మార్కండేయ మహా పురాణము
64 - స్వారోచిష మన్వంతర కథ సమాప్తి
మార్కండేయుడు:
తతః స్వరోచిషం నామ్నా ద్యుతిమంతం ప్రజాపతిమ్ మనుం చకార భగవాం స్తస్య మన్వంతరం శృణు తతాంతరే తు యే దేవా మునయ స్తత్సుతాశ్చ యే భూపాలాః క్రౌష్టుకే యే తాన్ గదత స్త్వం నిశామయ దేవాః పారావతా స్తత్రః తథైవ తుషితా ద్విజః స్వారోచిషేంతరే చేంద్రో విపశ్చిదితి విశ్రుతః ఊర్జస్తంబ స్తథా ప్రాణో దత్తోలి రృషభ స్తథా నిశ్చర శ్చార్వ వీరశ్చ తత్ర సప్తవర్షయో భవన్ చైత్ర కింపురుషా ద్యాశ్చ సుతా స్తస్య మహాత్మనః సప్తాస న్సుమహావీర్యాః పృథివీ పరిపాలకాః
మార్కండేయుడు:
అనంతరము భగవానుడు, ద్యుతిమానుడు లేక స్వారోచిషుడు అను పేరు గల ప్రజాపతిని మనువు చేసెను. అతని మన్వంతరమును వినుము. ఓ క్రౌష్టుకీ! ఆ స్వారోచిష మన్వంతర మందు ఏ దేవతలు, మునులు, మరియు మను పుత్రులు, భూపాల గణాలు ఉండిరో, వారిని గురించి వర్ణించెదను. అదంతయు నా వలన నీవు వినుము. ఓ ద్విజుడా! ఆ స్వారోచిష మన్వంతర మందు దేవ గణాలు, పారావతులు, యుతుషితులు అను పేర్లతో మరియు ఇంద్రుడు విపశ్చితుడను పేరుతో విఖ్యాతి పొంది ఊర్జస్తంబ, ప్రాణ, దత్త అలి, ఋషభ, నిశ్చర, అర్వ వీరులు అను పేర్లతో విఖ్యాతి చెందిన సప్తర్షులు ఉండిరి. మహాత్ముడగు స్వారోచిష మనువునకు చైత్ర, కింపురుషాది మహా వీర్యవంతులగు ఏడుగురు పుత్రులు భూపాలకులుగా నుండిరి.
తస్య మన్వంతరం యావ త్తావ త్తద్వంశ విస్తరే భుక్తేయ మవని స్సర్వా ద్వితీయం వై తదనంతరమ్ స్వరోచిషస్తు చరితం జన్మ స్వారోచిషస్య చ నిశమ్య మున్చతే పాపైః శ్రద్ధదానో హి మానవః
ఎప్పటి వరకు అతని మన్వంతరము ఉండెనో, అప్పటి వరకు అతని వంశ మందలి రాజు లందరు భూమిని అనుభవించిరి. మన్వంతరము లందు స్వారోచిష మన్వంతరము రెండవది. ఈ స్వరోచి చరిత్ర మరియు స్వారోచిష మనువు జన్మమును శ్రద్ధాసక్తులతో వినిన మానవులు పాపముల నుండి విముక్తు లగుదురు.
Summary of chapter 64 of the Mārkandeya Mahā Purana is as follows:
The narrative details the heroic deeds of Svarochis as he subdues demonic forces and establishes peace across his kingdom. His righteous governance and performance of grand Vedic sacrifices ensure prosperity and spiritual harmony throughout the realm.