మార్కండేయ మహా పురాణము
95 - రుచి వివాహము, రౌచ్య మను జననము
మార్కండేయుడు:
తత స్తస్మా న్నదీమధ్యా త్సముత్త స్థౌ మనోరమా ప్రమోదా నామ తన్వంగీ తత్సమీపే వరాప్సరాః సా చోవాచ మహాత్మానం రుచిం సుమధురాక్షరమ్ ప్రశ్రయావనతా సుభ్రూః ప్రమ్లోచా వై వరాప్సరా అతీవ రూపిణీ కన్యా మత్సుతా తపతాంవరః జాతా వరుణ పుత్రేణ పుష్కరేణ మహాత్మనా తాం గృహాణ మయా దత్తాం భార్యార్థే వరవర్ణినీమ్ మను ర్మహామతి స్తస్యాం సముత్పత్స్యతి తే సుతః
మార్కండేయుడు:
ఆ తరువాత ఆ నది నుండి “ప్రమ్లోచా” యను పేరుగల మనోహర, ఉత్తమ అప్సరా రమణి వెలుపలకు వచ్చి రుచి యోక్క సమీపమునకు వెళ్ళెను. తిరిగి అప్సరా శ్రేష్ఠ యగు ప్రమ్లోచ అను సుందరి వినయముతో, నమ్రతతో మహాత్ముడగు రుచి యొక్క సమీపమున మధుర వచనములతో ఇట్లు పలికెను. ఓ తాపస శ్రేష్టా! వారుణ పుత్రుడైన పుష్కరుడను మహాత్ముని ద్వారా నాకు ఉత్పన్న మైనదియు అత్యంత రూపవతి యగు ఒక కన్య ఉన్నది. నేను ఆ వరవర్దినిని ఇచ్చు చున్నాను. తమరు ఆమెను భార్యగా గ్రహింపుడు. ఆమె గర్భము నుండి మీకు మన్వంతరాధిపతి యగు పుత్రుడు జన్మించును.
మార్కండేయుడు:
తథేతి తేన సాప్యుక్తా తస్మా త్తోయా ద్వాపుష్మతీమ్ ఉజ్జహార తతః కన్యాం మాలినీం వామ నామతః
మార్కండేయుడు:
ఎప్పుడు రుచి “అట్లే యగు గాక” అని చెప్పెనో, అప్పుడు ఆ ప్రమ్లోచ జలము నుండి “మాలిని”అను కన్యను తీసుకొని వచ్చెను.
నద్యాశ్చ పులినే తస్మి న్స రుచి ర్ముని సత్తమః జగ్రాహ పాణిం విధిప త్సమానాయ్య మహామునీన్ తస్యాం తస్య సుతో జజ్ఞే మహావీర్యో మహామతిః రౌచ్యో భవ త్పితు ర్నామా ఖ్యాతోత్ర వసుధాతలే తస్య మన్వన్తరే దేవా స్తథా సప్తర్షయశ్చ యే తనయాశ్చ నృపాశ్చైవ తే సమ్య త్కథితా స్తవ ధర్మవృద్ధి స్తథారోగ్యం ధనధాన్య సుతోద్భవః నృణాం భావ త్యసందిగ్ధ మస్మిన్ మన్వంతరే శ్రుతే పితృ స్తవం తథా శ్రుత్వా పితౄణాం చ తథాగణాన్ సర్వా న్కామా నవాప్నోతి తత్ప్రసాదా న్మహామునే
మునివరుడగు రుచి ఆ నది ఒడ్డున మహా మునులను రప్పించి విధి విదానముగా పాణి గ్రహణము చేసెను. ఆమె గర్భము నుండి మహాత్ముడగు రుచికి మహా వీర్యవంతుడు, మహామతి యగు ఒక పుత్రుడు జన్మించెను. ఆ పుత్రుడు తండ్రి పేరు ననుసరించి రౌత్యుడను పేరుచే వసుధాతల మందు విఖ్యాతి చెందెను. అతని మన్వంతరము నందలి దేవతలు, సప్తర్షులు, మరియు అతని యొక్క సమస్త రాజ పుత్రుల విషయములను నీకు పూర్వము చెప్పితిని. ఈ మన్వంతర కథను వినుటచే మనుష్యులకు ధర్మవృద్ధి ,ఆరోగ్యము, ధన ధాన్యములు, మరియు పుత్రోత్పత్తి కలుగును. ఓ మహామునీ! పితరులను స్తుతించుట వలన మరియు నీ పితృ గణాలను శ్రవణము చేయుట వలనను వారి ప్రసాదముచే సంపూర్ణమగు కోరికలు సిద్ధించును.
Summary of chapter 95 of the Mārkandeya Mahā Purana is as follows:
The narrative introduces Prajāpati Ruci, a noble sage who embraced strict celibacy and forest seclusion. His departed ancestors, the Pitṛs, appeared before him and instructed him to marry and perform domestic sacrifices, explaining that the householder life is essential for fulfilling ancestral debts and maintaining cosmic order.