83 - ధూమ్రలోచన వధ

ఋషి:

ఇత్యాకర్ణ్య వచో దేవ్యాః స దూతోమర్ష పూరితః సమాచష్టే సమాగమ్య దైత్య రాజాయ విస్తరాత్ తస్య దూతస్య తద్వాక్య మాకర్ణ్యా సురరాట్ తతః సక్రోధః ప్రాహ దైత్యానా మధిపం ధూమ్రలోచనమ్ హే దూమ్రలోచనాశు త్వం స్వసైన్య పరివారితః తా మానయ బాలా ద్దుష్టాం కేశాకర్షణ విహ్వలామ్ తత్పరిత్రాణదః కశ్చి ద్యది వోత్తిష్టతే పరః స హంతవ్యో మరో వాపి యక్షో గంధర్వ ఏవ వా

ఋషి:

దేవి ఈ ప్రకారముగా పలికిన పలుకులు వినిన దూతయగు సుగ్రీవుడు అత్యంత కోపముతో దైత్యేశ్వరుని వద్దకు పోయి వృత్తాంత మంతయు సవిస్తరముగా చెప్పెను. దూత మాటలు విని రాక్షస రాజగు శంభుడు క్రోధము గలవాడై రాక్షస సేనాధిపతి యగు దూమ్రలోచనునితో నిట్లు చెప్పెను. దూమ్రాలోచనా! నీవు మన సైన్యముతో నచ్చటికి పొమ్ము. ఆ దుష్ట యువతిని జుట్టుపట్టి ఈడ్చి విహ్వలురాలిని జేసి శీఘ్రముగా తీసికొని రమ్ము. ఆమెను రక్షించుటకై ఎవడైన ప్రయత్నించినచో వాడు దేవుడు గాని యక్షుడు గాని, గంధర్వుడు గాని మరి ఎవడైనను గాని వానిని సంహరింపుము.

ఋషి:

తేనాజ్ఞప్త స్తత శ్శీఘ్రం స దైత్యో దూమ్రలోచనః ష్షవృత ష్ట్యా సహస్రాణా మసురాణాం దృతం యయౌ

ఋషి:

పిమ్మట ఆ దూమ్రలోచనుడు ఆ రాక్షసుని యాజ్ఞచే హిమాచల మందు నివసించి యున్న జగదంబ సమీపమునకు అరవై వేల రాక్షస సైన్యముతో త్వరగా బోయెను.

స దృష్ట్వాతో తతో దేవీం తుహినాచల సంస్థితామ్ జగా దోచ్చైః ప్రయాహీతి మూలం శుంభ నిశుంభయోః న చేత్ ప్రీత్యాద్య భవతీ మద్భర్తార ముషేష్యసి తతో బలా న్నయామ్యేష కేషాకర్షణ విహ్వలామ్

పిమ్మట దూమ్రలోచనుడు హిమాచలమున నివసించి యున్న దేవిని చూచి బిగ్గరగా “దేవీ! శుంభ, నిశుంభుల సమీపమునకు నడువుము.” అని పలికెను. నీవు ఈ సమయమున ప్రీతి పూర్వకముగా మా ప్రభువగు శంభుని వద్దకు రానిచో నేనే జుట్టు పట్టుకొని బలాత్కారముగా యీడ్చుకొని తీసుకొని పోయెదను.

శ్రీదేవి:

దైత్యేశ్వరేణ ప్రహితో బలవాన్ బాల సంవృతః బలాన్నయాసి మా మేవం తతః కింతే కరోమ్యాహమ్

దేవి:

దైత్యరాజగు శుంభుడు నన్ను తీసుకొని రమ్మని నిన్ను పంపెను. నీవు బలవంతుడవు. సేనాసహితముగా వచ్చితివి. నీవు బలాత్కారముగా తీసికొని పోయినచో నేను నిన్ను ఏమి చేయ గలను?

ఋషి:

ఇత్యుక్త స్సోభ్యదా వత్తా మసురో ధూమ్రలోచనః హుంకారేణైవ తం భస్మ సా చకారాంబికా తతః అథ కృద్ధం మహాసైన్య మసురాణాం తథాంబికా వవర్ష సాయకై స్తీక్ష్నై స్తథా శక్తి పరశ్వథైః

ఋషి:

దేవి ఇట్లు చెప్పుచుండ దూమ్రాలోచానుడు అను పేరు గల యా రాక్షసుడు ఆమె మీదకు పరుగు పరుగున బోయెను. అప్పుడు అంబికా దేవి హుంకారము చేసి ఆ రాక్షసుని భస్మము చేసెను. అనంతరము ఆ రాక్షస మహా సైన్యము క్రోధముతో దేవి మీదకు బోవగా, అంబికా దేవి తీక్ష్ణమగు బాణములను, శక్తులను, పర్వశ్వధములను వర్షించెను.

తతో దుతసటః కోపాత్ కృత్వా వాదం సుభైరవమ్ పపాటాసురసేనాయాం సింహో దేవ్యాస్తు వాహనః కాంశ్చిత్ కర ప్రహారేణ దైత్యా నాస్యేన చాపరాన్ ఆక్రమ్య చరణేనాన్యా న్ని జఘాన మహా సురాన్ కేశాంచిత్ పాటయామాస నఖైః కోష్టాని కేసరీ తథా తల ప్రహారేణ శిరాంసి కృతవాన్ పృథక్ విచ్చిన్న బాహు శిరసః కృతా స్తేన తథాపరే పపౌ చ రుధిరం కోష్ఠా ధన్యేషాం ధుతకేసరః క్షణేన తద్బలం సర్వం క్షయం నీతం మహాత్మనా తేన కేసరిణా దేవ్యా వాహనేనా తికోపినా

అప్పుడు దేవి వాహనమగు సింహము జూలును కోపముతో కంపింప జేసి భయంకరముగా గర్జించుచూ రాక్షస సేన మీద పడెను. కొలది దైత్యులను కరప్రహారము చేతను, కొందరిని నోటితోను, మహాసురులగు మరికొందరిని పాదముల చేతను ఆక్రమించి చంప సాగెను. మరికొందరు రాక్షసుల యొక్క గుండెలను గోళ్ళతో చీల్చెను. మరి కొందరి మస్తకములను ప్రహారముల ద్వారా దేహము నుండి వేరు చేసెను. మరి కొందరి రాక్షసుల యొక్క బాహువులను శిరస్సులను ఖండించి వేసెను. మరియు జూలును ఆడించుచు రాక్షసుల శరీర మందలి రక్తమును త్రాగి వేసెను. క్షణ కాలములోనే దేవి వాహనమగు మహా సింహము అత్యంత క్రోధముతో ఆ రాక్షస మహా సైన్యమును నాశనము చేసి వైచెను.

శ్రుత్వా త మసురం దేవ్యా నిహతం దూమ్రలోచనమ్ బలం చ క్షయితం కృత్స్నం దేవీ కేసరిణా తతః చుకోప దైత్యాధిపతిః శుంభః ప్రస్ఫురితాధరః ఆజ్ఞాపయామాస చ తౌ చణ్డముణ్డౌ మహాసురౌ హే చండః హే ముండః బలై ర్బహుభిః పరివారితౌ గచ్చతం తత్ర గత్వా చ సా సమానీయతాం లఘు కేశే ష్వాకృష్య బద్ధ్వా వా యది వః స శయో యుధి తదా శేషాయుదైః సర్వై రమరై ర్వినిహన్యతామ్ తస్యాం హతాయాం దుష్టాయాం సింహే చ నిపాతితే శీఘ్ర మాగమ్యతాం బద్ద్వా గృహీత్వా తా మథాంబికామ్

దేవి అసురుడగు దూమ్రలోచనుని చంపుటయు, దేవీ వాహనమగు సింహము సంపూర్ణముగా సైన్య మంతయు చంపుటయు, వినిన దైత్యరాజగు శంభుడు క్రోధముచే పెదిమలు కంపించు చుండగా ‘చండ’, ‘ముండ’ లను మహా రాక్షసులను ఆజ్ఞాపించెను. చండ ముండులారా! మీరు చాలా సైన్యమును వెంట బెట్టుకొని దేవి యున్న చోటుకు పొండు. ఆ యువతిని శీఘ్రముగా తీసుకొని రండు. ఆ స్త్రీ యొక్క జుట్టు పట్టుకొని ఈడ్చుకొని రండు. కానిచో బంధించి తీసుకొని రండు. ఈ ప్రకారము తీసుకొని వచ్చుటకు మీరు అసమర్థులైన యెడల సేనాసహితులై సమస్త అస్త్రములతో ఆమెను చంపి వేయుడు. ఆ దుష్టురాలిని ఆ సింహమును చంపిన తర్వాత ఆ అంబికా దేవిని బంధించి త్వరితముగా తీసుకొని రండు.