మార్కండేయ మహా పురాణము
96 - భౌత్య మన్వంతర కథ యందు అగ్నిస్తోత్రము
మార్కండేయుడు:
తతః పరం తు భౌత్యస్య సముత్పత్తిం నిశామయ దేవా నృషీం స్తథా పుత్రాం స్తథైవ వసుథా ధిపాన్ బభూవా ఙిరసః శిష్యో భూతి ర్నామ్నాతికోపనః చండ శాప ప్రదోల్పేర్థే ముని రాగ స్వసౌమ్యవాక్ తస్యాశ్రమే మాతరిశ్వా న వహ వతినిష్ఠురమ్ నాతితాపం రవి శ్చక్రే పర్జన్యోనా తికర్దమమ్ నాతిశీతం చ శీతాంసుః పరిపూర్ణోపి రశ్మిభిః చకార భీత్యా వై తస్య కోపనస్యా తితేజసః ఋతవశ్చ క్రమం త్యక్త్వా వృక్షే ష్వాశ్రమ జన్మసు తస్య పుష్ప ఫలం చకృ రాజ్ఞాయా సార్వకాలికమ్
మార్కండేయుడు:
తరువాత “భౌత్య” మనువు యొక్క జననము, అతని మన్వంతర మందలి దేవతలు, ఋషులు, వసుదాధిపతులు వారి యొక్క పుత్రులు మొదలగు వారి విషయములను వినుము. “అంగిరా” అను పేరు గల ముని శ్రేష్టునకు “భూతి” యను పేరు గల ఒక శిష్యు డుండెను. అతడు అతి కోప స్వభావము కలవాడు. అల్పమగు అపరాధ మైనను తీక్షణమగు శాపము నిచ్చును. మరియు నిరపరాధులైన పురుషుల యెడల కూడా అతడు పరుషముగా మాటలాడెడి వాడు. అమిత తేజుడు, కోప స్వభావము గల ఆ ఋషికి భయపడి ఆయన ఆశ్రమ మందు వాయువు వేగముగా వీచదు. సూర్యుడు తన తాపము నధికముగా చూపుటకు భయ పడును. ఇంద్రుడు అధికముగా వర్షించి పంకిలమును చేయుటకు భీతిల్లును. మరియు పరి పూర్ణుడైన చంద్రుడును తన కిరణములచే అతి శీతలము చేయడు. అతి కోప స్వభావము గల ఆ ముని యొక్క భయముచే విశేష మగు శీతలము ఉండదు. ఆ ముని యొక్క ఆజ్ఞానుసారముగా ఋతువు లన్నియు తమ క్రమములను త్యజించి, ఆ ముని యొక్క ఆశ్రమ స్థలము నందలి వృక్షముల యందు ఎల్లవేళలా ఫల పుష్పముల నుత్పన్నము చేయు చుండును.
ఊహు రాపశ్చ చన్దేన తస్యాశ్రమ సమీపగా కమణ్డలు గతాశ్చైవ తస్య భీతా మహాత్మనః నాతిక్లేశసహో విప్రః సోభవ త్కోపనో భృశమ్ అపుత్రశ్చ మహాభాగః స తప స్యకరో న్మనః పుత్రకామో యతాహారః శీత వాతానలా హతః తపస్యామి విచింత్యేతి తపస్యేవ మనో దధే తస్యేన్దు ర్నాతి శీతాయ నాతితాపాయ భాస్కరః అభవ న్మాతరిశ్వా చ వవౌ నాతి మహామునే అపీడ్యమానో ద్వంద్వైశ్చ స భూతి ర్ముని సత్తమః అనవాప్యాభిలాశం తం తపసః సన్యవర్తత?
ఆశ్రమ సమీపము నందలి జలములు (నదులు) మహాత్ముడగు భూతికి భయపడి అతని ఇచ్చానుసారముగా ముహూర్త కాలముననే ఆయన కమండలము లోనికి చేరును. ఓ విప్రుడా! అతి కోపము గల ఆ ముని క్లేశములను సహించ లేక పోయెడివాడు. అయినను పుత్రులు లేక పోవుటచే ఆ మహాభాగుడు వనములో తపస్సు చేయ వలెనని ఇచ్చగించినాడు. పుత్రుని కోరునట్టి ఆ ముని “సంయమ చిత్తుడనై శీత, వాత ఉష్ణములను సైచి తపస్సు చేయుదును” అని నిశ్చయించుకొని తపస్సు నందు మనస్సును లగ్నము చేసెను. ఓ మహామునీ! ఆతను తపస్సు చేయు సమయము నందు ఆయన యెడల చంద్రుడు అతి శీతలమును, సూర్యుడు అధిక తాపమును చూప లేదు. వాయువు కూడా వేగముగా వీచలేదు. ముని సత్తముడగు ఆ భూతి ద్వంద్వ భావములగు ఉష్ణ శీతలములచే పీడితుడై నప్పటికీ తానూ అభిలషించిన దానిని పొందలేదు. అందుచే తపస్సు చేయుట విరమించెను.
తస్య భ్రాతా సువర్చాభూ ద్యజ్ఞే తేనాభిమంత్రితః యియాసుః శాంతినామానం శిష్య మాహ మహామతిమ్ ప్రశాంత మక్షప్రతిమం వినీతం గురుకర్మణి సదో ద్యుక్తం శుభా చార ముదారం మునిసత్తమమ్
పిమ్మట భూతికి “సువర్చు”డను పేరు గల ఒక సోదరు డుండెను. ఆయన యజ్ఞము చేయుచు ఇతనిని ఆహ్వానించెను. అచటకు వెళ్ళ వలెనని అనుకొనిన వాడై బుద్ధిమంతుడగు “శాంతి” అను పేరు గల తన శిష్యునితో ఇట్లు పలికెను. ఓ ముని సత్తమా! ఇతడు పేరుకు తగినట్లుగా శాంతముతో గురువు యొక్క కార్యము లందు వినీతుడై సదా పనులను చేయుచు సదాచారుడై, ఉదారుడై యుండెడి వాడు.
భూతి:
అహం యజ్ఞం గమిష్యామి భ్రాతుః శాంతే సువర్చసః తేనా హూత స్త్వయా చేహ యత్కర్తవ్యం శృణుష్వ తత్ అతిజాగరణం వహ్నే స్త్వయా కార్యం మమాశ్రమే తథా త్వయా ప్రయత్నేన యథాగ్ని ర్న శమం వ్రజేత్
భూతి:
ఓ శాంతీ! నా సోదరుడు సువర్చసుడు పిలుచుటచే నేను అతని యజ్ఞమునకు పోవు చున్నాను. ఇప్పుడు నీవు ఇక్కడ ఉండి ఏమి చేయవలెనో వినుము. “నీవు నా ఆశ్రమ మందున నిత్యాగ్ని హోత్రమును చేయుము. అగ్ని చల్లారకుండా దానిని యత్న సహితముగా రక్షణ చేయుము.”
మార్కండేయుడు:
ఇత్యాజ్ఞాప్య తథేత్యుక్తో గురుశిష్యేణ శాంతినా జగామ యజ్ఞం తం భ్రాతు రాహుతః స యవీయసః
మార్కండేయుడు:
గురువు గారిచే ఈ విధముగా ఆజ్ఞను పొంది శిష్యుడగు శాంతి “అట్లే చేయుదును” అని చెప్పెను. అప్పుడు భూతి కనిష్ఠ సోదరుని యజ్ఞమునకు పోయెను.
స చ శాంతి రవాణా ద్యావా త్సమిత్పుష్ప ఫలాధికమ్ ఉపా హారతి భూత్యర్థం గురో స్తస్య మహాత్మనః అన్యచ్చ కురుతే కర్మ గురు భక్తి వశానుగః ప్రశాంత స్తావ దసలో యోసౌ భూతి పరిగ్రహః తం దృష్ట్వా సోనలం శాంతం శాంతి రత్యంతీ దుఃఖితః భీతశ్చ భూతే ర్భహుధా చింతా మాప మహామతిః కిం కరోమి కథం వాత్ర భవితా గమనం గురోః మయాద్య ప్రతిపత్తవ్యం కిం కృతే సుకృతం భవేత్ ప్రశాంతాగ్ని మిమం దిష్ణ్యం యది పశ్యతి మే గురుః తతో మాం విషమే హ్యద్య వ్యసనే సన్ని యోక్ష్యతి
పిమ్మట శాంతి గురువు గారి అగ్ని పోషణార్థము వనము నుండి సమిధలు, పుష్పములు, ఫలాదులను తెచ్చు చుండెను. మరియు గురు భక్తికి వశీభూతుడై ఇతర కార్యములు చేయుట యందు నిమగ్నుడై యున్న సమయమున గృహీతమైన అగ్ని చల్లబడి పోయెను. (ఆరి పోయెను) బుద్ధిమంతుడగు శాంతి ఆ అనలము ఆరి పోవుట చూచి అత్యంత దుఃఖితుడై భూతి యొక్క భయముచే భీతి నొందిన వాడై అనేక విధముల చింతింప సాగెను. ఇప్పుడేమి చేయుదును? ఈ సమయమున గురువు గారు వచ్చినచో, నేను ఏమి చేసిన ఉచితముగా నుండును? ఏమి చేసినచో మేలు కలుగును? ఇప్పుడు నా గురువు ఈ గృహము నందు అగ్ని ఈ విధముగా ఆరి పోవుట చూచినచో నిస్సందేహముగా నన్ను విషమ దుఃఖము లందు నియోజితుని చేయును.
యద్యన్య మగ్ని మత్రాహ మగ్నిస్థానే కరోమి తత్ సర్వ ప్రత్యక్ష దృగ్భస్య సోవశ్యం మాం కరిష్యతి సోహం పాపో గురో స్తస్య నిమిత్తం కోప శాపయోః తథాత్మానం న శోచామి యథా పాపం కృతం గురోః దృష్ట్వా ప్రశాంత మనలం నూనం శప్స్యతి మాం గురుః తథా వా పావకం కృద్ధ స్తథా వీర్యోహి స ద్విజః యస్య ప్రభావా ద్బిభ్యంతే దేవా స్తిష్టంతి శాసనే కృతాగసం స మాం యుక్త్యా కయా నో ధర్షయిష్యతి
ఒకవేళ నేను అగ్ని స్థానము నందు వేరొక అగ్నిని స్థాపించినను ప్రత్యక్ష దర్శియగు ఆ గురువు నన్ను తప్పక భస్మము చేయును. పాపాత్ముడ నైన నేను గురువు యొక్క కోప, శాపములకు హేతు భూతమైన పాపమును గురువు యెడల చేసిన పాపము యొక్క శోకమును పొందుదును. గురువు చల్లబడిన అగ్నిని చూచి నిశ్చయముగా నన్ను శపించును. లేక పావకునికి అయినను శాప మివ్వగలడు. నా గురువు యొక్క వీర్య మటువంటిది. దేవతలు కూడా ఎవని ప్రభావముచే భీతిల్లి శాసనా దీనులైరో అట్టివాడు నన్ను అవమానింపడా?
మార్కండేయుడు:
బహుధైవం విచింత్యా సౌ భీత స్తస్య సదా గురోః యయౌ మతిమతాం శ్రేష్ఠః శరణం జాతవేదసమ్
మార్కండేయుడు:
గురు భయముచే ఎల్లప్పుడూ భీతి కల్గియుండు వాడును, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడును అగు శాంతి ఇట్లు అనేక విధాలుగా చింతించిన వాడై జాతవేదసు డను అగ్ని దేవుని శరణు బొందెను.
స చకార తథా స్తోత్రం సప్తర్చే ర్యతమానసః స చైకచిత్తో మేదిన్యాం న్యస్తజానుః కృతాంజలిః
పిమ్మట ఆ శాంతి ఇంద్రియ నిగ్రహముతో ఏకాగ్ర చిత్తుడై భూమి యందు ముంగాళ్ళపై నిలిచి చేతులు జోడించి, సప్త శిఖా యుక్తుడగు అగ్నిని స్తుతింప సాగెను.
శాంతి:
ఓం నమః సర్వ భూతానాం సాధనాయ మహాత్మనే ఏక ద్విపఞ్చ దిష్ణ్యాయ తాజసూయే షడాత్మనే నమః సమస్త దేవానాం వృత్తిదాయ సువర్చసే శుక్ర రూపాయ జగతా మశేషానాం స్థితిప్రదః త్వం ముఖం సర్వ దేవానాం త్వయాత్తం భగవన్ హని ప్రీణయ స్యఖిలాన్ దేవాంస్త్వ త్ప్రాణాః సర్వ దేవతాః హుతం హని స్త్వయ్యనల మేధస్వ ముపగచ్చతి తతశ్చ జల రూపేణ పరిణామ ముపైతి యత్
శాంతి:
ఎవడు ప్రాణులందరకు సాధకుడై యున్నాడో, ఎవడు మహాత్ముడై ఉన్నాడో, ఎవడు ఏక ద్విపంచ రూపుడై ఉన్నాడో, మరియు ఎవడు రాజసూయ యజ్ఞ మందు షణ్మూర్తిధరుడై ఉన్నాడో, అతనికి నమస్కారము. ఎవడు సమస్త దేవతలకు వృత్తిని ప్రసాదించు చున్నాడో, ఎవడు సువర్చలుడై యున్నాడో, ఎవడు జగత్తు నంతటికి స్థితిని కల్పించు చున్నాడో, అట్టి శుక్ర రూపునకు నమస్కారము. నీవే దేవత లందరకు ముఖ స్వరూపుడవు. ఓ భగవానుడా! నీవు ఘృతపానము చేసి దేవత లందరకు సంతుష్టులను చేయు చున్నావు. నీవే దేవత లందరకు ప్రాణ స్వరూపుడవు. నీ యందే యజ్ఞ సామాగ్రులు భస్మమై నిర్మలమగు పరిశుద్ధిని పొంది, అటు పిమ్మట అవి జల స్వరూపములో పరిణతి చెందు చున్నవి.
తేనాదిలౌషధీ జన్మ చవత్యనిల సారధేః
ఔషధీభి రశేషాభిః సుఖం జీవంతి జంతపః వితన్వతే నరా యజ్ఞాన్ స్త్వత్ సృష్టా స్వౌషదీషు చ యజ్ఞైర్దేవా స్తదాదిత్యా స్తద్వా ద్రక్షాంసి పావకః ఆప్యాయ్యంతే చ తే యజ్ఞా స్త్వధా ధారా హుతాశనః అతః సర్వస్య యోనిస్త్వం వహ్నే సర్వమయ స్తథా దేవతా దానవా యక్షా దైత్యా గంధర్వ రాక్షసాః మానుషాః పశవో వృక్షా మృగ పక్షి సరీసృపాః ఆప్యాయ్యంతే త్వయా సర్వే సంవర్ధ్యంతే చ పావకః త్వత్త ఏవోద్భవం యాంతి త్వయ్యంతే చ తథా లయమ్
ఓ అనిల సారదీ! ఆ జలములచే సమస్త ఔషదులు పుట్టుచున్నవి. మరియు ఆ ఔషదుల వలననే జీవగణా లన్నియు సుఖముగా జీవించు చున్నవి. ఓ పావకుడా! మనుష్య గణాలు నీ ద్వారా ఉత్పన్నము లైన ఔషదుల ద్వారా ఎట్టి యజ్ఞములు చేయు చున్నారో, అట్టి యజ్ఞముల ద్వారానే దేవతలు, దైత్యులు, రాక్షస గణాలు, తృప్తులగు చున్నారు. ఓ హుతాశనా! నీవే ఆ యజ్ఞము లన్నింటికి ఆధార స్వరూపుడవు. అందు వలన ఓ వహ్నీ! నీవే అందరిని ఉత్పన్నము చేయు వాడవు. సర్వమయుడవు. ఓ పావకా! దేవా, దానవ, యక్ష, దైత్య, గాంధర్వ, మానవ, పశు, వృక్ష, మృగ, పక్షి, సరీసృప గణాలు నీ వలననే తృప్తులగు చున్నారు. సంవర్ధితులగు చున్నారు. నీ వలననే ఉత్పన్నమై అంత్య తాలమున నీ యందే లీనమగు చున్నారు.
అపః సృజసి దేవః త్వం త్వ మత్సి పున రేవ తాః పచ్యమానా స్త్వయా తాశ్చ ప్రాణినాం పుష్టికారణమ్ దేవేషు తేజో రూపేణ కాంత్యా సిద్దే ష్వవస్థితః విష రూపేణ నాగేషు వాయు రూపః పతత్రిషు మనుజేశు భవాన్ క్రోధో మోహం పక్షి మృగాబ్రిషు అవష్టంభోసి తరుషు కాఠిన్యం త్వం మహీం ప్రతి జలే దవత్వం భగన్ జవరూపీ తదానిలే వ్యాపిత్వేన తదైవాగ్నే నభసి త్వం వ్యవస్థితః త్వమగ్నే సర్వ భూతానా ముత శ్చరసి పాలయన్ త్వా మేక మాహుః కవయ స్త్వా మాహు స్త్రివిధః పునః
ఓ దేవా! నీవే జలమును ఉత్పన్నము చేయు చున్నావు. మరియు నీ ద్వారా అది జీర్ణము చేయు శక్తి గలదై ప్రాణులకు పుష్టి కారక మగుచున్నది. ఓ అగ్ని భగవానుడా! నీవే దేవతల యందు తేజః స్వరూపముతో, సిద్దులందు కాంతి స్వరూపముతో, నాగులందు విష రూపముతో, పక్షుల యందు వాయు రూపముతో, వెలుగు చున్నావు. ఓ దేవా! నీవే మనుష్యుల యందు క్రోధ రూపముతో, పక్షి, మృగముల యందు మోహ రూపముతో, వృక్షముల యందు స్థితి రూపముతో, పృథ్వి యందు కాఠిన్య రూపముతో, మరియు జలమందు ద్రవ రూపముతో ఉన్నావు. నీవే వాయువు నందు వేగ రూపముతో, ఆకాశ మందు వ్యాప్తి స్వరూపముతో ఆత్మను నిలిపితివి. ఓ అగ్నీ! నీవే పాలన చేయుచూ అన్ని జీవుల అంతస్సు లందు చరించు చున్నావు. కవి గణాలు నిన్ను ఒక్కనిగా నిర్దేశించుకొని తిరిగి వారే నిన్ను త్రివిధములని చెప్పు చున్నారు.
త్వ మష్టధా కల్పయిత్వా యజ్ఞవాహ మకల్పయన్ త్వయా సృష్ట మిదం విశ్వం వదంతి పరమర్షయః త్వా మృతే హి జగత్ సర్వం సద్యో నశ్యే ర్దుతాశనః తుభ్యం కృత్వా ద్విజా పూజాం స్వకర్మ విహితాం గతిమ్ ప్రయాంతి హవ్య కవ్యాద్యై స్వదా స్వాహాధ్యుదీరణాత్ పరిణామాత్మ వీర్యాణి ప్రాణినా మమరార్చితః దహంతి సర్వ భూతాని తతో నిష్క్రమ్య హేతయః జాతవేదః స్త్వయైవేదం విశ్వం సృష్టం మహాద్యుతే తవైవ వైదికం కర్మ సర్వభూతాత్మకం జగత్ నమస్తే నల పింగాక్షః నమస్తేస్తు హుతాశన
కవి గణాలు నిన్ను అష్ట విధాలుగా కల్పించి యజ్ఞ వాహునిగా గల యజ్ఞములను కల్పించినారు. నీ వలననే జగత్తు పుట్టు చున్నది అని పరమర్షి గణాలు చెప్పు చున్నారు. ఓ హుతాశనా! నీవు లేనిచో, వెంటనే సంపూర్ణ జగత్తు వినాశనమును పొందును. బ్రాహ్మణ గణాలు నిన్ను హవ్య, కవ్యాదులచే పూజించి ‘స్వధా’ “స్వాహా” అని ఉచ్చరించు కారణమున స్వకర్మ విహిత గతిని పొందు చున్నారు. దేవతలచే పూజింపబడు వాడా! ప్రాణుల యొక్క పరిణామాత్మకుడవగు వీర్య స్వరూపా! సమస్త అగ్ని శిఖలు నీ నుండియే వెలువడి భూత గణాలను దగ్ధము చేయు చున్నవి. ఓ మహాద్యుతీ! జాతవేదా! ఈ విశ్వ మంతయు నీ సృష్టియే. ఓ అనలా! వైదిక కర్మలు, మరియు సర్వ భూతాత్మకమగు జగత్తు నీ ఆధీనములోనే ఉన్నది. ఓ అనలా! పింగాక్షా! నీకు నమస్కరించు చున్నాను. ఓ హుతాశనా! నీకు ప్రణమిల్లు చున్నాను.
పావకాద్య నమస్తేస్తు నమస్తే హవ్య వాహనః త్వమేవ సర్వ భూతానాం పావనా ద్విశ పావనః త్వమేవ భుక్త పీతానాం పాచనా ద్విశ్వపాచకః సస్యానాం పాక కర్తా త్వం పోష్టా త్వం జగత స్తథా త్వమేవ మేఘస్త్వం వాయుస్త్వం బీజం సర్వహేతుకమ్ పోషాయ సర్వ భూతానాం భూత భవ్య భవోహ్యసి త్వ జ్యోతిః సర్వ భూతేషు త్వ మాదిత్యో విభావసుః త్వ మహ స్త్వం తథా రాత్రి రుబే సంధ్యే తథా భవాన్ హిరణ్య రేతా స్త్వం వహ్నేః హిరణ్యోద్భవ కారణమ్ హిరణ్యగర్భశ్చ భవాన్ హిరణ్య సదృశ ప్రభః త్వం ముహూర్తం క్షణశ్చ త్వం త్వం త్రుటి స్త్వం తధా లవః
ఓ ఆద్యా! ఓ పావకా! నీకు నమస్కారము. నీవే భుక్త పీత ద్రవ్యములను జీర్ణము చేయు వాడవగుటచే విశ్వ పావనుడవు. ఓ విశ్వపావనా! నీవు సర్వ భూతములను పవిత్రులుగా చేయు వాడవు. నీవే సస్యపాక కర్తవు. జగత్తునకు పుష్టి కారకుడవు. మేఘములు నీవే. వాయువు నీవే. సస్యోత్పాదక హేతువాదు బీజ స్వరూపుడవు నీవే మరియు నీవే అన్ని భూతముల యొక్క పోషణ కొరకై భూత, భవిష్యద్వర్తమాన కాల స్వరూపుడవు. నీవే సమస్త భూతముల యందలి జ్యోతి స్వరూపుడవు. మరియు సూర్యుడు పగలు నీవే. ఉభయ సంధ్యలు నీవే. ఓ వహ్నీ! నీవే హిరణ్య రేణువులచే సువర్ణము నుత్పన్నము చేయు వాడవు. నీవు హిరణ్య (సువర్ణ) గర్భుడవు. మరియు హిరణ్యముతో సమానమగు కాంతిని గల వాడవు. ముహూర్త కాలము నీవే. త్రుటి కాలము లవ పరిమాణములు కూడా నీవే.
కలా కాష్టా నిమేషావి రూపేణాది జగత్ ప్రభో త్వమేత దఖిలం కాలః పరిణామాత్మకో భవాన్ యా జిహ్వా భవతః కాలీ కాలనిష్టాకరి ప్రభోః తయా నః పాహి పాపేభ్య ఐహికాచ్చ మహాభయాత్ కరాళీనామ యా జిహ్వా మహాప్రళయ కారణమ్ తయా నః పాహి పాపేభ్య ఐహికాచ్చ మహాభయాత్ మనోజవా చ యా జిహ్వా లఘిమా గుణ లక్షణా తయా నః పాహి పాపేభ్య ఐహికాచ్చ మహాభయాత్ కరోతు కామం భూతేభ్యో యా తే జిహ్వా సులోహితా తయా నః పాహి పాపేభ్య ఐహికాచ్చ మహాభయాత్
ఓ జగత్ప్రభో! నీవే కలాకాష్టా నిమేషాది రూపము లందు పరిణామాత్మకుడవగు అఖిల స్వరూపుడవు. ఓ ప్రభో! కాల నిష్టాకరియైన నల్లని జిహ్వాచే ఓ దేవా! పాప భయముల నుండి మరియు ఐహికమగు గొప్ప భయముల నుండి మమ్ములను రక్షింపుము. మహా ప్రళయ మందు “కరాళీ” అను పేరు గల ఎట్టి జిహ్వ నీకు గలదో, దానిచే ఐహిక భయముల నుండి, పాపముల నుండి మమ్ములను రక్షింపుము. లఘిమాగుణ యుక్తమగు “మనోజవా” అను పేరుగల ఎట్టి జిహ్వ నీకు కలదో, అట్టి జిహ్వచే ఐహికమగు మహా భయముల నుండి, పాపముల నుండి మమ్ములను రక్షింపుము. ఏ “సులోహిత” అను పేరుగల నీ జిహ్వ ప్రాణుల యొక్క కోర్కెల సిద్ధింప జేయునో, అట్టి దాని చేత ఐహికమగు మహా భయముల నుండి, పాపముల నుండి మమ్ములను రక్షింపుము.
సుధూమ్ర వర్ణా యా జిహ్వా ప్రాణినాం రోగదాయికా తయా నః పాహి పాపేభ్య ఐహికాచ్చ మహాభయాత్ స్ఫులింగినీ చ యా జిహ్వా యతః స లపుద్గలాః తయా నః పాహి పాపేభ్య ఐహికాచ్చ మహాభయాత్ యా తే విశ్వసృజా జిహ్వా ప్రాణినాం శర్మదాయినీ తయా నః పాహి పాపేభ్య ఐహికాచ్చ మహాభయాత్ పింగాక్షః లోహితగ్రీవః కృష్ణ వర్త్మన్ః హుతాశనః త్రాహి మాం సర్వ దోషేభ్యః సంసారా దుద్ధరేహ మామ్ ప్రసీద వహ్నే! సప్తార్చిః కృశానో హవ్యవాహనః అగ్నిపావక శుక్రాది నామాష్టాభి రుదీరితః
“సుధూమ్ర వర్ణ” మను పేరు గల ఏ జిహ్వ ప్రాణుల రోగములను దగ్ధము చేయు చున్నదో, అట్టి జిహ్వచే ఐహిక మహా భయముల నుండి, పాపముల నుండి మమ్ములను రక్షింపుము. “స్ఫులింగినీ” యను పేరుగల ఏ జిహ్వచే ఆత్మ, దేహము ఉత్పన్నమగు చున్నవో, అట్టి నీ యొక్క జిహ్వచే ఐహిక మహా భయముల నుండి, పాపముల నుండి మమ్ములను రక్షింపుము. నీ యొక్క ‘విశ్వ’ యను పేరు గల ఏ జిహ్వ ప్రాణులకు శుభములను ప్రసాదించు చున్నదో, అట్టి జిహ్వచే ఐహిక మహా భయముల నుండి, పాపముల నుండి మమ్ములను రక్షింపుము. ఓ హుతాశనా! నీ నేత్రములు పింగళ (పసుపు పచ్చని) వర్ణములు. కంఠము లోహిత (ఎఱ్ఱని) వర్ణము. మరియు నీవు స్వయముగా కృష్ణ వర్ణము గల వాడవు. నీవు నన్ను అన్ని దోషముల నుండి రక్షింపుము. మరియు నన్ను ఈ ప్రపంచము నుండి ఉద్ధరింపుము. ఓ వహ్నీ! సప్తార్చి, హవ్యవాహన, కృశాను అగ్ని, పావక, శుక్ర, ఇత్యాది ఎనిమిది నామములతో చెప్పబడు చున్నావు. నాపై ప్రసన్నుడవు కమ్ము.
అగ్నేగ్రే సర్వభూతానాం సముత్పత్తి ర్విభావసో ప్రసీద హవ్యవాహాఖ్యః అభిష్టుత మయావ్యయ త్వమక్షయో వహ్ని రచింత్య రూపః సమృద్ధిమాన్ దుష్ప్రసహోతితీవ్రః తవావ్యయం భీమ మశేష లోక, సవర్ధకం హంత్యథవాతివీర్యమ్ త్వ ముత్తమం తత్త్వ మశేష సత్వ, హృత్పుండరీకస్థ మనంత మీడ్యమ్ త్వయా తతం విశ్వ మిదం చరాచరం, హుతాశనైకో బహుధా త్వ మత్ర త్వ మక్షయః సగిరివనా వసుంధరా, నభః ససోమార్క మహర్దివాఖిలమ్ మహోదదే ర్జఠర గతశ్చ బాడబో, భవా న్విభుః పిబతి పయాంసి పావకః హుతాశన స్త్వ మితి సదాభిపూజ్యసే, మహాక్రతౌ నియమపరై ర్మహర్షిభిః అభిష్టుతః పిబసి చ సోమ మధ్వరే, వషట్ కృతాన్యపి చ హవీంషి భూతయే
ఓ అగ్నీ! నీవు అన్ని భూతముల కన్న ముందుగా ఉత్పన్నమైనావు. హే విభావసో! ఓ హవ్యవాహనా! ఓ అవ్యయా! నేను నిన్ను స్తుతించు చున్నాను. నా స్తుతిని నీవు స్వీకరించి నాపై ప్రసన్నుడ వగుము. ఓ వహ్నీ! నీకు క్షయము లేదు. నీ రూపము అచింత్యము. నీవు సమృద్ధి సంపన్నుడవు. ఆశ్రయుడవు. మరియు అతి తీవ్రుడవు. మూర్తివంతుడ వైనను నీ ఎంత బలశాలి వనగా అవ్యయా! భీమ రూపమగు సంపూర్ణ జగత్తును కూడా నాశనము చేయ గలవు. ఓ హుతాశనా! నీవు ఉత్తమ తత్త్వానివి. సంపూర్ణ ప్రాణుల యొక్క హృదయ కమల స్వరూపుడవు. నీవు అందరిచే పూజింపబడు అనంత బ్రహ్మ స్వరూపుడవు. నీవే బ్రహ్మ స్వరూపముతో ఈ చరాచర జగత్తును వ్యాపించినావు. అందు వలన నీవు ఒక్కడివే అయినను అనేక విధాలుగా ఈ ప్రపంచము నందు నిలిచి యున్నావు. ఓ అనలా! నీవు అక్షయుడవు. నీవే పర్వత, వన, యుక్తమైన పృథ్వీ స్వరూపుడవు. నీవే సూర్య చంద్ర యుక్తమగు ఆకాశ స్వరూపుడవు. నీవే పగలు రాత్రి ఇత్యాది నిఖిల కాల స్వరూపుడవు. నీవే మహా సముద్రము నందలి బడబాగ్నివి. నీవే పరమ విభూతిచే అన్ని కిరణముల యందును నిలిచి యున్నావు. ఓ హుతాశనా! నీవు నా హవిస్సులను భుజింపుము. నిష్టాగారిష్టులగు మహర్షి గణాలు మహా యజ్ఞము లందు నిన్ను సదా పూజించెదరు. నీవు కూడా అనేక విధాల స్తవములను పొంది జగత్కళ్యానమునకై సోమ రసమును, వషట్కార పూర్వకముగా పానము చేయు చుందువు.
త్వం విప్రైః సతత మిహేజ్యసే ఫలార్థం, వేదాంగే ష్వథ సకలేషు గీయసే త్వమ్ త్వద్దేతో ర్యజసః పరాయణా ద్విజేంద్రా, వేదంగా న్యధిగమయంతి సర్వకాలే త్వం బ్రహ్మా యజనపర స్తభ్తేన విష్ణు, ర్భూతేశః సురపతి రర్యమా జలేశః సూర్యేందూ సకల సురాసురాశ్చ హవ్యైః, సంతోష్యాభిమత ఫలా న్యథాప్నువంతి అర్చద్భిః పరమ మహోపఘాత దుష్టం, సంస్ప్రుష్టం తవ శుచి జాయతే సమస్తమ్ స్నానానాం పరమ మతీవ భస్మానాం,సత్సంథ్యాయాం మునిభి రతీవ సేవ్యసే తత్ తత్ కృత్వా త్రిదివ మవాప్నువంతి లోకః సద్భక్త్యా సుఖనియతాః సమూహగతిమ్ ప్రసీద వహ్నే! శుచి నామదేయ! ప్రసీద వాయోః విమలాతిదీప్తే ప్రసీద మే పావకః వైద్యుతాభః ప్రసీద హవ్యాశన! పాహి మాం త్వమ్
సమస్త వేదాంగము లందు నిన్నే స్తుతించెదరు. మరియు నీ కొరకు యజన పరాయణులగు ద్విజ శ్రేష్ఠులు సదా వేదాంగములను అధ్యయనము చేయుదురు. యాజన పరుడవగు బ్రహ్మవు నీవే. విష్ణువు నీవే. మరియు భూతనాదుడగు మహా దేవుడవు నీవే. దేవేంద్రుడు, అర్యముడు, జలేశ్వరుడగు వరుణుడు, సూర్యుడు,చంద్రుడు కూడా నీవే. దేవ దానవు లందరును హవ్యముచే నిన్ను సంతుష్టుని చేసి ఫలమును బొందుదురు. అత్యుప ఘాతములచే కలుషిత మైన వస్తువు లన్నియు నీ శిఖా స్పర్శ చేత పవిత్రము లగుచున్నవి. వివిధ స్నానము లందు భస్మ లేపన స్నానమే శ్రేష్టమైనది. ఈ కారణముచే ముని గణాలు సంధ్యా కాలమున అట్టి స్నానమునే చేయుదురు. అట్లు చేయుట వలన స్వర్గ లోకమును పొందుదురు. మరియు సద్భక్తిని పొంది అనేక సుఖములను పొందుదురు. ఓ వహ్నీ! ఈ కారణమున నీవు “శుచి” అను పేరు గల వాడవు. అట్టి రూపము తోనే నాపై ప్రసన్నుడ వగుము. నీవు పవిత్ర ప్రబల వాయు స్వరూపముచే ప్రసన్నుడ వగుము. ఓ పావకా! వైద్యుతాగ్ని ఇత్యాది నామములచే కీర్తింప బడుదువు. అట్టి రూపముతో నాపై ప్రసన్నత జూపుము. ఓ హవ్యవాహనా! నాపై ప్రసన్నత జూపి నన్ను రక్షింపుము.
యత్తే వహ్నేః శివం రూపం యే చ తే సప్త హేతయః తైః పాహి న స్తుతో దేవః పితా పుత్రా మివాత్మజమ్
ఓ వహ్నీ! నాచే స్తుతింప బడి నీ మంగళ స్వరూపములగు జ్వాలలచే తండ్రి పుత్రుని గాపాడు విధమున నీవు నన్ను గాపాడుము.
Summary of chapter 96 of the Mārkandeya Mahā Purana is as follows:
Obeying his ancestors, Prajāpati Ruci offers a profound and beautiful hymn of praise to the Pitṛs, extolling them as divine beings of light who sustain the worlds. He worships them as the recipients of svadhā offerings who grant health, spiritual wisdom, progeny, and heavenly realms to devoted descendants.