మార్కండేయ మహా పురాణము
43 - బ్రహ్మాయుః ప్రమాణ కథనమ్
క్రౌష్టుకి:
భగవంత్స్వండ సంభూతి ర్యథావ త్కథితా మమ
బ్రహ్మాండే బ్రాహ్మణో జన్మ తథా చోక్తం మహాత్మనః
ఏత దిచ్చామ్యహం శ్రోతుం త్వత్తో భ్రుగు కులోద్బవః
యదా న సృష్టిర్భూతానా మస్తికిం ను న చాస్తివా
కాలేవై ప్రలయ స్యాంతే సర్వస్మి న్నుపసంహృతే
క్రౌష్టుకి:
హే భగవాన్! మీరు అండముల ఉత్పత్తి, బ్రహ్మాండ మందు మహాత్ముడగు బ్రహ్మ యొక్క జన్మము విధిగా వర్ణించితిరి. హే భ్రుగు వంశోద్భావా! ప్రళయాంత మందు సమస్త సంహారము జరిగిన పిమ్మట ఎప్పుడు సృష్టి యొక్క వెలుగు కొంచమైనను ఉండదో, ఆ తరువాత తిరిగి ఏ విధముగా భూత గణముల ఉత్పత్తి కలిగినది? ఇప్పుడు ఆ విషయమును విన వలెనని అభిలషించుచున్నాను.
మార్కండేయుడు:
యదా తు ప్రకృతౌ యాతి లయం విశ్వ మిదం జగత్
తదోచ్యతే ప్రాకృతోయం విద్వద్భిః ప్రతిసంచరః
స్వాత్మ న్యవస్ఠితే వ్యక్తే వికారే ప్రతి సంహృతే
ప్రకృతిః పురుషశ్చైవ సాధర్మ్యేణా వతిష్ఠతః
తదా తమశ్చ సత్వం చ సమత్వేన గుణౌ స్థితౌ
అనుద్రిక్తావనూనౌ చ ఓత ప్రోతౌ పరస్పరమ్
మార్కండేయుడు:
ఏ సమయ మందు ఈ విశ్వము ప్రకృతి యందు లీన మగునో, అప్పుడు విజ్ఞులు దానిని ప్రకృతి ప్రళయమని చెప్పిరి. ప్రకృతి ఆత్మ యందు స్థితి కలిగి యుండుటచే సంపూర్ణ సృష్టి పదార్థము సంహారమును పొందు చున్నది. ఏ సమయ మందు ప్రకృతి పురుషుని సాధర్మ్య మందు అవస్థితమై యుండునో, ఆ కాలమందు సత్త్వ, తమములను రెండు గుణములు సమభావ సహితముగా అధిష్టితమై యున్నవి. ఆ సమయ మందు వాటి యందు ఎవరికినీ ఏ విధముగాను వృద్ధి లేక నూతనత్త్వము విరాజిల్లదు. అవి రెండును పరస్పర సమ భావములతో కలిసి పోయి అధిష్టితమై యుండును.
తిలేషు వా యథా తైలం ఘృతం పయసి వా స్థితమ్
తథా తమసి సత్త్వే చ రజోప్యను సృతంస్థితమ్
ఉత్పత్తిర్ బ్రాహ్మణ్మో యావ దాయుర్వై ద్విపరార్తికమ్
తావద్దినం పరేశాస్య తత్సమా సంయమే నిశా
అష్టౌ యుగ సహస్రాణి అహోరాత్రం ప్రజాపతేః
అనేనైవ తు మానేన శతం బ్రహ్మాస జీవతి
పితామహ సతేనైవ విష్ణోర్మాసం విధీయతే
నిమేషార్దే న శంభోస్తు సహస్రాణి చతుర్దశ
వినశ్యంతి తథా విష్ణో రసంఖ్యాతాః పితామహాః
అహర్ముఖే ప్రబుద్దస్తు జగదాది రనాది మాన్
సర్వ హేతు రచింత్యాత్మా పరః కోన్యపర క్రియః
ప్రకృతిం పురుషం చైవ ప్రవిశ్యాశు జగత్పతిః
క్షోభయామాస యోగేన పరేణ పరమేశ్వరః
యథా మదో నవస్త్రీణాం యథా వా మాధవానిలః
అనుప్రవిష్టః క్షోభాయ తథాసౌ యోగ మూర్తిమాన్
నువ్వుల యందు తైలము మరియు పాల యందు ఘృతము వలె రజో గుణము కూడా సత్త్వతమో గుణముల యందు లీనమగుచు స్థిరముగా నుండును. సర్వేశ్వరుడగు బ్రహ్మ యొక్క పరమాయు యొక్క పరిమాణము ద్విపరార్థ పర్యంతము. బ్రహ్మ యొక్క పగలు పరిమాణము ఏ విధముగా నుండునో, రాత్రి కూడా అదే పరిమాణము కలిగి యుండును. (ఎనిమిది సహస్ర యుగములు ప్రజాపతికి ఒక పగలు ఒక రాత్రి యగును. ఈ పరిమాణమున బ్రహ్మ నూరు సంవత్సరములు జీవించును. ఇట్లు బ్రహ్మకు నూరు సంవత్సరములు గడచినచో విష్ణువు యొక్క స్థితికి ప్రమాణము. శివుని యొక్క అర్థ నిముష మందు పదు నాలుగు వేల విష్ణువులు కలిగెదరు. బ్రాహ్మలు ఎందఱో, దీనికి సంఖ్య లేదు. ఇది క్షేపకము.) అతడు జగత్తునకు మూలము అతనికి ముందు ఎవరూ లేరు. అతడు అందరి యొక్క కారణమునకు, అచింత్యాత్మకు, పరమేశ్వరునికి మరియు క్రియలకు అతీతుడు. అతడు జగత్పతి పరమ యోగ హేతువు. ప్రకృతి మరియు పురుషుల యందు ప్రవేశించి వారిని వ్యాకుల బెట్టును. మద గర్వము మరియు వసంత వాయువు ఏ విధముగా నవ యువతుల అంతస్సు నందు ప్రవేశించి వ్యాకులత కలుగ జేయునో, యోగ మూర్తి మంతుడగు బ్రహ్మ కూడా అదే విధముగా ప్రకృతి పురుషులకు వ్యాకులత కలుగ చేయును.
ప్రధానే క్షోభ్యమాణే తు స దేవో బ్రహ్మ సంజ్ఞితః
సముత్పన్నోండ కోశస్థో యథా తే కథితం మయా
స ఏవం క్షోభకః పూర్వం స క్షోభ్యః ప్రకృతేః పతిః
స సంకోచ వికాసాభ్యాం ప్రధానత్వేపి సంస్థితః
ఉత్సన్నో జగద్యోని రగుణోపి రజో గుణమ్
భుంజ న్ప్రవర్తతే సర్గే బ్రహ్మత్వం సముపాశ్రితః
బ్రహ్మత్వే స ప్రజాః సృష్ట్వా తతః సత్వాతిరేకవాన్
విష్ణుత్వ మేత్య ధర్మేణ కురుతే పరిపాలనమ్
తత స్తమోగుణోద్రిక్తో రుద్రత్వే చాఖిలం జగత్
ఉపసంహృత్య వైశేతే త్రైలోక్యం త్రిగుణో గుణః
ప్రకృతి క్షోభిత మగుటచే ఆ బ్రహ్మ అను పేరు గల దేవత అండకోశ మందు ప్రవేశించి సముత్పన్న మగును అని నేను నీకు చెప్పితిని. అతడు మొదట కలత బెట్టును. తిరిగి ప్రకృతి యొక్క పతి అయి స్వయంగా కలతను బొందును. ఈ విధముగా సంకోచ, వికాసముల ద్వారా అతడు ప్రకృతి రూప మందు విరాజిల్లును. అతడు జగత్ యోని నిర్గుణ మయినప్పటికి రజో గుణమును అవలంభించి బ్రహ్మ యొక్క రూపముతో ఉత్పన్నమై సృష్టిని చేయుటకు ఉద్యుక్తు డగును. ఆ బ్రహ్మ రూపముచే ప్రజా సృష్టి పూర్వకముగ సత్త్వగుణ మదిక మగుటచే విష్ణు రూపమును ధరించి న్యాయాను సారముగ ప్రజా పరిపాలన చేయును. అనంతర మందు తమోగుణ మదిక మగుటచే రుద్ర రూపమును గ్రహించి సంపూర్ణ విశ్వమును సంహారము చేయుచూ శయనించును. ఏ విధముగా అతడు నిర్గుణుడై నప్పటికి పైన చెప్పిన మూడు కాలము లందూ మూడు గుణములను భజించెను.
యథా ప్రాగ్వ్యాపవః క్షేత్రీ పాలకో లావక స్తథా
తథా స సంజ్ఞా మాప్నోతి బ్రహ్మ విష్ణు హరాత్మికామ్
బ్రహ్మత్వే సృజతే లోకా నృద్రత్వే సంహరత్యపి
విష్ణుత్వే చాప్యుదాసీన స్తిస్రోవస్థాః స్వయం భువః
రజో బ్రహ్మా తమో రుద్రో విష్ణుః సత్వం జగత్పతిః
ఏత ఏవ త్రయోదేవా ఏత ఏవ త్రయోగుణాః
అన్యోన్యమిథునా హ్యేతే అన్యోన్యాశ్రయిణ స్తథా
క్షణం వియోగో న హ్యేషాం న త్యజంతి పరస్పరమ్
ఏవం బ్రహ్మా జగత్పూర్వో దేవ దేవాశ్చ తుర్ముఖః
రజో గుణం సమాశిత్య స్రష్టృత్వే స వ్యవస్థితః
అందరి యొక్క జనన క్షేత్రము, సర్వవ్యాపి యగు ఆ ఈశ్వరుడు ఈ విధముగా సృజనము, రక్షణము మరియు సంహారము చేయుటచే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పేర్లు ప్రాప్తించినవి. ఆ బ్రహ్మత్వములో సంపూర్ణ లోకముల ఉత్పత్తి రుద్రత్వములో సంహారము, విష్ణుత్వములో ఉదాసీనుడు అయి పాలించెను. స్వయంభువునకు ఈ మూడు అవస్థలు కలిగినవి. బ్రహ్మయే సాక్షాత్తు రజో గుణుడు మరియు జగత్పతి విష్ణువు సత్త్వ గుణుడు. ఈ విధముగా రుద్రుడు తమో గుణుడు. ఈ ముగ్గురు దేవతలు మూడు గుణము లందు పరస్పరము నిపుణ భావముతో పరస్పరమును ఆశ్రయించు కొనుచు విరాజిల్లు చుందురు. క్షణ మాత్రము కూడా వీరికి వియోగము ఉండదు మరియు ముహూర్త మాత్రమున కూడా ఎవరు ఎవరినీ పరి త్యజించరు. ఈ విధముగా జగత్తునకు ఆది దేవ దేవుడు చతురాననుడు రజో గుణమును అవలంభించి అందరిని సృష్టించుట యందు ప్రవృత్తు డగును.
హిరణ్య గర్భో దేవాది రనాది రుపచారతః
భూపద్మ కర్ణికాసంస్థో బ్రహ్మాగ్రే సమజాయత
తస్య వర్ష శతం త్వేకం పర మాయు ర్మహాత్మనః
బ్రాహ్మ్యేణైవ హి మానేన తస్య సంఖ్యం నిబోధ మే
నిమేషైర్దశభిః కాష్ఠా ముహూర్తం త్రిశదేవ తాః
అహోరాత్రం ముహూర్తానాం నౄణాం త్రింశత్తు వై స్మృతమ్
అహోరాత్రైశ్చ త్రింశద్బిః పక్షౌ ద్వౌ మాస ఉచ్యతే
తైః షడ్బి రయనం వర్షం ద్వేయనే దక్షిణోత్తరే
తద్దేవానా మహోరాత్రం దినం తత్రోత్తరాయణమ్
హిరణ్య గర్భుడు ఆది దేవుడు మరియు ఒక విధముగా అనాది. భూ పద్మ కర్ణిక యొక్క అవలంబన పూర్వకముగా అందరి కంటే ముందుగ జన్మించెను. ఆ మహాత్ముని యొక్క పరమాయువు సంఖ్య బ్రహ్మ మానముచే శత వర్ష నిరూపితము వాని సంఖ్య చెప్పెదను వినుము. పదునైదు నిమేషముల కాలము ఒక కాష్టము ముప్పది కాష్టములు ఒక కళ. ముప్పది కళలు ఒక ముహూర్తము మరియు ముప్పది ముహూర్తములు మానవునికి ఒక పగలు, ఒక రాత్రి కాల మగును. ముప్పది దివా రాత్రములు, లేక రెండు పక్షములు ఒక మాసము అగును. ఆరు మాసములు ఒక ఆయనము. రెండు ఆయనములు ఒక సంవత్సరము అగును. ఆయనములు రెండు విధములు. దక్షిణాయానము, ఉత్తరాయనము. ఈ విధముగా మానవునికి ఒక సంవత్సర కాలము. దేవతలకు ఒక అహో రాత్రము అగును. ఇందు ఉత్తరాయనము వారికి ఒక పగలు అగును.
దివ్యైర్వర్ష సహస్రైస్తు కృతత్రేతాది సంజ్ఞితామ్
చతుర్యుగం ద్వాదశభి స్త ద్విభాగం శృణుష్వ మే
చత్వారి తు సహస్రాణి వర్షాణాం కృత ముచ్యతే
శతాని సంధ్యా చత్వారి సంధ్యాంశశ్చ తథావిథిః
త్రేతా త్రీణి సహస్రాణి దివ్యాబ్దానాం శతత్రయమ్
తస్య సంధ్యా సమాఖ్యాతా సంధ్యాంశశ్చ తథావిధిః
ద్వాపరం దవే సహస్రే తు వర్షాణాం ద్వేశతే తథా
తస్య సంధ్యా సమాఖ్యాతా దవే శతాబ్దే తదంశకః
కలిః సహస్రం దివ్యానా మబ్దానాం ద్విజసత్తమః
సంధ్యా స ద్యాంశకశ్చైవ శతకౌ సముదాహృతౌ
దివ్య పరిమాణముచే వేయి సంవత్సరములు, సత్యాది నాలుగు యుగము లగును. ఆ నాలుగు యుగముల యొక్క విభాగములను గురించి చెప్పెదను వినుము. దివ్య మగు నాలుగు వేల సంవత్సరములు సత్య యుగ మగును. నాలుగు వందల సంవత్సరములు దానికి సంధ్యా మరియు నాలుగు వందల సంవత్సరములు సంధ్యాంశము అగును. మూడు వేల దివ్య సంవత్సరములు త్రేతా యుగ మగును. దేవ మానము యొక్క మూడు వందల సంవత్సరములు దానికి సంధ్యా మరియు మూడు వందల సంవత్సరములు సంధ్యాంశము అగును. ద్వాపర యుగము యొక్క పరిమాణము రెండు వేల దివ్య సంవత్సరములు. రెండు వందల దివ్య సంవత్సరములు దానికి సంధ్యా మరియు రెండు వందల సంవత్సరములు సంధ్యాంశము అగును. ఓ ముని సత్తమా! ఒక వేయి దివ్య సంవత్సరములు కలి యుగ మగును. మరియు దీనికి సంధ్యా, సంధ్యాంశము రెండింటికి ఒక రెండు వందల దివ్య సంవత్సరములు.
ఏషా ద్వాదశ సాహస్రీ యుగాఖ్యా కవిభిః కృతా
ఏత త్సహస్ర గుణిత మహో బ్రాహ్మ ముదాహృతమ్
బ్రాహ్మణో దివసే బ్రహ్మ న్మనవః స్యు శ్చతుర్దళ
భవంతి భాగశ స్తేషాం సహస్రం తద్విభజ్యతే
దేవాః సప్తర్షయః సేంద్రా మను స్తత్సూనవో నృపాః
మనునా సహ సృజ్యంతే సంహ్రియంతే చ పూర్వవత్
చతుర్యుగానాం సంఖ్యాతా సాధికా హ్యేక సప్తతిః
మన్వంతరం తస్య సంఖ్యాం మానుషాబ్దైర్నిబోధ మే
త్రింశత్కోట్యస్తు సంపూర్ణాః సంఖ్యాతా సంఖ్యయా ద్విజ
సప్త షష్ఠి స్తథాన్యాని నియుతాని చ సంఖ్యయా
కవులు ఈ విధముగా నాలుగు యుగముల యొక్క పరిమాణమును పది రెండు వేల దివ్య సంవత్సరములలో విభజించిరి. దీనికి సహస్ర గుణితము చేయుటచే ఏమగునో. అదే బ్రహ్మకు ఒక దినముగా నిరూపిత మగును. హే బ్రాహ్మన్! బ్రహ్మ యొక్క ఈ ఒక్క దిన మందు విభాగముగ పదునాలుగు మనువులు ఉత్పన్న మైనచో, వాని యొక్క సహస్ర విభాగములు కల్పిత మైనవి. ఇంద్రాది దేవతలు, సప్తర్షి గణాలు, మను పుత్రులు, నృపతి గణాలు, మన్వంతర సహితముగా ఉత్పన్న మగును. మరియు పూర్వము వలెనే సంహారమును పొందును. డెబ్బది ఒకటి చతుర్యుగములు ఒక మన్వంతర మగును. మనుష్య మానాను సారముగ దాని సంఖ్యను చెప్పెదను వినుము. సంపూర్ణమగు ముప్పది కోట్ల అరువది ఏడు లక్షల ఇరువది వేల మనుష్యుల సంవత్సరములే ఒక మన్వంతరము యొక్క పరిమాణము. ఇప్పుడు దివ్య మానము యొక్క సంవత్సరాను సారము వినుము.
వింశతిశ్చ సహస్రాణి కాలోయం సాధికం వినా
ఏత న్మన్వంతరం ప్రోక్తం దివ్యైర్వర్షై ర్నిబోధ మే
అష్టౌ వర్ష సహస్రాణి దివ్యయాసంఖ్యయా యుతమ్
ద్విపంచా శత్తథాన్యాని సహస్రాణ్యధికాని తు
చతుర్దశ గుణో హ్యేష కాలో బ్రాహ్మ్య మహః స్మృతమ్
తస్యాంతే ప్రలయః ప్రోక్తో బ్రాహ్మో నైమిత్తికో బుధైః
భూర్లోకోథ భువర్లోకః స్వర్లోక స్తన్నివాసినః
తదా వినాశ మాయాంతి మహర్లోకశ్చ తిష్ఠతి
తద్వాసినోపి తాపేన జనలోకం ప్రయాంతే వై
ఏకార్ణవే చ త్రైలోక్యే బ్రహ్మా స్వపితి వైనిశి
ఇరువది వేల దివ్య సంవత్సరములు ఒక మన్వంతరముగా చెప్ప బడినది. ఎనిమిది లక్షల యాబది రెండు వేల దివ్య వర్షములు ఒక మన్వంతర ముండును. ఈ కాలమును చతుర్దశ గుణితము చేసినచో 1,92,28000 దివ్య సంవత్సరములు బ్రహ్మకు ఒక దిన మగును. హే బ్రహ్మన్! ఈ బ్రహ్మ దినము యొక్క అంత మందు ఏ ప్రళయము సంఘటిత మగునో, దానిని పండిత గణాలు నైమిత్తిక ప్రళయమని చెప్పుదురు. భూర్లోక, భువర్లోక స్వర్గ లోక నివాసులు ఈ లోకముల యొక్క నాశనము సంభవించి నపుడు మహర్లోకమునకు వెళ్ళుదురు. మహర్లోక నివాసులు ప్రళయ కాల మందు జనించిన తాపముచే జనలోక మందు చేరు కొనెదరు. అప్పుడు త్రిభువనములు ఏక మగును. బ్రహ్మ రాత్రి కాల మందు శయనించును.
తత్ర్పమాణైవ సా రాత్రి స్తద తే సృజ్యతే పునః
ఏవం తు బ్రహ్మణో వర్ష మేకం వర్ష శతంతు తత్
శతం హి తస్య వర్షాణాం పర మిత్యభిదీయతే
పంచాశద్బి స్తథా వర్షైః పర్యార్థమితి కీర్త్యతే
ఏక మస్య మరార్థం తు వ్యతీతం ద్విజ సత్తమః
యస్యాంతే భూన్మహా కల్పః పాద్మమ ఇత్యభి విశ్రుతః
ద్వితీయస్య పరార్థస్య వర్తమానస్య వై ద్విజ
వరాహ ఇతి కల్పోయం ప్రథమః పరికల్పితః
పగలు పరిమాణము ఎట్లుండునో బ్రహ్మకు రాత్రి పరిమాణము కూడా అట్లే ఉండును. రాత్రి యొక్క అంత మందు తిరిగి సృష్టి కార్య మారంభ మగును. ఈ విధముగా మూడు వందల అరువది దినములు బ్రహ్మకు ఒక సంవత్సర మగును. ఒక నూరు సంవత్సరములను ‘పర’ మని అందురు. ఈ విధముగా ఏబది సంవత్సరములు ఒక పరార్ధ మగును. ఓ ద్విజోత్తమా! ఈ విధముగా బ్రహ్మ యొక్క ఒక పరార్ధము గడచి పోయినది దాని యొక్క అంత మందు పాద్మమను పేరు గల మహా కల్పము ఉపస్థిత మైనది. ఓ ద్విజుడా! ఇప్పుడు పరార్ధము జరుగు చున్నది. దీనిని వరాహ కల్పమని అందురు. ఇదే ప్రధమ కల్పమని చెప్పబడి పరికల్పితమైనది.
Summary of chapter 43 of the Mārkandeya Mahā Purana is as follows:
The text describes various inauspicious physical and subtle omens that signal the approaching departure of the soul from the body. Recognizing these signs allows a wise yogi to prepare calmly for death, withdraw consciousness from material limbs, and fix the mind upon Bhagavān to attain liberation at the moment of transition.