మేదినీమ్ పితా తవ తథా శక్తో హిత్వా గ్రామం వనం గతః (తపశ్చరణ శక్తాహ మిహ చౌర్యా శ్రమే స్థితా)
సాహం పశ్యామి వైకల్యం తప రాజ్యం ప్రశాసతః పితామహస్య తేనాభూ ద్యత్పూర్వేషాం చ తే నృపః నూనం ప్రమత్తో భోగేషు సక్తో వావిజితే న్ద్రియః చారాన్దతా యతోస్తీయం దుష్టాదుష్టం న వేత్సి యల్ పాతాలా దభ్యుపేతై స్తు భుజగై ర్దంశశాలిభిః దష్టా మునిసుతాః సప్త దూషితాశ్చ జలాశయాః స్వేద మూత్ర పురీషేణదూషితం శుసృతం హవిః అపరాధం సముద్దిశ్య దత్తో నాగబలి శ్చిరాత్
నీ పితామహుడు బాగుగా భూమిని పాలించి స్వర్గమునకు వెళ్ళెను. నీ తండ్రి కూడా రాజ్యమును వదిలి వనమునకు వెళ్ళెను. నేను ఇప్పుడు తపస్సు నందలి ఆసక్తిచే ఔర్వాశ్రమమందు నివసించు చున్నాను. ఓ రాజా! నీ పితామహుడు లేక ఇతర పూర్వ పురుషుల రాజ్య మందు ఎట్టి సంఘటన ఎప్పుడును జరిగి ఉండలేదో, అట్టిది జరుగుట నీ శాసన కాలమందు చూచు చున్నాను. నిస్సందేహముగా నీవు ప్రమత్తుడవు లేక అజితేంద్రియుడవై యున్నావు. మరియు గుఢాచారులను నియమించుట నీవు చేయ లేదు. ఈ కారణమున నీవు దుష్టా దుష్టములు ఎరుగుటలో అసమర్థుడ వైనావు. భుజంగ గణాలు పాతాళము నుండి వచ్చి ఏడుగురు ముని పుత్రులను కాటు వేసినవి. మూత్రము, పురీహాదులచే హవిస్సులు కలుషిత మైనవి. ఈ కారణమున ముని గణాలు అపరాధము జరిగెనని ఎరిగి నాగులను బలి ఇచ్చు చున్నారు.
ఏతే సమర్థా మునయో భస్మీక ర్తుం భుజంగమాన్ కిన్తేషాం నాధికారోత్ర త్వమేవా త్రాధికారవాన్ తావ త్సుఖం భూపతిజై ర్భోగజం ప్రాప్యతే నృపః అభిషేక జలం యావ న్నమూర్ఘ్ని వినిపాత్యతే కాని మిత్రాణి కః శత్రు ర్మమ శత్రో ర్బలం కియత్ కోహం కే మన్త్రిణః పక్షే కేవా భూవతయో మమ (కియా న్కోశో బలం కిం వా కోనురక్తో జనో మమ),
విరక్తో వా పరై ర్భిన్న పరేషా మపి కీదృశః కః సమ్య గత్ర నగరే విషయే వా జనో మమ ధర్మ కర్మాశ్రయో మూఢః కః సమ్యగపి వర్తతే కో దండ్యః పరిపాల్యః కః కే చోపేక్షా నరా మయా
ఈ మును లందరును సర్పములను భస్మము చేయుటలో సమర్థులే. కాని ఇట్లు చేయుటకు వారికి అధికారము లేదు. నీవే ఆ కార్యమునకు అధికారివి. భూపాలా! రాజ పుత్రులు ఎప్పటి వరకు వారి శిరస్సుపై అభిషేక జలము పడదో, అప్పటి వరకు భోగ జనిత సుఖముల ననుభవింప గలరు. ‘మిత్రుడెవరు? శత్రువెవరు? శత్రువుల బలమెంత యున్నాది? నేనెవడను? మంత్రి ఎవరు? ఏ ఏ రాజులు తన పక్షమున నున్నారు? (నా వద్ద ధనము, బలము ఉందా? నా యందు జనులు అనురక్తులై యునారా?) ఎవరు విరక్తులై యున్నారు? ఎవరు శత్రువులచే భేదమును పొందిరి? శత్రువులలో ఎవరు ఏ విధముగా నున్నారు? తన నగర మందు లేక రాజ్య మందు ఎవరెవరు చక్కగా ధర్మ కర్తాశ్రయులై యున్నారు? మరియు ఎట్టి మూర్ఖులు నివసించు చున్నారు? దండనీయు లెవరు? పాలింప బడునట్టి యోగ్యు లెవరు? ఉపేక్షింప వలసిన వారు ఎవరు?
సామభేద తనయా దమ్యా దేశ కాల మవేక్షతా చారాంశ్చ చారయే దన్యై రజ్ఞాతా న్భూపతి శ్చరైః సచివాదిషు సర్వేషు చారా న్దద్యా న్మహీపతిః ఇత్యాదౌ భూపతి ర్శిత్యం కర్మ ణ్యాసక్తమానసః నయే ద్దినం తదా రాత్రిం న తు భోగ పరాయణః రాజ్ఞాం శరీర గ్రహణం నభోగాయ మహీపతేః క్లేశాయ మహతే పృథ్వీం స్వధర్మ పరిపాలనే సమ్య క్పాలయతః పృథ్వీం స్వధర్మం చ మహీపతేః ఇహ క్లేశో మహా న్స్వర్గే పరమం సుఖ మక్షయమ్ తదేత దవబుధ్వస్వ హిత్వా భోగా న్నరేశ్వరః పాలనాయ క్షితేః క్లేశ మజ్గీకర్తు మిహార్హసి ఇతి వృత్త మృషీణాం య ద్వ్యసనం త్వయి శాసతి భుజఙ్గ హేతుకం భూప చారాన్దో నాపి వేత్సి తత్ మహునాత్ర కిముకైన దుష్టే దండో నితాత్యతామ్ శిష్టా న్పాలయ రాజం స్త్యం ధర్మ షడ్ భాగ మాప్స్యసి అరక్ష న్పాపమఖలం దుష్టై రవినయా త్కృమ్
సమవాప్స్య స్యసన్దిగ్ధం యదిచ్చసి కురుష్వ తత్ ఏత న్మయోక్తం శకలం యత్తవాహం పితామహః కురుష్వేవం స్థితే యత్తే రోచతే వసుధాదిపః
సామ భేదములచే దేశ కాలములను విచారించి ఎవరి యెడల దృష్టి నుంచుట ఉచితము? ఇట్టి వృత్తాంతము లన్నియు తెలుసు కొనుటకు రాజు ఇతర గుఢాచారి నెరుగని వేరొక గుడాచారిని నియమించ వలెను. మహీపతి సమస్త మంత్రులు మొదలగు వారి యెడల కూడా గుడాచారులను నియమించ వలెను. భూపతి ఈ విధముగా ఇట్టి కార్యముల యందు సదా ఆసక్తుడై పగలు రాత్రులు గడుప వలెను. ఎప్పుడూ భోగ పరాయణుడై యుండుట రాజుకు ఉచితము గాదు. ఓ మహీపతీ! రాజులు శరీరమును ధరించునది భోగ నిమిత్తము కాదు. భూమిని మరియు తన ధర్మమును పాలించు కారణమున గొప్ప క్లేశములను కూడా అతడు అనుభవింప వలసి యుండును. ఈ జన్మ యందు అత్యంత క్లేశములను అనుభవించి నప్పటికీ పర లోకమున స్వర్గమునకు వెళ్ళిన పిమ్మట అక్షయ సుఖములు సంప్రాప్తించును. ఓ నరేశ్వరా! ఇవన్నియు బాగుగా విచారించి భోగమును పరిత్యజించి , నీకు పృథ్వీ పాలన కలుగు క్లేశములను అంగీకరించుట ఉచితము. ఓ రాజా! నీ శాసన కాలమున ఏ ఋషులను సర్పముల వలన దుఃఖము సంభవించినదో, గుడాచారులను నియమింపక పోవుటచే దానిని ఎరుగలేక పోయితివి. ఇంకా అధికముగా నేమి చెప్పుదును? ఓ రాజా! నీవు దుష్టులను శిక్షించి పాలింపుము. దీని వలన ధర్మ ఫలము యొక్క ఆరవ భాగము ప్రాప్తించును. దుష్ట గణాలు గర్వించి ఇట్టి కార్యములను చేయునప్పుడు నీవు వారి నుండి శిష్టులను రక్షింపక పోయినచో, నీవు నిస్సందేహముగా పాపము ననుభవించుదువు. ఇప్పుడు ఏది కర్తవ్యమో విచారింపుము. దానిని చేయుము. ఓ వసుధాది పతీ! నేను నీ పితామహురాలను. ఈ కారణమున నేను ఇదంతయు చెప్పితిని. ఈ సమయమున నీకు ఏది ఉచితమని తోచునో, దాని ననుసరించి చేయుము.
Summary of chapter 126 of the Mārkandeya Mahā Purana is as follows:
Princess Vaishālinī, deeply devoted to Avīkshita, refuses to marry anyone else and enters the forest to perform rigorous penance. Avīkshita's mother, Queen Vīrā, performs the sacred Kimicchaka vow to secure a grandson to continue the royal lineage.