111 - నాభాగ చరిత్రము

మార్కండేయుడు:

నివృత్తో సౌ తతో భూపః సంగ్రామా త్స్వసుతేన వై ఉపయేమే చ తాం వైశ్య తనయాం సోపి తత్సుతః తతః స వైశ్యతాం ప్రాప్తః సముపేత్యాహ పార్దివమ్ భూపాలాః యన్మయా కార్యం తన్మమాదిశ్యతాం మమ

మార్కండేయుడు:

అనంతరము పుత్రునితో యుద్దమును విరమించు కొనెను. మరియు నా రాజ కుమారుడును ఆ వైశ్య కన్యను వివాహమాడి వైశ్యత్వమును పొందెను. అప్పుడతడు వైశ్యత్వమును పొంది రాజు వద్దకు వెళ్లి ఇట్లడిగెను. ఓ భూపాలా ! ఇప్పుడు నేనేమి చేయ వలెనో, దానిని ఆజ్ఞాపింపుడు.

రాజు:

ధర్మాదికరణే యుక్తా బాభ్రవ్యాద్యా స్తపస్వినః యదస్య కర్మ ధర్మాయ తద్వదంతు తథా చర

రాజు:

“బాభ్రవ్యాధి ఏ సమస్త తపస్వులు ధర్మాదికరణము నందు నియమించ బడిరో, వారు ఏ కర్మను ధర్మమని చెప్పి ఆజ్ఞాపించుదురో, దానిని ఆచరింపుము.”

మార్కండేయుడు:

తత స్తే మునయ స్తస్య పాశుపాల్యం తథా కృషిమ్ వాణిజ్యం చ పరం ధర్మ! మాచచఖ్యుః సభాసదః తథైవ చక్రే స సుత స్తస్య రాజ్ఞో యధోదితమ్ తైర్దర్మవాదిభి ర్దర్మం చ్యుతస్య నిజ ధర్మతః

మార్కండేయుడు:

అప్పుడా సభ యందున్న మునులు “పశు పాలనము, వ్యవసాయము, వాణిజ్యము అను ఈ కర్మలే నీకు ఉత్తమ ధర్మమై ఉన్నవి.” అని పలికిరి. పిమ్మట ఆ రాజ పుత్రుడు తన ధర్మమును వీడి రాజు యొక్క ఆజ్ఞానుసారము ఆ ధర్మవాదులు నిర్దేశించిన ధర్మమును ఆచరింప సాగెను.

తస్య పుత్ర స్తతో జాతో నామ్నా ఖ్యాతో భలందనః స మాత్రా ప్రహితో గచ్చ ద్గోపాలో భవః పుత్రకః మాత్రా తథా నియుక్తోథ ప్రణిపత్య స్వమాతరమ్ రాజర్షి మగమ న్నీపం హిమవ త్పర్వతాశ్రయమ్ తం సమేత్య చ జగ్రాహ తస్య పాదౌ యధావిధి ప్రణిపత్యాహా చైవైనం రాజర్షిం స భలన్దనః ఆదిష్టో భగవ న్మాత్రా గోపాల స్త్వం భవేతి వై మయా చ పాలనీయా క్ష్మా తస్యాః స్వీకరణం కథమ్ మయా హి గౌః పాలనీయా సా యదా స్వీకృతా భవేత్ ఆక్రాంతా బలవద్భిః సా దాయాదైః పృథివీ మమ

కొంత కాలమునకు అతనికి “భలందను”డను పుత్రుడు కలిగెను. అతని తల్లి “ఓ కుమారా ! గోవులను పాలించు చుండుము.” అని పలికి గోపాలన యందు నియమించెను. అప్పుడతడు తల్లి ఆజ్ఞ ప్రకారము తల్లికి నమస్కరించి హిమాలయ పర్వత వాసియైన “నీపు” డను రాజర్షి వద్దకు వెళ్ళెను. భలందనుడు రాజర్షి సమీపమునకు వెళ్లి యధావిధిగా చరణములకు వందన మొనర్చి ఇట్లు పలుక సాగెను. హే భగవాన్  నా తల్లి నన్ను “గోపాలకుడ వగుము” అని ఆజ్ఞాపించినది. పృథ్వీ పాలనయే నా అవశ్య కర్తవ్యము. కాని ఈ గోపాలనము ఎట్లు స్వీకరించుదును? ఇప్పుడు పృథ్వీ పాలనను నేను స్వీకరించినను బలవంతులగు జ్ఞాతులచే రాజ్య మంతయు ఆక్రమింప బడి యున్నది.

తాం యథా ప్రాప్నుయాం పృథ్వీం త్వత్ప్రసాదా దహం విభోః తథాదిశ కరిష్యామి తవాజ్ఞా ప్రణతోస్మి తే

అందు వలన ఓ ప్రభూ ! మీ అనుగ్రహము వలన నేనెట్లు పృథ్వీ పాలన చేయగలనో, దానిని ఈ ప్రణతునకు ఆజ్ఞాపించుము. నేను దానిని చేయుదును.

మార్కండేయుడు:

తతః స నీపో రాజర్షి స్తస్మై నిరవశేషతః భలందాయ దదౌ బ్రహ్మ న్నస్త్ర గ్రామం మహాత్మనే ప్రాప్తాస్త్ర విద్యః స యయౌ పితృవ్య తనయాన్ ద్విజః వసురాతాదికాన్ పుత్రా నాదిష్టః స మహాత్మనా ఆయాచత స రాజ్యార్దం పితృ పైతామహోచితమ్ తే చోచు ర్వైశ్యపుత్ర స్త్వం కథం భోక్ష్యసి మేదినీమ్ తత స్తై ర్యుద్ధ మభవ ద్భలందస్యా త్మవంశజైః వసురాతా దిభిః కృద్ధైః కృతాస్త్రస్యాస్త్ర వర్షిభిః

మార్కండేయుడు:

ఓ బ్రాహ్మన్ ! అప్పుడు రాజర్షి యగు నీతడు మహాత్ముడగు భలందనునకు సంపూర్ణముగా అస్త్ర విద్యలను ప్రసాదించెను. ఓ ద్విజుడా ! భలందనుడు అస్త్ర విద్యా లాభమును పొంది రాజర్షి యొక్క ఆజ్ఞను తీసుకొని పితృ వ్యపుత్రులగు వసురాతుడు మొదలగు వారి సమీపమునకు వెళ్ళెను. మరియు తాత గారి రాజ్యము నందలి అర్థ భాగము నిమ్మని ప్రార్థించెను. తాత గారు “నీవు వైశ్య పుత్రుడవు. రాజ్య పాలన నీకు ఉచితము కాదు “అనిరి. అప్పుడు అస్త్ర లాభమును పొందిన భలందనుడు కృద్ధుడై అస్త్రములను వర్షించుచూ వసురాతుడు మొదలగు వారితో యుద్దమును ప్రారంభించెను.

న జిత్వా తా నషేషాంన్తు శస్త్ర విక్షత సైనికాన్ జహార పృథివీం తేషాం ధర్మయుద్దేన ధర్మవిత్ స నిర్జితారిః సకలాం పృథ్వీ రాజ్యం తథా పితుః నివేదయాముస తతస్త త్పితా జగృహే న చ ప్రత్యువాచ స తం పుత్రం భార్యయాః పురత న్తదా

ఆ యుద్ధమున ధర్మాత్ముడగు భలందనుడు ధర్మ యుద్ధము తోనే సేనలందరను శస్త్రములచే గాయపరచి పరాజితులను చేసి భూమి నాక్రమించెను. భలందనుడు ఈ విధముగా శత్రువులను జయించి పృథ్వీ రాజ్యము నంతయు తండ్రిగారి పాదములకు సమర్పించెను. కాని తండ్రి దానిని గ్రహింపక భార్య ఎదుటనే పుత్రునితో నిట్లు పలికెను.

నాభాగుడు:

భలంద! రాజ్య మేతత్తే క్రియతాం పూర్వజైః కృతమ్ అహం న కృత్వా న్రాజ్యం నా సామర్థ్య యుతః పురా వైశ్యతాం తు పురస్కృత్య తథైవాజ్ఞా కరః పితుః కృత్వా ప్రీతిం పితు రహం వైశ్య కన్యా పరిగ్రహాత్ న పుణ్యలోకభా గాజా యావ దాభూత సంప్లవమ్ ఉల్లంఘ్యా జ్ఞాం పూనా స్తస్య పాలయామి మహీం యది నాస్తి మోక్షస్తతో నూనం మమ కల్ప శతై రపి

నాభాగుడు:

“కుమారా! భలందనా! పూర్వీకులచే శాసింప బడిన ఈ రాజ్యమును నీవే అనుభవింపుము.” “నేను రాజ్య పాలన యందు అసమర్థుడను అని కాదు”. పూర్వము నేను తండ్రి గారి ఆజ్ఞ యందుండియు తండ్రి గారు సమ్మతించక పోయిననూ, వైశ్య కన్యను గ్రహించిన కారణమున వైశ్యత్వమును పొందితిని. అందుచే రాజ్య భోగములకు అధికారిని కాలేక పోయితిని. ఇప్పుడు నేను తండ్రి గారి ఆజ్ఞను ఉల్లంఘించి భూమిని పాలించినచో, విధ్యా ప్రతిజ్ఞ కారణమున రాజు కూడా ప్రళయ కాల పర్యంతము పుణ్య లోకములను పొంద లేడు. మరియు నాకును నూరు కల్పముల యందును ముక్తి లభింపదు.

న చాపి యుక్తం త్వద్బాహు నిర్జితం మమ మానిసః రాజ్యం భోక్తు మనిహస్య దుర్భల స్యేవ కస్యచిత్ రాజ్యం కురు స్వయం పుత్రః దాయాదేభ్యో విముంచ వా మమాజ్ఞా పాలనం శస్తం పితూ ర్నక్షితి పాలనమ్

మరియు నా వంటి ఆజ్ఞాలంఘన చేయు పురుషునకు దుర్బులు నిపర వర్జిత భోగ విషయముతో సమానముగా నీ బాహు బలముచే జయింప బడిన రాజ్యము ననుభవించుట ఉచితము గాదు. నీవే స్వయముగా రాజ్యమును పాలించుము. లేక తిరిగి దాయాదులకు ఇచ్చివేయుము. నాకు తండ్రి యాజ్ఞ పాటించుటయే ఉత్తమము. “అంతే కాని రాజ్యమేలుట ఉచితము కాదు.”

మార్కండేయుడు:

తతః ప్రహస్య తద్భార్యా సుప్రభా నామ భామినీ ప్రత్యువాచ పతిం భూపః గృహ్యతాం రాజ్య మూర్జితమ్ న త్వం వైశ్యో న చైవాహం జాతా వైశ్య కులే నృపః క్షత్రియస్త్వం తథైవాహం క్షత్రియాణాం కులోద్భవా పూర్వమాస న్మిహీపాలః సుదేవ ఇతి విశ్రుతః తస్యా భూచ్చ సఖా రాజ్ఞో దూమ్రాశ్వస్య సుతో నలః

మార్కండేయుడు:

అని పలికిన భర్త మాటలు వినిన సుప్రభ అను అతని భార్య నవ్వి ఇట్లనెను. ఓ రాజా! సమృద్ధకారి యగు ఈ రాజ్యమును గ్రహింపుము. మీరు వైశ్యులు కారు. మరియు నేనును వైశ్య కుల మందు జన్మింప లేదు. మీరును క్షత్రియులే మరియు నేనును క్షత్రియ కుల మందు జన్మించిన దాననే. పూర్వము సుదేవుడను విఖ్యాత రాజుండెను. ధూమ్రాశ్వుడను రాజు యొక్క పుత్రుడైన నలుడు అతని మిత్రుడు.

స తేన సఖయా సహితో జగామామవనం వనమ్ పత్నీభిః స సమం రంతుం మాధవే మాసి పార్థివః తతః పానా న్యనేకాని భక్ష్యాణి బుభుజే తదా భార్యాభిః సహిత స్తాభి స్టేన సఖ్యా సమన్వితః తతః పుష్కరిణీ తీరే దదరాతి మనోరమామ్ పత్నీం చ్యవన పుత్రస్య ప్రమతేః పార్థివాత్మజామ్ సఖా తస్య నాలో మత్తో జగృహే తాం చ దుర్మతిః పశ్యత స్తస్య రాజ్ఞశ్చ త్రాహి త్రాహితి వాదినీమ్ ఆక్రందితం నిశమ్యైవ స తస్యాః ప్రమతిః పతిః ఆజగామ త్వరాయుక్తః కిమేతదితి వైవదన్ తతో దదర్శ రాజానం సుదేవం తత్ర సంస్థితమ్ గృహీతాం చ తథా పత్నీం సతేన సుదురాత్మనా

ఓ పార్థివా ! ఒక రోజున వైశాఖమాస మందు స్నేహితునితో భార్యలతో గూడి ఆమ్రవన మను పేరుగల వనమునకు విహరించుటకు బోయెను. పిమ్మట అచ్చట మిత్రునితో భార్యా సహితుడై అనేకములగు పానములతో భక్షములను భుజించెను. అనంతరము పుష్కరిణీ తీరమున చ్యవన మహర్షి యొక్క కుమారుడగు ప్రమతి మహర్షి యొక్క మనోహరమగు భార్యను చూసెను. ఆమె ఒక రాజ కన్య. అప్పుడు రాజు యొక్క స్నేహితుడు దుష్ట బుద్ధియు నగు నలుడు ఆమెను బలాత్కారముగా గ్రహించబోగా ఆమె రక్షింపుము, రక్షింపుము అని రాజుతో మొర బెట్టుకొనెను. అప్పుడామె భర్తయగు ప్రమతి మహర్షి దూరముగా రోదన శబ్దమును విని “ఏమి జరిగినది?” అని పలుకుచూ త్వరితముగా అచ్చటకు బోయెను. పిమ్మట అచ్చటకు బోయి చూడగా, సుదేవుడను రాజు కూర్చొని యుండ అతని సమక్షమున దురాత్ముడగు స్నేహితుడు బలాత్కరించుట చూసెను.

తతః సుదేవం ప్రమతిః ప్రాహాయం శాస్యతా మితి త్వం చ శాస్త్రా భవద్రాజ్యే దుష్టశ్చాయం నలో నృపః

అప్పుడు ప్రమతి సుదేవునితో ఇట్లనెను. ఇతనిని శాసించుము. నీవు రాజువు. నీవే శాసించ దగిన వాడవు. అందువలన ఈ దుష్టుడగు నలుని శిక్షించుట ఉచితము.

మార్కండేయుడు:

తస్యా ర్తస్య వచః శ్రుత్వా సుదేవో నల గౌరవాత్ ప్రాహ వ్తైశ్యో స్మి గచ్చాన్యం క్షత్రియం త్రాణ కారణాత్ తతః స ప్రమతిః బుద్ధ స్తేజసా నిర్దహ న్నవ ప్రచ్యువాచాథ రాజానం వైశ్యోస్మి త్యభి భాషిణమ్

మార్కండేయుడు:

ప్రమతి ఈ కారణముగా చెప్పిన ఆర్త వచనమును విని రాజగు సుదేవుడు నలుని యందలి గౌరవముచే ఇట్లు పలికెను. నేను వైశ్యుడను. నిన్ను రక్షించ వలెనన్న వేరొక క్షత్రియుని వద్దకు బొమ్ము. ప్రమతి సుదేవుని మాటలను విని అత్యంత కృద్ధుడై తన తేజస్సుచే దహించు వానివలె, నేను వైశ్యుడనని పలికిన ఆ రాజుతో ఇట్లనెను.

ప్రమతి:

ఏవమస్తు భవాన్ వైశ్యః క్షత్రియః క్షత రక్షణాత్ క్షత్రియై ర్దార్యతే శస్త్రం నార్త శబ్దో భవేదితి స త్వం న క్షత్రియో భావీ వైశ్య ఏవ కులాధమః

ప్రమతి:

అట్లే యగుదువు గాక. ఎందు వలన యనగా ఆర్త జనుల రక్షణ కొరకే క్షత్రియ నామము కలిగినది. ఆర్త శబ్దము లేకుండుట కొరకే క్షత్రియులు శాస్త్రమును ధరించుదురు. అందు వలన నీవు ఇప్పటి నుండి క్షత్రియుడవు గాకుందువు గాక. కులాధముడగు వైశ్యుడ వగుదువు గాక.