మార్కండేయ మహా పురాణము
53 - గంగావతరణ వర్ణనము
మార్కండేయుడు:
ధరాధారం జగద్యోనేః పదం నారాయణస్య చ తతః ప్రవృత్తా యా దేవీ గంగా త్రిపథగామినీ సా ప్రవిశ్య సుదాయోనిం సోమ మాధార మంభసామ్ తతః సంబద్ధ మానార్క రశ్మి సంగతి పావనీ పపాతమేరుపృష్టేచ సా చతుర్థా తతో యయౌ మేరుకూటతటాంతే నిపతంతీ వివర్తితా విరీర్యమాణ సలిలా నిరాలంబా పపాత సా మందరాద్యేషు పాదేషు ప్రవిభక్తోదకా సమమ్ చతుర్శ్వపి పపాతాంబు విభిన్నాం ఘ్రి శిలోచ్చయా పూర్వా సీతేతి విఖ్యాతా యయౌ చైత్రరథం వనమ్
మార్కండేయుడు:
జగద్యోని యగు నారాయణుని ఏ ధ్రువాధారమని పేరుగల పదము ఉన్నదో దాని నుండియే త్రిపథగామిని యగు గంగా దేవి ఉత్పన్న మైనది. పిమ్మట ఆ సమస్త జలాధార స్వరూప సుధాయోని చంద్ర మండలము నందు ప్రవిష్టమై అక్కడ సంబధ్య మానమగుచు సూర్యుని కిరణాలతో కలియుటచే అతి పవిత్రమై సుమేరు పర్వతము పైన పడు చున్నది. మరియు అక్కడి సమస్త కూత తటముల నుండి నిపతిత నివర్తమై నాలుగు ధారలుగా నిర్గత మయ్యెను. ఈ విధముగా జలమును విస్తరింప జేయుచు ఆరలంబన రహిత యగు గంగా దేవి సమస్త మందరాది పర్వతముల నుండి సమాన ప్రవహించు చుండును. క్రమముగా సమస్త పర్వతముల యొక్క శిలలను పగుల గొడుతూ వెళ్ళెను. అందులో గంగా దేవి యొక్క ఏ జలధార తూర్పు దిక్కునందు ప్రవహించుచు చైత్రరథ వనము వైపుగా వెళ్ళెనో దాని పేరు ‘సీత’ అని ఖ్యాతి చెందినది.
తత్ల్పావయిత్వా చ యయౌ వరుణోదం సరోవరమ్ శీతాంతం చ గిరిం తస్మా త్తత శ్చాన్యాగిరీ క్రమాత్ గత్వా భువం సమాసాద్య భద్రాశ్వే జలధిం గతా తథైవా లకనందాఖ్యా దక్షిణే గంధమాదనే మేరుపాదే వనం గత్వా నందనే దేవనందనమ్ మానసంచ మహావేగా త్ప్లావయిత్వా సరోవరమ్ ఆసాద్య శైలరాజానం రమ్యం త్రిశిఖరం గతా తస్మాచ్చ పర్వతా న్సర్వా న్దక్షిణే యేక్ర మోదితాః తాం ప్లావయిత్వా సంప్రాప్తా హిమవంతం మహాగిరిమ్ దధార తత్ర తాం శంభు ర్నముమోచ వృషధ్వజః
ఆ సీత అను పేరుగల గంగ చైత్రరథ వనమును జలమయము చేసి వరుణోద సరోవరము లోనికి వెళ్ళెను. తిరిగి అక్కడి సీతాంత పర్వతము మొదలగు ఇతర పర్వతములను అతిక్రమించి, భూమి యందు ప్రవహించి భద్రాశ్వ వర్షము నుండి సముద్రము లోనికి వెళ్ళెను. సుమేరు పర్వతము యొక్క దక్షిణ దిక్కు నుండి గంగ యొక్క ఏ జలము గంధమాధన పర్వతము నుండి పడు చున్నదో దాని పేరు “అలకనంద”. ఈ అలకనంద మేరు పర్వతము యోక్క సమీపము నుండి దేవతలకు ఆహ్లాదజనకమై, నందన వనము లోనికి వెళ్లి, మహా వేగముతో మానస సరోవరమును ప్రవహింప జేసెను. మానస సరోవరమును ప్రవహింప జేసిన తరువాత పర్వత రాజమగు రమ్య పర్వతము యొక్క శిఖర దేశము నుండి దక్షిణ మండలి సమస్త పర్వతములను అతిక్రమించి ప్రవహిస్తూ, మహాద్రియగు, హిమాలయ మందు ప్రవహించెను. అక్కడ వృషధ్వజుడు భగవానుడగు శంభుడు గంగను ధరించెను. ఆయన ఏ విధముగాను ఆ నీటిని విడువ లేదు.
భగీరథే నోపవాసైః స్తుత్వా చారాధితో విభుః తత్ర ముక్తా చ శర్వేణ సప్తథా దక్షిణోదధిమ్ ప్రవివేశ త్రిథా ప్రాచ్యాం ప్లాపయ తో మహానదీ భగీరథ రథస్యాను స్రోతసైకేన దక్షిణామ్ తథైవ పశ్చిమో పాదే విపులే సా మహానదీ సుచక్షు రితి విఖ్యాతా వై భాజం సా వనం యయౌ శీతోదం చ శర స్తస్మా త్ప్లావయంతీ మహానదీ తస్మా త్క్రమేణ చాద్రీణాం శిఖరేషు నిపత్య సా కేతుమానం సమాసాద్య ప్రవిష్టా దక్షిణోదధిమ్ ( గత్వోత్తరాం దిశం గంగా దివ్యా సా చ మహానదీ తస్మాచ్చ బుషభాదీంశ్చ క్రమా ద్రుత్తరజా న్నగాన్ )
అనంతరము ఎప్పుడు మహా రాజగు భగీరథుడు ఉపవాసము, స్తుతి మొదలగు వాటిచే అతనిని ఆరాధించెనో, అప్పుడు ఆయన గంగను వదలి పెట్టెను. గంగా నది శ్రీ మహా దేవునిచే విడవ బడుతూనే సప్త భాగములై దక్షిణ సముద్రము నందు కలిసెను. అందు మహా నది యొక్క మూడు ధారలు తూర్పు వైపు ప్రవహించి సముద్రము నందు కలిసెను. ఒకధార భగీరథుని రథము వెనుకనే వెళ్ళుచు దక్షిణ సముద్రములో కలిసెను. సుమేరు పర్వతము యొక్క పశ్చిమ దిక్కునందు విపుల పాదయై గంగా నది యొక్క ఏ ధారా వెలువడు చున్నదో ఆ మహానది పేరు “సుచక్షువు”. అది పర్వతము నందలి లైభ్రాజ వనమును పవిత్రము చేసి శీతోద సరోవరము పల్లవింప చేసెను. అక్కడి నుండి క్రమాను సారము సర్వ పర్వతముల యొక్క శిఖరముల యందు చేరి తిరిగి కేతుమాల వర్షమందు ప్రవేశించి దక్షిణ సముద్రము నందు కలిసెను.
సుపార్శ్వం తు రథైవాద్రిం మేరుపాదం హిసా గతా
భద్రసోమేది విఖ్యాతా సాయయౌ సవితు ర్వనమ్ తత్సావయంతీ సంప్రాప్తా మహాభద్రం సరోవరమ్ తతశ్చ శంఖ కూటం సా ప్రయతా వై మహానదీ తస్మాచ్చ వృషభాదీన్సా క్రమాత్ప్రాప్య శిలోచ్చయాన్ మహిర్ణవ మనుప్రాప్తా ప్లావయిత్వోత్తరా న్కురూన్ ఏవయేషా మయా గంగా కథితాతే ద్విజర్శభః జంబూ ద్వీపనివేశశ్చ వర్షాణి చ యథాతథమ్ వసంతి తేషు సర్వేషు ప్రజాః కింపురుషాదిషు సుఖపాత్రా నిరాతంకా న్యూనతో త్కర్క వర్షితాః
ఆ తరువాత ఈ మహా నది ఉత్తర దిక్కునకు వెళ్లి, తిరిగి ఋషభాది ఉత్తర పర్వతము లోనికి వెళ్ళెను. ఈ నాల్గవ ధార సుపార్శ్వ మేరు పర్వతముల పైపై మీదుగా వెళ్ళుచు సవితృ వనమందు చేరెను. అక్కడ దాని పేరు “భద్రసోమ” అని ఖ్యాతి చెందినది. ఆ భద్ర సోమయను గంగ సవిత్రు వనమును పవిత్రము చేసి మహాభద్ర సరోవరము నందు చేరెను. అనంతరము ఆ మహా నది శంఖ కూట పర్వతమునకు బోయెను. అక్కడి నుండి వృషబాది పర్వతముల యందు చేరి, సమస్త ఉత్తర కురు దేశమును పవిత్రము చేసి మహా సాగరము నందు కలిసి పోయెను. ఓ ద్విజశ్రేష్టా! నేను నీకు ఈ గంగ యొక్క విషయము నంతయు వర్ణించితిని. జంబూ ద్వీపము యొక్క నివేశము నందు ఎట్టి, కింపురుషాది సమస్త వర్షములు వర్ణించ బడినవో వాటి యందు యథా విధిగా ఏ ప్రాణులన్నియు నివసించునో, అవి తరచుగా సుఖము నిరాతంకము, నూతనత్యము అధికముగా కలిగి ఉండును.
నవస్వాపి చ వర్షేషు సప్త సప్త కులాచలాః ఏకైక స్మిం స్తథా దేశే నద్యశ్చాద్రి వినిః సృతాః యాని కింపురుషాద్యాని వర్షాణ్యష్టౌ ద్విజోత్తమః తేషుజ్జాద్భిని తోయాని నైవం వార్యత్ర భారతే వార్శీస్వాభావికీ దేశ్యా తోయోత్థా మానసీ తథా కర్మజా చ నృణాం సిద్ధి ర్వర్షే ష్వేతేషు చాష్టసు కామ ప్రదేభ్యో వృక్షేభ్యో వార్షీ సిద్ధిః స్వభావజా స్వాభావికీ సమాఖ్యాతా తృప్తి ర్దేశ్యా చ దైశికీ అపాం సౌక్ష్మ్యాచ్చ తో యోత్థా ద్ధ్యానోపేతా చ్చ మానసీ ఉపాసనాది కార్యాత్తు కర్మజాసాప్యుడా హృతా న చైతేషు యుగావస్థా నాధయో వ్యాధయో న చ పుణ్యా పుణ్య సమారంభా నైవ తేషు ద్విజోత్తమః
వీనిని నవ వర్షములని చెప్పబడునో వాని యందు కూడా ఏడు కులాచలములు ఉన్నవి. ప్రత్యేక దేశ మందు పర్వత ప్రవాహిత సమస్త నదులు విద్యమానమై ఉన్నవి. ఓ ద్విజోత్తమా! కింపురుషాది ఏ ఎనిమిది వర్షము లున్నవో, వాని యందు ఏ జలము ఉన్నదో, అది కేవలము ఉద్భిజ్జ అయి ఉన్నది. ఎందుచేత ననగా ఈ భారత వర్షము నందే మేఘముల యొక్క జలము కలుగును. ఏ ఎనిమిది వర్షములు ఉన్నవో అక్కడ వార్క్షి, స్వాభావికి, దేశ్య, తోయోత్థా, మానసి, కర్మజ, అను ఈ ఆరు విధాల, మనస్సు యొక్క సిద్ధి యగును. అభిలాష ప్రసాదించు నట్టి వృక్షము నుండి ఏ సిద్ధి ఉత్పన్న మగునో దాని పేరు “వార్షి” స్వభావముచే ఉత్పన్నమగు సిద్ధి యొక్క పేరు “స్వాభావికి” దేశజాత యగు సిద్ధి పేరు “దేశ్య” జలము యొక్క సూక్ష్మతావశమున ఏ సిద్ధి కలుగునో అది “ మానసీ సిద్ధి” ధ్యానము ద్వారా సంపాదించ వచ్చు. ఉపాసనాది కార్యముల ద్వారా ఏ సిద్ధి లాభమో అది “కర్మజ” అను పేరుతో విఖ్యాతి చెందినది. ఓ ద్విజోత్తమా! ఈ సమస్త వర్షముల యందు యుగ భేదము ఆది వ్యాధులు, పుణ్య, పాపమున యొక్క సమారంభములు కొంచెమైనను ఉండవు.
Summary of chapter 53 of the Mārkandeya Mahā Purana is as follows:
The divine life of Bhagavān Ṛshabhadeva unfolds as He demonstrates perfect spiritual detachment, ascetic vows, and supreme wisdom before entrusting the empire to his eldest son Bharata. King Bharata rules the land with such exemplary virtue and devotion that the entire sub-continent is henceforth named Bhāratavarsha in his honor.