మార్కండేయ మహా పురాణము
21 - కువలయాశ్వుడు పాతాళలోకమునకు బోవుట
నాగపుత్రులు:
స రాజపుత్రః సం పాప్య వేగా దాత్మపురం తతః పిత్రో ర్వవందిషుః పాదౌ దిదృక్షుశ్చ మదాలసాయ్ స దదర్శ తదుద్విగ్న మప్రహృష్ట ముఖం పురమ్ పునశ్చ విస్మితాకారం ప్రహృష్ట వదనం పునః అన్య ముత్భుల్ల నయనం దిష్ట్యా దిష్టేతి వాదినమ్ పరిష్వజంత మన్యోన్య మతికౌతూహలాన్వితమ్ స రాజపుత్రో మిత్రుంతు ఉత్ఫుల్ల నయనం శుభమ్ ఆలింగ తదా కాలే సౌహృదేన పరేణ చ తతః పౌరా స్తదాలోక్య దిష్ట్యా దిష్టేతి వాదినః చిరంజీవోరు కళ్యాణః హతా స్తే పరిపంధినః
నాగ కుమారులు:
రాజపుత్రుడగు నా ఋతధ్వజుడు తల్లి దండ్రులకు వందనము జేయ వలెనని ప్రియపత్ని యగు మదాలసను జూడ వలయునను కోరికతో శీఘ్రముగా తన పట్టణమునకు బోయెను. రాజసూనుడు పట్టణమున ప్రజలు దుఃఖా క్రాంతచిత్తులై యుండుటను జూచెను. తనను జూడగనే దుఃఖము వదలి వెంటనే విస్మయాకార ముఖములతో సంతోష చిత్తులై యున్న పౌరులను జూచెను. కొందరు వికసించిన నేత్రములతో ఏమి భాగ్యమని అనుకొన సాగిరి. కొందరు అత్యంత స్నేహముచే కుతూహలముతో అన్యోన్యాలింగనము చేసుకొన సాగిరి. మరియు నా రాజపుత్రులు ఆనందముతో విప్పారిన నేత్రములు గల తన మిత్రులను ఆ సమయమున ఆలింగనము చేసుకొన సాగిరి. మరియు పురవాసులైన జనులు అతడిని చూసి ఏమి భాగ్యమని పలుకుచు, శుభయోగములు గల రాజపుత్రా! నీవు చిరంజీవి వగుదువు గాక. నీ శత్రువు లందరు నశించెదరు గాక.
పిత్రోః ప్రహ్లాదయ మన స్తథా స్మాక నుంకటకః ఇత్యేవం వాదిభిః పౌరైః పురః పృష్టే చ సంవృతః తత్ క్షణ ప్రభవానందః ప్రవివేశ పితుః పురమ్ పితా చ తం పరిష్వజ్య మాతా చాన్యే చ భాంధవాః చిరంజీవోరు కళ్యాణ దదౌ చాస్మై తదాశిషః ప్రణిపత్య తతః సోథ కిమేత దితి విస్మితః పప్రచ్ఛ పితరం చాధ సోస్మై సర్వం తదుక్తవాన్ స భార్యాం తాం మృతాం శ్రుత్వా హృదయేష్టాం మదాలసామ్ పితరౌ చ పురా దృష్ట్వా లజ్జా శోక విమధ్యగః చింతయామాస సా బాలా మాం శ్రుత్వా నిధనం గతమ్
తల్లిదండ్రుల మనస్సులకు, పౌరులగు మా మనస్సులకు , ఆనందమును కలుగజేయుము. ఇట్లు ప్రజలు పలుకుచూ వెంబడించు చుండ, తత్కాలము నందు కలిగిన ఆనందముతో జనకుని మందిరమునకు పోయెను. అప్పుడు తల్లిదండ్రులు, ఇతర బంధుగణము పరమానందముతో ఆలింగనము చేసుకొనిరి. “ఉరుకల్యాణా! నీవు చిరంజీవి యగుదువు గాక!” అని ఆశిస్సులిడ సాగిరి. అనంతరము రాజపుత్రుడు వారందరికీ నమస్కరించి ఇది యంతయు ఏమి? అని విస్మయము చెందెను. పిమ్మట రాజకుమారుడు జనకుని అడిగెను. తండ్రి జరిగిన వృత్తాంత మంతయు చెప్పెను. రాజసూనుడు ప్రాణ ప్రియురాలగు భార్య మదాలస యొక్క మరణ వార్త విని ఎదుట నున్న తల్లిదండ్రులను జూచి, లజ్జతో శోక సాగరమున మునిగెను. నా భార్య నేను చనిపోయినట్లు విని తాను కూడ మరణించెను గదా యని దుఃఖించ సాగెను.
తత్యాజ జీవితం సాధ్వీ దిజ్మాం నిష్ఠుర మానసమ్ మత్కృతే నిధనం ప్రాప్తాం యజ్జీవా మ్యతి నిర్ఘృణః పునస్సా చింతయామాస పరిసం స్తభ్య మానసమ్ మోహోద్గమ మపాస్యైవం నిశ్శ్వస్యో చ్చ్వస్వ చాతురః మృతేతి సా మన్నిమిత్తం త్యజామి యది జీవితమ్ కి మ్మయోప కృతం తస్యాః శ్లాఘ్య మేతత్తు యోషితామ్ యది రోదిమి వా దీనం హా ప్రియేతి వదన్ ముహుః తథాప్యశ్లా ఘ్యమేతన్నో వయం హిపురుషాః కీల
అథ శోకజడో దేనో సృజాహీనో బలాన్వితః
సాధ్వి యగుటచే జీవితమును త్యాగము జేసెను. నేను కఠిన మానవుడను. నీచుడను, నా నిమిత్తముగా ప్రాణ త్యాగము జేసినది. నేను మాత్రము నా ప్రియురాలు మరణించినను జీవించి యున్నాను. నేను దయా రహితుడను. అని యిట్లు దుఃఖించిన పిమ్మట మనస్సును నిగ్రహించుకొని అత్యంత కాతరుడై దీర్ఘములగు ఉచ్చ్వాస నిశ్వాసములను విడుచుచు మోహమును విడనాడి, చింతించ సాగెను. నా ప్రియురాలు నా కొరకు ప్రాణములను విడిచెను. నేను గూడ నా ప్రేయసి నిమిత్తము అసువులు బాసినచో ప్రయోజన మేమి యుండును? ఆమెకు ఏమి ఉపకారము చేసిన వాడనగుదును? హా ప్రియా! అని దీనముగా మాటి మాటికి ఏడ్చుట వలన ఆమెకు కలుగు ప్రయోజనమేమి? అట్లు ఏడ్చుట స్త్రీలు మాత్రమే చేయదగినది. పురుషుడ నైన నేను చేయదగినది కాదు. బలవంతుడ నయ్యను శోకాకులడను దీనుడను అయినచో రక్త హీనుడ నగుదును.
వివక్షస్య భవిష్యామి తతః పరిభవాస్పదమ్ మయారిశాతనా త్కార్యం రాజ్ఞః శుశ్రూణం పితుః జీవితం తస్య చాయత్తం సంత్యాజ్యం తత్కథం మయా కిం త్వ త మేన్య త్కర్తన్యం త్యాగో భో స్య యోషితః చాపినోపకారాయ తన్వంగ్యాః కిన్ను సర్వదా మయానృశంశ్యం కర్తవ్యం నాపకా ర్యుపకారి వా యా మదర్థే త్యజ ప్రాణం స్తదర్థేల్పమిదం మమ
అందువలన శత్రువుల చేత పరాభవము పాలగుదును. శత్రు నాశనము, పితృ సేవయు, ముఖ్య కర్తవ్యము. నా జీవితము శత్రు వినాశనము పితృ సేవాది కార్యములకు ఆధీనమై యున్నది. కావున జీవన పరిత్యాగము చేయుట ఉచితము కాదు. ఇప్పుడు స్త్రీ భోగమును త్యజించుట మరియొక కర్తవ్యము కారు. స్త్రీ సుఖ త్యాగము గూడ ఆమె ఆత్మ శాంతికి ఉపయోగించునది మాత్రము గాదు. అయినాను ఉపకారమైనను, అపకారమైనను నాకు ఆమె యండలి కరుణా పూర్వకమైన కర్తవ్యము. నా నిమిత్తము ప్రాణములను త్యజించిన ఆమెకు నేను చేయుచున్నది స్వల్పము మాత్రమే.
నాగపుత్రులు:
ఇతి కృత్వా మతిం సోథ నిష్పాద్యోదకదానికమ్ క్రియా శ్చానంతరం కృత్వా ప్రత్యువాచ ఋతధ్వజః యది సా మమ తన్వంగీ న స్యా ద్భార్యా మదాలసా
నాగ పుత్రులు:
ఋతధ్వజుడు ఈ విధముగా తలచి తన భార్యకు జల దానాది కర్మలు చేసెను. ఇట్లు పరలోక క్రియలు సమస్తము గావించిన పిదప ఋతధ్వజుడు అక్కడి వారితో ఈ విధముగా చెప్పెను.
అస్మిన్ జన్మని నాన్యా మే భవిత్రీ సహచారిణీ
తామృతే మృగశాబాక్షీం గంధర్వః తనయా మహమ్ న భోక్షే యోషితం కాంచి దితి సత్యం మయోదితమ్ సధర్మచారిణీం పత్నీం తాం ముక్త్వా గజగామినీమ్ కాంచి న్నాన్యాం కరిష్యామి తేన సత్యం మయోదితమ్ ఏవం సర్వాన్ పరిత్యజ్య స్త్రీ భోగాం స్తాత సర్వదా క్రీడ న్నాస్తే సమం తుల్యై ర్వయస్యై శ్శీల సంపదా ఏత త్తస్య పరం కార్యం తాత తత్కేన సాధ్యతే కర్తు మత్యంత దుష్ప్రాప్య మీశ్వరైః కిముతేతరైః
ఈ జన్మలో నాకు మదాలసయే భార్య గాని యెడల, మరి యే స్త్రీయు భార్య కాజాలదు. గంధర్వ తనయ, మృగ శాబాక్షియు నగు మదాలసను గాక మరియే కాంతను ఆపేక్షించను. సహా ధర్మచారిణి యగు నట్టి భార్యను వీడి అన్యకాంతను వివాహ మాడను. ఇది ముమ్మాటికి సత్యము. తండ్రీ! అతడిట్లు చెప్పి సర్వ భోగములను త్యజించి సంపదచే తనకు తుల్యమగు స్నేహితులతో నాట పాటల యందు కాలము గడుపు చుండెను. అతని కోరిక మదాలస ప్రాప్తియే. అది యెట్లు సాధ్య మగును? ఈ కార్యము ఈశ్వరునకు కూడా అసాధ్య మనుచో నితరులకు ఎట్లు సాధ్యము గాగలదు?
జడుడు:
ఇతి వాక్యం తయో శ్శ్రుత్వా విమర్శ మగమ త్పితా
జడుడు:
కుమారులిద్దరు చెప్పిన వాక్యములను విని నాగరాజు ఆలోచింప సాగెను.
విమృశ్య చాహ తౌ పుత్రౌ నాగరాట్ ప్రహన్నివ యద్యశక్య మితి శ్రుత్వా న కరిష్యంతి మానవాః కర్మ ణ్యుద్యమ ముద్యోగ హాన్యా హాని స్తతః పరమ్ ఆరభేత నరః కర్మ స్వపౌరుష మహాపయన్ నిష్పత్తిః కర్మణాం దైవో పౌరుషే చ వ్యవస్థితా తస్మా దహం తథా యత్నం కరిష్యే పుత్ర కార్యతః తపశ్చర్యాం సమాస్థాయ యథైత త్సాథ్యతే చిరాత్
నాగరాజు విచారణ జేసి నవ్వుచు పుత్రులతో ఇట్లు పలికెను. కుమారులారా! మానవులు చేయ దగిన పనిని శక్యము గాదని ప్రయత్నము చేయ కుండినచో దోషము కలుగును. పిమ్మట అత్యంత దుఃఖమును పొందిన వారగుదురు. కావున పురుష ప్రయత్నమును విడనాడ కుండ చేయదగిన కర్మను చేయవలెను. దైవ ప్రయత్న, పురుష ప్రయత్నముల రెండింటి యందు కర్మసిద్ది స్థిరమై యున్నది. అందు వలన నేను రాజ కుమారుని పత్ని కొరకు మానవ ప్రయత్నము చేసెదను. త్వరలో కార్యసిద్ధి యగునట్లు తపస్సు చేసెదను.
పుత్రులు:
ఏవముక్తా స నాగేంద్రః ప్లక్షా వతరణం గిరేః తీర్థం హిమవతో గత్వా తప స్తేపే సుదుశ్పరమ్ తుష్టావ వాగ్భి రిష్టాభి స్తత్ర దేవీం సరస్వతీమ్
పుత్రులు:
ఆ నాగేంద్రుడు ఇట్లు జెప్పి హిమాలయ పర్వత మందలి “ప్లక్షా వతరణ” మను పేరు గల తీర్థమునకు పోయెను. అచ్చట కఠోర మగు తపస్సు చేయ మొదలిడెను. తన కభీష్టములగు వాక్కులతో సరస్వతిని స్తుతించెను.
తన్మనా నియతా హారో భూత్వా త్రిషవనా పుతః
నిశ్చల మనస్సుతో త్రికాలముల యందు స్నానము చేయుచు నియమ పూర్వకముగ మితాహారమును తీసుకొనుచు దేవిని ఇట్లు స్తవము జేసెను.
అశ్వతరుడు:
జగద్దాత్రీ మహం దేవీ మారిరాధయిషు శ్శుభామ్ స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోని సరస్వతీమ్ సద సద్దేవి యత్ కించి న్మోక్ష బంథార్థవత్ పదమ్ తత్సర్వం త్వయ్యసంయోగం యోగవ ద్దేవి సంస్థితమ్ త్వమక్షరం పరం దేవి యత్ర సర్వం ప్రతిష్టితమ్ అక్షరం పరమ బ్రహ్మ జగచ్చైతత్ క్షరాత్మకమ్ దారు ణ్యవస్థితో వహ్ని ర్భౌమశ్చ పరమాణవః తథా త్వయి స్థితం బ్రహ్మ జగచ్చైద మశేషతః ఓంకారాక్షర సంస్థానం యత్తే దేవి స్థిరా స్థిరమ్
అశ్వతరుడు:
నేను జగజ్జనిని, శుభప్రదవు, సరస్వతీదేవివి యగు నిన్ను ఆరాధించ దలచితిని. నేను బ్రహ్మ కారణమగు సరస్వతిని శిరస్సుచే నమస్కరించి స్తుతించెను. ఓ సరస్వతీ! మోక్షము, అర్థము, బంధము మొదలగు సత్, అసత్ రూపములన్నియు నీవే అయి యున్నావు. సమస్తము నీయందు లేకున్నను ఉన్నదాని వలె ఉందువు. నీవు అక్షర స్వరూపవు. నీయందు సర్వము నిలిచి యున్నది. కట్టె యందు భౌమాణువులు, అగ్నియు ఉన్నట్లుగా అక్షరము లన్నియు పరమాణువులతో సమానముగా నీ యందు ఉన్నవి. అక్షర స్వరూప పరబ్రహ్మవు నీవే. ఈ విశ్వమంతయు నీ యందే ఉన్నది. నీవు పరబ్రహ్మ స్వరూపిణివి. అశేష ప్రపంచ మంతయు నీ స్వరూపము. నీ స్వరూపమైన ఓంకారము వర్ణములు నిత్యములు అనిత్యములు అగు చున్నవి.
తత్ర మాత్రా త్రయం సర్వ మస్తి యద్దేవి నాస్తి చ త్రయో లోకా స్త్రయో దేవా స్త్రైవిధ్య పావకత్రయమ్ త్రీణి జ్యోతీంషి వర్గాశ్చ త్రయో ధర్మాదయ స్తథా త్రయో గుణా స్త్రయ శ్శబ్దా స్త్రయో దోషా స్తథాశ్రమాః త్రయః కాలా స్తథా వస్థాః పితరో హర్నిశా దయః ఏతన్మాత్రా త్రయం దేవి తవ రూపం సరస్వతిః విభిన్న దర్శినా మాద్యా బ్రాహ్మణో వా సనాతనా సోమసంస్థా హవి స్సం స్థాః పాకసంస్థాశ్చ సప్త యాః తాస్త్వ దుచ్చారణా ద్దేవి క్రియంతే బ్రహ్మవాదిభిః అనిర్దేశ్యం తథా చాస్య దర్థమాత్రాశ్రితం పరమ్
అనగా సత్ అసత్ సంపూర్ణ పదార్థము లన్నియు నీ యందే యున్నవి. తల్లీ! త్రిలోకములు, త్రిమూర్తులు, వేద త్రయము, అగ్ని త్రయము (ధర్మ,అర్థ, కామములు) గుణ త్రయము (సత్వ, రజ, తమో గుణములు) శబ్ద త్రయము, దోష త్రయము, ఆశ్రమములు నీ స్వరూపమగు చున్నది. కాల త్రయము( భూత భవిష్యత్ వర్తమానములు) అవస్థా త్రయము( జాగ్రత్ స్వప్న సుషిప్త్యివస్థలు) పితృ దేవతలు అహో రాత్రులు మొదలగునవి యన్నియు దేవీ! సరస్వతీ! నీవే. మాత్రాత్రయ యుక్తమగు ఓంకారము నీ యొక్క స్వరూపమై యున్నది. వేరు వేరైన సంప్రదాయ యుక్తులగు పురుషుల కొరకు సోమ సంస్థా, అవిః సంస్థా, పాక సంస్థా, రూపములతో ఆద్యములు, సనాతనములు నగు ఏడు విధములగు వ్యాహృతులు వేద మందు నిరూపించబడి యున్నవి. గ్రంధ వేత్తలు ఈ సప్త వ్యాహృతులను నీ రూపముగానే ఉచ్చరించుదురు. ఇదియని చెప్పుటకు వీలుగాని ప్రణవ మంత్రము నందలి స్వరూపము నీవే.
అవికార్య క్షయం దివ్యం పరిణామ వివర్జితమ్ తవైవ చ వరం రూపం య న్నశక్యం మయేరితుమ్ నచాస్యేన న వా జిహ్వా తాల్వోష్టాదిభి రుచ్యతే ఇంద్రోపి వసవో బ్రహ్మా చందార్కౌ జ్యోతిరేవ చ విశ్వావాసం విశ్వరూపం విశ్వేశం పరమేశ్వరమ్ సాంఖ్య వేదాంత వేదోక్తం బహుశాఖా స్థిరీకృతమ్ అనాది మధ్య నిధనం సదాస న్నసదైవ తు ఏకం త్వనేక మప్యేకం భవ భేద సమాశ్రితమ్ అనాఖ్యం షడ్గునాఖ్యం చ షట్కాఖ్యం త్రిగుణా శ్రయమ్ నానాశక్తి మతామేకం శక్తివైభావికం పరమ్
వికార రహితము, దివ్యము, నాశ రహితము, పరిమాణ రహితము అయిన నీ రూపము వర్ణించుటకు నాకు శక్యము గాదు. ఎందు చేతననగా నీ యొక్క సంపూర్ణ స్వరూపము జిహ్వాతాలువు, ఓష్టములు మొదలగు వాటిచే కూడి ఉన్నను వర్ణించుటకు సాధ్యము గాదు. ఇంద్రుడు, వసువు, బ్రహ్మ, సూర్యచంద్రులు, తేజస్సు ఇవి యన్నియు నీ స్వరూపమై యున్నవి. విశ్వ మందున్నవి, విశ్వము యొక్క రూపము, విశ్వమునకు ఈశ్వరుడు పరమాత్మావు నీవే. సాంఖ్య వేదాంత తర్క శాస్త్రాదుల యందు నిరూపింప బడిన రూపములు నీవే. వేదము యొక్క అనేక శాఖల యందు నిర్ణయింప బడిన స్వరూపములు నీవే. ఆది మధ్యాంత రహితము, సత్, అసద్, ఏకము, అనేకము అన్నియు నీవే. సంసార మందలి భేదములచే నానా ప్రకారములతో నీ రూపము ప్రకాశించు చున్నది. మరియు నీ రూపము నామ రహితము. షడ్గుణాఖ్యము (మహత్తు, ధైర్యము, యశస్సు, లక్ష్మి, జ్ఞానము, వైరాగ్యము) చేత శోభిల్లు చున్నది. షడ్వర్గము (కామ, క్రోధ, లోభ, మోహము, మదము,మత్సరములు) త్రిగుణాశ్రయము. బహు ప్రకార శక్తి యుతులగు పురుషుల యొక్క శక్తి వైభవము నీవే.
సుఖాసుఖ మహాత్సౌఖ్యం రూపం తవ విభావ్యతే ఏవం దేవి త్వయా వ్యాప్తం సకలం నిష్కలం జగత్ అద్వైతా వస్థితం బ్రహ్మ యచ్చ ద్వైతే వ్యవస్థితమ్ యేర్థా నిత్యా ఏ వినశ్యంతిచాన్యే ఏ వాస్థూలాయే చ సూక్ష్మాచ్చ సూక్ష్మాః యే వా భూమౌ యే న్తరి క్షేన్యతో వా తేషాం సత్త్వం త్వత్త ఏవోపలబ్దిః యచ్చామూర్తం యచ్చ మూర్తం సమస్తమ్ యద్వా భూషే ష్వేక మేకం చ కించిత్ యద్దివ్యే స్తి క్ష్మాతలే ఖేన్యతో వా తత్సంబంధం త్వ త్స్వరై ర్వ్యంజనైశ్చ
సుఖ, మహా సుఖము, దుఃఖము, మహా దుఃఖములు, నీ రూపములే. ఈ ప్రకారము సకల నిష్కల ప్రపంచ మంతయు నీచే వ్యాప్తమై యున్నది. అద్వైత బ్రహ్మవు నీవే. ద్వైత ప్రపంచ మందలి బ్రహ్మవు నీవే. అద్వైత నిరూపితవు. ద్వైత నిరూపితవు నగు బ్రహ్మవు నీవే. నిత్యా నిత్య పదార్థము లన్నియు నీవే. స్థూలములు, సూక్షాతి సూక్ష్మములు మరియు భూమి అంతరిక్షముల యందున్న అన్ని పదార్థములు సత్వములు నీ వలననే లభించు చున్నవి. ఓ తల్లీ! మూర్తములు,అమూర్తములు అయిన సమస్త ప్రాణుల యందు ఏ కొంచెమున్నను స్వర్గలోక, మర్త్యలోక అంతరిక్షముల యందుగాని మరి యే ఇతర స్థానముల యందు గాని వున్న వన్నియు నీ స్వరూపములే. నీ రూపములగు స్వర వ్యంజనముల వల్లనే సమస్త పదార్థముల యొక్క జ్ఞానము కలుగు చున్నది.
జడుడు:
ఏవం స్తుతా తదా దేవీ విష్ణో ర్జిహ్వా సరస్వతీః
ప్రత్యువాచ మహాత్మానం నాగమశ్వతరం వచః
జడుడు:
విష్ణుజిహ్వ యగు సరస్వతీ దేవి ఇట్లు నాగరాజగు నశ్వతరుడు జేసినా స్తుతికి సంతసించి మహాత్ముడు నాగు నతనితో నిట్లు పలికెను.
సరస్వతి:
వరం తే కంబల భ్రాతః ప్రయచ్చా మ్యురగాధిపః తదుచ్యతాం పదాస్యామి యత్తే మనసి వర్తతే
సరస్వతి:
కంఇలుని సోదరుడవగు నాగరాజా! నీవు కోరిన వరమిచ్చెదను. నీ మనస్సు నందున్న దానిని తెలుపుము.
అశ్వతరుడు:
సాహాయ్యం దేవి దేహిత్వం పూర్వం కంబల మేవ చ సమస్త స్వర సంబద్ధ ముభయో స్సంప్రయచ్చ చ
అశ్వతరుడు:
దేవీ! ప్రథమముగా కంబలునికి నాకును సమస్త సర్వ సంబంద్దమైన సంగీత జ్ఞానమును ప్రసాదించుము.
సరస్వతి:
సప్త స్వరా గ్రామ రాగాఃసప్త పన్నాగా సత్తమః గీతకాని చ సప్తైవ తావత్యశ్చాపి మూర్చనాః తానా శ్చైకోన పంచాశత్ తథా గ్రామ త్రయం చ యత్ ఏతత్సర్వం భవాన్ వేత్తా కంబలశ్చైవ తేనఘ జ్ఞాస్యతే మత్ప్రసాదేన భుజగేంద్ర పరం తథాః చతుర్విధం పరం తాళం త్రిప్రకారం లయత్రయమ్ గతి త్రయం తథా తాలం మయా దత్తం చతుర్విధమ్ ఏతద్భవాన్ మత్ప్రసాదాత్ పన్నగేంద్రా పరం చ యత్
సరస్వతి:
పన్నగ రాజా! ఈ దినము నుండి నా యనుగ్రహము చేత సప్త స్వరములు, సప్త గ్రామ రాగములు, సప్త గీతములు, సమస్త మూర్చనలు మీకు తెలియును గాక. మరియు ఏకోన పంచాశత్ (49) తాళములు, మూడు గ్రామములు ఇవన్నియు కంబళునకును నీకును సంప్రాప్త మౌను గాక. భుజగేంద్ర! నా దయ చేత చతుర్విధ తాళములు, త్రివిధములైన లయలు మీకు తెలియ గలవు. త్రివిధ గతులు చతుర్విధము లగు తాళ విశేషములు నా యనుగ్రహము చేత తెలియబడు గాక.
అస్యాంతర్గత మాయత్తం స్వర వ్యంజనయోశ్చ యత్ తడశేషం మయా దత్తం భవతః కంబలస్య చ యథా నాన్యస్య భూలోకే పాతాలే వాపి పన్నగః ప్రణేతారౌ భావంతౌ చ సర్వస్యాద్య భవిష్యతః పాతాలే దేవలోకే చ భూర్లోకే చైవ పన్నగౌ
ముఖాంతర్గతమై స్వర వ్యంజనాదికము నాగు సశేష సంగీత శాస్త్రములను అనుగ్రహించితిని. నాగేంద్రా! మీ యిద్దరు స్వర్గ, మర్త్య, పాతాళ లోకములందు సమస్త సంగీత శాస్త్ర ప్రణేతలగుదురు గాక. మీతో సమానమైన వాడు వేరొకడు ఉండక పోవుగాక.
జడుడు:
ఇత్యుక్తా సా తదా దేవీ సర్వ జిహ్వా సరస్వతీ జగామాదర్శనం సద్యో నాగస్య కమలేక్షణా తయోశ్చ తద్యథా వృత్తం భ్రాత్రో స్సర్వ మజాయత
జడుడు:
సర్వ జిహ్వా స్వరూపిణియు, కమలముల వంటి నేత్రములు కలిగిన ఆ సరస్వతీ దేవి ఇట్లు చెప్పి తత్ క్షణమే అచటి నుండి అంతర్థాన మయ్యెను. ఆమె వర ప్రభావముచే ఆ ఇద్దరు సోదరులకు సంపూర్ణమైన సంగీత శాస్త్ర జ్ఞానము కలిగెను.
విజ్ఞాన ముభయో రగ్ర్యం పద తాల స్వరాధికమ్ తతః కైలాస శైలేంద్ర శిఖర స్థిత మీశ్వరమ్ గీతకి స్సప్తభి ర్నాగౌ తంత్రీలయ సమన్వితైః అరిరాధయిషూ దేవా మనంగాం గహరం హరమ్ ప్రచ కతుః పరం యత్న ముభౌ సంయత వాక్కరౌ ప్రాత ర్నిశాయాం మధ్యాహ్నే సంధ్యయో శ్చాపి తత్పరౌ
పద, తాళ స్వరాది విషయములందు విజ్ఞానము కలిగెను. తరువాత వారిద్దరు కైలాస పర్వత శిఖర స్థితుడు, పాప రహితుడు, కామ దహనుడునగు శంకరుని యొక్క అనుగ్రహము కొరకు తంత్రీలయ సప్తస్వరములచే గానము చేయుచు ఆరాధన చేయసాగిరి. ప్రాత ర్మధ్యాహ్న సాయంకాల సంధ్యాకాల సమయము లందే గాక రాత్రి భాగము నందు కూడ ఆ సోదరు లిద్దరు ఏకాగ్ర చిత్తులై సంగీత కళాయుక్తమగు వాక్యముల చేత పరమ యత్నముతో ఈశ్వరుని గూర్చి ఆరాధన చేసిరి.
తతః కాలేన మహతా స్తూయమానో వృషధ్వజః తుతోష గీతకై స్తౌ చ ప్రాహ సంగృహ్యతాం వరః తతః ప్రణమ్యాశ్వతరః కంబలేన సమం తదా విజ్ఞాపయన్ మహాదేవం శితికంఠ ముమాపతిమ్ యది నౌ భగవాన్ ప్రీతో దేవ దేవ త్రిలోచనః తతో యథాభిలషితం వర మేనం ప్రయచ్చ నౌ మరుతా కువలాశ్వస్య పత్నీ దేవ మదాలసా తేనైవ వయసా సద్యో దుహితృత్వం ప్రయాతు మే
వృషభ ధ్వజుడగు మహేశ్వరుడు చిరకాలమునకు వారి గానమునకు మిక్కిలి సంతోషించి ప్రత్యక్షమై వరము కోరు కొనుడు అని పలికెను.పిమ్మట కంబల సహితుడైన ఆశ్వతరుడు, ఉమాపతి శితికంఠుడు నగు మహాదేవునికి నమస్కరించి ఇట్లు విన్నవించెను. హి దేవా! త్రిలోచనా! భగవానుడా! నాయందు తమకు అనుగ్రహమున్నచో మా యిద్దరికీ అభీష్టమగు ఈ వరము నిమ్ము. దేవా! కువలయాశ్వుని పత్నియగు మదాలస చని పోయిన సమయ మందున్న వయస్సుతో నాకు పుత్రికగా జన్మించు గాక.
జాతిస్మరా యథా పూర్వం తద్వత్ క్షాంతి సమన్వితా యోగినీ యోగమాతా చ జాయతాం వచనా త్తవ
అట్లు నాకు జనించిన మదాలస మీ అనుగ్రహముచే యథా పూర్వముగా పూర్వ జన్మ జ్ఞానము కలదియు, క్షాంతి గలదియు యోగినియు యోగ జననియు అగును గాక.
ఈశ్వరుడు:
యథోక్తం పన్నాగ శ్రేష్ఠ సర్వమేతద్ భవిష్యతి మత్ప్రసాదా దసందిగ్ధం శృణు చేదం భుజంగమః శ్రాద్ధావసానే ప్రాశ్నీథా మధ్యమం పిండ మాత్మనా కామం చేమా మనుధ్యాయన్ కురు త్వం పితృ పూజనమ్ తత్ క్షణాదేవ సా సుభ్రూ ర్భవతో మధ్యమాత్ ఫణాత్ సముత్పత్స్యతి కళ్యాణీ తథారూపా యథా మృతా
ఈశ్వరుడు:
పన్నగ శ్రేష్టా! నీవు అడిగినది యంతయు నా అనుగ్రహముచే సిద్దించును గాక. సందేహము లేదు. మరియు నొక విషయమును చెప్పెదను. వినుము. నీవు మదాలసను గురించి సంకల్పించి పితృ శ్రాద్దమును జేయుము. శ్రాజ్దావ సానమున మధ్యమ పిండమును భక్షించుము. అట్లు భుజించుటచే మంగళ దాయినియు, చక్కని కను బొమ్మలు కలిగి నట్టిదియు నగు మదాలస ప్రాణ త్యాగ సమయ మందున్న వయో రూపములతో తక్షణమే నీ యొక్క మధ్యమ ఫణము నుండి జన్మించును.
స్వయ మేవోపభుంజస్వ తతః సర్వం భవిష్యతి ఉత్పత్స్యతే తతః సా తు సత్యం వైమధ్యమాత్ ఫణాత్ ఏతత్ శ్రుత్వా తతః స్తౌ తు ప్రణిపత్య మహేశ్వరమ్ రసాతల మనుప్రాప్తౌ పరితోష సమన్వితౌ తథా చ కృతవాన్ శ్రాద్ధం స నాగః కంబలానుజః పిండం చ మధ్యమం తద్వ ద్యథావ దుపభుక్తవాన్ ఉపభుక్తే తతః పిండే తస్యా సా తనుమధ్యమా జజ్ఞే నిష్వసతః సద్య స్తద్రూపా మధ్యమాత్ ఫణాత్ న చాపి కథయామాస కస్యచి తృ భుజం గమః అంతర్గృహే సా సుదతీం స్త్రీభిర్గుప్తా మధారయత్
నీవీ ప్రకారముగా ఆ పిండమును స్వయముగా భుజించిన తర్వాత ఆమె తప్పక నీ మధ్యమ ఫణము నుండి జన్మించ గలదు. ఆ మాటలు విని అశ్వతర కంబళులు ఇద్దరు శివునకు నమస్కరించి సంతోష చిత్తులై రసాతల లోకమునకు బోయిరి. కంబళ సోదరుడైన ఆ ఆశ్వతరుడు అను నాగరాజు శివదేవుడు చెప్పినట్లుగా శ్రాద్ధ కర్మను చేసి మధ్యమ పిండమును భుజించెను. అట్లు నాగరాజు ఆ మధ్యమ పిండమును భుజించిన ఆ క్షణమునందే మదాలస పూర్వపు రూపముతో మధ్యమ ఫణము నుండి ఉద్భవించెను. ఆశ్వతరుడు ఈ విషయమును ఎవ్వరికి తెలియ పరచకుండా మదాలసను తన అంతఃపుర స్త్రీల రక్షణ మందు ఉంచెను.
తౌ చానుదిన మాగత్య పుత్రో నాగపతేః సుఖమ్ ఋతధ్వజేన సహితౌ చిక్రీడాతే మరావివ ఏకదా తు స తౌ ప్రాహ స నాగోశ్వతరో ముదా తన్మయా పూర్వ ముక్తం తు క్రియతే కిన్ను తత్తథా స రాజపుత్రో యువయో రుపకారీ మమాంతికమ్ కిన్ను నానీయతే వత్సా వుపకారాయ మానదః ఏవ ముక్తౌ పున స్తేన పుత్రౌ స్నేహవతా తు తౌ గత్వా తస్య పురం సఖ్యూ రేమాతే తేన ధీమతా తతః కువలయాశ్వం తం కృత్వా కించిత్ కథాతరమ్ అబ్రూతాం ప్రణిపాతేన స్వగృహాగమనం ప్రతి
ఆ నాగరాజు యొక్క పుత్రులిద్దరు అను దినమున రుతధ్వజునితో కలిసి దేవ కుమారుల వలె సంతోషముతో విహరించు చుండిరి. ఒకనాడు ఆశ్వతరుడు పూర్వము తాను చెప్పిన విధముగా చేయుడని కుమారులతో చెప్పెను. “కుమారులారా! ఉన్నతిని కలిగించు వాడును, నీకు సహాయ కరుడును అగు ఆ రాజ పుత్రుని ఇచ్చటకు తీసుకు రావలయును” అని పలికెను. తండ్రిచే ఆ ప్రకారముగా ఆజ్ఞను పొందిన వారై నాగ కుమారులు ఋతధ్వజుని పురమున కేగి అతనితో కలసి క్రీడించుచు కొన్ని దినముల తరువాత అతనిని తమ గృహమునకు రమ్మని సగౌరవముగా ఆహ్వానించిరి.
తావాహ నృపపుత్రో సౌ నన్విధం భవతోర్గృహమ్ ధనవాహన వస్త్రాది యన్మదీయం తదేవ వామ్ యస్య వాం వాంచితం దాతుం ధనం రత్నమథాపివా తద్దీయ తాం ద్విజసుతౌ యది వాం ప్రణయో మయి ఏతావతాహం దైవేన వంచితోస్మి దురాత్మనా యద్భావద్భ్యాం మమత్వం నో మదీయే క్రియతాం గృహే యది వాం మే ప్రియం కార్య మనుగ్రాహ్యోస్మి వా యది తద్దనే మామ గేహే చ మమత్వ మను కల్ప్యతామ్ యువయో ర్మన్మదీయం తన్మామకం యువయోః స్వయమ్ ఏతత్సర్వం విజానీథ సఖా ప్రాణో బహిశ్చరః
అపుడు రాజ పుత్రుడు వారితో ఇట్లనెను. స్నేహితులారా! నన్ను ప్రత్యేకముగా మీ గృహమునకు రమ్మను చున్నారు. ఇచట నాకు గల ధన వాహన వస్త్రాది వైభవ మెల్లయు మీదే కదా! మీ కభీష్టములైన ధన రత్నములను, నాగపుత్రులారా! నాయందు సఖ్యము, ఇష్టము, ప్రేమ కలదేని మీరు యధేష్టముగా వినియోగింపుడు. ఇప్పటి వరకు మీరు నా యింటిని మీ స్వగృహముగా భావింప నందున నేను దురాత్ముడను. దైవ వంచితుడను అయితిని. నా యందు అనుగ్రహము కలిగి, నాకు ప్రియము చేయుట మీ కిష్టమైన యెడల నా గృహమును ధనమును మీవేయని భావింపుడు. ఏది మీదో అది నాది కూడా. అట్లే ఏది నాదో అది మీది కూడ. ఈ విషయమును తెలిసికొనుడు. స్నేహితుడనగా బహిః ప్రాణము.
పునర్నైవం విభిన్నార్ధం వక్తవ్యం ద్విజ సత్తమౌ మత్ప్రసాద పరౌ ప్రీత్యా శాపితౌ హృదయేన మే తతః స్నేహార్ధ్ర వదనౌ తాపుభౌ నాగనందనౌ ఊచతు ర్నృపతేః పుత్రం కించిత్ ప్రణయ కోపితమ్ ఋతధ్వజః అసందేహో యథైవాహ భవానిదమ్ తథైవ చాస్మ న్మనసి నాత్ర చింత్య మతోన్యథా కి త్వావయోః సమం పిత్రా ప్రోక్త మేత న్మహాత్మనా ద్రష్టుం కువలయాశ్వం త మిచ్చామీతి పునః పునః తతః కువలయాశ్వోథ సముత్తాయ వరాసనాత్ యథాహ తాతేతి వదన్ ప్రణామ మకరోద్భువి
పన్నగ శ్రేష్టులారా! ఈ విధమైన మాది మీది అని భేద భావముతో నెపుడును పలుక దగదు. ప్రీతితో నా యందనుగ్రహ ముంచుడు. హృదయ పూర్వకముగా ప్రతిజ్ఞ చేసి చెప్పితిని. తరువాత స్నేహార్ద్ర హృదయులైన ఆ నాగ కుమారులు ఇద్దరూ తమపై ప్రణయము వలన కొంచెము కోపించి యున్న రాజపుత్రునితో యిట్లనిరి. మిత్రమా! ఋతధ్వజా! నీ వనినది నిస్సందేహము. మేము నీ మనస్సు యందున్న విధముగానే భావించు చున్నాము. మమ్ము అన్యదా భావించ వలదు. కాని మహాత్ముడు మా తండ్రి కూడా కుశాలయాశ్వుని చూడవలయు నను కోరిక కలదని మాటి మాటికి చెప్పుచున్నాడు. ఆ మాట విని నంతనే కువలయాశ్వుడు తన ఉత్తమాసనము నుండి లేచి నాయన గారీ విధముగా చెప్పినారా? యని నేలపై సాగిలబడి ప్రణామము చేసెను.
కువలయాశ్వుడు:
థన్యోహ మతిపుణ్యోహం కోన్యోస్తి సదృశోమయా యత్తాతో మామభిదృష్టుం కరోతి ప్రవణం మనః తదు త్తిష్ఠత గచ్చామ తాతాజ్ఞాం క్షణ మప్యహమ్ నాతిక్రాంతు మిహేచ్చామి పద్భ్యాం తస్య శపా మ్యహమ్
కువలయాశ్వుడు:
నన్ను చూచుటకు తండ్రి గారు ఆసక్తులైనందు వలన నేను ధన్యుడను. మిక్కిలి పుణ్యము చేసుకున్న వాడిని అయితిని. నాతో సమానుడైన వాడింక నేవడుండును? కావున లెండు పోవుదము. వారి పాద సాక్షిగా చెప్పు చున్నాను. తండ్రి గారి యాజ్ఞను ముహూర్త మాత్రమైనను ఉల్లంఘించుటకు నాకు అంగీకారము గాదు.
జడుడు:
ఏవ ముక్తా యయౌ సోథ సహ తాభ్యాం నృపాత్మజః ప్రాప్తశ్చ గౌతమీం పుణ్యామ్ నిర్గమ్య నగారా ద్పహిః తన్మధ్యేన యయు స్తేవై నాగేంద్ర నృప నందనాః మేనే చ రాజపుత్రో సౌ పారే తస్యా స్తయో ర్గ్రుహమ్ తత శ్చాదృష్య పాతాళం తాభ్యాం నీతో నృపాత్మజః పాతాళే దదృశే చోభౌ సపన్నగ కుమారకౌ
జడుడు:
ఈ విధముగా జెప్పి ఆ రాజ కుమారుడు కువలయాశ్వుడు నాగ కుమారులతో నగరము నుండి ప్రయాణమై పుణ్య ప్రదమైన గౌతమీ నదిని చేరెను. వారు నదీ మధ్యమమున ప్రయాణించు చుండిరి. వారి గృహము నదీ తటమున కలదని రాజ పుత్రుడు భావించెను. పిమ్మట నాగ కుమారులు అతనిని తమతో పాతాళ లోకమునకు తీసికొని పోయిరి.
ఫణామణి కృతోద్యోతౌ వ్యక్త స్వస్తిక లక్షణౌ విలోక్య తౌ సురూపాంగౌ విస్మయోత్ఫుల్ల లోచనః విహస్య చా బ్రవీత్ ప్రేమ్ణా సాదుభో ద్విజసత్తమౌ కథయామాస తుష్ణౌ తు పితరం పన్నగేశ్వరమ్ శాంత మశ్వతరం నాగం మాననీయం దివౌకసామ్ రమణీయం తతో పశ్యత్ పాతాళం స నృపాత్మజః కుమారై స్తరుణై ర్వృద్దై రురగై రుపశోభితమ్ తథైవ నాగకన్యాభిః క్రీడంతీభి రిత స్తతః చారుకుండల హారాభి స్తారాభి ర్గగనం యథా గీతశబ్దే స్తథాన్యత్ర వీణా వేణు స్వరానుగైః
ఆ నాగకుమారు లిద్దరు మాయా మానవ రూపము వదలి తమ నాగ రూపములు ధరించిరి. ఆ నాగకుమారు లిద్దరు పాడగా యందున్న మణుల చేతను, స్వస్తిక చిహ్నములతోను ప్రకాశించు చుండిరి. రాజ కుమారుడు వారి స్వరూపమును చూచి విస్మయముతో వికసిత నేత్రుడు అయ్యెను. రాజ కుమారుడు వారిద్దరిని చూచి ప్రణయ పూర్వకముగా మిత్రులారా! నాగ కుమారులారా! మీ రూపములు చాలా బాగున్నవని సంతోషించెను. అనంతరము ఆ నాగ కుమారులు, పన్నగేశ్వరుడగు తమ తండ్రికి రాజ కుమారుని తీసుకొని వచ్చితిమని చెప్పిరి. అనంతరము రాజ కుమారుడు అత్యంత మనోహరము అగు పాతాళ లోక సౌందర్యమును చూసెను. మరియు ఆ కుమారుడు అన్ని వైపులా బాలక, యువక, వృద్ధ నాగ రాజులతో శోభాయ మానముగా నున్న పాతాళ నగరమును చూచుచు పోవు చుండెను. ఆకాశ మందలి తారల వలె మనోహరములగు కుండలములు హారముల నలంకరించుకొని క్రీడించు చున్న నాగ కన్యకలతో కొన్ని ప్రదేశములు వీణా వేరు స్వరముల ననుసరించి పాడుచున్న గీతములతో మనోరంజకముగా నుండెను.
మృదంగ పణవాతోద్య హారి వేశ్మ శతాకులమ్ వీక్షమాణస్స పాతాళం యయౌ శత్రుజితః సుతః సహ తాభ్యా మభీష్టాభ్యాం పన్న గాభ్యా మరిందమః తతః ప్రవిశ్య తే సర్వే నాగరాజ నివేశనమ్ దదృశు స్తం మహాత్మాన మురగాధిపతిం స్థితమ్ దివ్యమాల్యాంబరధరం మణికుండల భూషణమ్ స్వచ్చ ముక్తా ఫలలతా హారి హారోప శోభితమ్ కేయురిణం మహాభాగ మానసే సర్వ కాంచనే మణి విదృమ వైడూర్య జాలాంతరిత రూపకే స తాభ్యాం దర్శిత స్తస్య తాతో స్మాక మసావితి
మృదంగ ప్రణవాది వాద్య ధ్వనులచే గృహము లన్నియు ప్రతిధ్వనించుచు ఇష్టులగు నాగ కుమారులతో వారి తండ్రి యగు నాగరాజు గృహము ప్రవేశించెను. పిమ్మట వారు మణి విద్రుమ వైడూర్య ఖచిత కాంతులచే వ్యాప్త మైనదియు కాంచన మయమగు నాసనమున ఆశీనుడై యున్న వాడును స్వచ్చములగు ముక్తా ఫల లతల వలె మనోహరములగు కంఠహారములచే స్వర్ణమయములగు కర కంకణములచే శోభిల్లుచున్న వాడును, మహానుభావుడు నగు మణికుండల భూషణుడును, దివ్యమాల్యములు వస్త్రములు ధరించిన వాడును, మహాత్ముడు పన్నగాధిపతియు నగు ఆశ్వతరుని చూచిరి.
వీరః కువలయాశ్వోయం పిత్రే చాసౌ నివేదితః తతో ననామ చరణౌ నాగే ద్రస్య ఋతధ్వజః సముత్థాప్య బలాద్గాడం స నాగః పరిషస్వజే మూర్ధ్నిచైన ముపాఘ్రాయ చిరంజీవే త్యువాచ హ నిహతామిత్ర వర్గశ్చ పిత్రోః శుశ్రూషణం కురు వత్సః ధన్యస్య కధ్యంతే పరోక్షస్వాపి తే గుణాః భవతో మామ పుత్రాభ్యా మాభ్యాం యే మే నివేదితాః తదేతై రేవ వర్దేధాః మనోవాక్కాయ చేష్టితైః జీవితం గుణినః శాఘ్యం జీవన్నపి మృతో గుణీ గుణవా న్నిర్వృతిం పిత్రోః శత్రూణాం హృదయే జ్వరమ్
తరువాత నాగ కుమారులు ఈయనయే మా జనకుడు అని చూపించిరి. ఇతడే వీరుడైన కువలయాశ్వుడని తండ్రికి నివేదించిరి. పిమ్మట ఋతధ్వజుడు నాగేంద్రుని చరణములకు ప్రణమిల్లెను. అనంతరము నాగ రాజు తన పాదము లందు ప్రణమిల్లి యున్న రాజ కుమారుని బలాత్కారముగా పైకి లేవనెత్తి గాఢాలింగనము జేసుకొనెను. మూర్థాఘ్రాణము చేసి “చిరంజీవ” యని ఆశీర్వాదము జేసెను. వత్సా! శత్రు సంహారకుడవై తల్లి దండ్రులను సేవింపుము. నీవు ధన్యుడవు. నీ పరోక్ష మందు గూడ నీ సద్గుణములు కొనియాడ బడు చున్నవి. నా కుమారులు నీ సౌశీల్యాదులను చెప్పిరి. త్రికరణ శుద్ధములైన చేష్టితములచే విలసిల్లు నట్టి సద్గుణములతో వర్దిల్లుదువు గాక! గుణవంతుని జీవితము శ్లాఘించ దగినది. గుణహీనుడు జీవించి యున్నను మృతునితో సమానుడు. గుణవంతుడు తల్లి దండ్రులకు సుఖము కల్గించును. శత్రువులకు తాపము కలిగించును.
కరోత్యాత్మహితం కుర్వన్ విశ్వాసం చ మహాజనే దేవతాః పితరో విప్రా మిత్రార్థీ విభవాదయః బాంధవాశ్చ తథేగ్చంతి జీవితం గుణిన శ్చిరమ్ పరవాద నివృత్తానాం దుర్గాతేషు దయావతామ్ గుణినాం సఫలం జన్మ సంశ్రితానాం విపద్గతైః
మహాజనులకు విశ్వాస పాత్రుడై ఆత్మకు హితములగు సత్కర్మలు చేసుకొనును. దేవతలు, పితరులు, విప్రులు, ఆర్థులు, బంధువులు, శోభన దేవతలు, గుణవంతుడగు వానిని చిరకాలము జీవించ వలెనని ఆశీర్వదింతురు. గుణవంతుడు పరులను నిందించడు. దుఃఖితులను చూచి దయగల వాడగును. ఆపత్కాలమున ఆశ్రయించిన వారిని రక్షించిన గుణవంతుని జన్మ సఫలము.
పుత్రుడు:
ఏవముక్తా స తం వీరం పుత్రా విద మథాబ్రవీత్ పూజా కువలయాశ్వస్య కర్తు కామో భుజంగమః స్నానాదిక క్రమం కృత్వా సర్వమేవ యథా క్రమమ్ మధు పానాది సంభోగ మాహారం చ యదేప్సితమ్ తతః కువలయాశ్వేన హృదయోత్సవ భూతయా
పుత్రుడు:
ఆ నాగరాజు ఆ రాజ కుమారునితో ఇట్లు చెప్పిన పిమ్మట తన పుత్రుల కిట్లనెను. మనము కువలయాశ్వునకు ఇష్టానుసారముగా స్నానపాన భోజనాదులను యదా క్రమముగా చేయవలెను. అతని మనస్సుకు ఉత్సాహము ఉల్లాసము కలిగించు కథలతో కొంచెము కాలము గడుపుదము.
కథయా స్వల్పకం కాలం స్థాస్యామో హృష్ణచేతసః అనుమేనే చ తం మౌనీ వచః శత్రు జితః సుతః తథా చకార చ పతిః పన్నగానా ముదారదీః సమేత్య తైరాత్మజ భూవ నందనై ర్మహోరగాణా మదిపః స సత్యవాక్ ముదా యుతోన్నాని మధూని చాత్మవాన్ యథోప జోషం బుభుజే స భోగభాక్
అది అంతయు మౌనముగా వినుచున్న రాజ కుమారుడు మారు మాటాడక నాగరాజు మాటకును సమ్మతించెను. అపుడు ఉదారమతి యగు పన్నగ రాజు రాజ కుమారునకు ప్రియకరములగు కార్యక్రమములతో, కథా ప్రసంగముల తోడను కొంత కాలము గడిపెను. భోగవంతుడు, ఆత్మవంతుడు, సత్యభాషి, నాగరాజు యగు ఆశ్వతరుడు శత్రుజిత్తు యొక్క కుమారుడగు ఋతధ్వజునితోను తన కుమారులతోను కలసి ప్రసన్న చిత్తముతో అన్నపానాది మధుర పదార్థములతో యధేచ్చగా సమస్త భోగములను అనుభవించెను.
Summary of chapter 21 of the Mārkandeya Mahā Purana is as follows:
Prince Kuvalayāshva rescues the divine princess Madālasā, daughter of the Gandharva king Vishvāvasu, from the captivity of the demon Pātālaketu in Pātāla. Captivated by her nobility and spiritual devotion, Kuvalayāshva marries Madālasā according to sacred rites with the blessings of the hermits and returns victoriously to his father's royal palace in Ayodhyā.