మార్కండేయ మహా పురాణము
129 - నరిష్యంత చరితము
క్రౌష్టుకి:
మరుత్త చరితం కృత్స్నం భగవన్! కథితం త్వయా
తత్సంతతి మశేషణ శ్రోత్రు మిచ్చా ప్రవర్తతే.
తత్సంతతౌ క్షితీశా యే రాజ్యార్హ వీర్య శాలినః
తా నహం శ్రోతు మిచ్చామి త్వయాఖ్యాతా స్మహామునే!.
క్రౌష్టుకి:
ఓ భగవానుడా! మీకు మరుత్తుని చరిత్రను సంపూర్ణముగా చెప్పితిరి. ఇప్పుడు ఆతని సంతానము యొక్క వృత్తాంతమును మీ నోటి నుండి విన గోరు చున్నాను.
మార్కండేయుడు:
నరిష్యంత ఇతి ఖ్యాతో మరు త్తస్యాభవ త్సుతః
అష్టాదశానాం పుత్రాణాం స జ్యేష్ఠః శ్రేష్ఠ ఏవ చ.
వర్షాణాం చ సహస్రాణి సప్తతిం దశ పంచ చ
బుభుజే పృథివీం కృత్స్నాం మరుత్తః క్షత్రియర్ష భః.
కృత్యా రాజ్యం స్యధర్మేణ ఇష్ట్వా యజ్ఞా ననుత్తమాన్
నరిష్యంత సుతం జ్యేష్ఠ మభిషిచ్య యయౌ వనమ్.
మార్కండేయుడు:
మరుత్తుని యొక్క పదహారు మంది పుత్రులలో జేష్టుడైన నరిష్యంతుడు శ్రేష్ఠుడు. క్షత్రియ శ్రేష్టుడగు మరుత్త మహారాజు డెబ్బది వేల పదునైదు సంవత్సరములు భూమిని పరిపాలించెను. అతడు ధర్మానుసారము రాజ్యమును మఱియు ఉత్తమోత్తమ మగు యజ్ఞములను చేసెను. పుత్రుడగు నరిష్యంతుని రాజ్యాభిషిక్తుని చేసి చివరకు వనము నకు పోయెను.
ఏకాగ్రచిత్తః స సృప స్తప్త్వా తత్ర తపో మహత్
ఆరురోహ దివం విప్ర! యశ సావృత్య రోదసీ.
నరిష్యంతః సుతః సోస్య చింతయామాస బుద్దిమాన్
పితు ర్వృత్తం సమాలోక్య తథాన్యేషాం చ భూభృతామ్.
అత్ర వంశే మహాత్మానో రాజానో మమ పూర్వజాః
యజ్వినో ధర్మతః పృథ్వీం పాలయామాసు రూర్జితాః.
దాతారశ్చాపి విత్తానాం సంగ్రామే ష్వనివ ర్తినాం
తేషాం కశ్చరితం శక్త స్త్వనుయాతుం మహాత్మనామ్.
కిన్తు తైత్యత్కృతం కర్మ ధర్మ్య మహవనాదిభిః
తదహం కర్తుమిచ్చామి తచ్చ నాస్తి కరోమి కిమ్.
ఓ విప్రా! అటు పిమ్మట మరుత్త రాజు వనము నందు ఏకాగ్ర చిత్తముతో గొప్ప తపస్సు చేసి స్వర్గ లోక, మర్త్య లోకములలో తన యశస్సు వ్యాపింప స్వర్గారోహణము చేశెను. ఆతని పుత్రుడు, బుద్ది మంతుడు నగు నరిష్యంతుడు, తండ్రి యొక్క మఱియు ఇతర రాజుల యొక్క వ్యవహారము చూసి ఇట్లు ఆలోచించెను. ఈ వంశ మందు నా పూర్వీకు లందరు మహాత్ములగు రాజ గణాలు యజ్ఞా నుష్టానము చేయువారు అతి పరాక్రమ వంతులు, ధన దాతలు, మఱియు సంగ్రామ మందు అపరాన్ముఖులు మఱియు అందరును ధర్మాను సారముగా పృథ్విని పరిపాలించిరి. ఆ మహాత్ముల యొక్క చరిత్రను అనుసరించుటలో ఎవడు సమర్ధుడు కాగలడు? వారు ఆహావనాదులచే ఎట్టి ధర్మ కార్యములను సంపన్నము చేసిరో, నేనును అట్టి వాటిని చేయ వలెనని కోరు చున్నాను. కాని దాని నైనను చేయ లేదు. నేనేమి చేయుదును?
థర్మా త్పాలయతః పృథ్వీం కో గుణోత్ర మహీపతే
అసమ్య క్పాలనా త్పాసీ నరేన్ద్రో నరకం వ్రజేత్.
సతి విత్తే మహాయజ్ఞాః కర్తవ్యా ఏవ భూభృతా
దాతవ్యం చాత్ర కిం విత్తం సీదతా మీశ్వరో గతిః.
అభిజాత్యం తధా లజ్జా కోపశ్చారిజనాశ్రయః
కారయంతి స్వధర్మశ్చ సంగ్రామ దపలయనమ్.
ఏత త్సర్వం యథా సమ్య జ్మత్పూర్వైః పురుషైః కృతమ్
పిత్రా చ మే మరుత్తేన తథా త త్కేన శక్యతే
తదహం కిం కరిష్యామి యత్తు తైః పూర్వజైః కృతమ్
యే యజ్వినో నరా దాంతాః సంగ్రామా చ్చానివర్తినః.
మహాత్సంగ్రామ సంమర్ధే ష్వవిసంవాది పౌరుషాః
క్రమేణాహం యతిష్యామి కస్మై తా నభిసంధితుమ్.
అథవా తైః స్వయం యజ్ఞాః కృతాః పూర్వ జనేశ్వరేః
అవిశ్రమద్భి ర్నాన్యైస్తు కారితా స్త త్కరోమహమ్.
రాజు ధర్మానుసారముగా పృధ్వీ పాలన చేయనిచో రాజు యొక్క గుణ మేమున్నది? అతడు ఆతని గుణములలో పరిణతి చెందలేదు. ఎట్లనగా బాగుగా పృథ్వీ పాలన చేయనిచో నరేంద్రుడు పాప భాగియై నరకమునకు పోవును. ధన మున్నచో రాజు గొప్ప యజ్ఞములను, దానములను చేయ వలెను. కాని ఇందునూ విచిత్ర మేమున్నది? ఈ విధముగా రాజు దుఃఖితుడై నపుడు ఈశ్వరుడే అతనికి దిక్కు. రాజు స్వధర్మ మందు ఉండుట చేతనే అతడు సిగ్గు, శత్రువుల యెడల కోపము మఱియు సంగ్రామ మందు పలాయనము చేయడు. ఈ సమస్త కార్యములను నా పూర్వికులగు పురుష గణాలు, మఱియు మరుత్తడు ఏ విధముగా సంపన్నము చేసిరో, ఆ విధముగా అన్యులెవరు సమర్దులు అగుదురు? నా పూర్వీకులు శ్రేష్ఠములగు యజ్ఞములు చేసినారు. గుణ వంతులు సంగ్రామమున వెను తిరగని వారు, మఱియు యుద్దము సంప్రాప్తించి నప్పుడు శత్రువుల యెదుట తమ పరాక్రమమును చూపించు వారు అయి యుండిరి. వారు చేయని సత్కార్యము లేదు. అట్టి దాని నిప్పుడేమి చేయుదును? అందు వలన నేను నిష్కామ కర్మను అనుష్టించెదను. లేక నా పూర్వీకులు స్వయముగా అవిరతముగా యజ్ఞములను చేసి యుండిరి ఇతరు లెవరు అట్టి వానిని చేయలేదు. నేను వాని ననుష్టించెదను.
మార్కండేయుడు:
ఇతి సంచింత్య యజ్ఞం స చకారైకం నరేశ్వరః
యాదృశం న చకారాన్యో విత్తోత్సర్గోపశోభితమ్.
ద్విజానాం జీవనాయాలం దత్త్వాతు సుమహాధనమ్
తతః శతగుణం తేషాం యజ్ఞార్ద మదదా నృపః.
గావో వస్త్రా ణ్యలంకారాం దాన్యాగారాదికం తథా
ప్రత్యేక మదదా త్తేషాం సర్వ పృధ్వీ నివసినామ్.
మార్కండేయుడు:
ఆ నరేశ్వరుడు ఈ విధముగా చింతించిన వాడై విపులముగా ధనమును దానము చేసి ఒక యజ్ఞమును చేసెను. అట్టి యజ్ఞమును ఇంతకు ముందు ఎవరునూ చేసి యుండ లేదు. అతడు ఈ యజ్ఞ మందు బ్రాహ్మణులకు జీవనము గడుపు కొనుటకు అధిక ధనమును ఇచ్చెను. అంతే కాక శత గుణాధిక మగు అన్న దానము చేసెను. పృధ్వీ వాసులగు బ్రాహ్మణులలో కొందరకు గోవులు, వస్త్రములు, భూషణములు, ధాన్యములు, గృహములు, మొదలగునవి అధికముగా నిచ్చెను.
తత స్తేన యదా యజ్ఞః ప్రారబ్దో భూభుజా పునః
ప్రారబ్దో స మఖే యష్టుం తతో నాలభత ద్విజాన్.
యా న్యా న్వృణోతి స నృపో విప్రా నా ర్త్విజ్య కర్మణి
తే తే త మూచు ర్యజ్ఞాయ వయ మన్యత్ర దీక్షితాః.
అన్యం వరయ యద్యిత్తం త్వయాస్మాకం విసర్జితమ్
తస్యాంతో నాస్తి యజ్ఞేషు దద్యాస్త్వం నృపతే! కథమ్.
అటు పిమ్మట ఎప్పుడయితే తిరిగి రాజు యజ్ఞము ననుష్ఠింప దలచెనో, అప్పుడు ఋత్విక్కుగా నుండుటకు ఏ బ్రాహ్మణుడును లభింప లేదు. ఏ ఏ బ్రాహ్మణులను అతడు ఋత్విక్కర్య మందు ఎన్ను కొనెనో, ఆయా బ్రాహ్మణులు నేను యజ్ఞమునకై వేరొక చోట దీక్షను బూనితిని. మీరు వేరొకరిని ఎన్నుకొనుడు. ఓ రాజా! మీరు యజ్ఞ కాలము మాకు ఎంత ధనమును దానము చేసితిరో, ఆ ధనము మాకు అనేక యజ్ఞము లందును కూడ నిశ్శేషము కాలేదు.
మార్కండేయుడు:
న చాప ఋత్విజో విప్రాం స్తదాశేష క్షితీశ్వరః
బహిర్వేద్యాం తదా దానం స దాతు ముపచక్రమే.
తథాపి జగృహు ర్నైవ ధన సంపూర్ణ మందిరాః
ద్విజాయ దాక్షిం భూయోసౌ నిర్విణ్ణ ఇద మబ్రవీత్.
మార్కండేయుడు:
భూమి యంతటికి ఈశ్వరుడయి ఎప్పుడయితే అతడు ఋత్విక్కుల కొఱకు ఏ బ్రాహ్మణులను పొందలేదో, అప్పుడు బహిర్వేది యందు దానము చేయుటకు ప్రయత్నించెను. అయిననూ ధనముతో నిండియున్న గృహములు గల బ్రాహ్మణులు దానమును గ్రహింప లేదు. రాజు బ్రాహ్మణులకు దానము చేయు నిమిత్తము ప్రవృత్తు డయ్యెను. అనగా దానమును గ్రహించుటకు బ్రాహ్మణు లేవ్వరునూ రాక పోవుటకు అతని శ్రమ వ్యర్ధ మయ్యెను.
ఆహోతి శోభనం పృథ్వ్యాం యద్విప్రో నాధనః క్వచిత్
అశోభనం చ యత్కోశో విఫలోయ ద్యయజ్వినః.
నార్త్విజ్యం కురుతే కశ్చి ద్యజమానోఖలో జనః
ద్విజానాం న చ నో దానం దదతాం సంప్రతీచ్చతే.
“ఆహా! పుడమి యందలి ఏ ప్రదేశము నందూ ఇప్పుడు నిర్ధనుడగు బ్రాహ్మణుడు లేడు. ఇది తప్పక సుఖ దాయక మగు విషయము. కాని యజ్ఞము లేనిచో నా రాజ్యము యొక్క ధనాగారము వ్యర్ధ మగును ఇది అత్యంత కష్ట దాయకమగు విషయము. ఇప్పుడు బ్రాహ్మణు లందఱు స్వయముగా యజ్ఞములు చేసుకొనుటకు ప్రవృత్తులై యున్నారు. ఈ కారణమున ఎవరునూ ఋత్విక్కుగా నుండుటకు సమ్మతించుట లేదు. మఱియు వారే స్వయముగా దానము చేయు చున్నారు. అందు వలన నాచే ఇవ్వ బడుచున్న దానములు స్వీకరించుట లేదు.
మార్కండేయుడు:
తతః కాం శ్చిద్ద్విజా న్భక్త్యా ప్రణిపత్య పునః పునః
స్వయజ్ఞే బుత్విజ శ్చక్రే తే ప్రచకృ ర్మహామఖమ్.
అత్యద్భుత మిదం చాసీ ద్యదా తస్య మహీపతేః
స యజ్ఞోభూ త్తదా పృథ్వ్యాం యజమానోఖిలో జనః
ద్విజన్మనా మభూన్నాసీ త్సదస్య స్తత్ర కశ్చన
యజమానా ద్విజాః కేచి త్తేషాం తు యాజకాః
మార్కండేయుడు:
పిమ్మట నరిష్యంత మహారాజు కొంత మంది బ్రాహ్మణులకు భక్తితో మాటి మాటికి నమస్కరించి వారిని తన యజ్ఞ మందు ఋత్విక్కులుగా చేసు కొనెను. ఆ ద్విజులు ఆ మహా యజ్ఞములను నిర్వహించిరి అట్టి సమయమున అత్యంత ఆశ్చర్య మేమనగా “ఆ మహా యజ్ఞము నందు అఖిల జనులు యజమానులైరి. అప్పుడు ఆ యజ్ఞము లందు ఎవరునూ సభాసదులు లేరు. అప్పుడు బ్రాహ్మణులలో కొందఱు యజమానులైరి. మరి కొందరు వారికి యాజకులైరి.”
నరిష్యంతో నరపతి రియాజ సయదా తదా
తత్ప్రదాతు ర్ధనై ర్యాగం కుర్యుః పృధ్వ్యా మశేషతః.
ప్రాచ్యాం కోట్యస్తు యజ్ఞానా మాస న్నష్టా దశాధికః
ప్రతీచ్యాం సప్త క్తోట్యో దక్షిణస్యాం చతుర్దశ.
ఉత్తరస్యాం చ పంచాశ ధేక కాలం తదాభవన్
మునే బ్రాహ్మణయజ్ఞానాం నరిశ్యంతో యదాయజత్.
ఏవం స రాజా ధర్మాత్మా నరిష్యంతోభవ త్పురా
మరుత్త తనయో విప్ర విఖ్యాత బల పౌరుషః.
నరిష్యంత మహారాజు యజ్ఞము చేయు సమయమున ఇచ్చిన ధనముతో భూమి యందలి బ్రాహ్మణులు లెల్లరు అనేక యజ్ఞములు చేసిరి. తూర్పు దిక్కున పదునెనిమిది కోట్ల కన్న నధికముగా యజ్ఞములు చేసిరి. పడమర దిక్కున ఏడు కోట్లు మఱియు దక్షిణ దిక్కున పదు నాలుగు కోట్ల యజ్ఞములు చేసెను. ఉత్తర దిక్కున యాబది కోట్ల యజ్ఞములు చేసిరి. బ్రాహ్మణులు చేసిన ఈ సమస్త యజ్ఞములు ఒకే సమయమున జరిగెను. అనగా నరిష్యంతుడు యజ్ఞము చేసిన సమయ మందే జరిగెను. ఓ విప్రా! పూర్వ కాలమున మరుత్త మహారాజు పుత్రుడు, విఖ్యాత బల పౌరుష సంపత్తి కలవాడు అగు నరిష్యంత మహారాజు ఇట్టి ధర్మాత్ముడై యుండెను.
Summary of chapter 129 of the Mārkandeya Mahā Purana is as follows:
King Marutta protects forest sages from demonic intrusions, entering into conflict with Nagas and rakshasas. Through his powerful bow and divine mantras, Marutta forces the invaders to seek peace and make restitution to the hermits.