మార్కండేయ మహా పురాణము
94 - రుచికి పితృ వర ప్రదానము
మార్కండేయుడు:
ఏవం తు స్తువత స్తస్య తేజసో రాశి రుచ్చ్రితః
ప్రాదు ర్భభూవ సహసా గగన వ్యాపి కారకః
తద్దృష్ట్వా సుమహ త్తేజః సమాసాద్య స్థితం జగత్
జానుభ్యా మవనిం గత్వా రుచి స్తోత్ర మిదం జగౌ.
మార్కండేయుడు:
ఎప్పుడైయితే రుచి ఈ విధముగా స్తుతించెనో. అప్పుడు వెంటనే అతని ఎదుట ఉచ్చ శిఖలతో గగన వ్యాపకము అగు తేజో రాశి ఉద్భవించెను. సమస్త జగత్తును కప్పియున్న ఆ తేజస్సును చూచి రుచి జానవులతో భూమి స్పృసించి ఈ స్తోత్రమును కీర్తించెను.
రుచి:
అమూర్తానాం చ మూర్తానాం పితౄణాం దీప్త తేజసామ్
నమస్యామి సదా తేషాం ధ్యానినాం దివ్య చక్షుపామ్.
ఇంద్రాదీనాం చ నేతారో దక్ష మారీచయో స్తధా
సప్తర్షీణాం తదాన్యేషాం తా న్న మస్యామి కామదాన్.
మన్వాదీనాం మునీంద్రాణాం సూర్య చంద్రమసో స్తధా
తా న్నమాస్యా మ్యహం సర్వా న్పితర శ్చార్ణవేషు యే.
ఋచి:
పితృ దేవతలారా! మూర్తా మూర్త స్వరూపులు. దీప్త తేజస్కులు, ధ్యానరతులు, దివ్య నేత్రములు గలిగిన మిమ్ములను నేను ఎల్లప్పుడు నమస్కరించెదను. దక్షుడు, మరీచి, ఇంద్రాదులు. ఇతరులగు వారందరి నాయకుల కోరికలు దీర్చువారు అగు పితృ దేవతలకు నమస్కరించు చున్నాను. మనువు మొదలగు వారికి, మునీంద్రులకు సూర్య చంద్రులకు కోరికలు దీర్చు వారు. మఱియు సముద్రము లందు ఉన్న వారును, అగు సమస్త పితృ దేవతలకు నమస్కరించు చున్నాను.
నక్షత్రాణాం గ్రహాణాం చ వాయ్వగ్న్యో ర్నభాస స్తథా
ద్యావాపృథి వ్యోశ్చ తధా నమస్యామి కృతాంజలిః.
దేవర్షీణాం గ్రహాణాం చ సర్వలోక నమస్కృతాన్
అక్షయ్యస్య సదా దాతౄన్ నమస్యేహం కృతాంజలిః
నమో గణేభ్యః సప్తభ్య స్తధా లోకేషు సప్తసు
స్వయంభువే నమస్యామి బ్రహ్మణే యోగాచక్షుషే.
సోమాధారాన్ పితృగణాన్ యోగామూర్తిధరాం స్తధా
నమస్యామి తధా సోమం పితరం జగతా మహమ్.
ఎవరు నక్షత్రములు, గ్రహములు, వాయువు, అగ్ని, ఆకాశము, స్వర్గము మఱియు పృథ్వీ యొక్క అధిపతులు అయి ఉన్నారో, అట్టి పితృ దేవతలకు చేతులు జోడించి నమస్కరించు చున్నాను. దేవర్షులకు, గ్రహములకు అక్షయ ఫలము నిచ్చు వారును సర్వ లోక నమస్కృతులును, అగు పితృ దేవతలకు సదా చేతులు జోడించి, నమస్కరించెదను. ఎవరు సప్త లోకముల యందు సప్త గణముల యందున్నారో. వారికి నమస్కరించు చున్నాను. మఱియు యోగ చక్షవులు కలవారును, స్వయంభువు బ్రహ్మ యొక్క స్వరూపము గల పితరులకు నమస్కరించు చున్నాను. ఎవరు సోమునికి ఆధారమై యున్నారో. యోగ మూర్తి రూప ధారులైన వారును, సోమ రూపులై మరియు జగత్తునకు తండ్రులై యున్నారో, అట్టి పితరులకు నేను నమస్కరించు చున్నాను.
అగ్నిరూపాం స్తథైవాన్యాస్ నమస్యామి పితౄ నహమ్
అగ్నీ శోమమయం విశ్వం యత ఏత దశేషతః.
యే తు తేజసి యేచైతే సోమ సూర్యాగ్ని మూర్తయః
జగ త్ప్వరూపిణ శ్చైవ తధా బ్రహ్మ స్వరూపిణః
తేభ్యోఖిలేభ్యో యోగిభ్యః పితృభ్యో యత మానసః
నమో నమో నమస్తే మే ప్రసీదంతు స్వధాభుజః.
ఈ జగత్తు అంతయు అగ్నీషోమ మయము గాన అగ్ని రూపులగు అన్యాన్య పితృ దేవతలకు వందనము జేసెదను. ఎవరు తేజః స్థితులై సోమ సూర్య, అగ్ని రూపములను ధరించి జగత్స్వరూపులు మరియు బ్రహ్మ స్వరూపులు అయి ఉన్నారో, అట్టి సంపూర్ణ పితృ యోగులకు నేను ఇంద్రియ నిగ్రహము గల మనస్సుతో మాటి మాటికి నమస్కరించు చున్నాను. స్వధా భోజులగు పితృ గణాలు నా యందు ప్రసన్ను లగుదురు గాక.
మార్కండేయుడు:
ఏవం స్తుతా స్తత స్తేన తేజసా మునిసత్తమ
నిశ్చక్రము స్తేపి తతః భాసయంతో దిశో దశ.
నివేదితం చ యుత్తేన పుష్ప గంధానులేపనమ్
తద్భూషితా నథ స తాన్ దదృశే పురతః స్థితాన్.
మార్కండేయుడు:
ఓ ముని సత్తమా! రుచి ఈ విధముగా స్తుతించ గానే పితృ గణాలు తేజస్సుచే దశ దిశలను ప్రకాశింప జేయుచు ప్రత్యక్షమైరి. అతడు నివేదించిన పుష్ప గంధాను లేపనములచే విభూషితులై తన ఎదుట యున్న వారిని విప్రవరు డగు రుచి చూచెను.
ప్రణిపత్య పునర్భాక్త్వా పున రేవ కృతాంజలిః
నమ స్తుభ్యం నమస్తుభ్య మిత్యాహ పృధ గాదృతః.
తతః ప్రసన్నాః పితర స్త మూచు ర్మునిసత్తమమ్
వరం వృణిష్యేతి సతాన్ ఉవాచ నత కంధరః.
వెంటనే చేతులు జోడించి భక్తి సహితముగా నమస్కరించి వేరు వేరుగా “మీకు నమస్కారము మీకు నమస్కారము” అని ఈ విధముగా ఆదరముతో చెప్ప సాగెను. తదనంతరము పితృ దేవతలు ప్రసన్నులై ఆ ముని శ్రేష్టుని వర మడుగ మనిరి. అప్పుడు విప్రవరు డగు రుచి శిరస్సు వంచి వారితో ఇట్లు చెప్ప సాగెను.
రుచి:
సాం పతం సర్గ కర్తృత్వ మాదిష్టం బ్రహ్మణా మమ
సోహం పత్నీ మభిప్సామి ధన్యాం వివ్యాం ప్రజావతీమ్
రుచి:
పితృ దేవతలారా! నన్ను బ్రహ్మ దేవుడు ప్రజాసృష్టికి ఆదేశించెను. ఈ కారణముచే ఇప్పుడు నేను అందమైనదియు సంతాన ప్రాప్తికి సమర్దురాలగు దివ్యమైన భార్యను పొంద వలె నని అభిలషించు చున్నాను.
పితృ దేవతలు:
అద్యైవ సద్యః పత్నీ తే భవత్యతిమనోరమా
తస్యాం చ పుత్రో భవితా భవతో మను రుత్తమః
మన్వంతరాధిపో ధీమాం స్త్వన్నామ్నైవోపలక్షితః
రుచే రౌచ్య ఇతి ఖ్యాతిం యో యాస్యతి జగత్త్రయే.
పితృ దేవతలు:
నీకు ఇప్పుడే ఈ ప్రదేశము నందే అందమైన భార్య లభించును. ఆమె గర్భమున నీకు శ్రేష్టుడగు పుత్రుడు మనువుగా జన్మించును. ఓ ఋచి! మన్వంతరాధిపతి బుద్దిమంతుడగు నీ కుమారుడు నీ పేరు నను సరించియే ఖ్యాతి చెందును. అనగా మూడు లోకము లందు రౌచ్యుడను పేరుచే ప్రసిద్ది చెందును.
తస్యాపి బహవః పుత్రా మహాబలః పరాక్రమాః
భవిష్యతి మహాత్మనః పృధివీ పరిపాలకాః.
త్వం చ ప్రజాపతి ర్భూత్వా ప్రజాః సృష్ట్వా చతుర్విధా
క్షీణాధికారో ధర్మజ్ఞ! తతః సిద్ది మవాప్స్యసి.
స్తోత్రేణానేన చ నరో యోస్శాం స్తోష్యతి భక్తితః
తస్య తుష్టా వయం భోగా నాత్మజ్ఞానం తథోత్తమమ్.
శరీరారోగ్య మర్థం చ పుత పౌత్రాదికం తథా
ప్రదాస్యా మో న సందేహో యచ్చాన్వ దభివాంఛితమ్.
తస్మా త్పుణ్య ఫలం వాంచద్భిః సతతం నరైః
పితౄణాంక్షయాం తృప్తిం స్తవ్యాః స్తోత్రేణ మానవై చ.
ఆ రౌచ్యునికి కూడా మహాబల పరాక్రమ వంతులు. మహాత్ములు పృథ్వీ పాలకులు అగు అనేక మంది పుత్రులు జన్మింతురు. ధర్మజ్ఞుడా! నీవు కూడా ప్రజాపతివై నాలుగు రకాల ప్రజలను ఉత్పన్నము చేసి. ఎప్పుడు క్షీణాధికారి వగుదువో, అప్పుడు నీకు సిద్ది లభించును. ఏ నరుడు ఈ స్తోత్రముచే భక్తి సహితుడై మమ్ములను స్తుతించునో. వాని యడం మేము సంతుష్టులమై భోగములను ఉత్తమ మగు ఆత్మ జ్ఞానమును ప్రసాదించెదము. శరీరారోగ్యము, ధనము, పుత్రా పౌత్రాదులను కోరు వారును, మరియు ఇంకను వాంఛితము లగు కోరికలు కోరువారు. ఈ స్తోత్రముతో సదా మమ్ములను స్తుతించినచో మేము నిస్సందేహముగా వారికి అభీష్టము లగు వస్తువులను ప్రసాదించెదము. ఈ కారణముచే లోకము నందు పుణ్య ఫలమును కోరువారు. ఈ స్తోత్రముచే పితృ దేవతలకు అక్షయ తృప్తిని కలిగించ వలెను.
వాంఛద్భిః సతతం స్తవ్యాః స్తోత్రేణానేన వైయతః
శ్రాద్దే చ య ఇమం భక్త్యా అస్మ త్ప్రీతికరం స్తవమ్.
పఠిష్యంతి ద్విజాగ్ర్యాణాం భుంజతాం పురతః స్థితా
స్తోత్ర శ్రవణ సంప్రీత్యా సన్నిధానే పరే కృతే.
అస్మాక మక్షయం శ్రాద్ధం తద్ భవిష్య త్యసంశయమ్
యద్యప్యశ్రోత్రియం శ్రద్ధం యద్యప్యుహతం భవేత్.
అన్యాయోపాత్త విత్తేన యది వా కృత మన్యథా
అశ్రాద్దార్హై రుపహతై రుపహారై స్తథా కృతమ్.
అకాలేప్యధవాదేశే విధిహీన మథాపి వా
అశ్రద్ధయా వా పురుషై ర్ధమ్భ మాశ్రిత్య వా కృతమ్.
మా యొక్క ప్రీతిని కోరువారు ఈ స్తోత్రమును నిరంతరము పఠింప వలెను. శ్రాద్ధ కాలమందు భుజించు చున్న బ్రాహ్మణుల సమ్ముఖమున కూర్చుండి ఎవరు మా ప్రీతి కొఱకు ఈ స్తోత్రము భక్తితో పఠించుదురో. మఱియు ఎవరు స్తోత్ర శ్రవణ మందలి కుతూహలముతో వినెదరో, వారు మాకు అక్షయమగు శ్రాద్దమును పెట్టిన ఫలమును బొందుదురు. సందియము లేదు. నిస్సందేహముగా మాకు అక్షయ శ్రాద్దము సంపన్న మగును అనగా శ్రాద్దము శ్రోత్రియ హీనము అయినను లేక దూషిత మయినను, అన్యాయముగా సంపాదించిన ధనముచే చేసినను, అకాల మందు దేశము కాని దేశము నందు విధి హీనముగాను, శ్రద్ధ లేక దూషిత ఉపహారముల ద్వారా శ్రాద్దము శేయ బడిననూ, శ్రద్దా హీనులగు దంభము గల పురుషులచే చేయ బడిననూ.
అస్మాకం తృప్తయే శ్రాద్ధం తథాప్యేత దుదీరణాత్
యత్రై తత్ పృఠ్యతే శ్రాద్దే స్తోత్ర మస్మ త్సుఖావహమ్.
అస్మాకం జాయతే తృప్తి స్తత్ర ద్వాదశ వార్షికీ
హేమంతే ద్వాదశాబ్ధాని తృప్తి మేత త్ర్పయచ్చతి.
శిశిరే ద్విగుణాబ్దాశ్చ తృప్తిం స్తోత్ర మిదం శుభమ్
వసంతే షోడశ సమా స్తృప్తయే శ్రాద్ధ కర్మాణి.
గ్రీష్మే షోడశై వైతత్ పఠితం తృప్తి కారకమ్
వికలేపి కృతే శ్రాద్దే స్తోత్రేణానేన సాధితే.
వర్షాసు తృప్తి రాస్మాక మక్షయా జాయతే రుచే!
శరత్కాలేపి పఠితం శ్రాద్దకాలే ప్రయచ్ఛతి.
ఈ స్తోత్ర పాఠము చేసిన కారణము చేత ఆ శ్రాద్దము మాకు తృప్తిని కలిగించును. ఏ శ్రాద్ధము నందు మా సుఖము కొఱకు ఈ స్తోత్రము పఠింప బడునో ఆ శ్రాద్ధము వలన మాకు పన్నెండు సంవత్సరముల వరకు తృప్తి లభించును. ఈ స్తోత్రము హేమంత కాలము నందు మాకు ద్వాదశ వార్షికములు తృప్తి కలిగించును. శుభమగు ఈ స్తోత్రము శీతాకాల మందు మాకు ఇరువది నాలుగు సంవత్సరముల పర్యంతము తృప్తిని ప్రసాదించును. వసంత కాల మందలి శ్రాద్దమున ఈ స్తోత్రమును పఠించుటచే పదునారు సంవత్సరముల వరకు తృప్తిని ప్రసాదించును. మఱియు గ్రీష్మ కాలము నందు కూడా ఈ స్తోత్రమును పఠించుటచే పదునారు సంవత్సరముల పర్యంతము తృప్తి కారక మగును. ఏదేని కారణముచే శ్రాద్దము వికృత మగునేని ఈ స్తోత్ర పాఠముచే అది సంపన్న మగును. ఓ రుచీ! వర్షా కాలము నందు శ్రాద్ధ సమయమున ఈ స్తోత్రమును పఠించుటచే మాకు అక్షయ తృప్తి కలుగును పురుషులు శరత్కాలము నందు ఈ స్తోత్రము పఠించి శ్రద్ధ సంబందమగు ద్రవ్యములను ప్రసాదించినచో.
అస్మాక మేత త్పురుష స్తృప్తిం పంచ దశాబ్దికీమ్
యస్మిన్ గృహే చ లిఖిత మేత త్తిష్ఠతి నిత్యదా.
సన్నిధానం కృతే శ్రాద్దే తత్రాస్మాకం భవిష్యతి
తస్మా దేత త్త్వయా శ్రాద్దే విప్రాణాం భుంజతః పురః.
శ్రపణీయం మహాభాగః! అస్మాకం పుష్టి హేతుకమ్
ఇత్యుక్త్వా పితర స్తస్య స్వర్గతా మునిసత్తమః.
పదునైదు సంవత్సరముల పర్యంతము మాకు తృప్తి కలుగును. ఏ గృహము నందు ఈ స్తోత్రము వ్రాయబడి సదా ఉంచ బడునో, ఆ గృహము నందు శ్రాద్ధ సమయమున మేము నివసించెదము. ఈ కారణమున నీవు శ్రాదము నందు భోజనము చేయుచున్న బ్రాహ్మణుల ఎదుట నిలుచుండి ఓ మహాబాగా! మా యొక్క పుష్టి కొఱకు ఈ స్తోత్రమును వినిపించుము. ఓ ముని సత్తమా! పితృ గణాలు ఋచితో ఈ విధముగా బలికి స్వర్గమునకు బోయిరి.
Summary of chapter 94 of the Mārkandeya Mahā Purana is as follows:
Following the glorious Devī Māhātmya, Mārkaṇḍeya resumes the exposition of the future cosmic ages, outlining the ninth, tenth, eleventh, twelfth, thirteenth, and fourteenth Manvantaras. He highlights the divine patriarchs, Seven Sages, and royal guardians destined to govern these upcoming epochs.