మార్కండేయ మహా పురాణము
11 - జీవుని గర్భ స్థితి నిరూపణము
పుత్రుడు:
నిషేకం మానవ స్త్రీణాం బీజం ప్రోక్తం రజస్యథ విముక్త మాత్రో నరకాత్ స్వర్గాదపి ప్రపద్యతే తేనాభిభూతం తత్ స్థైర్యం యాతి బీజ ద్వయం పితః కలలత్వం బుద్భుదత్వం తతః పేశిక్వ మేవ చ పేశ్యా స్తథా యథా బీజా దంకురాది సముద్భవః అంగానాం చ తథోత్పత్తిః పంచానా మనుభాగశః ఉపాంగా న్యంగుశీ నేత్ర నాసాస్య శ్రవణాని చ వ్రరోహం యాంతి చాగేభ్య స్తర్వ త్తేభ్యో నఖాదికం త్వచి రోమాణి జాయంతే కేశా శ్చైవ తతః పరమ్ సమం సమృద్ధి మాయాతి తేనైవోద్భవ కోశకః
పుత్రుడు:
జనకా! నిషేక కాలమున స్త్రీ యొక్క రజస్సు యందు పురుషుని వీర్యము గలిసిన సమయమున స్వర్గము నుండి గాని నరకము నుండి గాని విడువ బడిన జీవుడు శుక్ర శోణితముల నాశ్రయించును. అనంతర మందా జీవునితో వ్యాప్తమైన శుక్ర శోణితము లకు స్థిరత్వమేర్పడును. ( అనగా గర్భము నిలుచును.) మొదట నురుగు గాను బిమ్మట బుడగ వలెను తరువాత చిన్న మాంసపు ముద్ద యాకారము గలది యగును. బీజము నుండి యెట్లుగా నంకురాదులు (మొలకలు) బుట్టునో యా విధముగా నా మాంసపు ముద్ద యను బీజము నుండి విభాగ క్రమముగా ఐదవయవములు ఉద్భవించును. తరువాత సమస్తము లైన యుపాంగములు అనగా వ్రేళ్ళు, నేత్రములు, ముక్కు, ముఖము, చెవులు బుట్టును. అటులనే యా యుపాంగముల నుండి గోళ్ళు మొదలగునవి బుట్టును. చర్మము నందు రోమములు కేశములు ఉత్పన్న మగును. ఇట్లన్ని యవయవములు సమాన బాళ్ళుగా వృద్ధి పొందు చుండును. అండ కోశము గూడా పెరుగు చుండును.
నారికేళ ఫలం యాద్వత్సకోశం వృద్ధి మృచ్చతి తద్వత్ ప్రయా త్యసౌ వృద్ధిం స కోశోదో ముఖ స్టితః తలే తు జాను పార్శ్వాభ్యాం కరౌ న్యస్య స వర్ధతే అంగుష్టౌ చోపరి న్యాస్తౌ జాన్వో రగ్రే తథాంగుళీ జాను పృష్టే తథా నేత్రే జాను మధ్యే చ నాసికా స్పిచౌ పార్ష్ణి ద్వయస్తౌ చ బాహు జంఘే బహిః స్తితే ఏవం వృద్ధిం క్రమా ద్యాతి జంతుః స్త్రీ గర్భ సంస్థితః అన్యః సత్వోదరే జంతో ర్యథా రూపం తథా స్తితిః కాఠిన్య మగ్నినా యాతి భుక్త ప్రీతేన జీపతి పుణ్యా పుణ్యాశ్రయ మయీ స్థితి ర్జంతో స్తథోదరే
ఎట్లనగా నారికేళ ఫల మవయవ సహితముగా నెట్లు వృద్ది బొందునో, యా విధముగా నీ జీవుడు సైతము గర్భ కోశ, ముద్భవ కోశమను రెండును సమానముగా బెరుగు చుండును. జీవుడు తల్లి గర్భమున నివసించు సమయమున తొడలు, ప్రక్క భాగములతో సహితము రెండు చేతులును శిరస్సు నందుంచి క్రింది భాగమున నుండును. అంగుష్టములు రెండును తొడల యందుండును. మరియు వ్రేళ్ళన్నియు జానువుల యగ్రమందుండును. జానువుల వెనుక భాగమున నేత్రములు, జానువుల మధ్య భాగమున నాసికయు సంలగ్నమై యుండును. రెండు స్పిక్కులు పార్షి ద్వయము యొక్క పై భాగమున బాహువులు, పిక్కలు బహిర్భాగమున నండును. జీవుడు గర్భమందుండి యీ ప్రకారము క్రమముగా వృద్ధిని బొందును. (అనగా పిండము గట్టి బడును.) మరియు తల్లి తినిన ఆహారము త్రాగిన పానీయముచే జీవుడు జీవనాధారణ జేయును. గర్భ వాసము గూడ పుణ్య పాపముల తారతమ్యములచే భిన్న భిన్నములుగా యుండును.
నాడీచాప్యాయని నామ నాభ్యాం తస్య నిబధ్యతే । స్త్రీణాం తథాన్తః శుషిరే సా నిబద్దోపజాయతే ॥ క్రామంతి భుక్త పీతాని స్త్రీణాం గర్భోదరే యథా తై రాప్యాయిత దేహో సౌ జంతు ర్వ్రుద్ది ముపైతి వై స్మ్రుతిం తత్ర ప్రయాన్త్యస్య బహ్వ్య స్సంసార భూమాయః తతో నిర్వేద మాయాతి పీడ్యమాన ఇత స్తతః పునర్నైవం కరిష్యామి ముక్తమాత్ర ఇహోదరాత్ తథా తథా యతిష్యామి గర్భం నాప్స్యా మ్యహం యథా ఇతి చింతయతే స్మృత్వా జన్మ దుఃఖ శాతాని వై యాని పూర్వాను భూతాని దైవ భూతాని యాని వై
స్త్రీ గర్భ మందున్న యా జీవుని నాభి యందు “ఆప్యాయనీ” యను పేరుతొ నొక నరము నిబద్ధమై యుండును. ఆ నాడి తల్లి యొక్క అంత్ర శుషిరమందు సంలగ్నమై యుండును. ఆ “అంత్ర చిద్రము” నుండి తల్లి త్రాగిన తినిన యన్ని పదార్థములు అచ్చటికి చేరును. అందువలన దేహము బలము గల దగును. జీవుడు బెరుగు చుండును. అప్పుడా జీవునికి యనేకములగు తన జన్మ వృత్తాంతములు స్మృతికి వచ్చును. మరియు నా గర్భ నరక మందన్ని వైపులా పీడింప బడుతూ మహా దుఖమును బొందు చుండెను. వెనుకటి జన్మల యందలి దుఃఖములను దలంచు కొనును. ‘గర్భము నుండి బైట బడిన వెంటనే మరల జన్మించ కుండ ప్రయత్నము జేసెదను’ అని యనుకొనును. వందలు వేల సార్లు తాను జన్మించి యనుభవించిన దుఃఖ పరంపరలను దలచు కొని నిర్వేదము బొందును. పూర్వానుభూతములు, దైవ భూతము లన్నియు స్మరించును.
తతః కాల క్రమా జ్జతుః పరివర్త త్యదోముఖః నవమే దశమే వాపి మాసి సంజాయతే తతః నిష్క్రామ్య మాణో వాతేన ప్రాజాపత్యేన పీడ్యతే । నిష్క్రామ్యతే చ విలపన్ హృది దుఃఖ నిపీడితః ॥ నిష్క్రాంత శ్చోదరా న్మూర్భా మసహ్యం ప్రతిపద్యతే ప్రాప్నోతి చేతనాం చాసౌ వాయు స్పర్శ సమన్వితః తతస్తం వైష్ణవీ మాయా సమాస్కందతి మోహినీ తయా విమోహితా త్మాసౌ జ్ఞాన భ్రంశ మవాప్నుతే భ్రష్ట జ్ఞానో బాల భావం తతో జంతుః ప్రపద్యతే తతః కౌమారకా వస్థాం యౌవనం వృద్ధ తామపి
అనంతరమా జీవు డప్పు డధో ముఖుడై కాల క్రమముగా తొమ్మిదవ నెల లేక పదియవ నెల యందు గాని పరివర్తనము బొందును. తరువాత జననము నందును ఆ ప్రసవ సమయమున నా ప్రాణి “ప్రాజాపత్య” మను సంజ్ఞ గల వాయువుచే పీడింప బడిన వాడగుచు, మహా దుఃఖముతో రోదనము జేయుచు వెలుపలకు వచ్చును. ఇట్లు గర్భము నుండి వెడలుతున్న సమయముననే యా జీవుని కసహ్య మగు మూర్చ బొందును. తరువాత బాహ్య మందలి వాయు స్పర్శచే చైతన్యము గలుగును. పిమ్మట సమ్మోహిని యగు వైష్ణవీ మాయ యావరించును. ఆ మాయచే విమోహితాత్ము డగును. అనంతర మంతకు పూర్వము గర్భ మందున్న తన జ్ఞానము భ్రష్టమయిన పిమ్మట బాల భావము బొందును. క్రమముగా బాల్య, కౌమార, యౌవన, వార్ధక్య దశలను గూడా ననుభవించును.
పునశ్చ మరణం తద్వజ్జన్మ చాప్నోతి మానవః తతః సంసార చక్రేస్మిన్ భ్రామ్యతే ఘటి యంత్రపత్ కదాచి త్స్వర్గ మాప్నోతి కదాచి న్నిరయం నరః నిరయం చైవ స్వర్గం చ కదాచి చ్చ మృతోశ్నుతే కదాచి దత్రైవ పూనా ర్జాతః స్వం కర్మ సోశ్నుతే కదాచిద్భుక్త కర్మా చ మృతః స్వల్పెన గచ్చతి కదాచి దల్పైశ్చ తతో జాయతే త్ర శుభా శుభైః స్వర్లోకే నరకే వాపి భుక్త ప్రాయో ద్విజోత్తమః నరకేషు మహాద్దుఃఖ మేతద్య త్స్వర్గ వాసినః ద్రుశ్యంతే తాతః మోదంతే పాత్యమానాశ్చ నారకః
తిరిగి మరల మరణించును. మరల జన్మించును. ఘటీ యంత్రము వలె నీ సంసార చక్రము నందు క్రిందికి మీదికి నిరంతరము తిరుగు చుండును. ఒక జన్మలో స్వర్గమునకు బోవును. మరియొక జన్మమున నరకమునకు జేరును. ఇట్లు జనన, మరణముల నందుచు స్వర్గ నరకములకు బోవు చుండును. వచ్చు చుండును. మరియు నొకసారి ఈ మనుష్య లోకముననే మరల జన్మించును. జన్మించి పుణ్య పాప కర్మల ననుభవించి స్వల్ప కాలముననే మరణించును. ద్విజోత్తమా! యోకప్పుడు సామాన్యములగు పుణ్య పాప కర్మల మూలమున స్వల్పకాలము స్వర్గ నరకములు కలుగును. జనకా! స్వర్గ లోక సౌఖ్యములు, బొంది సంతోషము బొందుదురు. నరక లోక దుఃఖములు గలిగి నపుడేడ్చు చుందురు. ఇట్టి వారినెందరినో నేను జూచితిని.
స్వర్గేపి దుఃఖ మతులం యదా రోహణ కాలతః ప్రభృత్యం పతిష్యామీ త్యేవం మనసి వర్తతే నరకాం శ్చైవ సంప్రేక్ష్య మః దుఃఖ మవాప్యతే ఏతాం గతి మహం గం తే త్యహర్నిశ మనిర్వ్రుతః గర్భవాసే మః దుఃఖం జాయ మానస్య యోనితః జాతస్య బాల భావే చ వృద్దత్వే దుఃఖ మేవ చ కామేర్ష్యాః క్రోధ సంబంధం యౌవనం చాటి దుస్సహ దుఃఖ ప్రాయా వృద్ధతా చ మరణే దుఃఖ ముత్తమమ్ క్రుష్య మాణశ్చ యామ్యైశ్చ నరకేషు చ పాత్యతః పునశ్చ గర్భో జన్మాధ మరణం నరక స్తథా
జీవుడు స్వర్గమును బోయిన సమయము నుండియు గూడ, స్వర్గమందున్నను, పుణ్య క్ష్యయమైన వెంబడి, స్వర్గము నుండి భ్రష్టుడ నగుదునని, స్వర్గము నుండి గూడ నంతు లేని దుఃఖము బొందును. నరక లోకమునకు బోయిన ప్రాణి నరకములను జూచి మహా దుఃఖము జెందును. ఈ నరక గమనము లన్నీ నేను బొందవలసి యున్నది కదాయని యహర్నిశలు శాంతి లేని వాడై మహా దుఃఖమును బొందును. గర్భ మందు నివసించుటచే దుఃఖము, పుట్టబోవు నప్పుడు యోని నుండి వెడలునప్పటి దుఃఖము, పుట్టిన బిమ్మట, బాల భావమందలి దుఃఖము, వృద్దావస్తలో దుఃఖము జెందు చుండును. మరియు కామము, ఈర్షా, క్రోధము, మొదలగు కారణములచే యౌవన మతి దుస్సహ మయమై యుండును. మరియు దీని తరువాతది యగు వృద్దావస్థ దుఃఖ నిలయమని జెప్పవచ్చును. ఇక సరే, మరణ మన్న మహా కఠిన దుఃఖము. యమదూతలు జీవుని బంధించి యీడ్చుకొని బోయి నరకముల బడ వైతురు. తరువాత మరల గర్భ వాసము జననము, మరణము, మరల నరక వాసము గలుగు చుండును.
ఏవం సంసార చక్రేస్మిన్ జంతవో ఘటి యంత్రవత్ భ్రామ్యంతే ప్రాకృతై ర్భంధై ర్భద్వా వద్యంతి చాసకృత్ నాస్తి తాత సుఖం కించి రిత్ర దుఃఖ శతాకులే తస్మా న్మోక్షాయ యతతా కథం సేవ్యా మయా త్రయీ?
ఈ ప్రకారమిట్లు సంసార చక్రమున సమస్త ప్రాణి కోట్లు ప్రకృతి బంధనమున బంధింప బడి ఘటీ యంత్రము వలె సదా క్రిందికి పైకి తిరుగు చుందురు. మరల మరల దుఃఖమును బొందు చుందురు. గావున నో జనకా! కోట్ల గొలది దుఃఖముల కాలవాల మయిన నీ సంసార మందు లేశ మాత్రము గూడ సుఖ మనునది గనుపించదు. ఇందు వలన నేను మోక్ష లాభమునకై యత్నించెదను. త్రై గుణ్య విషయములగు వేదములతో నాకు బని ఏమున్నది?
Summary of chapter 11 of the Mārkandeya Mahā Purana is as follows:
The enlightened son instructs his father on the inevitable cycle of saṃsāra and the precise workings of karmic fruit. Every action performed in thought, word, or deed leaves a subtle impression that determines the soul's future embodiment across human, animal, or divine species. Virtue leads to celestial realms of light and joy, whereas unrighteousness drags the mind into dense delusion and painful rebirths, emphasizing that true freedom lies only in transcending worldly attachment.