మార్కండేయ మహా పురాణము
76 - వైవస్వత మన్వంతర వృత్తాంతము
మార్కండేయుడు:
ఆదిత్యా వసవో రుద్రాః సాధ్యాః విశ్వే మరుద్గణాః భృగవోంగిరస శ్చాష్టౌ యత్ర దేవగణాః స్మృతాః ఆదిత్యా వసవో రుద్రా విజ్ఞేయాః కశ్యపాత్మజాః సాధ్యాశ్చ వసవో విశ్వే ధర్మ పుత్ర గణా స్త్రయః భృగోస్తు భృగవో దేవాః పుత్రా హ్యంగిరసః సుతాః ఏష సర్గశ్చ మారీచో విజ్ఞేయః సాంప్రతాధిపః ఉర్జస్వీ నామ చైవేంద్రో మహాత్మా యజ్ఞభాగభుక్ అతీతానాగతా యే చ వర్తంతే సాంప్రతం చ యే సర్వే తే త్రిదశేంద్రాస్తు విజ్ఞేయా స్తుల్య లక్షణాః సహస్రాక్షా కులిశినః సర్వ ఏవ పురందరాః
మార్కండేయుడు:
ఆదిత్య, వసు, రుద్ర, సాధ్య, విశ్వ, మరుత, భృగు, అంగీరసులను ఈ ఎనమండుగురు ఈ మన్వంతర మందు దేవతలు. వీరిలో ఆదిత్యాలు, వసు, రుద్ర గణాలు కష్యపుని సంతానము. సాధ్య, విశ్వ, మరుత గణాలు అను ఈ మూడు గణాలు ధర్ముని పుత్రులు. భృగు గణ దేవతలు భృగుని పుత్రులు. అంగీరో గణాలు అంగీరసుని పుత్రులు. ఓ ద్విజుడా! ఈ సర్గమును ఇప్పుడు మారీచ సర్గమని ఎరుగ వలెను. ఈ మన్వంతర మందు ఊర్జస్వి యను మహాత్ముడు ఇంద్రుడై యజ్ఞఫల భోగుడయ్యెను. పూర్వము ఇంద్రుడుగ నున్న వారు, తరువాత ఎవరు ఇంద్రుడగునో, ఇప్పుడు ఎవరు ఇంద్రత్వములో నున్నారో, వీరందరూ దేవేంద్రుని వలెనె సమ లక్షణము గల వారుగా విఖ్యాతి చెందిరి. అందరూ సహస్రాక్షులు, వజ్రధారులు, మరియు పురంధరులు.
మఘవంతో వృషాః సర్వే శృంగిణో గజగామినః తే శతక్రతవః సర్వే భూతాభిభవ తేజసః ధర్మాద్యైః కారణైః శుద్ధై రాధిపత్య గుణాన్వితాః భూత భవ్య భవన్నాథాః శృణు చైత్రత్రయం ద్విజః భూర్లోకోయం స్మృతా భూమి రంతరిక్షం దివః స్మృతమ్ దివ్యాఖ్యశ్చ తథా స్వర్గ స్త్రైలోక్య మితి గద్యతే అత్రి శ్చైవ వసిష్టశ్చ కస్యపశ్చ మహానృషిః గౌతమశ్చ భరద్వాజో విశ్వామిత్రోథ కౌశికః తథైవ పుత్రో భగవా నృచీకస్య మహాత్మనః జమదగ్నిస్తు సప్తైతే మునయోత్ర తథాంతరే
అందరు ఇంద్రులు, వృషభ శృంగధారులు, మరియు గజగాములు వారందరూ శత యజ్ఞకారులు భూత పరాభవ కారులు, తేజో యుక్తులు. ఓ ద్విజుడా! వారందరూ పరిశుద్ద ధర్మాదులకు కారణమగుటచే ఆధిపత్య గుణ యుక్తులు, మరియు భూత, భవిష్యత్, వర్తమానములకు అధిపతులు. ఇప్పుడు త్రైలోక్యముల విభాగమును వినుము. ఈ లోకమును భూర్లోకమనీ, అంతరిక్షమును ‘దివ్య లోక’ మని స్వర్గమును ‘దివ్యాఖ్య’ మని అందురు. ఈ మూడింటిని త్రిలోకములని చెప్పిరి. అత్రి, వశిష్ఠ, కశ్యప, గౌతమ, భరద్వాజ, కుశిక నందనుడగు విశ్వామిత్రుడు మరియు మహాత్ముడు, భగవానుడు, ఋచీక నందనుడగు జమదగ్ని, ఈ ఏడుగురు మునులు ఈ మన్వంతరమున సప్తర్షులుగా నుండిరి.
ఇక్ష్వాక్షు ర్నాభగ శ్చైవ ధృష్టః శర్యాతి రేవ చ నరిష్యంతశ్చ విఖ్యాతో నాభాగో దిష్ట ఏవ చ కరూషశ్చ పృషధ్రశ్చ వసుమాం ల్లోక విశ్రుతః మనో ర్త్వైవస్వత స్త్యైతే నవ పుత్రాః ప్రకీర్తితాః వైవస్వత మిదం బ్రహ్మ న్కథితం తే మయాంతరమ్ అస్మిఞ్ ఛృతే నరః సద్యః పఠితే చైవ సత్తమః ముచ్యతే పాతకైః సర్వైః పుణ్యం చ మహాదశ్నుతే
ఇక్ష్వాక్షు, నాభాగ ధృష్ట శర్యాతి, నరిష్యంత, నాభాగ, దిష్ట, కరూశ పృషధ్రులు అను ఈ తొమ్మిది మంది వైవస్వత మనువు యొక్క దీప్తి మంతులు జగద్విఖ్యాతులగు పుత్రులు. హే బ్రాహ్మన్! నేను ఈ వైవస్వత మంవంతరమును నీకు వర్ణించితిని. ఓ మునిశ్రేష్టా! దీనిని వినిన వారు లేక చదివిన వారు వెంటనే అన్ని పాపములనుండి విడువబడి పుణ్యము ననుభవింతురు.
Summary of chapter 76 of the Mārkandeya Mahā Purana is as follows:
The Sixth Manvantara unfolds under the reign of Cākshusha Manu, born from the eye of Svayambhū Brahmā. The text details the grand lineages descended from Cākshusha, culminating in the birth of the great King Pṛthu who leveled the Earth and milked her resources for human welfare.