మార్కండేయ మహా పురాణము
118 - కరంధమ చరితము
మార్కండేయుడు:
తతః స నృపతి ర్గత్వా గోమతీం పాపనాశినీమ్
తత్ర తుష్టావ నియతో భూత్వా దేవం పురందరమ్.
తప్యమాన స్తపశ్చోగ్రం యతి వాక్కా య మానసః
తుష్టావ వ్రయతః శక్ర మపత్యార్ధం మహీపతిః.
తస్య స్తోత్రేణ తపసా భక్త్వా చాపి సురేశ్వరః
తుతోష భగవా నింద్రః ప్రాహ చైవం మహామునే!.
అనేన తపసా భక్త్వా స్తోత్రేణో చ్చారితేన చ
పరితుష్టోస్మి తే భూప! వ్రియతాం భవతా వరః.
మార్కండేయుడు:
అనంతరము ఖనీనేత్ర మహారాజు పాప నాశిని యగు గోమతీ తీరమునకు బోయి ఇంద్రియ నియమము గలిగి దేవేంద్రుని స్తుతించ సాగెను. ఓ మహామునీ! ఎప్పుడు మహీపతి మనో వక్కాయముల నియమించి పుత్రుని గోరి ఇంద్రుని స్తుతించెనో అప్పుడు సురేశ్వరుడగు దేవేంద్రుడు అతని స్తుతిచే సంతోషించి ఆతనితో నిట్లు బలికెను. ఓ రాజా! నీ యొక్క తపస్సు, భక్తి, స్తోత్ర ఉచ్చారణల వలన నేను అత్యంతము సంతోషించితిని. గాన వరము కోరు కొనుము.
రాజు:
అపుత్రస్య సుతో మేస్తు సర్వశస్త్ర భృతాం వరః
సదా చావ్యహతై శ్వర్యో ధర్మకృ ద్దర్మవిత్ కృతీ.
రాజు:
నేను అపుత్రకుడను సమస్త శస్త్ర ధారులలో శ్రేష్ఠుడు, ప్రతిబంధ రహితుడు ఐశ్వర్య వంతుడు. ధర్మజ్ఞుడు, ధర్మచారి, ధర్మవేత్త యగు పుత్రుడు కలుగు గాక.
మార్కండేయుడు:
తథేతి చోక్తః శక్రేణ రాజా ప్రాప్త మనోరధః
ప్రజాః పాలయితుం భూప ఆజగామ నిజం పురమ్.
తత్రాస్య కుర్వతో యజ్ఞం సమ్య క్పాలయతః ప్రజాః
అజాయత సుతో విప్ర! తదా శక్ర ప్రసాదతః.
తస్య నామ పితా చక్రే బలాశ్వ ఇతి భూపతిః
అస్త్రగ్రామ మశేషం చ గ్రహయామాస తం సుతమ్.
పిత ర్యుపరతే విప్ర! సోధిరాజ్యే స్థితో నృపః!
స బలాశ్యో వశం నిన్యే భువి సర్వ మహీక్షితః.
కరం చ దాపయా మాస సారగ్రాహణ పూర్వకమ్
స సర్వ భూమిపా న్రాజా పాలయామాస చ ప్రజాః.
మార్కండేయుడు:
రాజు ప్రార్ధన విని ఇంద్రుడు “అటులే యగు గాక” యని వరమిచ్చెను. అప్పుడు రాజు ప్రజా పాలనకై తిరిగి తన పురమునకు వచ్చెను. ఆ రాజు యజ్ఞా నుష్టానము, ప్రజా పాలనము చేయుచుండ ఇంద్రుని అనుగ్రహముచే ఒక కుమారుడు జన్మించెను. రాజు ఆ కుమారునికి “బలాశ్వుడు” అని పేరు బెట్టెను. మఱియు వానికి సంపూర్ణ అస్త్ర విద్యలను గ్రహింప జేసెను. విప్రా! బలాశ్వుడు తండ్రి మరణించిన పిమ్మట సామ్రాజ్యమునకు రాజు అయి, భూమి యందలి సమస్త రాజులను తన వశము చేసి కొనెను. మరియు ధర్మ పూర్వకముగా పన్నును స్వీకరించెను. ప్రజా పాలనము చక్కగా చేయు చుండెను.
అతాఖిల నరేంద్రా స్తే దాయాదా స్తస్య దుర్మదాః
న చాభ్యుత్థాయ సతతం తే చాస్మై ప్రదదుః కరాన్.
వ్యుత్థితః స్వేషు రాష్ట్రేషు న సంతోషపరా స్తతః
భువం తస్య నరేంద్రస్య జగృహు స్తే నరాధిపాః.
స గృహీత్వా స్వకం రాజ్యం పృథివీశో బలాన్ మునే
తస్థౌ స్వసగరే భూపై ర్విరోధో బహుభిః కృతః.
సమేత్య సుమహావీర్యాః ససాధన ధనా స్తతః
రురుధు స్తం మహీపాలం పురే తత్రే పరేశ్వరాః.
పరరోధేన తేనాథ కుపితః స మహీపతిః స్వల్ప
కోశోల్పదండశ్చ వైక్లబ్యం పర మాగతః.
అనంతరము సమస్త రాజులు, దుర్మదులగు జ్ఞాతి గణాలు అభ్యుత్ధాన రూపమగు సత్కారమును చేయక పన్నులు చెల్లించుట మాని వేసిరి. మరియు వారు అభ్యుత్థాన రహితులై స్వార్ధముతో రాజ్య శాసనము చేయుటతోనే సంతుష్టులు కాలేదు. చివరకు వారు ఆ బలాశ్వ రాజు యొక్క అదీనములో నున్న భూములను కూడ చేజిక్కించు కొనిరి. పృథ్వీశ్వరు డగు బలాశ్వుడు అనేక మంది రాజులతో యుద్దము చేసి హీన బలుడై తన రాజ్యమును మాత్రము దక్కించు కొని తన రాజధాని యందు నివసించు చుండెను. సాధన ధన సంపన్నులు, మహా బలవంతులైన ఆ రాజు లందఱు ఆతని పురమును జుట్టు ముట్టిరి. ఆ రాజు పురమును ముట్టడించు టచే అత్యంత కుపితు డయ్యెను. కాని ఆ బలశాలి యగు బలాశ్వుడు ఆ సమయమున స్వల్ప కోశము, కొద్ది సైన్యము గల వాడు అగుటచే మిక్కిలిగా విషాదము పొందెను.
అపశ్యమానః శరణం సబలో ద్విజ సత్తమ!
కరౌ ముఖాగ్రతః కృత్వా నిశాస్వాసార్తమానసః.
తతోస్య హస్తవివరాన్ ముఖానిల సమాహతాః
నిర్జగ్ముః శతశో యోధా రథనాగ తురంగామాః.
తతః క్షణేన తత్సర్వం నగరం తస్య భూపతేః
వ్యాప్త మాసీ ద్భాలౌఘేన సారేణాతిబలా న్మునే!.
అథ సోతి బలౌఘేనా మహతా తేన సంవృతః
నిర్మథ్య నగరా త్తస్మా త్తా న్విజగ్యే నరాధిపః.
జిత్వా చ వశ మానీయ చకార కరదాన్ పునః
యథాపూర్వం మహాభాగ! మహాభాగ్యో నరేశ్వరః.
రక్షణకై వేరొక ఉపాయము కనబడక అత్యంత వికలు డయ్యెను. మరియు వ్యథిత హృదయుడై రెండు చేతులను ముఖముపై నుంచుకొని దీర్ఘ మగు శ్వాసమును విడువ సాగెను. అట్లు చేయుటచే అతని హస్తముల నుండి వచ్చు చున్న వాయువు వలన వందల కొలది యోధులు, రథములు, గుఱ్ఱములు, ఏనుగులు వచ్చు చుండెను. ఓ మునీ! ఈ విధముగా క్షణ కాలములోనే సర్వోత్తమ బలశాలురు అగు ఆ సైన్య సమూహములచే భూపతి యొక్క నగర మంతయు వ్యాపించెను. అనంతరము మహత్తర మగు ఆ సైన్యముతో రాజు నగరము నుండి వచ్చి శత్రువులను గెలిచెను. ఓ మహాభాగా! అప్పుడు నరపతి పరాజితులను చేసి తన వశము గావించు కొని, పూర్వము వలె కప్పములు చెల్లించు నట్లు నియమించి సౌభాగ్య శాలి అయ్యెను.
దుతాయోః కరయో ర్జజ్ఞే యథా స్తస్యారిదాహదమ్
బలం కారంధమ స్తస్మా త్స బలాశ్వోభిదీయతే.
స ధర్మాత్మా మహాత్మా చ స మైత్రః సర్వ జన్తుషు
కరందిమోభవ ద్భూప స్త్రిషు లోకేషు విశ్రుతః.
సం ప్రాప్తస్య పరా మార్తిం దదా వరివినాశనమ్
బలం ధర్మేణ చాక్షిప్త మభ్యుపేత్య స్వయం నృపమ్.
బలాశ్వుని యొక్క కంపితము లగు రెండు చేతుల మధ్య నుండి శత్రువులను వధించు నట్టి సైన్యము పుట్టుటచే బలాశ్వుడు “కరంధము” డను పేరుతో విఖ్యాతి చెందెను “కరంధముడు” మూడు లోకము లందును విఖ్యాతుడు, ధర్మాత్ముడు, మహాత్ముడు మరియు సర్వ ప్రాణుల యందు మైత్రీ భావము కలవాడు నుండెను, ఆ రాజు స్వయముగా ధర్మ ప్రదత్త మగు బలమును పొంది శత్రువులకు దుఃఖము కలిగించి వారిని నాశనము చేసెను.
Summary of chapter 118 of the Mārkandeya Mahā Purana is as follows:
King Khanitra's forest penance is celebrated as he dissolves all personal desires and merges his consciousness in the Supreme Soul, setting a luminous example of royal detachment and forgiveness.