మార్కండేయ మహా పురాణము
98 - వంశానుకీర్తనము
క్రౌష్టుకి:
భగవ! న్కధితా సమ్య క్త్వయా మన్వంతర స్థితిః
క్రమా ద్విస్తరత స్త్వత్తో మయా చైవావధారితా.
బ్రహ్మాద్య మఖిలం వంశం భూభుజజాం ద్విజ సత్తమ!
శ్రోతుం మమేచ్చతః సమ్య గ్భగవన్! ప్రబ్రవీహి మే.
క్రౌష్టుకి:
ఓ భగవానుడా! మీరు మన్వంతరముల విషయములను చక్కగా చెప్పితిరి. మరియు నేను క్రమముగా ఆ విషయములను మీ వలన విస్తార సహితముగా వింటిని. ఓ ద్విజ సత్తమా! బ్రహ్మ మొదలుకొని రాజుల యొక్క సంపూర్ణ వంశములను విన వలెనని కోరు చున్నాను. ఓ భగవానుడా వాటిని నాకు చక్కగా వర్ణించి చెప్పుడు.
మార్కండేయుడు:
శృణు వత్స! నృపాణాం త్వ మశేషాణాం సముద్భవమ్
చరితం చ జగ న్మూల మాదౌ కృత్వా ప్రజాపతిమ్
ఆయం హి వంశో భూపాలై రనేక క్రతు కర్తృభిః
సంగ్రామజిద్భి ర్దర్మజ్ఞైః శత సంఖ్యే రలంకృతః
శ్రుత్వా చైషాం నరేంద్రాణాం చరితాని మహాత్మనామ్
ఉత్పత్తయశ్చ పురుషః సర్వపాపైః ప్రముచ్యతే
మార్కండేయుడు:
ఓ వత్సా! నీవు జగత్తుకు మూలమగు ప్రజాపతి యగు బ్రహ్మ నుండి ఆరంభించి సంపూర్ణ రాజుల యోక్క జన్మ వృత్తాంతములను, మరియు చరిత్రలను వినుము. అనేక యజ్ఞములు చేసిన వారు, రణ విజయములు పొందిన, ధర్మజ్ఞులు, అగు వందల సంఖ్యలలో ఉన్న రాజులతో ఈ వంశములు అలంకృత ములై ఉన్నవి. మహాత్ము లగు ఈ రాజుల ఉత్పత్తి విషయములను మరియు అందరి చరిత్రమును, విన్న పురుషుడు సమస్త పాపముల నుండి విడువ బడును.
మను ర్యత్ర తతేక్ష్వాకు రనరణ్యో భగీరథః
అన్యే చ శతశో భూపాః సమ్య క్పాలిత భూమయః
ధర్మజ్ఞా యజ్వనః శూరాః పరమార్దార్ద వేదినః
శ్రుతే తస్మిం పూమాన్వం శే పాపౌఘా ద్విప్రముచ్యతే.
తదయం శ్రూయతాం వంశో యతో వంశాః సహ సశః
భిద్యంత్యే మనుజేంద్రాణా మవరోహా యథా వటాత్.
బ్రహ్మా ప్రజాపతిః పూర్వం సిసృక్షు ర్వివిధాః ప్రజాః
అంగుష్టా ద్దక్షిణా ద్దక్ష మసృజ ద్ద్విజ సత్తమ!
వామాంగుష్టాచ్చ తత్పత్నీం జగత్సూతికరో విభుః
ససర్జ భగవాన్ బ్రహ్మ జగతాం కారణం పరమ్.
ఏ వంశ మందు మనువు, ఇక్ష్వాకుడు, అనరాణ్యుడు, భగీరథుడు మరియు వందల కొలది ధర్మజ్ఞులు, యజ్ఞ కారులు, శూరులు, పరమ జ్ఞానులు అగు భూపాల గణాలు జన్మించి, బాగుగా భూమిని పాలించి యుండిరో, ఆ వంశముల యొక్క విషయములను వినిన పురుషుడు సంపూర్ణ పాప సమూహము నుండి విడువ బడును. వట వృక్షము నుండి అంకురము ఉత్పన్నమై ఏ విధముగా అది స్వతంత్ర వట వృక్ష రూపములో పరిణతి చెందునో, అదే విషముగా ఈ వంశముల నుండి మనుజేంద్ర గణాల యొక్క సహస్ర సహస్రముల వంశములు ఉత్పన్న మైనవి. వానిని వినుము. ఓ ద్విజోత్తమా! పూర్వ కాల మందు ప్రజాపతి యగు బ్రహ్మ వివిధ ములగు ప్రజలను ఉత్పన్నము చేయ వలెనను కోరికచే కుడి చేతి యందలి బొటన వ్రేలు నుండి ‘దక్షుడు’ అను వానిని సృష్టించెను. జగత్ప్రసవ కారి యగు ప్రభువు, భగవానుడు అగు బ్రహ్మ జగత్తు యొక్క సృష్టి కొఱకు ఎడమ చేయి బొటన వ్రేలు నుండి దక్షుని భార్యను సృష్టించెను.
అదితి స్తస్య దక్షస్య కన్యాజాయత శోభనా
తస్యాం చ కశ్యపో దేవం మార్తాండం సమజజినత్.
బ్రహ్మ స్వరూపం జగతా మషేషాణాం వరప్రదమ్
ఆది మధ్యంతభూతం చ సర్గ స్థిత్యంత కర్మను.
యతోఖిల మిదం యస్మి న్న శేషం చ స్థితం ద్విజ!
యత్స్వరూపం జగచ్చేదం సదేవాసుర మానుషమ్.
యః సర్వ భూతః సర్వాత్మా పరమాత్మా సనాతనః
ఆదిత్యా మభవ ద్భాస్వాన్ పూర్వ మారాదిత స్తయా
ఆ దక్షునికి అదితి అను పేరు గల సుందరి యగు కన్య జన్మించెను. ఆమె గర్భము నుండి కశ్యపుని వీర్యముచే ఆదిత్యుడు జన్మించెను. ఓ ద్విజుడా! ఎవరు బ్రహ్మ స్వరూపమై అశేష జగత్తునకు వరము నిచ్చు వాడై ఉన్నాడో, సృష్టి, స్థితి, ప్రళయ, క్రియల యందు ఎవరు ఆది, మధ్యాంత స్వరూపుడై ఉన్నాడో, మఱియు ఎవరు సనాతనుడై పరమాత్ముడై ఉన్నాడో, అట్టి సూర్య భగవానుడు పూర్వము అదితిచే ఆరాధింప బడి ఆమె గర్భము నుండి జన్మించెను.
క్రౌష్టుకి:
భగవన్! శ్రోతు మిచ్చామి తత్స్వరూవం వివస్వతః
యత్కారణం చాదిదేవః సోభవ త్కశ్యపాత్మజః
క్రౌష్టుకి:
ఓ భగవానుడా! వివస్వాను డగు సూర్యుని యొక్క ఏ స్వరూప మున్నదో మరియు ఏ కారణముచే ఆ ఆది దేవుడు కశ్యపుని పుత్రు డయ్యెనో దానిని విన వలె నని కోరు చున్నాను.
యథా చారాధితో దేవ్యా సోదిత్యా కశ్యపేన చ
ఆరాధితేన చోక్తం యత్ తేన దేవేన భాస్వతా
ప్రభావం చావతీర్ణస్య యథావన్ మునిసత్తమ!
భవతా కథితం సమ్యక్ చ్రోతు మిచ్చా మ్యశేషతః.
మఱియు అతడు ఏ విధముగా కశ్యపుడు మరియు అదితి దేవిచే ఆరాధింప బడెనో, ఆరాదింప బడి ఆ బాస్కర దేవుడు ఏమి చెప్పెనో, గృహీత జన్ముడగు దివాకరుని ప్రభావము ఇంతకు ముందు మీరు ఏ విధముగా చెప్పిరో, ఓ ముని సత్తమా! అవన్నియు చక్కగా సవిస్తరముగా విన వలెనని కోరు చున్నాను.
మార్కండేయుడు:
విస్పష్టా పరమా విద్యా జ్యోతి ర్భా శాశ్వతీ స్ఫుటా
కైవల్యం జ్ఞాన మావిర్భూః ప్రాకామ్యం సంవిదేవ చ
భోధశ్చావగతి శ్చైవ స్మృతి ర్విజ్ఞాన మేవ చ
ఇత్యేతా నీహ రూపాణి తస్యారూపస్య భాస్వతః
శ్రూయతాం చ మహాభాగ! విస్తరా ద్వాదతో మమబ్
యత్ పృష్టవా ససి రవే రావిర్భావో యథాభవత్.
మార్కండేయుడు:
విస్పష్టా, పరమా, విద్యా, జ్యోతి, శాశ్వతీ, ప్రకాశితా, దీప్తి, కైవల్య. జ్ఞాన, ఆవిర్భావ, ప్రాకామ్య సంవిత్, భోధ, ఆవగతి, స్మృతి, విజ్ఞానము లన్నియు రూప రహితుడగు సూర్య దేవుని స్వరూపములు. ఓ మహాభాగా! నీవు “రవి ఏ విధముగా ఆవిర్భవించెను?” అని అడిగితివి. దానిని నేను విస్తారముగా చెప్పెదను. వినుము.
నిష్ప్రభేస్మి న్నిరాలోకే సర్వత స్తమసావృతే
బృహదండ మభూ దేక మక్షరం కారణం పరమ్.
తాద్భిభేద తదంతస్థో భగవాన్ ప్రపితామహః,
పద్మయోనిః స్వయం బ్రహ్మా యః స్రష్టా జగతాం ప్రభుః.
తన్ముఖా ధోమితి మహా నభూ చ్చబ్దో మహామునే!
తతో భూస్తూ భువ స్తస్మాత్ తతశ్చ స్వ రానంతరమ్.
ఏతా వ్యాహృతయ స్తిస్రః స్వరూపం త ద్వివసతః
ఓ మిత్యస్మా త్స్వ రూప్పాత్తు సూక్ష్మ రూపం రవేః పరమ్.
తతో మహరితి స్థూలం జనం స్తూలతరం తతః
తత స్తప స్తపః సత్య మితి మూర్తాని సప్తథా.
సృష్టి ముందు ఎప్పుడైతే ఏమియు లేదో, అప్పుడు ఈ జగత్తు ప్రభా హీనముగా, నిరా లోకముగా బాగుగా అంధ కారముచే కప్పబడిన సమయ మందు అక్షయము, జగదు త్పత్తికి పరమ కారణ మయినది యగు ఒక పెద్దదగు అండము (గ్రుడ్డు) జన్మించెను. దాని మథ్య యందున భగవానుడు, పితా మహుడు, పద్మయోని యగు బ్రహ్మ ఉండెను. ఎవరు జగత్తు యొక్క సృష్టి కర్తయై ఉన్నాడో అట్టి ప్రభువగు బ్రహ్మ స్వయముగా ఈ అండమును భేదించి బయలు వెడలెను. ఓ మహా మునీ! ఆ బ్రహ్మ ముఖము నుండి ఆ సమయమున “ఓమ్” అను శబ్దము కలిగెను. ఈ ఓం కారము నుండి మొదట “భూః” తర్వాత “భువః” ఆ తర్వాత “స్వః” అను శబ్దములు ఉత్పన్న మయ్యెను. ఈ మూడు విధముల వ్యాహృతులే సూర్య భగవానుని స్వరూపములు. ఈ “ఓమ్” స్వరూపము నుండియే రవి యొక్క అతి సూక్ష్మ రూప మున్నది. తర్వత దాని స్థూల రూప మగు “మహః” ఆ తర్వాత స్థూల రూపమగు “జనః” తిరిగి దాని కన్నను కూడా స్థూల రూపమగు “తపః” అనంతరము దాని కంటెను కూడా స్థూల రూపమగు “సత్యః” అనునవి ఉత్పన్న మయ్యెను. ఇవి సూర్యుని యొక్క సమస్త స్థూల రూపములు అని చెప్పుదురు. ఓం కారము నుండి వినస్వానుని యొక్క స్థూల సూక్ష్మ రూపములచే ఈ ఏడు రూపములు ఉత్పన్న మైనవి.
స్థితాని తస్య రూపాణి భవంతి చ
స్వభావ భావయో ర్భావం యతో గచ్చంతి సంశయమ్.
ఆద్యంతం యత్పరం సూక్ష్మ మరూపం పరమం స్థితమ్
ఓ మిత్యుక్తం మయా విప్ర! తత్పర బ్రహ్మ తద్వపుః.
భాస్కర భగవానుని యొక్క రూపము లైనప్పటికి ఇవి ఒకప్పుడు ప్రకాశించును, మరి యోకప్పుడు అప్రకాశముగ నుండును. వాని స్వభావములు మఱియు భావము యొక్క అస్తిత్వములు కూడా సంశయమును పొందు చుండును. ‘ఓ విప్రా! ఈ విశ్వము యొక్క ఆద్యంతములు యందు ఎట్టి రూప విహీనుడు అతి సూక్ష్మ పరమాత్ముడు స్థితుడై ఉన్నాడో, నేను ఎట్టి ఓం కారమును చెప్పితినో’ ఆ ఓం కారము అతడే. ఓ విప్రా! ఆ పర బ్రహ్మయే మార్తాండ దేవుని శరీరము అయి యున్నది.
Summary of chapter 98 of the Mārkandeya Mahā Purana is as follows:
Prajāpati Ruci marries the divine maiden Mālinī, daughter of the apsaras Pramlocā, with the blessings of the Pitṛs. From their union is born the radiant Raucya Manu, under whose righteous stewardship the Ninth Manvantara flourishes with peace, truthfulness, and spiritual prosperity.