114 - ఖనిత్ర చరిత్రము

మార్కండేయుడు:

తస్య తస్యాం సునన్దాయాం పుత్రా ద్వాదశ జజ్జీరే

ప్రాంశుః ప్రవీరః శూరశ్చ సుచక్రో విక్రమః క్రమః.

బలీ బలాక శ్చండశ్చ ప్రచండశ్చ సువిక్రమః

సునయశ్చ మహాభాగాః సర్వే సంగ్రామజిత్తమాః.

తేషాం జ్యేష్ఠో మహావీర్యః ప్రాంశు రాసీ న్నరాధిపః

ఇతరే భృత్యప త్తస్య బభూవు ర్వశవర్తినః.

తస్య యజ్ఞే ద్విజ త్యక్తై రనేకై ర్ర్దవ్య రాశిభిః

మ్యాన వర్ణ విసృష్టైశ్చ సత్యనామా వసుంధరా.

సమ్య క్పాలయత స్తస్య ప్రజాః పుత్రా నివౌరసాన్

యోభూ ద్ధనచయః కోశే తేన నిష్పాదితాస్తూ యే.

క్రతవః శాతం సహస్రాస్తే తేషాం సంఖ్యా న విద్యతే

ఆయుతాద్యేన కోతిభి ర్నచ పద్మాదిబి ర్మునే.

మార్కండేయుడు:

పిమ్మట ఆ సునంద గర్భము నుండి వత్సప్రికి పన్నెండు మంది పుత్రులు కలిగిరి. వారి పేర్లు వరుసగా, ప్రాంశు, ప్రవీర, శూర, సుచక్ర, విక్రమ, క్రమ, బల, బలాక, చండ, ప్రచండ, సువిక్రమ, స్వరూపులను వీరందరు గొప్ప అదృష్ట వంతులు, మఱియు సంగ్రామ మందు విజయులు. వీరిలో జ్యేష్టుడు, మహా వీరుడునగు ప్రాంశుడు రాజయ్యెను, ఇతరులగు పదు నొకండుగురు సోదరులు సేవకులతో సమానులుగా నుండి అతనికి వశ వర్తులై యుండిరి. అతడు చేసిన యజ్ఞ కాల మందు అనేక మంది బ్రాహ్మణుల చేతను ఇతర వర్ణముల చేతను వదిలి వేయ బడిన అనంత ద్రవ్య రాసులతోను భూమికి వసుందర యను నామము సార్ధక మయ్యెను. కన్న పిల్లలతో సమానముగా ప్రజా పాలన చేయుచు అతని యొక్క ధన కోశము నందు యే ధనము నింపబడెనో ఆ ధనము చేతనే అసంఖ్యాక ములగు యజ్ఞములు చేయ బడినవి. మునీశ్వరా! వందలు వేలు, లక్షలు, కోట్లు పద్మములు మొదలగు సంఖ్యల చేతను గూడ లెక్క బెట్ట శక్యము గాదు.

ప్రజాతి స్తస్య పుత్రో భూ ద్యస్య యజ్ఞే శతక్రతుః

అవాప్య తృప్తి మతులాం యజ్ఞ భాగైః సురైః సహ.

దానావానాం సువీర్యాణాం జఘాన నవతీ ర్నవ

బలం చ బలినాం శ్రేష్ఠో జంభం చాసుర సత్తమమ్.

అన్యాంశ్చ సుమహావీర్యా నాజఘానామర ద్విషః!

ప్రజాతే స్తనయాః పంచ ఖనిత్ర ప్రముఖా మునే!

తేషాం ఖనిత్రో రాజాభూ త్ప్రభ్యాతో నిజ విక్రమైః

స శాన్తః సత్యవాక్ భూరః సర్వ ప్రాణిహితే రతః.

ప్రాంశుకు ప్రజాతి యను కుమారుడు కలిగెను. అతని యజ్ఞ మందు ఇంద్రుడు దేవతలతో గూడి యజ్ఞ భాగముల వలన తృప్తి బొందెను. మహావీర్య శాలులగు తొంబది తొమ్మిది మంది దానవులను, బలవంతులలో శ్రేష్ఠుడగు బలాసురుని, అసు రోత్తముడగు జంభాసురుని, ఇంకను మహావీర్య వంతులు దేవ శత్రువులు నగు రాక్షసులను సంహరించెను. ఓ మునీశ్వరా! అట్టి ప్రజాపతికి ఖనిత్రుడు మొదలగు అయిదుగురు పుత్రులు కలిగిరి. వారిలో ఖనిత్రుడు నిజ పరాక్రమముచే ప్రసిద్ది బొందిన రాజు అయ్యెను. అతడు శాంతుడు, సత్య వాది, శూరుడు, సర్వ ప్రాణులకు హితము చేయు వాడుగా నుండెను.

స్వధర్మాభిరతో నిత్యం వృద్ద సేవీ బహుశ్రతుః

వాగ్మీ వినయ సంపన్నః కృతాస్త్రోప్యవికత్ధనః.

సర్వలోక ప్రియో నిత్య మువాచైత దహర్నిశమ్

నందంతు సర్వ భూతాని స్నిహ్యంతు విజనేష్యపి.

స్వస్త్యస్తు సర్వభూతేషు నిరాతంకాని సంతు చ

మా వ్యాధి రస్తూ భూతానా మాధ్యయో న భవంతు చ.

మైత్రీ మశేష భూతాని పుష్యంతు సకలే జనే

శివ మస్తు ద్విజాతీనాం ప్రీతి రస్తు పరస్పరమ్.

సమృద్దిః సర్వ వర్ణానాం సిద్ది రస్తు చ కర్మణామ్

భో లోకాః సర్వ భూతేషు శివా వొస్తు సదా మతిః.

స్వధర్మ పరాయణుడు, సదా వృద్దులను సేవించు వాడు, బహు శాస్త్రముల దర్శించిన వాడు, వాగ్మి, వినయము కలవాడు అహంకార రహితుడు. మఱియు సర్వ లోకములకు ప్రియము కలిగి యుండెను. అతడు ఎల్లప్పుడు ఇట్లు పలుకు చుండెడి వాడు “అన్ని ప్రాణులు ఆనందము ననుభవించు గాక. విజన స్థానము లందును ప్రీతి మంతుడ నగుదును గాక. జీవు లన్నింటికి జయ మగును గాక. అందఱు భయ రహితులై యుందురు గాక. ప్రాణుల పీడలు నశించును గాక, ఎవ్వరికీ మనో వ్యథ కలుగ కుండును గాక, మరియు సమస్త ప్రాణులు అందరి యెడల మైత్రీ భావము కలిగి యుండును గాక. బ్రాహ్మణులకు మంగళము. పరస్పర ప్రీతి, అన్ని వర్ణముల యొక్క సమృద్ది, మరియు సంపూర్ణ కర్మల సిద్ది కలుగును గాక. ఓ జనులారా! మీ అందరిలోనూ ఎల్లప్పుడు మంగళ ప్రదమగు వృద్ది ప్రవృత్త మగును గాక.”

యథాత్మని యథా పుత్రో హిత మిచ్చథ సర్వదా

తథా సమస్త భూతేషు వర్తధ్వం హిత బుద్దయః.

ఏత ద్వో హిత మత్యంత కోవా కస్యాపరాధ్యాతే

యత్కరోత్యహితం కించి త్కస్యచి న్మూఢ మానసః.

తం సమభ్యేతి తస్యూనం కర్త్రు గామి ఫలం యతః

ఇతి మత్వా సమస్తేషు భో లోకా! హితా బుద్దయః!.

సంతు మా లౌకికం పాపం లోకాః ప్రాప్స్యథ వై బుధాః

యో మద్య స్నిహ్యతే తస్య శివ మస్తు సదా భువి.

యశ్చ మాం ద్వేష్టి లోకేస్మి న్సోపి భద్రాణి వశ్యతు

ఏవం స్వరూపః పుత్రోభూ త్ఖనిత్ర స్తస్య భూపతేః.

మీరు ఏ విధముగా మీ యొక్క మఱియు మీ కుమారుల యొక్క హితమును కోరు చుందురో, అట్లే అన్ని జీవుల హితమును కోరుడు. అట్టి భావమే మీకు అత్యంత హిత మైనది. ఎడల ఎవరి ఎదుట అపరాధి యగునో, ఏ మంద బుద్ది ఎవరి కైననూ అపకారమును చేయునో, అట్టి వానికే కీడు సంభవించును. ఎట్లనగా కర్మ ఫలమును కర్తయే అనుభవింప వలసి వచ్చును. ఓ జనులారా మీరు ఇట్లాలోచించి సమస్త ప్రాణు లందును హితమగు బుద్దిని కలిగి యుండుడు. అనగా సదా ప్రాణులకు హితమునే చేయు చుండుడు. ఓ బుధులారా! మీరు లౌకిక పాపము లందు ప్రవృత్తులు కాకండి! అట్లు చేయుట వలన మీరు పుణ్య లోకమును పొందెదరు. ఎవరు ఈ సమయమున నా యెడల స్నేహమును చూపు చున్నారో, పృథ్వి యందు వారికి సదా జయము కలుగును’ లేక ఎవరు నన్ను ద్వేషించుదురో, అట్టి వారును జయమును పొందుదురు గాక. సమస్త గుణ సంపన్నుడు, పద్మ పలాశలోచనుడు, రాజ పుత్రుడు నగు ఆ ఖనిత్రుడు ఈ విధముగా చెప్పెను. అతడు ప్రీతి పూర్వకముగా సోదరులను వేరు వేరు రాజ్యము లందు నియమించెను.

సమస్త గుణ సంపన్నః శ్రీఘా నబ్జదలేక్షణః

తేన తే భ్రాతరః ప్రీత్యా పృథ గ్రాజ్యేషు యోజితాః.

స్వయం చ పృథివీ మేతాం బుభుజే సాగరాంబరాయ్

ప్రాచ్యాం తేన కృతః శౌరి ర్ధక్షిణస్యా ముదావసుః.

దిశి ప్రతీచ్యాం మునయ ఉత్తరస్యాం మహారథిః

తేషాం తస్య చ భూపస్య పృథ గ్గోత్రాః పురోహితాః.

బభూవు ర్మునయ శ్చైవ మంత్రి వంశక్రమాగతాః

శౌరే రత్రికులో ద్భూతః సుహోత్రో నామ వై ద్విజః.

ఉదావసోః కుశావర్తో గౌతమాన్వయజోభవత్

కాశ్యపః ప్రమతి ర్నామ సునయస్య పురోహితః.

సముద్ర పర్యంతము ఈ పృథ్విని పాలించుచూ భోగించు చుండెను. శౌరికి తూర్పు నందు, ముదావసుకు దక్షిణ దిక్కు నందు, పశ్చిమ దిక్కు నందు మునికి, మఱియు ఉత్తర దిక్కు నందు మహారధికి, ఇట్లు రాజ్యముల నిచ్చెను. ఆ రాజులకు వేరు గోత్రీకులు పురోహితులుగ నుండిరి. ఖనిత్రునికి మరియు అతని సోదరుల యొక్క మంత్రుల వంశ క్రమముతో ప్రాప్తించిన అన్య గోత్రికులగు ముని గణాలు పురోహితులుగ నుండిరి. అట్లే అత్రికులో త్పన్నుడగు సుహోత్రుడను బ్రాహ్మణుడు శౌరికి, గౌతమ వంశో త్పనుడగు కుశావర్తుడు ఉదాసనునకు, కాశ్యప గోత్రికుడగు ప్రమతి సునయునకు, మఱియు వసిష్ఠుడు మహారథునకు పురోహితులుగా నుండిరి పైన చెప్పిన నల్గురు సోదరులు రాజులై తమ తమ రాజ్యముల ననుభవించు చుండిరి.

మహారథస్య వాసిష్టః పురోదాభూ న్మహీభృతః

బుభుజు స్తే స్వరాజ్యాని చత్వారోపి నరాధిపాః

ఖనిత్రాశ్చధిప స్తేషా మశేష వసుధాధిపః

తేషు భ్రాతృ ష్వశేషేషు ఖనిత్రః స మహీపతిః

ప్రజాసు చ సమస్తాసు పుత్రేష్విన సదా హితః

ఏకదా మంత్రిణా శౌరిః స ప్రోక్తో విశ్వవేదినా.

వివిక్తే పృథివీపాల కించిద్వక్తవ్యయ మస్తినః

యస్యేయం పృథివీ కృత్స్నా యస్య భూపా వశానుగాః.

స రాజా తస్య పుత్రశ్చ తత్ ప్రౌత్రాశ్చాన్వయ స్తతః

ఇతరే భ్రాతర స్తస్య ప్రాక్స్వల్ప విషయాదిపాః.

సమస్త వసుదాధిపతి యగు ఖనిత్రుడు వారికి అధిపతిగా నుండెను. మహారాజు ఖనిత్రుడు, అందఱు సోదరులు, మఱియు సమస్త ప్రజల యెడల తండ్రి ఏ విధముగా పుత్రుల యెడల వ్యవహరించునో అదే విధముగా ఎల్లప్పుడు హితముగా వ్యవహరించు చుండిరి. ఒకనాడు మంత్రి విశ్వవేది శౌరితో నిట్లు పలికెను. ఓ రాజా! ఈ ఏకాంత సమయమున నేను మీతో కొంచెము మాట్లాడ వలసి యున్నది. ఈ సమస్త పృథ్వి మరియు భూపాల గణాలు ఎవరి ఆధీనములో నుండెనో. అతడు, అతని యొక్క పుత్ర పౌత్రులు మొదలగు వారి వంశములోని వారే రాజులగు చుందురు. కాని అతని సోదరులు మాత్రము అల్ప రాజ్యమునకు మాత్రమే అధికారియై యుందురు.

తత్ పుత్రాశ్చాల్పకా స్తస్మా తత్ పోత్రాశ్చానేల్ప కాల్పకాః

కాలేన హ్రాస మాసాద్య పురుషా త్పురుషాన్తరమ్.

కృశ్యోపజీవినో భూప భవన్తీతి తదన్వయాః

నోద్దారం కురతే భ్రాతా భ్రాతృస్నేహ బలార్పణః

స్నేహః కః పృథివీపాల! పరమో ర్భ్రాతృ పుత్రాయోః

తత్ పుత్రాయోః పరతరా మతి ర్భావతి పార్ధివ!.

తత్పుత్రః కేన కార్యేణ ప్రీతియుక్తో భవిష్యతి

అధవా యేన తేనైవ సంతోషం కురుతే నృపః.

క్రియతే త త్కిమర్ధం తు భూపై ర్మంత్రి పరిగ్రహః

భుజ్యతే సకలం రాజ్యం మయా తే మంత్రిణా సతా.

క్రమానుసారముగా అతని పుత్రుడు అతని కన్నా అల్ప రాజ్యమునకు. మరల అతని పౌత్రుడు అతని కన్నను అల్పమగు రాజ్యమునకు అధికారి యగు చుండును. కాలక్రమాన పురుషాను క్రమముతో అది తగ్గుచూ చివరకు, “ఆ వంశము లోని వారు వ్యవసాయమును చేసుకొనుచు జీవనము నడుపు కొను చుండూరు. ఓ రాజా! భ్రాతృ స్నేహము నకు బద్దుడైన సోదరుడు ఎప్పటికి సోదరుని ఉద్దరింప లేదు.” పిమ్మట ఆ యిద్దరు సోదరులు పుత్రులును పరస్పరము పరాయి వారుగా తలంచుదురు. ఓ రాజా! వారికి కలిగిన బిడ్డలు తిరిగి వారిని కూడా అన్యులుగా తలచెదరు.” “మరియు ఏ కార్యము వలన నా పుత్రుడు సుఖముగా నుండును? అని ఆ విషయమును గూర్చియే అధికముగా యోచించు చుందురు. ఇంకను సంతోషకరమగు ఎట్టి కార్యము నైనను ఆ రాజు అవలంబిచును.” “అయినచో భూపాలుడు ఏ ప్రయోజనము కొఱకు మంత్రులను నియమించు కొందురు? నా వంటి మంత్రు లున్నచో మీరు సమస్త రాజ్యమును భోగింప గలరు.”

తత్కిం ముదా ధారయసే సంతోషం కురుతే యది

కార్య నిష్పాదకం రాజ్యం కారణం కర్తు రిష్యతే.

రాజ్యలభ్దుశ్చ తే కార్యం త్వం కర్తా కారణం వయమ్

సోస్మాభిః కరణై రాజ్యం పితృపైతామహం కురు.

ఫలప్రదా భవిష్యామః పరలోకేన తే వయమ్.

“మఱియు నేను కార్యమును చేసినచో మీరెందులకు వృధా సంతోషమును పొందు చున్నారు? రాజ్యమును చేయువాని కార్యమును చేయుటయే మంత్రి అభీష్టము.” “కాని రాజ్య లాభ కార్యము నందు మీరు కర్త, నేను క్రియ. అందు వలన క్రియ ద్వారానే పితృ, పితామహుల రాజ్య శాసనము చేయుడు. మేము ఈ లోకము నందు మాత్రమే ఫలము నిచ్చెదము పర లోక దాతలము మేము కాము.”

రాజు:

జ్యేష్టో భ్రాతా మహీపాలో వయం తస్యానుజా యతః

తతః స భుంక్తే పృథివీం వయం చాల్పవసుంధరామ్.

వయం తు భ్రాతరం పంచ పృధ్వీ చైకా మహామతే!

అత్యోస్యా! పృథగైశ్వర్యం కథం కృత్స్నం భవిష్యతి.

రాజు:

“మహీ పాలుడగు రాజు మా జ్యేష్ఠుడు. మేము వారి అనుజులము. అందు వలన ఆయన ఈ భూమి నంతటిని అనుభవించు చున్నారు. మఱియు మేము అల్ప మాత్రమగు పృథ్విని అనుభవించు చున్నాము.” “ఓ మహామతీ! మేము ఐదుగురు సోదరులము కానీ భూమి కేవలము ఒక్కటి మాత్రమే. అందు వలన ఈ భూమి యొక్క సమస్త ఐశ్వర్యమును ఏ విధముగా వేరు వేరు భాగములుగా చేసి అనుభవించుటలో సమర్ధుల మగుదుము?”

విశ్వవేద్యుడు:

ఏవమేత ద్భవ త్వత్ర యద్యేకా వాసుదా నృప!

తాం త్వమేవాభిపద్యస్వ జ్యేష్ఠః శాస్తు యథా భవాన్.

సర్వాధిపత్యః సర్వేభ్యో భవ త్వ మఖిలేశ్వరః

యత న్తే చ యథాహం తే తేషా మాపి హి మన్త్రిణః.

విశ్వవేద్యుడు:

“ఓ రాజా! మీరు చెప్పినది సత్యమే పృథ్వీ ఒక్కటి మాత్ర మేనని అంగీకరించేదము. అందు చేత మీరే దానిని గ్రహింపుడు. అందరిలో ప్రదానుడుగా నుండి మీరే ఈ భూమిని శాశింపుడు.” “సర్వాదిపత్యమును పొంది సోదరు లందరిలో మీరే అఖిలేశ్వరునిగా నుండుడు. నా వలెనే ఆయనకు నియమింప బడిన మంత్రియును ఇట్లు చేయును.”

రాజు:

జ్యేష్టో రాజా యథా ప్రీత్యా భాజతేస్మాన్సుతా నివ

కథం తస్య కరిష్యామి మమత్వం జగతీ గతమ్.

రాజు:

జ్యేష్టుడు అగ్రజుడు మమ్ములను పుత్రుల వలె స్నేహముతో పాలించు చున్నాడు. అట్టి వాని యెడల నేనెట్లు రాజ్యమునకు లోభము చెందుదును?

విశ్వవేధ్యుడు:

రాజ్యే స్థితః పూజమేధా జ్యేష్టం భూపార్హణై ర్ధసైః

కనిష్ఠ జ్యేష్ఠతా కేయం రాజ్యం ప్రార్ధయతాం నృణామ్.

విశ్వవేధ్యుడు:

నీవు అధికార పూర్వకముగా రాజ్యమునకు జ్యేష్టుడవై వివిధ సత్కారములచే వారిని పూజింపుము. రాజ్యము కోరు వాడు కనిష్ఠ జ్యేష్ఠ విచారణ చేయుట నిష్ప్రయోజనము.

మార్కండేయుడు:

తథేతి చ ప్రజిజ్ఞాతే భూభుజా తేన సత్తమ

విశ్వవేదీ తతో మన్త్రే తాద్ భ్రాతౄ ననయ ద్వశమ్.

మార్కండేయుడు:

అనంతరము రాజు ఈ మాటను అంగీకరించెను. పిమ్మట మంత్రియగు విశ్వవేది ఆ రాజు యొక్క ఇతర సోదరులను తన వశము చేసి కొనెను.

తేషాం పురోహితాశ్చైవ ఆత్మనః శాంతికాదిషు

నియోజయామాస తతః ఖనిత్రస్యాభిచారికే.

బిభేద తస్య నిభృతా న్సామదానాదిభి స్తధా

చక్రే చ వరమోద్యాగం నిజదండ ప్రభావనే.

అభిచారిక మత్యుగ్ర మహన్యహాని కుర్వతామ్

పురోధసాం చతుర్ణాం చ భజ్ఞే కృత్యా చతుష్టయమ్.

వికరాలం మహావక్త్ర మతిభీషణ దర్శనమ్

సముద్యతా మహాశూలం ప్రభూత మతిదారుణమ్.

తత స్తదాగతం తత్ర ఖనిత్రో యత్ర ప్రార్దివః

నిరస్తం చాప్యదుష్టస్య తస్య పుణ్య చయేన తత్.

మఱియు వారి పురోహితులను తను చేయు శాంతి కర్మలో ఖనిత్రుని అంతము చేయు కార్యము నందు నియమించెను. ఖనిత్రుని యొక్క విశ్వాస పాత్రులగు భృత్యులను సామ, ధాన, భేద యుక్తులచే తన దండము యొక్క ప్రభావము పెంచుట యందు నియమించెను. ఎప్పుడయితే నలుగురు పురోహితులు నిత్యము అత్నుగ్రమైన అభిచారిక కర్మ చేయుట యందు ప్రవృత్తులైరో, అప్పుడు “కృత్య” లను నాలుగు శక్తులు పుట్టుకొని వచ్చెను. అవి యన్నియు భీకర శరీరములు, భయంకర ముఖములు, చూచుటకే అతి భీషణ ముగా నుండెను. వాటి హస్తముల యందు మహా శూలములు పెద్ద శరీరములతో దారుణముగా నుండిన వయ్యెను. పిమ్మట ఆ నాలుగు శక్తులు ఖనిత్ర మహారాజు సమీపమునకు పోగానే ఏ పాప మెరుగని ఆ రాజు పుణ్య బలమున అతని తేజస్సుచే ఏమి చేయ జాలక పోయెను.

కృత్యా చతుష్టయం తేషు నిపపాత దురాత్మాసు

పురోహితేషు భూపానాం తథా వై విశ్వవేదిని.

తతో నిహన్త్యా విర్ధగ్దాః కుత్త్యయా తే పురోహితాః

విశ్వ వేదీ తాథామన్త్రీస శౌరే ర్దుష్ట మన్త్రదః.

ఆ శక్తులు ఆ రాజుల యొక్క నలుగురు పురోహితుల యొక్క విశ్వ వేది యొక్క సమీపమునకు తిరిగి వచ్చిన వయ్యెను. అప్పుడు పురోహితులు శౌరికి దుష్ట సలహాలను యిచ్చు విశ్వవేదియు కృత్యా శక్తులచే చంప బడుటయే గాక భస్మము చేయ బడిరి.