మార్కండేయ మహా పురాణము
102 - మార్తాండోత్పత్తి
మార్కండేయుడు:
తతః స్వతేజసః స్తస్మా దావిర్భూతో విభావసుః అదృశ్యత తదాదిత్య స్తప్తతామ్రోపమప్రభః అధ తాం ప్రణతాం దేవీం తస్య సందర్శనా న్మునే ప్రాహ భాస్వా న్వృణు ష్వేష్టవరం మత్తో య మిచ్చసి ప్రణతా శిరసా సా చ జాను పీడిత మేదినీ ప్రత్యువాచ వివస్వంతం వరదం సముపస్థితిమ్ దేవః ప్రశీద పుత్రాణాం హృతం త్రిభువనం మమ యజ్ఞ భాగాశ్చ దైత్యేశ్చ దానవైశ్చ బలాధికైః తన్నిమిత్తం ప్రసాదం త్వం కురుష్వ మామ గోపతే అంశేన తేషాం భ్రాతృత్వం గత్వానాశాయ తద్రిపూన్
మార్కండేయుడు:
పిమ్మట విభావసుడు తన తేజో మండలము యొక్క మధ్య భాగము నుండి మండు చున్న రాగి వంటి దేహము కలవాడై ప్రత్యక్ష మయ్యెను. ఓ మునీ! అతనిని దర్శించుట తోనే అదితీ దేవి నమస్కరించెను. అప్పుడు సూర్య భగవానుడు ఆమెతో నిట్లు పలికెను. “నీ కెట్టి కోరిక కలదో, దానిని అడుగుము. అభీష్టమును నెరవేర్చెదను.” అప్పుడు ఆ అదితి జానువులచే భూమిని తాకుచు మస్తకముచే ప్రణమిల్లుచూ వరము నిచ్చుటకు సిద్ధముగా నున్న వివస్వానునితో ఓ దేవా! ప్రసన్నుడ వగుము. అధిక బలసంపన్నులగు దైత్యులు, దానవులు, నా పుత్రుల యొక్క త్రిభువనములు మరియు యజ్ఞ భాగములను అపహరించిరి. “ఓ గోపతీ! అందుచే నాపై ప్రసన్నుడవై నీ యొక్క అంశమున వారికి సోదరుడవై శత్రువులను నాశనము చేయుము.”
యథా మే తనయా భూయో యజ్ఞభాగ భుజః ప్రభో భవేయు రధిపాశ్చైవ త్రైలోక్యస్య దివాకరః తథానుకంపాం పుత్రాణాం సుప్రసన్నో రవే మమ కురు ప్రసన్నార్తిహరః స్థితికర్తా త్వ ముచ్యసే
హే ప్రభో! దివాకరా! ఇట్లు నా కుమారులు తిరిగి యజ్ఞ భాగ భోజన మందు అధికారమును, త్రైలోక్యాధిపత్యమును పొంద వలెను. ఓ దేవా! నా యందు ప్రసన్నుడవై నా పుత్రుల యెడల కృపను ప్రకాశింప జేయుడు. దుఃఖితుల భయమును పోగొట్టు వాడా! నిన్ను లోక పాలకుడని అందురు కదా! నా అభీష్టమును సిద్ధింప జేయుము. అని పలికెను.
మార్కండేయుడు:
తత స్తా మః భగవాన్ భాస్కరో వారితస్కరః ప్రణతా మదితిం విప్రః ప్రసాద సుముఖో విభుః సహస్రంశేన తే గర్భే సమ్భూయాహ మశేషతః త్వ త్పుత్ర శత్రూ నదితే నాశాయా మ్యాశు నిర్వృతః ఇత్యుక్త్వా భగవాన్ భాస్వా నంతర్దాన ముపాగమత్ నివృత్తా సాపి తపసః సంత్రుప్తాఖిల వాంచితా
మార్కండేయుడు:
ఓ విప్రా! అనంతరము వారి తస్కరుడగు భాస్కర భగవానుడు ప్రసన్నుడై ప్రణతురాలైన ఆ అదితితో నిట్లు పలికెను: “ఓ అదితీ! నేను సహస్రాంశ తేజస్సుచే నీ గర్భము నుండి జన్మించి నీ పుత్రుల యొక్క శత్రువుల నందరిని సమూలముగా నాశనము చేయుదును. నీ పుత్రులు వెంటనే సుఖముగా నుందురు గాక.” అని పలికి భాస్కర భగవానుడు అచటి నుండి అంతర్ధానమయ్యెను. మరియు అదితియు కోరిన వరమును పొందినదై తపస్సును విరమించుకొని స్వగృహమునకు పోయెను.
తతో రస్మి సహస్రాత్తు సౌషుమ్నాఖ్యో రవే, కరః విప్రావతారం సంచక్రే దేవమాతు రథోదరే కృచ్చ్ర చాంద్రాయణా దీని సా చ చక్రే సమాహితా శుచిః సంధారయామాస దివ్యం గర్భ మితి ద్విజః తత స్తాం కశ్యపః ప్రాహ కించి త్కోపప్ణుతాక్షరమ్ కిం మారయసి గర్భాండ మితి నిత్యోప వాసినీ సా చ తం ప్రాహ గర్భాండ మేత త్పశ్యేతి కోపనా న మారితం విపక్షాణాం మృత్యువే తద్భవిష్యతి
ఓ విప్రా! పిమ్మట కొంత కాలమునకు రవి యొక్క “సౌషుమ్న” యను పేరు గల సహస్రాంశ కిరణము దేవమాత యగు అదితి యొక్క గర్భమున ప్రవేశించెను. ఓ ద్విజుడా! గర్భవతి యగు అదితి సావధానురాలై కృచ్చ్ర చాంద్రాయణాది వ్రతానుష్టానములు గర్భము శుచిగా నుండ వలెనని ఆచరింప సాగెను. అప్పుడు కశ్యపుడు కృద్ధుడై భార్యతో “నీవు నిత్యమూ ఈ విధముగా ఉపవాసము చేయుచూ ఈ గర్భస్త అండమును చంపుదువా ఏమి?” అని పరుషముగా పలికెను. ఆ పలుకులు వినిన అదితి “ ఓ కృద్ధ స్వభావుడా! నీవు చూచుచున్న ఈ గర్భాండమును చంపుట లేదు. ఇది శత్రు వినాశనమునకు కారణ మగును” అని ప్రత్యుత్తర మిచ్చెను.
మార్కండేయుడు:
ఇత్యుక్త్వా తం తదా గర్భ ముత్ససర్జ సురారణిః జాజ్వల్యమానం తేజోభిః పత్యు ర్వచన కోపితా!
మార్కండేయుడు:
ఇట్లు పలికిన సుర మాత యగు అదితి భర్త మాటలకు కోపించినదై తేజస్సుతో జాజ్వల్య మానముగా నున్న ఆ గర్భమును పరిత్యజించెను.
తం దృష్ట్వా కశ్యపో గర్భ ముద్య ద్భాస్కర వర్చసమ్ తుష్టావ ప్రణలో, భూత్వా బుగ్భి రాద్యాభి రాదరాత్ సంస్తూయమానః స తదా గర్భాణ్డా త్ప్రకటోభవత్ పద్మపత్ర సవర్ణాభ స్తేజసా వ్యాప్త దిజ్ముఖః అధాంతరిక్షా దాభాష్య కశ్యపం మునిసత్తమమ్ సతోయ మేఘ గంభీర వాగువాచా శరీరిణీ మారితం తే గతః ప్రోక్తమే తదణ్ణం త్వయా మునే తస్మాన్మునే సుత స్తేయం మార్తాండాఖ్యో భవిష్యతి సూర్యాధికారం చ విభు ర్జగత్యేష కరివ్యతి హనిష్య త్యసురాంశ్చాయం యజ్ఞ భాగ హరా నరీన్
ఉదయ కాల భాస్కరునివలె ప్రకాశించు చున్న ఆ గర్భమును చూసి కశ్యపుడు నమస్కరించుచూ, ఆదరముతో ఆద్య ఋక్ మంత్రాదులచే స్తుతించెను. ఇట్లు కశ్యపునిచే స్తుతించబడిన వాడై భాస్కరుడు తన తేజస్సును అన్ని దిక్కులకు వ్యాపింప చేయుచూ పద్మ పత్రము వంటి వర్ణము కలవాడై గర్భాండము నుండి బయల్వెడలెను. అనంతరము సజల జల ధ్వనితో అశరీర వాణి ఆకాశము నుండి మునివరుడగు కశ్యపునితో ఇట్లు చెప్పెను. “ఓ మునివరా! ఈ అండమును చంపుదువా” అని పలికితివి. ఈ కారణమున నీ పుత్రుడు “మార్తాండు”డని పిలువ బడును. “ఈ విభుడు ప్రపంచమున సూర్యుని కార్యములు చేయును. మరియు యజ్ఞ భాగాపహరు లైన దేవ శత్రువులగు అసురులను ఇతడే నాశనము చేయును.” అని పలికెను.
దేవా నిశమ్యేతి వచో గగనా త్సముపాగామన్ పహర్ష మతులం యాతా దానవాశ్చ హృతౌజనః తతో యుద్ధాయ దైతేయా నాజుహావ శతక్రతుః సహా దేవై ర్ముదా యుక్తో దానవాశ్చ సమభ్యయుః తేషాం యుద్ధ మాభూ ద్ఘోరందేవానా మసురైః సహ శస్త్రాస్త్ర దీప్తి సందీప్తం సమస్త భువనాంతరమ్ తస్మి న్ముద్దే భాగవతా మార్తణ్డేన నిరీక్షితాః తేజసా దహ్యమానాస్తే భస్మీభూతా మహాసురాః తతః సుహర్ష మతులం ప్రాప్తాః సర్వే దివౌకసః తుష్ణువు స్తేజసాం యోనిం మార్తండ మదితిం తథా
ఆకాశవాణి యొక్క ఈ వాక్యములను వినిన దేవగణాలు హర్షముతో ఆకాశము నుండి వచ్చిరి. దానవ గణాలు తేజో విహీనులైరి. తదనంతరము దేవతా సహితుడైన ఇంద్రుడు దైత్యులను యుద్ధమునకు పిలిచెను. ప్రసన్న చిత్తులై దానవ గణాలు, దేవ గణాలతో పోరునకు తలపడిరి. ఆ సమయమున అసురులతో దేవతలకు ఘోర యుద్ధము జరుగ సాగెను. భువనాంతరము లన్నియు దేవాసురుల యొక్క అస్త్ర శస్త్రాదుల కాంతిచే దీప్తి వంతము లయ్యెను. ఆ యుద్ధమున బీకర రూపులైన అసుర గణాలు భగవానుడగు మార్తాండ దేవుని చూచుట తోనే, మరియు ఆయన తేజస్సు శరీరమును తాకుట తోనే, దగ్ధ మగుచూ భస్మమై పోయిరి. అప్పుడు దేవతలు హర్షాతిరేకములతో, పులకిత శరీరులై సంపూర్ణ తేజః స్వరూపుడైన మార్తాండ దేవుని, తల్లి యగు అదితీ దేవిని స్తుతించిరి.
స్వాధికారం స్తథా ప్రాప్తౌ యజ్ఞభాగాంశ్చ పూర్వవత్ భగవా నపి మార్తణ్డః స్వాధికార మథాకరోత్ కదంబ పుష్పవ ద్భాస్వా నధ శ్చోర్ద్యం చ రస్మిభిః వ్భత్తాగ్నిపిండ సదృశో దద్రే నాతి స్ఫుర ద్వపుః
దేవతలు పూర్వము వలె తిరిగి తమ అధికారములను, యజ్ఞ భాగములను పొందిరి. మరియు సూర్య భగవానుడును స్వాధికార కార్యములను చేయ సాగెను. అతడు కదంబ పుష్పము వలె క్రింద పైన వెలుగు చున్న కిరణములచే దీప్తి మంతుడై గోళాకారమగు అగ్ని గుండము వలె కన్పించ సాగెను. మరియు నతడు స్వల్పమగు కాంతి గల శరీరమును ధరించెను.
Summary of chapter 102 of the Mārkandeya Mahā Purana is as follows:
The supreme majesty, light, and spiritual glory of Sūryadeva are celebrated as the visible soul of the universe. Sūryadeva is extolled as the embodiment of the Trimūrti—Brahmā in the morning, Vishṇu at noon, and Śiva in the evening—sustaining all life through His radiant rays.