మార్కండేయ మహా పురాణము
28 - శ్రాద్ధ కల్పము
మదాలస:
సపిండీకరణా దూర్ధ్వం పితు ర్యః ప్రపితామహః సుత లేప భుజో యాతి ప్రలుప్త పితృ పిండకః తేషా మన్య శ్చతుర్థో యః పుత్రలేప భుజాన్న భుక్ సోపి సంబంథతో హీన ముపభోగం ప్రపద్యతే పితా పితామహశ్చైప తథైవ ప్రపితామహః పిండ సంబందినో హ్మేతే విజ్ఞేయాః పురుషా స్త్రయః లేప సంబంధిన శ్చాన్యే పితామహ పితామహత్ ప్రభృత్యుక్తా స్త్రయ స్తేషాం యజమానశ్చ సప్తమః ఇత్యేష మునిభిః ప్రోక్తః సంబంధ స్సాప్త పౌరుషః యజమానా త్ప్రభృత్యూర్ధ్వ మనులేప భుజ స్తథా
మదాలస:
సపిండీకరణ మందు పితృ పిండమున తండ్రి యొక్క ప్రపితామహునకు అధికారము లేదు. వారు లేప భాజులుగా లెక్కింప బడుదురు. వాటిలో నాల్గవ స్థాన మందున్న పిండము పుత్ర లేపాన్న భోజి యగును. అతను సంబంధ హీనుడై ఉండును. అతడు లేప మాత్ర బోగమును మాత్రమునే పొందు వాడగును. తండ్రి, తాత, ముత్తాత. ఈ ముగ్గురు పురుషులు మాత్రమే సపిండులై ఉన్నారు. ముత్తాత యొక్క తండ్రి, తాత, ముత్తాతలు లేప సంబంధులై యున్నారు. వీరి తరువాత యజమాని ఏడవ వాడై యున్నాడు. మునీశ్వరులు పై విధముగా యజమాని లగాయితు అనులేప భుజుల వరకు సంబంధము స్థిరముగా నుండునని చెప్పిరి.
తతోన్యే పూర్వజాః స్వర్గే యే చాన్యే నరకౌకసః యే చ తిర్వక్త్వ మాపన్నా యే చ భూతాది సంస్తితాః తా న్నర్వా న్యజమానో వై శ్రాద్ధం కురవా న్యతావిధి సమాప్యాయయతే వత్స! యేన యేన శృణుష్వ తత్ అన్నప్రకిరణం యత్తు మనుష్యైః క్రియతే భువి తేన తృప్తి ముపాయాంతి యే పిశాచత్వ మాగతాం యదంబు స్నాన వస్త్రోత్థం భూమౌ పతతి పుత్రకః తేన యే తరుతాం ప్రాప్తా స్తేషాం తృప్తిః వ్రజాయతే యస్తు గాత్రాంబు కణికాః పతంతి ధరణీ తలే తాభి రాప్యాయనం తేషాం యే దేవత్వం కులే గతాః
స్వర్గ వాసులైన పూర్వ పురుషులు మరియు నరక వాసులైన పురుషులు, తిర్యగ్యోని యందున్న వారు, భూతాదుల యందున్న వారు, వీరందరినీ గురించి గృహస్థు అయిన వాడు ఏ ఏ ప్రకారముగా ఏ ఏ విధానానుసారముగా శ్రాద్ధము చేసిన వారికి తృప్తి కలుగునో వత్సా! వాని విధానమును గురించి వినుము. పిశాచ జన్మ ఎత్తిన పురుషునకు భూమి మీద వికిర పిండ మిచ్చినచో తృప్తి నొందును. కుమారా! స్నాన వస్త్రము నీటి ఒడ్డున పిండినచో వృక్ష జాతి యందు పుట్టిన పురుషుడు తృప్తి నొందును. కుల మందు దేవత్వాన్ని పొందిన వారు భూమి యందు పడిన శరీర జల బిందువులచే తృప్తిని బొందుదురు.
ఉద్ధృతే ష్వథ పిండేషు యా శ్చాన్న కణికా భువి తాభి రాప్యాయనం తేషాం యే తిర్యక్త్వం కులే గతాః యే వా దగ్ధాః కులే బాలాః క్రియా యోగ్యా హ్యసంసృతాః విపన్నాస్తేన్న వికిర సంమార్జన జలాశినః భుక్త్వా చా చామతాం యచ్చ జలం యచ్చాంఘ్రి శోదనే బ్రాహ్మణానాం తథై వాన్యే తేన తృప్తిం ప్రయాంతి వై పిశాచత్వ మను ప్రాప్తాః క్రిమి కీటత్వ మేవ యే ఎవమ్యో యజమానస్య యశ్చ తేషాం ద్విజన్మనామ్ కశ్చి జ్జలాన్న విక్షేపః శుచి రుచ్చిష్ట ఏవ వా తేన తేన కులే తత్ర తత్త ద్యోన్యంతరం గతాః
పిండోద్వాసన సమయ మందు భూమి యందు పడిన అన్న కణములచే తిర్యగ్యోని గతులైన జీవులకు తృప్తి కలుగు చున్నది. ఏ పురుషుడు క్రియా యోగ్యుడై నప్పటికి సంస్కరింప బడక బాల్యా వస్థలోనే దగ్దులై ప్రాణ త్యాగము చేయుదురో వారికి అన్న వికిర సమ్మార్జన జలములచే తృప్తి కలుగును. బ్రాహ్మణుడు భోజనము చేసిన పిమ్మట ఆచమన సమయ మందు ఏ జలమును వదులుదురో పాద ప్రక్షాళన సమయ మందు ఏ జలము భూమి యందు బడునో వాటిచే అన్ని విధముల వారు తృప్తి పొందుదురు. వత్సా! పిశాచత్వమును పొందిన వారు క్రిమి కీటకముల జన్మల నెత్తిన వారు యజమాని బ్రాహ్మణుల నిమిత్తము పవిత్రమైనను అపవిత్రమైనను జలము నిచ్చెదరో ఆ జలముచే యోన్యంతర మందు వున్న వారలు తృప్తి బొందుదురు.
ప్రయాంత్యాప్యాయనం వత్సః సమయ క్చాద్ధ క్రియావతామ్ అన్యాయోపార్జితై రర్థైర్యచ్చ్రాద్ధం క్రియతే నరైః తృప్యంతే తేన చాండాల పుల్కసాద్యాసు యోనిషు ఏవ మాప్యాయనం వత్స బహూనా మపి బాంధవైః శ్రాద్ధం కుర్వద్భి రాన్నాంబు శాకై రపి హి జాయతే తస్మా చ్చ్రాద్ధం నరో భక్త్యా శాకైరపి యథావిథి కుర్వీత కుర్వతః శ్రాద్ధం కులే కశ్చిన్న సీదతి తస్య కాలా నహం వక్ష్యే నిత్య నైమిత్తికాత్మికాన్ విధినా యేన చ నరైః క్రీయతే తన్నిభోధ మే కరం శ్రాద్ధ మమావాస్యాం మసి మాస్యుడుప క్షయే
శ్రద్ధా భక్తులతో శ్రాద్ధము చేయుటచే పితృ దేవతలు గొప్పగా తృప్తి పొందుదురు. ఏ మనుష్యుడు అన్యాయార్జిత ద్రవ్యముతో శ్రాద్ధమును పెట్టునో ఆ శ్రాద్ధము చేత చండాల పులస్కాది యోనుల యందు పుట్టిన పితరులకు తృప్తి కలుగును. ఈ ప్రకారము బంధువులైన వారికి కూడా కలుగును. శ్రాద్దానుష్టాన పూర్వకముగా అన్నోదకములు ఇచ్చినచో వాని వలన పితృ దేవతలకు తృప్తి కలుగు చున్నది. ఈ ప్రకారము భక్తి కలిగి శాకపాకము చేత నైనను శ్రాద్ధము చేయదగినదై వున్నది. శ్రద్ధగా అనుష్టించినచో అతని వంశములో ఎవరికీ ఖేదము పొందుట ఉండదు. కుమారా! ఇప్పుడు శ్రాద్ధము యొక్క నిత్య నైమిత్తిక కాలము గురించి చెప్పెదను వినుము. ఏ విధి ప్రకారముగా శ్రాద్ధము ననుసరించ వలెనో అది కూడా చెప్పెదను. ప్రతి మాసము నందు చంద్రునికి క్షీణము కలుగును. అపుడు అమావాస్య అగును. అపుడు విధి విదానముగా అమా శ్రాద్ధము పెట్ట వలెను.
తథాష్టకా స్వప్యవశ్య మిష్టకాలా న్సిబోధ మే విశిష్ట బ్రాహ్మణ ప్రాప్తౌ సూర్యేందు గ్రహణేయనే విషువ ద్రవి సంక్రాంతి వ్యతీపాతేషు పుత్రకః శ్రాద్దార్హ ద్రవ్య సంపత్తౌ తథా దుస్వప్న దర్శనే జన్మర్క్ష గ్రహ పీడాసు శ్రాద్ధం కుర్వీత చేచ్చయా విశిష్టః శ్రోత్రియో యోగీ వేదవి జ్జ్యేష్ట సామగః త్రినాచికేతః శ్రుత్వా న్విహిత వ్రాత కారకః త్రినాచికేత స్త్రీ మధు స్త్రసుపర్ణః షడంగవిత్ దౌహిత్ర ఋత్విక్ జామాతా స్వస్రీయః శ్వశుర స్తథా పంచాగ్ని కర్మ నిష్టశ్చ తపోనిష్ఠోథ మాతులః మాతా పితృ పరాశ్చైవ శిష్య సంబంధి బాంధవాః ఏతే ద్విజోత్తమా శ్రాద్దే సమస్తాః కేతన క్షమాః
మరియు పౌష మాసాది కృష్ణాష్టమి యందు కూడా శ్రాద్ధమును పెట్టవలెను. శ్రాద్ధములు పెట్టుటకు ఉత్తమ కాలములను చెప్పెదను వినుము. బ్రాహ్మణులు సంప్రాప్తించి నప్పుడు, సూర్య చంద్ర గ్రహణముల యందు, ఉత్తరాయణ మందు, విషువత్ పుణ్యకాల మందు, రవి సంక్రణ మందు, వ్యతీపాతము నందు, శ్రాద్ధ యోగ్యములగు వస్తువులు లభించి నపుడు, దుస్స్వప్నములు వచ్చినపుడు, జన్మ నక్షత్ర మందు, గ్రహ పీడలు కలిగి నపుడు ఇచ్చా పూర్వకముగా శ్రాద్ద కర్మ చేయవలెను. విశిష్ట మైన శోత్రయుడు, యోగి, వేదజ్ఞుడు, జ్యేష్టుడు, సామ గానము చేయువాడు, త్రినాచికేతుడు, అనగా (నాచికేత ప్రణీతము లైన మూడు ఉపనిషత్తులు ఉపాసన చేయువాడు) త్రిమదు, త్రిసువర్ణుడు, షడంగవేత్త, దౌహిత్రుడు, ఋత్విక్కు, జామాత, మేనల్లుడు, పంచాగ్ని, కర్మ, నిష్టులు,తపఃపరాయణుడు, మేనమామ, తల్లిదండ్రియందు భక్తీ గల పురుషుడు, శిష్య సంబంధ బాంధవులు, వీరందరూ కూడా శ్రాద్ధమునకు యోగ్యులు. తన తల్లి దండ్రుల యందు ప్రేమగల వారిని, తల్లి దండ్రుల శిష్యులను, సంబంధులను, బాంధవులను, ఇట్టి బ్రాహ్మణోత్తములను శ్రాద్ధ నిమంత్రణము చేయుటకు తగిన వారు.
అవకీర్ణ స్తథా రోగీ న్యూనాంగ స్త్వదికాంగకః పౌనర్భవ స్తథా కాణః కుండో గోలోథ పుత్రకః మిత్రధ్రు క్కునఖీ కుష్టీ శ్యావదంతో నిరాకృతిః అభిశస్త స్తథా స్తేయః పిశునాః సోమవిక్రయీ కన్యా దూషయితా వైద్యో గురుపిత్రో స్తథోజ్ఝకః భృతకాథ్యా పకోమిత్రం పరదుష్టాపతి స్తథా వేదోజ్ఘ శ్చాగ్ని సంత్యాగీ పృషలాపత్య దూషితః యథాన్యే చ వికర్మస్థా వర్జ్యాః పైత్రేషు వై
బ్రహ్మచర్యాది రహితుడు, రోగి, స్థూలాంగుడు, హీనాంగుడు, మారు మనువు స్త్రీకి పుట్టిన వాడు, ఏకాక్షి, కుండుడు (అనగా భర్త బ్రతికి ఉండగా జారుడి వలన జన్మించిన వాడు) గోళకుడు, (అనగా భర్త మరణించిన పిమ్మట జారుని వలన జన్మించిన వాడు) మిత్ర ద్రోహి, పిప్పి పళ్ళు గలవాడు, కుష్ఠు రోగి, నల్లని దంతములు గలవాడు, రూపము లేని వాడు, అభిశస్తుడు (అనగా దూషింపబడిన వాడు), చోరుడు, లోభి, సోమ విక్రయము చేసిన వాడు, కన్యను చెరచిన వాడు, వేద విక్రయము చేసిన వాడు, గురువును త్యజించిన వాడు, తల్లి దండ్రులను వదలి పెట్టిన వాడు, జీతము తీసికొని చదువు చెప్పిన వాడు, శత్రువు, పరుని భార్యను తన భార్యగా చేసుకొనిన వాడు, వేదత్యాగి, అగ్నిహోత్ర త్యాగి, సూద్ర స్త్రీ యందు సంతానమును పొందిన వాడు, వీరే కాక నీచ కర్మలను చేయు బ్రాహ్మణులను, పితృ కర్మల యందు వర్జింప వలెను.
నియంత్రయేత పూర్వేద్యుః పూర్వోక్తాన్ద్విజ సత్తమాన్ దైవే నియోగే పిత్ర్యే చ తాం స్తథైవోపకల్పయేత్ తైశ్చ సంయమిఖి ర్భావ్యం యశ్చ శ్రాద్ధం కరిష్యతి శ్రాద్ధం దత్త్వా చ భుక్త్వా చ మైథునం యోనుగచ్చతి పితరస్తు తయో ర్వాసం తస్మి న్న్రేతసి శేరతే గత్వా చ యోషితం శ్రాద్దే యో భుంక్తే యస్తు గచ్చతి రేతో మూత్ర క్రుతాహారా స్తం మాసం పితర స్తయోః తస్మాత్తు ప్రథమం కార్యం ప్రాజ్ఞేనో పని మంత్రణమ్ అప్రాప్తౌ తద్ధినే చాపి వర్జ్యా యోషి త్ప్రసంగినః భిక్షార్థ మాగతా న్వాపి కాలే సంయమినో యతీన్ ఖోజయే త్ప్రణిపాతాద్యైః ప్రసాద్య యత మానసః యథైవ శుక్లపక్షా ద్వై పితౄణా మసితః ప్రియః
శ్రాద్ధ కర్మకు ముందు రోజున పూర్వోక్తమైన బ్రాహ్మణ శ్రేష్టులను దేవ కార్య పితృ కార్యముల యందు నిమంత్రణము చేయవలెను. శ్రాద్ధకర్త శ్రాద్ధ భోజన నియమమును పాటించి యుండవలెను. శ్రాద్ధ కర్త , శ్రాద్ధభోజి మైధునము చేసిన యడల వారిద్దరికీ పితరులు ఒక నెల రోజులు వారి రేతస్సు యందు శయ నించుదురు. శ్రాద్ధకర్త, నిమంత్రణము చేసిన వాడు, స్త్రీ సాంగత్యము చేసి శ్రాద్ధము పెట్టినను, శ్రాద్దాన్నము భుజించినను, వారిద్దరి తల్లిదండ్రులు నెల రోజుల వరకు రేతో మూత్రములే ఆహారముగా గలవారై ఉందురు. అందు వలననే ప్రాజ్ఞులు పూర్వ దినమందే నిమంత్రణము చేయుదురు. శ్రాద్ధ దినమున బ్రాహ్మణోత్తములు దొరకక పోయినను స్త్రీ సాంగత్యము గలవాడిని ఎప్పటికి నిమంత్రణము చేయ కూడదు. సకాలమున భిక్షకు వచ్చిన యతులను నమస్కారాదులచే ప్రసన్నులను చేసుకొని శుద్ధ చిత్తముతో భుజింప చేయ వలెను. శుక్ల పక్షము కంటె కృష్ణ పక్షము పితృ దేవతలకు ప్రియ మైనది. నమస్కారాలతో ప్రసన్నులను చేసి నియత మనస్కుడై భుజింప చేయ వలెను.
తథాపరాహ్ణః పూర్వాహ్ణా త్పితౄణా మతిరచ్యతే సంపూజ్య స్వాగతే నైతా నభ్యుపేతా న్గృహే ద్విజాన్ పవిత్ర పాణి రాచాంతా నాసనే హోపవేశయత్ పితౄణా మయుజః కామం యుగ్మా న్దైవే ద్విజోత్తమాన్ ఏకైకం వా పితౄణాం చ దేవానాం చ స్వశక్తితః తథా మాతామహానాం చ తుల్యం వా వైశ్వదైవిగమ్ వృథ క్తయో స్తథా చాన్యే కేచి దిచ్చంతి మానవాః ప్రాజ్ముఖా న్దైవ సంకల్పా న్పిత్రూ న్కుర్యా వదుదజ్ముఖాన్ తథా మాతామహానాం చ విధి రుక్తో మనీషిభిః విష్టరార్థే కుశా న్దత్త్వా సంపూజ్యార్ఘాదినా తతః
ఈ ప్రకారము పితృ దేవతలకు పూర్వాహ్నము కంటె అపరాహ్నము ప్రియమైనది. ఇంటికి వచ్చిన బ్రాహ్మణులను స్వాగతము పలికి అచ్చన చేసి పవిత్ర ప్రాణియై ఆచమించి ఆసన మందు కూర్చుండ బెట్టవలెను. పితృ స్థానమునకు బేసి సంఖ్యలో, దేవకార్య మందు సరి సంఖ్యలో బ్రాహ్మణులను అర్చించ వలెను. తన యొక్క సామర్థ్యము ననుసరించి పితృ స్థానమందు ఒకరిని , విశ్వే దేవ స్థానము నందు ఒకరిని అర్చించ వచ్చును. మాతామహుని శ్రాద్ధము నందున కూడా ఈ ప్రకారముగానే వైశ్వదేవ విధానము నిర్దిష్టమై యున్నది. కొంతమంది తూర్పు ముఖముగా దేవ కర్మలను మరియు మాతామహ కర్మలను చేయవలెనని చెప్పుదురు. ఈ సమయము నందు ఆసనము కొరకు కుశలు ఇవ్వ వలెను. అర్ఘాదులచే పూజింప వలెను.
పవిత్రకాణి దత్త్వా వై తేభ్యోనుజ్ఞా మహాప్య చ కుర్యా దావాహనం ప్రాజ్ఞో దేవానాం మంత్రతో ద్విజః యవాంభోభి స్తతశ్చార్ఘ్యం దత్త్వా వై వైశ్యదైవికమ్ గంధమాల్యాది ధూపం చ దత్త్వా సమ్య క్ప్రదీపకమ్ అపసవ్యం పితౄణాం చ సర్వ మేవోప కల్పయేత్ దర్భాంశ్చ ద్విగుణా న్దత్త్వా తెభ్యోనుజ్ఞా మవాప్య చ మంత్రపూర్వం పితౄణాం చ కుర్యా దావాహనం బుధః అపసవ్యం తథైవార్ఘ్యం యవార్థే చ తథా తిలైః నిష్పాదయే న్మహా భాగః పితౄణాం ప్రీణనే రతః అగ్నౌ కార్య మనుజ్ఞాతః కురుష్వేతి తతో ద్విజైః
తరువాత పవిత్రములను యిచ్చి బ్రాహ్మణానుజ్ఞ తీసికొని మంత్రం పూర్వకముగా దేవతలను ఆవాహనము చేయ వలెను. యవలతో కూడిన జలముతో విశ్వే దేవతల నుద్దేశించి అర్ఘ్య ప్రధాన పూర్వకముగా గంధ, మాల్య, ధూప, దీప, జల కుంభ, దానములు చేసి, దక్షిణ దిక్కు యందు అపసవ్యముగా పితృ దేవతలకు సమస్త కర్మలు చేయ వలెను. అనంతరము రెట్టింపుగా దర్భల నిచ్చి వారి యాజ్ఞ తీసికొన వలెను. మంత్రం పూర్వకముగా పితృ దేవతల యొక్క ఆవాహనము చేయవలెను. ఈ సమయ మందు పితృ దేవతల యొక్క సంతుష్టి యందు ఆసక్తి గలవాడై ప్రాచీనావీతియై యావ, తిలలతో కూడిన అర్ఘ్యము నీయవలెను. అటు పిమ్మట బ్రాహ్మణానుజ్ఞ తీసికొని అగ్ని కార్యము చేయ వలెను. పితృ ప్రీతిని చేయుటకు ఆసక్తి గలిగి యుండ వలెను.
జుహుయా ద్వ్యంజన క్షార వర్జ మన్నం యథావిధి అగ్నయే కవ్యవాహనాయ స్వాహేతి ప్రథమాహతిః సోమాయ వై పితృమతే స్వాహే త్యన్యే తథా భవేత్ యమాయ ప్రేత పతయే స్వాహేతి తృతీయాహుతిః హుతావశిష్టం దద్యాచ్చ భాజనేషు ద్విజన్మనామ్ భాజనాలంభనం కృత్వా దత్త్వా చాన్నం యథావిధి యథాసుఖం జుషద్వం భో రితి వాచ్య మనిస్థురమ్ భుంజీరశ్చ తత స్తేపి తచ్చిత్తా మౌనినః సుఖమ్
అగ్ని కార్య మందు విదానానుసారముగా వ్యంజన సహితము. క్షారరహిత ములగు అన్నమును హోమము చేయవలెను. “ఆగ్నయే కవ్యవాహనాయ స్వాహా” అనగా (కవ్యమును పొందుచున్న అగ్నిని ప్రసన్నుని చేసు కొనుటకు ఈ అన్నమును ఇచ్చు చున్నాను.) ఈ మంత్రమును ఉచ్చరించి మొదటి ఆహుతిని ఇవ్వవలెను. మరల “సోమాయ వైపితృమతే స్వాహా” అని ఈ మంత్రమును ఉచ్చరించి రెండవ ఆహుతిని ఇవ్వ వలెను. “యమాయ ప్రేత పతయే స్వాహా” ఈ మంత్రమును ఉచ్చరించి మూడవ ఆహుతిని ఇవ్వ వలెను. హోమంత మందు మిగిలిన అన్నమును బ్రాహ్మణుల యొక్క భోజన పాత్రల యందు ఉంచ వలెను. సర్వ పదార్థములు ఉంచి భోజన పాత్రను స్పృశించి “యధాసుఖం జుషద్వం భోః” అని మృదు వచనములతో పలుక వలెను. అపుడు బ్రాహ్మణులు ఏకాగ్ర చిత్తులై మౌనముతో యదా సుఖముగా భోజనము చేయుదురు.
యద్య దిష్టతమం తేషాం తత్త దన్న మసత్వరమ్ అక్రుధ్యశ్చ నరో దద్యా త్సంస్తవేన ప్రలోభయేత్ రక్షోఘ్నాంశ్చ జాపే స్మంత్రాం స్తిలైశ్చ వికిరే న్మహీమ్ సిద్ధార్థకైశ్చ రక్షార్థం శ్రాద్ధం హాయ్ ప్రాచుర చ్చలమ్ పృష్టై స్తృప్తైశ్చ తృప్తాః స్థః తృప్తాస్స్మ ఇతి వాదిభిః అనుజ్ఞాతో నారా స్త్వన్నం వికిరే ద్భువి సర్వతః తద్వ దాచమనార్థాయ దద్యా దంభ స్సకృ త్సకృత్ అనుజ్ఞాం చ తతః ప్రాప్య యత వాక్కాయ మానసః సతిలేన తతోన్నేన పిండా న్సర్వేణ పుత్రకః పితౄ నుద్దిశ్య దర్భేఘ దద్యా దుచ్చిష్ట సన్నిధౌ
ఏ భోజన పదార్థములు భోక్తలకు ప్రియమగునో క్రోధములు లేనివాడై మెల్ల మెల్లగా ఆ పదార్థము లందు రుచిని కలుగునటుల చెప్పుచు ఆదరముతో ఆ పదార్థములను వడ్డించు చుండవలెను. రక్షోఘ్న మంత్రములను జపించ వలెను. భూమి యందు అన్ని వైపుల నువ్వులు చల్లవలెను. శ్రాద్ధ రక్షణార్థమై ఆవాలను కూడా చల్ల వలెను. ఎందువలన అనగా స్వభావముగా శ్రాద్ధము అనేక చిద్రములతో కూడుకొని యుండును. అనంతరము పుష్టిగా తృప్తిగా భోజనము చేసిన బ్రాహ్మణులను “తృప్తాః స్థః” అనగా తృప్తిగా భోజనము చేసితిరా? అని అడుగవలెను. “తృప్తాః స్మః” అనగా తృప్తుల మైతిమి అని వారు చెప్ప వలెను. అపుడు వారి యొక్క అనుజ్ఞ తీసికొని భూమి యందు అన్నము జల్లవలెను. ఆచమనము కొరకు విధానానుసారముగా ఒక్కొక్కసారి జలమును ఇవ్వవలెను. పిమ్మట ఆజ్ఞను తీసికొని త్రికరణ శుద్ధితో నువ్వులతో కూడుకొనిన పిండమును దక్షిణ దిక్కుగా పితరుల నుద్దేశించి దర్భల మీద ఉచ్చిష్ట సన్నిధిన పిండములను ఉంచ వలెను.
పితృ తీర్థేన తోయం చ దద్యా త్తేభ్య స్సమాహితః పితౄ న్సంచింత్య తద్భక్త్యా యజమానో నృపాత్మజః తద్వ న్మాతామహానాం చ దద్యా త్పిండా న్యథా విధి గంధమాల్యాది సంయుక్తాన్ దద్యా దాచమనం తతః దత్త్వా చ దక్షిణాం శక్త్యా సుస్వదా స్త్వితి తా న్వదేత్ తైశ్చతుష్టై స్తథే త్యుక్త్వా వాచయే ద్త్వేశ్వ దైవికాన్ ప్రీయంతా మితి భద్రం వో విశ్వేదేవా ఇతీరయేత్ తథేతి చోక్తే తై ర్విప్రైః ప్రార్థనీయా స్తదాశిషః విసర్జయే త్ప్రియా ణ్యుక్త్వా ప్రణిపత్య చ భక్తితః ఆద్వార మనుగచ్చేచ్చ ఆగచ్చే చ్చానుమోదితః
సమాహిత చిత్తుడై పితృదేవతల నుద్దేశించి భక్తి పూర్వకముగా పితృ తీర్థముచే తర్పణము చేయవలెను. అటులనే మాతామహుల నుద్దేశించి కూడా ఈ ప్రకారముగనే పిండ ప్రధానము చేయవలెను. గంధ మాల్యాదులతో ఇట్లు పిండమును అర్చించి ఆచమనము ఇవ్వవలెను. అనంతరము తన శక్తి ననుసరించి దక్షిణ ఇచ్చి “సుస్వదాస్తు” అని వారిని గురించి పలుకవలెను. సంతుష్టులైన బ్రాహ్మణులు “తథా” అని వారు చెప్పవలెను. అనంతరము విశ్వే దేవతలను గురించి “ప్రీయంతామితి భద్రం వో విశ్వే దేవాః” యని యడుగ వలెను. “తథా” అని వారు చెప్పవలెను. అనంతరము వారిచే ఆశీర్వచనము పొందవలెను. తరువాత ప్రియ వచనములు పలికి అందరికి భక్తితో నమస్కరించి ద్వార పర్యంతము వారిని అనుసరించి వారి యాజ్ఞ తీసికొని లోపలి తిరిగి రావలెను.
తతో నిత్యక్రియాం కుర్యా ద్భోజయేచ్చ తథాతిథీన్ నిత్యక్రియాం పితౄణాం చ కేచి దిచ్చంతి సత్తమాః న పితౄణాం తథైవాన్యే శేషం పూర్వవదాచరేత్ పృథక్పాకేన చేత్యనే కేచి త్పూర్వం చ పూర్వవత్ తతస్తదన్నం భుంజీత సహ భృత్యాదిభి ర్నరః ఏవం కుర్వీత ధర్మజ్ఞః శ్రాద్ధం పిత్ర్యం సమాహితః యథా వా ద్విజముఖ్యానాం పరితోషోభిజాయతే త్రీణి శ్రాద్దే పవిత్రాణి దౌహిత్రం కుతపఃస్తిలాః వర్జ్యాని చాహు ర్విప్రైశ్చ కోపోద్వగమనం త్వరా రాజతం చ తథా పాత్రం శస్తం శ్రాద్దేషు పుత్రకః రజతస్య తథా కార్యం దర్శనం దాన మేవ వా రాజతే హి స్వథా దుగ్దా పితృభిః శ్రూయతే మహీ తస్మా త్పితౄణాం రజత మభీష్టం ప్రీతి వర్ధనమ్
పిమ్మట నిత్య క్రియలను చేయవలెను. పిమ్మట అతిథులను భుజింప చేయవలెను. కొందరు పితృ దేవతలకు నిత్య క్రియలు చేయవలెనని చెప్పుదురు. కొందరు కూడదని చెప్పుదురు. తర్వాత అవశిష్ట కర్మను పూర్వము వలె సమాప్తి చెందించ వలెను. కొందరి మతము ప్రకారము వేరుగా పాకము చేయించి పితృ కార్యము చేయవలెనని, కొందరు చేయకూడదని అందురు. అనంతరము ఆ అన్నమును శ్రాద్దకర్త భృత్యాదులతో భుజింప వలెను. ధర్మజ్ఞుడా! ఏ ప్రకారముగా బ్రాహ్మణులు సంతోషించుదురో ఆ ప్రకారముగా సావధాన చిత్తుడై పితృ దేవతల నుద్దేశించి శ్రాద్ధ కర్మను చేయ వలెను. దౌహిత్రుడు కుతపము (పగటి 15 భాగములలో ఎనిమిదవ భాగము) తిలలు ఈ మూడు శ్రాద్ధమునందు పవిత్రమైనవి. కోపము, ప్రయాణము, తొందర ఈ మూడింటిని బ్రాహ్మణులు వర్ణించ వలెను. పుత్రా! శ్రాద్ధమందు వెండి పాత్ర శ్రేష్ట మైనది. రజత దానము రజత దర్శనము శ్రాద్ధమందు ఉచితమై ఉన్నవి. పితృదేవతలు, రజత పాత్ర యందు భూమి నుండి స్వధా రూపమైన పాలను పితుకుదురు అని పెద్దలచే వినబడు చున్నది. ఈ కారణముచే వెండి పితృదేవతలకు అభీష్టమై ప్రీతి వర్ధకమై ఉన్నది.
Summary of chapter 28 of the Mārkandeya Mahā Purana is as follows:
When her fourth son Prince Alarka is born, King Kuvalayāshva requests Madālasā to raise him as a future ruler rather than an ascetic renunciate. Madālasā lovingly instructs Alarka in the profound duties of Rājadharma, teaching him how a king must control his six inner enemies, protect his subjects like a compassionate father, execute justice impartially, and view royal power as a sacred sacrifice to Bhagavān.