35 - దత్తాత్రేయాలర్క సంవాదము

జడుడు:

దత్తాత్రేయం తతో విప్రం ప్రణిపత్య పార్థివః

ప్రత్యువాచ మహాత్మానం ప్రశ్రయా వనతో వచః

సమయ క్ప్రపశ్యతో బ్రహ్మ! నమ్మ దుఃఖం న కించన

అసమయ గ్దర్శినోమగ్నాః సర్వదైవా సుఖార్ణవే

యస్మి న్యస్మి న్మమత్వేన బుద్ధిః పుంసః ప్రజాయతే

తత స్తతః సమాదాయ దుఃఖా న్యేవ ప్రయచ్చతి

మార్జార భక్షితే దుఃఖం యాదృశం గృహ కుక్కుటే

న తాదృ జ్ఞ్మమాతా శూన్యే కలవింకేథ మూషికే

సోహం న దుఃఖీ న సుఖీ యతోహం ప్రకృతేః పరః

యొ భూతాభిభవో భూతైః సుఖ దుఃఖాత్మతో హి సః

జడుడు:

పిమ్మట నరపతి యగు అలర్కుడు వినయ పూర్వకముగా నమ్రతతో మహాత్ముడు, విప్రుడు నగు దత్తాత్రేయునికి నమస్కరించి మరల నిట్లు పలికెను. బ్రాహ్మణ్యుడా! సమ్యక్ప్రకారముగా దర్శనము కలిగిన నాకు ఇప్పుడు కొంచెము కూడా దుఃఖము లేదు. బాగుగా ఆత్మను దర్శించిన మనుష్యులు ఎల్లప్పుడు దుఃఖ సాగరమున మునుగు చుందురు. మనుష్యుని యొక్క బుద్ధి యే యే పదార్థముల యందు ఆసక్తమై యుండునో ఆయా పదార్థముల నుండి దుఃఖము కలుగు చుండును. ఇంటిలో పెంచుచున్న కోడిని పిల్లి భక్షించినచో ఎంత దుఃఖము కలుగునో, మమతా సూన్యమగు గోరువంక పక్షిని గాని ఎలుకను గాని భక్షించినచో అంట దుఃఖము కలుగదు. ఎందు వలననగా కోడి యందు మమకారము వున్నది. నేను సుఖిని గాని, దుఃఖిని గాని, నేను ప్రకృతి కంటే అతీతుడను, భూతములకు సుఖ దుఃఖములు కలుగు చుండును. అనగా ఈ సంసార మందు ఆసక్తి వున్న వారికి సుఖ దుఃఖములు కలుగు చుండును.

దత్తాత్రేయుడు:

ఎవమేతన్నార వ్యాఘ్రః యథైత ద్వ్యాహృతం త్వయా

మమేతి మూలం దుఃఖస్య న మమేతి చ నిర్వృతిః

మత్ప్రశ్నా దేవ తం జ్ఞాన ముత్పన్న మిద ముత్తమమ్

మమేతి ప్రత్యయో యేన క్షిప్తః శాల్మలి తూలవత్

అహ మిత్యంకురోత్పన్నో మమేతి స్కంధవా న్మహాన్

గృహ క్షేత్రోచ్చ శాఖశ్చ పుర దారాది పల్లవః

ధన ధాన్య మహాపత్రో నిక కాల ప్రవర్దితః

పుణ్యా పుణ్యాగ్ర పుష్పశ్చ సుఖ దుఃఖ మహాఫలః

అపవర్గీ పథ వ్యాపీ మూడ సంపర్క సేచనః

విధిత్సా భృంగ మాలాద్యో కృత్య జ్ఞాన మహా తరుః

దత్తాత్రేయుడు:

నర శ్రేష్ఠా! నీవు చెప్పినది సత్యము మమకారము దుఃఖములకు మూలము, సుఖములకు కూడా మూలమై వున్నది. నేను ప్రశ్నించుట వలననే నీ హృదయ మందు ఇట్టి ఉత్తమ జ్ఞానము కలిగినది. ఈ జ్ఞాన బలము చేత నీ యొక్క మమకారము బూరుగు దూది వలె ఎగిరి పోయినది. అహంకార రూపమైన అంకురము నుండి అజ్ఞాన రూపమగు మహా వృక్షము పుట్టెను. ఆ వృక్షమునకు మమకారము స్కంధమై ఉన్నది. గృహ క్షేత్రములు ఆ వృక్షము యొక్క ఉన్నత శాఖలై ఉన్నవి. స్త్రీ పుత్రాదులు దాని యొక్క చిగుళ్ళు. ధన ధాన్యములు పత్రములు పుణ్యా పుణ్యములు ప్రధాన పుష్పములు. సుఖ దుఃఖములు దాని యొక్క ఫలములు మోహ వశుడైన మానవుడు ఈ అజ్ఞాన రూప వృక్షముతో సంబంధము పెట్టు కొనును.

సంసారాధ్య పరిశ్రాంతా యే తచ్చాయాం సమాశ్రితాః

భ్రాంతి జ్ఞాన సుఖాదీన స్తేష మాత్యభ్తికం కుతః

యైస్తు సత్సం పాషాణ శితేన మమతా తరుః

భిన్నో విద్యా కుఠారేణ తే గతా స్తేన వర్త్మనా

ప్రాప్య బ్రహ్మవనం శీతం నీరజస్క మకంటకమ్

ప్రాప్ను వంతి పరాం ప్రాజ్ఞా నిర్వృతిం వృత్తి వర్జితాః

భూతేంద్రియ మయం స్థూలం న త్వం రాజన్న చాప్యహమ్

స తన్మాత్రం మయా వాచ్యం నై వాంతః కరణాత్మకౌ

కం వా పశ్యామి రాజేంద్రః ప్రధాన మిద మావయోః

యతః పరో హి క్షేత్రజ్ఞ సంఘాతో హి గుణాత్మకః

ఏ పురుషులు సంసార మార్గ మందు అలసి పోయి ఈ అజ్ఞాన వృక్ష చాయను బ్రాంతిచే సుఖ ముందనుకొని ఆశ్రయించు చుందురో వారికి మహా సుఖమగు మోక్ష లాభము ఎట్లు లభించును? పురుషుడు జ్ఞాన రూపమైన గొడ్డలిని సత్సంగ రూపమైన రాతి యందు పదును పెట్టి దానిచే మమతా వృక్షమును చేదించుటకు సమర్థు డగును. ఆ మార్గమున బ్రహ్మ రూప వన మందు ప్రవేశించు చున్నాడు. బ్రహ్మ వనము అత్యంత శీతలము, రజో విహీనము, కంటక రహితము అయి ఉన్నది. ఈ వనము నందు ఉండుటచే వృత్తి రహితుడై పరమ సుఖ లాభమును పొందు చున్నాడు. భూపతీ! భూతేంద్రియ మయమగు స్థూల స్వరూపము నీవు కావు. నేను కూడా కాను. మన యిద్దరి యందు తన్మాత్రలు లేవు. అంతః కారణాత్మకులము కూడా కాము. రాజేంద్రా! మన ఇద్దరిలో ఎవరి యందు ఏ ప్రకృతి మయమును చూచు చున్నామో అతడు క్షేత్రజ్ఞ పురుషుడు, ప్రకృతికి అతీతుడు, గుణాత్మకుడు అయి ఉన్నాడు.

మశకో దుంబరేషీకా ముంజ మత్స్యాంభసాం యథా

ఏకత్వేపి పృధగ్భావ స్తథా క్షేత్రాత్మనోర్నృపః

ఓ రాజా! దోమ, ఉదుంబర వృక్షము, ఇషీకా, ముంజ, మచ్చ, జలముల యందు ఉన్న ఆత్మ ఒక్కటైనను, నేనుగా కనపడు చున్నట్లు క్షేత్రమునకు క్షేత్రజ్ఞునకు కూడా ఈ ప్రకారము అని తెలియ వలెను.

అలర్కుడు:

భగవం స్తంత్ప్ర సాదేనా మమావిద్భూత ముత్తమమ్

జ్ఞానం ప్రధాన చిచ్చక్తి వివేక కరమీదృశమ్

కింత్యంత్ర విషయా క్రాంతేస్థైర్య వత్త్వం న చేతసి

న చాపి వేద్మి ముచ్యేయం కథం ప్రకృతి బంధనాత్

కథం న భూయాం భూయశ్చ కథం నిర్గుణతా మియామ్

కథం చ బ్రహ్మణై కత్వం వ్రజేయం శాశ్వతెన వై

తన్మే యోగం తథా బ్రహ్మాన్ ప్రణతాయాభియా చతే

సమయ గ్బ్రూహి మహా ప్రాజ్ఞః సత్సంగో హ్యుపకృన్నృణామ్

అలర్కుడు:

భగవాన్! తమ యొక్క అనుగ్రహముచే నాకు ప్రధానము యొక్క చిచ్చక్తి యొక్క వివేకము గల ఉత్తమ జ్ఞానము కలిగినది. కాని నా చిత్తము విషయము లందు ఆకర్షింప బడుటచే స్థిరముగా ధారణ చేయ లేక పోవు చున్నాను. ఏ ప్రకారము ప్రవృతిని నిగ్రహించ వలయునో? ఈ ప్రకృతి బంధము నుండి ఎట్లు విడిపో గలనో తెలియ జాల కున్నాను. ఏ విధముగా జన్మ లేకుండునో? ఎట్లు నిర్గుణత్వమును పొందుదునో? ఏ అనుష్టానము శాశ్వత మగు బ్రహ్మ సాయుజ్యమును పొందుదునో? అట్టి యోగమును నాకు చక్కగా ఉపదేశము చేయుడు. మహా ప్రాజ్ఞా! ప్రణతుడనై తమ ముందు ప్రార్థన చేయు చున్నాను. సత్సంగత్వము మనుష్యునకు ఉపకార సాధనమై యున్నది.