మార్కండేయ మహా పురాణము
90 - దేవీ మాహాత్మ్యము ముగింపు: సురధ వైశ్యులకు వర ప్రధానము
ఋషి:
ఏతత్తే కథితం భూప! దేవీ మహాత్మ్య ముత్తమమ్ ఏవం ప్రభావా సా దేవీ యయేదం ధార్యతే జగత్ విద్యా తథైవ క్రియతే భగవ ద్విష్ణు మాయయా,
తథా త్వమేష వైశ్యశ్చ తథైవాన్యే వివేకినః మోహ్యంతే మోహితాశ్చైవ మోహమేష్యంతి చాపరే తా ముపైహి మహా రాజ! శరణం పరమేశ్వరీమ్ ఆరాదితా సాయి వ నృణాం భోగాస్వర్గాపవర్గదా
ఋషి:
ఓ రాజా! మీకు నేను ఈ ఉత్తమమగు దేవీ మహాత్మ్యమును చెప్పితిని. ఎవరు ఈ జగత్తును ధరించి యున్నదో, ఆమె ప్రభావము ఈ విధముగా ఉన్నది. ఆ భగవతీ విష్ణు మాయయే తత్త్వ జ్ఞానమును ఇచ్చు చున్నది. ఆమెయే నిన్ను, ఈ వైశ్యుణ్ణి మరియు అన్యాన్య వివేక పురుషులను కూడా మోహితులను చేయు చున్నది. మరియు ఆమె ద్వారానే భవిష్యత్ ప్రాణులు మొహితులగుదురు. ఓ మహారాజా! ఆ భగవతియగు మహేశ్వరినే శరణు వేడుము. ఆమెను ఆరాధించుట చేతనే ఆమె మనుష్యులకు భోగములు స్వర్గములు మరియు ముక్తిని ప్రసాదించు చున్నది.
మార్కండేయుడు:
ఇతి తస్య వచః శ్రుత్వా సురథః స నరాధిపః ప్రణిపత్య మహాభాగం తమృషిం సంశితవ్రతమ్ నిర్విణ్ణోతి మమత్వేన రాజ్యాపహరణేన చ జగామ సద్య స్తపాసే స చ వైశ్యో మహామునేః
మార్కండేయుడు:
ఓ మహా మునీ! అతిశయమగు మమత మరియు రాజ్యము హరించి పోవుటచే అత్యంత దుఃఖితుడగు ఆ నరాధిపుడు సురథుడు ఋషి యొక్క ఈ వచనములు విని కఠోర వ్రత సంపన్నుడగు ఆ ఋషి మహాభాగునకు నమస్కరించి వెంటనే తపస్సు కొరకు పోయెను. మరియు ఆ వైశ్యుడు కూడా ఇదే విధముగా తపస్సు చేయుటకు పోయెను.
సందర్శనార్థ మంబాయా నదీపులిన సంస్థితః సచ వైశ్య స్తప స్తేపే దేవీ సూక్తం పఠం జపన్ తౌ తస్మిన్ పులినే దేవ్యాః కృత్వా మూర్తిం మహీమయీమ్ అర్హణాం చ చక్రతు స్తస్యాః పుష్ప ధూపాగ్ని తర్పణైః నిరాహారౌ యతాత్మానౌ తన్మనస్కౌ సమాహితౌ దదతు స్తౌ బలిం చైవ నిజగాత్రా సృగుక్షితమ్ ఏవం సమారాధయతో స్త్రిభి ర్వర్షై ర్యతాత్మనోః పరితుష్టా జగద్ధాత్రీ ప్రత్యక్షం ప్రాహ చండికా
ఆ రాజు మరియు వైశ్యుడు నది ఒడ్డున స్థితులై భగవతి యొక్క ధర్మనార్థము ఉత్క్రృష్టమగు దేవీ సూక్తమును జపించుచు తపస్సు నందు నిమగ్నులైరి. వైశ్యుడు మరియు రాజు ఆ నది ఒడ్డున మృత్తికతో దేవీ విగ్రహమును చేసి పుష్ప, ధూప, హోమ తర్పనాదులచే ఆమెను పూజించిరి. వారు నియమితాహారములతో ఆమె యందు మనస్సు లగ్నము చేసి సావధానులై తమ తమ దేహముల నుండి రక్తము తీసి బలి ఇచ్చిరి. ఈ విధముగా ఇంద్రియ నిగ్రహులై మూడు సంవత్సరములు ఆరాధించుటచే జగద్ధాత్రి యగు చండిక సంతుష్టురాలై వారికి ప్రత్యక్షమయి ఇట్లు పలికెను.
శ్రీదేవి:
యత్ ప్రార్థ్యతే త్వయా భూపః త్వయా చ కుల నందనః మత్త స్తత్ ప్రాప్యతాం సర్వం పరితుష్టా దదామి తత్
శ్రీదేవి:
సురధ వైశ్యులారా! మీరు దేనిని అర్థించితిరో, దానిని పొందుదురు గాక మీ తపస్సునకు సంతుష్టురాలనై మీ కోరికను ఇచ్చు చున్నాను.
మార్కండేయుడు:
తతో వన్రే నృపో రాజ్య మవిభ్రంశ గ్రజన్మని అత్రైవ చ నిజం రాజ్యం హతశత్రు బలం బలాత్ సోపి వైశ్య స్తతో జ్ఞానం వవ్రే నిర్విణ్ణ మానసః మమేత్యహ మితి ప్రాజ్ఞః సంగ విచ్యుతి కారకమ్
మార్కండేయుడు:
అనంతరము రాజు మరుసటి జన్మ మందు అఖండిత రాజ్యమును మరియు ఈ జన్మము నందు బలప్రకాశ పూర్వకముగా శత్రువులను వధించి తన రాజ్యమును తిరిగి పొంద వలెనని వారము అడిగెను. మరియు దుఃఖిత చిత్తుడు, బుద్ధిమంతుడు అగు ఆ వైశ్యుడు కూడా “ఇది నాది” మరియు “ఇది నేను” అనునట్టి ఈ విధమగు మోహమును నాశనము జ్ఞానము నడిగెను.
శ్రీదేవి:
స్వల్పై రహోభి ర్నృపతే స్వం రాజ్యం ప్రాప్స్యతే భవాన్ హత్వా రిపూ నస్ఖలితం తవ తత్ర భవిష్యతి మృతశ్చ భూయః సంప్రాప్య జన్మ దేవా ద్వివస్వతః సావర్ణికో నామ మనుర్భవా న్భువి భవిష్యతి వైశ్య వర్యః త్వయాస్మతో వారో యశ్చాభివాంచితః తం ప్రయచ్చామి సంసిద్ధ్యై తవ జ్ఞానం భవిష్యతి
శ్రీదేవి:
ఓ రాజా! నీవు కొద్ది దినములలోనే శత్రు కులములను నిర్మూలనము చేసి నీ రాజ్యమును పొందుదువు. ఆ తరువాత తిరిగి నీకు రాజ్యము నుండి భ్రష్టుడవగుట జరుగదు. మృతి పొందిన పిమ్మట సూర్య భగవానుని కుమారుడవై జన్మించి భూమి యందు సావర్ణియను పేరుతో ప్రసిద్ధుడవగు మనువు అగుదువు గాక. ఓ వైశ్య వ్రేష్టా! నీవు కూడా నా నుండి ఏ వరమును నీ సిద్ధి కొరకు ప్రార్థించితివో, దానిని నీకు ఇచ్చు చున్నాను. నీకు జ్ఞానము కలుగును గాక.
మార్కండేయుడు:
ఇతి దత్వా తయో ర్దేవీ యథాభిలషితం పరమ్ బభూవాంతర్హితా సచ్యో భక్త్యా తాభ్యా మభిష్ణుతా ఏవం దేవ్యా వరం లబ్ద్వా సురథః క్షత్రియర్షభః సూర్యా జ్జన్మ సమాసాద్య సావర్ణి ర్భవితా మనుః
మార్కండేయుడు:
దేవి వారికి ఈ విధముగా కోరిన వరముల నిచ్చి అంతర్థాన మయ్యెను. అంతర్థాన మగుటకు మునుపే వారిద్దరూ ఆమెను భక్తి పూర్వకముగా స్తుతించిరి. ఈ విధముగా క్షత్రియ శ్రేష్టుడగు సురథుడు దేవి నుండి వరములను పొంది సూర్య దేవునికి ఉద్భవించి భూమి యందు సావర్ణి యను పేరు గల మనువుగా ప్రసిద్ధి చెందును.
Summary of chapter 90 of the Mārkandeya Mahā Purana is as follows:
Left alone on the battlefield, the titan Śumbha arrogantly taunts the Goddess for relying on the strength of other Śaktis. The Mother smiles and declares that all these goddesses are merely Her own divine emanations, instantly absorbing all Mātṛkās back into Her single body. A thrilling wrestling battle takes place in the sky, culminating in the Goddess hurling Śumbha to the earth and piercing his chest with Her spear, restoring peace and radiant joy across all realms.