మార్కండేయ మహా పురాణము
117 - ఖనీనేత్ర చరిత్రము
మార్కండేయుడు:
తస్య పుత్రః ఖనీనేత్రో మహాబల పరాక్రమః యస్య యజ్ఞే ష్వగాయన్త గంధర్వా విస్మయా న్వితాః ఖనీనేత్ర సమో నాన్యో భువి యజ్వా భవిష్యతి తేన యజ్ఞాయుతే పూర్ణే దత్తా పృథ్వీ ససాగరా దత్త్వా చ సకలా పృథ్వీ బ్రాహ్మణానాం మహాత్మనామ్ తపసా ద్రవ్య మాసాద్య మోదయన్ సాధితేన యః యతశ్చ ప్రాప్య విత్తర్ది మతులాం దాతృ సత్తమాత్ జగృహు ర్బహథా విప్రః నాన్య రాజ్ఞః ప్రతిగ్రహమ్ స చ షష్టి సహస్రాణి సప్త షష్టి శాతాని చ సప్త షష్టిం చ యో యజ్ఞా నయజ ద్భూరి దక్షిణాన్
మార్కండేయుడు:
వివింశుని పుత్రుడు మహా బలవంతుడు, విక్రమ శాలి “ఖనీనేత్రుడు” అను నామధేయుడు ఆతడు చేసిన యజ్ఞానుష్టానములు చూసి విస్మితుడై గంధర్వులు ఇట్లు గానము చేసిరి. ఖనినేత్రునితో సమానముగా యజ్ఞములు చేయువారు భూమండలమున ఎవ్వరును ఉండరు. ఎందువలన యనగా అతడు పదివేల యజ్ఞములు చేసి సాగర సహితముగా భూమిని దానము చేసెను. మహారాజగు ఖనీనేత్రుడు మహాత్ములగు బ్రాహ్మణులకు భూమి నంతటిని ఇచ్చి, తపస్సుచే అనేక ద్రవ్య లాభములను పొంది దానిని విడిపించెను. ఓ విప్రా! అప్పుడా బ్రాహ్మణులు కూడా దాతలలో గొప్ప దాతయగు ఖనీనేత్రుని వద్ద విపులముగా ధనమును పొంది తిరిగి వేరొకరి వద్ద నుండి దానములు తీసుకొన లేదు. (అనగా ధనము సమృద్ధిగా లభించుటచే దానము తీసుకొను ఆవశ్యకత వారికి లేదు) అతడు , అరువది యారు వేల ఏడు వందల అరువది ఏడు యజ్ఞములను చేసెను. మరియు ప్రతి యజ్ఞము నందు భూరి దక్షిణలను ఇచ్చెను.
అపుత్రః స మహీపాలో మృగయా ముపచక్రమే పుత్రార్థం పిత్భయజ్ఞాయ మాంస కామో మహామునే ఆశ్వారూఢో వినా సైన్యం మేక ఏవ మహావనే బద్దగోధాంగులిత్రాణో బాణఖడ్గ ధనుర్ధరః తం వాహయన్తం తురగ మన్యతో గహనా ద్వనాత్ వినిష్క్రమ్య మృగః ప్రాహ మాంహత్వాభిమతం కురు
ఓ మహామునీ! మహీపాలుడగు ఖనీనేత్రుడు అపుత్రు డగుటచే పుత్రుని పొంద వలెనను కోరికచే పితృ యజ్ఞమును చేయదలచి మృగ మాంసమును తీసుకొని వచ్చుటకు గోద మరియు అంగుళి త్రాణమును, చేతి యందు ధనుస్సు బాణములను కత్తిని ధరించి సైన్యము లేకుండా ఒంటరిగా గుఱ్ఱముపైనెక్కి మహావనము నందు వేటకు వెళ్ళెను. కొంత దూరము వెళ్ళిన పిమ్మట ఆ దట్టమైన అడవి నుండి వేరొక అడవికి వెళ్ళుటకు గుఱ్ఱమును పరుగెత్తించెను. అప్పుడు ఒక మృగము వచ్చి అతనితో నిట్లనెను. “ఓ రాజా! నన్ను చంపి నీ అభీష్టమును నెరవేర్చు కొనుము.”
రాజు:
అన్యే మృగాః పలాయన్తే మహాభీత్యా విలోక్య మామ్ కథ మాత్మ ప్రదానం త్వం మృత్యవే కర్తు మిచ్చసిః
రాజు:
మృగము లన్నియు నన్ను చూచి భీతి చెంది పారిపోవు చున్నవి. మరి నీవు మృత్యువునకు ఆత్మను ఇచ్చుటకు ఎందుకు ఇచ్చగించు చున్నావు?
మృగము:
అపుత్రోహం మహారాజః వృథా జన్మ ప్రయోజనమ్ విచారయ న్న పశ్యామి ప్రాణానా మిహ ధారణమ్
మృగము:
మహారాజా! నేను అపుత్రకుడను. అందుచే నేను జీవించుట వృథా యని తలంచితిని.
మార్కండేయుడు:
అథాఖ్యేత్య మృగః ప్రాహ త మన్యో వసుధాధిపమ్ మృగస్య తస్య ప్రత్యక్ష మల మేతేన పార్థివః ఘాతయ స్వేతి మాం మాంసై ర్మమ కర్మ సమాచర యథా కృతార్థతా తే స్యా న్మమ చాప్యుపకారి తత్ పుత్రార్థం త్వం మహారాజః స్వవతౄ న్యష్టు మిచ్చసి అపుత్రస్యాస్య మాంసేన లప్స్యసే వాంచితం కథమ్ యాదృ క్కర్మ వినిష్పాద్యం తాదృగ్ద్రవ్య ముపాహరేత్ దుర్గన్ధైర్న సుగంధానాం గంధజ్ఞాన వినిర్ణయః
మార్కండేయడు:
అదే సమయమున మరియొక మృగము వచ్చి మృగము ఎదుటనే ఇట్లు పలికెను. రాజా! ఈ మృగమును తీసుకొనిపోయి మీరేమి చేయుదురు? నా మాంసముతో మీ ప్రయోజనము సిద్ధించును. నాకునూ ఉపకారము చేసిన వారగుదురు. మహారాజా! మీరు పుత్రుని కోరి పితృ యజ్ఞమును చేయుచున్నారు. కాని ఈ పుత్రుని మాంసముతో మీ కోరిక ఎట్లు సిద్ధింప గలదు? ఎట్లనగా కర్మ ఎటు వంటిదో, దాని కొరకు కావలిసిన ద్రవ్యము కూడా అట్టిదై యుండ వలెను. చూడుము. దుర్గంధము ద్వారా సుగంధ ద్రవ్యముల సువాసనా జ్ఞానము నిర్ణయింపబడదు.”
రాజు:
వైరాగ్య కారణం ప్రోక్త మనేనాపుత్రతా మమ కథ్యతాం ప్రాణసం త్యాగే యత్తే వైరాగ్య కారణమ్
రాజు:
“మొదటి మృగము తనకు పుత్రులు లేని కారణమున వైరాగ్యము కలిగినదని చెప్పెను. మరి నీవు ప్రాణ త్యాగము చేయుటకు వైరాగ్యము ఎందులకు కలిగెను? దానిని తెలుపుము.”
బహవో మే సుతా భూపః బహ్వ్యో దుహితర స్తథా యచ్చిన్తా దుఃఖ దావాగ్ని జ్వాలా మధ్యే వసా మ్యహమ్ సర్వ సాధ్యా నరేన్ద్రేయం మృగజాతిః సుకాతరా తేశ్వపత్యేషు మే చాతి మమత్వం తేన దుఃఖితః మనుష్య సింహ శార్దూల వృకాదిభ్యో బిభే మ్యహమ్ విహీనా త్సర్వ సత్త్వేభ్యః శ్వ శృగాలా దపి ప్రభో సోహం నిమిత్తం బంధూనా మిమాం శూన్యాం వసుంధరామ్ నృశింహాదిభయా త్సర్వామిచ్చామి సునృశంసక్భత్ తృణా న్యన్యేపి ఖాదంతి గోజావి తురగాధికాః తాం స్తేషాం పోషణాయాహ మిచ్చామి నిధనం గతాన్
మృగము:
“రాజా! నాకు పుత్రులు, పుత్రికలు చాలా మంది ఉన్నారు. వారి బాధ వలననే నేను దుఃఖ దావానల మందు దగ్ధమై పోవు చున్నాను.” “ఓ నరేంద్రా! పిరికి వారమగు మా మృగజాతి సామాన్యముగా అన్ని జీవులకు ఆధీనమై యుండును. నేను కూడా సంతానముపై మోహమును పెంచు కున్నాను. ఆ కారణముగా నేను సదా దుఃఖము ననుభవించు చున్నాను.” “ప్రభూ! మానవులు , సింహము, వ్యాఘ్రము, ఇంతయేల? అన్ని జీవుల కన్నా హీనమగు కుక్క, నక్క మొదలగు వానికి కూడా నేను భయ పడుదును.” నేను బంధు ప్రీతిచే ఈ మనుష్యులు, సింహము మొదలగు వాని వలన కలుగు భయము లేక అవియన్నియు నశించి భూమి శూన్యముగా నుండ వలెనని నేను సదా కోరుచున్నాను. ఆవు, గొర్రె, మేక, అశ్వము మొదలగు పశువులు తృణమును భక్షించి నప్పుడు తృణమంతయు హరించి పోవును. అప్పుడు నా బిడ్డలు ఏమి తిని జీవించెదరు? ఆకారణముచే వారి పోషణ కొరకు తృణ భక్షకులగు పశువుల మృతిని కోరవలసి వచ్చుచున్నది.
నిష్క్రాంతేషు తత స్తేషు మమాపత్యేషు వై పృథక్ భవంతి చింతాః శతశో మమత్వావృత చేతసః కిం కూట పాశం కిం వజ్రం వాగురాం కిం సుతో మమ ప్రాప్తశ్చర న్వనే కిం వా నృసింహాది వశం గతః ప్రాప్తోయ మేకః సంప్రాప్తా స్తే వస్థాం కీద్రుశీం మమ సాంపత్రం తే చిరాయంతే యే గతాః సుమహావనమ్ దృష్ట్వా ప్రాప్తాన్ మమాభ్యాశ మహం తా నాత్మజా న్నృప ఈష దుచ్చ్వసితః క్షేమ మిచ్చామి రజనీం పునః ప్రభాతే దివసం క్షేమ మస్తగేర్కే నిశామపి వాంచామహ్యం కదా క్షేమం సర్వకాలం భవిష్యతి
నా పుత్రులు, పుత్రికలు వేరు వేరు ప్రదేశములకు పోయినప్పుడు స్నేహమునకు వశమైన కారణముగా నాకు వందల కొలది బాధలు కలుగు చున్నవి. నా బిడ్డలలో ఎవరైనా పాశము చేత గాని, లేక వలల చేత గాని చిక్కుకొనుట లేక సింహాదుల చేత చిక్కి మరణించుట వంటి విషయములు తెలిసినచో చింత గలుగు చుండును. మరియు ఒకడు గృహమునకు తిరిగి వచ్చిన రెండవ వాని గూర్చి చింత కలుగును. అవి ఈ మహారణ్యము నందు తృణము మేయుటకు వెళ్ళును. అక్కడ వారి పరిస్థితి ఎట్లున్నదో తిరిగి వచ్చువరకు తెలియదు.” నా బిడ్డలు నా సమీపమునకు రాగానే నేను పరమానందమును అనుభవించెదను. కాని ఆ సమయ మందును రాత్రి యంతయు వారి క్షేమము కొరకు చింతించు చునే యుందును.” తిరిగి తెల్లవారిన పిమ్మట పగలంతయు సూర్యాస్తమయ మైన పిమ్మట రాత్రంతయు క్షేమము కొరకు చింతించు చునే యుందును. వారు సర్వావస్థల యందును క్షేమముగా నుండ వలెనని ప్రతి క్షణము వారి గూర్చి చింతించు చునే యుందును.
ఏతత్తే కథితం భూప మహోద్వేగస్య కారణమ్ అతః ప్రసాడంకురు మే బాణోయం పాత్యతాం మయి ఇతి దుఃఖ శతావిష్టః ప్రాణాన్నాహం త్యజామి యత్ తత్కారణం నిభోద త్వం బ్రువతో మమ పార్థివః అసూర్యా నామ తే లోకా యాన్ గచ్చత్యాత్మఘాతకాః యజ్ఞోపయుక్తాః పశవః సంప్రయాంత్యుచ్చ్రితీః ప్రభో అగ్నిః పశు రభూ త్పూర్వం పశు రాసీ జ్జలాధిపః భాస్వా నథోచ్చ్రితీః ప్రాప్తా యజ్ఞే నిష్టా ముపాగతాః తన్మమైతాం కృపాం కృత్వా నయ మామ్ముచ్చ్రితీం నృపః ఆత్మన శ్చేప్సితం కామం పుత్రలాభా దవాప్స్యసి
“ఓ భూపాలా! నేను నా ఉద్వేగమునకు కారణము తెలిపితిని. ఇప్పుడు నన్ననుసరించి నాపైనే బాణమును వేయుము. పార్థివా! ఏ కారణము చేత నేను ఈ విధముగా వందల కొలది దుఃఖములచే ఆక్రాంతుడనై ప్రాణ త్యాగమును కోరు చున్నానో, దానిని మీరు అర్థము చేసుకొనుడు. ప్రభూ! ఆత్మహత్యను చేసుకొను వాడు ‘ఆసూర్య’ అను లోకములను పొందును. కాని యజ్ఞము కొరకు నియమింప బడిన సమస్త పశువులు సద్గతిని పొందును. పూర్వ కాలమున అగ్ని, వరుణుడు మరియు సూర్యుడు పశుత్వమును గ్రహించి యజ్ఞ కార్య మందు నియుక్తులైరి. ఆ కారణమున వారు సద్గతిని పొందిరి. అందువలన ఓ రాజా! నా యందు కృప జూపి సద్గతిని ప్రసాదించుము. అట్లు చేయుట వలన మీకు పుత్రప్రాప్తి కలుగును.
పూర్వ మృగము:
రాజేంద్ర సైష హంతవ్యో ధన్యోయం సుకృతీ మృగః బహవ స్తనయా హ్యస్య హంతవ్యోహ మసంతతిః
పూర్వ మృగము:
ఓ రాజేంద్రా! ఈ మృగమును చంపుట ధర్మము కాదు. ఈ మృగమునకు బహు సంతానము కలదు. ఈ మృగము పుణ్యాత్మురాలు. ధన్యురాలు. నాకు సంతానము లేదు గాన నన్ను చంపుము.
ఉత్తర మృగము:
ఏకదేహ భయం యస్య దుఃఖం ధన్యః స వైభవాన్ బహూని యస్య దేహాని తస్య దుఃఖా న్యనేకథా ఏకో యదాహ మాసం తు ప్రాక్తదా దేహజం మమ దుఃఖమాసీ న్మమత్వే తు భార్యాయా స్తదభూ ద్ద్విథా యదా జాతా న్యపత్యాని తదా యావంతి తాని వై తావ చ్చరీర భూమీని మమ దుఃఖా న్యథా భవాన్ న కృతార్థో భావా మ్యస్య నాతి దుఃఖాయ సంభవః ఇహ దుఃఖాయ మత్సూతిః పరత్ర చ విరోధినీ
ఉత్తర మృగము:
ఏక శరీర మాత్రమునే ఎవరికీ దుఃఖము మాత్రమే కలుగునో అతడు నీవలె ధన్యుడు. ఏమన ఎవనికి శరీరములు ఎక్కువగా నుండునో, అతనికి దుఃఖములు కూడా అనేకము లుండును. ముందుగా నేనొక్కడనే యుంటిని. అప్పుడు నా ఒక్క దేహమునకు మాత్రమే దుఃఖము. ఎప్పుడు మరల భార్య కలిగినదో అప్పుడు స్నేహ వశమున దుఃఖము రెండు భాగములుగా విభక్త మైనది. మరియు ఎప్పుడైతే అసత్యము లెన్ని కలిగినవో అప్పుడు ఈ దేహము కూడా అన్ని భాగములుగా విభజించ బడినది. ఈ కారణమున నాకు అనేక దేహముల వలన కలిగిన దుఃఖములు ఉత్పన్న మైనవి. ఎప్పుడైతే నీకు ఇన్ని దుఖములు అనుభవింప రాలేదో, అప్పుడు నీవు కృతార్థుడవు కావా? నా ఈ సంతానము ఈ లోకమున దుఃఖమునకు కారణము. పర లోకమున నరకమునకు కారణమగు చున్నది.
యతో రక్షణ పోషార్థ మపత్యానాం కరోమి తత్ చింతయామి చ సంభూతి స్తేన మే నరకే ధృవమ్
చూడుము! నేను పుత్రులను పోషించుట కొరకు ఏమి చేయుదునో అదంతయు నిస్సందేహముగా నరకములకు కారణములు.
రాజు:
న వేద్మి కిం సంతతిమాన్ ధన్యో పుత్రోత్ర కిం మృగః పుత్రార్థశ్చాయ మారంభో మమ దోలాయతే మనః దుఃఖాయ సంతతిః సత్య మైహికాముష్మికాయ తత్ తథాప్యతనయాన్ యాంతి ఋణానీతి శ్రుతం మయా సోహం యతిష్యే పుత్రార్థ మృతే ప్రాణి వధం మృగః తపసైవ ప్రచండేన యథాపూర్వం మహీపతిః
రాజు:
ఓ మృగమా! పుత్ర వంతులు పుత్ర హీనులలో ఎవరు ధన్యులో, నాకు తెలియ రాకున్నది. నేను గూడ యిప్పుడు పుత్రోత్పత్తి కొరకు ప్రయత్నించు చున్నాను. ఇందువలన నా మనస్సు డోలాయమాన మగుచున్నది. సంతాన కారణము గానే ఇహలోక పరలోకము లందు దుఃఖమును అనుభవించ వలసిన మాట సత్యమై ఉన్నది. అయినను సంతానము లేని వారు ఋణత్రయ విముక్తులు కాజాలరు అను వీటిని కూడా విని యుంటిని. అందు వలన ఓ మృగమా! నేను ప్రాణులను వధింపకయే పూర్వ కాలపు రాజులతో సమానముగా గొప్ప తపస్సు చేసి పుత్రప్రాప్తి నిమిత్తమైన కర్మ కొరకు యత్నించెదను.
Summary of chapter 117 of the Mārkandeya Mahā Purana is as follows:
The history of King Khanitra, a monarch of deep compassion, is narrated. When his ambitious relatives attempted to overthrow him through dark sorcery, the magical entities summoned by the conspirators destroyed the sorcerers instead. Overcome with grief for his relatives' demise, Khanitra handed his crown to his son and retired to practice asceticism.