మార్కండేయ మహా పురాణము
39 - యోగ నిరూపణము
దత్తాత్రేయుడు:
ఏవం యో వర్తతే యోగీ సమ్యగ్యోగ వ్యవస్థితః న స వ్యావర్తితుం శక్యో జన్మాంతర శతై రపి దృష్ట్వా చ పరమాత్మానాం ప్రత్యక్షం విశ్వరూపిణమ్ విశ్వపాద శిరో గ్రీవం విశ్వేశం విశ్వ భావనమ్ తత్త్రాప్తయే మహా త్పుణ్య మోమి త్యేకాక్షరం జపేత్ తదేవాధ్యయనం తస్య స్వరూపం శ్రుణ్వతః పరమ్ ఆకారశ్చ తథోకారో మకారశ్చాక్షర త్రయమ్ ఏతా స్తిస్రః స్మృతా మాత్రాః సాత్త్వ రాజస తామసాః నిర్గుణా యోగిగమ్యాన్యా చార్థమాత్రోర్ఘ్వ సంస్థితా గాన్థారీతి చ విజ్నేయా గాన్దార స్వర సంశ్రయా
దతాత్రేయుడు:
ఈ ప్రకారముగా ఏ యోగి బాగుగా యోగ చిత్తుడై యుండునో జన్మాంతర శతముల కైనను తిరిగి ఆ యోగి స్వస్థానము నుండి నివృత్తుడు కాడు. యోగి విశ్వరూపుడు, విశ్వేశ్వరుడు, విశ్వ భావనుడు విశ్వపాద శిరోగ్రీవుడు నగు పరమాత్మను ప్రత్యక్షము చేసు కొనును. ఆ పరమాత్మను ప్రత్యక్షము చేసు కొనుటకు మహా పుణ్య ప్రదమగు “ఓం” అను ఏకాక్షరమును జపించ వలెను. అదే అధ్యయనము చేయ వలెను. ఓంకార స్వరూపమును శ్రవణము చేయ వలెను. అకార, ఉకార, మకారములు అను ఈ మూడు అక్షరములు ఓంకారము యొక్క స్వరూపమై యున్నవి. వీటిని మూడు మాత్రలుగా తెలుసుకొన వలెను. ఈ మూడు మాత్రలు క్రమానుసారముగా సాత్త్విక, రాజస, తామసములై యున్నవి. ఈ మూడక్షరముల కంటె అతిరిక్తముగా ఓంకారమునకు ఒక అర్థ మాత్ర ఉన్నది. అది సాత్త్వికాది మూడు గుణముల కంటే అతీత మైనది.అనగా నిర్గుణ స్వరూపమై యున్నది.
పిపీలికా గతి స్పర్శా ప్రయుక్తా మూర్ధ్ని లక్ష్యతే యథా ప్రయుక్త ఓంకారః ప్రతినిర్యాతి మూర్ధని తథోంకారమయో యోగీ త్వక్షరే త్వక్షరో భవేత్ ప్రాణో ధనుః శరో హ్యాత్మా బ్రహ్మ వేద్య మనుత్తమమ్ అప్రమత్తేన వేద్దవ్యం శరవ త్తన్మయో భవేత్ ఓమిత్యేత త్త్రయో వేదా స్త్రయో లోకా స్త్రయోర్నయః విష్ణు ర్బ్రహ్మా హరశ్చైవ ఋక్సామాని యజూంషి చ మా తాః సార్దాశ్చ తిస్రశ్చ విజ్నేయాః పరమార్థతః తత్ర యుక్తస్తు యో యోగీ స తల్లయ మవాప్నుయాత్ ఆకార స్త్వథ భూ ర్లోక ఉకార శ్చోచ్యతే భువః సవ్యంజనో మకారశ్చ స్వర్లోకః పరికల్ప్యతే వ్యక్తా తు ప్రథమా మాత్రా ద్వితీయాఽవ్యక్త సంజ్ఞితా
ఈ అర్థ మాత్ర పిపీలిక (చీమ) తో సమాన గమనము కలిగి స్పర్శ యుక్తమై ఉన్నది. ఇది శిరోభాగ మందు చూడబడు చున్నది. ఓంకారము ప్రయోగించి ఏ విధముగా గమనము చేయు చున్నదో ఈ ప్రకారముగా యోగ యుక్త పురుషుడు ప్రతి అక్షర మందు ఓంకార మయుడు అగు చున్నాడు. ప్రాణము ధను స్స్వరూపము. ఆత్మ బాణ స్వరూపము. బ్రహ్మ లేధ్యస్య రూపముగాను తెలుసుకొన వలెను. అప్రమత్తుడై బాణముతో సమానముగా బ్రహ్మను లక్ష్యము చేసినచో తన్మయుడు కాగలడు. ఓంకారము మూడు వేదములు, మూడు లోకములు, మూడు అగ్నులు, త్రిమూర్తులు, ఋక్, సామ, యజుః, స్వరూపములై ఉన్నది. పరమార్థ విచారముచే ఓంకారము సార్ద త్రిమాత్రలు గల దానినిగా తెలుసుకొన వలెను. ఈ ఓంకార మందు సంయుక్తుడైన యోగి ఓంకార మందు విలీనుడగును. ఆకారము భూర్లోకము ఉపకారము భువర్లోకము సవ్యంజన మగు మకారము స్వర్లోకముగా చెప్ప బడెను. మొదటి మాత్ర వ్యక్తమని రెండవ మాత్ర అవ్యక్తమని చెప్పుదురు.
మాత్రా తృతీయా చిచ్చక్తి రర్ధమాత్రా పరం పదమ్ అనేనైవ క్రమేణై తా విజ్ఞేయా యోగ భూమాయః ఓమిత్యుచ్చారణా త్సర్వం గృహీతం సద సద్భవేత్ హ్రస్వా తు ప్రథమా మాత్రా ద్వితీయా దైర్ఘ్య సంయుతా తృతీయా చ ప్లుతార్దాఖ్యా వచసః సా న గోచరా ఇత్యేత దక్షరం బ్రహ్మ పర మోంకార సంజ్ఞితమ్ యస్తు వేద నర స్సమ్య క్తథా ధ్యాయతి వాపు నః సంసార చక్ర ముత్స్రు జ్య త్యక్త త్రివిధ బంధనః ప్రాప్నోతి బ్రాహ్మణి లయం పరమే పరమాత్మని అక్షీణ కర్మ బంధశ్చ జ్ఞాత్వా మృత్యు మరిష్టః ఉత్క్రాన్తి కాలే సంస్మృత్య పునర్యోగిత్వ మ్రుచ్చతి తస్మా దసిద్ధయోగేన సిద్ధయోగేన వా పునః జ్ఞేయా న్యరిష్టాని సదా ఏనోత్క్రాన్తౌ న సీదతి
మూడవ మాత్ర చిచ్చక్తి అని చెప్పుదురు. మరియు నాల్గవ మాత్ర పరమ పదమని చెప్పబడెను. ఈ ప్రకారముగా ఈ మాత్రలను యోగ భూములుగా తెలుసుకొన వలెను. “ఓం” అను ఈ అక్షరము యొక్క ఉచ్చారణ మాత్రము చేతనే సమస్తములగు సత్, అసత్ రూపములు గ్రహింప బడిన వగుచున్నవి. మొదటి మాత్ర హ్రస్వము, రెండవ మాత్ర దీర్ఘము, తృతీయ మాత్ర ప్లుత స్వరూపమై యున్నది. అర్థ మాత్ర యొక్క స్వరూప వర్ణనము చేయుట సాధ్యము కాదు. ఈ ప్రకారముగా యోగి ఓంకార సంజ్ఞకము, అక్షర స్వరూపమగు పర బ్రహ్మను తెలుసుకొని ఓంకార ధ్యానము చేసినచో ఆ యోగి సంసార చక్రము నుల్లంఘించి త్రివిధ బంధములను (ఈపణ త్రయములు) త్యజించిన వాడై పరమాత్మ స్వరూపమగు పరబ్రహ్మ యందు లీనమగు చున్నాడు. కర్మ బంధము క్షయము గాని యెడల, అరిష్టముల వలన మృత్యువును తెలుసుకొని మరణ కాలమందు జాతి స్మృతి కలవాడై మరల యోగిగా పుట్టును. ఈ కారణముచే యోగి సిద్ధి అసిద్ధుల యందు అరిష్టము లన్నింటిని తెలుసుకొన వలెను. అరిష్టములను తెలుసు కొనినచో మరల కాల మందు దుఃఖ ప్రాప్తి ఉండదు.
Summary of chapter 39 of the Mārkandeya Mahā Purana is as follows:
The son details the practical system of Yoga, including posture, prāṇāyāma, and mental withdrawal from sensory objects. He explains how regulating the vital breath stills the restless mind, purifies subtle nāḍīs, and prepares the practitioner for unbroken concentration on the Supreme Soul.